
చాక్లెట్స్‌లో గంజాయి
నిజామాబాద్: జిల్లాలో అక్రమంగా సాగుతున్న గంజాయి దందా గుట్టును పోలీసులు బుధవారం రట్టు చేశారు. చాక్లెట్స్‌లో గంజాయి పెట్టి అమ్ముతున్న గ్యాంగ్‌లో ఓ వ్యక్తిని లలిత మహల్ థియేటర్ సమీపంలో అరెస్టు చేశారు. గంజాయిని చాక్లెట్స్‌లో ఉంచి ఒక్కింటికి రూ.5 చొప్పున కూలీలకు, హమాలీలకు అమ్ముతున్నట్లు గుర్తించారు.
అతని వద్ద నుంచి భారీ మొత్తంలో చాక్లెట్ డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. రాజస్ధాన్ నుంచి గంజాయిను తెప్పించి జిల్లాలో అమ్ముతున్నట్లు ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్ తెలిపారు. రూ.45 విలువైన గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. దీని వెనుక ఉన్న సూత్రధారులెవరనే దానిపై దర్యాప్తు చేపట్టామని వెల్లడించారు.