గాంధీ నగర్: గుజరాత్ రాష్ట్రంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. అహ్మదాబాద్‌లో విదేశాల నుంచి వచ్చిన వారి నుంచి సుమారు రూ. కోటికి పైగా విలువైన డ్రగ్స్‌ను కస్టమ్ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.
వివరాలు.. అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్‌తోపాటు కస్టమ్స్, ఎక్సైజ్ శాఖ అధికారులు సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో అమెరికా, కెనడా, థాయ్‌లాండ్ నుంచి వచ్చిన వారి వద్ద నుంచి రూ. 1.15 కోట్ల విలువైన హైబ్రిడ్, సింథటిక్ గంజాయి పొట్లాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
వీటిని చిన్నారుల ఆట బొమ్మలు, చాక్లెట్లు, లంచ్ బాక్స్‌లు, క్యాండీ విటమిన్‌లల్లో దాచి అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి ఓ విదేశీయుడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment