హరికేన్ బాధితులకు జెన్నీఫర్ సాయం | Jennifer Lopez donates 1Million us Dollors to Puerto Rico relief | Sakshi
Sakshi News home page

హరికేన్ బాధితులకు జెన్నీఫర్ సాయం

Published Tue, Sep 26 2017 3:41 PM | Last Updated on Tue, Sep 26 2017 4:33 PM

Jennifer lopez

ఇర్మా, మారియా హరికేన్ లతో కుదేలైన అమెరికా వాసులను ఆదుకునేందుకు హాలీవుడ్ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. తాజాగా హాలీవుడ్ హీరోయిన్ జెన్నీఫర్ లోపెజ్, హరికేన్ బాధితులకు భారీ సాయాన్ని ప్రకటించారు. న్యూయార్క్ గవర్నర్ తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధితులకు పది లక్షల అమెరికన్ డాలర్లు సాయంగా ప్రటించారు.

ఈ హరికేన్ మూలంగా తను కూడా వ్యక్తిగతంగా చాలా నష్టపోయాన్న లోపెజ్, తన కుటుంబ సభ్యులను కూడా కలుసుకోలేకపోయానని ఆవేదన వ్యక్తి చేశారు. తాను సాయం అందించటంతో పాటు అభిమానులు కూడా సాయం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. త్వరలో నిర్వహించనున్న లాస్ వెగాస్ షో ద్వారా వచ్చే మొత్తాన్ని హరికేన్ బాధితులకు అందించనున్నట్టుగా ప్రకటించారు జెన్నీఫర్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement