los vegas
-
మేడలెక్కగలనే ఓ వనితా..
సాధారణంగా యూత్ ఏం చేస్తుంది? చదువు, కెరీర్ బిల్డింగ్, డేటింగ్స్తో తలమునకలై ఉంటుంది. ఖాళీ సమయాల్లో..? సోషల్ మీడియా.. పబ్‌లు.. క్లబ్‌లు.. సినిమాలు.. అవుటింగ్‌లు.. ఎట్సెట్రా! కదా.. కానీ ఈ అబ్బాయి.. మేసన్ డెస్చాంప్స్ మాత్రం చకచకా ఆకాశ హార్మ్యాలు ఎక్కేస్తాడు.. తాళ్లు, కొక్కాలు, జీనులు వంటివాటి ఆసరా ఏమీ లేకుండా. మేసన్ వయసు 22 ఏళ్లు. లాస్ వేగస్‌లోని యూనిర్శిటీ ఆఫ్ నెవాడలో ఫైనాన్స్ స్టూడెంట్. కాలేజీకి ఒక్క పూట సెలవు దొరికినా దగ్గరున్న బిల్డింగులను వెదుక్కుని మరీ చివరి అంతస్తుకి పాకేస్తాడు. అది అతని సరదా. అయితే దానికి ఓ లక్ష్యాన్ని పెట్టుకున్నాడు. ఇన్ని రోజుల్లో ఇన్ని భవంతులకు ఎక్కాలని కాదు.. ఎన్ని అంతస్తుల మేడనైనా ఏ సహాయమూ లేకుండా ఇట్టే ఎక్కేసి చూపిస్తా .. ఫలానా అన్ని డాలర్లు ఇస్తారా అని సవాలు విసురుతాడు. దాని ద్వారా వచ్చిన డబ్బును యాంటీ అబార్షన్ ప్రాజెక్ట్‌కు ఖర్చు పెడ్తాడు. అవును.. ఆ మేసన్ అబార్షన్లకు వ్యతిరేకి. పెళ్లి కాకుండా, పెళ్లయినా ఇష్టం లేని లేదా మానసికంగా సిద్ధంగా లేని, లేదా ఆర్థికలేమిలో ఉన్న అమ్మాయిలు, మహిళలు అబార్షన్‌ను ఆశ్రయించి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారని.. అది నివారించడానికి మేసన్ యాంటీ అబార్షన్ యాక్టివిస్ట్ అయ్యాడు. తాను మేడలెక్కి సంపాదిస్తున్న డబ్బును వీళ్ల డెలివరీలకు ఖర్చు పెడ్తున్నాడు. అలా పుట్టిన పిల్లలను దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చే జంటలను ప్రోత్సహించే ప్రాజెక్ట్ కోసమూ వెచ్చిస్తున్నాడు. అయితే.. ఆ ఉద్దేశం మంచిదే అయినప్పటికీ ఇలా కనిపించిన మేడల్లా ఎక్కుతూ ఏ కాలో .. చెయ్యో.. నడుమో విరగ్గొట్టుకుంటే.. లేదా ప్రాణాల మీదకే తెచ్చుకుంటే ఎలా? ఎవరు దీనికి పూచీకత్తు? పైగా ముందస్తు అనుమతుల్లేకుండా బిల్డింగులు ఎక్కడమేంటి? తప్పు కదా? అంటూ స్థానిక ప్రభుత్వ సంస్థలు మేసన్ సాహసాన్ని తప్పుపట్టాయి. ఇటీవలే శాన్ఫ్రాన్సిస్కోలోని వెయ్యిడెబ్భై అడుగుల ఎత్తున్న 61 అంతస్తుల భవనాన్ని చకచకా ఎక్కేశాడు. అయితే స్థానిక సంస్థల ఆగ్రహం ఫలితంగా అతను ఆ భవంతిని దిగేలోపు పోలీసులు వచ్చి అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఇప్పుడు కాలిఫోర్నియా, నెవాడ రాష్ట్రాల్లో టాక్ ఆఫ్ ది స్టేట్స్ ఈ మగానుభావుడే. ఇతనికి ‘ప్రో– లైఫ్ స్పైడర్‌మ్యాన్’ అని పేరు పెట్టుకుని మరీ ఆ అబ్బాయి గురించి చర్చించుకుంటున్నారు. ఇప్పుడు అతని కేస్ కోర్ట్‌లో ఉంది. ఎక్కితే ఎక్కావ్ కానీ పర్మిషన్ తీసుకో నాయనా అంటోంది కోర్ట్. ‘ఎహే.. నా కిష్టమైన.. పై నుంచి నాతోని ఎవరికీ ఇబ్బంది కలగని పనికి ఎవరినో పర్మిషన్ అడుగుడేంది? అట్లనే ఉంటది మనతోని’ అని వాదిస్తున్నాడు మేసన్. అడాప్షన్ ఓవర్ ది అబార్షన్ (అబార్షన్ బదులు అడాప్షన్) పేరిట ఈ అబ్బాయి సాగిస్తున్న ఉద్యమం అతని అరెస్ట్‌తో అమెరికా అంతటికీ తెలిసిపోయింది. -
తొలిసారి హైపర్‌లూప్‌లో ప్రయాణికులు
వాషింగ్టన్ : అమెరికాలోని లాస్ వెగాస్ నగరంలో రిచర్చ్ బ్రాన్సన్కు చెందిన వర్జిన్ గ్రూప్ ఆదివారం నాడు హైపర్ లూప్ రైలును(కత్రిమ సొరంగ మార్గం గుండా అతివేగంగా నడిచే రైలు) తొలిసారి ప్రయాణికులతో నడిపి విజయం సాధించింది. గతంలో 400 సార్లు హైపర్ లూప్ రైలు ట్రయల్స్‌ను నిర్వహించిన ఈ సంస్థ ప్రయాణికులతో నడపడం మాత్రం ఇదే మొదటిసారి. హైపర్‌లూప్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ జోష్ జోజెల్, డైరెక్టర్ ఆఫ్ ప్యాసింజర్ ఎక్స్‌పీరియెన్స్ సారా లుచియాన్ తొలి ప్రయాణికులుగా ప్రయాణించారు. ప్రయాణికులు కూర్చొని వెళ్లే రైలును ప్రస్తుతం సైన్స్ పరిభాషలో ‘లెవిటేటింగ్ పాడ్’ అని, రైలు మార్గాన్ని ట్యూబ్ అని వ్యవహరిస్తున్నారు. భవిష్యత్తులో దీన్ని ఆంగ్లంలో ‘ట్యూబ్ ట్రెయిన్’ అని పిలిస్తే తెలుగులో గొట్టం రైలుగా చెప్పుకోవచ్చేమో! ఈ రైలుకు గంటకు 600 మైళ్ల వేగంగా దూసుకెళ్లే సామర్థ్యం ఉన్నప్పటికీ ప్రయాణికులతో నడపడం తొలిసారి కనుక గంటకు వంద మైళ్ల వేగంతో రైలును నడిపారు. ( కరోనా వ్యాక్సిన్ : ఫైజర్ పురోగతి ) ఆ రైలు 15 సెకండ్లలో 0.3 మైళ్లు, అంటే 500 మీటర్ల దూరం దూసుకెళ్లింది. అత్యద్భుతమైన హైపర్‌లూప్ టెక్నాలజీని వాస్తవ రూపంలోకి తీసుకొచ్చేందుకు తమ వర్జిన్ గ్రూప్ విశేషంగా కృషి చేస్తోందని గ్రూప్ వ్యవస్థాపకులు పర్ రిచర్డ్ బ్రాన్సన్ తెలిపారు. ఈ సంస్థ నెవడాలోని ఎడారిలో తన హైపర్‌లూప్ మార్గాన్ని నిర్మించి గత కొన్నేళ్లుగా ప్రయోగాలు నిర్వహిస్తోంది. హైపర్‌లూప్‌లో గాలిని కూడా తొలగిస్తారు కనుక ఎలాంటి బాహ్య ఒత్తిడి లేకుండా రైలు వేగంగా ప్రయాణిస్తుందన్నది సైద్ధాంతికంశం. ప్రస్తుతం 600 మైళ్ల వేగంతో నడపడమన్నది కంపెనీ లక్ష్యం కాగా, దాన్ని భవిష్యత్తులో గంటకు వెయ్యి కిలోమీటర్ల వేగం వరకు పెంచవచ్చన్నది భవిష్యత్ వ్యూహం. -
చేతులకు నగలు వేసుకుని అడ్డంగా బుక్కైంది
లాస్‌వెగాస్ : గ్రాసరీ షాపులో 1800 డాలర్ల విలువైన సరుకును దొంగలించేందుకు ప్రయత్నించిన ఒక మహిళ అడ్డంగా బుక్కైన ఘటన అమెరికాలోని నెవెడా ప్రాంతంలో చోటుచేసుకుంది. కాగా ఈ ఘటన ఏప్రిల్ 9న చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నెవెడాకు చెందిన జెన్నిఫర్ వాకర్ అనే 53 ఏళ్ల మహిళ సరుకులు కొనడానికి కాలిఫోర్నియా గ్రాసరీ షాపుకు వెళ్లింది. తనకు కావలిసిన సరుకులను కంటైనర్‌లో లోడ్ చేసిన జెన్నిఫర్ ఆ తర్వాత అక్కడే ఉన్న కొన్ని నగలను తన చేతులకు వేసుకొని ఎవరికి అనుమానం రాకుండా బిల్ కౌంటర్ వద్దకు వచ్చింది. అయితే బిల్లింగ్ చేస్తున్న సమయంలో జెన్నిఫర్ ముఖంలో ఆందోళన కనిపించడంతో షాపు యజమానికి అనుమానమొచ్చి ఆరా తీశాడు. ఆమె సమాధానం చెప్పడానికి తటపటాయించడంతో క్రాస్‌చెక్ చేయాల్సిందిగా పనివాళ్లకు తెలిపాడు. దీంతో జెన్నిఫర్‌ను తనిఖీ చేయగా అసలు విషయం బయటపడింది. దీంతో జెన్నిఫర్ చేతులకు వేసుకున్న నగలను లాక్కొని పోలీసులకు సమాచారమందించాడు. పోలీసులు అక్కడికి చేరుకొని జెన్నిఫర్ వాకర్‌పై దొంగతనం చేయడమే గాక వాటిని అపరించేందుకు ప్రయత్నం చేసినందుకు కేసు నమోదు చేసి ఎల్ డొరాడో కౌంటీ జైలుకు తరలించారు. కాగా జెన్నిఫర్ బెయిల్‌కు అప్లై చేసుకోవాలంటే 10వేల డాలర్లు చెల్సించాల్సి ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. -
హరికేన్ బాధితులకు జెన్నీఫర్ సాయం
ఇర్మా, మారియా హరికేన్ లతో కుదేలైన అమెరికా వాసులను ఆదుకునేందుకు హాలీవుడ్ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. తాజాగా హాలీవుడ్ హీరోయిన్ జెన్నీఫర్ లోపెజ్, హరికేన్ బాధితులకు భారీ సాయాన్ని ప్రకటించారు. న్యూయార్క్ గవర్నర్ తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాధితులకు పది లక్షల అమెరికన్ డాలర్లు సాయంగా ప్రటించారు. ఈ హరికేన్ మూలంగా తను కూడా వ్యక్తిగతంగా చాలా నష్టపోయాన్న లోపెజ్, తన కుటుంబ సభ్యులను కూడా కలుసుకోలేకపోయానని ఆవేదన వ్యక్తి చేశారు. తాను సాయం అందించటంతో పాటు అభిమానులు కూడా సాయం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. త్వరలో నిర్వహించనున్న లాస్ వెగాస్ షో ద్వారా వచ్చే మొత్తాన్ని హరికేన్ బాధితులకు అందించనున్నట్టుగా ప్రకటించారు జెన్నీఫర్. -
హాలీవుడ్ సినిమాలో సీతగా..!
ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. కానీ, మంచు లక్ష్మీప్రసన్న ముందు రచ్చ గెలిచి, ఆ తర్వాత ఇంట గెలిచారు. తెలుగు తెరపై కనిపించకముందు ఆమె లాస్ వేగాస్, ఇఆర్, డెస్పరేట్ హౌస్‌వైవ్స్ లాంటి అమెరికన్ షోస్‌లో నటించారు. అలాగే, ది ఓడ్, డెడ్ ఎయిర్లాంటి చిత్రాల్లోనూ యాక్ట్ చేశారు. దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత ఆమె మళ్లీ హాలీవుడ్లో ఓ చిత్రంలో నటిస్తున్నారు. ‘బాస్మతి బ్లూస్’ పేరుతో రూపొందుతోన్న ఈ చిత్రంలో లక్ష్మీ పోషిస్తున్న పాత్ర పేరు సీత. ఓ శాస్త్రవేత్త బియ్యం తయారు చేస్తాడట. ఆ వ్యాపారం నిమిత్తం అతను ఇండియా రావడం, ఇక్కడి అమ్మాయితో ప్రేమలో పడటం తదితర అంశాలతో ఈ చిత్రం సాగుతుందని సమాచారం. ఇది రొమాంటిక్ మ్యూజికల్ కామెడీ మూవీ. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. -
క్యాసినో... ‘డామన్’!
గ్యాంబ్లింగ్‌కి, బెట్టింగ్‌కి పేరొందిన మకావూ, లాస్ వెగాస్ తరహాలో దేశీయంగా డామన్‌లోనూ అతి పెద్ద క్యాసినో సిద్ధమవుతోంది. ఏకంగా 10 ఎకరాల విస్తీర్ణంలో డెల్టా కార్ప్ దీన్ని సిద్ధం చేస్తోంది. భారత్‌లో గ్యాంబ్లింగ్ (రేసింగ్‌లు, బెట్టింగ్‌లు మొదలైనవి)మార్కెట్ విలువ ఏటా సుమారు 60 బిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. ఇందులో సగభాగం అక్రమంగానే జరుగుతోంది. ప్రస్తుతం దేశీయంగా కొన్ని రాష్ట్రాలు మాత్రమే క్యాసినోలను అనుమతిస్తున్నాయి. సిక్కిం, గోవాలో మాత్రమే క్యాసినోలు ఉండగా.. తాజాగా పంజాబ్ వీటిపై దృష్టి సారిస్తోంది. ఇక, ఇక్కడ కుదరని వారు మకావూ, సింగపూర్, లాస్ వెగాస్ వంటి చోట్లకు వెడుతున్నారు. మొత్తం గ్యాంబ్లింగ్ మార్కెట్ టర్నోవర్‌లో సుమారు నాలుగు శాతం వాటా భారతీయులదే ఉంటోందని అంచనా. దీంతో ఇందులో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు కంపెనీలు పోటీ పడుతున్నాయి. దీనిలో భాగంగానే డెల్టా కార్ప్ దేశంలోనే అతి పెద్ద క్యాసినో ‘ది డెల్టిన్’ని డామన్ భూభాగంపై ఏర్పాటు చేస్తోంది. (ప్రస్తుతం చాలా మటుకు క్యాసినోలు ఆఫ్‌షోర్ అంటే సముద్ర భాగంలో ఉంటున్నాయి). డెల్టా కార్ప్‌కి గోవాలో 3 ఆఫ్‌షోర్ క్యాసినోలు ఉన్నాయి. అనేక ప్రత్యేకతలు..: ది డెల్టిన్లో 10 ఎకరాల్లో 60,000 చదరపు అడుగుల గేమింగ్ స్పేస్ ఉంటుంది. ఇందులో 187 గదులు కూడా ఉంటాయి. అలాగే, మూడు బార్లు, వివిధ రకాల వంటకాలను వడ్డించే నాలుగు రెస్టారెంట్లు ఉంటాయి. కార్పొరేట్ క్లయింట్ల కోసం డెల్టా కార్ప్ ప్రత్యేకంగా 29,000 చ.అ. స్థలం కేటాయిస్తోంది. దీన్ని కాన్ఫరెన్సులు, ఇన్డోర్ మీటింగులు, ఎగ్జిబిషన్లు మొదలైన వాటికి ఉపయోగించుకోవచ్చు. అలాగే, అంతర్జాతీయ క్యాసినోల తరహాలో 8,000 చ.అ. స్థలంలో హై ఎండ్ రిటైల్ బ్రాండ్స్ కొలువుతీరనున్నాయి. క్యాసినో ఏర్పాటుకు డామన్‌ని ఎంచుకోవడానికి ప్రత్యేక కారణం ఉందని వివరించారు డెల్టా కార్ప్ చైర్మన్ జైదేవ్ మోడి. అటు ముంబైకి, ఇటు గుజరాత్‌కి దగ్గర్లో ఉండటం వల్లే దీన్ని ఎంచుకున్నట్లు తెలిపారు. ముంబై నుంచి 3 గంటల ప్రయాణ దూరంలోనూ, గుజరాత్‌లోని ప్రధాన నగరాలకు ఇది దగ్గర్లోనూ ఉంది. ఏటా 20 శాతం వృద్ధి.. గోవాలో డెల్టా కార్ప్‌కి చెందిన క్యాసినో వ్యాపారం గణనీయంగా వృద్ధి చెందుతోంది. కంపెనీ క్యాసినోలకి వచ్చే వారి సంఖ్య ఏటా 20% పెరుగుతోంది. డెల్టా కార్ప్‌కి చెందిన ఇతర క్యాసినోలకు వచ్చే వారు ప్రతిసారీ సగటున రూ.12,000-15,000 ఖర్చు చేస్తున్నారు. ఈ క్యాసినోలకు వచ్చే వారిలో భారతీయులే ఉంటున్నారు. 24-34 ఏళ్ల మధ్య వయస్సు గలవారు పోకర్ని ఆడేందుకు ఇష్టపడుతున్నారని మోడి వివరించారు.