ఆ ప్లేయర్‌తో జెన్నిఫర్‌ డేటింగ్‌! | Jennifer Lopez dating Alex Rodriguez? | Sakshi
Sakshi News home page

ఆ ప్లేయర్‌తో జెన్నిఫర్‌ డేటింగ్‌!

Published Thu, Mar 9 2017 1:34 PM | Last Updated on Tue, Sep 5 2017 5:38 AM

ఆ ప్లేయర్‌తో జెన్నిఫర్‌ డేటింగ్‌!

ఆ ప్లేయర్‌తో జెన్నిఫర్‌ డేటింగ్‌!

లాస్‌ఎంజెల్స్‌: ప్రముఖ హాలీవుడ్‌ సింగర్‌, నటి జెన్నిఫర్‌ లోపెజ్‌ ఒక కొత్త వ్యక్తితో రొమాంటికల్‌ లైఫ్‌లోకి దిగింది. ఆమె ప్రస్తుతం ఆ వ్యక్తితో డేటింగ్‌ చేస్తూ మీడియాకు చిక్కేసింది. ప్రముఖ బేస్‌బాల్‌ ప్లేయర్‌ అలెక్స్‌ రోడ్రిగ్వెజ్‌తో ప్రస్తుతం ఆమె రొమాన్స్‌ చేస్తోందని హాలీవుడ్‌ మీడియా కోడై కూస్తోంది. లాస్‌ వెగాస్‌లో వీరిద్దరు గత నెలలో పలువురి కంటపడ్డారట. అలా కనిపించడంపై వారిని ప్రశ్నించగా ఏదో కొద్ది సమయం సేద తీరేందుకు, కలిసి గడిపేందుకు ఇలా వచ్చామంటూ చెప్పి వెంటనే వెళ్లిపోయారంట.

దీంతో వారిద్దరి మధ్య డేటింగ్‌ జరుగుతోందంటూ వార్తలు షికార్లు చేయడం మొదలుపెట్టాయి. ‘ అందరికీ ఇది నిజంగా చాలా చాలా కొత్తది. అయితే, సీరియస్‌ విషయం మాత్రం కాదు. జెన్నిఫర్‌, అలెక్స్‌లు రిలేషన్‌లో ఉన్నారు. వారిద్దరు సహజీవనం చేస్తున్నారు’ అంటూ రాశాయి. గతంలో 30 ఏళ్ల బ్రేక్‌తో 47 ఏళ్ల జెన్నిఫర్‌ డేటింగ్‌ చేయడంపై ప్రశ్నించగా డేటింగ్‌కు వయసుతో పనిలేదని చెప్పారు. ప్రస్తుతం డేటింగ్‌ చేస్తున్నట్లు అలెక్స్‌కు 41 సంవత్సరాలు. జెన్నిఫర్‌కు తొమ్మిదేళ్ల ట్విన్స్‌ ఉన్నారు. ఆమె మాజీ భర్త పేరు మార్క్‌ ఆంటోని.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement