న్యూఢిల్లీ: నిర్భయపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో దోషులను వేర్వేరుగా ఉరితీయాలంటూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణని సుప్రీంకోర్టు శుక్రవారానికి వాయిదావేసింది. అలాగే రాష్ట్రపతి కోవింద్ క్షమాభిక్ష తిరస్కరణను చాలెంజ్ చేస్తూ దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ దాఖలు చేసుకున్న పిటిషన్‌నూ శుక్రవారం విచారిస్తామని సుప్రీంకోర్టు వెల్లడించింది. తన పాత లాయర్‌ను తొలగించారని, కొత్త లాయర్‌ను నియమించు కోవడానికి సమయం అవసరమని దోషి పవన్ గుప్తా కోర్టుకు విన్నవించాడు. దీంతో జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ(డీఎల్‌ఎస్‌ఏ) మరో లాయర్‌ను సూచించగా అందుకు పవన్ సుముఖంగా లేనట్టు తీహార్ జైలు అధికారులు ఢిల్లీ కోర్టుకు తెలిపారు. విచారణ ఆలస్యం కావడంతో జడ్జి ధర్మేంద్ర. పవన్ తరఫున వాదించేందుకు రవి క్వాజీ అనే లాయర్‌ను కొత్తగా నియమించారు.
Comments
Please login to add a commentAdd a comment