లాస్‌వెగాస్ : గ్రాసరీ షాపులో 1800 డాలర్ల విలువైన సరుకును దొంగలించేందుకు ప్రయత్నించిన ఒక మహిళ అడ్డంగా బుక్కైన ఘటన అమెరికాలోని నెవెడా ప్రాంతంలో చోటుచేసుకుంది. కాగా ఈ ఘటన ఏప్రిల్ 9న చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నెవెడాకు చెందిన జెన్నిఫర్ వాకర్ అనే 53 ఏళ్ల మహిళ సరుకులు కొనడానికి కాలిఫోర్నియా గ్రాసరీ షాపుకు వెళ్లింది. తనకు కావలిసిన సరుకులను కంటైనర్‌లో లోడ్ చేసిన జెన్నిఫర్ ఆ తర్వాత అక్కడే ఉన్న కొన్ని నగలను తన చేతులకు వేసుకొని ఎవరికి అనుమానం రాకుండా బిల్ కౌంటర్ వద్దకు వచ్చింది.
అయితే బిల్లింగ్ చేస్తున్న సమయంలో జెన్నిఫర్ ముఖంలో ఆందోళన కనిపించడంతో షాపు యజమానికి అనుమానమొచ్చి ఆరా తీశాడు. ఆమె సమాధానం చెప్పడానికి తటపటాయించడంతో క్రాస్‌చెక్ చేయాల్సిందిగా పనివాళ్లకు తెలిపాడు. దీంతో జెన్నిఫర్‌ను తనిఖీ చేయగా అసలు విషయం బయటపడింది. దీంతో జెన్నిఫర్ చేతులకు వేసుకున్న నగలను లాక్కొని పోలీసులకు సమాచారమందించాడు. పోలీసులు అక్కడికి చేరుకొని జెన్నిఫర్ వాకర్‌పై దొంగతనం చేయడమే గాక వాటిని అపరించేందుకు ప్రయత్నం చేసినందుకు కేసు నమోదు చేసి ఎల్ డొరాడో కౌంటీ జైలుకు తరలించారు. కాగా జెన్నిఫర్ బెయిల్‌కు అప్లై చేసుకోవాలంటే 10వేల డాలర్లు చెల్సించాల్సి ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment