cheaper
-
ఇక చౌకగా స్విట్జర్లాండ్ చాక్లెట్లు, వాచీలు
స్విస్ చీజ్, చాక్లెట్, వైన్, వాచీలు, ఇతర ఉత్పత్తులను భారతీయ వినియోగదారులకు మరింత చౌకగా లభించనున్నాయి. యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ (ఈఎఫ్టీఏ) ఎగుమతుల్లో 95.3 శాతం వాటా కలిగిన 82.7 శాతం టారిఫ్ లైన్లపై కస్టమ్స్ సుంకాలను తగ్గిస్తున్నట్లు భారత ప్రభుత్వం ప్రకటించింది.అదనంగా, ఈఎఫ్టీఏ దేశాలకు తన సేవల ఎగుమతులను పెంచడానికి ఐటీ, హెల్త్‌కేర్, అకౌంటింగ్ వంటి 105 ఉప రంగాలలో భారతదేశం రాయితీలను అందించింది. యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్‌తో భారత్ మార్చి 10న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందంలో భాగంగా స్విట్జర్లాండ్ నుంచి 128, నార్వే నుంచి 114, లైచెన్టెయిన్ నుంచి 107, ఐస్లాండ్ నుంచి 110 సబ్ సెక్టార్లను భారత్ ఈఎఫ్టీఏకు అనుమతించింది.1960లో ఏర్పాటు చేసిన ఈఎఫ్టీఏ అనేది ఐస్లాండ్, లైచెన్‌స్టెయిన్, నార్వే, స్విట్జర్లాండ్లతో కూడిన ఒక అంతర్ ప్రభుత్వ సంస్థ. ఇది ఐరోపా అంతటా ఆర్థిక సహకారం, స్వేచ్ఛా వాణిజ్యాన్ని ప్రోత్సహిస్తుంది. మొత్తం 13 మిలియన్ల జనాభాతో, ఈఎఫ్టీఏ దేశాలు ప్రపంచంలోని పదో అతిపెద్ద వాణిజ్య వ్యాపారులు, వాణిజ్య సేవల ఎనిమిదో అతిపెద్ద సరఫరాదారులుగా ఉన్నాయి. -
జీఎస్టీ కౌన్సిల్ సమావేశం - ధరలు తగ్గేవి & పెరిగేవి ఇవేనా?
నేటి జీఎస్టీ కౌన్సిల్ 50వ సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి 'నిర్మలా సీతారామన్' అధ్యక్షత ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి, ఏ వస్తువుల ధరలు తగ్గుతాయనే విషయాలు అధికారికంగా వెల్లడవుతాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం.. ఈ రోజు సమావేశంలో ప్రధానంగా ఆన్లైన్ గేమింగ్, మల్టి యుటిలిటీ వాహనాలు, క్యాసినో, గుర్రపు పందాలు వంటి వాటి మీద చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఇవి మరింత ప్రియం కానున్నాయి. కాగా సినిమా హాళ్లలో తినుబండారాల ధరలు తగ్గించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ధరలు పెరిగేవి.. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆన్లైన్ గేమింగ్, క్యాసినోలు, గుర్రపు పందాలు మరింత ప్రియం కానున్నాయి. మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని కమిటీ ఈ మూడింటి మీద ట్యాక్స్ పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం. వీటి పైన జీఎస్టీ 28 శాతం పెరిగే అవకాశం ఉంది. మల్టీ యుటిలిటీ వెహికల్స్ (MUV), క్రాస్ఓవర్ యుటిలిటీ వెహికల్స్ (XUV) ధరలు కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్రం & రాష్ట్ర అధికారులతో కూడిన ఫిట్మెంట్ కమిటీ వీటి మీద 22 శాతం సెస్ వసూలు చేయాలని సిఫార్సు చేసింది. (ఇదీ చదవండి: ఆ రెండు యాప్స్ ఉంటే మీ వివరాలు చైనాకే.. వెంటనే డిలీట్ చేయండి!) ధరలు తగ్గేవి.. సినిమా హాళ్లలో తినుబండారాలు, పానీయాల ధరలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. సినిమా హాళ్ల యజమానులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇండస్ట్రీ లాబీ గ్రూప్ మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (MAI) పన్నులను తగ్గించనున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద సినిమా హాళ్లలో ఆహార పానీయాలపై 18 శాతం జీఎస్టీ కాకుండా 5 శాతం వర్తిస్తుందని కౌన్సిల్ ఈ రోజు స్పష్టం చేసిందని రెవెన్యూ కార్యదర్శి 'సంజయ్ మల్హోత్రా' అధికారికంగా తెలిపారు. శాటిలైట్ సర్వీస్ లాంచ్ కూడా చౌకగా మారే అవకాశం ఉంది. కమిటీ దీనిపైనా కూడా ట్యాక్ తగ్గింపుని కల్పించడానికియోచిస్తోంది. మెడిసిన్స్ మీద కూసే ధరలు తగ్గే అవకాశం ఉంది. రోగులు సాధారణంగా క్రౌడ్ ఫండింగ్ ద్వారా డబ్బును సేకరిస్తున్నందున రూ. 36 లక్షల ఖరీదు చేసే మందులను GST నుండి మినహాయించాలని ఫిట్మెంట్ కమిటీ సిఫార్సు చేసింది క్యాన్సర్ ఔషధం (dinutuximab/qarziba) వ్యక్తిగత ఉపయోగం కోసం దిగుమతి చేసుకున్నప్పుడు 12% ఇంటిగ్రేటెడ్ GST (IGST) నుండి మినహాయింపు ఇవ్వాలని సూచించింది. -
మండే వేసవిలో ప్రయాణికులకు గుడ్ న్యూస్: రైల్వే కీలక నిర్ణయం
సాక్షి,ముంబై: రైల్వే ప్రయాణీకులకు శుభవార్త. ఏసీ-3 టైర్ ఎకానమీ క్లాస్ టికెట్ ధరలు దిగొచ్చాయి. రైలు ప్రయాణాన్ని ప్రయాణికులకు మరింత చౌకగా అందించేలా రైల్వే మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ వేసవికి ఎండలు మరింత మండ నున్నాయనే వార్తల నేపథ్యంలో తరచుగా రైళ్లోలో ప్రయాణించే వారికి ఇది చల్లటి కబురే. రైల్వే తాజా నిర్ణయంతో ఇప్పుడు తక్కువ ఖర్చుతో ఏసీ-3టైర్ ఎకానమీ క్లాస్ టిక్కెట్‌ను బుక్ చేసుకోవచ్చు. ఏసీ-3టైర్ ఎకానమీ క్లాస్ టిక్కెట్ చార్జీలకు సంబంధించి మునుపటి (నవంబరు 2022) ఆర్డర్‌ను ఉపసంహరించుకుంది. దీని ప్రకారం ఏసీ-3 టైర్ ఎకానమీ క్లాస్ టిక్కెట్ల కొత్త ధర మార్చి 22వ తేదీ నుంచి అమల్లోకి ఉంటుందని బెడ్స్ యథావిధిగా అందజేస్తామని రైల్వే అధికారులు వెల్లడించారు. అలాగే ఇప్పటికే ఆన్లైన్లో లేదా వ్యక్తిగతంగా టిక్కెట్లను బుక్ చేసుకున్న ప్రయాణికులకు వారు చెల్లించిన అదనపు డబ్బు తిరిగిచెల్లించనున్నారు. దీంతో ఏసీ-3 టైర్ ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించడం ఇప్పుడు చౌకగా మారింది. (ఇదీ చదవండి: Maruti Suzuki: మారుతి కస్టమర్లకు మరో షాక్: ఏ మోడల్ అయినా బాదుడే!) ఉత్తమ, చౌకైన ఏసీ ప్రయాణం సేవను అందించడానికి 3-టైర్ ఎకానమీ కోచ్‌లను సెప్టెంబరు 2021లో ప్రవేశపెట్టింది. 11,277 సాధారణ ఏసీ 3 కోచ్‌లతో పోలిస్తే ప్రస్తుతం 463 ఏసీ 3 ఎకానమీ కోచ్‌లు ఉన్నాయని, సాధారణ AC 3 కోచ్‌ల కంటే AC 3 ఎకానమీ కోచ్‌లలో ప్రయాణీకులకు మెరుగైన సౌకర్యాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. సాధారణ AC 3-టైర్ కోచ్‌లో 72 బెర్త్‌లు ఉంటే, AC 3-టైర్ ఎకానమీలో 80 బెర్త్‌లు ఉంటాయి. డేటా ప్రకారం ఏసీ 3-టైర్ ఎకానమీ క్లాస్‌ను ప్రవేశపెట్టిన తొలి ఏడాదిలోనే ఇండియన్ రైల్వే రూ.231 కోట్లు ఆర్జించింది. ఏప్రిల్-ఆగస్టు 2022 వరకు, ఈ కోచ్‌లలో 15 లక్షల మంది ప్రయాణించారు, దీని ద్వారా రూ. 177 కోట్ల ఆదాయం వచ్చింది. (సీఈవో సుందర్ పిచాయ్‌కు ఉద్యోగుల బహిరంగ లేఖ: కీలక డిమాండ్లు) -
రూ.37 వేలకే తులం బంగారం! ఇలా చేస్తే మీ సొంతం
భారతీయులకు బంగారం అంటే అత్యంత ప్రీతి. దాన్ని ఒక పెట్టుబడి సాధనంగా కూడా చూస్తారు. ముఖ్యంగా మహిళలయితే బంగారం ఆభరణాలు ధరించడానికి ఇష్టపడతారు. ఈ నేపథ్యంలో రోజూ బంగారం ధరలు ఎలా ఉన్నాయో గమనిస్తూ ఉంటారు. ఇదీ చదవండి: Currency Notes: రద్దయిన పాత నోట్లను మార్చుకోవచ్చా..? కేంద్రం కీలక ప్రకటన! దేశంలో బంగారం 90 శాతం దిగుమతుల ద్వారానే సమకూరుతోంది. 2022 ఏడాదిలో విదేశాల నుంచి దాదాపు 706 టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంది భారత్. ఇందుకోసం దాదాపు 36.6 బిలియన్ డాలర్లు వెచ్చించింది. బంగారంపై భారతీయులకు ఉన్న ఆసక్తిని గ్రహించిన భూటాన్.. భారతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఫుయంషోలింగ్, థింపులకు వచ్చేవారు ఎలాంటి ట్యాక్స్ లేకుండానే బంగారం కొనుగోలు చేసేందుకు అనుమతిస్తోంది. దీంతో భారత్‌లో కంటే తక్కువ ధరకే అక్కడ బంగారం కొనుక్కోవచ్చు. ఇదీ చదవండి: Ola Holi Offer: తక్కువ ధరకు ఓలా స్కూటర్లు.. రూ.45,000 వరకు తగ్గింపు! భూటాన్ దేశ నూతన సంవత్సరం, భూటాన్ రాజు జన్మదినాన్ని పురస్కరించుకుని ఫిబ్రవరి 21న ఆ దేశ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా తమ పర్యాటక ఆదాయాన్ని పెంచుకోవాలని భావిస్తోంది. ఈ మేరకు భూటాన్ అధికారిక పత్రిక డైలీ కౌన్సెల్ ప్రచురించింది. భారత్‌తో పోలిస్తే ధరలు కాస్త తక్కువగా ఉండటంతో ప్రస్తుతం చాలా మంది భారతీయులు దుబాయ్ వెళ్లి బంగారం కొంటున్నారు. తులం బంగారం రూ.37 వేలే.. ప్రస్తుతం ఉన్న ధర ప్రకారం భారత్‌లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.55,600పైగానే ఉంది. అదే భూటాన్‌లో 10 గ్రాముల బంగారం 37,588.49 భూటనీస్ ఎన్‌గూల్ట్రమ్ (బీటీఎన్)గా ఉంది. ఒక బీటీఎన్ భారత రూపాయితో దాదాపు సమానంగా ఉంది. అంటే భారతీయులు రూ.37,588కే తులం బంగారం కొనుక్కోవచ్చన్న మాట. మరి షరతులు? భూటన్లో భారతీయులు పన్ను రహిత బంగారం కొనుగోలు చేయాలంటే సస్టెయినబుల్ డెవలప్మెంట్ ఫీ (ఎస్డీఎఫ్) రూ.1,200 నుంచి రూ.1,800 చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఆ దేశ ప్రభుత్వం గుర్తింపు పొందిన టూరిస్ట్ సెర్టిఫైడ్ హోటల్లో ఒక రాత్రి బస చేయాల్సి ఉంటుంది. టూరిస్టులు అమెరికా డాలర్లతోనూ బంగారం కొనుగోలు చేయొచ్చు. ఈ ఎస్డీఎఫ్ టూరిజం ట్యాక్స్‌ను 2022లోనే భూటాన్ ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. దీని ప్రకారం.. భారతీయులు ఒక వ్యక్తి.. ఒక రోజుకు రూ.1,200 నుంచి రూ.1,800 చెల్లించాలి. ఇతర దేశస్థులయితే 65 నుంచి 200 డాలర్ల వరకు చెల్లించాలి. ఈ ఎస్డీఎఫ్ ట్యాక్స్ కట్టిన వారు మాత్రమే ఈ ట్యాక్స్ ఫ్రీ గోల్డ్ కొనేందుకు అర్హులు. ఈ బంగారాన్ని లగ్జరీ వస్తువులు విక్రయించేడ్యూటీ ఫ్రీ ఔట్‌లెట్స్‌లో కొనుగోలు చేయొచ్చు. ఎంత బంగారం తెచ్చుకోవచ్చు? కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు, కస్టమ్స్ విభాగం నిబంధనల ప్రకారం విదేశాల నుంచి భారత్‌లోకి మగవారైతే రూ.50 వేల విలువైన బంగారం, మహిళలయితే గరిష్టంగా రూ.లక్ష విలువైన బంగారం తెచ్చుకోవచ్చు. అంతకు మించి తీసుకువస్తే కస్టమ్స్ సుంకాలు చెల్లించాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: Women’s Day 2023: ఈ బ్యాంకును నడిపించేది ఆమే.. ఏకైక మహిళా చీఫ్! In a bid to boost tourism Indian and other SDF fee paying tourists coming to Phuentsholing or Thimphu in Bhutan can now buy tax free gold. The only condition being you have to stay in a tourist certified hotel and pay SDF. The gold will be much more cheaper than in India. — Tenzing Lamsang (@TenzingLamsang) February 24, 2023 -
Union Budget 2023: పెరిగేవి, తగ్గేవి ఇవే!
ఎప్పుడెప్పుడా అని దేశమంతా ఎదురుచూసిన కేంద్ర బడ్జెట్‌ను మోదీ ప్రభుత్వం ఆవిష్కరించింది. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ 2023-24ని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఇందులో పలు కీలక ప్రకటనలు చేశారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రకారం పలు వస్తువుల ధరలు పెరగనున్నాయి. అలాగే మరికొన్నింటి ధరలు తగ్గనున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం! పెరుగనున్నవి... బ్రాండెడ్ దుస్తులు సిగరెట్లు బంగారం, వెండి వాహనాల టైర్ల ధరలు విదేశాల నుంచి దిగుమతి అయ్యే రబ్బరుపై కస్టం డ్యూటీ పెంపు తగ్గనున్నవి ఎలక్ట్రిక్ వాహనాల ధరలు టీవీలు, మొబైల్ కిచెన్ చిమ్ని ధరలు తగ్గనున్నాయి టీవీ ప్యానెళ్లపై కస్టమ్ డ్యూటీ 2.5 శాతానికి తగ్గింపు లిథియం బ్యాటరీలపై కస్టమ్ డ్యూటీనీఇ21 శాతం నుంచి 13 శాతానికి తగ్గింపు -
తగ్గిన కమర్షియల్ గ్యాస్ ధర! ఎంతంటే!
పెరిగిన,పెరగనున్న నిత్యవసర వస్తువుల ధరలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సామాన్యులకు గ్యాస్ కంపెనీలు ఊరట నిచ్చాయి.కమర్షియల్ గ్యాస్ ధరల్ని తగ్గిస్తూ నిర్ణయించాయి. తగ్గిన ఈ ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. చమురు కంపెనీల నిర్ణయంతో దేశంలోని ప్రాంతాల వారీగా కమర్షియల్ గ్యాస్ ధరలు అదుపులోకి వచ్చాయి.ఢిల్లీలో 19కేజీల కమర్షియల్ గ్యాస్ ధర రూ.198తగ్గింది. కోల్‌కతాలో రూ.182, ముంబైలో రూ.190.50, చెన్నైలో రూ.187 తగ్గాయి. గతంలో ఎంత తగ్గిందంటే చమురు కంపెనీలు వ్యాపారానికి వినియోగించే గ్యాస్ ధరల్ని వరుసగా తగ్గిస్తూ వస్తున్నాయి. గత నెలలో జూన్ 1న అదే గ్యాస్ ధరను రూ.135 తగ్గించాయి. కానీ 14.2 కిలోల వంట గ్యాస్ ధరల్లో ఎలాంటి తగ్గుముఖం కనిపించగా పోగా..వాటి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఒక్క మే నెలలో వంటింట్లో వాడే వంట గ్యాస్ ధరను రెండు సార్లు పెంచాయి. తొలిసారిగా మే 7న లీటరుకు రూ.50 పెంచగా.. మే 19న డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్‌పై రూ.3.50పెరిగాయి. -
బడ్జెట్ 2022: పెరిగేవి..తగ్గేవి ఇవే..!
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం కేంద్ర బడ్జెట్-2022ను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఆసియాలోని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇక కేంద్ర బడ్జెట్-2022లో ఆర్థిక మంత్రి ప్రతిపాదించినట్లుగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో పలు వస్తువులు మరింత చౌకగా, ఖరీదైనవిగా లభించే అవకాశం ఉంది. కేంద్ర బడ్జెట్-2022 ప్రకారం మొబైల్ ఫోన్స్, మొబైల్ ఫోన్ ఛార్జర్లతో సహా పెద్ద సంఖ్యలో సాధారణంగా ఉపయోగించే వస్తువులు చౌకగా మారబోతున్నాయి. కట్ చేసి పాలిష్ చేసిన వజ్రాలు, రత్నాలపై కస్టమ్స్ డ్యూటీ 5 శాతంకు తగ్గించారు. భారత్‌లో తయారు చేయబడిన వ్యవసాయ రంగానికి సంబంధించిన పనిముట్లు, ఉపకరణాలపై మినహాయింపును పొడిగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో చౌకగా, ఖరీదైన వస్తువుల జాబితా ఇదే.. చౌకగా లభించేవి బట్టలు రత్నాలు,వజ్రాలు. మొబైల్ ఫోన్లు మొబైల్ ఫోన్ ఛార్జర్లు పెట్రోలియం ఉత్పత్తులకు అవసరమైన రసాయనాలపై కస్టమ్ డ్యూటీ తగ్గింపు మిథనాల్‌తో సహా కొన్ని రసాయనాలు స్టీల్ స్క్రాప్‌పై రాయితీ మరో ఎడాదిపాటు వర్తించనుంది. స్మార్ట్‌వాచ్ వినికిడి పరికరాలు వ్యవసాయ ఉపకరణాలు కోకా బీన్స్, ఇంగువ ఖరీదైనవి అన్ని దిగుమతి వస్తువులు గొడుగులపై భారీ సుంకాలను పెంచడంతో వీటి ధరలు భారీగా పెరగనున్నాయి. క్రిప్టో లావాదేవీలపై 30 శాతం పన్నులు అనుకరణ ఆభరణాలు స్పీకర్స్, హెడ్ ఫోన్స్, ఇయర్‌ఫోన్స్ సోలార్ సెల్స్, మాడ్యూల్స్ ఎక్స్ రే మెషిన్స్ చదవండి: Budget 2022: క్రిప్టో ట్రేడర్లకు శుభవార్త ! -
2022 జనవరి 1 నుంచి పెరిగే, తగ్గే వస్తువుల జాబితా ఇదే..!
2021కు ఎండ్ కార్డు పడనుంది. వచ్చే 2022 జనవరి 1 నుంచి అనేక వినియోగ వస్తువులపై జీఎస్టీ పన్ను రేట్ల, విధానాల్లో మార్పులు రానున్నాయి. జీఎస్టీలో మార్పులు, ఈ-కామర్స్ వెబ్‌సైట్స్ నుంచి, ఫుడ్ డెలివరీ అగ్రిగేటర్లపై ప్రభావితం చేయనున్నాయి. కానీ ఈ సేవలను పొందే కస్టమర్లను ప్రభావితం చేయవు. ఆయా వ్యాపారులను మాత్రమే కొత్త జీఎస్టీ ప్రభావితం చేయనున్నాయి. కాగా పలు కన్య్సూమర్ గూడ్స్‌పై విధించే కొత్త జీఎస్టీ మాత్రం సామాన్యులపై పడే అవకాశం ఉంది. 2022 జనవరి 1 నుంచి ధరలు పెరిగే జాబితా ఇదే..! 1. బట్టలు, పాదరక్షలు దుస్తులు, పాదరక్షలు వంటి వస్తువులపై కేంద్ర ప్రభుత్వం 5 నుంచి 12 శాతం వరకు జీఎస్టీ స్లాబ్ రేట్లను పెంచింది. ఈ వస్తువులు జనవరి 1, 2022 నుంచి మరింత ఖరీదైనవిగా కానున్నాయి. రూ. 1,000 వరకు ఉన్న వస్తువులపై జీఎస్టీ గతంలో 5-12శాతంకి పెంచారు. వస్త్రాలు, సింథటిక్ నూలు, దుప్పట్లు, టెంట్లు, అలాగే టేబుల్క్లాత్లు లేదా సర్వియెట్‌లు వంటి ఉపకరణాలతో సహా వస్త్రాలపై జీఎస్టీ రేటు కూడా పెరిగింది. పాదరక్షలపై ప్రత్యక్ష పన్నును కూడా 5% నుంచి 12%కి పెంచారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) నవంబర్ 18, 2021న మార్పులను తెలియజేసింది. బట్టలు, పాదరక్షల ధరల పెంపు చర్యను వివిధ వ్యాపార సంఘాలు వ్యతిరేకించాయి. ఆర్థిక వ్యవస్థలో అధిక ద్రవ్యోల్బణ ఒత్తిడి ఉన్న సమయంలో రేట్ల పెంపుపై ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు. 2. క్యాబ్ అండ్ ఆటో రైడ్స్ ఓలా..ఉబర్ వంటి యాప్ అగ్రిగేటర్ల ద్వారా బుక్ చేసుకునే ఆటో రిక్షా రైడ్లు కూడా కొత్త సంవత్సరంలో మరింత ఖరీదైనవిగా మారనున్నాయి. జనవరి 1 నుంచి ఆన్లైన్లో బుక్ చేసుకునే ఆటో రైడ్లపై 5% జీఎస్టీని విధించనున్నట్లు గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ కామర్స్ ఆటో రిక్షా బుకింగ్ పై జీఎస్టీ మినహాయింపు ఉండేది. దాన్ని ఇప్పుడు కేంద్రం ఉప సంహరించుకుంది. 3. స్విగ్గీ అండ్ జోమాటో జనవరి 1, 2022 నుంచి జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ అగ్రిగేటర్ సంస్థలు అందించే సేవలపై 5 శాతం జీఎస్టీ విధించనున్నట్లు తెలిపారు. ఇక జొమాటో, స్విగ్గీ వంటి ఆహార డెలివరీ యాప్‌లను రెస్టారెంట్లుగా పరిగణించి, వాటి ద్వారా చేసిన సరఫరాలపై 5 శాతం జీఎస్టీ పన్ను విధించనున్నారు. రెస్టారెంట్లలో భోజనం చేసినప్పుడు ఆయా సంస్థలు 5 శాతం పన్ను విధిస్తున్నాయి. కానీ స్విగ్గీ, జొమాటో నుంచి ఆర్డర్ చేసినప్పుడు పన్ను ఎగవేత జరుగుతోందని కేంద్రం గుర్తించింది. జనవరి 1 నుంచి తగ్గే ధరల లిస్ట్..! 1. క్యాన్సర్ మందులు గతంలో కేంద్ర ప్రభుత్వం క్యాన్సర్ మందులపై 18 శాతం జీఎస్టీను రేట్‌ను విధించింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి వీటిపై 5 శాతం జీఎస్టీ రేట్స్ అందుబాటులోకి రానున్నాయి. దీంతో క్యాన్సర్ మందులు తగ్గే అవకాశం ఉంది. 2. ఫోర్టిఫైడ్ రైస్(బలవర్థకమైన బియ్యం) ఫోర్టిఫైడ్ రైస్‌పై కేంద్రం కొత్త జీఎస్టీ రేట్లను ప్రతిపాదించింది. వీటిపై 18 శాతం నుంచి 5 శాతం జీఎస్టీ రేటును తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. 3. బయోడీజిల్ బయోడీజిల్ అనేది కూరగాయల నూనెలు, జంతువుల కొవ్వులు లేదా రీసైకిల్ చేసిన రెస్టారెంట్ గ్రీజు నుంచి తయారు చేసిన పునరుత్పాదక ఇ, బయోడిగ్రేడబుల్ ఇంధనం. వీటిపై కేంద్రం గతంలో 18 శాతం మేర జీఎస్టీను వసూలు చేసేది. 2022 జనవరి 1 నుంచి వీటిపై 5 శాతం జీఎస్టీను కేంద్రం వసూలు చేయనుంది. చదవండి: డిసెంబరు 31న జీఎస్టీ కౌన్సిల్ భేటీ -
ఇసుక మరింత చౌకగా..
శృంగవరపుకోట: ఇసుక కొరత రానీయకూడదన్న ప్రభుత్వ నిర్ణయం అమలుకు నోచుకుంటోంది. అన్ని వర్గాల అవసరాలకూ ఇసుక ఉచితంగా అందివ్వాలన్న నిర్ణయంతో ఎంతోమందికి మేలు కలగనుంది. పేదలు, ప్రభుత్వ ప్యాకేజీల వంటి పనులకు ఇసుక రవాణా చేసే ట్రాక్టర్లను ప్రభుత్వానికి చెల్లించాల్సిన చలానా నుంచి మినహాయిస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ఇసుక మరింత సులభంగా, చౌకగా లభించనుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది నుంచి ఈ నెల 13న ఆదేశాలు వెలువడ్డాయి. శుక్రవారం నుంచి ఇది అమలులోకి రానుంది. భారీగా తగ్గనున్న ధరలు జిల్లాలో 80 ఇసుక రీచ్‌లు ఉండగా ఇవన్నీ 1 నుంచి 3 స్ట్రీమ్స్‌గానే పరిగణిస్తున్నారు. ప్రస్తుతం 34 రీచ్‌ల నుంచి మాత్రమే ఇసుక లభిస్తోంది. ఇప్పటి వరకూ టాక్టర్తో ఇసుక తరలించాలంటే ప్రభుత్వానికి రూ.1300లు చలానా కట్టాల్సి వచ్చేది. టైరు బండ్లు మాదిరిగా ట్రాక్టర్లతో ఇసుక రవాణాకు ఎటువంటి చెల్లింపులు అవసరం లేదని తాజా ఉత్తర్వుల్లో తేల్చడంతో భారీగా ధర తగ్గనుంది. ప్రస్తుతం ట్రాక్టర్ ఇసుకకు చలానాగా రూ.1300లు, లోడింగ్ చార్జీలు రూ.800లు, రవాణా చార్జీ రూ.1000 నుంచి 1500లు మొత్తం రూ3500 నుంచి 4000 వరకూ వసూలు చేస్తున్నారు. ఇకపై చలానా ధర తగ్గడంతో వినియోగదారునికి వెసులుబాటు కలగనుంది. తాజా మార్గదర్శకాలు -వినియోగదారుడు గ్రామ సచివాలయంలో తన చిరునామాతో అనెక్సర్–1లో ఇసుక కోసం దరఖాస్తు చేయాలి. ∙24 గంటల్లో అర్జీని పరిశీలించి అనెక్సర్–2లో పర్మిట్‌ను సమయం, తేదీలతో ఇస్తారు. ఇసుకను రీచ్ నుంచి 20కి.మీ పరిధిలో మాత్రమే అనుమతిస్తారు. -ఇసుక రవాణా సమయంలో సచివాలయం ఇచ్చిన పర్మిట్ కచ్చితంగా ఉండాలి. నోటిఫై చేసిన రీచ్‌ల నుంచి ఇసుక తరలించాలి. -గ్రామకార్యదర్శి ఇసుక పక్కదారి పట్టకుండా పర్యవేక్షించాలి. 1నుంచి 3స్ట్రీమ్స్‌లో ఇసుక లభ్యత లేకుంటే జిల్లా కలెక్టర్ 4, 5 స్ట్రీమ్స్ నుంచి ఇసుక తెప్పించి స్టాక్‌యార్డుల ద్వారా సరఫరా చేస్తారు. లోడింగ్ చార్జీల భారం తగ్గాలి ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా నడుస్తున్న పలు రీచ్‌లలో ట్రాక్టర్ లోడింగ్‌కు రూ. 800 నుంచి 1000లు వసూ లు చేస్తున్నారు. గతంలో లోడింగ్ చార్జీలు రూ.400లే ఉండేది. క్రమంగా ఇసుకకు డిమాండ్ పెరగటంతో లోడింగ్ చార్జీలు కూడా పెంచేశారు. దీని భారం వినియోగదారులపై పడుతోంది. ప్రభుత్వ నిర్ణయం ప్రకా రం లోడింగ్‌కు టన్నుకు రూ.90లు చొప్పున ట్రాక్టర్ (4.5టన్నులు)కు రూ.405లు తీసుకోవాలి. జిల్లా వ్యాప్తంగా లోడింగ్ చార్జీలపై నియంత్రణ లేక పోవటంతో ఇసుక ధర తగ్గటం లేదు. ఇదే తీరుగా వినియోగదారుల అవసరాలను ట్రాక్టర్ యజమానులు సొమ్ము చేసుకుంటున్నారు. పేదల అవసరాలు తీర్చటం కోసం ఆదాయాన్ని వదులుకున్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే లోడింగ్, ట్రాన్స్‌పోర్టు చార్జీలను నియంత్రిస్తూ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో వినియోగదారులకు ట్రాక్టర్‌కు రూ.1300లు భారం తగ్గింది. సామాన్యులకు అందుబాటు.. ఇసుక సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలన్నది ప్రభుత్వ ఆశయం. తాజా ఉత్తర్వుల ప్రకారం ట్రాక్టర్లను రూ.1300లు చలానా నుంచి మినహాయించారు. జిల్లా వ్యాప్తంగా నడుస్తున్న 34రీచ్‌ల నుంచి ఎక్కడైనా నిబంధనలకు లోబడి ట్రాక్టర్లతో ఉచితంగా ఇసుక తీసుకెళ్లవచ్చు. శుక్రవారం నుంచి ఉత్తర్వులు అమల్లోకి వస్తాయి. ట్రాక్టర్ లోడింగ్‌కు రూ.405లు తీసుకోవాలి. అధిక వసూళ్లపై జిల్లా కలెక్టర్, జేసీలతో సంప్రదిస్తాం. – కర్రా ప్రవీణ్‌కుమార్, జిల్లా ఇసుక సహాయ అధికారి -
హ్యుందాయ్ ‘కోనా’ ధర భారీగా తగ్గనుందా?
సాక్షి, ముంబై : దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ దారు హ్యుందాయ్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినతొలి ఎలక్ట్రిక్ ఎస్యూవీ కోనా ధర భారీగా తగ్గనుంది. ఆర్థికమంత్రి నిర్మాలా సీతారామన్ ఎలక్ట్రిక్ కార్లపై జీఎస్టీ తగ్గింపు ప్రతిపాదనతో ఎలక్ట్రిక్ కార్ల ధరలు విపరీతంగా తగ్గనున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రస్తుతం జీఎస్టీని 12 నుంచి 5 శాతానికి తగ్గించాలన్న ప్రతిపాదన అమలైతే హ్యుందాయ్ కోనా కారు ధర రూ.1.50 లక్షల మేర తగ్గనుంది. కాలుషాన్ని నివారించేందుకు, ఇంధన వాడకాన్ని నియంత్రించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రోత్సాహానిస్తోంది. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్లో ఎలక్ట్రిక్ కార్ల మీద ఉన్న జీఎస్టీని తగ్గించే ప్రతిపాదనలను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఎలక్ట్రిక్ కార్లపై 12 శాతంగా ఉన్న జీఎస్టీని 5 శాతానికి తగ్గించాలని జీఎస్టీ మండలి కోరినట్లు తెలిపిన సంగతి తెలిసిందే. హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ ఎస్యూవీ లాంచింగ్ ధర రూ.25.3(ఎక్స్ షోరూం ధర) ఆర్థికమంత్రి ప్రతిపాదనలకు జీఎస్టీ కౌన్సిల్ ఆమోదం లభిస్తే.. కోనా ధర రూ. 23.8 లక్షలుగా ఉండనుంది. అంతేకాదు ఈ కారును కొనుగోలు చేసే కస్టమర్లకు కేంద్రం ద్వారా మరో శుభవార్త కూడా ఉంది. ప్రతి కోనా ఎలక్ట్రిక్ ఎస్యూవీ కొనుగోలు సందర్బంగా వాహనరుణంపై వడ్డీ రాయితీ, ఆదాయపన్ను రాయితీ కలిపి రూ. 1.50 లక్షల వరకు ప్రయోజనాలను అందించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అంటే మొత్తం రూ.3 లక్షల తగ్గింపుతో కోనా ఎలక్ట్రిక్ ఎస్యూవీ కస్టమర్లకు అందుబాటులోకి రానుంది. కాగా చెన్నైలోని హ్యుందాయ్ ప్లాంట్‌లో అసెంబుల్ అయిన ఈ కారు ఫీచర్ల విషయానికి వస్తే.. ఆరు ఎయిర్ బ్యాగులు, యాంటీ–లాక్ బ్రేకింగ్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ బ్రేక్–ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, మార్గదర్శకాలతో కూడిన వెనుక కెమెరా ఉన్నాయి. 39.2 కిలో వాట్స్ సామర్థ్యం గల లిథియం-అయాన్ బ్యాటరీ, 136 బిహెచ్పిగరిష్ట పవర్ 395 ఎన్ఎమ్ టార్క్ లాంటివి ఇతర ఫీచర్లు. కేవలం 9.7 సెకన్లలో 0-100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగల హ్యుందాయ్ కోనా ఒక్కసారి ఛార్జింగ్‌తో 452 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని లాంచింగ్ సమయంలో హ్యుందాయ్ వెల్లడించింది. -
గృహ, వాహన రుణాల వడ్డీరేట్లు తగ్గుతాయ్
సాక్షి, ముంబై : ఆర్బీఐ పాలసీ రివ్యూలో వడ్డీరేట్ల కోతకే మొగ్గు చూపడంతో గృహ, వాహన రుణాల వడ్డీరేట్లు తగ్గుముఖం పట్టనున్నాయి. రెపో రేటుపై పావు శాతం లేదా 25 బేసిస్ పాయింట్లు తగ్గడం గృహ, వాహన రుణగ్రహీతలకు శుభపరిణామమని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. వడ్డీరేట్ల కోత విధించి గృహ, వాహన కొనుగోలుదారులకు కేంద్ర బ్యాంకు శుభవార్త అందించిందని పేర్కొన్నాయి. ఈ సవరించిన రేట్లను బ్యాంకులు వినియోగదారులక పాస్ చేస్తాయని తాము భావిస్తున్నామని నైట్ ఫ్రాంక్ ఛైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ షిషీర్ బైజల్ చెప్పారు. ఇది కస్టమర్ల కొనుగోలు నిర్ణయాన్ని సులభతరం చేస్తుంది. కొంతకాలంగా డిమాండ్ లేక నీరసించిన రియల్ రంగ అభివృద్ధికి ఇది కీలక అడుగు అని వ్యాఖ్యానించారు. కీలక వడ్డీరేట్లపై ఆర్బీఐ యధాతథానికే మొగ్గు చూపనుందన్న విశ్లేషకుల అంచనాలకు భిన్నంగా మానిటరీ పాలసీ కమిటీ స్పందించింది. వరుస యథాతథ పాలసీకి చెక్ చెబుతూ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని కమిటీ రెపో రేట్ కోతకే మొగ్గు చూపింది. దీంతో రెపో రేటు 6.50 శాతం నుంచి 6.25 శాతానికి దిగి వచ్చింది. రివర్స్ రెపో 6 శాతానికి చేరింది. అలాగే బ్యాంక్ రేటు 6.5 శాతంగా అమలు కానుంది. -
నిత్యావసరాల ధరలు దిగి రానున్నాయా?
సాక్షి,న్యూఢిల్లీ: గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ)ని మరింత సరళం చేయనున్నామని, తద్వారా నిత్యావసర వస్తువుల ధరలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హింట్ ఇచ్చారు. ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ సమ్మిట్‌లో ప్రసంగించిన మోదీ సామాన్యులు వినియోగించే దాదాపు అన్ని వస్తువులను 18 శాతం, లేదా దాని కంటే తక్కువ శాతం జీఎస్టీ శ్లాబులోకి తీసుకురానున్నామని చెప్పారు. 99 శాతం వస్తువులను 18శాతం జీఎస్టీ శ్లాబులోకి తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం యోచిస్తోందని వెల్లడించారు. అలాగే ప్రస్తుత 2 శాతం జీఎస్టీ శ్లాబులో కొన్ని లగ్జరీ వస్తువులను మాత్రమే పరిమితం చేస్తామని ప్రధాని తెలిపారు. జీఎస్టీ ప్రారంభానికి ముందు దేశంలో 65 లక్షల రిజిస్టర్ అయిన వ్యాపారస్తులు ఉండగా, ఇప్పుడు 55 లక్షలమంది అదనంగా రిజిస్టర్ అయ్యారని ప్రధాని తెలిపారు. దేశంలో అతి చిన్న పన్ను సంస్కరణలు చేపట్టడం కూడా చాలా సంక్లిష్టమైన అంశంగా ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో అవినీతిని రూపుమాపడానికి తన ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. దేశంలో అవినీతి పట్ల తేలిగ్గా స్పందిస్తున్నారని, ఆ విధానంలో మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు. 2014 నాటికి దేశంలోని 55 శాతం గృహాలు గ్యాస్ కనెక్షన్ కలిగి ఉన్నాయని అయితే తమ హయాంలో గ్యాస్ కనెక్షన్ల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు వివరించారు. అలాగే దశాబ్దల తరబడి అపరిష్కృతంగా ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారాల కోసం ప్రభుత్వం కృషి చేస్తోందపి ఆయన చెప్పారు. కొత్త భారతదేశం నిర్మించే దిశగా తాము సాగుతున్నామన్నారు. జీఎస్టీ విధానాన్ని సరళీకరణ చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్ వినిపిస్తున్నప్పటికీ 2019 సార్వత్రిక ఎన్నిలకు సమయం సమీపిస్తున్న తరుణంలో ఈ నేపథ్యంలో 99 శాతం వస్తువులను 18 శాతం శ్లాబులోకి తీసుకొస్తామని ప్రధాని ప్రకటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
ఇక తగ్గింపు ధరల్లో హైఎండ్ బైక్స్
సాక్షి, న్యూఢిల్లీ: దిగుమతి సుంకం భారీ తగ్గింపుతో అంతర్జాతీయ బైక్‌లు చవకగా భారతీయులకు లభించ నున్నాయి. హర్లే డేవిడ్సన్, ట్రైయింప్ సహా, ఇతర హై ఎండ్ బ్రాండ్ల మోటార్ సైకిళ్లు తక్కువ ధరలకే అందుబాటులోకి రానున్నాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ (సీబీఈసీ) ఫిబ్రవరి 12 న జారీ చేసిన నోటిఫికేషన ప్రకారం పూర్తిగా విదేశాల్లో తయారైన బైక్‌లపై బేసిక్ దిగుమతి సుంకాన్ని 50 శాతానికి తగ్గించింది. ఇప్పటివరకూ 800 సీసీ అంతకంటే తక్కువ ఇంజీన్ కెపాసిటీ బైక్‌లపై 60శాతం దిగుమతి సుంకం ఉండగా, 800సీసీ కన్నా ఎక్కువ సామర్థ్యం గల బైక్‌లపై దిగుమతి సుంకం 75శాతంగా ఉండేది. పూర్తిస్థాయిలో దిగుమతి చేసుకున్న మోటార్ సైకిళ్ల దిగుమతులపై ప్రభుత్వం కస్టమ్స్ సుంకం రేటు ఈ రెండు రకాల మోడళ్లపై 50 శాతానికి తగ్గించడంతో దేశంలో వీటి ధరలు తగ్గుముఖం పడతాయని ఈవై పార్టనర్ అభిషేక్ జైన్ చెప్పారు. సీబీఎఫ్సీ నోటిఫికేషన్ ప్రకారం, ప్రీ ఎసంబుల్డ్ ఇంజిన్, గేర్‌బాక్స్ లేదా ట్రాన్స్మిషన్ మెకానిజంపై పూర్తిగా దిగుమతి చేసుకున్న (సీకేడీ) వస్తు సామగ్రిపై, దిగుమతి సుంకం 25 శాతానికి తగ్గించింది. ఇంతకుముందు ఇది 30శాతంగా ఉంది. మరోవైపు మేక్ ఇన్ ఇండియా లో భాగంగా స్థానిక తయరాదారులకు ప్రోత్సహించేందుకు ఎసంబుల్డ్ కాని ఇంజిన్, గేర్ బాక్స్, ట్రాన్స్మిషన్ మెకానిజం దిగుమతిపై 15 శాతం వరకు కస్టమ్స్ సుంకం పెంచివంది. ఇది ఇప్పటివరకు 10 శాతంగా ఉంది. తద్వారా ఆటోమొబైల్ సహాయక పరిశ్రమలను రక్షించే ఒక పెద్ద సందేశాన్ని ప్రభుత్వం పంపిందనీ, గొప్ప తయారీ కేంద్రంగా ఇండియాకు ప్రాధాన్యత నిచ్చేలా విధానాన్ని రూపొందించిందని డెలాయిట్ ఇండియా సీనియర్ డైరెక్టర్ అనూప్ కాల్వాత్ వ్యాఖ్యానించారు. -
లోన్లు ఇక చవకేనట!
