![Recipes In Telugu: Dates Donuts Apple Chocolate Wontons - Sakshi](/styles/webp/s3/article_images/2021/09/13/nuts2.jpg.webp?itok=d_kJ63Bn)
నోరూరించే డేట్స్ డోనట్స్, ఆపిల్ చాక్లెట్ వొంటన్స్, ప్రాన్స్- ఎగ్‌బాల్స్ ఇంట్లోనే ఇలా సింపుల్‌గా తయారు చేసుకోండి.
డేట్స్ డోనట్స్
కావలసినవి: మైదాపిండి – 2 కప్పులు
పంచదార పొడి – 1 కప్పు, వైట్ వెనిగర్, వెనీలా ఎసెన్స్,
బేకింగ్ సోడా – 1 టీ æస్పూన్ చొప్పున, ఉప్పు – అర టీ స్పూన్,
మజ్జిగ – ముప్పావు కప్పు, గుడ్లు – 2, పంచదార పొడి – అర కప్పు
ఖర్జూరం – 6 (గింజలు తీసి, గుజ్జులా చేసుకోవాలి)
నూనె – 2 టేబుల్ స్పూన్లు, నీళ్లు – 2 టేబుల్ స్పూన్లు,
హెవీ క్రీమ్ – అర కప్పు, ఉప్పు – 1 టేబుల్ స్పూన్
తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో మైదాపిండి, పంచదార పొడి, బేకింగ్ సోడా, మజ్జిగ, వెనీలా ఎసెన్స్, గుడ్లు, నూనె, వైట్ వెనిగర్, ఖర్జూరం గుజ్జు, తగినంత ఉప్పు వేసుకుని బాగా కలిపి పెట్టుకోవాలి.
►డోనట్స్ మేకర్‌కి కొద్దిగా నూనె పూసి, ఆ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా పెట్టుకుని, ఓవెన్‌లో కుక్ చేసుకోవాలి.
►అనంతరం ఒక కళాయిలో హెవీ క్రీమ్, నీళ్లు, కొద్దిగా ఉప్పు, పంచదార పొడి వేసుకుని.. పాకం పట్టించి.. సర్వ్ చేసుకునే ముందు డోనట్స్‌పైన వేసుకుంటే భలే రుచిగా ఉంటాయి.
ఆపిల్ చాక్లెట్ వొంటన్స్
కావలసినవి: ఆపిల్ గుజ్జు – పావు కప్పు
చాక్లెట్ పౌడర్ – 3 టేబుల్ స్పూన్లు
జీడిపప్పు, వాల్‌నట్స్, బాదం పప్పు – 4 టేబుల్ స్పూన్ల చొప్పున (నేతిలో దోరగా వేయించి మిక్సీలో పౌడర్ చేసుకోవాలి)
గుడ్డు తెల్లసొన – 1
పంచదార పొడి – అభిరుచిని బట్టి
చీజ్ – 2 టేబుల్ స్పూన్లు
వొంటన్ రేపర్స్ – 20 (మార్కెట్‌లో దొరుకుతాయి)
నూనె – డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ: ముందుగా ఒక బౌల్‌లో ఆపిల్ గుజ్జు, చాక్లెట్ పౌడర్, జీడిపప్పు మిశ్రమం, పంచదార పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. అందులో చీజ్, గుడ్డు తెల్లసొన వేసుకుని బాగా కలిపి ముద్దలా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా వొంటన్ రేపర్స్‌లో పెట్టుకుని.. నచ్చిన షేప్‌లో మడిచి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే అభిరుచిని బట్టి పంచదార పొడితో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది.
ప్రాన్స్–ఎగ్ బాల్స్
కావలసినవి: రొయ్యలు – అర కిలో (శుభ్రం చేసుకుని.. ఉప్పు, కారం, పసుపు దట్టించి కుకర్‌లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉంచి తీసుకోవాలి. చల్లారాక చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి)
మిరియాల పొడి – అర టీ స్పూన్
సోయా సాస్ – 2 టేబుల్ స్పూన్లు
అల్లం–వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి పేస్ట్ – పావు టేబుల్ స్పూన్
ఉల్లిపాయల పేస్ట్ – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు
గుడ్డు – 1
మొక్కజొన్న పిండి – 2 టేబుల్ స్పూన్లు
బ్రెడ్ పౌడర్ – పావు కప్పుతో పాటు 4 టేబుల్ స్పూన్లు అదనంగా కూడా
ఉప్పు – తగినంత, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా
తయారీ: ముందుగా రొయ్యల ముక్కల్లో మిరియాల పొడి, సోయాసాస్, అల్లం–వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, ఉల్లిపాయల పేస్ట్, పావు కప్పు బ్రెడ్ పౌడర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. అందులో గుడ్డు, మొక్కజొన్న పిండి, తగినంత ఉప్పు వేసుకుని బాగా కలిపి ఉండల్లా చేసుకుని అదనంగా తీసుకున్న బ్రెడ్ పౌడర్‌లో అటు ఇటు తిప్పి.. ప్రతి ఉండకు బ్రెడ్ పౌడర్ పట్టించి 20 నిమిషాలు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. ఆపైన నూనెలో డీప్ ఫ్రై చేసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.
Comments
Please login to add a commentAdd a comment