
జీడిపప్పు అధరహో..!
● పెరిగిన జీడిపప్పు ధరలు
● పరిశ్రమల్లో పిక్కల కొరతే కారణం
● కేజీ జీడిగుడ్లు రూ.830,
జీడిబద్దలు రూ.760కు పైమాటే
కాశీబుగ్గ: ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిగాంచిన పలాస జీడిపప్పు ధరకు రెక్కలొచ్చాయి. కొత్త జీడి పంట చేతికి అందుతున్న తరుణంలో పాత జీడినిల్వలు పూర్తవడంతో ఒక్కసారిగా జీడిపప్పుకు డిమాండ్ ఏర్పడింది. రెండు నెలలుగా వరుసగా శుభకార్యాలు ఊపందుకోవడం, నెలరోజులుగా పలాస–కాశీబుగ్గ జంట పట్టణాలలోని జీడి పరిశ్రమలలో అటు పిక్కలు, ఇటు పప్పు రెండూ అందుబాటులోకి రాకపోవడంతో ధరలు అమాంతం పెరిగిపోయాయి. అనేక ప్రాంతాలలో జీడిపప్పు దొరుకుతున్నప్పటికీ ఉద్దానంఇసుక నేలలో పండిన జీడి పంట రుచే వేరు. అందుకే ధర ఎంత పెరిగినా డిమాండ్ మాత్రం తగ్గదు.
అనధికారికంగా మూత..
మరోవైపు, కొంతమంది పరిశ్రమదారులు గోదాములలో పాత పిక్కలు, పప్పులను షాపులకు తరలించి ఫ్యాక్టరీలు ఖాళీ చేస్తున్నారు. పిక్కలు లేవంటూ అనధికారకంగా పరిశ్రమలను మూసివేస్తున్నా రు. కొత్త పప్పు ప్రాసెసింగ్ జరగడం లేదంటూ కృత్రిమ కొరత ఏర్పడేలా చేసి ధరలను పెంచుతున్నారనే ఆరోపణలూ వినిపిస్తున్నాయి. ఏదిఏమైనా పలాస కాష్యూ మాన్యుఫ్యాక్చర్ అసోషియేషన్ పరిధిలోని మూడు వందలకు పైగా పరిశ్రమలతో పా టు ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లోని పరిశ్రమలు సై తం ధరలు భారీగా పెంచేశాయి. టన్నుల కొద్దీ లా రీలు ఉత్తరాదికి ఎగుమతులు జరుగుతున్నా స్థానికంగా పప్పు దొరకాలంటే కష్టతరంగా మారింది.
కొత్త ధరలు
రకం ధర
జంబో జీడి పప్పు రూ.900
మొదటి రకం(240 గుడ్లు) రూ.830
మూడో రకం (330 గుడ్లు) రూ.760
నాలుగోరకం (కౌంట్‌లెస్) రూ.730
మొదటి రకం బద్ద (జేహెచ్) రూ.760
రెండో రకం బద్ద (జేహెచ్)
రూ.600–రూ.700
మూడో రకం(కే) సగం బద్ద రూ.710
నాలుగో రకం ముక్క బద్ద రూ.610
మొదటి రకం బేబీ (జీడి నూక) రూ.440
రెండో రకం బేబీ (జీడి నూక) రూ.250

జీడిపప్పు అధరహో..!