హాలీవుడ్ సినిమాలో సీతగా..! | lakshmi manchi acting in hollywood movie | Sakshi
Sakshi News home page

హాలీవుడ్ సినిమాలో సీతగా..!

Published Fri, Feb 7 2014 11:38 PM | Last Updated on Sat, Sep 2 2017 3:27 AM

హాలీవుడ్ సినిమాలో సీతగా..!

హాలీవుడ్ సినిమాలో సీతగా..!

 ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. కానీ, మంచు లక్ష్మీప్రసన్న ముందు రచ్చ గెలిచి, ఆ తర్వాత ఇంట గెలిచారు. తెలుగు తెరపై కనిపించకముందు ఆమె లాస్ వేగాస్, ఇఆర్, డెస్పరేట్ హౌస్‌వైవ్స్ లాంటి అమెరికన్ షోస్‌లో నటించారు. అలాగే, ది ఓడ్, డెడ్ ఎయిర్‌లాంటి చిత్రాల్లోనూ యాక్ట్ చేశారు. దాదాపు ఐదేళ్ల గ్యాప్ తర్వాత ఆమె మళ్లీ హాలీవుడ్‌లో ఓ చిత్రంలో నటిస్తున్నారు. ‘బాస్మతి బ్లూస్’ పేరుతో రూపొందుతోన్న ఈ చిత్రంలో లక్ష్మీ పోషిస్తున్న పాత్ర పేరు సీత. ఓ శాస్త్రవేత్త బియ్యం తయారు చేస్తాడట. ఆ వ్యాపారం నిమిత్తం అతను ఇండియా రావడం, ఇక్కడి అమ్మాయితో ప్రేమలో పడటం తదితర అంశాలతో ఈ చిత్రం సాగుతుందని సమాచారం. ఇది రొమాంటిక్ మ్యూజికల్ కామెడీ మూవీ. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement