సహజీవనం చేస్తున్న ఇద్దరి ఆత్మహత్య | - | Sakshi

సహజీవనం చేస్తున్న ఇద్దరి ఆత్మహత్య

Published Sat, May 25 2024 12:25 AM | Last Updated on Sat, May 25 2024 7:58 AM

-

కోటపల్లి: మండలంలోని సర్వాయిపేట గ్రా మానికి చెందిన ఇద్దరు ఉరేసుకుని మృతిచెందిన ఘటన మండలంలో సంచలనం రేపింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సర్వాయిపేటకు చెందిన కోట రాజేశ్‌ (40), నాయిని చీకటి (28) కొద్దిరోజులుగా సహజీవనం చేస్తున్నారు. 

వెలమపల్లి జాతీయ రహదారి పక్కన గల ఇటుకల కంపెనీలో కూలీ పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న దాబాలో వీరు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకోగా ఇటుకల కంపెనీలో పనిచేసే మిగతా కూలీలు సామగ్రి భద్రపరిచేందుకు వెళ్లి గుర్తించారు. స్థానికులకు, కుటుంబీకులకు సమాచారం అందించారు. 

విషయం తెలుసుకున్న సీఐ సుధాకర్‌ ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కుటుంబీకులు ఇరువురి మృతిపై అనుమానం వ్యక్తం చేయగా అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. వీరి ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులే కారణమా? లేక ఇతర కారణలేమైనా ఉన్నాయా? అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement