బ్యాంకులో లోన్లు తీసుకుని ఈఎంఐలు సక్రమంగా కట్టనివారి నుంచి బకాయిలు రాబట్టేందుకు అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) వినూత్న ఐడియా వేసింది. ఈఎంఐలు చెల్లించనివారికి ఇక నోటీసులు, ఫోన్ కాల్స్ కాకుండా నేరుగా ఇంటికే వెళ్లి చేతిలో చాక్లెట్లు పెట్టి శుభాకాంక్షలు చెప్పి వాయిదా కట్టేలా చేస్తోంది.
(ఈ బ్యాంక్ కస్టమర్లకు గుడ్ న్యూస్! ఇంటి వద్దకే ప్రభుత్వ బ్యాంక్ సేవలు)
ఈఎంఐ చెల్లించకుండా తప్పించుకోవాలనుకుంటున్న కస్టమర్లు.. సాధారణంగా బ్యాంక్ చేసే రిమైండర్ కాల్‌కు స్పందించరు. కాబట్టి ఫోన్ కాల్స్ కాకుండా నేరుగా కస్టమర్లకు ఇంటికే వెళ్లి గుర్తు చేయడం ఉత్తమ మార్గమని ఎస్‌బీఐ భావిస్తోంది. వడ్డీ రేట్లలో కదలికల నేపథ్యంలో ఈఎంఐలు చెల్లింపుల్లో జాప్యాలు బాగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో మెరుగైన వసూళ్లను సాధించడానికి ఎస్‌బీఐ ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది.
(PM Vishwakarma Scheme: రూ.13,000 కోట్లతో కేంద్ర ప్రభుత్వ కొత్త పథకం.. ప్రయోజనాలు ఇవే..)
ఎస్‌బీఐ రిటైల్ లోన్ బుక్ 2023 జూన్ త్రైమాసికంలో గతేడాది రూ.10,34,111 కోట్ల నుంచి 16.46 శాతం పెరిగి రూ. 12,04,279 కోట్లకు చేరుకుంది. ఇక మొత్తం రిటైల్ రుణాలు 13.9 శాతం వృద్ధి చెంది రూ. 33,03,731 కోట్లకు చేరుకున్నాయి.
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను ఉపయోగించే రెండు ఫిన్‌టెక్ కంపెనీలతో ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఎస్‌బీఐలో రిస్క్ విభాగానికి ఇన్‌చార్జ్ మేనేజింగ్ డైరెక్టర్ అశ్విని కుమార్ తివారీ తెలిపారు. ఈ ఫిన్‌టెక్ ప్రతినిధులు ఈఎంఐ చెల్లించని కస్టమర్ల ఇళ్లకు వెళ్లి చాక్లెట్ల ప్యాక్ ఇచ్చి ఈఎంఐ బకాయిని గుర్తుచేస్తారని పేర్కన్నారు. అయితే ఆ ఫిన్‌టెక్‌ల పేరు చెప్పడానికి ఆయన నిరాకరించారు. ఈ చర్య కేవలం పైలట్ దశలో ఉందని, కేవలం 15 రోజుల క్రితమే దీనిని అమలులోకి తెచ్చామని, విజయవంతమైతే అధికారికంగా ప్రకటిస్తామని ఆయన వివరించారు.
(కస్టమర్లకు షాకిచ్చిన ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్! సెప్టెంబర్ 21 నుంచే..)
Comments
Please login to add a commentAdd a comment