స్విస్ చీజ్, చాక్లెట్, వైన్, వాచీలు, ఇతర ఉత్పత్తులను భారతీయ వినియోగదారులకు మరింత చౌకగా లభించనున్నాయి. యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (ఈఎఫ్‌టీఏ) ఎగుమతుల్లో 95.3 శాతం వాటా కలిగిన 82.7 శాతం టారిఫ్ లైన్లపై కస్టమ్స్ సుంకాలను తగ్గిస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది.
అదనంగా, ఈఎఫ్‌టీఏ దేశాలకు తన సేవల ఎగుమతులను పెంచడానికి ఐటీ, హెల్త్‌కేర్, అకౌంటింగ్ వంటి 105 ఉప రంగాలలో భారతదేశం రాయితీలను అందించింది. యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్‌తో భారత్ మార్చి 10న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందంలో భాగంగా స్విట్జర్లాండ్ నుంచి 128, నార్వే నుంచి 114, లైచెన్టెయిన్ నుంచి 107, ఐస్లాండ్ నుంచి 110 సబ్ సెక్టార్లను భారత్ ఈఎఫ్టీఏకు అనుమతించింది.
1960లో ఏర్పాటు చేసిన ఈఎఫ్‌టీఏ అనేది ఐస్లాండ్, లైచెన్‌స్టెయిన్, నార్వే, స్విట్జర్లాండ్లతో కూడిన ఒక అంతర్ ప్రభుత్వ సంస్థ. ఇది ఐరోపా అంతటా ఆర్థిక సహకారం, స్వేచ్ఛా వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తుంది. మొత్తం 13 మిలియన్ల జనాభాతో, ఈఎఫ్‌టీఏ దేశాలు ప్రపంచంలోని పదో అతిపెద్ద వాణిజ్య వ్యాపారులు, వాణిజ్య సేవల ఎనిమిదో అతిపెద్ద సరఫరాదారులుగా ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment