
బంగారి సత్యవతితో సహజీవనం
నరసన్నపేట: స్థానిక బజారువీధిలో నివాసముంటున్న పాయకరావుపేటకు చెందిన దక్కుబల్లి శివ (35) అనుమానాస్పదంగా మృతి చెందాడు. గుర్తు తెలియని వ్యక్తులు తీవ్రంగా కొట్టడం వలన శివ మృతి చెందాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పాయకరావుపేట నుంచి నరసన్నపేటకు 15 ఏళ్ల క్రితం వలస వచ్చిన శివ తునికి చెందిన బంగారి సత్యవతితో సహజీవనం చేస్తూ బజారు వీధిలో నివాసముంటున్నారు.
మద్యానికి బానిసయ్యాడు. ఈ నెల 12న తీవ్ర గాయాలతో ఇంటికి రాగా సత్యవతి స్థానికుల సహాయంతో నరసన్నపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించింది. పరిస్థితి విషమించడంతో ఈ నెల 13న శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందా డు. కాగా, శివ స్నేహితులు మాత్రం ఇది హత్యేనని, కేసు దర్యాప్తు చేసి నిందితులను గుర్తించాలని కోరుతున్నారు. శివ కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చినా రాకపోవడంతో సత్యవతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామ ని ఎస్‌ఐ సింహాచలం తెలిపారు.