
బెంగళూరు: సహజీవనం చేసి పెళ్లాడకపోతే అది మోసగించడం కిందకు రాదని కర్నాటక హైకోర్టు పేర్కొంది. సదరు వ్యక్తిపై ఐపీసీ సెక్షన్ 420 కింద కేసు పెట్టలేమని న్యాయమూర్తి జస్టిస్ కె.నటరాజన్ స్పష్టం చేశారు.
తన బోయ్‌ఫ్రెండ్ ఎనిమిదేళ్లు సహజీవనం చేసి చివరికి పెళ్లికి నిరాకరించాడంటూ ఓ మహిళ చేసిన ఫిర్యాదును కొట్టేస్తూ ఆయన తీర్పు వెలువరించారు. ఇద్దరి మధ్య ఉన్న సహజీవన ఒప్పందాన్ని అతను మోసపూరిత ఉద్దేశంతో ఉల్లంఘించాడని చెప్పలేమని ఈ సందర్భంగా న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఇంట్లోవాళ్లు ఇంకో అమ్మాయితో పెళ్లి కుదిర్చిన కారణంగా సహజీవనాన్ని వైవాహిక బంధంగా మార్చుకునేందుకు సదరు అబ్బాయి నిరాకరించాడు.