న్యూఢిల్లీ: కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన పిటిషన్‌పై అత్యవసర విచారణకు కోర్టు నిరాకరించింది. తనను ఈడీ అరెస్టు చేయడాన్ని సవాలు చేస్తూ ఆయన శనివారం పిటిషన్ దాఖలు చేశారు. తన అరెస్టు, రిమాండ్ చట్టవిరుద్ధమని, వెంటనే విడుదల చేసేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. పిటిషన్‌ను అత్యవసరంగా, వీలైతే ఆదివారమే విచారించాలని కోరారు. అయితే బుధవారం విచారణ చేపడతామని కోర్టు తెలిపింది.
జర్మనీ ప్రకటన, రాయబారికి భారత్ సమన్లు
కేజ్రీవాల్ అరెస్ట్‌పై జర్మనీ సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘‘ఈ అరెస్ట్‌ను మేం గమనిస్తున్నాం. న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రమాణాలు, ప్రాథమిక ప్రజాస్వామ్య సూత్రాలు ఈ కేసుకు వర్తిస్తాయని ఆశిస్తున్నాం. కేజ్రీవాల్ న్యాయమైన, నిష్పక్షపాత విచారణకు అర్హులు. చట్టపరమైన పరిష్కారాలను పరిమితుల్లేకుండా ఉపయోగించుకునే హక్కు ఆయనకుండాలి’’ అని జర్మనీ విదేశాంగ మంత్రి పేర్కొంది. దీనిపై విదేశాంగ శాఖ తీవ్ర నిరసన తెలిపింది. ఇది తమ అంతర్గత వ్యవహారాల్లో, న్యాయ ప్రక్రియలో జోక్యం చేసుకోవడమేనని ఆక్షేపించింది. జర్మనీ వ్యాఖ్యలను అసమంజసం, పక్షపాతపూరితమని పేర్కొంటూ ఢిల్లీలోని జర్మనీ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ జార్జి ఎన్జ్‌వీలర్‌కు సమన్లు జారీ చేసినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ చెప్పారు.
కేజ్రీకి ఢిల్లీ హైకోర్టులో దక్కని ఊరట
Published Sun, Mar 24 2024 5:46 AM | Last Updated on Sun, Mar 24 2024 5:46 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment