కిరాణా కొట్టులో గంజాయి చాక్లెట్లు | Ganja Chocolates At Grocery Store | Sakshi
Sakshi News home page

కిరాణా కొట్టులో గంజాయి చాక్లెట్లు

Published Mon, Aug 19 2024 7:20 AM | Last Updated on Mon, Aug 19 2024 7:40 AM

Ganja Chocolates At Grocery Store

 విద్యార్థులు, యువతకు విక్రయం  

    షాపు యజమాని అరెస్టు  

సాక్షి, హైదరాబాద్‌: కిరాణాకొట్టులో గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్న వ్యక్తిని సైబరాబాద్‌ స్పెషల్‌ ఆపరేషన్‌ టీం (ఎస్‌ఓటీ) పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వివరాలిలా ఉన్నాయి.. ఉత్తరప్రదేశ్‌లోని గోహ్నియా గ్రామానికి చెందిన పివేస్‌ అలియాస్‌ ప్రైవేష్‌ బతుకుతెరువు కోసం కొన్నేళ్ల క్రితం ఐడీపీఎల్‌ బాలానగర్‌కు వలస వచ్చాడు. పేట్‌ బషీరాబాద్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని సుభా నగర్‌లో కిరాణాష్‌ కొట్టు పెట్టాడు.

 ఆశించిన మేర ఆదాయం లేకపోవడంతో గంజాయి విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. ఈక్రమంలో తన స్వస్థలమైన యూపీ నుంచి అక్రమంగా గంజాయి చాక్లెట్లను నగరానికి తీసుకొస్తున్నాడు. వీటిని స్కూల్, కాలేజీ విద్యార్థులు, యువత, దినసరి కూలీలకు విక్రయిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం అందుకున్న మేడ్చల్‌ ఎస్‌ఓటీ, పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు కిరాణా కొట్టులో ఆకస్మిక తనిఖీలు చేయగా.. 5 ప్యాకెట్లలో 200 గంజాయి చాక్లెట్లు లభించాయి. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement