బేరాల్లేవ్!
గణనీయంగా పడిపోయిన మార్కెట్
దుకాణాలు తెరిచినా ఉపయోగం లేదంటున్న బంగారం వ్యాపారులు
పాడైపోతున్న పండ్లు, కూరగాయలు కిరాణ, వస్త్ర దుకాణాల్లోనూ ఇదే పరిస్థితి
హన్మకొండ : పెద్ద నోట్ల రద్దుతో ఢిల్లీ నుంచి గల్లీస్థారుు వరకు వ్యాపారాలపై తీవ్ర ప్రభావం పడి లావాదేవీలు గణనీయంగా పడిపోయారుు. వరంగల్ రూరల్ జిల్లాలోని నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట డివిజన్లతో పాటు పాటు మండలాల్లో వ్యాపార లావాదేవీలు 20నుంచి 30శాతానికి పడిపోగా వ్యాపారులు దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ప్రజలు, రైతులు మరిన్ని ఇబ్బందులు పడుతున్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో పాటు, రబీకి రైతులు సన్నధ్ధమవుతున్న నేపథ్యంలో గగ్గోలు పెడుతున్నారు. పండించిన పంటను అమ్ముకునేందుకు మార్కెట్‌కు రాగా అడ్తిదారులు చెక్కులు ఇస్తుండడంతో తీసుకునేందుకు రైతులు నిరాకరిస్తున్నారు. సినిమా థియేటర్లలో టికెట్ల అమ్మకం ఐదోవంతుకు పడిపోరుుంది.
పరకాల మార్కెట్‌లో వ్యాపారం సున్నా స్థారుుకి చేరుకుంది. చిరువ్యాపారులు, తోపుడుబండ్ల వారు వ్యాపారం లేక దిగాలుగా ఉన్నారు. పాత నోట్లు తీసుకోలేక బంగారం వ్యాపారులు దుకాణాలు పూర్తిస్థారుులో తెరవడంలేదు. కిరాణ దుకాణాల్లో వ్యాపారం 20శాతానికి పడిపోగా, వస్త్ర దుకాణాల్లో రోజుకు రూ.15వేలు నడిచే పరకాల, నర్సంపేటల్లో రూ.1500కు మించి నడవడం లేదని వ్యాపారులు వాపోతున్నారు. మరోవైపు చోరీలు చోటుచేసుకుంటున్నారుు. వర్ధన్నపేట మండలం ఇల్లందలో కిరాణా దుకాణంలో సుమారు రూ.50వేల విలువైన రీచార్జి కూపన్లు, సిగరెట్లు చోరీకి గురయ్యారుు. ఐరన్ దుకాణంలో రూ.60వేల నగదు చోరీకి గురైంది.