To marry
-
క్రికెటర్ ని పెళ్ళాడుతున్న రుతురాజ్ గైక్వాడ్..!
-
సహజీవనం చేసి పెళ్లాడకుంటే...మోసగించినట్టు కాదు
బెంగళూరు: సహజీవనం చేసి పెళ్లాడకపోతే అది మోసగించడం కిందకు రాదని కర్నాటక హైకోర్టు పేర్కొంది. సదరు వ్యక్తిపై ఐపీసీ సెక్షన్ 420 కింద కేసు పెట్టలేమని న్యాయమూర్తి జస్టిస్ కె.నటరాజన్ స్పష్టం చేశారు. తన బోయ్‌ఫ్రెండ్ ఎనిమిదేళ్లు సహజీవనం చేసి చివరికి పెళ్లికి నిరాకరించాడంటూ ఓ మహిళ చేసిన ఫిర్యాదును కొట్టేస్తూ ఆయన తీర్పు వెలువరించారు. ఇద్దరి మధ్య ఉన్న సహజీవన ఒప్పందాన్ని అతను మోసపూరిత ఉద్దేశంతో ఉల్లంఘించాడని చెప్పలేమని ఈ సందర్భంగా న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఇంట్లోవాళ్లు ఇంకో అమ్మాయితో పెళ్లి కుదిర్చిన కారణంగా సహజీవనాన్ని వైవాహిక బంధంగా మార్చుకునేందుకు సదరు అబ్బాయి నిరాకరించాడు. -
‘అత్యాచారం చేసిన వ్యక్తినే పెళ్లి చేసుకుంటా’.. కీలక పరిణామం
న్యూఢిల్లీ: కేరళలోని వయనాడ్ జిల్లాలో పదహారేళ్ల బాలికపై అత్యాచారం చేసి, బిడ్డకు జన్మనివ్వడానికి కారణమైన కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. 2016 లో మైనర్‌పై అత్యాచారానికి పాల్పడిని కేసులో దోషిగా తేలి, 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష అనుభవిస్తున్న క్యాథిలిక్ చర్చి ఫాదర్ రాబిన్ వడక్కుం చెర్రీని వివాహం చేసుకోవడానికి అనుమతి కోరుతూ బాధితురాలు శనివారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అంతేకాదు ఇది తన సొంత నిర్ణయమని, కేరళలోని కొట్టియూర్‌కు చెందిన బాధితురాలు పేర్కొంది. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. ఈ అప్పీల్‌నుసుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది. బాధితురాలిని పెళ్లి చేసుకుంటానంటూ కేరళ హైకోర్టులో రాబిన్ దాఖలు పిటిషన్‌ను తిరస్కరించిన అయిదు నెలల అనంతరం ఈ పరిణామం చోటుచేసుకుంది. 2016 లో రాబిన్ మైనర్ బాలిక (16)ను లోబర్చుకుని అత్యాచారానికి పాల్పడ్డాడు. ఫలితంగా ఆ బాలిక 2017లో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. బాధితురాలి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 2017 ఫిబ్రవరిలో రాబిన్ వడక్కుం చెర్రిన కొచ్చిలో అరెస్టు చేశారు. తనకు సంబంధం లేదని, తాను అమాయకుడిననీ రాబిన్ మొదట్లో బుకాయించాడు. కానీ డీఎన్ఏ టెస్టులో నిజాలు నిగ్గు తేలడంతో రెండేళ్ల తర్వాత అతడిని దోషిగా నిర్ధారించింది. 2019లో రాబిన్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే జైలు శిక్ష అనుభవిస్తున్న రాబిన్ తన వల్ల బాధితురాలికి జన్మించిన చిన్నారి సంరక్షణ బాధ్యతలను జైలు శిక్ష కారణంగా చూసుకోలేకపోతున్నానని, ఆమెను పెళ్లి చేసుకునేందుకు అనుమతించాలంటూ కేరళ హైకోర్టుకు లేఖ రాశాడు. ఇందుకు తనకు రెండు నెలలు బెయిల్ మంజూరు చేయాలని కోరాడు. అయితే రాబిన్ ప్రతిపాదనను కేరళ హైకోర్టు తిరస్కరించింది. శిక్షనుంచి తప్పించుకునేందుకు అతను ఈ ఎత్తుగడ వేశాడని వ్యాఖ్యానించింది. అంతేకాదు దీనికి అంగీకరిస్తే ఇకపై ప్రతి అత్యాచార దోషి, శిక్షలు తప్పించుకునేందుకు బాధితురాలిని పెళ్లి చేసుకుంటాననే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఇలాంటి సంప్రదాయన్ని తాము ప్రోత్సహించమని ధర్మాసనం ఈ ఏడాది ఫిబ్రవరిలో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. -
గుడ్డిగా నమ్మొద్దు!
వేదిక వృత్తిని బట్టి వ్యక్తిత్వాన్ని అంచనా వేయొద్దు. నా విషయంలో నా తల్లిదండ్రులు చేసిన పొరపాటు అలాంటిదే. నేను ఇంటర్ చదువుతుండగా పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టారు. మొదట వచ్చిన సంబంధంలో అబ్బాయి చదువుకోలేదని మావాళ్లు ఒప్పుకోలేదు. రెండో సంబంధం అబ్బాయి చాన్నాళ్ల నుంచి పట్నంలో ఉన్నాడు...ఎలాంటి చెడు అలవాట్లుంటాయోనని వద్దన్నారు. ఇంతలో మా బంధువులబ్బాయి ఏదో చిన్న వ్యాపారం చేసుకుంటూ బాగానే సంపాదిస్తున్నాడని, అబ్బాయి కూడా బాగానే ఉంటాడని మా మేనత్త చెప్పింది. కానీ అబ్బాయికి స్నేహితులెక్కువనీ, ఖర్చు కూడా ఎక్కువని మా నాన్న ఒప్పుకోలేదు. ఒక్కగానొక్క బిడ్డను కావడంతో మావాళ్ళు అన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకొనేవారు. ఇంతలో నాన్న స్నేహితుడు ఒక సంబంధం తీసుకొచ్చారు. అబ్బాయి సిఐగా పనిచేస్తున్నాడనగానే మా నాన్న ఎగిరి గంతేశారు. ‘పోలీసంటే పెళ్లి తర్వాత మనమ్మాయి గురించి పూర్తిగా మరచిపోవచ్చు. ఎంచక్కా పోలీసాయన చేతిలో పెడితే ఏ గొడవా ఉండదు’ అన్నారు. అబ్బాయి ఎలా ఉంటాడు, ఎక్కడ పనిచేస్తున్నాడు, ఎంత జీతం వస్తుంది, కుటుంబం వివరాలు ఏమిటన్నది కనుక్కున్నారు. తర్వాత ఒక్క నిమిషం కూడా ఆగలేదు...హడావిడిగా పెళ్లి చేసేశారు. పెళ్లయిన కొత్తలో అంతా బాగానే ఉంది. ఉన్నట్టుండి ఆయనకి పక్కజిల్లాకి ట్రాన్స్ఫర్ అయింది. ఒకోరోజు ఇంటికి వచ్చేవారు కాదు. అదేంటంటే...డ్యూటీ అనేవారు. ఒకసారి క్యాంపు పని అని చెప్పి నాలుగురోజులు రాలేదు. ఆ సమయంలో ఒక కానిస్టేబుల్ వచ్చి ‘సార్ ఉన్నారా మేడమ్...’ అన్నాడు. క్యాంపుకెళ్లారని చెప్పగానే ‘క్యాంపు ఏమిటి మేడమ్! సార్ సెలవులో ఉన్నారు కదా!’ అన్నాడు. అప్పుడిక అనుమానం వచ్చి ఆయన గురించి ఆరా తీయడం మొదలుపెట్టాను. ఆయనకు చాన్నాళ్ల నుంచి ఒకమ్మాయితో అక్రమసంబంధం ఉంది. నాకేం చేయాలో అర్థం కాలేదు. ఇదే పని మరొక వ్యక్తి చేసుంటే వెంటనే పోలీసులను ఆశ్రయించేదాన్ని. కానీ, పోలీసు వృత్తిలో ఉండి కూడా ఇలాంటి ఘోరాలు చేస్తే ఇంకెవరికి చెప్పాలి. పదిమందికీ రక్షణ కల్పించాల్సిన వాళ్ల గురించి చెడుగా చెప్పడానికి మనసు రావడంలేదు. కానీ, చేస్తున్న వృత్తుల్ని చూసి మోసపోకండని నలుగురి కళ్లు తెరిపించే ప్రయత్నం చేయాలని ఉంది. నాకు అసలు విషయం అర్థమైనట్లు ఇంకా నా భర్తకు తెలియదు. తెలిస్తే...నాకు భయపడి తను చేస్తున్న తప్పుని సరిదిద్దుకుంటారని నేను అనుకోవడం లేదు. అందుకే నా చదువుని కొనసాగింద్దామనుకుంటున్నాను. ఈ ‘వేదిక’ ద్వారా ఆడపిల్లల తల్లిదండ్రులకు నేను చెప్పేదేమిటంటే...అబ్బాయి ఫలానా ఉద్యోగం చేస్తున్నాడు కాబట్టి బుద్ధిమంతుడై ఉంటాడనే అపోహల్లో ఉండకండి! - ఓ సోదరి, ఖమ్మం