పెద్ద నోట్లు.. జనం పాట్లు | Arrested in business transactions | Sakshi
Sakshi News home page

పెద్ద నోట్లు.. జనం పాట్లు

Published Fri, Nov 11 2016 1:55 AM | Last Updated on Tue, Sep 3 2019 9:06 PM

పెద్ద నోట్లు..  జనం పాట్లు - Sakshi

పెద్ద నోట్లు.. జనం పాట్లు

జిల్లాలో స్తంభించిన వ్యాపార  లావాదేవీలు
రూ.500, 1000 నోట్లు తీసుకోని వ్యాపారులు
{పయాణికులు, రోగులకు నానా ఇబ్బందులు
రంగంలోకి దిగిన దళారులు


తిరుపతి: పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ప్రజానీకాన్ని పరుగులు తీరుుస్తోంది. జిల్లాలోని పేద, మధ్య తరగతి ప్రజలతో పాటు ధనిక, వ్యాపార, ఉద్యోగ వర్గాల జనమంతా బుధవారం వివిధ రకాల ఇక్కట్లను ఎదుర్కొన్నారు. జిల్లా అంతటా ముఖ్యమైన వ్యాపార లా వాదేవీలు 50 శాతం పైగా స్తంభిం చారుు. సినిమా హాళ్లు, హోటళ్లు, చికెన్, మటన్ సెంటర్లు, చిల్లర దుకాణాలు, సూపర్ మార్కెట్లు వెలవెలబోయారుు. వైన్‌షాపులు, పెట్రోలు బంకులు కిటకిటలాడినా చిల్లర సమస్య జనాన్ని ఇబ్బందులకు గురిచేసింది. చాలా పట్టణా ల్లో దళారులు రంగప్రవేశం చేసి కమీషన్ల వ్యాపారానికి తెరలేపారు. రూ.500కి రూ.400, రూ.1000కి రూ.800 చొప్పున చెల్లింపులు జరి పారు. పెద్ద నోట్లను ఏదో విధంగా బ్యాంకులు, పోస్టాఫీసుల్లో  మార్చుకుంటామనే భరోసా ఉన్న వ్యాపారు లు, కమీషన్ ఏజెంట్లు, కుదువ వ్యాపారులు నోట్లు తీసుకున్నారు. పుణ్యక్షేత్రాలైన తిరుమల, శ్రీకాళహస్తి, కాణిపాకం, నారాయణవనం, అప్పలాయగుంట, శ్రీనివాస మంగాపురంలో బుధవారం భక్తుల తాకిడి తగ్గింది.

నోట్లు తీసుకునేందుకు వ్యాపారులు నో
రద్దరుున నోట్లను తీసుకునేందుకు వ్యాపారాలు ససేమిరా అన్నారు. తిరుపతి, చిత్తూరు, పుత్తూరు, పుంగనూరు, మదనపల్లె పట్టణాలతో పాటు పుణ్యక్షేత్రాలైన తిరుమల, కాణిపాకం, శ్రీకాళహస్తిల్లోని పూజా సామగ్రి విక్రేతలు కొనుగోలుదారుల నుంచి రూ.500, 1000 నోట్లను తీసుకోలేదు. చిల్లర లేదని కొందరు, చెల్లని నోట్లు వద్దని మరికొందరు నిరాకరించారు. నోట్లు తీసుకోవాలని తిరుపతి, చిత్తూరు చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు వాట్సప్ గ్రూపుల్లో మెసేజ్‌లు పెట్టినా వ్యాపారులు సానుకూలంగా స్పందించలేదు.  పాలు, కూరగాయలు, చికెన్ సెంటర్ల నుంచి అన్ని రకాల దుకాణాలు, సూపర్ మార్కెట్లు నోట్లు తీసుకునేందుకు విముఖత చూపారుు. దీంతో జిల్లా అంతటా వ్యాపారాలు 50 శాతం తగ్గారుు. రోజుకి రూ. 250 కోట్ల వ్యాపార లావాదేవీలు నమోదయ్యే జిల్లాలో బుధవారం రూ.100 కోట్ల వ్యాపార లావాదేవీలు సాగడం గగనమైందని వ్యాపార వర్గాలు వెల్లడించారుు.

కిటకిటలాడిన పెట్రోలు బంకులు..
రద్దరుున నోట్లు మారింది ఇక్కడొకచోటే. జిల్లాలోని పెట్రోలు బంకుల యజమానులందరూ నోట్లు స్వీకరించారు. అరుుతే రూ.100, 200లకు కొట్టకుండా రూ.500 మొత్తానికీ పెట్రోలు కొడతామని షరతు పెట్టారు, చేసేది లేక వాహనచోదకులు మొత్తానికీ పెట్రోలు పట్టుకున్నారు. ఇదే అదునుగా బంకుల యజమానులు స్పీడ్, సూపర్ మైలేజ్ పెట్రోలు లక్ష్యాలను కూడా అధిగమించారు. ఒక్కో పెట్రోలు బంకు గతంలో 3000 నుంచి 4000 లీటర్ల పెట్రోలు విక్రరుుంచేది. అరుుతే బుధవారం మాత్రం రెట్టింపు అమ్మకాలు జరిగారుు. జిల్లాలోని వైన్, బార్ అండ్ రెస్టారెంట్లలోనూ అమ్మకాలు బాగున్నారుు. పెద్ద నోట్ల మార్పిడికి మందుబాబులు వైన్‌షాపులను ఎంచుకున్నారు. ఇదే అదునుగా వ్యాపారులు రెట్టింపు అమ్మకాలు జరిపారు.

 ఇష్లారాజ్యంగా దళారులు...
చిల్లర సమస్యను ఆసరాగా తీసుకున్న కొందరు దళారులు రంగప్రవేశం చేసి కమీషన్ల వ్యాపారం చేయడం ప్రారంభించారు. తిరుపతి తుడా సర్కిల్, టీటీడీ ఏడీ బిల్డింగ్, అలిపిరి, బస్టాండ్, రైల్వే సెంటర్లను అడ్డాగా చేసుకుని వ్యాపారం చేశారు. రూ.500 నోటుకు బదులుగా రూ.400 మాత్రమే ఇచ్చి కమీషన్ కింద రూ.100 మినహారుుంచుకున్నారు. అత్యవసరంగా ప్రయాణించాల్సిన యాత్రికులు చిల్లర కోసం వీరిని ఆశ్రరుుంచి నష్టపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement