
నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు:
అజీమ్ ప్రేమ్‌జీ (వ్యాపారవేత్త); జెన్నీఫర్ లోపెజ్ (నటి)
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న వారి సంవత్సర సంఖ్య 3. ఇది బృహస్పతికి సంబంధించిన సంఖ్య కాబట్టి మీకు గురుత్వం వస్తుంది. అందరూ మీ మాట వింటారు. కార్యజయం కలుగుతుంది. విషయ పరిజ్ఞానం పొందుతారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తారు. నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తారు. ఈ రోజు పుట్టిన తేదీ 24. అంటే 6. ఇది శుక్రునికి సంబంధించిన అంకె. కుటుంబ పరమైన బాధ్యతలకు ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. వివాహం కాని వారికి వివాహం అవుతుంది. పిల్లలకోసం పెళ్లి సంబంధాలు చూస్తున్న వారి శ్రమ ఫలిస్తుంది. విలాస జీవనానికి ఎక్కువ ఖర్చు చేస్తారు. గతంలో కన్నా ఎంతో రిలాక్స్‌డ్‌గా కనిపిస్తారు.
విద్యార్థులకు కోరుకున్న కోర్సులలో సీట్లు లభిస్తాయి. ఉద్యోగులకు ప్రమోషన్ వస్తుంది. వారు కోరుకున్న ప్రదేశాలకు బదిలీ అవుతుంది. మీడియా రంగంలోని వారికి, కళాకారులకు, సంగీతవిద్వాంసులకు మంచి అవకాశాలు వస్తాయి. చాలా కాలంగా బదిలీ కోసం ఎదురు చూస్తున్న వారి కల ఫలిస్తుంది. పాతస్నేహితులను కలుసుకుంటారు. ఆపోజిట్ సెక్స్ వారితో జాగ్రత్తగా ఉండాలి. న్యాయకోవిదులకు మంచి పేరు వస్తుంది. లక్కీ నంబర్స్: 1,2,3, 5,6,9; లక్కీ కలర్స్: రోజ్, ఆరంజ్, క్రీమ్, గోల్డెన్, శాండల్, బ్లూ; లక్కీ డేస్: గురు, శుక్ర, శని, ఆదివారాలు సూచనలు: దక్షిణామూర్తి ఆరాధన, అనాథలను ఆదుకోవడం, ఆలయాలు, ఇతర ప్రార్థనా స్థలాలలో భోజన సదుపాయాలు ఏర్పాటు చేయించడం వల్ల మరిన్ని మంచి ఫలితాలు అందుకోవచ్చు.
- డాక్టర్ మహమ్మద్ దావూద్