Grocery Store
-
కిరాణా కొట్టులో గంజాయి చాక్లెట్లు
సాక్షి, హైదరాబాద్: కిరాణాకొట్టులో గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్న వ్యక్తిని సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వివరాలిలా ఉన్నాయి.. ఉత్తరప్రదేశ్‌లోని గోహ్నియా గ్రామానికి చెందిన పివేస్ అలియాస్ ప్రైవేష్ బతుకుతెరువు కోసం కొన్నేళ్ల క్రితం ఐడీపీఎల్ బాలానగర్‌కు వలస వచ్చాడు. పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలోని సుభా నగర్లో కిరాణాష్ కొట్టు పెట్టాడు. ఆశించిన మేర ఆదాయం లేకపోవడంతో గంజాయి విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. ఈక్రమంలో తన స్వస్థలమైన యూపీ నుంచి అక్రమంగా గంజాయి చాక్లెట్లను నగరానికి తీసుకొస్తున్నాడు. వీటిని స్కూల్, కాలేజీ విద్యార్థులు, యువత, దినసరి కూలీలకు విక్రయిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం అందుకున్న మేడ్చల్ ఎస్ఓటీ, పేట్ బషీరాబాద్ పోలీసులు కిరాణా కొట్టులో ఆకస్మిక తనిఖీలు చేయగా.. 5 ప్యాకెట్లలో 200 గంజాయి చాక్లెట్లు లభించాయి. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
అమెరికా : ఆ ఇద్దరు తప్పు చేశారా? చేతివాటమా?
ఎరక్కపోయి అమెరికాలో ఇరుక్కుపోయారు ఇద్దరు అమ్మాయిలు. తెలిసో తెలియకో ఓ షాపింగ్ మాల్‌కు వెళ్లిన ఇద్దరు తెలుగు అమ్మాయిలు ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. అమెరికాలో చదువుకునేందుకు వెళ్లిన ఇద్దరు తెలుగు అమ్మాయిలు ఇబ్బందుల్లో పడ్డారు. న్యూజెర్సీలో చదువుకుంటున్న వీరిద్దరు హోబెకన్ ఏరియాలోని షాప్‌రైట్ అనే సూపర్ మార్కెట్‌కు వెళ్లారు. ఈ మాల్లో కొంతసేపు షాపింగ్ చేసిన వీరిద్దరు బిల్లింగ్ చేసి బయటికొచ్చారు. అయితే వీరు అన్ని వస్తువులకు కాకుండా.. ఉద్దేశపూర్వకంగా కొన్ని వస్తువులకు మాత్రమే బిల్లు చెల్లించినట్టు పోలీసులు అభియోగం మోపి కేసు పెట్టి అరెస్ట్ చేశారు. -
‘క్విక్’ డెలివరీతో పోటీ కిరాణా హైరానా
సాక్షి, హైదరాబాద్: బస్తీలు, కాలనీలు, సందుల్లో ఉండే కిరాణా దుకాణాలు తెరుచుకోకముందే పొద్దుపొద్దునే అవసరమయ్యే టూత్పేస్ట్లు, సబ్బులు, ఇతర చిన్నాచితకా సరుకు లు మొదలు నిత్యావసరాలు సైతం నిమిషాల్లోనే ఇళ్లకు చేరిపోతున్నాయి. టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ఈ– కామర్స్, క్విక్ (క్యూ)–కామర్స్ ద్వారా ’ఆన్–డిమాండ్ డెలివరీ’’ఇ–కిరాణా’తో వంటి వాటితో నిమిషాల వ్యవధిలోనే వేగంగా సరుకులు వచ్చిపడుతున్నాయి. చిల్లర సామాన్లు మొదలు అన్నీ ఈ–కామర్స్ వ్యాప్తితో జెప్టో, బీబీ(బిగ్ బా స్కెట్), జొమాటో(బ్లింకిట్), ఇన్‌స్టా మార్ట్ (స్విగ్గీ) తదితరాలతో కిరాణా దుకాణాలకు పోటీ తప్పడం లేదు. నిమిషాల్లోనే డెలివరీ చేసే ఈ–కామర్స్ బిజినెస్ క్ర మంగా దేశంలో పుంజుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా వేగంగా చోటుచేసుకుంటున్న మార్పుచేర్పుల్లో భాగంగా ఫాస్ట్ ఫుడ్ నుంచి ఫాస్ట్ ఇంటర్నెట్ వరకు.. ఇన్స్టంట్ మెసేజింగ్ నుంచి ఆన్–డిమాండ్ స్ట్రీమింగ్ వరకు వివిధరకాల వినియోగదారులు వేగవంతమైన సేవలు కోరుకుంటున్నారు. ఈ–కామర్స్, క్యూ–కామర్స్ ద్వారా కిరాణా వస్తువులు మొదలు ఎల్రక్టానిక్ పరికరాలు, వస్తువులు, రెడిమేడ్ దుస్తులు, అత్యవసరమైన మందుల దాకా కొద్దినిమిషాల వ్యవధిలోనే డోర్ డెలివరీ కావాలని కస్టమర్లు ఆశిస్తున్నారు. దీంతో ఈ తరహా వేగవంతమైన డెలివరీ సిస్టమ్ అందిస్తున్న ఈ–కామర్స్ సంస్థల నుంచి ప్రధానంగా సంప్రదాయ కుటుంబపరమైన వ్యాపారంలో భాగంగా ఉన్న కిరాణా మర్చంట్స్, వ్యాపారులు తీవ్రమైన పోటీని ఎదుర్కోక తప్పడం లేదు. సాంకేతికత సాయంతో సత్వరమే... క్యూ–కామర్స్ ఆన్–డిమాండ్ విధాన వినియోగంతోపాటు కృత్రిమమేధ ఆధారంగా అల్గారిథమ్‌లు, ఇతర అత్యాధునిక సాంకేతికతలను ఉపయోగించడం ద్వారా అత్యంత వేగంగా వినియోగదారులకు ఆర్డర్లు చేరవేస్తున్నారు. స్థానిక మైక్రో– వేర్‌హౌస్‌లను ఉపయోగించడం ద్వారా రిటైలర్లు వేగంగా డె లివరీ చేయడంతోపాటు రవాణా ఖర్చులను తగ్గించేందుకు దోహదపడుతున్నారు. కస్టమర్ల నుంచి వచ్చే ఆర్డర్ల ప్రాసెసింగ్ వేగవంతం చేసి, లోటుపాట్లు, లోపాల తగ్గింపునకు ఈ విధానం రో»ొటిక్లను కూడా ఉపయోగిస్తున్నాయి, కచ్చితమైన డిమాండ్ అంచనా క్యూ–కామర్స్ ప్లాట్‌ఫామ్‌లు వినియోగదారు ప్రవర్తనను అంచనా వేయడానికి మెషీన్ లెరి్నంగ్ అల్గారిథమ్‌లను ఉపయోగిస్తాయి. క్యూ–కామర్స్ డిమాండ్ రాబోయే రోజుల్లో మరింత వేగంగా పుంజుకుంటుందని మెకన్సీ 2020 నివేదిక వెల్లడించింది. దీని ప్రకారం మొత్తం వినియోగదారుల రిటైల్ వ్యయంలో 10 శాతం వాటాను ఇది సాధించే అవకాశాలున్నాయని, ఈ మార్కెట్ 2025 నాటికి 5 బిలియన్ల విలువకు చేరుకుంటుందని అంచనా. ఆన్–డిమాండ్ ఎకానమీ పెరుగుదలతో సంప్రదాయ సరఫరా గొలుసు విధానాన్ని అనుసరించే బదులు, క్విక్ కామర్స్ కంపెనీలు అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించుకుంటున్నాయి. క్విక్ కామర్స్ ఇప్పటికే ఉన్న పరిశ్రమలను విజయవంతంగా ఏకీకృతం చేశాయి. జనసాంద్రత అధికంగా ఉన్న నగరాల్లో వ్యూహాత్మక హైపర్–లోకల్ మైక్రో–ఫుల్ఫిల్మెంట్ సెంటర్ల నెట్‌వర్క్‌ను పెంచడం ద్వారా క్విక్ కామర్స్ సంప్రదాయ కిరాణా వ్యాపారాన్ని అధిగమిస్తోంది.క్యూ–కామర్స్ వారానికి ఏడురోజులు, 24 గంటలు పనిచేస్తుండడంతో ఆధునిక జీవనశైలి డిమాండ్లకు అనుగుణంగా వినియోగదారులు ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా కొనుగోళ్లు చేసే సౌలభ్యం ఉంది. పోటీని తట్టుకునేలా ‘కిరాణా’ కొత్త ఆలోచనలు దేశవ్యాప్తంగా ఉన్న 1.20 కోట్ల సంప్రదాయ కిరాణాస్టోర్లలో సగం దాకా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా క్యూ–కామర్స్ చురుగ్గా సాగుతున్న పది నగరాల్లో దాదాపు మూడోవంతు రిటైలర్ల వ్యాపారాలు 35 శాతం దాకా వీటి ద్వారా ప్రభావితమైనట్టు ఆన్లైన్ కమ్యూనిటీ నైబర్హుడ్షాప్స్ కిరణ్క్లబ్ నివేదిక తేల్చింది. ప్రస్తుతానికి కిరాణా వ్యాపారాలపై క్యూ–కామర్స్ ప్రభావం పరిమితంగా ఉన్న రానున్న రోజుల్లో ఇది పెరిగితే తట్టుకునేందుకు వీలుగా కిరాణా దుకాణదారులు కొత్త ఆలోచనలు చేస్తున్నారు. క్యూ–కామర్స్, ఇతర డెలివరీ యాప్‌లను నియంత్రించేలా సిద్ధమయ్యారు. ► కస్టమర్లకు ఉచిత హోండెలివరీ సౌకర్యం పెంచడం, ఎక్కువ మంది పనివారిని నియమించుకొని వేగంగా వినియోగదారుల ఇళ్లకు (గంటలోపే) వస్తువుల చేరవేత వంటివాటిపై దృష్టిపెడుతున్నాయి. ► మరికొందరు తమ పాత కస్టమర్లతో వాట్సాప్ గ్రూప్‌లు ఏర్పాటు చేసుకొని కొత్త వస్తువులు, ఉత్పత్తులకు సంబంధించిన అప్డేట్స్ పంపిస్తూ ఆఫర్లు, డిసౌంట్లు వంటివి అందుబాటులోకి తెస్తున్నారు. ► వాట్సాప్‌పైనే కస్టమర్లకు కావాల్సిన వస్తువుల ఆర్డర్లు స్వీకరించి వ్యాపారం కాపాడుకునే ప్రయత్నాల్లో కిరాణా షాప్ యాజమానులు నిమగ్నమయ్యారు. ► క్యూ–కామర్స్ ద్వారా అందించలేని కొత్త కొత్త ఉత్పత్తులు, విభిన్నరకాల వస్తువులు, ఫ్లేవర్లు అందించేందుకు, వీటికి సంబంధించిన సమాచారం కస్టమర్లకు చేరవేసి వారిని ఆకర్షించే ప్రయత్నాల్లో నిమగ్నమవుతున్నారు. -
విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో దంపతుల మృతి
హైదరాబాద్: కిరాణా దుకాణం ద్వారా వచ్చే ఆదాయంతో ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా గడిచిపోతున్న ఆ కుటుంబంలో అగ్ని ప్రమాదం తీరని విషాదాన్ని నింపింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో దుకాణంలో మంటలు చెలరేగడంతో దంపతులిద్దరూ అసువులు బాసిన ఘటన మూసాపేట గూడ్స్‌షెడ్ రోడ్డులో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. గూడ్స్ షెడ్ రోడ్డులో నివాసముంటున్న దివ్యాంగుడు శ్రీ రాములు యాదవ్ (48)కు భార్య స్వప్న (39), ఇద్దరు కూతుళ్లు, తల్లి ఆండాళ్ ఉన్నారు. శ్రీరాములు కిరాణా దుకాణం నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆదివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో కిరాణా దుకాణాంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. చిప్స్ ప్యాకెట్, పూజా ఆయిల్ అదే ప్రాంతంలో ఉండటంతో మంటలు ఒక్కసారిగా భారీగా వ్యాపించాయి. శ్రీరాములు దివ్యాంగుడు కావటం, ఆయన తల్లి వృద్ధురాలు కావటంతో వీరిద్దరు సురక్షితంగా బయటికి రాలేకపోయారు. వీరిని బయటకు తీసుకువచ్చే ప్రయత్నంలో శ్రీరాములు భార్య స్వప్న మంటల్లో చిక్కుకుంది. స్థానికులు గమనించి ఫైర్ స్టేషన్‌కు, పోలీసులకు సమాచారం అందించి వారిని బయటకు తీసుకువచ్చారు. అప్పటికే భార్యాభర్తల శరీరాలు ఎక్కువ శాతం కాలిపోయి గాయాలపాలయ్యారు. గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శ్రీరాములు, స్వప్న మృతి చెందారు. -
ధోనిని ముప్పుతిప్పలు పెట్టిన కివీస్ టాప్-3 బౌలర్, ఇప్పుడు సూపర్ మార్కెట్లో
క్రికెట్లో ఒక వెలుగు వెలిగిన క్రికెటర్లు ఏదో ఒకరోజు ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాల్సిందే. అయితే రిటైర్మెంట్కు ముందే భవిష్యత్తులో ఏం చేయాలనేది ముందే నిర్ణయించుకోవడం చూస్తుంటాం. కొంతమంది క్రికెటర్లు ఆటకు గుడ్‌బై చెప్పిన తర్వాత బిజినెస్ ప్లాన్ చేయడం.. కామెంటేటర్లుగా మారడం చూస్తుంటాం. క్రికెట్ బాగా పాపులర్ ఉన్న మన దేశంలో ఎక్కువమంది క్రికెటర్లు రిటైర్మెంట్ తర్వాత కామెంటేటరీ ఫీల్డ్‌లోకి వస్తున్నారు. అయితే మరికొంత మంది క్రికెటర్లు వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. ఉదాహరణకు దిగ్గజం కపిల్ దేవ్ వ్యాపారంలో రాణిస్తుండడంతో పాటు అప్పుడప్పుడు కామెంటేటరీ బాక్స్‌లో కనిపిస్తుంటాడు. ఇంకొంతమంది క్రికెటర్లు మాత్రం సోషల్ మీడియాలో ఫేమస్ అయిపోతుంటారు. షోయబ్ అక్తర్ లాంటి పాక్ క్రికెటర్లు ఎక్కువగా యూట్యూబ్ చానెళ్లు నడుపుతూ మరింత ఫేమస్ అయిపోతున్నారు. కొందరు మాత్రం ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత లగ్జరీ జీవితానికి దూరంగా బతకాలని ఆశపడతారు. ఆ కోవకు చెందిన వాడే న్యూజిలాండ్ మాజీ బౌలర్ క్రిస్ మార్టిన్. క్రిస్ మార్టిన్ న్యూజిలాండ్ తరపున 2000వ సంవత్సరం నుంచి 2013 వరకు 71 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. 71 టెస్టుల్లో 233 వికెట్లు తీశాడు. ఒక దశలో న్యూజిలాండ్ తరపున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో మూడో స్థానంలో నిలిచాడు. క్రిస్ మార్టిన్ కంటే ముందు టెస్టుల్లో రిచర్డ్ హడ్లీ, డానియెల్ వెటోరిలు మాత్రమే ఉన్నారు. మరో విషయమేంటంటే.. టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని తన బౌలింగ్‌తో ముప్పుతిప్పలు పెట్టిన బౌలర్‌గా క్రిస్ మార్టిన్ నిలిచాడు. చాలా సందర్భాల్లో ధోనిని ఔట్ చేసిన ఘనత క్రిస్ మార్టిన్ సొంతం. ఇక 40 ఏళ్ల వయసు దాకా క్రిస్ మార్టిన్ క్రికెట్లో కొనసాగాడు. అయితే 35 ఏళ్ల వయసుకు చేరుకోగానే క్రిస్ మార్టిన్ తన పోస్ట్ రిటైర్మెంట్పై ఆలోచనలో పడ్డాడు. అప్పటినుంచే తన వ్యాపార రంగాన్ని విస్తృతం చేయాలని భావించాడు. ఆటకు రిటైర్మెంట్ ఇచ్చేలోపే న్యూజిలాండ్‌లోని ఈస్ట్‌బోర్న్‌లో ''Four Square'' పేరుతో సూపర్‌మార్కెట్‌ను నెలకొల్పాడు. మొదట చిన్న స్టోర్‌గా ప్రారంభించినప్పటికి 2019లో దానిని బిగ్స్టోర్గా మార్చాడు. ఫుడ్‌స్టఫ్ సహా మార్కెట్లో అవసరమైన అన్ని రకాల రిటైల్ వస్తువులను అందుబాటులో ఉంచాడు. అనతికాలంలోనే కస్టమర్స్ దగ్గర మంచి పేరు సంపాదించాడు. He took 233 Test wickets for New Zealand - the third highest of all-time for the Blackcaps, but only scored 123 runs in 71 matches! Happy Birthday to Chris Martin! pic.twitter.com/WAzVuktrNO — ICC (@ICC) December 10, 2017 చదవండి: రాత్రి 7:45కు ముహూర్తం.. దాయాదుల మ్యాచ్ సెప్టెంబర్ 2న! SL Vs PAK 1st Test: లంక కీపర్‌ను ముప్పతిప్పలు పెట్టిన పాక్ బౌలర్ -
Banjara Hills: బియ్యం కావాలని దుకాణానికి వచ్చి..
సాక్షి, బంజారాహిల్స్: బియ్యం కావాలని దుకాణానికి వచ్చిన ఓ అగంతకుడు షాపు యజమాని దృష్టి మరల్చి సెల్‌ఫోన్‌తో పాటు ద్విచక్రవాహనం అపహరించుకుపోయాడు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. యూసుఫ్‌గూడ సమీపంలోని ఎల్‌ఎన్‌నగర్‌లో అబ్దుల్ రహీం బియ్యం దుకాణం నిర్వహిస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం ఓ వ్యక్తి షాపునకు వచ్చి తనకు రెండు బ్యాగుల బియ్యం కావాలని శాంపిల్ చూపించాలని అడిగాడు. బియ్యం నమూనాలు తీసేందుకు రహీం బ్యాగుల వద్దకు వెళ్లగా.. అదే సమయంలో టేబుల్‌పై ఉన్న సెల్‌ఫోన్‌తో పాటు బయట ఉన్న స్కూటీని అపహరించుకొని క్షణాల్లో అగంతకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వెధవ రూల్.. మాస్క్ కోసం మాల్లో వైద్యుడి లొల్లి
-
ఇదొక చెత్త రూల్: మాస్క్ కోసం మాల్లో వైద్యుడి లొల్లి
బెంగళూరు: కరోనా సోకకుండా ప్రాథమికంగా ధరించాల్సింది మాస్క్. కానీ ఇది ధరించడంలో కొందరు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో మాస్క్ ధరించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వాలు హెచ్చరిస్తూనే ఉన్నాయి. అయితే మాస్క్ కొన్ని చోట్ల వివాదానికి దారి తీస్తోంది. తాజాగా ఒక మాల్లో మాస్క్ కోసం పెద్ద గొడవే జరిగింది. ఈ ఘటనలో వైద్యుడిపై కేసు నమోదైంది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కర్ణాటకలోని మంగళూరులో ఓ మాల్‌కు వైద్యుడు వెళ్లాడు. అయితే మాస్క్ పెట్టుకోకుండా బిల్ చేయించేందుకు వస్తువులు తీసుకొచ్చారు. ఆయన మాస్క్ ధరించకపోవడాన్ని గమనించిన మాల్ సిబ్బంది అతడిని ప్రశ్నించారు. మాస్క్ ధరించాలని సూచించారు. దీంతో ఆ వైద్యుడు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ గొడవ చూసి మేనేజర్ రాగా అతడితో కూడా వైద్యుడు గొడవ పడ్డాడు. తీవ్ర వాగ్వాదం జరిగింది. చివరకు ఆయన మాస్క్ ధరించకుండానే షాపింగ్ పూర్తి చేసుకుని బయటపడ్డాడు. మాస్క్ తప్పనిసరి అనే నిబంధనను ఆ వైద్యుడు ‘వెధవ రూల్ (ఫూలిష్ రూల్)’ అని మండిపడ్డాడు. ఈ ఘటనపై మాల్ మేనేజర్ ఫిర్యాదు మేరకు ఆ వైద్యుడిపై కేసు నమోదు చేసినట్లు మంగళూరు పోలీస్ కమిషనర్ ఎన్.శశికుమార్ తెలిపారు. అయితే ఈ ఘటన మే 18వ తేదీన జరగ్గా తాజాగా బహిర్గతమైంది. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజీ వీడియో వైరల్‌గా మారింది. వాగ్వాదం చేసిన వైద్యుడు ఇప్పటికే కరోనా బారిన పడి కోలుకున్నాడని ఆ గొడవలో చెప్పాడు. కరోనా బారినపడిన మీరే మాస్క్ ధరించకుంటే ఎలా అని మాల్ సిబ్బందితో పాటు సోషల్ మీడియాలో నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. చదవండి: ఫ్రంట్‌లైన్ వారియర్స్‌పై ‘ఫంగస్’ దాడి చదవండి: లాక్డౌన్ నిబంధనలు గాలికి -
ఒక్క స్క్రాచ్ కార్డు జీవితాన్ని మార్చేసింది
వర్జీనియా : తల్లితో కలిసి ఒక కొడుకు సరదాగా సరుకుల షాప్‌కు వెళ్లాడు. తల్లి సరుకులు కొనే పనిలో బిజీగా ఉండడంతో ఆ కొడుక్కి ఏం చేయాలో తోచలేదు. దీంతో అదే షాపులో ఒక స్క్రాచ్ కార్డును కొన్నాడు. ఈలోపు తల్లి షాపింగ్ ముగించుకొని వచ్చింది. ఇద్దరు కలిసి ఇంటికి వెళ్లారు. తర్వాత తన వెంట తెచ్చకున్న స్క్రాచ్ కార్డును గీకి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నాడు. స్క్రాచ్కార్డును గీకగానే అందులో ఉన్నది చూసి ఎగిరి గెంతేశాడు. దీంతో వెంటనే తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైందంటూ కొడుకును అడిగింది.(పావురానికో గూడు.. భళా ప్రిన్స్!) మనకు లాటరీలో 1.4కోట్ల రూపాయలు వచ్చాయని కొడుకు చెప్పాడు. అయితే కొడుకు చెప్పింది ఆ తల్లి నమ్మలేదు.. స్క్రాచ్ కార్డును ఆమె చేతిలోకి తీసుకొని పరీక్షించింది. దాని మీద అక్షరాల 2,00,000 డాలర్లు గెలుచుకున్నట్లు ఉంది. అంతే ఆ తల్లి కొడుకుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ ఘటన వర్జీనియాలో చోటుచేసుకుంది. లాటరీ గెలుచుకున్న వ్యక్తి పేరు హెబర్ట్ స్క్రగ్స్. షాపింగ్ చేసినంత టైంలోనే కోట్లు సంపాదించిన కొడుకును చూసి తల్లి మురిసిపోతుంటే... మిగతావారు మాత్రం వారికొచ్చిన బంపర్ లాటరీని చూసి ఈర్ష్య పడుతున్నారు. -
చేతులకు నగలు వేసుకుని అడ్డంగా బుక్కైంది
లాస్‌వెగాస్ : గ్రాసరీ షాపులో 1800 డాలర్ల విలువైన సరుకును దొంగలించేందుకు ప్రయత్నించిన ఒక మహిళ అడ్డంగా బుక్కైన ఘటన అమెరికాలోని నెవెడా ప్రాంతంలో చోటుచేసుకుంది. కాగా ఈ ఘటన ఏప్రిల్ 9న చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నెవెడాకు చెందిన జెన్నిఫర్ వాకర్ అనే 53 ఏళ్ల మహిళ సరుకులు కొనడానికి కాలిఫోర్నియా గ్రాసరీ షాపుకు వెళ్లింది. తనకు కావలిసిన సరుకులను కంటైనర్‌లో లోడ్ చేసిన జెన్నిఫర్ ఆ తర్వాత అక్కడే ఉన్న కొన్ని నగలను తన చేతులకు వేసుకొని ఎవరికి అనుమానం రాకుండా బిల్ కౌంటర్ వద్దకు వచ్చింది. అయితే బిల్లింగ్ చేస్తున్న సమయంలో జెన్నిఫర్ ముఖంలో ఆందోళన కనిపించడంతో షాపు యజమానికి అనుమానమొచ్చి ఆరా తీశాడు. ఆమె సమాధానం చెప్పడానికి తటపటాయించడంతో క్రాస్‌చెక్ చేయాల్సిందిగా పనివాళ్లకు తెలిపాడు. దీంతో జెన్నిఫర్‌ను తనిఖీ చేయగా అసలు విషయం బయటపడింది. దీంతో జెన్నిఫర్ చేతులకు వేసుకున్న నగలను లాక్కొని పోలీసులకు సమాచారమందించాడు. పోలీసులు అక్కడికి చేరుకొని జెన్నిఫర్ వాకర్‌పై దొంగతనం చేయడమే గాక వాటిని అపరించేందుకు ప్రయత్నం చేసినందుకు కేసు నమోదు చేసి ఎల్ డొరాడో కౌంటీ జైలుకు తరలించారు. కాగా జెన్నిఫర్ బెయిల్‌కు అప్లై చేసుకోవాలంటే 10వేల డాలర్లు చెల్సించాల్సి ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. -
అమృత్‌సర్‌లో దారుణం.. గన్‌గురిపెట్టి దొంగతనం
-
బేరాల్లేవ్!
గణనీయంగా పడిపోయిన మార్కెట్ దుకాణాలు తెరిచినా ఉపయోగం లేదంటున్న బంగారం వ్యాపారులు పాడైపోతున్న పండ్లు, కూరగాయలు కిరాణ, వస్త్ర దుకాణాల్లోనూ ఇదే పరిస్థితి హన్మకొండ : పెద్ద నోట్ల రద్దుతో ఢిల్లీ నుంచి గల్లీస్థారుు వరకు వ్యాపారాలపై తీవ్ర ప్రభావం పడి లావాదేవీలు గణనీయంగా పడిపోయారుు. వరంగల్ రూరల్ జిల్లాలోని నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట డివిజన్లతో పాటు పాటు మండలాల్లో వ్యాపార లావాదేవీలు 20నుంచి 30శాతానికి పడిపోగా వ్యాపారులు దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ప్రజలు, రైతులు మరిన్ని ఇబ్బందులు పడుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో పాటు, రబీకి రైతులు సన్నధ్ధమవుతున్న నేపథ్యంలో గగ్గోలు పెడుతున్నారు. పండించిన పంటను అమ్ముకునేందుకు మార్కెట్‌కు రాగా అడ్తిదారులు చెక్కులు ఇస్తుండడంతో తీసుకునేందుకు రైతులు నిరాకరిస్తున్నారు. సినిమా థియేటర్లలో టికెట్ల అమ్మకం ఐదోవంతుకు పడిపోరుుంది. పరకాల మార్కెట్లో వ్యాపారం సున్నా స్థారుుకి చేరుకుంది. చిరువ్యాపారులు, తోపుడుబండ్ల వారు వ్యాపారం లేక దిగాలుగా ఉన్నారు. పాత నోట్లు తీసుకోలేక బంగారం వ్యాపారులు దుకాణాలు పూర్తిస్థారుులో తెరవడంలేదు. కిరాణ దుకాణాల్లో వ్యాపారం 20శాతానికి పడిపోగా, వస్త్ర దుకాణాల్లో రోజుకు రూ.15వేలు నడిచే పరకాల, నర్సంపేటల్లో రూ.1500కు మించి నడవడం లేదని వ్యాపారులు వాపోతున్నారు. మరోవైపు చోరీలు చోటుచేసుకుంటున్నారుు. వర్ధన్నపేట మండలం ఇల్లందలో కిరాణా దుకాణంలో సుమారు రూ.50వేల విలువైన రీచార్జి కూపన్లు, సిగరెట్లు చోరీకి గురయ్యారుు. ఐరన్ దుకాణంలో రూ.60వేల నగదు చోరీకి గురైంది. -
కిరాణా దుకాణాలపై ఎస్వోటీ దాడులు
ఉప్పల్ (హైదరాబాద్) : నగరంలోని ఉప్పల్ ప్రాంతంలో ఉన్న కిరాణా దుకాణాలపై ఎస్వోటీ పోలీసులు సోమవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో శ్రీ సుమధుర అనే కిరాణ దుకాణం లో అక్రమంగా నిల్వ ఉంచిన 10 క్వింటాళ్ల రేషన్ బియ్యం, 240 లీటర్ల కిరోసిన్, 50 కిలోల కందిపప్పు, 110 కిలోల గోదుమలను గుర్తించారు. దీంతో ఆ దుకాణదారుడిపై కేసు నమోదు చేశారు. -
కిరాణాషాపు దగ్ధం: రూ.3 లక్షలు నష్టం
మెదక్ రూరల్ : విద్యుత్ షార్ట్‌సర్క్యూట్‌తో ఓ కిరాణా షాపు దగ్ధమై రూ.3 లక్షల నష్టం సంభవించిన ఘటన మండల పరిధిలోని పాతూరు గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల ప్రకారం... పాతూరు గ్రామానికి చెందిన పొగాకు అశోక్ గత కొంతకాలంగా గ్రామంలో కిరాణా షాపును నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. కాగా సోమవారం వేకువజామున ఒక్కసారిగా షాపులో మంటలు చెలరేగాయి. దీంతో ఫైర్ సిబంది వచ్చి మంటలను ఆర్పినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఈ ప్రమాదంలో ఫ్రిడ్జ్, కూలర్‌తోపాటు నగదు, రూ. 5వేలు సైతం కాలి బూడిదైనట్లు బాధితుడు అశోక్ పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో రూ. 3 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని వాపోయాడు. తనను ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకోవాలని కోరారు. -
కిరాణా షాపులో రేషన్ బియ్యం పట్టివేత
ఆత్మకూర్ : నల్లగొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో ఓ కిరాణా షాపుపై విజిలెన్స్ అధికారులు మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. చౌక ధరల దుకాణం ద్వారా పేదలకు పంపిణీ చేయాల్సిన 50 కిలోల చక్కెర, క్వింటాన్నర బియ్యం షాపులో విక్రయానికి ఉండగా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. యజమాని చందా రాంబాబుపై కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు. -
నీతి తప్పిన మనిషి రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాడు
నీతి తప్పిన మనిషి రెండు నిండు ప్రాణాలను బలిగొన్నాడు. పొట్ట కూటి కోసం కిరాణా కొట్టును నడుపుకొనే అభాగ్యుల పాలిట మృత్యువుగా మారాడు. ద్విచక్ర వాహనంలో పెట్రోల్ పోసుకుని తీరా డబ్బులు ఇవ్వకుండా పరారయ్యాడు. పైసలు ఇవ్వకుండా పారిపోవడంతో ఆ దుండగుడిని వెంటాడిన తండ్రీ కొడుకులను విధి బలి తీసుకుంది. ఎదురుగా వచ్చిన టిప్పర్ వీరి బైకును ఢీకొనడంతో అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఇద్దరి ఉసురుపోసుకున్న ఆ ఆగంతకుడి చర్యపై స్థానికంగా ఆగ్రహం వ్యక్తమైంది. అన్నెంపున్నెం ఎరుగని ఆ తండ్రీకొడుకులు విగతజీవులైన దృశ్యాన్ని చూసి ప్రతి ఒక్కరూ అయ్యో పాపం అనకుండా ఉండలేకపోయారు. ఈ హృదయ విదారక ఉదంతం బుధవారం మంచాల మండలంలోని ఆగాపల్లి సమీపంలో చోటుచేసుకుంది. కిరాణ దుకాణంలో పెట్రోల్ పోయించుకున్న ఓ వ్యక్తి డబ్బులివ్వకుండా పరారయ్యాడు. అతడిని బైక్‌పై వెంబడించిన తండ్రీకొడుకులను టిప్పర్ ఢీకొట్టడంతో మృత్యువాత పడ్డారు. ఈ విషాదకర ఘటన మండలంలోని ఆగాపల్లి సమీపంలో బుధవారం సాయత్రం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆగాపల్లికి చెందిన కంభాలపల్లి దశరథ(55) గ్రామంలో హైదరాబాద్- నాగార్జునసాగర్ రహదారిపై చిన్న కిరాణా కొట్టు నిర్వహిస్తున్నాడు. ఈయనకు భార్యాపిల్లలు ఉన్నారు. పెద్ద కుమారుడు కృష్ణ(27) నగరంలోని ముషీరాబాద్-1 డిపోలో డ్రైవర్. బుధవారం కృష్ణ ఇంటివద్ద ఉన్నాడు. సాయంత్రం 4:10 గంటల సమయంలో ఓ గుర్తుతెలియని వ్యక్తి బైక్‌పై వచ్చి దశరథ కిరాణ కొట్టులో పెట్రోల్ పోయించుకొని డబ్బులు ఇవ్వకుండా చిన్నతుండ్ల గ్రామం వైపు పరారయ్యాడు. దీంతో దశరథ తన కొడుకు కృష్ణకు ఫోన్‌చేసి విషయం చెప్పాడు. కృష్ణ ఇంటినుంచి బైక్‌తో వచ్చి తండ్రిని ఎక్కించుకొని దుండగుడు పరారైన చిన్నతుండ్ల గ్రామం వైపు బయలుదేరాడు. ఈ క్రమంలో ఆగాపల్లి శివారులోని జాద్మియా బావి సమీపంలోని మలుపులో ఎదురుగా వస్తున్న టిప్పర్ (ఏపీ21టీయూ2243) వీరి బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దశరథ, కృష్ణ తలలకు తీవ్ర గాయాలవడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఇబ్రహీంపట్నం ఆస్పత్రికి తరలించారు. దశరథకు భార్య రాములమ్మ, కుమారుడు కృష్ణతోపాటు నాగభూషణ్, రమేష్, రాజేష్ ఉన్నారు. కృష్ణకు భార్య స్వప్న ఉంది. ఇద్దరూ సచ్చిపోతిరి.. దశరథ, కృష్ణల మృతితో మంచాల మండలంలోని ఆగాపల్లిలో విషాదం అలుముకుంది. ఘటనా స్థలం మృతుల కుటుంబీకులు, బంధువుల రోదనలతో మిన్నంటింది. భర్త, కుమారుడి మృతితో రాములమ్మ కన్నీటిపర్యంతమయ్యారు. ‘కొడుకా..కృష్ణ.. ఆర్నెళ్ల కింద నీ కొలువు పర్మినెంట్ అయింది బిడ్యా.. మంచిగ బతుకుతవ్ అనుకున్న.. అంతలోనే మీ నాయినను.. నిన్ను.. ఆ దేవుడు తీసుకపోయ్యిండు బిడ్యా.. ఇద్దరూ సచ్చిపోతిరి.. మేమెవరి కోసం బతకాలి.. ఎట్ల బతకాలి.. అయ్యా.. ’ అని రాములమ్మ రోదించిన తీరు హృదయ విదారకం. తండ్రి ఫోన్ చేయడంతో ‘ఇప్పుడే.. వస్తాను’ అని కృష్ణ భార్య స్వప్నకు చెప్పి బైక్‌పై వెళ్లాడు. భర్త కోసం ఎదురుచూస్తున్న ఆమెకు 20 నిమిషాల వ్యవధిలోనే ఆయన మృతిచెందాడనే సమాచారం తెలియడంతో కుప్పకూలిపోయింది. ‘నేనెట్ల బతకాలయ్యా.. నీ డ్యూటి పర్మినెంట్ అయింది.. మంచిగా బతుకుదమనుకున్నం.. అంతలోనే ఆ దేవుడు నిన్ను నాకు కాకుండా తీసుకపోయిండు కదయ్యా..’ అని స్వప్న గుండెలుబాదుకుంటూ రోదించింది. -
మందు నోట్లు!
రూ. 5 చిల్లర కొరత పేరుతో రాజధానిలో మద్యం వ్యాపారుల సరికొత్త దందా ప్లాస్టిక్ కార్డుపై ‘* 5’ అని ముద్రించి ఇస్తున్న నిర్వాహకులు అన్ని మద్యం షాపుల్లో చెల్లుబాటయ్యేలా ఒప్పందాలు హైదరాబాద్: చిల్లర మోత ఎందుకనో..! మరేమోగానీ..!? కిరాణా దుకాణం నుంచి బేకరీల దాకా ఎక్కడ చూసినా ‘చిల్లర’కు కొరతే. రూపాయో రెండు రూపాయలో ఇవ్వాలంటే ఏ చాక్లెట్లో చేతిలో పెడుతున్నారు. ఇంకా ఎక్కువైతే బిస్కట్ ప్యాకెట్లో.. మరో వస్తువో ఇస్తున్నారు. వీళ్లంతా ఒక ఎత్తయితే.. హైదరాబాద్‌లోని మద్యం దుకాణాలవారు మరో ఎత్తు. వీళ్లయితే చిల్లర సమస్యను తీర్చుకోవడంతో పాటు మందుబాబులను మళ్లీ రప్పించేలా ఏకంగా ‘* 5’ ప్రైవేటు నోట్లనే తయారు చేసుకున్నారు. రిజర్వు బ్యాంకు గవర్నరే ఆశ్చర్యపోయేలా బార్ కోడ్లు,‘ఐ ప్రామిస్ టు పే’ హామీతో ‘ప్లాస్టిక్ కరెన్సీ’ని ము ద్రించి, వినియోగిస్తున్నారు. మద్యం దుకాణం పేరుతోపాటు నిర్వాహకుల సంతకాన్నీ వాటిపై ముద్రించి... అక్కడ కాకపోతే మరో మద్యం దుకాణంలోనైనా చెల్లుబాటయ్యేలా ఒప్పందాలు కూడా చేసుకుంటున్నారు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని దాదాపు అన్ని మద్యం దుకాణాల్లో చలామణి అవుతున్న ఈ ఐదు రూపాయల సొంత కరెన్సీ క థా కమామీషు..! విజిటింగ్ కార్డు సైజులో... ఒక వినియోగదారుడు సికింద్రాబాద్‌లోని ఓ పేరుమోసిన మద్యం దుకాణానికి వెళ్లి రూ. 100 నోటు ఇచ్చి రూ. 95 విలువైన మద్యం కొనుగోలు చేశాడనుకోండి. గతంలో అయితే ఏ పల్లీల ప్యాకెట్టో, మరేదైనా తినుబండారమో ఇచ్చేవారు. ఇప్పుడు మాత్రం విజిటింగ్ కార్డు పరిమాణంలో ఉన్న ఒక ‘ప్లాస్టిక్ నోటు’ను చేతిలో పెడుతున్నారు. ఇదేమిటంటే... ‘‘ఐదు రూపాయల చిల్లర లేదు! ఈ సారి వచ్చేటప్పుడు దీన్ని తీసుకొస్తే.. మీ డబ్బు సర్దుబాటు చేస్తాం..’’ అని చెబుతున్నారు. ‘నేను ఉండేది హిమాయత్‌నగర్‌లో మళ్లీ ఇక్కడికెందుకు వస్తాను..?’ అని కొనుగోలుదారుడు ప్రశ్నిస్తే... హైద ర్గూడలో మాకు షాపుంది. అక్కడైనా చెల్లుతుంది. సిటీలోని మా ఐదు బ్రాంచిల్లో ఎక్కడైనా ఇస్తారు..’ అని బదులిస్తున్నారు. ఇలా ఐదు రూపాయల చిల్లర కొరత తీర్చుకునే సాకుతో ఆయా బ్రాంచిలకు ఒక రెగ్యులర్ వినియోగదారుడిని తయారు చేసుకుంటున్నారు. ‘మందు’ నోట్లకు ఒప్పందాలు.. ఎక్కువ దుకాణాలున్న వారే కాదు.. ఆయా ప్రాంతాల్లో విడివిడిగా మద్యం దుకాణాలున్నవారు కూడా ఇదే తరహా ‘*5 ప్లాస్టిక్ కరెన్సీ’ని వినియోగిస్తున్నారు. అయితే ఆ ప్రాంతంలోని మరే మద్యం షాపులో దాన్ని ఇచ్చినా.. చెల్లుబాటయ్యేలా ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. ఉదాహరణకు అంబర్‌పేట ప్రాంతంలో ఉన్న ఒక మద్యం షాపులో సరుకు కొనుగోలు చేసినప్పుడు నిర్వాహకులు ఇచ్చే ఈ నోట్ అంబర్‌పేట, నల్లకుంట, బర్కత్‌పురా మొదలైన ప్రాంతాల్లోని అన్ని మద్యం దుకాణాల్లోనూ ఇచ్చి మద్యం కొనుగోలు చేసుకోవచ్చు. తర్వాత ఆయా షాపుల వాళ్లు ఈ నోట్లను ‘మార్పిడి’ చేసుకుంటారన్నమాట. భద్రత, హామీ కూడా..! విజిటింగ్ కార్డు పరిమాణంలో ఉండే ఈ ‘మందు’ నోట్ల మీద ఎడమవైపు ప్రభుత్వం అధికారికంగా గుర్తించిన రూపాయి చిహ్నంతో ‘*5’ను, పైభాగంలో అసలైన కరెన్సీ నోట్లపై ఉన్నట్టుగా.. ‘ఐ ప్రామిస్ టు పే’ అనే ఆంగ్ల అక్షరాలను ముద్రించారు. వీటిని నకిలీవి ముద్రించకుండా బార్కోడ్లు ఉండడం విశేషం. ఈ బార్కోడ్ పక్క ముద్రించిన నెల, సంవత్సరం ఉంటాయి. అయితే ఇలాంటి నోట్లను తొలుత కాగితంపై ముద్రించినా.. అవి తొందరగా చిరిగిపోతుండడంతో విజిటింగ్ కార్డుకు ఉపయోగించే ‘ప్లాస్టిక్ పేపర్’ను వాడుతున్నారు.