లక్ష్మీపురం డీలర్‌పై కూటమి నాయకుల దాడి | - | Sakshi
Sakshi News home page

లక్ష్మీపురం డీలర్‌పై కూటమి నాయకుల దాడి

Apr 18 2025 1:33 AM | Updated on Apr 18 2025 1:33 AM

లక్ష్

లక్ష్మీపురం డీలర్‌పై కూటమి నాయకుల దాడి

ఎచ్చెర్ల: లావేరు మండలంలోని లక్ష్మీపురం గ్రామంలో డీలర్‌గా పనిచేసిన డి.రమణమ్మపై ఆ గ్రామానికి చెందిన కూటమి నాయకులు గురువారం దాడికి పాల్పడ్డారు. గాయాలపాలైన ఆమెను 108 ద్వారా రిమ్స్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతున్నారు. వివరాల్లోకి వెళితే.. గ్రామంలో డీలర్‌గా పనిచేసిన డి.రమణమ్మను రేషన్‌ పంపిణీలో కందిపప్పు వద్ద అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో గత ఏడాది ఏప్రిల్‌లో సస్పెండ్‌ చేశారు. అయితే ఆమె హైకోర్టును ఆశ్రయించగా హైకోర్టు ఆమె డీలర్‌గా కొనసాగేందుకు స్టే ఇచ్చింది. అయితే రమణమ్మ డీలర్‌గా కొనసాగడానికి వీల్లేదని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకురాగా.. ఆ మేరకు గురువారం ఎమ్మర్వో జోగారావు, ఆర్‌ఐ శ్రీనివాసరావులు గ్రామానికి చేరుకుని గ్రామస్తుల వద్ద స్టేట్‌మెంట్‌ తీసుకున్నారు. కోర్టు ఆర్డర్‌ ఇచ్చిందని, దీన్ని తాము కాదనలేమని ఆమెనే కొనసాగించాలని అధికారులు తెలిపారు. ఏ స్టే ఇచ్చినా తమకు ఆమె డీలర్‌గా కొనసాగేందుకు ఇష్టం లేదని స్థానికులు అధికారులకు తెలిపారు. దీంతో అధికారులు వెనుదిరిగారు. ఆ తర్వాత వీఆర్‌ఓ గ్రామస్తుల వద్ద స్టేట్‌ మెంట్‌ తీసుకుంటుండగా అక్కడకు వచ్చి న డీలర్‌ రమణమ్మను చూసిన కూటమి నాయకులు ఒక్కసారిగా ఆమైపె దాడికి దిగారు. ఆమె వద్దనున్న ఫోన్‌ లాక్కున్నారు. ఆమెతో పాటు రమణమ్మ భర్త సూరప్పన్న, కుమార్తె వసంతకుమారిలపై కూడా దాడిచేశారు. వీరంతా ప్రస్తుతం రిమ్స్‌లో చికిత్స పొందుతున్నా రు. కూటమి నాయకులు డీలర్‌పై చేసిన దాడిని ఖండిస్తున్నామని వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు దన్నాన రాజీన్నాయుడు, రొక్కం బాలకృష్ణలతో పాటు పలువురు తెలిపారు.

సెంటీమీటర్‌ శిలువ

కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ 21వ వార్డుకు చెందిన సూక్ష్మ కళాకారులు కొత్తపల్లి రమేష్‌ ఆచారి పలుచటి బంగారపు రేకు పైన శిలువ గుర్తు తయారు చేశారు. కేవలం 100 మిల్లీ గ్రాముల బంగారంతో ఒక సెంటీమీటర్‌ ఎత్తుతో తయారు చేసి గుడ్‌ఫ్రైడే సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

‘ప్రభుత్వ పాఠశాలలను

10 లక్షల మంది విడిచారు’

కాశీబుగ్గ: కరోనా సమయంలో నాలుగు లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చేరితే.. ఇప్పుడు ప్రభుత్వ విధానాల వల్ల 10 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలను విడిచిపెట్టి వెళ్లిపోయారని యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు లండ బాబూరావు అన్నారు. కాశీబుగ్గ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా కార్యదర్శి కంచరాన రమేష్‌ ఆధ్వర్యంలో గురువారం ప్రాంతీయ సమావేశం జరిగింది. సమావేశంలో పలాస, మందస, వజ్రపుకొత్తూరు మండలాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ ప్రభుత్వం విద్యా రంగంపై చేస్తున్న ప్రయోగాల వల్ల నానాటికీ విద్యావ్యవస్థ దిగజారే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఒకే మీడియం పాఠశాలలను నిర్వహించడం, 3,4,5 తరగతులు హైస్కూల్‌లో కలపడం, నేటి ప్రభుత్వం పరిసర ప్రాంత పాఠశాలల విలీనం చేయడం పాఠశాలల మూత వేయడానికి ప్రధాన కారణమన్నారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బమ్మిడి శ్రీరామ్మూర్తి, జిల్లా కార్యదర్శి గున్న రమేష్‌, అకడమిక్‌ సెల్‌ కన్వీనర్‌ లఖినాన వెంకటాచలం, పలాస అధ్యక్షుడు తమ్మినాన జయరాం, ప్రధాన కార్యదర్శి డి.జనార్దనరావు, పి.సంజయ్‌కుమార్‌, టి.అప్పారావు, పలాస వజ్రపుకొత్తూరు మందస యూటీఎఫ్‌ నాయకులు హాజరయ్యారు.

లక్ష్మీపురం డీలర్‌పై  కూటమి నాయకుల దాడి 
1
1/3

లక్ష్మీపురం డీలర్‌పై కూటమి నాయకుల దాడి

లక్ష్మీపురం డీలర్‌పై  కూటమి నాయకుల దాడి 
2
2/3

లక్ష్మీపురం డీలర్‌పై కూటమి నాయకుల దాడి

లక్ష్మీపురం డీలర్‌పై  కూటమి నాయకుల దాడి 
3
3/3

లక్ష్మీపురం డీలర్‌పై కూటమి నాయకుల దాడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement