పారిస్: ప్రతి ఒక్కరూ తమ సొంతింటిని స్వీట్ హోంగా చెప్పుకొంటుంటారు. అలాగే ఫేస్‌బుక్, వాట్సాప్‌ల్లో తమ ఇంటి ఫొటోలు పోస్ట్ చేస్తూ... ‘మై స్వీట్ హోం’ అని చేసే పోస్టులనూ మీరు చూసే ఉంటారు. అయితే ఇప్పుడు తెలుసుకోబోయే ఇల్లు నిజంగానే ‘స్వీట్ హోం’. ఎందుకంటే ఈ ఇంటిని మొత్తం చాక్లెట్‌తో రూపొందించారు. నమ్మలేకపోతున్నారా? అయితే ఈ ఇంటి గురించి తెలుసుకొని తీరాల్సిందే... పారిస్‌లోని సౌత్‌వెస్ట్రన్ శివారులో ఉందీ ఇల్లు. దీన్ని ఆస్ట్రియాకు చెందిన ప్రముఖ చాక్లెట్ కంపెనీ యజమాని జీన్–లూక్ డిక్యుజియో నిర్మించారు. ఈ ఇంట్లోని గోడల నుంచి పైకప్పు వరకు, పుస్తకాల నుంచి గడియారాల వరకు అణువణువునూ చాక్లెట్లతోనే రూపొందించారు. అంతేకాదు ఈ చాక్లెట్లను తినడానికి వీలుండడం మరో విశేషం. మరి ఈ చాక్లెట్ కాటేజీలో ఎవరు ఉంటారనేదేగా మీ డౌట్... ఇందులో నివసించడానికి ఆసక్తి ఉన్న వారు ఆన్‌లైన్ ద్వారా అక్టోబర్ 5, 6 తేదీల్లో కాటేజీని బుక్ చేసుకునే అవకాశం కల్పించారు. ప్రస్తుతం ఈ కాటేజీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment