ఓ ఇండియన్ వీడియోకి హాలీవుడ్ నటి ఫిదా | Jennifer Lopez shared Travelographer Charanpreet Singh video | Sakshi
Sakshi News home page

ఓ ఇండియన్ వీడియోకి హాలీవుడ్ నటి ఫిదా

Published Fri, Jul 1 2016 6:22 PM | Last Updated on Mon, Sep 4 2017 3:54 AM

Jennifer Lopez shared Travelographer Charanpreet Singh video

ఓ 27 ఏళ్ల భారత యువకుడి సాహస యాత్ర ప్రముఖ పాప్ సింగర్, నటి, హాలీవుడ్ హాట్ లేడీ జెన్నిఫర్ లోపెజ్కు తెగనచ్చేసింది. పంజాబ్లోని లుథియానాకు చెందిన చరణ్ ప్రీత్ సింగ్కు ఫోటోగ్రఫీ అన్నా బైక్ పై లాంగ్ ట్రిప్ లకు వెళ్లడమన్నా తెగ సరదా.

జమ్మూ కశ్మీర్లోని ఇష్త్యారీ, త్యారీ మధ్యలో ఉన్న దారి ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర రోడ్డు మార్గాల్లో ఒకటి. ఎత్తైన కొండలు, వాటి మధ్యలో లోతైన లోయలు. కిందకు చూడడానికే అతి భయంకరంగాఉండే లోయల నడుమ చిన్న మట్టిరోడ్లు. ఇలాంటి మార్గాల్లో చరణ్ తన సహచరులతో కలిసి బైక్పై ప్రయాణించాడు. దీనికి సంబంధించి వీడియోను బైక్ వెనకవైపు కూర్చున్న వ్యక్తి షూట్ చేశాడు.


రోడ్డు మార్గం మొత్తం చిన్న చిన్న గుంతలు, రాళ్లు దర్శనమిస్తాయి. మధ్య మధ్యలో కొండలపైనుంచి కిందకు జారిపడే జలపాతాలు కూడా రోడ్డు పై నుంచే వెళ్లడంతో నీటిలోంచే బైక్ వెళ్లాల్సి ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఏ చిన్న తప్పిదం జరిగినా బైక్ లోయల పడడం మినహా వేరే దారే లేదు. ఒక వేళ అదే గనుకు జరిగితే కనీసం వారి ఆనవాళ్లు కూడా దొరకడం అనుమానమే.

ఈ ట్రిప్ను చరణ్ తన సహచరులతో కలిసి విజయవంతంగా పూర్తి చేసి దీనికి సంబంధించి వీడియోను సోషలో మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ వీడియోని చూసి ముగ్ధురాలైన జెన్నిఫర్ ఇలాంటి సాహసం మీరు చెయగలరా అంటూ...వీడియోను తన ఫేస్ బుక్ పేజీలో షేర్ చేసింది. 4,55,49,546 మంది ఫాలోవర్లతో ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్స్ ఉన్న వారిలో 59 వ స్థానంలో జెన్నీఫర్ ఫేస్ బుక్ పేజీ ఉంది. ఇంకేముంది షేర్ చేసిన కొద్దిసమయంలోనే వేలల్లో లైక్లు వచ్చాయి. 

ఈ వీడియో చూసిన వారిలో ...ఎలాగైనా ఇలాంటి రోడ్లపై ఒక్కసారైనా రైడ్ చేయాలని యువకులు భావిస్తుంటే, కిక్ కోసం మరీ అంత ప్రమాదకరమైన మార్గాల్లో ప్రయాణం అవసరమా అని కొంచెం వయసుపైబడిన వారు కామెంట్లలో తమ అభిప్రాయాలు తెలుపుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement