refusal
-
కేజ్రీకి ఢిల్లీ హైకోర్టులో దక్కని ఊరట
న్యూఢిల్లీ: కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన పిటిషన్‌పై అత్యవసర విచారణకు కోర్టు నిరాకరించింది. తనను ఈడీ అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఆయన శనివారం పిటిషన్ దాఖలు చేశారు. తన అరెస్టు, రిమాండ్ చట్టవిరుద్ధమని, వెంటనే విడుదల చేసేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. పిటిషన్‌ను అత్యవసరంగా, వీలైతే ఆదివారమే విచారించాలని కోరారు. అయితే బుధవారం విచారణ చేపడతామని కోర్టు తెలిపింది. జర్మనీ ప్రకటన, రాయబారికి భారత్ సమన్లు కేజ్రీవాల్ అరెస్ట్‌పై జర్మనీ సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘‘ఈ అరెస్ట్‌ను మేం గమనిస్తున్నాం. న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రమాణాలు, ప్రాథమిక ప్రజాస్వామ్య సూత్రాలు ఈ కేసుకు వర్తిస్తాయని ఆశిస్తున్నాం. కేజ్రీవాల్ న్యాయమైన, నిష్పక్షపాత విచారణకు అర్హులు. చట్టపరమైన పరిష్కారాలను పరిమితుల్లేకుండా ఉపయోగించుకునే హక్కు ఆయనకుండాలి’’ అని జర్మనీ విదేశాంగ మంత్రి పేర్కొంది. దీనిపై విదేశాంగ శాఖ తీవ్ర నిరసన తెలిపింది. ఇది తమ అంతర్గత వ్యవహారాల్లో, న్యాయ ప్రక్రియలో జోక్యం చేసుకోవడమేనని ఆక్షేపించింది. జర్మనీ వ్యాఖ్యలను అసమంజసం, పక్షపాతపూరితమని పేర్కొంటూ ఢిల్లీలోని జర్మనీ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ జార్జి ఎన్జ్వీలర్కు సమన్లు జారీ చేసినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ చెప్పారు. -
సహజీవనం చేసి పెళ్లాడకుంటే...మోసగించినట్టు కాదు
బెంగళూరు: సహజీవనం చేసి పెళ్లాడకపోతే అది మోసగించడం కిందకు రాదని కర్నాటక హైకోర్టు పేర్కొంది. సదరు వ్యక్తిపై ఐపీసీ సెక్షన్ 420 కింద కేసు పెట్టలేమని న్యాయమూర్తి జస్టిస్ కె.నటరాజన్ స్పష్టం చేశారు. తన బోయ్‌ఫ్రెండ్ ఎనిమిదేళ్లు సహజీవనం చేసి చివరికి పెళ్లికి నిరాకరించాడంటూ ఓ మహిళ చేసిన ఫిర్యాదును కొట్టేస్తూ ఆయన తీర్పు వెలువరించారు. ఇద్దరి మధ్య ఉన్న సహజీవన ఒప్పందాన్ని అతను మోసపూరిత ఉద్దేశంతో ఉల్లంఘించాడని చెప్పలేమని ఈ సందర్భంగా న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. ఇంట్లోవాళ్లు ఇంకో అమ్మాయితో పెళ్లి కుదిర్చిన కారణంగా సహజీవనాన్ని వైవాహిక బంధంగా మార్చుకునేందుకు సదరు అబ్బాయి నిరాకరించాడు. -
నిర్భయ కేసు విచారణ నేటికి వాయిదా
న్యూఢిల్లీ: నిర్భయపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషులను వేర్వేరుగా ఉరితీయాలంటూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణని సుప్రీంకోర్టు శుక్రవారానికి వాయిదావేసింది. అలాగే రాష్ట్రపతి కోవింద్ క్షమాభిక్ష తిరస్కరణను చాలెంజ్ చేస్తూ దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ దాఖలు చేసుకున్న పిటిషన్‌నూ శుక్రవారం విచారిస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. తన పాత లాయర్‌ను తొలగించారని, కొత్త లాయర్‌ను నియమించు కోవడానికి సమయం అవసరమని దోషి పవన్ గుప్తా కోర్టుకు విన్నవించాడు. దీంతో జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ(డీఎల్ఎస్ఏ) మరో లాయర్‌ను సూచించగా అందుకు పవన్ సుముఖంగా లేనట్టు తీహార్ జైలు అధికారులు ఢిల్లీ కోర్టుకు తెలిపారు. విచారణ ఆలస్యం కావడంతో జడ్జి ధర్మేంద్ర. పవన్ తరఫున వాదించేందుకు రవి క్వాజీ అనే లాయర్‌ను కొత్తగా నియమించారు. -
వీడ్కోలు కార్యక్రమ ఆహ్వానాన్ని తిరస్కరించిన జస్టిస్ చలమేశ్వర్
న్యూఢిల్లీ: వచ్చే నెల 22న పదవీ విరమణ చేయనున్న జస్టిస్ చలమేశ్వర్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్(ఎస్సీబీఏ) తలపెట్టిన వీడ్కోలు కార్యక్రమ ఆహ్వానాన్ని తిరస్కరించారు. గతవారం జస్టిస్ చలమేశ్వర్‌ను కలిసి వీడ్కోలు సమావేశానికి ఆహ్వానించగా ఆయన తిరస్కరించారని ఎస్సీబీఏ కార్యదర్శి వికాస్ సింగ్ తెలిపారు. దీంతో బుధవారం తాము మరోసారి వెళ్లి, ఆయన్ను ఒప్పించేందుకు యత్నించగా వ్యక్తిగత కారణాలు చూపుతూ ఆ కార్యక్రమానికి హాజరుకాలేకపోతున్నట్లు చెప్పారన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి మరో హైకోర్టుకు బదిలీ అయినప్పుడూ వీడ్కోలు సమావేశానికి వెళ్లలేదని ఆయన తెలిపారని వికాస్ సింగ్ చెప్పారు. సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆఖరి పనిదినమైన ఈనెల 18న జస్టిస్ చలమేశ్వర్ వీడ్కోలు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వికాస్ సింగ్ వివరించారు. కాగా, జస్టిస్ చలమేశ్వర్ గత మూడు వారాలుగా బుధవారం రోజు కోర్టు విధులకు హాజరుకావడం లేదని కోర్టు వర్గాలు తెలిపాయి. -
‘డ్రీమర్ల’కు సెనెట్ నో
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు ఆ దేశ ఎగువసభ సెనెట్‌లో ఎదురుదెబ్బ తగిలింది. బాల్యంలోనే తల్లిదండ్రులతో అమెరికాకు అక్రమంగా వలసవచ్చిన 18 లక్షల మంది(డ్రీమర్ల)కి పౌరసత్వం కల్పించేందుకు ట్రంప్ మద్దతిచ్చిన బిల్లును 60–39 ఓట్లతో శుక్రవారం సెనెట్ తిరస్కరించింది. డ్రీమర్లకు పౌరసత్వం కల్పించినందుకు ప్రతిగా అమెరికా–మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణానికి, భద్రతా ఏర్పాట్లకు రూ.16.08 లక్షల కోట్లు(25 బిలియన్ డాలర్లు) కేటాయించాలని ట్రంప్ డెమొక్రాట్లతో గతంలో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ బిల్లు ఆమోదం పొందితే అమెరికాలోకి కుటుంబ ఆధారిత వలసలతో పాటు దేశాలవారీగా చేపట్టే లాటరీ వీసా పద్ధతి రద్దయ్యేది. తద్వారా హెచ్1బీ వీసా కోసం ఎదురుచూస్తున్న భారతీయులకు లబ్ధి చేకూరేది. అమెరికాలో వలసలపై సెనెట ర్లు షుమర్–రౌండ్స్–కొలిన్స్ ప్రతిపాదిం చిన మరో బిల్లును ఎగువ సభ 54–45 మెజారిటీతో తిరస్కరించింది. డ్రీమర్ల బిల్లును సెనెట్ తిరస్కరించిన నేపథ్యంలో త్వరలో మరో ఒప్పందం కుదరకుంటే మార్చి 5 తర్వాత 18 లక్షల మందిని బలవంతంగా విదేశాలకు పంపిస్తారేమోనన్న భయాలు నెలకొన్నాయి. సెనెట్‌లో ఏదైనా బిల్లు ఆమోదం పొందేందుకు 60 ఓట్లు రావడం తప్పనిసరి. -
నీట్ ఆర్డినెన్స్ స్టేపై సుప్రీం కోర్టు నిరాకరణ
-
సెక్స్‌కు ఒప్పుకోలేదని.. 19 మంది దహనం
బాగ్దాద్: ఇరాక్‌లో యాజ్దీ యువతులపై ఐఎస్ఐఎస్ టెర్రరిస్టుల పైశాచికత్వం నిరాఘటంగా కొనసాగుతోంది. జిహాదీల వాంఛలు తీర్చేందుకు సెక్స్ బానిసలుగా మారడానికి ఒప్పుకోని 19 యాజ్దీ అమ్మాయిలను ఇనుపబోనులో బంధించి సజీవ దహనం చేశారు. ఈ దారుణ సంఘటన ఇరాక్‌లోని మోసుల్ పట్టణంలో చోటుచేసుకుందని స్థానిక మీడియా ప్రతినిధి అబ్దుల్లా అల్ మల్లా కుర్దీష్ వార్తా సంస్థ ఏఆర్ఏ న్యూస్‌కు వెల్లడించారు. వందలాది మంది ప్రజలు చూస్తుండగానే టెర్రరిస్టులు ఈ దారుణ మారణకాండకు పాల్పడ్డారని, వారిని రక్షించేందుకు ప్రజలెవరూ కూడా సాహసించలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఇప్పటికే మూడువేల మంది యాజ్దీ అమ్మాయిలను సెక్స్ బానిసలుగా చేసుకున్న టెర్రరిస్టులు వారిపై అకృత్యాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఇరాక్‌లోని యాజ్దీ ప్రాంతాన్ని ఐఎస్ఐఎస్ టెర్రరిస్టులు ఆక్రమించుకున్న 2014 నుంచి వారి పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నారు. సెక్స్ బానిసలుగా మారేందుకు ఒప్పుకోని యాజ్దీ యువతులను గతంలో కూడా దారుణంగా కొట్టి చంపారు. క్రైస్తవం, జొరాస్ట్రియన్, ఇస్లాం మతాన్ని ఆచరించే యాజ్దీ జాతి ప్రజలను ఐఎస్ఐఎస్ సైతాన్ ఆరాధకులుగా ముద్రవేస్తూ వారిపై పైశాచిక చర్యలకు పాల్పడుతోంది. వారి ఆగడాలను భరించలేక ఇప్పటికే దాదాపు యాభైవేల మంది యాజ్దీలు దేశం విడిచి పారిపోయారు.