chocolates
-
చాక్లెట్లు దొంగలించిందని చంపేశారు !
రావల్పిండి: పాకిస్తాన్లో పేదరికం కారణంగా చిన్నతనంలోనే బాలకార్మికులుగా ఇంటిపని చేసే చిన్నారుల్లో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. ఇంట్లో చాక్లెట్లు దొంగతనం చేసిందని ఆరోపిస్తూ 13 ఏళ్ల బాలికను ఆ ఇంటి యాజమానులు చితకబాదడంతో గాయాలపాలై ఆ అమ్మాయి చనిపోయిన ఘటన ఆగ్నేయ పాకిస్తాన్లో గత బుధవారం సాయంత్రం జరిగింది. రావల్పిండిలో నమోదైన ఈ కేసులో యజమాని రషీద్ షఫీఖ్, ఆయన భార్య సనా, వాళ్ల ఖురాన్ బోధకుడినీ పోలీసులు అరెస్ట్‌చేశారు. బాలిక కాళ్లు, చేతులు, చీలమండ పలు చోట్ల విరిగినట్లు పోస్ట్‌మార్టమ్ ప్రాథమిక నివేదికలో తేలింది. సమగ్ర నివేదిక ఇంకా రావాల్సి ఉంది. బాలిక ఇఖ్రా పనిచేస్తున్న యజమాని దంపతులకు 8 మంది సంతానం. వాళ్ల బాగోగులు, ఇంటి పనులు చూసుకునేందుకు రెండేళ్ల క్రితం వాళ్లింట్లో ఇఖ్రా పనికి కుదిరింది. జీతంగా నెలకు దాదాపు రూ.2,430 ఇచ్చేవారు. చాక్లెట్లు దొంగతనం చేసిందని ఆరోపిస్తూ ఇఖ్రాను దారుణంగా హింసించారని పోలీసులు అనుమానిస్తున్నారు. తలకు తీవ్రగాయమైనట్లు సంబంధిత వీడియోల్లో తెలుస్తోంది. అన్నపానీయాలు ఇవ్వకుండా కడుపు మార్చారని, కట్టేసి కొట్టారని, చపాతీలు చేసే కర్రతో కొట్టడంతో పుర్రె పగిలిందని వార్తలొచ్చాయి. బాలిక మరణవార్త తెల్సి దేశవ్యాప్తంగా వేలాది మంది బాలల హక్కుల కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఇఖ్రాకు న్యాయం జరగాలని డిమాండ్‌చేశారు. తన బిడ్డ మరణాన్ని 45 ఏళ్ల రైతు సనా ఉల్లాహ్ ఏడుస్తూ చెప్పారు. ‘‘నా కుమార్తె ఆరోగ్యం బాలేదని పోలీసులు ఫోన్‌చేసి ఆస్పత్రికి రమ్మన్నారు. వచ్చి చూస్తే ఆస్పత్రి బెడ్‌పై ఇఖ్రా చలనంలేకుండా పడి ఉంది. కొద్దిసేపటికి ప్రాణాలు కోల్పోయింది. నాకున్న అప్పు తీర్చుకునేందుకు గతిలేక ఇఖ్రాను పనికి పంపించాను’’అంటూ తండ్రి దిక్కులు పిక్కటిల్లేలా ఏడ్చారు. తండ్రి అప్పులు తీర్చేందుకు, ఇంట్లో ఖర్చులకు పనికొస్తాయనే ఉద్దేశ్యంతో ఇఖ్రా ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పటి నుంచే పనులకు వెళ్లడం మొదలెట్టింది. పేదరికంలో మగ్గిపోతున్న బాలకార్మికుల కుటుంబాలు ఇలాంటి సందర్భాల్లో న్యాయం కోసం తుదికంటా పోరాటం చేయడం పాకిస్తాన్లో చాలా అరుదు. నిందితులను దేవుడే క్షమిస్తాడని మనసును రాయి చేసుకుని ఆ దోషులు నష్టపరిహారంగా ఇచ్చే ఏంతో కొంత మొత్తాలను తీసుకుని కోర్టుల బయటే రాజీ కుదుర్చుకోవడం పాకిస్తాన్లో పరిపాటిగా మారింది. ఇఖ్రా కేసు సైతం చివరకు ఇలాంటి ‘పరిష్కారం’దిశలో పయనిస్తుందని పలువురు సామాజిక కార్యకర్తలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. యూనిసెఫ్ గణాంకాల ప్రకారం పాకిస్తాన్లో 33,00,000 మంది బాలకార్మికులు ఉన్నట్లు తెలుస్తోంది. పాకిస్తాన్లో ఇంటిపనుల్లో నిమగ్నమైన మొత్తం 85 లక్షల మంది కార్మికుల్లో అత్యధిక శాతం మంది మహిళలు, బాలికలేనని అంతర్జాతీయ కార్మిక సంఘం(ఐఎల్ఓ) పేర్కొంది. -
మానసిక ఒత్తిడిని తగ్గించే చాక్లెట్
హైదరాబాద్: మానసిక ఒత్తిడిని తగ్గించే విధంగా చాక్లెట్లను తయారు చేయడం అభినందనీయమని ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ అన్నారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 లోని దసపల్ల హోటల్ లో హెటాఫీ డైమండ్ క్యాండి నీ ఆయన ప్రముఖ వైద్యురాలు పద్మశ్రీ మంజుల అనగాని తో కలిసి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా యండమూరి మాట్లాడుతూ ప్రస్తుత మార్కెట్లో ఆరోగ్యాలను పాడుచేసే, చెడగొట్టే ఆహార పదార్థాలు తయారవుతున్నాయని అలాంటివి కాకుండా ముఖ్యంగా పిల్లలు ఎక్కువగా ఇష్టంగా తినే చాక్లెట్లను ఆరోగ్యాలను పాడు చేసే విధంగా కాకుండా మెరుగుపరిచే విధంగా తయారు చేయడం నిజంగా అభినందనీయం అన్నారు. హెటాఫీ క్యాండీ అధినేత ఎస్. సృజన్ మాట్లాడుతూ ప్రధాని మోడీ మేక్ ఇన్ ఇండియా పిలుపు మేరకు ప్రపంచ స్థాయి చాక్లెట్ లను దేశం మొత్తం అందించేందుకు ఉత్పత్తి చేస్తున్నామని అన్నారు. కాన్ఫెక్షనరీ రంగంలో స్వదేశీ ఉత్పాదనగా ఇప్పటికే హెటాఫీ క్యాండీ గుర్తింపు పొందిందని అన్నారు. ఈ క్యాండీ పై క్లినికల్ ట్రయల్స్ జరిగి యూఎస్ఏ నుంచి ఎఫ్డియే అప్రూవల్ కూడా పొందిందని తెలిపారు. ప్రతిరోజు ఓ క్యాండీ తినే వాళ్ళకి గ్యాస్ట్రిక్, బ్లోటింగ్ వంటి సమస్యలు తొలగిపోతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దిలీప్ భానుషాలి, పద్మశ్రీ గ్రహీత మంజుళ అనగాని, ఇండియన్ డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ సతీశ్ కుమార్ రెడ్డి, భారత ఫిజిషియన్స్ అసోసియేషన్ ప్రెసిడెండ్ డా. జి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. -
నోరూరించే చాక్లెట్ల చరిత్ర తెలుసా? ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్
క్యాడ్బరీ డైరీమిల్క్, ఫైవ్‌స్టార్, కిట్‌కాట్, జెమ్స్... చెబుతుంటేనే నోరూరి΄ోతోంది కదా. అమ్మానాన్నలు ఏదైనా పని చె΄్పాలంటే ‘చేశావంటే చాక్లెట్ ఇస్తా’ అంటుంటారు. నోట్లో వేసుకోగానే కరిగి΄ోయే చాక్లెట్లంటే చిన్నపిల్లలకే కాదు, పెద్దలకూ ఇష్టమే. ఈ చాక్లెట్లకు దాదాపు 5 వేల ఏళ్ల చరిత్ర ఉంది. అప్పట్లో అమెరికాలో చాకో చెట్లను తొలిసారి గుర్తించారు. ఆ చెట్టు పళ్లలోని గింజల నుంచి రసం తీసి తాగడం అలవాటు చేసుకున్నారు. రుచికరమైన ఆ రసం అందరికీ తెగ నచ్చింది. దీంతో కోకో చెట్టును దైవప్రసాదంగా భావించేవారు. ప్రధాన వేడుకల్లో ఈ చెట్లను కానుకలుగా ఇచ్చేవారు. డబ్బు చలామణీ లేని ఆ కాలంలో ఈ చెట్టునే విలువైన వస్తువుగా భావించేవారు. ఆ తర్వాత 1519లో స్పెయిన్ దేశస్థులు ఆ చాకో చెట్టు రసాన్ని తమ దేశానికి తెచ్చారు. అక్కడే మొదటిసారి ఆ రసానికి ‘చాకొలేట్’ అనే పేరు పెట్టారు. అక్కడి నుంచి అది యూరప్ ప్రాంతానికి పరిచయమై ప్రాధాన్యాన్ని పొందింది. వందల ఏళ్లపాటు రసంగానే ఉన్న ఆ ద్రవం 19వ శతాబ్దంలో పారిశ్రామికీకరణ అనంతరం బిళ్లల రూపంోకి మారింది. ఆ రసంలో మరిన్ని కొత్త దినుసులు కలిపి కొత్త తరహా రుచుల్ని తీసుకొచ్చారు. 1819లో స్విట్జర్ల్యాండ్ దేశంలో ‘ఫ్రాంకోయిస్ లూయిస్ కైల్లర్’ తొలిసారి చాక్లెట్ తయారీ ఫ్యాక్టరీ మొదలు పెట్టారు. ‘స్విస్ చాక్లెట్’ సృష్టికర్త ఆయనే. ఇప్పటికీ కైల్లర్ బ్రాండ్ చాక్లెట్ ప్రపంచంలోనే శ్రేష్ఠమైన చాక్లెట్.మొదట్లో ఒకే రంగులో ఉండే చాక్లెట్లు ఆ తర్వాత కొత్త కొత్త రంగులతో మార్కెట్లోకి వచ్చాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాక్లెట్ల వ్యాపారం లక్షల కోట్ల ఆదాయంతో నడుస్తోంది. పుట్టినరోజులు, పెళ్లిరోజులు, చిన్నారులకు వేడుకలు... ఇలా ఏ శుభకార్యం జరిగినా చాక్లెట్లు ఉండాల్సిందే అనేంతగా పేరు పొందాయి. అయితే మీకు చాక్లెట్లంటే ఎంత ఇష్టమున్నా వాటిని ఎక్కువగా తింటే అనేక సమస్యలు వస్తాయి. తరచూ చాక్లెట్లు తింటే పళ్లు పాడవుతాయి. కాబట్టి ఎప్పుడో ఒకసారి మాత్రమే చాక్లెట్లు తినండి. ఇది కూడా చదవండి: ఉసిరితో వనభోజనం : ఇన్స్టంట్ పచ్చడి ఒక్కసారి తిన్నారంటే! -
చాక్లెట్లతో గణేశుడి విగ్రహం..
-
కిరాణా కొట్టులో గంజాయి చాక్లెట్లు
సాక్షి, హైదరాబాద్: కిరాణాకొట్టులో గంజాయి చాక్లెట్లను విక్రయిస్తున్న వ్యక్తిని సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. వివరాలిలా ఉన్నాయి.. ఉత్తరప్రదేశ్‌లోని గోహ్నియా గ్రామానికి చెందిన పివేస్ అలియాస్ ప్రైవేష్ బతుకుతెరువు కోసం కొన్నేళ్ల క్రితం ఐడీపీఎల్ బాలానగర్‌కు వలస వచ్చాడు. పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలోని సుభా నగర్లో కిరాణాష్ కొట్టు పెట్టాడు. ఆశించిన మేర ఆదాయం లేకపోవడంతో గంజాయి విక్రయించాలని నిర్ణయించుకున్నాడు. ఈక్రమంలో తన స్వస్థలమైన యూపీ నుంచి అక్రమంగా గంజాయి చాక్లెట్లను నగరానికి తీసుకొస్తున్నాడు. వీటిని స్కూల్, కాలేజీ విద్యార్థులు, యువత, దినసరి కూలీలకు విక్రయిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం అందుకున్న మేడ్చల్ ఎస్ఓటీ, పేట్ బషీరాబాద్ పోలీసులు కిరాణా కొట్టులో ఆకస్మిక తనిఖీలు చేయగా.. 5 ప్యాకెట్లలో 200 గంజాయి చాక్లెట్లు లభించాయి. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. -
Gujarat: పిల్లల బొమ్మల్లో, లంచ్ బాక్సుల్లో దాచి..
గాంధీ నగర్: గుజరాత్ రాష్ట్రంలో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. అహ్మదాబాద్‌లో విదేశాల నుంచి వచ్చిన వారి నుంచి సుమారు రూ. కోటికి పైగా విలువైన డ్రగ్స్‌ను కస్టమ్ అధికారులు శనివారం స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన ఒకరిని అదుపులోకి తీసుకున్నారు.వివరాలు.. అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్‌తోపాటు కస్టమ్స్, ఎక్సైజ్ శాఖ అధికారులు సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో అమెరికా, కెనడా, థాయ్‌లాండ్ నుంచి వచ్చిన వారి వద్ద నుంచి రూ. 1.15 కోట్ల విలువైన హైబ్రిడ్, సింథటిక్ గంజాయి పొట్లాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని చిన్నారుల ఆట బొమ్మలు, చాక్లెట్లు, లంచ్ బాక్స్‌లు, క్యాండీ విటమిన్‌లల్లో దాచి అక్రమంగా తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి ఓ విదేశీయుడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. -
ఇక చౌకగా స్విట్జర్లాండ్ చాక్లెట్లు, వాచీలు
స్విస్ చీజ్, చాక్లెట్, వైన్, వాచీలు, ఇతర ఉత్పత్తులను భారతీయ వినియోగదారులకు మరింత చౌకగా లభించనున్నాయి. యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (ఈఎఫ్టీఏ) ఎగుమతుల్లో 95.3 శాతం వాటా కలిగిన 82.7 శాతం టారిఫ్ లైన్లపై కస్టమ్స్ సుంకాలను తగ్గిస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది.అదనంగా, ఈఎఫ్టీఏ దేశాలకు తన సేవల ఎగుమతులను పెంచడానికి ఐటీ, హెల్త్‌కేర్, అకౌంటింగ్ వంటి 105 ఉప రంగాలలో భారతదేశం రాయితీలను అందించింది. యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్‌తో భారత్ మార్చి 10న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందంలో భాగంగా స్విట్జర్లాండ్ నుంచి 128, నార్వే నుంచి 114, లైచెన్టెయిన్ నుంచి 107, ఐస్లాండ్ నుంచి 110 సబ్ సెక్టార్లను భారత్ ఈఎఫ్టీఏకు అనుమతించింది.1960లో ఏర్పాటు చేసిన ఈఎఫ్టీఏ అనేది ఐస్లాండ్, లైచెన్‌స్టెయిన్, నార్వే, స్విట్జర్లాండ్లతో కూడిన ఒక అంతర్ ప్రభుత్వ సంస్థ. ఇది ఐరోపా అంతటా ఆర్థిక సహకారం, స్వేచ్ఛా వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తుంది. మొత్తం 13 మిలియన్ల జనాభాతో, ఈఎఫ్టీఏ దేశాలు ప్రపంచంలోని పదో అతిపెద్ద వాణిజ్య వ్యాపారులు, వాణిజ్య సేవల ఎనిమిదో అతిపెద్ద సరఫరాదారులుగా ఉన్నాయి. -
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో గంజాయి చాక్లెట్ల గుట్టురట్టు
-
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో గంజాయి చాక్లెట్ల గుట్టురట్టు
-
ఆ చాక్లెట్లు తిని మత్తులోకి జారి!
కొత్తూరు: స్కూలు సమీపంలోని పాన్ డబ్బాల్లో విక్రయిస్తున్న చాక్లెట్లు తిని విద్యార్థులు మత్తులోకి జారుకోవడం, వింత వింతగా ప్రవర్తిస్తున్న దృష్టాంతాలు రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వెలుగుచూశాయి. ఉపాధ్యాయులు తెలిపిన వివరాల ప్రకారం.. స్కూలు సమీపంలోని పాన్ డబ్బాల్లో లభించే చాక్లెట్లను తరచూ కొని తింటున్న పలువురు విద్యార్థులు తరగతి గదుల్లో మత్తులోకి జారుకుంటున్నారు. కొద్ది రోజులుగా విద్యార్థులు వింతగా ప్రవర్తించడాన్ని గమనించిన ఉపాధ్యాయులు ఆరా తీయగా చాక్లెట్ల వల్లనే అని తేలింది. వీటిని మొదట పాన్ డబ్బాల వ్యాపారులు ఉచితంగా విద్యార్థులకు అందించారని, క్రమంగా వాటికి బానిసలైన విద్యార్థులకు ఒక్కో చాక్లెట్ 20 రూపాయలకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఉపాధ్యాయుల సమాచారం మేరకు ఎస్వోటీ పోలీసులు మంగళవారం సదరు పాన్ డబ్బాలపై దాడిచేయగా స్వల్ప మొత్తంలో చాక్లెట్లు లభించాయి. అయితే ఈ చాక్లెట్లలో ఏముందనేది తెలియరాలేదని చెబుతున్నారు. హెచ్ఎం అంగోర్ నాయక్‌ను వివరణ కోరగా విద్యార్థులు వింతగా ప్రవర్తిస్తున్న విషయం వాస్తవమేనని, దీనిపై స్థానిక మున్సిపల్ అధికారులు, పోలీసులకు సమాచారం అందించామని చెప్పుకొచ్చారు. -
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో కల్తీ చాక్లెట్ల తయారీ.. హైదర్‌గూడలో సుప్రజా ఫుడ్స్ పేరుతో కల్తీ దందా
-
ఎస్బీఐ వినూత్న ఐడియా! ఈఎంఐలు కట్టనివారి కోసం..
బ్యాంకులో లోన్లు తీసుకుని ఈఎంఐలు సక్రమంగా కట్టనివారి నుంచి బకాయిలు రాబట్టేందుకు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వినూత్న ఐడియా వేసింది. ఈఎంఐలు చెల్లించనివారికి ఇక నోటీసులు, ఫోన్ కాల్స్ కాకుండా నేరుగా ఇంటికే వెళ్లి చేతిలో చాక్లెట్లు పెట్టి శుభాకాంక్షలు చెప్పి వాయిదా కట్టేలా చేస్తోంది. (ఈ బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్! ఇంటి వద్దకే ప్రభుత్వ బ్యాంక్ సేవలు) ఈఎంఐ చెల్లించకుండా తప్పించుకోవాలనుకుంటున్న కస్టమర్లు.. సాధారణంగా బ్యాంక్ చేసే రిమైండర్ కాల్‌కు స్పందించరు. కాబట్టి ఫోన్ కాల్స్ కాకుండా నేరుగా కస్టమర్లకు ఇంటికే వెళ్లి గుర్తు చేయడం ఉత్తమ మార్గమని ఎస్బీఐ భావిస్తోంది. వడ్డీ రేట్లలో కదలికల నేపథ్యంలో ఈఎంఐలు చెల్లింపుల్లో జాప్యాలు బాగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో మెరుగైన వసూళ్లను సాధించడానికి ఎస్బీఐ ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. (PM Vishwakarma Scheme: రూ.13,000 కోట్లతో కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం.. ప్రయోజనాలు ఇవే..) ఎస్బీఐ రిటైల్ లోన్ బుక్ 2023 జూన్ త్రైమాసికంలో గతేడాది రూ.10,34,111 కోట్ల నుంచి 16.46 శాతం పెరిగి రూ. 12,04,279 కోట్లకు చేరుకుంది. ఇక మొత్తం రిటైల్ రుణాలు 13.9 శాతం వృద్ధి చెంది రూ. 33,03,731 కోట్లకు చేరుకున్నాయి. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించే రెండు ఫిన్‌టెక్ కంపెనీలతో ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఎస్బీఐలో రిస్క్ విభాగానికి ఇన్చార్జ్ మేనేజింగ్ డైరెక్టర్ అశ్విని కుమార్ తివారీ తెలిపారు. ఈ ఫిన్‌టెక్ ప్రతినిధులు ఈఎంఐ చెల్లించని కస్టమర్ల ఇళ్లకు వెళ్లి చాక్లెట్ల ప్యాక్ ఇచ్చి ఈఎంఐ బకాయిని గుర్తుచేస్తారని పేర్కన్నారు. అయితే ఆ ఫిన్‌టెక్‌ల పేరు చెప్పడానికి ఆయన నిరాకరించారు. ఈ చర్య కేవలం పైలట్ దశలో ఉందని, కేవలం 15 రోజుల క్రితమే దీనిని అమలులోకి తెచ్చామని, విజయవంతమైతే అధికారికంగా ప్రకటిస్తామని ఆయన వివరించారు. (కస్టమర్లకు షాకిచ్చిన ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్! సెప్టెంబర్ 21 నుంచే..) -
ఇంత పిచ్చా?....వధువు హెయిర్‌స్టైల్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే
పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మరపురాని వేడుక. అందుకే తమ పెళ్లి రోజును మరపురాని జ్ఞాపకంగా మిగుల్చుకోవాలని వధూవరులిద్దరూ ఎంతగానో కోరుకుంటారు. ఇటీవల పెళ్లిలో ఓ వధువు డిఫరెంట్ హెయిర్‌స్టైల్‌తో షాకిచ్చింది. పూలతో అయితే రొటీన్‌గా ఉంటుందని చాక్లెట్లతో జడ అల్లేసుకుంది. దీనికి సంబంధించిన ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. తమ పెళ్లిలో మరింత అందంగా కనిపించాలని ముచ్చటపడిపోతుంటారు. అందుకే బట్టల దగ్గర్నుంచి హెయిర్ స్టైల్ వరకు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటారు. ఏం చేసినా కాసింత కళాపోషణ ఉండాలి అన్నట్లు సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూనే వినూత్నంగా కనిపించాలని భావిస్తుంటారు. సాధారణంగా పెళ్లిలో వధువుకి పూలజడ ప్రత్యేకం. ఈమధ్య అలా రకరకాల పూలజడలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే ఓ వధువు మాత్రం కాస్త డిఫరెంట్‌గా ఆలోచించి చాక్లెట్స్‌తో జడను అలంకరించుకుంది. ఇయర్ రింగ్స్,నెక్లెస్ వంటి ఆభరణాలు కూడా చాక్లెట్స్‌తో చేసినవే. జడకు కిట్‌క్యాట్, ఫైవ్‌స్టార్, ఫెరెరో, రోచర్, మిల్కీబార్ వంటి చాక్లెట్లతో అందంగా ముస్తాబైంది. దీనికి సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. పెళ్లికూతురి క్రియేటివిటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. View this post on Instagram A post shared by chitrasmakeupartist (@_chitras_makeup_artist_28) -
వధువు అలంకరణ చూసి..పెదాలు చప్పరించకుండా ఉండలేరు!
ఏదైనా పండుగలు, ఫంక్షన్ల అంటే కచ్చితంగా ఆడవాళ్లు చాలా అందంగా రెడీ అవుతారు. ఇక పెళ్లి అంటే చెప్పాల్సిన అవసరం లేదు ఓ రేంజ్లో రెడీ అవతారు. హెవీ జ్యూవెలరీతో రెడీ అవ్వడం లేదా అంతకు మరింత ఖరీదైన వస్తువులతో అందంగా రెడీ అవుతారు. కానీ చాక్లెట్లతో వధువు అలంకరణ గురించి విన్నారా! ఔను రకరకాల చాక్లెట్లతో నూతన వధువులా రెడీ అయ్యింది. జాగ్రత్తగా పరిశీలిస్తేగాని తెలియదు అవి చాక్లెట్లు అని. చెవి కమ్మలు దగ్గర నుంచి నగలు, పూల జడ వరకు అన్ని వివిధ రకాల చాక్లెట్లని ఉపయోగించారు. చూసేందుకు కూడా అందంగానూ చాలా విలక్షణంగానూ అనిపించింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. మీరు ఓ లుక్కేయండి. View this post on Instagram A post shared by Niche Lifestyle (@nichelifestyle) (చదవండి: పెళ్లి మండపంలోకి హఠాత్తుగా చొరబడ్డ కోతి..వధువరులపై దాడి చేసి..) -
కాలంచెల్లిన చాక్లెట్లు,బిస్కెట్లకు కొత్త లేబుల్స్ వేసి విక్రయం.. ముఠా గుట్టు రట్టు..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ బొడిప్పల్‌లో అతిపెద్ద రీసైక్లింగ్ ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠా కాలంచెల్లిన చాక్లెట్లు, బిస్కెట్లను రీసైకిల్ చేస్తోంది. ప్రముఖ బ్రాండ్ల నుంచి ఎక్స్పైర్ అయిన వస్తువులు, ఆహార పదార్థాలను సేకరించి వాటికే కొత్త లేబుల్స్ వేసి తిరిగి మార్కెట్లో విక్రయిస్తోంది. సబ్బులు, షాంపులు, తిను బండారాలు వంటి వంటి మొత్తం 300 రకాల వస్తువులను ఈ ముఠా రీసైకిల్ చేసి భారీ మోసానికి పాల్పడటటేగాక.. ప్రజలు ప్రాణాలతో చెలగాటమాడుతోంది. హైదరాబాద్ శివార్లలోని గోదాములు, కోఠిలోని హరిహంత్ కార్పోరేషన్ కార్యాలయంలో పోలీసులు తనిఖీలు చేయగా ఈ రీసైక్లింగ్ ముఠా బాగోతం బట్టబయలైంది. ఈ సోదాల్లో రూ.కోట్లు విలువ చేసే ఆహారపదార్థాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పలువురిని అరెస్టు చేశారు. -
కాలంచెల్లిన చాక్లెట్లు, బిస్కెట్లుకు కొత్త లేబుల్స్ వేసి విక్రయం.. రీసైక్లింగ్ ముఠా గుట్టు రట్టు..
-
చాక్లెట్ బార్లలో గంజాయి!
సాక్షి, హైదరాబాద్: అతని పేరు రిషి సంజయ్ మెహతా (22)... తల్లిదండ్రులు ఓ ఫార్మా కంపెనీ యజమానులు... చదివేది అమెరికాలోని ఫీనిక్స్ యూనివర్సిటీ నుంచి ఆన్లైన్ ఎంబీఏ. అయితేనేం... మాదకద్రవ్యాలకు బానిసగా మారాడు. పోలీసుల నిఘాకు చిక్కకుండా ఉండేందుకు హష్ ఆయిల్ (ఓ రకమైన గంజాయి గుజ్జు)తో చాక్లెట్లు తయారు చేసి విక్రయిస్తూ హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ (హెచ్–న్యూ) అధికారులకు చిక్కాడు. ఈ విషయాన్ని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ శనివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... రిషి సంజయ్ మెహతాకు కాలేజీ రోజుల నుంచే హష్ ఆయిల్ సహా ఇతర డ్రగ్స్ వినియోగం అలవాటైంది. ఆపై డ్రగ్ పెడ్లర్‌గా మారాడు. ప్రస్తుతం హష్ చాక్లెట్స్ తయారీ మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఆన్లైన్ క్లాసులు నడుస్తుండటంతో ఇంటి వద్దే ఉంటూ తల్లిదండ్రులు ఫార్మా కంపెనీకి వెళ్లగానే బెడ్రూమ్లోనే వాటిని తయారు చేస్తున్నాడు. దీనికి అవసరమైన ఉపకరణాలు కూడా ఏర్పాటు చేసుకున్నాడు. విశాఖలోని చింతపల్లికి చెందిన రామారావు గంజాయి నుంచి ఈ హష్ ఆయిల్ తయారు చేస్తున్నాడు. ఇది సూరారానికి చెందిన బోనాల వినోద్, కె.శ్రీకాంత్ యాదవ్‌ల చేతులు మారి సి.రోహిత్‌కు చేరుతోంది. అతన్నుంచి 5 గ్రాముల బాటిల్‌ను రూ. 3 వేలకు రిషీ కొంటున్నాడు. తొలినాళ్లలో దీన్ని ఈ–సిగరెట్లు, బ్రౌనీస్‌లో (తినుబండారం) ఉంచి విక్రయించినా లాభసాటిగా లేకపోవడంతో ఇంటర్నెట్లో చూసి హష్ ఆయిల్ చాక్లెట్ల తయారీ మొదలెట్టాడు. తయారీ ఇలా... మార్కెట్ నుంచి ముడి చాక్లెట్‌ను 4 కేజీల చొప్పున రిషి కొనుగోలు చేసి అందులో 40 గ్రాముల హష్ ఆయిల్ కలుపుతున్నాడు. ఆపై ఆ ద్రవాన్ని పోతపోసి చాక్లెట్లుగా మారుస్తున్నాడు. ఆ సమయంలోనే ఓరియో, కిట్‌క్యాట్, క్యాట్‌బర్రీ వంటి ఫ్లేవర్లు కలుపుతున్నాడు. ఈ మిశ్రమాన్ని డీఫ్రిజ్‌లో పెట్టి చాక్లెట్ బార్స్‌గా మారుస్తున్నాడు. వాటిని సిల్వర్ ఫాయిల్‌తో కూడిన వేఫర్లలో చుట్టి ఒక్కోటి రూ. 5 వేల నుంచి రూ.10 వేలకు అమ్ముతున్నాడు. అతనికి నగరంలోనే 100 మంది కస్టమర్లు ఉన్నారు. రిషీ దందాపై సమాచారం అందుకున్న హెచ్–న్యూ ఇన్స్పెక్టర్ పి.రాజేశ్, ఎస్సై జీఎస్ డానియేల్‌లతో కూడిన బృందం అతనిపాటు వినోద్, శ్రీకాంత్, రోహిత్‌లను పట్టుకుంది. పరారీలో ఉన్న రామారావు కోసం గాలిస్తోంది. అతన్నుంచి 48 హష్ చాక్లెట్ బార్స్, 40 గ్రాముల హష్ ఆయిల్ స్వాధీనం చేసుకుంది. రిషీ నుంచి చాక్లెట్ బార్లు కొనుగోలు చేసిన వాళ్లు అందులోని 15 పీసులను విడగొట్టి ఒక్కో పీస్‌ను గరిష్టంగా రూ. 2 వేల చొప్పున రూ. 30 వేలకు అమ్ముతుండటం గమనార్హం. ఒక్కో చాక్లెట్ బార్ తినడం ద్వారా వినియోగదారులు 6 గంటల వరకు మత్తులో జోగుతున్నారు. -
మా అమ్మను అరెస్టు చేయండి.. స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసిన బుడ్డోడు
భోపాల్: మూడేళ్ల బుడ్డోడు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పిర్యాదు చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌గా మారింది. ఆ బుడతడు మాటలు చూసి అక్కడున్న పోలీసులు పగడలబడి నవ్వారు. కానీ మనోడు చెప్పిన ప్రతి అక్షరాన్ని కంప్లెయింట్‌గా తీసుకున్నారు. ఇంతకీ ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. నాన్నను వెంటపెట్టుకుని మరీ ఈ చిన్నారి పోలీస్ స్టేషన్‌కు వెళ్లింది తన సొంతతల్లిపై ఫిర్యాదు చేయడానికే. వాళ్ల అమ్మ అసలు చాక్లెట్లు తిననిన్వడం లేదట. వాటిని దొంగిలించి తనకు దొరక్కుండా దాచి పెడుతోందట. అంతేకాదు క్యాండీలు కావాలని అడిగినప్పుడల్లా కొడుతుందట. బుడ్డోడు ఎంతో క్యూట్‌గా ఈ విషయాలు చెప్పడం అక్కడున్న వారిని నవ్వులు పూయించింది. మహిళా పోలీస్ కూడా అతడు చెప్పిన ప్రతి అక్షరాన్ని ఫిర్యాదులో రాసింది. చిన్నారికి కాటుక పెట్టే సమయంలో అతడు చాక్లేట్లు తింటూ అటూ ఇటూ కదిలాడని, దీంతో వాళ్లమ్మకు కోపమొచ్చి చెంపపై మెల్లగా కొట్టిందని తండ్రి చెప్పాడు. వెంటనే తనను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లమని మారాం చేశాడని వివరించాడు. దీంతో తప్పక తన కూమరుడ్ని స్టేషన్‌కు తీసుకొచ్చినట్లు చెప్పాడు. ఇంత చిన్న వయసులో పిల్లాడు స్టేషన్‌కు వెళ్లి సొంతతల్లిపైన ఫిర్యాదు చేసిన అతని అమాయకత్వాన్ని చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు. మధ్యప్రదేశ్ బర్హాన్‌పూర్ జిల్లా డేడ్తలాయి గ్రామంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో మీరూ చూసేయండి.. मध्यप्रदेश के बुरहानपुर में तीन साल का बच्चा मम्मी की शिकायत लेकर पुलिस थाने पहुंच गया। उसने पुलिस से कहा कि मम्मी मेरी कैंडी और चॉकलेट चुरा लेतीं हैं। उनको जेल में डाल दो। बच्चे की मासूमियत देखकर सभी की हंसी छूट गई।#MadhyaPradesh #Video pic.twitter.com/iGdHVOZEF6 — Hindustan (@Live_Hindustan) October 17, 2022 చదవండి: గంగూలీ వ్యవహారంపై మమతా బెనర్జీ తీవ్ర అసంతృప్తి.. ‘ఇది నిజంగా షాక్’ -
‘నాకేం వద్దు.. నాకు ఇలా బతకడమే బాగుంది’
వారం రోజులుగా ఈ ‘దాదీజీ’ (అవ్వ) వీడియో వైరల్ అవుతోంది. దానికి కారణం ముంబై మెట్రో రైళ్లల్లో ఈ దాదీజీ చాక్లెట్లు అమ్ముతూ కనిపించడమే. ఆమె కథ ఏమిటో. పిల్లలు చూస్తున్నారో లేదో. కాని తన జీవితం తాను బతకడానికి చక్కని నవ్వుతో తియ్యని చాక్లెట్లు అమ్ముతోంది. ఒక ప్రయాణికుడు ఆమె వీడియో సోషల్ మీడియాలో పెట్టడంతో అది కాస్తా వైరల్ అయ్యింది. చాలామంది సాయం చేస్తామని వచ్చారు. ‘చాక్లెట్లు కొనండి చాలు’ అని సున్నితంగా, ఆత్మగౌరవంతో తిరస్కరించిందామె. ముంబై లోకల్ ట్రైన్లలో చక్కగా నవ్వుతూ, చుడీదార్లో చలాకీగా నడుస్తూ, చాక్లెట్లు అమ్మే ఆ పెద్దావిడను చూసి ఎవరో వారం క్రితం సోషల్ మీడియాలో పెట్టారు. ఆ వయసులో కూడా జీవించడానికి శ్రమ పడుతున్న ఆమెను అందరూ ప్రశంసలతో ముంచెత్తారు. ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ అయితే ఆ వీడియోను ట్వీట్ చేసి అందరూ ఆమె దగ్గర చాక్లెట్లు కొనండి అని వినతి చేశారు. ఆ తర్వాత ‘హేమ్‌కుంట్ ఫౌండేషన్’కు చెందిన అహ్లూవాలియా అనే వ్యక్తి ఆమెకు పెద్ద ఎత్తున సాయం చేస్తాము ఆమె ఎక్కడ ఉంటుందో గుర్తించండి అని ముంబై వాసులను ఉద్దేశించి ట్వీట్లు చేశారు. ఆ ట్వీట్లను బాలీవుడ్ స్టార్లు కూడా రీట్వీట్ చేశారు. చాలామంది ముంబైవాసులు ‘మేము ఫలానా ట్రైన్లో చూశాం. ఆ స్టేషన్లో చూశాం’ అని స్పందనలు పెట్టారు. చివరకు వెతికి వెతికి ఆమెను పట్టుకున్నారు అహ్లూవాలియా మనుషులు. ఆమె పేరు వజ్జీ... ‘నా కుటుంబంలో సమస్య వచ్చింది. అప్పటినుంచి చాక్లెట్లు అమ్ముతున్నా’ అని ఆమె చెప్పింది వజ్జీ. ఫౌండేషన్ సభ్యులు ఆమెకు వెంటనే పెద్ద ఎత్తున ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు. ‘నాకేం వద్దు. నాకు ఇలా బతకడమే బాగుంది’ అని చెప్పిందామె. ‘నా మనుషులు ఆమె చాక్లెట్లను రెట్టింపు రేటు ఇచ్చి కొందామన్నా ఆమె ఇవ్వలేదు. మామూలు రేటుకే ఇచ్చింది. ఇకపై ప్రతి వారం ఆమె చాక్లెట్లు మొత్తం మేము కొంటాం. ఎందుకంటే ఆ ఒక్క రోజు ఆమె అన్ని రైళ్లు తిరిగే అవస్థ తప్పుతుంది’ అని ట్వీట్ చేశాడు అహ్లూవాలియా. ‘ఆమె ఆత్మగౌరవం చూసి మేమందరం ఆమెకు మరింత అభిమానులం అయ్యాం’ అని నెటిజన్లు వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరికీ ఏవో సమస్యలు వస్తాయి. కాని వజ్జీలా నవ్వుతూ హుందాగా వాటిని ఎదుర్కొనడం తెలియాలి. వజ్జీ నుంచి గ్రహించాల్సిన పాఠం అదే. -
Kitchen Tips: గుడ్లు, చాక్లెట్లు, ఉల్లి.. ఇంకా వీటిని కూడా ఫ్రిజ్‌లో పెడుతున్నారా? అయితే
Why Should We Not To Store These Foods In Refrigerator: కూరగాయలు, పండ్లు... ఇలా ఏవైనా బయటి నుంచి కొనుక్కుని రాగానే శుభ్రం చేసి ఎక్కువ కాలం తాజాగా ఉండాలని ఫ్రిజ్‌లో పెట్టేస్తాం. అది కొంతవరకూ నిజమే. అయితే కొన్ని కూరగాయలు, పండ్లను ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల అవి వాటి సహజ గుణాలను కోల్పోతాయి. ఒక్కోసారి అవే మన అనారోగ్యానికి కారణమవుతాయి. అలాగని ఫ్రిజ్‌లో పెట్టవలసిన వాటిని పెట్టడం మానకూడదు. అయితే ప్రస్తుతానికి మనం ఫ్రిజ్‌లో ఏమేమి పెట్టకూడదో తెలుసుకుందాం. ఈ కింది వాటిని ఎప్పుడూ ఫ్రిజ్‌లో పెట్టకండి. వీటికి గది ఉష్ణోగ్రతే సరిపోతుంది. ఇంతకీ అవేమిటి? వాటిని ఫ్రిజ్‌లో పెడితే ఏమౌతుందో తెలుసుకుందాం. టమాటా: టమాటాలు ఫ్రిజ్‌లో పెడితే గట్టిపడిపోతాయి. వాసన కూడా పోతుంది. దీంతో మనం ఏదైనా వంటకం చేస్తే రుచీపచీ ఉండదు. కాబట్టి ఈసారి మీరు ఇంటికి టమాటాలు తీసుకువస్తే శుభ్రం చేసిన తర్వాత ఫ్రిజ్‌లో పెట్టకుండా బయట గది ఉష్ణోగ్రత వద్దే ఉంచడం మరచిపోకండి. అరటికాయలు: అరటికాయలను ఫ్రిజ్‌లో పెడితే తొందరగా నల్లబడిపోతాయి. ఇలా నల్లబడిన అరటికాయలను చూస్తూ చూస్తూ పారేయలేము. అలాగని తినలేము కూడా. ఒకవేళ తిన్నా కూడా రుచి ఉండదు. అందువల్ల ఫ్రిజ్‌లో పెట్టకుండా ఎక్కువ రోజులు అరటికాయలు తాజాగా ఉండాలంటే వాటిని తడి లేని ప్రదేశంలో ఉంచి ప్లాస్టిక్ కవర్ సగం వరకు తొడగండి. అరటి కాయలే కాదు, అరటి పండ్లు కూడా ఫ్రిజ్‌లో పెట్టకూడదు. ఆవకాడో: ఫ్రూట్స్‌లో కాసింత ఖరీదయినది అవకాడో. మరి అంత ఖరీదు పెట్టి అవకాడో కొన్నాం కదా అని దానిని తీసుకెళ్లి పదిలంగా ఫ్రిజ్‌లో పెట్టేయద్దు. దానివల్ల అవకాడో రుచి మారుతుంది. వాటిని తడి లేని చోట, గాలి మారే చోట భద్రపరిస్తే మంచిది. పుచ్చకాయ: ఇంటికి పుచ్చకాయ తెస్తే సగం కోసి మిగిలింది ఫ్రిజ్‌లో పెట్టేస్తాం. అందరి ఇళ్లల్లో జరిగేదే ఇది. కానీ, పుచ్చకాయని ఫ్రిజ్‌లో పెట్టడం వల్ల వాటిలోని యాంటీ ఆక్సిడెంట్స్‌ని కోల్పోతాం. ఫలితంగా పుచ్చకాయ తిన్నా కడుపు నిండుతుందేమో గానీ ఆరోగ్య ప్రయోజనాలు అందవు. వంకాయ: వంకాయలను ఫ్రిజ్‌లో పెడితే తొందరగా పాడైపోతాయి. ఇవి ఫ్రిజ్‌లో కంటే బయట ఉంటేనే తాజాగా ఉంటాయి. ఉల్లి, వెల్లుల్లి: వెల్లుల్లిపాయలు ఫ్రిజ్‌లో కంటే గాలి, వెలుతురు ఉండే చోట పెడితే నెలరోజులైనా ఫ్రెష్‌గా ఉంటాయి. వీటిని ఫ్రిజ్‌లో పెడితే జిగురు వస్తుంది. ఉల్లి కూడా అంతే! చాక్లెట్లు: చాలామంది పేరెంట్స్ చాక్లెట్లను ఫ్రిజ్‌లో పెట్టి పిల్లలు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి ఇస్తుంటారు. అయితే అలా ఫ్రిజ్‌లో పెట్టిన చాక్లెట్లు ఆరోగ్యానికి అంత మంచిది కాదు. పైగా ఫ్రిజ్ లో పెట్టడం వల్ల చాక్లెట్లకు ఉండే సహజమైన రుచి, ఫ్లేవర్ దెబ్బతింటాయి. అయితే బయటపెట్టినా వీటిని ఎండలో కాకుండా కాంతి కిరణాలకు దూరంగా ఉంచడం మంచిది. గుడ్లు: చాలామంది ఇళ్లలో ఫ్రిజ్ తెరవగానే ఎగ్ ట్రేస్ దర్శనమిస్తాయి. అయితే ఎగ్స్‌ని ఎప్పుడూ ఫ్రిజ్‌లో పెట్టకూడదు. మార్కెట్లలో కూడా గుడ్లను ఫ్రిజ్‌లో ఉంచరు. వీలయినంత వరకు వీటిని బయట ఉంచితేనే బెటర్. బ్రెడ్: బ్రెడ్‌ని ఫ్రిజ్‌లో ఉంచితే తొందరగా పాడవుతుంది. అది త్వరగా ఎండిపోతుంది. బ్రెడ్ ప్యాకెట్ ఓపెన్ చేసిన తర్వాత కూడా బయట ఉంచితే అది ఫ్రెష్‌గా ఉంటుంది. బత్తాయి పండ్లు: సిట్రస్ యాసిడ్ ఉన్న బత్తాయిలు ఫ్రిజ్‌లో ఉంచితే త్వరగా పాడైపోతాయి. అదే విధంగా... తేనె, కాఫీ గింజలు, కెచప్, పీనట్ బటర్, దోసకాయలు, స్ట్రాబెర్రీస్‌లను ఫ్రిజ్‌లో పెట్టద్దు. మరేం చేయాలి.. అని చికాకు పడకండి. మరీ సంచులు సంచులు కాకుండా వారానికి సరిపడా కూరగాయలు, పండ్లు తెచ్చుకోండి చాలు. ఆ తర్వాత మళ్లీ తాజాగా తెచ్చుకుంటే సరి. అప్పుడు అనారోగ్యాలు మీ దరి చేరవు. చదవండి: Health Tips: బోడ కాకర తరచుగా తింటున్నారా? దీనిలోని లుటీన్ వల్ల.. -
ఎన్నో ప్రయోజనాలు.. ఎంచక్కా చాక్లెట్లు లాగించేయొచ్చు! కానీ..
కిస్ మీ.. క్లోజ్ యువర్ ఐస్.. అండ్ మిస్ మీ.. క్లోజ్ యువర్ ఐస్.. అంటూ టీవీలో వచ్చే ఓ యాడ్ మనల్ని మెస్మరైజ్ చేస్తుంది. ఆ యాడ్ చూస్తుంటే.. చిన్నారుల నుంచి పెద్దవాళ్ల వరకు నోరూరుతుందంటే అతిశయోక్తి కాదేమో! విదేశాల నుంచి మనకు తెలిసిన బంధువులు వస్తే.. మొదటి ప్రశ్న ఏలా ఉన్నారు? వెంటనే మరో ప్రశ్న.. చాక్లెట్లు తీసుకొచ్చారా? ఇదంతా ఎందుకంటారా? ఈ రోజు చాక్లెట్ దినోత్సవం. ఏదైనా శుభకార్యం చేసుకున్నప్పుడు నోరు తీపి చేస్తుంటాం. అపురూపంగా చాక్లెట్‌ను తీసుకుని తింటూ పంచే వారికి విషెస్ చెబుతాం. చాక్లెట్లను ఇష్టపడని వారుండరు. ముఖ్యంగా చిన్న పిల్లలు తెగతింటారు. ఒక్క రూపాయి మొదలుకొని వేల రూపాయల్లో ఉండే చాక్లెట్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. చాక్లెట్ డే సందర్భంగా ఈ రోజు తియ్యని వేడుక చేసుకుందామా? – పెదగంట్యాడ(గాజువాక) చాకొలెట్.. ఇది ఒక తీపి పదార్థం. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుంది. గొంతులో కమ్మగా దిగిపోతుంది. మంచి అనుభూతిని పంచుతుంది. తీపి అనేది శుభ సూచకం. పుట్టినరోజు వేడుక వచ్చిందంటే.. చాక్లెట్లు ఉండాల్సిందే.. వాటిని అందరికీ పంచాల్సిందే.! ప్రేమికుల రోజు నాడు కూడా పూలతో పాటు చాక్లెట్ ఇవ్వడం కూడా ఆనవాయితీ. ఇవే కాదు.. ఏ వేడుక అయిన చాక్లెట్లతోనే నిండిపోతోంది.. చిన్నారులకైతే చాక్లెట్లంటే చెప్పలేనంత ఇష్టం.. ఇళ్లలో ఉన్న చాక్లెట్ల డబ్బాలను ఖాళీ చేసే వరకూ నిద్రపోరు. ఇలా నగరం నోరు తీపి చేసుకుంటోంది. చాక్లెట్ రుచికి దాసోహమంటోంది. పుట్టిన రోజైనా.. ప్రేమికుల దినమైనా.. పరీక్షల్లో పాసైనా, ఆనందించే ఊసేదైనా.. ‘చాక్లెట్ పార్టీ’ తప్పనిసరి అంటోంది. దేశవ్యాప్తంగా పెరుగుతున్న చాకొలెట్ క్రేజ్‌లో సిటీ గణనీయమైన వాటా పంచుకుంటోంది. రూపాలెన్నో... రుచి ఒకటే.. ఒకప్పుడు అంటే రాపర్లలో చుట్టిన చిన్న చిన్న చాక్లెట్లు, ఆ తర్వాత డైరీ మిల్క్ లాంటివి... అలా కొన్నే ఉండేవి. ఇప్పుడు విభిన్న రకాల్లో అందుబాటులో ఉన్నాయి. విభిన్న రకాల ఫ్లేవర్లు, ముడి దినుసులలో సులువుగా కలిసిపోయే సుగుణం చాక్లెట్‌ను మరింతగా ప్రేమించేలా చేస్తోంది. ఐస్‌క్రీమ్స్, మిల్క్‌షేక్స్.. ఇలా ప్రతి దానిలో చాక్లెట్స్ ఒదిగిపోతున్నాయి. పండ్ల దగ్గర్నుంచి లిక్కర్ దాకా ప్రతిదానికీ జత కడుతున్నాయి. సిరప్‌లతో సహా విభిన్న రూపాల్లో చాక్లెట్లు వినియోగించడం సిటీలో బాగా పెరిగింది. దీంతో చిన్నాపెద్దా తేడా లేకుండా చాకో క్రేజ్‌లో మునిగి తేలుతున్నారు. చాక్లెట్ ఐస్‌క్రీమ్, చాక్లెట్ బార్, చాక్లెట్ బాల్స్, చాక్లెట్ మౌంటెన్, వైట్ చాక్లెట్, మెల్టెడ్ చాక్లెట్, చాక్లెట్ కప్ కేక్, హాట్ చాక్లెట్, మిల్క్ చాక్లెట్ .. ఇలా వందల రకాలు సిటీలో అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్లో ఆర్డర్ చేయగానే మన చెంతకు చేరుతున్నాయి. బిస్కెట్ల కంపెనీలు కూడా ఇప్పుడు చాక్లెట్ల రుచులతోనే తయారు చేస్తున్నాయి. చాకెట్ల అందించే ప్రత్యేక షాపులు వెలిశాయి. కేక్ షాపుల్లో చాక్లెట్లే క్రేజ్. ఈట్.. చాక్లెట్ ఏదైనా ఫుడ్ కాస్త హెవీగా తీసుకున్న తర్వాత చాకొలెట్‌ను ఎంజాయ్ చేయడం బాగా పెరిగింది. డిన్నర్, స్నాక్స్ పూర్తి చేసిన తర్వాత కూడా సిటీజనులు లెట్స్ చాక్లెట్ అంటున్నారు. బ్రేక్‌ఫాస్ట్, లంచ్ తర్వాత కూడా వీటి వినియోగం బాగా ఉంటోంది. ముఖ్యంగా వారాంతాల్లో ఈ ట్రెండ్ మరింతగా కనిపిస్తోంది. చాక్లెట్ మోమో, చాక్లెట్ పిజ్జా, శాండ్విచ్, చాక్లెట్ గ్రిల్డ్ శాండ్విచ్, చాక్లెట్ టోస్ట్ వంటివి ఆన్లైన్ ద్వారా బాగా ఆర్డర్లు అందుకుంటున్న వాటిలో ఉన్నాయి. చాక్లెట్ కుకీ, చాక్లెట్ పేస్ట్రీస్ తదితర చాకెట్లు ఉత్పత్తులను బాగా ఆర్డర్ చేస్తున్నారని ఓ సర్వేలో తేలింది. ఈ రోజే ఎందుకు? ఏటా జూలై 7న ప్రపంచ చాక్లెట్ దినోత్సవం నిర్వహిస్తున్నారు. చాక్లెట్లు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు గురించి ప్రజల్లో అవగాహన కలిగించడం కోసం ఈ దినోత్సవం జరుపుకొంటున్నారు. జూలై 7న ఐరోపాలో మొదటిసారిగా చాక్లెట్ తయారైందని లభించిన ఆధారాల వల్ల తెలుస్తోంది. దానికి గుర్తింపుగా తొలిసారిగా 2009, జూలై 7న ప్రపంచ చాక్లెట్ దినోత్సవం నిర్వహించారు. అప్పటినుంచి కొనసాగిస్తున్నారు. ఆరోగ్యానికి మేలు ►డార్క్ చాక్లెట్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ►కోకో చెట్టు నుంచి సేకరించిన విత్తనాలతో దీనిని తయారు చేస్తారు. ►రుచితో పాటు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అనేక గుణాలు కలిగి ఉంది. ►డార్క్ చాక్లెట్లు శరీరంలోని రక్త సరఫరాను మెరుగుపరస్తుంది. ►రక్తపోటు సమస్య నుంచి రక్షిస్తుంది. ►రక్తం గడ్డ సమస్య నుంచి కూడా కాపాడుతుంది. ►మెదడు నుంచి గుండెకు రక్తాన్ని సాఫీగా సాగేలా చూస్తుంది. ►యాంటీ ఆక్సి డెంట్లు పుష్కలంగా ఉంటాయి. ►డార్క్ చాక్లెట్లలో ముఖ్యంగా ఐరస్, మెగ్నీషియం, కాపర్ కలిగి ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. చాక్లెట్ల వల్ల కలిగే నష్టాలు ►మితంగా తింటే మేలు చేస్తాయని.. అమితింగా తింటే కీడు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ►అధికంగా చాక్లెట్లు తినే అలవాటు ఉన్న వారికి వేగంగా ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంది. ►దీని వల్ల వారు మిగతా ఆహారాన్ని నిర్లక్ష్యం చేస్తారని వైద్యులు అంటున్నారు. ►అంతేకాకుండా చాక్లెట్లు ఎక్కువగా తినే పిల్లల్లో కూడా పళ్లు పుచ్చిపోయే ప్రమాదం ఉంటుందంటున్నారు. ►పళ్లు పాడయ్యే ప్రమాదం ఉంది ►రాత్రి వేళల్లో చిన్నారులు చాక్లెట్లు తిని పడుకుంటే పిప్పి పళ్లు వచ్చే ప్రమాదం ఉంది. ►ఒకవేళా తిన్నా.. వెంటనే బ్రష్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ►ఎక్కువగా చాక్లెట్లు తినడం మంచిది కాదు. ఆరోగ్యానికి మేలు చేసేవి మాత్రమే తినాలి. –డాక్టర్ వి.సుజిత్‌కుమార్, దంత వైద్యుడు ఊబకాయం వస్తుంది ఎక్కువగా చాక్లెట్లు తినడం వల్ల ఊబకాయం వచ్చే ప్రమాదం ఉంది. ఇతర ఆహారంపై ఆసక్తి ఉండదు. శరీరం మాత్రం భారీగా పెరిగిపోతుంది తప్ప దానికి అవసరమైన ప్రోటీన్స్ అందవు. దీని వల్లే ఇతరత్రా అనారోగ్య సమస్యలు కూడా వస్తుంటాయి. –డాక్టర్ రమేష్‌బాబు, వైద్యాధికారి, పెదగంట్యాడ పీహెచ్సీ చాక్లెట్ అంటే చాలా ఇష్టం చాక్లెట్ అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఎక్కువగా తినేదానిని. ఇప్పుడు ఈ అలావాటు నాతో పాటు నా భర్తకు, పిల్లలకు కూడా వచ్చేసింది. రోజులో ఒక్కసారైనా.. ఒక్క చాక్లెట్ అయినా తినకుండా ఉండేలేం. వేడుకల్లో కూడా చాక్లెట్లే మాకు ప్రత్యేకం. – కె.శ్రీలక్ష్మి, పెదగంట్యాడ చదవండి: World Zoonoses Day: కని‘పెట్’కుని ఉండాలి..! లేదంటే కష్టమే! -
పిల్లలు పక్క తడుపుతున్నారా? క్రాన్బెర్రీ జ్యూస్, అరటిపండ్లు.. ఇంకా ఇవి తినిపిస్తే మేలు!
Bed Wetting Problem In Children: సాధారణంగా పసిపిల్లలు తరచుగా పక్కతడుపుతుంటారు. ఈ సమస్య పిల్లలు ఒక నిర్ధిష్టమైన వయస్సుకు వచ్చేవరకు కొనసాగుతుంది. అయితే కొందరు పిల్లలు ఆరు సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఈ అలవాటును కొనసాగిస్తుంటే అది తల్లిదండ్రులకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. చల్లటి వాతావరణం, నిద్రపోయే ముందు అధిక ద్రవాలను తీసుకోవడం వంటి కారణాల వల్ల ఈ సమస్య తలెత్తవచ్చు. పిల్లలు 6, 7 సంవత్సరాల వయస్సు దాటుతున్నా కూడా పక్క తడిపే అలవాటు ఉన్నట్లయితే దీనికి అనేక కారణాలు ఉంటాయి. అవేంటంటే.. కారణాలు! ►పిల్లల మూత్రాశయం తక్కువగా అభివృద్ధి చెందడం లేదా ఇంకా అభివృద్ధి చెందుతున్న దశలోనే ఉండడం కూడా ఒక కారణం. ఈ సమస్య తో ఉన్న పిల్లలు ఎక్కువ సేపు మూత్రం నియంత్రించలేని స్థితికి చేరుకోవడం జరుగుతుంది. ►పిల్లాడు ఆహారంలో అధికంగా కెఫిన్ లేదా డైయూరిటిక్స్ వంటివి ఎక్కువగా ఉన్నా కూడా మూత్రం ఉత్పత్తి పెరుగుతుంది. ►మధుమేహం ఉన్నా కూడా పిల్లలకు మూత్ర నియంత్రణ ఉండదు. ►యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వచ్చినా, ఒత్తిడి లేదా మానసిక సమస్యలున్నా కూడా మూత్ర నియంత్రణ ఉండదు. ►కాబట్టి పై కారణాల్లో ఏదో వైద్యుని సహాయంతో తెలుసుకుని తగిన చికిత్సను అందించాలి. క్రాన్బెర్రీ జ్యూస్ తాగిస్తే! ►ఇవే కాకుండా జీవనశైలిలో మార్పులు, ఆహార ప్రణాళికలో మార్పులను జోడించి, ఇంట్లో కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా కూడా దీన్ని నియంత్రించవచ్చు. ►పక్క తడపడం తగ్గించడంలో క్రాన్బెర్రీ జ్యూస్ ఉత్తమంగా పనిచేస్తుంది. ఈ జ్యూస్ రాత్రి పడుకోబోయే ముందు తీసుకోవడం ద్వారా సమస్యను తగ్గించవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ సమస్యను తగ్గించడంలో ఎంతో కీలకంగా పనిచేస్తుంది. తృణధాన్యాల వల్ల ►సహజ సిద్ధమైన ఫైబర్ సమృద్ధిగా ఉండే వాల్నట్స్, కిస్మిస్లు.. పక్క తడిపే పిల్లల సమస్యను నిరోధించడానికి చక్కగా ఉపయోగపడతాయి. వీటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇవి పిల్లల పెరుగుదలకు సహాయపడే ముఖ్య ఖనిజం. ►తృణధాన్యాలు పిల్లల్లో నీటి నిలుపుదల సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగపడతాయి. ఓట్స్, ఫుడ్రైస్, కార్న్‌ఫ్లేక్స్, గోధుమ పొట్టు వంటి ధాన్యాలు పక్క తడిపే అలవాటును తగ్గిస్తాయి. అరటిపండ్లతో అద్భుతం ►ఈ సమస్యకు అరటిపండ్లు అద్భుతమైన గృహ చిట్కాగా ఉపయోగపడతాయి. ఈ పండు జీర్ణవ్యవస్థకు సహకారాన్ని అందివ్వడమే కాకుండా మూత్రాశయంలో అదనపు ద్రవాన్ని నిరోధించడంలో ఉత్తమంగా ఉపయోగపడుతుంది. ►దాల్చిన చెక్క, తేనెలో ఉండే గుణాలు పిల్లల్లో పక్క తడిపే అలవాటును నివారిస్తాయి. ఇవి పీడియాట్రిక్ డయాబెటిస్ సమస్య చికిత్సలో కూడా సహకారాన్ని అందివ్వగలవు. తులసి ఆకులను వేయించి తేనెతో కలిపి ఇస్తే ►ఈ సమస్యను తగ్గించడంలో తులసిని పూర్వీకుల వైద్యంగా చెప్పారు. కొన్ని తులసి ఆకులను వేయించి తేనెతో కలిపి ఇవ్వడం వల్ల సమస్య తగ్గిపోతుంది. ►మూత్రాశయం నిండినప్పుడు బాత్రూమ్కు వెళ్లాలి అని పిల్లలకి తరచూ చెబుతుండాలి. ఎందుకంటే కొంతమంది పిల్లలు సోమరితనం, మొండితనం వల్ల సరైన సమయానికి బాత్రూమ్కి వెళ్లకుండా లేటు చేస్తుంటారు. ఇవి తినకూడదు ►స్వీట్లు, చాక్లెట్ల తయారీలో ఉపయోగించే కృత్రిమ రసాయనాలు, చక్కెరలు పిల్లల్లో రాత్రి సమయంలో కొన్ని జీవక్రియలకు దారితీయొచ్చు. కాబట్టి రాత్రి నిద్రపోయే ►ముందు స్వీట్లు, చాక్లెట్ల జోలికి పిల్లలు వెళ్లకుండా చేయాలి. ►రాత్రి పడుకునేముందు ఎక్కువ మంచినీరు, జ్యూస్‌లు తాగకుండా చేయాలి. ఇలా చేయాలి! ►పడుకునే ముందు పిల్లలను బాత్రూమ్కి వెళ్లమని చెప్పాలి. ►వీలైతే మధ్య రాత్రులలో క్రమం తప్పకుండా పిల్లలను బాత్రూమ్కు తీసుకెళ్లాలి. ఇలా తరచూ చేస్తుంటే పిల్లలు త్వరలోనే ఈ అలవాటును మానేస్తారు. చదవండి: Health Tips: ఇవి తరచుగా తింటే ప్లేట్లెట్స్ కౌంట్ పెరుగుతుంది! అంతేకాదు.. -
మూడ్స్ బాగు చేసి ఆరోగ్యాన్నీ, ఆనందాన్నిపెంచే చాక్లెట్స్!
‘బార్’ కంటే ‘చాకోబార్’ మేలనీ... ‘ఆల్కహాల్’ ఆరోగ్యానికి చేటు కాగా... దానికి భిన్నంగా ‘చాకో’హాలికులు (పరిమితంగానే) కావడం హెల్త్‌కే కాదు... మంచి మూడ్స్‌కీ మంచిదంటున్నారు పరిశోధకులు. డార్క్ చాక్లెట్లు గుండెకు మేలు చేస్తాయనీ, వాటితో మంచి ఆరోగ్యం సమకూరుతుందని ఇప్పటికే కొన్ని అధ్యయనాల్లో తేలినా... ఇప్పుడు దక్షిణ–కొరియన్ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో తాజాగా మరెన్నో విషయాలు వెల్లడయ్యాయి. చాకోలెట్‌లో ఉండే పదార్థాలు మన జీర్ణవ్యవస్థలో నెలవై ఉండే... మనకు మేలు చేసే సూక్ష్మజీవుల (మైక్రోబ్స్)పై చూపే ప్రభావం వల్ల మనం మరింత ఆరోగ్యకరంగా మారతామని అంశం వాళ్ల పరిశోధనల్లో వెల్లడైంది. అంతేకాదు... 85 శాతం డార్క్ చాక్లెట్ మోతాదులతో... ఒకింత తక్కువ పాళ్లలో చక్కెర కలిగి ఉన్న 30 గ్రాముల చాక్లెట్‌ను రోజూ మూడు సార్లు చొప్పున తీసుకుంటే... మనుషుల మూడ్స్ బోలెడంత బాగుపడి... మనుషులు చాలా ఆనందంగా ఉల్లాసంగా ఉంటారనీ, అది పూర్తి (ఓవర్ ఆల్) ఆరోగ్యానికి మేలు చేస్తుందంటున్నారు. డార్క్ చాక్లెట్‌లోని ‘కోకో’లో ఫైబర్, ఐరన్‌తో పాటు ఫైటోకెమికల్స్ క్యాన్సర్లు, మతిమరపు (డిమెన్షియా), ఆర్థరైటిస్, గుండెజబ్బులు, పక్షవాతం వంటి అనేక సమస్యలను సమర్థంగా నివారిస్తాయనీ దక్షిణకొరియాలోని సియోల్ నేషనల్ యూనివర్సిటీకి చెందిన కాలేజ్ ఆఫ్ హ్యూమన్ ఎకాలజీలోని ఫుడ్ అండ్ న్యూట్రిషన్ విభాగం నిర్వహించిన పరిశోధనల్లో వెల్లడయ్యాయి. ఇప్పటివరకూ సానుకూల భావోద్వేగాలకూ చాక్లెట్‌కు ఉన్న సంబంధాల గురించి పరిమితంగానే తెలిసినా... ఈ తాజా పరిశోధనలతో అవి మూడ్స్‌ను ఎంతగా ప్రభావితం చేస్తాయన్న సంగతులు మరింత విపులంగా తెలిశాయంటున్నారు పరిశోధకులు. కొంత పరిమిత మోతాదుల్లో రోజూ మూడుసార్లు చాక్లెట్స్ ఇస్తూ ఇందులో పాల్గొన్న అభ్యర్థుల ‘పాజిటివ్ అండ్ నెగెటివ్ ఎఫెక్ట్ షెడ్యూల్’ (పీఏఎన్ఏఎస్)ను పరిశీలించి, వారి ఫీలింగ్స్‌ను తెలపాలంటూ నిర్వాహకులు కోరారు. అప్పుడు అభ్యర్థుల నుంచి వెల్లడైన అంశాలను చూసినప్పుడు ‘సైకలాజికల్ స్కేల్’పై సానుకూల అంశాలే అత్యధికంగా నమోదయ్యాయని, దాంతో మూడ్స్ ఎలివేషన్‌కు చాక్లెట్లు సమర్థంగా తోడ్పడతాయంటూ వెల్లడైంది. అంతేకాదు... ఇలా చాక్లెట్స్ తిన్నవారి మలపరీక్షలూ నిర్వహించారట. ఆ పరీక్షల విశ్లేషణలో తేలిన అంశాలేమిటంటే... వారి మలంలో ‘బ్లావుషియా’ అనే ప్రోబయాటిక్ బాక్టీరియా ఎక్కువ మోతాదులో ఉందనీ, ఈ తరహా బ్యాక్టీరియా కడుపు (గట్)లో ఉండటం వల్ల సంతోషంగా, ఆహ్లాదంగా ఉండే అవకాశాలూ పెరిగి మూడ్స్ మరింత బాగుంటాయాని వెల్లడైంది. ఈ అధ్యయన ఫలితాలన్నీ ‘‘ద జర్నల్ ఆఫ్ న్యూట్రిషనల్ బయోకెమిస్ట్రీ’’ అనే మెడికల్ జర్నల్‌లో ఇటీవలే ప్రచురితమయ్యాయి. -
దొంగ తెలివి... చాక్లెట్లు కూడా బంగారమే!
శంషాబాద్: అక్రమంగా తీసుకొచ్చిన బంగారాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రియాద్ నుంచి జజీరా ఎయిర్‌లైన్స్ విమానంలో సోమవారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ప్రయాణికుడి కదలికలు అనుమానాస్పదంగా కనిపించాయి. దీంతో కస్టమ్స్ అధికారులు అతడిని క్షుణ్నంగా తనిఖీ చేశారు. అతడి సామగ్రిలో చాక్లెట్లు, బిస్కెట్లలో 763 గ్రాముల బరువు కలిగిన బంగారు బిస్కెట్లు, నాణేలు బయటపడ్డాయి. వాటి విలువ 32.24 లక్షలు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేశారు. చదవండి: ‘డ్రోన్ డెలివరీ’ అద్భుతం: వరద ప్రభావిత ప్రాంతాల్లో మందుల సరఫరా’ -
1990లలో తీసిన క్యాడ్బరీ యాడ్ గుర్తుందా? అది ఇప్పుడు రివర్స్‌గా..
క్యాడ్బరీ డైరీ మిల్క్ చాకొలెట్లు అంటే పెద్దలు నుంచి చిన్న పిల్లలు వరకు ఇష్టపడని వారు ఉండరు. అలాగే ఈ క్యాడ్బరీ డైరీ మిల్క్ చాకొలెట్ అడ్వర్టైస్మెంట్ ఎంతగా ప్రజల దృష్టిని ఆకర్షించిందో అందరికి తెలిసిందే. 1990లలో తీసిన అడ్వర్టైస్మెంట్ ఇప్పుడు వస్తున్న అడ్వర్టైస్మెంట్కి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. కొంత మంది ట్విట్టర్లో ప్రశంసిస్తుంటే మరికొంత మంది విమర్శిస్తున్నారు. ఇంతకీ ఆ కథ ఏంటంటే.... (చదవండి: వ్యాక్సిన్ తీసుకుని మోదీకి బహుమతిగా ఇద్దాం’) క్రికెట్ తమ ఆరాధ్య క్రీడగా భావించే మన దేశంలో 1990లో వచ్చిన క్యాడ్బరీ డైరీ మిల్క్ చాకొలెట్ అడ్వర్టైస్ మెంట్ గురించి తెలియని వారు ఉండరు. ఆ సమయంలో కేవలం పురుషుల క్రికెట్ మ్యాచ్‌లు మాత్రమే జరిగేవి. ఈ క్రమంలో కాలనుగుణంగా క్యాడ్బరీ ప్రకటన రూపకర్త ఓగిల్వి మంచి అడ్వర్టైస్మెంట్ రూపొందించారు. ఇందులో ఒక అమ్మాయి పూల డ్రస్ వేసుకుని క్యాడ్బరీ చాకొలెట్ తింటూ స్టేడియంలో మ్యాచ్ వీక్షిస్తుంటోంది. తన బాయ్‌ఫ్రెండ్ మ్యాచ్ గెలిచిన వెంటనే ఆనందంతో నృత్యం చేసుకుంటూ సెక్యూరిటీని తప్పించుకుని మైదానంలోకి వచ్చేస్తుంది. పైగా దీనికి "అస్లీ స్వాద్ జిందగీ కా" (జీవితంతో నిజమైన రుచి) ట్యాగ్‌లైన్ జోడించడంతో ప్రజల దృష్టి క్రికెట్ నుంచి మరల్చకుండా చాలా బాగా ప్రజలకు చేరువైంది. అప్పటి వరకు పిల్లలకు మాత్రమే చాకొలెట్లు అనే దానిని చెరిపేసినట్లుగా చాలా బాగా ప్రేక్షకుల మనస్సుకు హత్తుకునేలా ప్రకటనను రూపొందించారు. తదనంతరం ప్రస్తుతం మహిళల క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతుండటంతో చిన్న చిన్న మార్పులతో అదే అడ్వర్టైస్మెంట్ రూపొందించింది. అప్పుడు అమ్మాయి బాయ్ ఫ్రెండ్‌కోసం నృత్యం చేస్తే ఇప్పుడు అమ్మాయి కోసం బాయ్ ఫ్రెండ్ నృత్యం చేసినట్లు రూపొందించారు. ఇది కూడా ప్రేక్షకులకు చేరువైంది గానీ కొత్తదనం కోరుకుంటున్నామంటూ నెటిజన్లు ట్విట్ చేస్తున్నారు. మరికొంతమంది లింగఅసమానతకు తావు లేకుండా కాలానుగుణంగా రూపొందిస్తున్నారంటూ ప్రశంసిస్తూ ట్వీట్ చేస్తున్నారు. Oh wow!! Take a bow, Cadbury Dairy Milk and Ogilvy :) A simple, obvious twist that was long overdue, and staring right at all of us all this while! pic.twitter.com/Urq8NXtg7W — Karthik 🇮🇳 (@beastoftraal) September 17, 2021 (చదవండి: యూఎస్ నేషనల్ సైన్స్ బీ పోటిల్లో రెండో స్థానంలో ఢిల్లీ బాలుడు) -
నోరూరించే డేట్స్ డోనట్స్, ఆపిల్ చాక్లెట్ వొంటన్స్ తయారీ ఇలా!
నోరూరించే డేట్స్ డోనట్స్, ఆపిల్ చాక్లెట్ వొంటన్స్, ప్రాన్స్- ఎగ్బాల్స్ ఇంట్లోనే ఇలా సింపుల్‌గా తయారు చేసుకోండి. డేట్స్ డోనట్స్ కావలసినవి: మైదాపిండి – 2 కప్పులు పంచదార పొడి – 1 కప్పు, వైట్ వెనిగర్, వెనీలా ఎసెన్స్, బేకింగ్ సోడా – 1 టీ æస్పూన్ చొప్పున, ఉప్పు – అర టీ స్పూన్, మజ్జిగ – ముప్పావు కప్పు, గుడ్లు – 2, పంచదార పొడి – అర కప్పు ఖర్జూరం – 6 (గింజలు తీసి, గుజ్జులా చేసుకోవాలి) నూనె – 2 టేబుల్ స్పూన్లు, నీళ్లు – 2 టేబుల్ స్పూన్లు, హెవీ క్రీమ్ – అర కప్పు, ఉప్పు – 1 టేబుల్ స్పూన్ తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మైదాపిండి, పంచదార పొడి, బేకింగ్ సోడా, మజ్జిగ, వెనీలా ఎసెన్స్, గుడ్లు, నూనె, వైట్ వెనిగర్, ఖర్జూరం గుజ్జు, తగినంత ఉప్పు వేసుకుని బాగా కలిపి పెట్టుకోవాలి. ►డోనట్స్ మేకర్‌కి కొద్దిగా నూనె పూసి, ఆ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా పెట్టుకుని, ఓవెన్లో కుక్ చేసుకోవాలి. ►అనంతరం ఒక కళాయిలో హెవీ క్రీమ్, నీళ్లు, కొద్దిగా ఉప్పు, పంచదార పొడి వేసుకుని.. పాకం పట్టించి.. సర్వ్ చేసుకునే ముందు డోనట్స్పైన వేసుకుంటే భలే రుచిగా ఉంటాయి. ఆపిల్ చాక్లెట్ వొంటన్స్ కావలసినవి: ఆపిల్ గుజ్జు – పావు కప్పు చాక్లెట్ పౌడర్ – 3 టేబుల్ స్పూన్లు జీడిపప్పు, వాల్నట్స్, బాదం పప్పు – 4 టేబుల్ స్పూన్ల చొప్పున (నేతిలో దోరగా వేయించి మిక్సీలో పౌడర్ చేసుకోవాలి) గుడ్డు తెల్లసొన – 1 పంచదార పొడి – అభిరుచిని బట్టి చీజ్ – 2 టేబుల్ స్పూన్లు వొంటన్ రేపర్స్ – 20 (మార్కెట్లో దొరుకుతాయి) నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: ముందుగా ఒక బౌల్లో ఆపిల్ గుజ్జు, చాక్లెట్ పౌడర్, జీడిపప్పు మిశ్రమం, పంచదార పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. అందులో చీజ్, గుడ్డు తెల్లసొన వేసుకుని బాగా కలిపి ముద్దలా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా వొంటన్ రేపర్స్‌లో పెట్టుకుని.. నచ్చిన షేప్‌లో మడిచి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే అభిరుచిని బట్టి పంచదార పొడితో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. ప్రాన్స్–ఎగ్ బాల్స్ కావలసినవి: రొయ్యలు – అర కిలో (శుభ్రం చేసుకుని.. ఉప్పు, కారం, పసుపు దట్టించి కుకర్‌లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉంచి తీసుకోవాలి. చల్లారాక చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి) మిరియాల పొడి – అర టీ స్పూన్ సోయా సాస్ – 2 టేబుల్ స్పూన్లు అల్లం–వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి పేస్ట్ – పావు టేబుల్ స్పూన్ ఉల్లిపాయల పేస్ట్ – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు గుడ్డు – 1 మొక్కజొన్న పిండి – 2 టేబుల్ స్పూన్లు బ్రెడ్ పౌడర్ – పావు కప్పుతో పాటు 4 టేబుల్ స్పూన్లు అదనంగా కూడా ఉప్పు – తగినంత, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: ముందుగా రొయ్యల ముక్కల్లో మిరియాల పొడి, సోయాసాస్, అల్లం–వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, ఉల్లిపాయల పేస్ట్, పావు కప్పు బ్రెడ్ పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. అందులో గుడ్డు, మొక్కజొన్న పిండి, తగినంత ఉప్పు వేసుకుని బాగా కలిపి ఉండల్లా చేసుకుని అదనంగా తీసుకున్న బ్రెడ్ పౌడర్‌లో అటు ఇటు తిప్పి.. ప్రతి ఉండకు బ్రెడ్ పౌడర్ పట్టించి 20 నిమిషాలు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. ఆపైన నూనెలో డీప్ ఫ్రై చేసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. -
ఫైవ్‌స్టార్ చాక్లెట్స్‌తో పాఠశాలకు ఆహ్వానం
కరీంనగర్ మండలం నగునూరు పాఠశాలలో హెచ్ఎం కట్ట వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో విద్యార్థులకు ఉపాధ్యాయులు ఫైవ్‌స్టార్ చాక్లెట్లతో స్వాగతం పలికారు. కరీంనగర్‌లోని మంకమ్మతోటలో గల ధన్గర్‌వాడీ పాఠశాలలో ప్రార్థన సమయంలో విద్యార్థిని సాయి స్పృహతప్పి పడిపోగా, ఉపాధ్యాయుడు ప్రథమ చికిత్స చేశాడు. సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘పొద్దున లేవాలి.. స్నానం చేయాలి.. బడికెళ్లాలి.. ప్రార్థన చేయాలి, పాఠాలు వినాలి.. మైదానంలో ఆడాలి.. సాయంత్రానికి మాసిన బట్టలతో ఇంటికి చేరుకోవాలి.. ఇదే ప్రపంచంలో ఎక్కడైనా విద్యార్థి దినచర్య. కానీ, కరోనా మహమ్మారి దెబ్బకు ఏడాదిన్నరగా విద్యార్థుల దినచర్య పూర్తిగా స్తంభించిపోయింది. నిత్యం స్మార్ట్ఫోన్లలో పాఠాలు విన్న విద్యార్థులకు బుధవారం నుంచి ప్రత్యక్ష బోధన మొదలైంది. ఏడాదిన్నర అనంతరం పాఠశాలకు వెళ్తున్నామనే హుషారు విద్యార్థుల్లో కనబడింది. కరోనా వల్ల పాఠశాలలకు దూరమైన విద్యార్థినీ విద్యార్థులకు ప్రత్యక్ష బోధనకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు బడిబాట పట్టారు. కరోనా నేపథ్యంలో విద్యార్థులు మాస్కులు ధరించి పాఠశాల, కళాశాలలకు హాజరవ్వడం కనిపించింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యాసంస్థల యాజమాన్యాలు ప్రత్యక్ష తరగతులు నిర్వహించాయి.’ చదవండి: కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్‌కు దరఖాస్తులు ఆహ్వానం 18 నెలల అనంతరం..! గతేడాది మార్చి 23 నుంచి దేశవ్యాప్తంగా విధించిన లాక్డౌన్లో భాగంగా విద్యాసంస్థలు మూతబడ్డాయి. 2019–20 విద్యాసంవత్సరానికి గాను పదో తరగతి, ఇంటర్, కొన్ని ఉన్నత విద్యలకు సంబంధించి ప్రభుత్వం నేరుగా పాస్ చేశారు. 2020–21 విద్యా సంవత్సరంలోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. సెకండ్ వేవ్ ముగియడం, ప్రత్యక్ష బోధన కొరవడటంతో విద్యార్థుల్లో విద్యాప్రమాణాలు పడిపోతాయన్న ఆందోళనతో ప్రభుత్వం కూడా ప్రత్యక్ష బోధన వైపు మొగ్గుచూపింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు దాదాపు 18 నెలల అనంతరం విద్యార్థులు బడిబాటపట్టడం గమనార్హం. పాఠశాలల్లో 21.11 శాతం, కళాశాలల్లో 22.65 శాతం.. పాఠశాలలు, కళాశాలల పునఃప్రారంభమైన తొలిరోజు హాజరు శాతం అతి తక్కువ నమోదు కావడం గమనార్హం. విద్యార్థులను బలవంతం చేయొద్దని, ఆన్లైన్, ఆఫ్‌లైన్ విద్యార్థుల కోరిక మేరకు విద్యాసంస్థల యజమానులు వ్యవహరించాలని వచ్చిన వార్తలతో తొలిరోజు విద్యార్థులు, తల్లిదండ్రులు గందరగోళానికి గురికావడంతోనే హాజరు శాతం తగ్గిందని ఉపాధ్యాయ వర్గాలు పేర్కొన్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాలలను శుభ్రం చేసి విద్యార్థులు ప్రత్యక్ష «తరగతులకు హాజరయ్యేలా విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తొలిరోజు జిల్లా వ్యాప్తంగా 662 ప్రభుత్వ పాఠశాలల్లో 42,698 మంది విద్యార్థులకు గాను 9,014 మంది (21.11 శాతం).. ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో 13,059 మంది విద్యార్థులకు గాను 2,958 మంది (22.65 శాతం) హాజరయ్యారు. -
ఎండర్ఫుల్ కుకీస్
డాక్టర్ మినాల్ కబ్రా, మహారాష్ట్రలోని జల్నా నగరంలో డెంటిస్ట్. తన దగ్గరకు వచ్చే పేషెంట్లను పరీక్ష చేస్తున్నప్పుడు ఆమెకో సంగతి తెలిసింది. ముఖ్యంగా పిల్లలను పరీక్ష చేస్తున్నప్పుడు ‘ఇది వ్యక్తిగత అనారోగ్యం కాదు, సామాజిక అనారోగ్యం’ అని తెలిసింది. సమస్య మనుషుల్లో కాదు, వారు తింటున్న ఆహారంలో అని నిర్ధారణ అయింది. పిల్లలు తింటున్న చాక్లెట్లు పిల్లల దంతాలను తినేస్తున్నాయని అర్థమైంది. దాంతో పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే వారు తినాల్సిన చిరుతిండ్ల మీద కూడా దృష్టి పెట్టాలి. తన దగ్గరకు వచ్చిన పేషెంట్లకు మాటల్లో చెప్పడం ద్వారా పరిష్కారం అయ్యే సమస్య కాదిది. సమస్య మూలాన్ని మార్చేయాల్సిందే. అందుకే రాగి, జొన్న, ఓట్, అవిసె గింజలు, కొబ్బరి, తోటకూర గింజలు, మునగ ఆకు, గోధుమ పిండి, బెల్లం, అల్లం, నిమ్మరసం వంటి ఆరోగ్యకరమైన దినుసులతో పిల్లలు ఇష్టపడే కుకీ బిస్కెట్లు తయారు చేయిస్తోంది డాక్టర్ మినాల్ కబ్రా. మినాల్ పిల్లల ఆరోగ్యం గురించి మాత్రమే కాదు, పర్యావరణ హితాన్ని కూడా అదే స్థాయిలో కోరుకుంటోంది. అదేంటంటే... ఆమె తయారు చేయిస్తున్న కుకీస్ ఏవీ అగ్నిపక్వాలు కాదు మొత్తం అర్కపక్వాలే. అంటే సూర్యకిరణాల వేడితో తయారవుతాయన్న మాట. వందకు చేరాలి డాక్టర్ మినాల్ కబ్రా రెండేళ్ల కిందట ‘కివు’ పేరుతో చేసిన ప్రయోగం విజయవంతమైంది. ‘‘మా జల్నాలో ఏడాదిలో మూడు వందల రోజులు మంచి ఎండ ఉంటుంది. ప్రకతి ఇచ్చిన వనరును ఉపయోగించుకోవడంకంటే మించిన ఆలోచన ఏముంటుంది? అందుకే సోలార్ ఎనర్జీతో పని చేసే కుకీ మేకింగ్ యూనిట్ డిజైన్ చేయించుకున్నాను. మామూలుగా అయితే ప్రతి కుకీ తయారీలో ఐదు గ్రాముల కార్బన్ డయాకై ్సడ్ విడుదలై పర్యావరణంలో కలుస్తుంది. సోలార్ ఎనర్జీ ఉపయోగించడం వల్ల ఈ మేరకు నివారించవచ్చు. 2016 నుంచి ఏడాది పాటు సొంతంగా ప్రయోగం చేశాను. రెండేళ్ల కిందట పరిసర గ్రామాల్లో గ్రామానికి ఇద్దరు చొప్పున మహిళలను గుర్తించి వారికి శిక్షణ ఇచ్చి సోలార్ బేకింగ్ యూనిట్లను ఇచ్చాను. ఇందులో నేను ఎంటర్‌ప్రెన్యూర్‌ని కాదు, వాళ్లు నా ఉద్యోగులూ కాదు. ఎవరి యూనిట్‌కి వాళ్లే యజమానులు. నేను కేవలం ‘ఏం చేయాలి, ఎలా చేయాలి’ అనే సూచనలు మాత్రమే ఇస్తాను. మార్కెట్ చేయడానికి ఒక వేదికను కల్పించానంతే. ఈ ఉత్పత్తులు ఇప్పటి వరకు పదిహేడు పట్టణాల్లో మొత్తం 72 స్టోర్లకు చేరాయి. వీటిని వంద క్లస్టర్లకు చేర్చాలనేది నా లక్ష్యం. ఇప్పటి వరకు 825 కిలోల కర్బన కాలుష్యాలను నివారించగలిగాం. మరోసారి చెబుతున్నాను నేను ఎంటర్‌ప్రెన్యూర్‌ని కాదు. ఒక సమాజహితమైన పని చేయడమే నా ఉద్దేశం. ఈ ప్రాక్టీస్ దేశమంతటా విస్తరింపచేయడం, కొనసాగింపచేయడం కోసం పని చేస్తాను. డెంటిస్ట్‌గా నా ప్రాక్టీస్ కొనసాగుతుంది’’ అన్నారు డాక్టర్ మినాల్. డాక్టర్ మినాల్ చేసిన ప్రయత్నం గ్రామీణ మహిళలకు మంచి ఉపాధి మార్గంగానూ మారింది. ఖర్చులు పోగా రోజుకు నాలుగు వందల యాభై రూపాయలు మిగులుతున్నాయని చెప్పింది మినాల్ దగ్గర శిక్షణ తీసుకుని కుకీలు చేస్తున్న స్వప్న. -
గౌతమ్ తను నాతో ఎక్కువ టైం ఉండట్లేదు: కాజల్
సెలబ్రిటీ కపుల్స్‌లో కాజల్ అగర్వాల్-గౌతమ్ కిచ్లు జంట ఒకటి. వీరిద్దరి పెళ్లి విషయం ప్రపంచానికి తెలిసినప్పటి నుంచి తరుచూ వార్తలో నిలుస్తున్నారు. గతేడాది ఆక్టోబర్ 30న పెళ్లి పీటలెక్కిన ఈ జంట ప్రస్తుతం వైవాహిక జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే పెళ్లి అనంతరం కాజల్ సినిమాలతో, గౌతమ్ తన బిజినెస్‌లో బిజీగా ఉన్నారు. దీంతో ఒకరితో ఒకరు ప్రేమగా సమయం గడిపేందుకు కుదరడం లేదు. ఈ క్రమంలో తన భర్త గురించి చెబుతూ కాజల్ సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేశారు. గౌతమ్ ఇచ్చిన అయిదు డిఫరెంట్ ఫ్లేవర్ చాక్లెట్లను ముఖానికి అడ్డంగా పట్టుకొని ఫోటోకు ఫోజిచ్చారు. అయితే కాజల్‌కు ఇష్టమని చాక్లెట్లు ఇవ్వలేదు. దీని వెనుక ఓ బలమైన కారణం కూడా ఉందడోయ్. పెళ్లి తర్వాత గౌతమ్ తన వృత్తిపరమైన పనుల్లో బిజీగా మారిపోయాడు. ఈ క్రమంలో తనుకున్న వర్క్స్ కారణంగా చందమామతో సమయం గడిపేందుకు సరిగా వీలు దొరకడం లేదు. అందుకే ఇంటికి తిరిగొచ్చినప్పుడు తనకు ఇష్టమైన చాక్లెట్స్‌ను గిఫ్ట్‌గా ఇచ్చి ఆమెను కూల్ చేశాడు. ఈ విషయాన్ని కాజల్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో పేర్కొన్నారు. గౌతమ్ బహుమతిగా ఇచ్చిన చాక్లెట్ల ఫోటోను షేర చేస్తూ.."నా భర్త నాతో ఎక్కువ సమయం వెచ్చించలేకపోవడంతో దానికి బదులు ఇలా వీటిని తీసుకొచ్చాడు. నా డైట్ కూడా నాశనం చేస్తుంది. ఏది ముందు తినేశానని మీరు అనుకుంటున్నారు. అనే క్యాప్షన్ జతచేశారు. చదవండి: ఆ పాత్ర కోసం ప్రత్యేక శిక్షణ తీసుకుంటున్న కాజల్ వైరలవుతున్న రామ్‌చరణ్- ఉపాసన రొమాంటిక్ ఫోటో -
పిల్లల చిరుతిండి.. డిమాండ్ దండి!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ మహమ్మారి రాక ముందు పిల్లలు ఏ స్నాక్స్ అడిగినా పెద్దలు అడ్డుచెప్పేవారు కాదు. అయితే, వైరస్ వచ్చాక పిల్లల డిమాండ్లను తోసిపుచ్చుతున్నారు. కారణం.. వైరస్ భయంతోపాటు రోగనిరోధక శక్తిని పెంచడానికి ఆ స్నాక్స్ ఉపయోగపడవనే ఆలోచనే. దీంతో పిల్లల చిరుతిండి తయారుచేసే కంపెనీల ప్రణాళికల్లో మార్పులు తప్పనిసరి అయ్యాయి. పదేళ్లలోపు పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారంతోపాటు రోగ నిరోధక శక్తి పెంచేందుకు దోహదపడేలా స్నాక్స్ రూపం లో వివిధ తినుబండారాలు అందించే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. గతంలో చిన్న పిల్లల చిరుతిండి, స్నాక్స్ సెగ్మెంట్‌ను కంపెనీలు పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రస్తుతం కోవిడ్ కారణంగా నూతన ఆవిష్కరణల వైపు ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్ స్టార్టప్‌లు ప్రణాళికలు అమలు చేస్తున్నాయి. పిల్లలకు ఆరోగ్యవంతమైన ఆహారం అందించేందుకు పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. పిల్లల చిరుతిండి కోసం ప్రత్యేకంగా ఒక సెగ్మెంట్ ఏర్పాటు చేసుకునేందుకు ఇప్పటికే కొన్ని కంపెనీలు కార్యాచరణ చేపట్టగా మంచి ఫలితాలే నమోదయ్యాయి. ప్రీ బయోటెక్ చాక్లెట్లు, హోల్ గ్రెయిన్ స్నాక్స్, పల్లీ, డ్రై ఫ్రూట్స్, ఇతర నట్స్‌తో తయారు చేసిన చాక్లెట్ బార్లు, ఇలా భిన్నమైన ఉత్పత్తుల ద్వారా చిన్నపిల్లలు, వారి తల్లిదండ్రులను ఆకర్షించే ప్రయ త్నాలు ఊపందుకున్నాయి. ఈ క్రమంలోనే బెల్లం తో తయారుచేసిన తినుబండారాలు, ప్రొటీన్లతో కూడిన పానీయాలు, డెయిరీ ప్రొడక్ట్‌లు, ఇతర ఆహార పదార్థాల తయారీ పెరుగుతోంది. ప్రస్తుతం మనదేశంలో చిన్నపిల్లల స్నాక్స్ మార్కెట్ సెగ్మెంట్ నాలుగు బిలియన్ అమెరికన్ డాలర్లు ఉన్న ట్లు అంచనా. ఇది 2023 కల్లా దశలవారీ మూడు రెట్లు పెరుగుతుందని కంపెనీలు భావిస్తున్నాయి. -
మతిమరపు.. చికిత్స తియ్యతియ్యగా!
మానవుల్లో ఒక వయసు దాటాక మతిమరపు రావడం చాలా చాలా సాధారణం. పెద్ద వయసులో సాధారణంగా అల్జైమర్స్ వల్ల మతిమరపు రావడం ఎక్కువ. పైగా వృద్ధాప్యంలో దాపురించే అల్జైమర్స్ వ్యాప్తి కూడా ఇటీవల బాగా పెరిగింది. అయితే చాలా తియ్యని మార్గంలో, చాలా సహజసిద్ధమైన రీతిలో మతిమరపును ఎదుర్కొనే అవకాశం ఉందంటున్నారు పరిశోధకులు. ప్రతి రోజూ పరిమితమైన మోతాదులో తీసుకునే చాక్లెట్ వల్ల వృద్ధాప్యంలో వచ్చే మతిమరపు (డిమెన్షియా), అఅల్జైమర్స్ను నివారించవచ్చని పేర్కొంటున్నారు. చాక్లెట్లో ఉపయోగించే కోకో... అందులోని పోషకాల్లో ఒకటైన ఫ్లేవనాల్ వల్ల ఈ ప్రయోజనం ఒనగూరుతుందంటున్నారు వారు. ఇటీవల కొద్దికాలం కిందట ఇటలీలోని యూనివర్సిటీ ఆఫ్ ఎల్ అక్విలాకు చెందిన వైద్య నిపుణుడు డాక్టర్ గియోవాబాటిస్టా దేసిదెరి ‘‘మనం మితిమీరిన క్యాలరీలు తీసుకోకుండా పరిమితంగా కోకో ఉన్న చాక్లెట్లను తినడం వల్ల మన జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది’’ అని పేర్కొన్నారు. అంతేకాదు... చాలా పరిమితంగా చాక్లెట్ డ్రింక్ (ఫ్లేవనాల్ డ్రింక్) తీసుకోవడం వల్ల రక్తపోటు తగ్గే అవకాశం కూడా ఉందంటున్నారు నిపుణులు. అందుకే వృద్ధాప్యానికి ముందరే చాలా పరిమితంగా చాక్లెట్లు తినడం మంచిదనే అంటున్నారు. అయితే చక్కెర వ్యాధి ఉన్నవారు మాత్రం ఈ విషయంలో ఒకసారి తమ మెడికల్ స్పెషలిస్ట్‌ను సంప్రదించాకే తాము తీసుకోగలిగే చాక్లెట్ మోతాదును నిర్ణయించుకోవడం మంచిదని వారు హెచ్చరిస్తున్నారు. అయితే ఇలా చాక్లెట్లతో ఇన్ని మేళ్లు ఉన్నాయంటూ మితిమీరి తింటే మనకు ప్రయోజనం కలగకపోగా... ప్రతికూల ఫలితాలే ఉంటాయంటూ హెచ్చరిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. -
కరోనా: ఇళ్లలో తిష్ట వేసిన ‘చాక్లెట్’
చాక్లెట్.. పేరు వినగానే నోరూరిపోతుంది. దీన్ని ఇష్టపడని వారు నూటికో కోటికో ఒక్కరుంటారు. అలాంటి చాక్లెట్ కరోనా సమయంలోనూ చాలామంది ఇళ్లలో తిష్టవేసిందట. కరోనా భయంతో పదేపదే కిరాణా షాపుకు వెళ్లలేని వారు ఒక్కసారిగా నెలకు సరిపడా సామాన్లు తెచ్చేసుకుంటారు. అయితే అలా తెచ్చుకునే లిస్టులో చాక్లెట్ ముందు వరుసలో ఉందని ఓ అధ్యయనం తెలుపుతోంది. లక్నోలోని ఐఐఎమ్(ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్) అధ్యయనం ప్రకారం ఈ లాక్డౌన్లో 42 శాతం భారతీయులు చాక్లెట్‌ను ముందస్తుగా తెచ్చేసుకుని ఇంట్లో నిల్వ పెట్టుకున్నారు. స్కూళ్లు లేకపోవడంతో పిల్లల అల్లరికి కళ్లెం వేయాలంటే చాక్లెట్‌ను మించిన పరిష్కారం లేదు. (చిరు వ్యాపారులపై ఫేస్బుక్ సర్వే) ఇష్టమైన బ్రాండ్లకే మొగ్గు దీంతో చాక్లెట్ కొనే తల్లిదండ్రుల సంఖ్య బాగా పెరిగిపోయింది. తొలి దశ లాక్డౌన్లో 39 శాతం వినియోగదారులు ఎప్పుడూ తినే చాక్లెట్లు కాకుండా కొత్త బ్రాండ్లను టేస్ట్ చేసేందుకు మొగ్గు చూపారు. కానీ రెండో దశకు వచ్చేసరికి 54 శాతం మంది మళ్లీ తమకు ఇష్టమైన బ్రాండ్లను కొనుగోలు చేశారు. మొత్తంగా 75 % మంది బియ్యం, 65 % గోధుమ పిండిని ఎక్కువ మోతాదులో తెచ్చుకుని ముందుగానే నిల్వ చేసి పెట్టుకున్నారు. కూరగాయల విషయానికొస్తే.. ఉల్లిపాయలు, ఆలుగడ్డలు నిల్వ చేసుకున్న లిస్టులో ఉన్నాయి. ఇవి ఎక్కువ రోజులు పాడవకుండా ఉండటం కూడా ఓ కారణమే. (చిన్నారుల్లో కరోనా ప్రభావం తక్కువే: సర్వే) కొత్త ప్రయోగాలతో వంటింట్లో గడిపేస్తున్న జనాలు ప్రజల్లో పరిశుభ్రత స్పృహ గణనీయంగా పెరిగింది. 40 శాతం మంది సానిటరీ న్యాప్కిన్లు, టిష్యూలు, న్యాపీస్ కొనుక్కోగా 39 శాతం మంది క్రిమి సంహారకాలను కొనుగోలు చేశారు. అలాగే లాక్డౌన్ కాలంలో 53 శాతం మంది టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తుండగా, 45 % ఆన్లైన్ కార్యకలాపాల్లో పాల్గొనడం, నిద్రపోవడానికే ప్రాధాన్యతనిస్తున్నారు. కేవలం 24 శాతం జనాలు మాత్రం పుస్తకాలు చదువుతున్నారు. ఇక వంటచేసేవారి సంఖ్య పెరగడం విశేషం. 44 % కొత్త కొత్త ప్రయోగాలతో వంటింట్లోనే గడిపేస్తున్నారు. 20 శాతం మంది ధ్యానం చేస్తున్నారు. అధ్యయనకారుడు ప్రొఫెసర్ సత్య భూషణ్ దాస్ మాట్లాడుతూ ప్రజల్లో ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతోందన్నారు. అలాగే కుటుంబంతో కలిసి కాలక్షేపం చేస్తుండటం శుభపరిణామం అన్నారు. -
డ్యూక్స్ ‘బటర్ ఫ్లేవర్డ్’ వాఫీ
హైదరాబాద్: రవి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తాజాగా ‘బటర్ ఫ్లేవర్డ్’ వాఫీ ని మార్కెట్లో ఆవిష్కరించింది. ఈ క్రీమీ, క్రంచ్ వాఫీ వినియోగదారులకు కొత్త ఫ్లేవర్‌తో మంచి అనుభూతిని ఇస్తుందని కంపెనీ తెలిపింది. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రవిందర్ అగర్వాల్ ఆలోచనలకు అనుగుణంగా వినియోగదారుల అభిరుచుల మేరకు కొత్త ఫ్లేవర్లను ఆవిష్కరించడానికి రవి ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ డ్యూక్స్ ముందుంటుందని పేర్కొంది. చాకొలెట్స్, వాఫీలు, కుకీస్, బిస్కెట్లసహా పలు ప్యాకేజ్డ్ ఫుడ్ ఇండస్ట్రీలో రెండు దశాబ్దాలుగా సంస్థ కీలకపాత్ర పోషిస్తోందని వివరించింది. ‘‘క్రీమీ వాఫర్ విభాగం మార్కెట్లో రవి ఫుడ్స్ వాటా దాదాపు రూ.45,000 కోట్లు. ఏడాదికి 10 శాతం నుంచి 12 శాతం వృద్ధి నమోదుచేసుకుంటోందని ఎండీ అగర్వాల్ ఇటీవల ఒక ప్రకటనలో తెలిపారు. -
చాక్లెట్లతో ఇళ్లు కట్టేశారు!
పారిస్: ప్రతి ఒక్కరూ తమ సొంతింటిని స్వీట్ హోంగా చెప్పుకొంటుంటారు. అలాగే ఫేస్బుక్, వాట్సాప్‌ల్లో తమ ఇంటి ఫొటోలు పోస్ట్ చేస్తూ... ‘మై స్వీట్ హోం’ అని చేసే పోస్టులనూ మీరు చూసే ఉంటారు. అయితే ఇప్పుడు తెలుసుకోబోయే ఇల్లు నిజంగానే ‘స్వీట్ హోం’. ఎందుకంటే ఈ ఇంటిని మొత్తం చాక్లెట్‌తో రూపొందించారు. నమ్మలేకపోతున్నారా? అయితే ఈ ఇంటి గురించి తెలుసుకొని తీరాల్సిందే... పారిస్‌లోని సౌత్‌వెస్ట్రన్ శివారులో ఉందీ ఇల్లు. దీన్ని ఆస్ట్రియాకు చెందిన ప్రముఖ చాక్లెట్ కంపెనీ యజమాని జీన్–లూక్ డిక్యుజియో నిర్మించారు. ఈ ఇంట్లోని గోడల నుంచి పైకప్పు వరకు, పుస్తకాల నుంచి గడియారాల వరకు అణువణువునూ చాక్లెట్లతోనే రూపొందించారు. అంతేకాదు ఈ చాక్లెట్లను తినడానికి వీలుండడం మరో విశేషం. మరి ఈ చాక్లెట్ కాటేజీలో ఎవరు ఉంటారనేదేగా మీ డౌట్... ఇందులో నివసించడానికి ఆసక్తి ఉన్న వారు ఆన్లైన్ ద్వారా అక్టోబర్ 5, 6 తేదీల్లో కాటేజీని బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. ప్రస్తుతం ఈ కాటేజీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. -
చాక్లెట్ మిల్క్‌తో చాలా మేలు
జిమ్‌లో బాగా వ్యాయామం చేసి వచ్చిన తర్వాత ఖరీదైన స్పోర్ట్స్ డ్రింక్స్ తాగడం కంటే చాక్లెట్ మిల్క్ తాగడం మంచిదని ఒక తాజా పరిశోధనలో తేలింది. స్పోర్ట్స్ డ్రింక్స్‌తో పోలిస్తే చాక్లెట్ మిల్క్ తాగడం వల్ల గుండె వేగం త్వరగా అదుపులోకి వస్తుందని, శరీరంలోని లాక్టిక్ యాసిడ్ పరిమాణం కూడా సాధారణ స్థితికి చేరుకుంటుందని ఇరాన్‌లోని షహీద్ సదౌఘీ యూనివర్సిటీకి చెందిన పోషకాహార నిపుణులు జరిపిన పరిశోధనలో వెలుగులోకి వచ్చింది. ఇతర స్పోర్ట్స్ డ్రింక్స్ కంటే చాక్లెట్ మిల్క్‌లో కార్బొహైడ్రేట్లు, ప్రొటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయని వారు చెబుతున్నారు. వ్యాయామం వల్ల కోల్పోయిన శక్తిని సత్వరమే పుంజుకొనేందుకు, వ్యాయామం వల్ల కలిగిన అలసట నుంచి కండరాల నొప్పుల నుంచి త్వరగా తేరుకునేందుకు చాక్లెట్ మిల్క్ చక్కని పానీయమని షహీద్ సదౌఘీ వర్సిటీ పరిశోధన బృందానికి నేతృత్వం వహించిన డాక్టర్ అమీన్ సలేహీ అబర్గోయీ చెబుతున్నారు. ప్రతిరోజూ వ్యాయామం చేసే అలవాటు గల 150 మందిపై పన్నెండు విడతలుగా జరిపిన అధ్యయనాల్లో ఈ మేరకు నిర్ధారణకు వచ్చినట్లు ఆయన వివరించారు. -
రాజధానిలో లిక్కర్ చాక్లెట్లు
సాక్షి, హైదరాబాద్: మద్యం తాగడం గురించి తెలుసు.. కానీ మద్యం తినొచ్చని మీకు తెలుసా..? అవును గ్లాసులో పోసుకుని సోడా కలుపుకొని తాగడం మనకు తెలిసిన విధానం కానీ బ్రాందీ, విస్కీ, రమ్ముతో తయారు చేసిన లిక్కర్ చాక్లెట్ల అమ్మకాలు మన హైదరాబాద్‌లోనే జోరుగా సాగుతున్నాయి. ఇలాంటి చాక్లెట్లపై మన దేశంలో నిషేధం ఉన్నా అక్రమ విక్రయాలు జరుగుతున్నాయి. ఢిల్లీకి చెందిన ఓ మాఫియా లిక్కర్ చాక్లెట్లను డెన్మార్క్ నుంచి అక్రమంగా తెప్పించి మెట్రోపాలిటన్ నగరాల్లో విక్రయిస్తోంది. హైదరాబాద్‌కు చెందిన ఓ చాక్లెట్ డిస్ట్రిబ్యూటర్ ముఠాతో ఒప్పందం చేసుకొని విక్రయిస్తుండగా హైదరాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. లండన్, ఐరిస్, డెన్మార్క్‌కు చెందిన మొత్తం 96 బాక్సుల్లో ఉన్న 1,081 చాక్లెట్లను అధికారి నంద్యాల అంజిరెడ్డి స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో చాక్లెట్లో 4 శాతం ఆల్కహాల్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కాగా, గతంలో ఇలాగే లిక్క ర్ చాక్లెట్లను సరఫరా చేసిన అబిడ్స్‌కు చెందిన శ్రీధర్ అనే వ్యక్తి ప్రస్తుతం ఇంట్లోనే లిక్కర్ చాక్లెట్ల కంపెనీ పెట్టాడు. స్థానికంగా లభించే విస్కీ, బ్రాందీ, రమ్ము తీసుకొచ్చి వాటితో చాక్లెట్లు తయారు చేసి విక్రయిస్తుండగా హైదరాబాద్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ వివేకానందరెడ్డికి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. నిందితుడి నుంచి 1.3 కిలోల విస్కీ చాక్లెట్లు, 1.5 కిలోల రమ్ము చాక్లెట్లు, 6.4 కిలోల చాక్లెట్ పదార్థాలు, లిక్కర్ సీసాలు స్వాధీనం చేసుకున్నారు. -
ఆ షాపుల్లో... చాక్లెట్లు, కూల్‌డ్రింక్‌లకు ‘నో’
భావితరాలను పొగాకు వ్యసనానికి దూరంగా ఉంచేందుకు కేంద్రం ప్రభుత్వం మరో చర్య చేపట్టింది. సిగరెట్లు, బీడీలు, ఖైనీ, గుట్కాలను అమ్మే షాపులు స్థానిక సంస్థల వద్ద రిజిస్టర్ చేసుకొని... విక్రయాలకు అనుమతి పొందాలని ప్రతిపాదించింది. అలాగే మైనర్లు వీటి పట్ల ఆకర్షితులు కాకూడదనే ఉద్దేశంతో పాన్‌షాపుల్లో చాక్లెట్లు, బిస్కట్లు, చిప్స్, కూల్‌డ్రింక్స్ లాంటివి అమ్మకూడదని స్పష్టం చేసింది. పొగాకు ఉత్పత్తులు అమ్మే షాపులకు స్థానిక సంస్థల ద్వారా అనుమతిని జారీచేసే ప్రక్రియకు సంబంధించి విధివిధానాలను రూపొందించాలని కోరుతూ ఈనెల 21న కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అన్ని రాష్ట్రాలకూ లేఖలు రాసింది. దేశవ్యాప్తంగా మైనర్లకు పొగాకు ఉత్పత్తుల అమ్మకుండా ఓ కన్నేసి ఉంచడానికి ఈ విధానం పనికి వస్తుందని ఆరోగ్యశాఖ సలహాదారు అరుణ్ ఝా అన్నారు. అయితే మన దేశంలో పాన్‌షాపుల్లో కాకుండా ప్రతిచిన్న కిరాణా కొట్టులోనూ సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తులు అమ్ముతారు. వీటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తాయో చూడాలి. ప్రపంచ వ్యాప్తంగా పొగతాగే వారిలో 90 శాతం మందికి 20 ఏళ్ల వయసులోపే దమ్ము అలవాటైందని గణాంకాలు చెబుతున్నాయి. మొక్కగా ఉన్నపుడే వంచడం సులువు కాబట్టి యుక్త వయసులో అటు వైపు ఆకర్షితులు కాకుండా నిరోధిస్తే... ఈ మహమ్మారి బారినపడకుండా యువ శక్తిని కాపాడుకోగలమని ప్రభుత్వం భావిస్తోంది. – భారత్‌లో ప్రతి ఐదుగురిలో ఒకరికి పొగాకు నమిలే అలవాటు ఉందని ప్రభుత్వ సర్వే తేల్చింది. – 10 కోట్లు: భారత్‌లో పొగాకు తాగే అలవాటు ఉన్నవారు. – 1 కోటి: పొగాకు తాగే అలవాటు కారణంగా... క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులు, గుండె సంబంధం వ్యాధుల బారినపడి ప్రతియేటా మనదేశంలో మరణించే వారి సంఖ్య. – 60 శాతం నివారించొచ్చు: క్యాన్సర్లలో 60 శాతం నివారించదగ్గవే. వీటిలో పొగాకు సంబంధింత క్యాన్సర్లు 40 శాతం. – 16 ఏళ్లు: భారత్‌లో పొగాకు అలవాటుపడుతున్న పిల్లలు 16 ఏళ్ల సగటు వయసులో దీన్ని మొదలుపెడుతున్నారు. – 4.4 శాతం: కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జూన్‌లో విడుదల చేసిన గ్లోబల్ అడల్ట్ టొబాకో సర్వే (గాట్స్) నివేదిక ప్రకారం 2010 నుంచి 2016 మధ్యకాలంలో 15–17 ఏళ్ల మధ్యలో పొగాకుకు అలవాటుపడుతున్న వారి సంఖ్య 9.6 శాతం నుంచి 4.4 శాతానికి పడిపోయింది. – 15.4 శాతం: ఇదే కాలంలో 18–24 ఏళ్ల వయసు వారిలో పొగాకు అలవాటున్న వారి శాతం 21.4 నుంచి 15.4 శాతానికి పడిపోయింది. ప్రజారోగ్యానికి సంబంధించి ఇదో ఆరోగ్యకర పరిణామంగా భావించిన కేంద్రం... యువతను ఈ అలవాటుకు దూరంగా ఉంచేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో తాజా చర్యలు చేపట్టింది. – 7 ఏళ్లు: 2015లో ఆమోదించిన జువనైల్ చట్టం ప్రకారం... మైనర్లకు పొగాకు ఉత్పత్తులు అమ్మితే గరిష్టంగా ఏడేళ్ల దాకా కఠినకారాగార శిక్షను విధించే అవకాశముంది. 100 మీటర్లు: విద్యాసంస్థలకు 100 మీటర్ల దూరంలోపు పొగాకు ఉత్పత్తులను అమ్మకూడదు. – 4వ స్థానం: ప్రపంచంలో అత్యధికంగా సిగరెట్లు అమ్ముడయ్యే దేశాల్లో భారత్‌ది నాలుగోస్థానం. చైనా, అమెరికా, జపాన్ల తర్వాత మనమున్నాం. 9,900 కోట్లు: 2016లో భారత్‌లో అమ్ముడైన సిగరెట్ల సంఖ్య. 51 శాతం: ప్రపంచవ్యాప్తంగా సిగరెట్ల వినయోగంలో టాప్–4 దేశాలు ( చైనా, అమెరికా, జపాన్, భారత్) ఏకంగా 51 శాతం వినియోగిస్తున్నాయి. 11.2 శాతం: ప్రపంచవ్యాప్తంగా మొత్తం పొగరాయుళ్లలో భారతీయులు 11.2 శాతం. – ఈ ఏడాది విడుదల చేసిన జాతీయ ఆరోగ్య విధానంలో 2020 కల్లా పొగాకు వినియోగాన్ని 15 శాతం తగ్గించాలని, 2025 కల్లా 30 శాతం తగ్గించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
చాక్లెట్స్‌లో గంజాయి
నిజామాబాద్: జిల్లాలో అక్రమంగా సాగుతున్న గంజాయి దందా గుట్టును పోలీసులు బుధవారం రట్టు చేశారు. చాక్లెట్స్‌లో గంజాయి పెట్టి అమ్ముతున్న గ్యాంగ్‌లో ఓ వ్యక్తిని లలిత మహల్ థియేటర్ సమీపంలో అరెస్టు చేశారు. గంజాయిని చాక్లెట్స్‌లో ఉంచి ఒక్కింటికి రూ.5 చొప్పున కూలీలకు, హమాలీలకు అమ్ముతున్నట్లు గుర్తించారు. అతని వద్ద నుంచి భారీ మొత్తంలో చాక్లెట్ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. రాజస్ధాన్ నుంచి గంజాయిను తెప్పించి జిల్లాలో అమ్ముతున్నట్లు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్ తెలిపారు. రూ.45 విలువైన గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. దీని వెనుక ఉన్న సూత్రధారులెవరనే దానిపై దర్యాప్తు చేపట్టామని వెల్లడించారు. -
25 గ్రాముల చక్కెర చాలు!
అమెరిక : చాక్లెట్లు, కూల్‌డ్రింకులను పిల్లలు ఎడాపెడా లాగించేస్తున్నారా? అయితే కొంచెం జాగ్రత్త. ఎందుకంటే రెండేళ్ల నుంచి 18 ఏళ్ల వయసు లోపు పిల్లలు రోజుకు 25 గ్రాముల కంటే ఎక్కువ చక్కెర తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదంటోంది అమెరికన్ హార్ట్ అసోసియేషన్. సర్క్యులేషన్ అనే జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. రోజుకు ఆరు టీస్పూన్లు లేదా 25 గ్రాముల కంటే ఎక్కువ చక్కెర తింటే పిల్లలు, యుక్తవయస్సులో ఉన్న వారికి రక్తపోటు, ఊబకాయం వంటి సమస్యలు వచ్చే అవకాశముందని, గుండెజబ్బుల బారిన పడే ప్రమాదముందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన శాస్త్రవేత్త మిర్రమ్ వాస్ అంటున్నారు. చక్కెర పదార్థాలు ఎక్కువగా తినే పిల్లలు ఆరోగ్యకరమైన పండ్లు, కాయగూరలు, హోల్ గ్రెయిన్స్ తక్కువగా తింటారని, ఇది కూడా వారి ఆరోగ్యంపై దుష్ర్పభావం చూపుతుందని పేర్కొన్నారు. పిల్లలు ఎంత మేరకు చక్కెరలు తీసుకోవచ్చు అన్న అంశంపై ఇప్పటివరకూ స్పష్టత లేదని, ఫలితంగా అన్నిరకాల ఆహార పదార్థాల్లో చక్కెరలు చేరిపోతున్నాయన్నారు. అమెరికాలోని పిల్లలు ప్రతిరోజూ మూడు రెట్లు ఎక్కువ చక్కెరలు తింటున్నారని, ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్న శాస్త్రీయ పరిశోధనలన్నింటినీ సమీక్షించిన తర్వాత రోజుకు 25 గ్రాములకు మించి చక్కెర తీసుకోవడం మంచిది కాదన్న అంచనాకు తాము వచ్చినట్లు తెలిపారు. అలాగే రెండేళ్ల లోపు వయసున్న పిల్లలకు చక్కెరలు ఇవ్వకపోవడమే మంచిదని సూచించారు. దీనివల్ల వారు చక్కెర రుచికి అలవాటు పడకుండా భవిష్యత్తులో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేందుకు దోహదపడుతుందని చెప్పారు. -
మినీ బేకరీ
ఒకప్పుడు చిరుతిళ్లు అంటే మురుకులు, గారెలు మాత్రమే. మహా అంటే షాపుల్లో దొరికే చాక్లెట్లు, బిస్కెట్లు. కానీ ఇప్పుడో... అన్నీ బేక్డ్ ఫుడ్సే. కుకీస్ అనీ చిప్స్ అనీ... రకరకాల వెరైటీలతో వచ్చేస్తున్నాయి. దాంతో చాలామంది అవన్ కొనేసి, ఇంట్లోనే బేక్డ్ ఫుడ్స్‌ను తయారు చేసి పిల్లలకు పెడుతున్నారు. అంతవరకు ఓకే. కానీ మనం బేక్ చేస్తున్నప్పుడు, పదార్థాలను సరైన మోతాదుల్లోనే వేస్తున్నామా? అన్న విషయాన్ని గమనించాలి. అలా ఎలా తెలుస్తుందండీ అంటారా? అయితే ఈ ‘పర్ఫెక్ట్ బేక్ సెట్’ ఇక మీ కోసమే. ఈ సెట్లో స్కేల్, ఫోన్/టాబ్లెట్ స్టాండ్, 3 మిక్సింగ్ బౌల్స్, అవన్ థర్మామీటర్, 3.5 ఎంఎం కేబుల్ ఉంటాయి. ఫోన్/ టాబ్లెట్ (అందులో ఈ పర్ఫెక్ట్ బేక్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి) ద్వారా మీ బేకింగ్ ఐటమ్ (రెసిపీ)ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు స్కేల్‌పై బౌల్ పెట్టి, అందులో బేకింగ్‌కు వాడే పదార్థాలను వేస్తూ ఉండాలి. ఎంత మోతాదైతే సరిపోతుందో, ఆ ఇండికేషన్ మనకు ఫోన్లో కనిపిస్తుంది. అలా అన్నీ పర్ఫెక్ట్గా వేస్తేనే... మీ బేకింగ్ ఫుడ్స్ (కుకీస్, కేక్స్,...) కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇది బ్యాటరీతో పని చేస్తుంది. బేకింగ్ కిట్లాగే ‘పర్ఫెక్ట్ డ్రింక్ సెట్’ కూడా దొరుకుతుంది. -
పెప్సోడెంట్ పేస్టు.. పియర్స్ సబ్బు.. చింపాంజీ సోకులు!
హైదరాబాద్: నెహ్రూ జూలాజికల్ పార్కులో ఓ చింపాంజీకి రాజభోగాలు అందుబాటులో ఉంటున్నాయి. ఇది సాధారణ చింపాంజీ కాదు.. ఓ కోటీశ్వరుడు పెంచుకున్నది!! ఈ మధ్యేనే హైదరాబాద్ జూకి వచ్చిన ఈ చింపాంజి పేరు సుజీ (28). సహారా గ్రూపు చైర్మన్ సుబ్రతా రాయ్ పెంచుకున్న ఈ చింపాజీని ఇప్పుడు నగరంలోని జూ కు తీసుకొచ్చారు. చిన్నప్పటి నుంచి లగ్జరీ లైఫ్‌కు అలవాటు పడిన సుజీ ప్రస్తుతం జూలో కూడా అదే రాజభోగాలు అనుభవిస్తోంది. ఉదయాన్నే పళ్లు తోమడంతో తన దైనందిన జీవితాన్ని మొదలుపెట్టే సుజీ.. ఇందుకు పెప్సోడెంట్ టూత్ పేస్టు తప్ప మరొకటి వాడదు. ఆ తర్వాత స్నానానికి సకల సౌకర్యాలతో కూడిన బాత్ రూమ్, షాంపూ, పియర్స్ సబ్బు ఉండాల్సిందే. స్నాన కార్యక్రమం ముగిశాక కొబ్బరినూనెతో శరీరంపై మర్దన చేసుకుంటుంది. సర్వాంగ సుందరంగా ముస్తాబైన తర్వాత చక్కని కాఫీ సేవిస్తుంది. ఎప్పుడూ నెస్ కేఫ్ కాఫీని తాగే సుజీ.. అప్పుడడప్పుడూ కాంప్లాన్ ను హెల్త్ డ్రింక్ గా భావిస్తూ తీసుకుంటుంది. ఆ తర్వాత బ్రెడ్, ఫ్రూట్ జామ్, కొన్ని పండ్లతో బ్రేక్ ఫాస్ట్ కానిచ్చేస్తుంది. లంచ్ కోసం తేనె, పండ్లు, కార్న్ ఫ్లేక్స్, డ్రై ఫ్రూట్స్ తీసుకుంటుంది. కాడ్ బరీ చాక్లెట్స్ అంటే పిచ్చెత్తిపోయే సుజీ కేవలం మినరల్ వాటరే తాగుతుంది. అది కూడా తన బాటిల్ లో మాత్రమే. జూ అధికారులు సుజీ పడుకోవడానికి రోజూ కొత్త బ్లాంకెట్స్ ఇవ్వాల్సిందే.. వాడినది ఇచ్చి దాన్ని మోసం చేయడం అసాధ్యం. ఇక ఎండ వేడిమి ఉంటే కచ్చితంగా కూలర్, ఫ్యాన్ ఉండాల్సిందే. దోమలు లేకుండా ఉంచడం కోసం ఆలౌట్ లాంటి లిక్విడ్ సదుపాయం కూడా తప్పదు మరి. ఈ విషయంపై అధికారులను అడగగా ప్రస్తుతం జైలులో ఉన్న సుజీ పాత యజమాని సుబ్రతా రాయ్‌కి కూడా ఇలాంటి సదుపాయాలు ఉండవని అంటున్నారు. -
చాక్లెట్లు ఆ భావనలు పెంచుతాయా?
అవాస్తవం చాక్లెట్లు రొమాంటిక్ భావనలను పెంచుతాయనే అభిప్రాయం ఎప్పటి నుంచో ఉంది. చాక్లెట్స్కు అవసరమైన మూల పదార్థాలు ఒకప్పుడు చాలా అరుదుగా లభ్యమయ్యేవి. దక్షిణ అమెరికాలోని వర్షాధార అడవుల్లోనే అవి దొరికేవి. చాక్లెట్ల మూలపదార్థాలు ఈ ‘కొకోవా చెట్ల’ నుంచి లభ్యమయ్యేవి. దాంతో అక్కడి ప్రాచీన మాయ నాగరికతకు చెందిన వారు ఆ చెట్టును ‘దేవుడి ఆహారపు’ చెట్టుగా కొలిచేవారు. చాక్లెట్లలో ‘ఫీల్‌గుడ్’ అనుభూతిని, సంతోషభావనను పెంచే జీవరసాయనమైన సెరిటోనిన్ ఉంటుంది. ఈ సెరిటోనిన్తో పాటు చాక్లెట్స్లోని ఫినైల్ ఇథైల్ఎమైన్ (పీఈఏ) రసాయనం నాడీ వ్యవస్థపై కాస్త స్టిమ్యులెంట్స్గా పనిచేస్తుంది. అప్పట్లో చాక్లెట్లు చాలా అరుదుగానూ, పరిమితంగానూ దొరికే ఆహారం కావడంతో పాటు, ఆనంద భావననూ, ఉల్లాసాన్ని కలిగించేవి. దాంతో చాక్లెట్స్ తయారయ్యే తొలినాళ్లలో వాటిని రొమాంటిక్ ఫీలింగ్స్ కలిగించేవిగా పరిగణించేవారు. ఇప్పుడు ఆధునిక పరిశోధనలతో చాక్లెట్ వల్ల కోరిక పెరగడం జరగదని తేలింది, అయితే చాక్లెట్లలోని ‘ఫీల్ గుడ్’ భావన వల్ల, స్టిమ్యులెంట్స్ వల్ల మనసు ఉత్తేజితమవుతుందని తెలిసింది. ఇక పరిమితంగా తింటే డార్క్ చాక్లెట్లు గుండెకు ఒకింత మేలు చేస్తాయి. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే అవి సెక్స్‌ను ఉత్తేజితం చేస్తాయనడం కంటే మనసును ఉల్లాసంగా ఉంచేలా చూస్తాయనడమే సబబు. -
చుక్కల్లో చక్కెర.. చిక్కుల్లో ఉత్పత్తులు
న్యూఢిల్లీ : చక్కెర ఉత్పత్తులైన చాకోలెట్ లు, సాప్ట్ డ్రింక్ లు, ఐస్ క్రీమ్ లు, బిస్కెట్ల ధరలు ఇక చేదు కానున్నాయా? వాటిపై లభించే డిస్కౌంట్లు ఇక లభించవా? అంటే అవుననే అనిపిస్తోంది. ఈ ఐదేళ్లలో ఈ ఏడాది చక్కెర ఉత్పత్తి గణనీయంగా పడిపోవడంతో ఆయా ధరలు పెరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయనే అంచనాలు నెలకొన్నాయి. చక్కెర ధరలు ఆకాశాన్నంటడంతో చక్కెర ప్రొడక్ట్ ల ఉత్పత్తిదారులు ఇబ్బందుల్లో పడ్డారు. విపరీతంగా పెరిగిన షుగర్ దరలు వారికి చుక్కలు చూపిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో ఈ ఉత్పత్తులపై కంపెనీలు ఇచ్చే డిస్కౌంట్లు తగ్గించనున్నాయని సమాచారం. గత అక్టోబర్ లో ఒక కిలో చక్కెర ధర రూ.30 ఉంటే, ఈ వారంలో ఆ ధర రూ.40 లను తాకింది. చక్కెర ఉత్పత్తిలో మహారాష్ట్ర ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. అయితే ఈ ఏడాది తీవ్ర కరవు సంభవించడంతో, దేశమంతటా ఘగర్ ఉత్పత్తి 10శాతం పడిపోయిందని క్రెడిట్ రేటింగ్ సంస్థ ఐసీఆర్ఏ గణాంకాలు తెలిపాయి. ధరలు పెరుగుతున్న ప్రతిసారీ ప్రమోషన్లను, ఆఫర్లను తగ్గించి, ప్రత్యక్షంగా తమపై ప్రభావం చూపనున్న ఎక్కువ కమోడిటీ ధరల నుంచి కొంత ఉపశమనం పొందుతామని పార్లె ఉత్పత్తుల మార్కెటింగ్ హెడ్ మయాంక్ షా చెప్పారు. చక్కెర ధరలు పెరుగుతున్నప్పటికీ, వెంటనే ఉత్పత్తుల ధరలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని, జూన్ లో వీటిపై పునఃసమీక్షిస్తామని మదర్ డైరీ ఎండీ ఎస్.నాగరాజన్ పేర్కొన్నారు. ఎందుకంటే ఈ కాలంలోనే తమ ఉత్పత్తులకు డిమాండ్ బాగా ఉంటుందని చెప్పారు. చక్కెర ధరలు ఇలానే పెరుగుతూ ఉంటే మాత్రం ఉత్పత్తి కంపెనీలు ఇచ్చే డిస్కౌంట్లు కొంతమేర తగ్గుతాయని బెవరేజ్ పరిశ్రమ అధికారులు పేర్కొన్నారు. -
తీపి కొలువుకు... కొత్త పిలుపు
ప్రపంచంలోనే ప్రత్యేక ఆఫర్ లండన్: ఉద్యోగమంటే..ఎంతో కష్టపడాలి. గంటలు లెక్కేయకుండా రెక్కలు ముక్కలు చేసుకోవాలి. మరోవైపు బాస్‌ను మంచి చేసుకోవాలి. అబ్బో..ఒకటా, రెండా ఎన్నో ఎత్తులు..జిత్తులు.. కాస్త లౌక్యం అవసరం. కానీ ఆ కొలువుకు ఇలాంటివేం అక్కర లేదు. అసలు చెమటోడ్చాల్సిన పనేలేదు. లోకో భిన్నరుచి అన్నట్టుగా కాస్త నాలికకు పదును పెట్టాలి. ఎంచక్కా ఇచ్చిన క్వాంటిటీని లాయించేసి దీని ప్రత్యేకత ఇది సార్..ఇంకాస్త సృజన జోడించి అలా చేస్తే భేషుగ్గా ఉంటుంది అని నాలుగు సలహాలు పడేయాలి. ఇదీ ఆ కొలువుకు ఉన్న అసలు సిసలైన క్వాలిఫికేషన్. ఇంతకీ అదేమిటనేగా మీ సందేహం. ఆ ఉద్యోగ హోదా పేరు ‘చీఫ్ చాక్లెట్ టేస్టర్’ ..ఓ స్కాట్లాండ్ చాక్లెట్ కంపెనీ ఈ కొలువుకు సరైన అభ్యర్థులకోసం అన్వేషిస్తోంది. ఏడాది కాలంపాటు ఉండే ఈ ఉద్యోగానికి దరఖాస్తుకు చివరి తేదీ డిసెంబరు3. అయితే ఈ ఉద్యోగానికి ఎంపికలో ఓ ట్విస్ట్ కూడా ఉంది. కొత్తదనానికి, సృజనకు అభ్యర్థులు పెద్దపీట వేయాలి. ఏ చాక్లెట్ రుచి ఏమిటో ఠక్కున పట్టగలగాలి,వారు ఎలా అర్హులో చెప్పేందుకు నాలుగు చక్కని ఐడియాలు చెప్పాలి. ఆ తర్వాత రెండు జాబితాలు సిద్ధంచేసి అందులోనుంచి వడపోస్తారు. ఆ తర్వాత ప్రతీ ఒక్కరినీ సామాజిక మాధ్యమాల ద్వారా పబ్లిక్ ఓటింగ్కోరి ఎంపిక చేస్తారు. ఎంపికయ్యాక ఎంచక్కా చాక్లెట్లు తింటూ ఉద్యోగాన్ని కొనసాగించ వచ్చు. తీపి..తీపిగా ఉద్యోగ జీవితాన్ని గడిపేయొచ్చు. -
పుష్టిగా ఉంటేనే బెస్టు!
బల్లిని చూస్తే బేర్మంటారు... కారు వేగం పెరిగితే క్యార్మంటారు... చాక్లెట్స్ అంటే ఇష్టంగా చప్పరించేస్తారు... ఇలా సోనాక్షీ సిన్హాకు సంబంధించి చాలా ఆసక్తికరమైన విషయాలున్నాయి. వాటి గురించి మీకు తెలుసా?! * హీరోయిన్ కాకముందే సోనాక్షీ సిన్హా ఆటోగ్రాఫ్స్ ఇచ్చేవారట. ఆమె తండ్రి, ప్రముఖ నటుడు శత్రుఘ్న సిన్హాది పాట్నా. స్కూల్ డేస్‌లో ఉన్నప్పుడు తండ్రితోపాటు ఎన్నికల ప్రచారంలో భాగంగా సోనాక్షి పాట్నా వెళ్లినప్పుడు అక్కడివాళ్లు ఆటోగ్రాఫ్స్ అడిగితే, సిగ్గుపడుతూ ఇచ్చారట. * ఫ్యాషన్ డిజైనర్ కావాలనే ఆకాంక్షతో ముంబయ్‌లోని ‘శ్రీమతి నాతీబాయ్ దామోదర్ తాకర్సే ఉమన్స్’ యూనివర్శిటీలో ఫ్యాషన్ డిజైనింగ్ చేశారు. * ‘దబాంగ్’ చిత్రం ద్వారా కథానాయిక కాకముందు ‘మేరా దిల్ లేకే దేఖో’ అనే చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్‌గా చేశారు. ‘దబాంగ్’ చిత్రానికి సల్మాన్ ఖాన్ కథానాయికగా అడగ్గానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. * దూర ప్రాంతాలకు వెళ్లినప్పుడు మాత్రమే కాదు.. ముంబయ్‌లో ఉన్నప్పుడు ఏదైనా ఫంక్షన్‌కి వెళ్లినా లేక వేరే ఏదైనా కార్యక్రమానికి వెళ్లినా తనతో పాటు అదనంగా ఓ డ్రెస్ తీసుకెళతారు సోనాక్షి. ఒంటి మీద ఉన్న డ్రెస్ పొరపాటున చిరిగినా, అసౌకర్యంగా అనిపించినా నలుగురిలో నవ్వులపాలు కాకూడదు కాబట్టి, ఇలా ముందు జాగ్రత్త తీసుకుంటారు. * యాక్టర్స్ అందరూ కాంప్లికేటెడ్ అనుకుంటారు. కానీ తాను ఆ జాబితాకు చెందనని పలు సందర్భాల్లో సోనాక్షి పేర్కొన్నారు. అందుకే హీరోలను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదంటున్నారు. అన్‌కాంప్లికేటెడ్ పర్సన్స్‌ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. అది కూడా సినిమా రంగానికి చెందినవాళ్లని చేసుకోరట. * సైజ్ జీరో అంటే చాలా చిరాకు. పుష్టిగా ఉంటేనే అందంగా ఉంటామంటున్నారు. అందుకే తననెవరైనా బొద్దుగా ఉంటావని విమర్శించినా వాటిని ప్రశంసలుగా భావిస్తారు. * ఖరీదు గల కార్లు చూపించి అమ్మాయిలను పడగొట్టాలనుకునే అబ్బాయిలంటే పడదు. కాలేజ్ డేస్‌లో అలా బిల్డప్ ఇచ్చిన అబ్బాయిల బుర్ర తిరిగిపోయేలా క్లాస్ తీసుకునేవారు. * బల్లులంటే తెగ భయం. సాలీడులంటే అలర్జీ. బల్లులంటే సోనాక్షీకి భయం అని తెలిసి, ‘జోకర్’ సినిమాలో నటించేటప్పుడు అక్షయ్ కుమార్ సరదాగా రబ్బర్ బల్లిని చూపిస్తూ, ఆమెను ఏడిపించేవారు. మొదటిసారి ఆ రబ్బర్ బల్లిని చూసి, నిజమైనదని నమ్మి, షూటింగ్ లొకేషన్లో పరుగులు పెట్టారు. * చదువుకునే రోజుల్లో ఆటల్లో ఫస్ట్. వాలీబాల్, ఫుట్‌బాట్, త్రో బాల్, టెన్నిస్ బాగా ఆడేవారు. వేగంగా కారు నడపడం అంటే టెన్షన్. అలా నడిపేవాళ్లతో ప్రయాణం చేయరు. * చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం. అవి తినకుండా ఉండలేరు. తిన్న తర్వాత గిల్టీగా అనిపిస్తుందని అంటుంటారు. అలాగే, డైట్ కోలా తెగ తాగుతారు. అది ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసినా తాగుతారట. * పెయింటింగ్ అంటే సోనాక్షీకి ఇష్టం. తీరిక చిక్కినప్పుడల్లా బొమ్మలు గీస్తుంటారు. అలాగే ఖాళీ సమయాల్లో ఐప్యాడ్‌లో గేమ్స్ ఆడుతుంటారు. -
చాక్లెట్లు తింటే నోబెల్ బహుమతి!
పరిపరి శోధన అతిగా చాక్లెట్లు తినొద్దంటూ పిల్లలను వారించే తల్లిదండ్రులు ఒకసారి ఆలోచించాల్సిన విషయమే ఇది. ఎందుకంటే, చాక్లెట్లు తింటే నోబెల్ బహుమతి వచ్చే అవకాశాలు పెరుగుతాయట! అలాగని న్యూయార్క్‌లోని రూజ్వెల్ట్ హాస్పిటల్‌కు చెందిన కార్డియాలజిస్టు డాక్టర్ ఫ్రాంజ్ హెచ్ మెసెర్లీ చెబుతున్నారు. తెల్లగా కనిపించే మిల్క్ చాక్లెట్ కంటే కోకోతో తయారయ్యే డార్క్‌చాక్లెట్ తినడమే శ్రేష్టమని కూడా ఈ డాక్టర్‌గారు సలహా ఇస్తున్నారు. డార్క్ చాక్లెట్ తింటే తెలివితేటలు అమోఘంగా పెరుగుతాయని, ఫలితంగా నోబెల్ బహుమతి వంటి ఉన్నత పురస్కారాలను అందుకోగల అవకాశాలూ పెరుగతాయని ఢంకా బజాయించి చెబుతున్నారు. -
చాక్లెట్లతో గుండె జబ్బులు దూరం
లండన్: రోజుకు వంద గ్రాముల మిల్క్ చాక్లెట్ లేదా డార్క్ చాక్లెట్ తింటే చాలు. గుండెజబ్బులు, పక్షవాతం వచ్చే ముప్పు తగ్గుతుందని పరిశోధకులు అంటున్నారు. చాక్లెట్ తినేవారికి గుండె సమస్యలు వచ్చే అవకాశం 11 శాతం తక్కువగా ఉంటుందని, ఈ జబ్బుల ద్వారా మరణించే అవకాశం 25 శాతం తగ్గుతుందని వారి అధ్యయనంలో తేలింది. చాక్లెట్‌కు, గుండె సమస్యలకు ఉన్న సంబంధాన్ని కనుగొనేందుకు స్కాట్లాండ్కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ అబిర్డీన్ పరిశోధకులు అధ్యయనం చేశారు. 21వేల మందిని పన్నెండేళ్ల పాటు అధ్యయనం జరిపి ఈ ఫలితాలు వెల్లడించారు. రోజుకు వంద గ్రామ్‌ల వరకు డార్క్, మిల్క్ చాక్లెట్లు తిన్నవారికి హృదయ సంబంధిత సమస్యలొచ్చే అవకాశం తగ్గినట్లు గుర్తించారు. చాక్లెట్లు ఆరోగ్యానికి అంత మంచివి కావనే విషయానికి విరుద్ధంగా తమ అధ్యయన ఫలితాలున్నాయని వారు వివరించారు. -
హృదయ స్పందన
ప్రేమికుల రోజున క్యాండిల్ లైట్ విందులు, చాక్లెట్లు, ఖరీదైన కానుకలతో భాగస్వామి మనసు గెలుచుకోవాలని తపిస్తారు. కానీ, తమ భాగస్వామిని ఏడాది మొత్తంగా సంతోషపెట్టే కానుక ఇవ్వాలని ఆలోచించేవారికి ఓ అద్భుతమైన ఐడియా ‘హెల్త్ చెకప్.’ ఇలా ఆలోచించే జంటలకు ప్రేమికుల రోజైన నేడు నగరంలోని కార్పొరేట్ ఆసుపత్రులు ప్రత్యేక హెల్త్ చెకప్‌లు అందిస్తున్నాయి. కిమ్స్ ఆసుపత్రి రూ.10 వేల విలువ గల హెల్త్ చెకప్‌కి ప్రేమికుల రోజును పురస్కరించుకొని రూ.3,200కే ఇస్తోంది. ఈ రోజు రూ.200 చెల్లించి పేరు నమోదు చేసుకుంటే 6 నెలల వరకు ఇదే డిస్కౌంట్ పొందవచ్చు. కిమ్స్ ఉషాలక్ష్మి సెంటర్ రొమ్ము వ్యాధులను నిర్ధారించే బైలేటరల్ మమోగ్రామ్, అల్ట్రాసౌండ్ వంటి పరీక్షలలలో 50 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. ఈ పరీక్షలు మామూలు రోజుల్లో రూ.4,470 ఉంటే ఈ ఒక్క రోజు రూ.2,325కే చేస్తారు. ప్రేమికుల రోజు సందర్భంగా మీ జీవితభాగస్వామి ఆరోగ్యరీత్యా రొమ్ము క్యాన్సర్ పరీక్షలను సగం ధరకే పొందవచ్చు’ అని కిమ్స్-ఉషాలక్ష్మి ఆసుపత్రి డెరైక్టర్ డా.పి.రఘురామ్ తెలియజేశారు. కేర్ గ్రూప్, గ్లోబల్ హాస్పిటల్స్ సైతం మరో అడుగు ముందుకేసి జంటలకు హెల్త్ చెకప్స్, నిర్ధారణ పరీక్షలలోనూ, అవుట్ పేషంట్ సేవలలోనూ డిస్కౌంట్స్ ఇస్తున్నాయి. హెల్త్ చెకప్స్‌లో ఏడాది పొడవునా డిస్కౌంట్స్ ఇచ్చే గ్లోబల్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ హెల్త్చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్స్‌లో ఈ రోజు మరో 500 రూపాయల డిస్కౌంట్ ఇస్తోంది. ఇప్పటికే రూ.9,275కు పైగా ఉన్న హెల్త్ చెకప్స్ డిస్కౌంట్ ధరలో రూ.3,000కు ఇస్తుండగా ఈ రోజు మాత్రం మరింత డిస్కౌంట్ ఇస్తూ రూ.2,500 చేసింది. డాక్టర్ ఫీజులో 15 శాతం రాయితీ ఇస్తోంది. కేర్ గ్రూప్ హాస్పిటల్స్ 60 ఏళ్లు పైబడిన వయోవృద్ధులైన జంటకు హెల్త్ చెకప్స్‌లో 30 శాతం డిస్కౌంట్ అందజేస్తుంది. ఇతర ఆఫర్లలో భాగంగా కాస్మటిక్, డెంటల్ కూడా చోటుచేసుకున్నాయి. వాటిలో భాగంగా అపోలో వైట్ డెంటల్ స్పా ఓరల్ స్క్రీనింగ్, వైట్ ఫేషియల్, కాస్మటిక్ పాలిషింగ్లలో 60 శాతం డిస్కౌంట్ ఇస్తోంది. సో... ఏడాది పొడవునా ఆరోగ్య ధీమా కలిగించే ఏ హెల్త్ చెకప్ అయినా ఓ అమూల్యమైన కానుకే! - నిర్మలారెడ్డి -
ప్రేమికుల రోజు ఆన్లైన్ కొనుగోళ్లు రూ.22 వేల కోట్లు!
న్యూఢిల్లీ: ప్రేమికుల రోజు కార్డులు, ఫ్లవర్స్, డైమండ్ జ్యువెలరీ, చాక్లెట్లు, బొమ్మలు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు తదితర వాటిని కొనుగోలు చేయటానికి ఆన్లైన్ కొనుగోలుదారులు వెచ్చించే మొత్తం రూ. 22 వేల కోట్లు ఉంటుందని అసోచాం తెలిపింది. గతేడాది ఈ మొత్తం రూ.16 వేల కోట్లుగా ఉందని పేర్కొంది. దీనికోసం అసోచాం ఓ సర్వేను జరిపింది. సర్వేలో దాదాపు 52 శాతం మంది ఆన్లైన్ షాపింగ్ చేసే వారు రిటైల్ షాపులతో పోలిస్తే ఆన్లైన్లోనే ఆఫర్లు బాగుంటాయనే అభిప్రాయపడ్డారు. అలాగే 50 శాతం మంది స్మార్ట్‌ఫోన్ వినియోగదారులు, 18 శాతం మంది ట్యాబ్లెట్ వినియోగదారులు గిఫ్ట్‌లను కొనుగోలు చేయటానికి వారి ఉపకరణాలనే వినియోగిస్తారు. -
కుచ్ మీఠీ బాత్
వీలైతే నాలుగు మాటలకు.. కుదిరితే కప్పు కాఫీకి మధ్యలో.. ఇచ్చిపుచ్చుకునే ఇదొకటి ఉంది. పరిచయాలు పెంచే అమోఘమైన ప్రేమ గుళిక అది. తొలిచూపులో పుట్టి.. కొంటె చూపులతో కనెక్టై.. ముసిముసి నవ్వుల తో ముడిపడే.. అందమైన ఫీలింగ్‌ను తర్వాతి మెట్టుకు తోసే మహత్తర మార్గం ఏదైనా ఉందంటే అది చాక్లెట్ల రాయబారమే. ప్రేమలో ఎంత కమిట్మెంట్ ఉందో చాటడానికి చాక్లెట్లే కొలమానం. ఒకరంటే ఒకరికి ఎంత ఇష్టమో చెప్పడానికి ప్రేమపక్షులు వీటినే ఇచ్చిపుచ్చుకుంటుంటాయి. అందుకే వాలెంటైన్స్ వీక్‌లో మూడో రోజు చాక్లెట్లు ప్లేస్ కొట్టేశాయి. ప్రేమ ఎంతో మధురమో.. ప్రియురాలూ అంతే మధురంగా ఉండాలని.. ప్రేమికుడు చాక్లెట్ ఆఫర్ చేస్తాడు. చాక్లెట్ అంటే చిన్ని చిన్ని ఆశ చాక్లెట్ కాదు.. ఓపిగ్గా తింటే.. ఎంత లేదన్నా మినిమమ్ ఓ గంటైనా పట్టే చాక్లెట్. ప్రేమతో ఇచ్చిన చాక్లెట్ రుచిని ఆస్వాదించిన తర్వాత.. సదరు ప్రేయసి మనసు మాటున దాగున్న మాటల మూటలు.. తీపి కబుర్లుగా మారిపోతాయి. ఈ చాక్లెట్ల పంపకాలు రోజులకు రోజులు అలా సాగిపోతూనే ఉంటాయి. వీరిద్దరి మధ్య అనుబంధం కూడా రోజుకింత దృఢంగా మారిపోతుంది. 3డీ ఇంప్రెస్ 200 ఏళ్ల కిందటే ప్రేమికులు చాక్లెట్ల వాయనం మొదలు పెట్టారు. ఈ ట్రెండ్ ముదిరిపాకాన పడ్డాక.. రకరకాల చాక్లెట్లు మార్కెట్లోకి వచ్చి చేరుతున్నాయి. చాక్లెట్ల మీద మెసేజ్‌లు చేర్చి మరీ ఒకరికొకరూ ప్రేమగా ఇచ్చుకుంటున్నారు. చాకో తాజ్‌మహల్‌ను తయారు చేసి.. ప్రేయసిని ఇంప్రెస్ చేయడానికి తెగ ఆరాటపడుతున్నారు. ఇలా డిఫరెంట్ థీమ్స్‌తో వస్తున్న చాక్లెట్లు.. ఇద్దరి మధ్య ప్రేమ చప్పున పుట్టేట్టు చేస్తున్నాయి. చాక్లెట్లే కాదు.. ఎదుటివారిని ఇంప్రెస్ చేసేలా ప్రేమను వ్యక్తపరచడానికి చాక్లెట్ బొకేలు కూడా వచ్చేశాయి. ప్రేయసి ఫొటోను, అది పొందుపరిచే ఫ్రేమ్‌ని.. 3డీ ప్రింటింగ్ సహాయంతో చాక్లెట్‌తోనే రూపొందించి.. గిఫ్ట్‌గా ఇచ్చి ఆమె మనసును గెలుచుకుంటున్నారు. . .:: శిరీష చల్లపల్లి -
పండగంటే పండగే!
ఆహా ఏమి రుచి! వేఫర్ బిస్కెట్, చెర్రీస్, లాలీపాప్, పిప్పరమెంట్... ఇలా పిల్లలకు నచ్చే వాటితో తయారు చేసిన అందమైన చర్చ్ ఇది. పిల్లలను ఇట్టే ఆకట్టుకునే ఈ చర్చిలో శాంతాక్లాజ్ బహుమానాలు ఇచ్చే వస్తువులు... చాక్లెట్స్, బెల్స్, క్యాండీస్, ఆల్మండ్స్, కిస్మిస్... ఇలా నోరూరేవి ఎన్నో ఈ చర్చిలో అలంకృతమై ఉంటాయి. ఈ స్వీట్ చర్చ్ పదిహేను రోజుల వరకు నిల్వ ఉంటుంది. దీన్ని పిల్లలు తినవచ్చు. ఆత్మీయులకు క్రిస్మస్ కానుకగా ఇవ్వొచ్చు. క్రిస్మస్ బొకే సాధారణంగా దొరికే బొకేలలో గులాబీలతో పాటు రకరకాల పువ్వులను మాత్రమే చూస్తుంటాం. ఈ ప్రత్యేకమైన క్రిస్మస్ బొకేలో మాత్రం... ప్లాస్టిక్ చెట్టుకు వివిధ రకాల చాక్లెట్లు, బిస్కెట్లతో అలంకరించిన స్టార్లు, బౌ, బెల్స్, శాంతాక్లాజ్‌తో చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. పండగ ముగియగానే.. మన ఇంట్లో పిల్లలకు తీపి పండగ. ఆన్లైన్లో కూడా... ఆత్మీయులకు, స్నేహితులకు, బంధువులకు విభిన్నమైన క్రిస్మస్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? అయితే వీటి కోసం ఎన్నో ఆన్లైన్ వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి. శాంతాక్లాజ్ రూపంలో ఉన్న పర్ఫ్యూమ్ బాటిల్, పెన్‌స్టాండ్, హ్యాండ్ వాష్... ఇలా క్రిస్మస్ పండగ అంటే గుర్తుకు వచ్చే వస్తువులతో గృహాలంకరణ వస్తువులు అందుబాటు ధరల్లో ఉన్నాయి. వీటికి గ్రీటింగ్ కార్డ్ కూడా జత చేసి పంపితే... మీ పండగ సంతోషాన్ని పంచినట్లే. లిటిల్ ఏంజిల్స్ ఈ డ్రెస్ ధరిస్తే పిల్లలు సాక్షాత్తు దేవదూతల్లా కనిపిస్తారు. ప్రత్యేకంగా క్రిస్మస్ను దృష్టిలో పెట్టుకొని దీన్ని డిజైన్ చేశారు. సెట్‌గా లభించే ఈ డ్రెస్‌లో... కుచ్చుల ఫ్రాక్, ఫెయిరీ వింగ్స్, హెడ్ వెయిల్, మ్యాజిక్ వాండ్, హెయిర్ బాండ్...మొదలైనవి ఉంటాయి. వైట్, పింక్ అండ్ రెడ్ కలర్స్‌లో లభించే ఈ డ్రెస్ పిల్లలకు వేస్తే... పండగ కళ రెట్టింపుగా ఉట్టిపడుతుంది. -
చాక్లెట్ హట్
స్వచ్ఛమైన కోకో బట్టర్‌తో తయారైన శాకాహార చాక్లెట్లు నగరవాసుల నోరూరిస్తున్నాయి. తాజ్‌మహల్, ఏంజిల్, శాంతాక్లాజ్, ఫ్లవర్ బాస్కెట్, హట్స్ తదితర థీమ్‌లతో తయారు చేసిన చాక్లెట్లు జూబ్లీహిల్స్‌లో బుధవారం ప్రారంభమైన చాక్లెట్ హట్లో నోరూరిస్తున్నాయి. మోకా క్రీమ్, రిచ్ మరిపాన్, ప్రాలినె, మింట్క్రీమ్, రకరకాల పండ్లు, డ్రై ఫ్రూట్స్, కొబ్బరి, బాదం వంటి వాటితో తయారు చేసిన ప్రీమియమ్ సాఫ్ట్ చాక్లెట్లు యమ టేస్టీగా ఉన్నాయి. సాక్షి, సిటీప్లస్ -
తీపిని పంచే కెరీర్.. చాక్లెట్ టేస్టర్!
చాక్లెట్లు.. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ప్రీతిపాత్రం. నోట్లో వేసుకోగానే కరిగిపోయే మృదు మధురమైన చాక్లెట్లను ఇష్టపడనివారు ఎవరూ ఉండరు. ఇవి లేకుండా కొన్ని వేడుకలకు నిండుదనం రాదు. మిఠాయిల స్థానంలో చాక్లెట్లను కానుకగా ఇచ్చే సంప్రదాయం ఎప్పుడో మొదలైంది. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ఇవి ప్రాంతాలకు అతీతంగా ప్రపంచవ్యాప్తంగా అందరి నోళ్లను తీపి చేస్తున్నాయి. భిన్న రకాల చాక్లెట్లను రుచి చూడడమే కాదు, వాటి తయారీపై ఆసక్తి ఉన్నవారు ఈ రంగంలోకి నిరభ్యంతరంగా ప్రవేశించొచ్చు. చాక్లెట్ల వ్యాపారం నానాటికీ విస్తరిస్తుండడంతో నిపుణులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. ప్రధానంగా ఇందులో మహిళలకు ఎన్నో అవకాశాలున్నాయి. కొరత లేని అవకాశాలు భారత్‌లో చాక్లెట్ల తయారీ కార్పొరేట్ స్థాయితోపాటు కుటీర పరిశ్రమగా కూడా కొనసాగుతోంది. చాక్లెట్ టేస్టర్‌కు కార్పోరేట్ సంస్థల్లో ఉద్యోగాలు దక్కుతున్నాయి. నాణ్యమైన ముడి సరకును సేకరించడం, చాక్లెట్‌ను తయారు చేయడం, స్వయంగా రుచి చూసి, అత్యుత్తమదాన్ని ఎంపిక చేయడం, ప్రిజర్వేషన్, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, డిస్ట్రిబ్యూషన్.. ఇలా వివిధ దశల్లో వీరు సేవలందించాల్సి ఉంటుంది. జనం అభిరుచికి, మార్కెట్ అవసరాలకు తగిన సరకును ఉత్పత్తి చేయడం టేస్టర్ల ప్రధాన బాధ్యత. మొదట సంస్థల్లో ఉద్యోగం ద్వారా అనుభవం గడించి, సొంతంగా చాక్లెట్ తయారీని చేపట్టవచ్చు. దీనికి డిమాండ్ తగ్గే ప్రసక్తే లేదు. కాబట్టి అవకాశాలకు కొరతే ఉండదు. నిపుణులకు విదేశాల్లో అధిక వేతనాలతో కూడిన అవకాశాలు లభిస్తున్నాయి. సృజనాత్మకతతో కొత్త రుచులను వినియోగదారులకు పరిచయం చేయగలిగితే అవకాశాలు, ఆదాయం పెరుగుతాయి. కావాల్సిన స్కిల్స్: చాక్లెట్ టేస్టర్‌గా వృత్తిలో రాణించాలంటే ఈ రంగంపై వ్యక్తిగతంగా ఆసక్తి ఉండాలి. వివిధ ఫ్లేవర్లను రుచి చూసి, వాటిలో స్వల్ప తేడాలను కూడా పసిగట్టి చెప్పగలిగే నైపుణ్యం అవసరం. అందుకు నాలుకపై రుచి మొగ్గలు సరిగ్గా పనిచేయాలి. ఈ రంగంలోని లేటెస్ట్ ట్రెండ్స్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ నైపుణ్యాలకు మెరుగులు దిద్దుకోవాలి. తయారు చేసే చాక్లెట్లలో ఆశించిన రుచి వచ్చేదాకా ఓపికతో పనిచేయాలి. టేస్టర్లు.. ముడి సరకు పంపిణీదారులు, డిజైన్ ఏజెన్సీలు, వినియోగదారులో తరచుగా మాట్లాడాల్సి ఉంటుంది. కనుకు వీరికి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. విధుల్లో భాగంగా అనారోగ్య సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తపడాలి. అర్హతలు: చాక్లెట్ టేస్టర్‌గా మారేందుకు ప్రత్యేకంగా ఎలాంటి విద్యార్హతలు అవసరం లేదు. అయితే, మనదేశంలో న్యూట్రీషన్ అండ్ ఫుడ్ టెక్నాలజీ, అప్లయిడ్ సైన్స్(హానర్స్) గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో భాగంగా చాక్లెట్ మేకింగ్, టేస్టింగ్‌పై శిక్షణ ఇస్తున్నారు. కొన్ని హోటల్ మేనేజ్మెంట్ విద్యాసంస్థలు కూడా దీనిపై కోర్సులను నిర్వహిస్తున్నాయి. ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణత సాధించిన తర్వాత ఈ కోర్సుల్లో చేరొచ్చు. ఈ కోర్సులను పూర్తిచేసినవారికి ఉద్యోగాల విషయంలో ప్రాముఖ్యత ఉంటుంది. వేతనాలు: ఇండియన్ మార్కెట్లో చాక్లెట్ టేస్టర్‌కు ప్రారంభంలో నెలకు రూ.20 వేల వేతనం లభిస్తుంది. అనుభవం, పనితీరు, నైపుణ్యాలను బట్టి వేతనం పెరుగుతుంది. విదేశాల్లో చాక్లెట్ నిపుణులకు అధిక జీతభత్యాలు అందుతాయి. కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు: యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ వెబ్సైట్: www.du.ac.in/du/ యూనివర్సిటీ ఆఫ్ మైసూర్ వెబ్సైట్: www.unimysore.ac.in ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, కేటరిం గ్ టెక్నాలజీ అండ్ అప్లయిడ్ న్యూట్రీషన్-గోవా వెబ్సైట్: www.ihmgoa.nic.in చాకోలెట్ అకాడమీ వెబ్సైట్: www.chocolateacademy.com ఎంటర్‌ప్రెన్యూర్‌సగా మారొచ్చు ‘‘చాక్లెట్ అంటే ఎవరికైనా నోరూరుతుంది. పెరిగిన డిమాండ్‌తో వీటి ధరలు కూడా పెరిగాయి. దీంతో ఇటీవల చాక్లెట్ మేకింగ్‌ను నేర్చుకునే వారి సంఖ్య పెరుగుతోంది. కేవలం హాబీగానే కాకుండా మహిళలు దీన్ని ఉపాధి మార్గంగా ఎంచుకుంటున్నారు. వీటి త యారీలో సృజనాత్మకత, నైపుణ్యాన్ని జోడిస్తే వినియోగదారుల నుంచి ఆదరణ లభిస్తుంది. మారుతున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా చాక్లెట్లలో వైవిధ్యమైన ఫ్లేవర్స్ వస్తున్నాయి. దీని తయారీలో శిక్షణ పొంది సర్టిఫికేషన్ పొందిన వారు ఎంటర్‌ప్రెన్యూర్‌సగా మారవచ్చు. ఉద్యోగం చేయదలచుకుంటే చాక్లెట్ టేస్టర్‌గా పేరున్న కంపెనీల్లో మంచి వేతనాలతో ఉద్యోగిగా జీవితం ప్రారంభించవచ్చు. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా వంటి నగరాల్లో వీరికి మంచి డిమాండ్ ఉంది. హైదరాబాద్‌లోనూ ఇటీవలే ఈ ట్రెండ్ మొదలైంది. షాపింగ్ మాల్స్, స్టార్ హోటల్స్, ఫంక్షన్స్‌లో చాక్లెట్ క్రీమ్‌ను ఇవ్వడం పరిపాటిగా మారింది. రాబోయే రోజుల్లో ఈ రంగంలో కెరీర్‌గా బాగుంటుందని చెప్పొచ్చు’’ -నీతూ జైన్, చాకోలెట్ మేకింగ్ శిక్షకురాలు, సికింద్రాబాద్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఆఫీసర్లు ఇండియన్ ఎయిర్ ఫోర్స్.. ఫాస్ట్ ట్రాక్ సెలక్షన్ ద్వారా ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఫ్లైయింగ్. అర్హతలు: 60 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులు. లేదా 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. అకౌంట్స్. అర్హతలు: 60 శాతం మార్కులతో కామర్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులు. లేదా 50 శాతం మార్కులతో కామర్స్‌లో పీజీ/సీఏ/ఐసీడబ్ల్యూఏ ఉండాలి. మెటీరియాలజీ. అర్హతలు: సైన్స్ స్ట్రీమ్/మ్యాథ మెటిక్స్/స్టాటిస్టిక్స్/జాగ్రఫీ/కంప్యూటర్ అప్లికేషన్స్/ ఎన్విరాన్మెంటల్ సైన్స్/అప్లయిడ్ ఫిజిక్స్/ఓషియనో గ్రఫీ/మెటీరియాలజీ/అగ్రికల్చరల్ మెటీరియాలజీ/ ఎకాలజీ అండ్ ఎన్విరాన్మెంట్/జియో ఫిజిక్స్/ ఎన్విరాన్మెంటల్ బయాలజీలో 55 శాతం మార్కులతో పీజీ ఉండాలి. సెలక్షన్ తేది: సెప్టెంబర్ 14 వెబ్సైట్: http://careerairforce.nic.in నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్యూబర్క్యులోసిస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్యూబర్క్యులోసిస్-న్యూఢిల్లీ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. సీనియర్ రెసిడెంట్ విభాగాలు: టీబీ అండ్ చెస్ట్ డిసీజ్, మైక్రోబయాలజీ, ఎనస్థీషియా, మాలిక్యులర్ మెడిసిన్/జెనెటిక్స్, థోరాసిక్ సర్జరీ, పాథాలజీ జూనియర్ రెసిడెంట్ పూర్తి వివరాల కోసం వెబ్సైట్ చూడొచ్చు. ఎంపిక: సెప్టెంబర్ 16న నిర్వహించనున్న వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా... వెబ్సైట్: www.nitrd.nic.in నేను ఆర్ట్స విద్యార్థిని. పోలీసు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నాను. బయాలజీ కోసం ఏయే పుస్తకాలు చదవాలి? - వి.నవీన్, మూసాపేట ఏ పోటీ పరీక్షలోనైనా జనరల్ స్టడీస్ అత్యంత కీలకమైంది. ఈ సబ్జెక్టును క్షుణ్నంగా చదివినవారు పోటీలో ఎప్పుడూ ముందంజలో ఉంటారు. ఇందులో వివిధ అంశాలుంటాయి. అందరికీ అన్ని అంశాలపై పట్టు ఉండకపోవచ్చు. కానీ పట్టుదలతో కృషిచేస్తే 95 శాతం మార్కులు సాధించడం కష్టమేమీ కాదు. జనరల్ స్టడీస్‌లో కీలకమైన ఒక విభాగం బయాలజీ. పాఠశాల స్థాయిలో 6 నుంచి 10వ తరగతి వరకు జీవశాస్త్ర అంశాలను క్షుణ్నంగా చదివితే ఈ సబ్జెక్టుపై మంచి పట్టు సాధించవచ్చు. దీంతోపాటు దినపత్రికలు, సైన్స మేగజైన్స చదవాలి. గత ప్రశ్నపత్రాలను పరిశీలించి, ప్రశ్నల స్వభావాన్ని అర్థం చేసుకోవాలి. ప్రతి అంశాన్ని విశ్లేషణాత్మకంగా చదివితే కొండ గుర్తుల అవసరం లేకుండా సమాధానాలను గుర్తించవచ్చు. ఒక పాఠ్య భాగాన్ని ప్రిపేరయ్యేటప్పుడు తరచుగా మరచిపోయేందుకు అవకాశమున్న అంశాలను పాయింట్స్ రూపంలో రాసుకొని, పునశ్చరణ చేయాలి. ఎక్కువసార్లు చదివి, సంపూర్ణంగా అర్థం చేసుకుంటే జవాబులను గుర్తించే విషయంలో గందరగోళానికి తావుండదు. ఉద్యోగ భర్తీలకు సంబంధించిన ప్రకటన వచ్చాకే సన్నద్ధతను ప్రారంభించడం ఒకప్పటి విధానం. మారిన పోటీ పరిస్థితుల దృష్ట్యా ఎంత ముందుగా ప్రిపరేషన్ ప్రారంభిస్తే అంత ప్రయోజనం ఉంటుంది. ఉద్యోగం కోసం తపించే ప్రతి ఒక్కరూ కనీసం ఏడాది టైమ్ టేబుల్ వేసుకొని, నిరంతరం ఒక క్రమపద్ధతిలో కష్టపడాలి. వివిధ అంశాలను తమదైన శైలిలో ప్రిపేరైన వారికి ఉద్యోగం కచ్చితంగా సొంతమవు తుంది. ఇప్పటికే ఏదో ఒక ఉద్యోగం చేస్తూ ఉన్నత కొలువు కోసం ప్రయత్నించేవారైతే మరింత శ్రమించాలి. ఇన్పుట్స్: టి.సుధాకర్‌రెడ్డి, సీనియర్ ఫ్యాకల్టీ -
చాకో ... అంటే కోటి
చవులూరించే చాక్లెట్లను నోట్లో వేసుకుంటే చప్పున కరిగిపోతాయి. ఒక్కసారి రుచి మరిగితే చిన్నారులు మొదలుకొని వయసు మళ్లిన వారు సైతం చాక్లెట్ల రుచికి దాసోహం కావలసిందే. చాక్లెట్లలో ప్రధానంగా ఉపయోగించే కోకోతోనే వాటికి ఆ రుచి వస్తుంది. చిన్నపిల్లలకు ఇచ్చేందుకు చాక్లెట్‌ను మించిన తాయిలం లేదు. సంతోషాన్ని పంచుకునే సందర్భాల్లో పెద్దలు కూడా చాక్లెట్లు ఇచ్చిపుచ్చుకోవడం మామూలే. రకరకాల బ్రాండ్లతో, రకరకాల పేర్లతో ఇప్పటికే లెక్కలేనన్ని అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు రొటీన్‌కు భిన్నమైన చాక్లెట్లు వస్తున్నాయి. ఈవెంట్‌కు తగ్గ డిజైన్లలో నోరూరిస్తున్నాయి. - శిరీష చల్లపల్లి చాక్లెట్ కళాఖండాలు... పెళ్లి సందడిలో చాక్లెట్ భాగస్వామిగా మారుతోంది. విలక్షణమైన విజిటింగ్ కార్డులు చాక్లెట్పైనే కొలువుదీరుతున్నాయి. అందరూ చాక్లెట్లపై తెల్లని కేరమెల్తో అక్షరాలు మాత్రమే కాదు, ఫొటోలనూ ముద్రించి సెలబ్రేషన్స్‌కు చాకో హంగులు అద్దుతున్నారు. బర్త్ డే బాయ్స్‌కు వెరైటీ శుభాకాంక్షలు తెలియజేయడానికి ఆ చిన్నారుల ఫొటోలతో లాలిపాప్స్ ప్రిపేర్ చేయించుకోవచ్చు. రాఖీ పండుగ కోసం ఆన్నాచెల్లెల్ల ఫొటోలతో రాఖీ చాకోలు ఆర్డరిస్తే క్షణాల్లో ముందుంటాయి. ఒక రకంగా చెప్పాలంటే మనదైన వేడుకల్లో మనసైన బహుమతి చాక్లెట్ రూపంలో దొరుకుతున్నాయి. హ్యాండ్‌మేడ్ చాక్లెట్లు, షుగర్‌ఫ్రీ చాక్లెట్లు, వైన్, రమ్ వంటి లిక్కర్స్ ఉపయోగించి తయారు చేసే లిక్కర్ చాక్లెట్ల వంటి వినూత్న రకాలు మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. పలు వేడుకల్లో చాక్లెట్ ఫౌంటేన్లు అతిథులకు పసందైన రుచులు అందిస్తున్నాయి. వెరైటీ కోరుకుంటున్నారు ప్రస్తుతం నగరవాసులు ప్రతిదాంట్లో కొత్తదనం కోరుకుంటున్నారు. ఇంట్లో జరిగే చిన్నాపెద్దా ఫంక్షన్లకు చాక్లెట్ హంగులు దిద్దుతున్నారు. తయారీలో స్వచ్ఛత ఉన్న వాటికి ఎక్కువగా ఆదరిస్తున్నారు. వెరైటీ చాక్లెట్లకు డిమాండ్ చాలా ఉంది. అందుకే మా చాక్లెట్ హట్ సంస్థ డిఫరెంట్ డిజైన్లతో చాక్లెట్లను ప్రిపేర్ చేస్తోంది. టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఎన్నికల్లో గెలుపొందిన సందర్భంగా ఆయనకు కానుకగా ఇచ్చిన గులాబీ రంగు చాక్లెట్ బొకే మా తయారీనే. - కె.లక్ష్మి, చాక్లెట్ హట్ నిర్వాహకురాలు -
శ్రీసిటీలో క్యాడ్బరీ..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ‘క్యాడ్బరీ’ బ్రాండ్ నేమ్‌తో చాక్లెట్స్‌ను ఉత్పత్తి చేస్తున్న మాంటెజ్ ఆసియా పసిఫిక్‌లోనే అతిపెద్ద తయారీ కేంద్రాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేస్తోంది. చిత్తూరు జిల్లా శ్రీ సిటీ సెజ్‌లో 134 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో క్యాడ్బరీ ఇండియా ఒప్పందం కుదుర్చుకుంది. బుధవారం హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.కిరణ్ కుమార్ రెడ్డి, క్యాడ్బరీ ఇండియా మేనేజింగ్ డెరైక్టర్ మను ఆనంద్ సంతకం చేశారు. తదనంతరం లాంఛనంగా భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మను ఆనంద్ మాట్లాడుతూ ఇది దేశంలో ఏడవ తయారీ కేంద్రమని, 2.50 లక్షల టన్నుల సామర్థ్యంగల ఈ ప్రాజెక్టును 2020కి నాలుగు దశల్లో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. మొదటి దశ యూనిట్ 2015 మధ్య నాటికి అందుబాటులోకి వస్తుందని, ఇందుకోసం రూ.1,000 కోట్లు వ్యయం చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఇండియాలో క్యాడ్బరీ బ్రాండ్ పేరుమీద అయిదు రకాల ఉత్పత్తులు అందిస్తున్నామని, కాని ఈ యూనిట్ మొదటి దశలో చాక్లెట్స్పైనే ప్రధానంగా దృష్టిసారిస్తున్నట్లు తెలిపారు. చాక్లెట్స్కు ప్రధానముడిసరుకైన ‘కోకా’కోసం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లలో 6,000 మంది రైతులతో కాంట్రాక్టింగ్ పద్ధతిలో కోకా సాగును చేపట్టినట్లు తెలిపారు. నాలుగున్నర లక్షలమంది రైతులకు ఉపయోగం క్యాడ్బరీ చాక్లెట్ తయారీ కేంద్రానికి అవసరమైన పాలు, పంచదార సరఫరా చేయడం ద్వారా నాలుగున్నర లక్షలమంది రైతులు నేరుగా ప్రయోజనం పొందనున్నట్లు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ యూనిట్ పూర్తిస్థాయి సామర్థ్యం అందుబాటులోకి వస్తే రోజుకి పదిలక్షల లీటర్ల పాలు, 100 టన్నుల పంచదార అవసరమవుతుందన్నారు. ఈ యూనిట్ ద్వారా 1,600 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. తాను ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు రూ.1.30 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులు రాష్ట్రానికి వచ్చినట్లు కిరణ్ కుమార్ తెలిపారు. గతేడాది రాష్ట్రం ఎదుర్కొన్న విద్యుత్ సంక్షోభం ఈ ఏడాది నుంచి ఉండదని రాష్ట్ర పారిశ్రామిక రంగానికి ముఖ్యమంత్రి అభయమిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి జె.గీతా రెడ్డి మాట్లాడుతూ త్వరలో మెదక్ జిల్లాలో ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్, జాన్సన్ అండ్ జాన్సన్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. -
ఎంత జాగ్రత్తగా ఉన్నా... ఈ దంత సమస్యలేమిటి?
నా వయసు 25. ఒక పన్ను పుచ్చింది. ఈ మధ్యే చికిత్స చేయించుకున్నాను. మా నాన్నగారు నా చిన్నప్పటినుంచి చాలా పంటి జబ్బులతో ఇబ్బంది పడుతూనే ఉన్నారు. నేను ఎంత జాగ్రత్తగా ఉందామనుకున్నా నాకూ పంటిసమస్యలు వస్తూనే ఉన్నాయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు. తగిన సలహా చెప్పగలరు. -డి.అశోక్, హైదరాబాద్ మనం దేనిని ఉపయోగించినా లేకపోయినా, పళ్లను, నోటిని మాత్రం నిత్యం నిరంతరం ఉపయోగిస్తునే ఉంటాము. దానికితోడు రోజూవారి ఆహారం తీసుకోవడం వల్ల దంతాలు, నోటిలోని ఇతర భాగాలు బయటి వాతావరణానికి ప్రభావితమవుతుంటాయి. మనం కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే చాలు... నోటి ఆరోగ్యం పదికాలాలపాటు పదిలంగా ఉంటుంది. పంటికి అతుక్కుపోయే అహార పదార్థాలు... అంటే చాక్లెట్లు, స్వీట్లు, బేకరీ ఫుడ్ వంటివి పళ్లకు అనర్థదాయకం. పంటికి, చిగుళ్లకు అతుక్కోకుండా సులభంగా గొంతులోకి వెళ్లే ఆహారమే అత్యుత్తమమైనది. ఈమధ్య అందరూ జంక్‌ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నారు. ఇది పంటిపైన, పంటిసందుల్లోనూ అతుక్కుపోతుంటుంది. సాధారణంగానే నోటిలో ఉండే బ్యాక్టీరియా ఈవిధంగా ఇరుక్కున్న ఆహారంతో కలిసిపోయి హానికర రసాయనాలను విడుదల చేస్తుంది. ఫలితంగా అన్ని రకాల దంతసమస్యలూ మొదలవుతాయి. వీటితోపాటుగా మరెన్నో అంశాలు కూడా నోటి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. వంశపారంపర్య సమస్యలు, మనం నివసించే పరిసరాలు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు లాంటివెన్నో పంటి ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. మరో ముఖ్యవిషయం... రోజూ ఒకపూట పళ్లు తోముకుని నోటి ఆరోగ్యం కోసం ఎంతో కష్టపడిపోతున్నామని ఫీలైపోతుంటారు కొంతమంది. అతి జాగ్రత్తకు పోయి పళ్లని దాదాపు అరగంటసేపు బరాబరా తోమేస్తుంటారు మరికొంతమంది. నిజానికి ఈ రెండు పద్ధతులూ సరైనవి కావు. రోజూ నిద్రలేవగానే, ఆ తర్వాత పడుకునే ముందు నాలుగు నిమిషాలపాటు శుభ్రంగా బ్రష్ చేసుకుంటే సరిపోతుంది. ఖరీదైన పేస్టు, వింత వింత బ్రష్‌ల మీద కాకుండా బ్రష్ చేసుకునే విధానంపైన దృష్టి పెడుతూ శాస్త్రీయమైన పద్ధతిలో... వీలైతే అద్దంలో చూసుకుంటూ బ్రష్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అయితే అంతటితో సరిపెట్టకూడదు. రెండు పళ్లమధ్య చేరుకున్న ఆహారాన్ని డెంటల్ ఫ్లాస్ అనబడే నైలాన్ దారంతో శుభ్రపరచుకోవాలి. టూత్‌పిక్స్, పిన్నులు లాంటివి పళ్లల్లో పెట్టి కెలుక్కోకూడదు. ఇది హానికరమైన అలవాటు. దీంతోపాటు మౌత్‌వాష్ అనబడే నోరు పుక్కిలించే ద్రవాన్ని కూడా వాడుతుండాలి. దీనివల్ల నోటిలోని బ్యాక్టీరియాను అదుపులో ఉంచవచ్చు. ఇవన్నీ చేస్తూనే ప్రతి ఆరునెలలకోసారి డెంటిస్ట్‌ను కలిసి చెకప్ చేయించుకోవటం, రెగ్యులర్‌గా చేసుకునే క్లీనింగ్, స్కేలింగ్, పాలిషింగ్ లాంటి చికిత్సల వల్ల దంతసమస్యలను చాలామేరకు నివారించవచ్చు. డాక్టర్ పార్థసారథి కాస్మటిక్ డెంటల్ సర్జన్, పార్థా డెంటల్, హైదరాబాద్ -
చాక్లెట్ తిన్న విద్యార్థులకు అస్వస్థత
తమ తోటి విద్యార్థిని జన్మదినం సందర్భంగా పాఠశాలలో పంపిణీ చేసిన చాక్లెట్లు తిన్న 20 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 12 మంది బాలికలు, ఎనిమిది మంది బాలురున్నారు. ఠాణే మాజీవాడాలోని సంకేత్ పాఠశాలలో బుధవారం ఉదయం జరిగిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలాన్ని సృష్టించింది. అందిన వివరాల మేరకు...స్థానిక మనపాడా ప్రాంతంలోని సంకేత్ విద్యాలయలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులు తమ సహచర విద్యార్థిని పుట్టినరోజు కావడంతో తీసుకొని వచ్చిన చాక్లెట్లను తీసుకొని తిన్నారు. అనంతరం అనేక మంది విద్యార్థులకు కడుపులో మంట, నొప్పి ప్రారంభమైంది. ఆ వెంటనే వీరిని పాఠశాల యజమాన్యం సమీపంలోని టైటన్ ఆసుపత్రికి తరలించింది. చికిత్స అనంతరం అనేక మందిని డిశ్చార్జి చేసిన వైద్యులు ఐదుగురు విద్యార్థులకు ఇంకా అబ్జర్వేషన్లోనే ఉంచారు. ఈ సంఘటన అనంతరం ఒక్కసారిగా పాఠశాల విద్యార్థుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.ఈ వార్త తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకున్నారు. దీంతో పాఠశాలతో పాటు టైటాన్ ఆసుపత్రి పరిసరాల్లో రద్దీ కన్పించింది. తమ పిల్లలు సురక్షితంగా ఉన్నారని తెలుసుకున్న కొంతమంది తల్లిదండ్రుల్లో ఆనందం కనిపించగా, తమ పిల్లలు అస్వస్థతకు గురయ్యారని తెలుసుకున్న తల్లిదండ్రుల్లో విషాదం నెలకొంది. అయితే వీరి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలుపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై కేసు నమోదుచేసిన కాపూరిబావుడి పోలీసులు చాక్లెట్లు ఎక్కడి నుంచి కొనుగోలు చేసిన విషయాన్ని ఆరా తీసి బానుశాలి అనే దుకాణ యజమానిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఇలాంటి పుట్టిన రోజు వేడుకలకు చాక్లెట్లు, తినుబండారాలు పంపిణీ చేయడాన్ని నిషేధించామని పాఠశాల సిబ్బంది ఒకరు తెలిపారు. దీనికి బదులు పెన్నులు, పుస్తకాలు ఇవ్వాలని సూచించామని అన్నారు. -
చాక్లెట్ తిన్న విద్యార్థులకు అస్వస్థత
తమ తోటి విద్యార్థిని జన్మదినం సందర్భంగా పాఠశాలలో పంపిణీ చేసిన చాక్లెట్లు తిన్న 20 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 12 మంది బాలికలు, ఎనిమిది మంది బాలురున్నారు. ఠాణే మాజీవాడాలోని సంకేత్ పాఠశాలలో బుధవారం ఉదయం జరిగిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలాన్ని సృష్టించింది. అందిన వివరాల మేరకు...స్థానిక మనపాడా ప్రాంతంలోని సంకేత్ విద్యాలయలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులు తమ సహచర విద్యార్థిని పుట్టినరోజు కావడంతో తీసుకొని వచ్చిన చాక్లెట్లను తీసుకొని తిన్నారు. అనంతరం అనేక మంది విద్యార్థులకు కడుపులో మంట, నొప్పి ప్రారంభమైంది. ఆ వెంటనే వీరిని పాఠశాల యజమాన్యం సమీపంలోని టైటన్ ఆసుపత్రికి తరలించింది. చికిత్స అనంతరం అనేక మందిని డిశ్చార్జి చేసిన వైద్యులు ఐదుగురు విద్యార్థులకు ఇంకా అబ్జర్వేషన్లోనే ఉంచారు. ఈ సంఘటన అనంతరం ఒక్కసారిగా పాఠశాల విద్యార్థుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.ఈ వార్త తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకున్నారు. దీంతో పాఠశాలతో పాటు టైటాన్ ఆసుపత్రి పరిసరాల్లో రద్దీ కన్పించింది. తమ పిల్లలు సురక్షితంగా ఉన్నారని తెలుసుకున్న కొంతమంది తల్లిదండ్రుల్లో ఆనందం కనిపించగా, తమ పిల్లలు అస్వస్థతకు గురయ్యారని తెలుసుకున్న తల్లిదండ్రుల్లో విషాదం నెలకొంది. అయితే వీరి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు తెలుపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దీనిపై కేసు నమోదుచేసిన కాపూరిబావుడి పోలీసులు చాక్లెట్లు ఎక్కడి నుంచి కొనుగోలు చేసిన విషయాన్ని ఆరా తీసి బానుశాలి అనే దుకాణ యజమానిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు. కాగా, ఇలాంటి పుట్టిన రోజు వేడుకలకు చాక్లెట్లు, తినుబండారాలు పంపిణీ చేయడాన్ని నిషేధించామని పాఠశాల సిబ్బంది ఒకరు తెలిపారు. దీనికి బదులు పెన్నులు, పుస్తకాలు ఇవ్వాలని సూచించామని అన్నారు.