ముంబై: రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య విధాన కమిటీలో రెపో రేటు తగ్గించడంతో రుణాల రేట్లు మరింత దిగి రానున్నాయి. కీలక వడ్డీ రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో ఈ బాటను మిగిలిన బ్యాంకులు కూడా అనుసరించనున్నాయి. దీంతో బ్యాంక్ ఖాతాదారులకు మరింత చవకగా లోన్ సౌకర్యం లభించనుంది. మానిటరీ పాలసీ రివ్యూ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ద్రవ్య విధాన కమిటీలో నలుగురు సభ్యులు 25 బీపీఎస్ పాయింట్లను తగ్గించటానికి ఓటు వేయగా, 50 పాయింట్ల కట్ కొరకు ఒక ఓటు పడిందని ఆర్బీఐ గవర్నర్ తెలిపారు. ద్రవ్యోల్బణం దిగి రావడంతో కేంద్రం బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు. తద్వారా బ్యాంకులు కూడా తమ వడ్డీరేట్లను తగ్గించనున్నాయని ఉర్జిత్ పటేల్ చెప్పారు. రుణాల తగ్గింపు ప్రకటించని కొన్ని విభాగాల్లో రేట్లు తగ్గే అవకాశం ఉందని చెప్పారు. మార్కెట్ అంచనాలకనుగుణంగానే ఆర్బీఐ తన పాలసీ రివ్యూని వెల్లడించింది. 0.25 శాతం కోతతో రెపో రేటు 6శాతం వద్ద నిలిచింది. 2016 నవంబర్ స్థాయి వద్ద ఏడేళ్ల కనిష్టాన్ని నమోదు చేసింది. అలాగే రివర్స్రెపో కూడా 0.25శాతం కోతతో ప్రస్తుత 5.75గా ఉండనుంది. వడ్డీ రేట్లను తగ్గించాలనే రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా నిర్ణయం నిరంతర ఆర్థిక వృద్ధికి కీలకమైనదని ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ వ్యాఖ్యానించారు. కాగా మానిటరీ పాలసీ కమిటీ తరువాతి సమావేశం అక్టోబర్ 3, 4 తేదీల్లో జరుగుతుంది. -
మరింత దిగిరానున్నగృహరుణ వడ్డీ రేట్లు
2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) రెండవ ద్వితీయ ద్రవ్య విధాన సమీక్షలో యథాతధ వడ్డీరేట్లను అమలు చేయనున్నట్టు ప్రకటించింది. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ నేతృత్వంలో రెండు రోజుల భేటీ అనంతరం ద్రవ్యవిధాన కమిటీ వడ్డీరేట్లపై తమ నిర్ణయాన్ని వెల్లడించింది. రివర్స్, రెపో రేట్లను స్టేటస్ కో వ్యూహాన్ని అనుసరిచింది. చాలామంది ఆర్థిక విశ్లేషకుల అంచనాలకు కనుగుణంగానే ఆర్బీఐ అనుసరించిన విధానంతో గృహరుణాల రేట్లు దిగారానున్నాయని ఎనలిస్టులు భావిస్తున్నారు. ఎస్ఎల్ఆర్లో కట్ బ్యాంకింగ్ పరిశ్రమకు సానుకూలంగా ఉందనీ, ఇది మరింత ద్రవ్యత్వాన్ని అందిస్తుందని ఎనలిస్టుల అంచనా. ఫలితంగా గృహరుణాలు మరింత దిగిరానున్నాయనే అంచనాలు నెలకొన్నాయి. మానిటరీ పాలసీ కమిటీ రెపో రేటును 6.25, రివర్స్‌రెపోను 6శాతం, సుప్రీం బ్యాంక్ లీటరి లిక్విడిటీ రేషియో (ఎస్ఎల్ఆర్) ను 50 బీపీఎస్ పాయింట్లను తగ్గించింది. దీంతో కచ్చితంగా బ్యాంకింగ్ వ్యవస్థలో మరింత ద్రవ్యం రానుంది. దీంతో హోం లోన్లు మరింత చౌకగా లభించనున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అధిక ద్రవ్యతతో, కొంతమంది బ్యాంకులు ముందుకొచ్చే బిట్లను తగ్గించవచ్చని చెప్పారు.మానిటరీ పాలసీ కమిటీ వడ్డీ రేట్లు స్థిరంగా ఉంచడానికి నిర్ణయించడంతో ఎస్ఎల్ఆర్ 50 బేసిస్ పాయింట్లు తగ్గింపును ఊహించలేదని ఎనలిస్టులు చెప్పారు. ఫలితంగా బ్యాంకులు ఖాతాదారులకు తక్కువ రేటులో ఎక్కువ రుణా లివ్వగలిగే ద్రవ్యనిధులను కలిగి ఉంటాయని చెప్పారు. క్రెడిట్ ఆఫ్ తీసుకోవడం కూడా మెరుగుపరుస్తుందని ఆశిస్తున్నామన్నారు. ప్రొవిజనింగ్ అవసరాలు తగ్గిపోతుండటం వలన హౌసింగ్ రుణాలు ఖచ్చితంగా చౌకగా లభించనున్నాయని ఇన్వెస్టాప్ షాప్ప్ ఇండియా లిమిటెడ్ సీఈఓ ఆశిష్ కపూర్ తెలిపారు. అయితే మార్జిన్ ఒత్తిడి వంటి, ఎన్పీఐ రిజల్యూషన్ తదితరకారణాల రీత్యా పారిశ్రామిక రుణాలు చౌకగా లభించవనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఆర్బీఐ తదుపరి పాలసీ రివ్యూ ఆగష్టులో జరుగనుంది. ప్రధానంగా జీఎస్టీ, రుతుపవనాలపై ఆర్బీఐ దృష్టి కొనసాగనుంది. ఏదైనా సానుకూల సూచికలు అందితే తప్ప ఆర్బీఐ కొన్ని నెలలు రిపో రేటు ప్రస్తుత వైఖరినే కొనసాగించనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. అంతేకాదు ఇంటిని కొనడానికి చూస్తున్న వారు ముందుకు సాగవచ్చనీ, గృహ రుణాన్ని తీసుకోవడానికి ఇదే సరైన సమయమని సూచిస్తున్నారు. కాగా డిమానిటైజేషన్ అనంతరం దాదాపు అన్ని ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకులు హోం లోన్లపై విధించే ఎంసీఎల్ఆర్ రేట్లను ఇప్పటికే గణనీయంగా తగ్గించిన సంగతి తెలిసిందే. -
తగ్గేవి.. పెరిగేవి..
న్యూఢిల్లీ: 2017-18 ఆర్థిక బడ్జెట్ బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఎక్సైజ్, కస్టమ్స్ సుంకాలు తన ప్రతిపాదనలతో ఖజానాకు ఎటువంటి నష్టం లేదా లాభం రాదని చెప్పారు. ముఖ్యంగా త్వరలోనే జీఎస్ టీ అమల్లోకి రానున్న నేపథ్యంలో ఎక్సైజ్ & సర్వీస్ టాక్స్ ప్రస్తుత విధానంలో పెద్దగా మార్పులు చేయలేదని తెలిపారు. సిల్వర్ కాయిన్స్ పై 12.5 శాతం దిగుమతి సుంకం విధించారు. ఎక్సైజ్ & సర్వీస్ టాక్స్ లో స్వల్ప మార్పుల కారణగా ధరలు పెరిగేవి, తగ్గేవి ఈ విధంగా ఉన్నాయి. తగ్గేవి ఎల్ ఈడీ దీపాలు సౌర ఫలకాలు( సోలార్ ప్యానల్స్) మైక్రో ఎటీఎంలు ఫింగర్ ప్రింట్ యంత్రాలు, ఐరిస్ స్కానర్లు రైల్వే టిక్కెట్ల ఆన్లైన్ బుకింగ్ ఎల్ఎన్జి(లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్) ఫ్యూయల్ సెల్ బేస్డ్ జనరేటర్లు లెదర్ ఉత్పత్తుల తయారీకి వాడే కూరగాయల ఉత్పత్తులు రక్షణ రంగంలో గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీలు పెరిగేవి సెల్ ఫోన్లు, వెండి నాణేలు, సిగరెట్లు, పొగాకు, బీడీలు, పాన్ మసాలా ఉత్పత్తులు అల్యూమినియం ఉత్పత్తులు పార్సిల్ ద్వారా దిగుమతి అయ్యే ఇతర వస్తువులు, వాటర్ ఫిల్టర్స్ పరికరాలు, జీడిపప్పు ప్రియం కానున్నాయి -
జియోను తలదన్నేలా బీఎస్ఎన్ఎల్
న్యూఢిల్లీ: టెలికం సంస్థల మధ్య కాంపిటేషన్ వార్ మొదలైంది. బీఎస్ఎన్ఎల్ ఈ వార్‌ను డిక్లేర్ చేసింది. జియోకు తానేమి తక్కువ కాదంటూ దూసుకొస్తోంది. కొత్త ఏడాది నుంచి తాము కూడా ఉచిత వాయిస్ కాల్స్ అందించడమే కాకుండా తక్కువ టారిఫ్ లతో వినియోగదారులకు సేవలందిస్తామంటూ బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. ఉచిత వాయిస్ కాల్స్ , తక్కువ ధరకే ఇంటర్నెట్ ప్యాకేజ్ లు అంటూ మొబైల్ రంగంలోకి దూసుకొచ్చి ఇతర టెలికం సంస్థలకు అనూహ్యంగా రిలయన్స్ జియో షాకిచ్చిన విషయం తెలిసిందే. దీంతో దాదాపు అన్ని నెట్ వర్క్ లపై ప్రభావం పడింది. తమ వద్ద ఉన్న కస్టమర్లను జియోవైపు వెళ్లనీయకుండా ఆయా సంస్థలు తీవ్రతంటాలు పడుతున్నాయి. ఆఫర్లను మార్చుకుంటున్నాయి. ఇందులో భాగంగా ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ మాత్రం జియోకు ధీటుగా వస్తున్నానంటూ ప్రకటించేసింది. లైఫ్ టైం వ్యాలిడిటీతో ఉచిత వాయిస్ కాల్స్ ఇచ్చేందుకు ముందుకొస్తోంది. దీంతో జియో ఆగమనం తర్వాత దానికి పోటీగా దూసుకొస్తున్న మరో టెలికం సంస్థగా బీఎస్ఎన్ఎల్ మారనుంది. అంతేకాదు జియో కేవలం 4జీ ఫోన్లకు మాత్రమే ఉచిత వాయిస్ కాల్స్ సౌకర్యాన్ని అందిస్తుండగా బీఎస్ఎన్ఎల్ మాత్రం 2జీ, 3 జీ ఫోన్లకు ఈ సౌకర్యం అందించనుందట. 'మేం ప్రస్తుత మార్కెట్లో జియో పనితీరును పూర్తిగా పరిశీలన చేస్తున్నాం. మేం కూడా వచ్చే కొత్త ఏడాది నుంచి అత్తి తక్కువ టారిఫ్ లు కొత్త కొత్త ఆఫర్లతోపాటు లైఫ్ టైం వ్యాలిడిటీతో ఫ్రీ వాయిస్ కాల్స్ ఇస్తాం' అని బీఎస్ఎన్ఎల్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ అనుపమ్ శ్రీవాత్సవ చెప్పారు. 'జియోకంటే తక్కువ రేట్ కే ఈ ప్లాన్ అందించనున్నాం. ఇది కేవలం రూ.2 నుంచి రూ.4 ఉండొచ్చు' అని ఆయన చెప్పారు. కేరళ, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఒడిషా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ లలో బీఎస్ఎన్ఎల్కు అతి పెద్ద మార్కెట్ ఉంది. ఈ ప్రాంతాల్లో జనవరి నుంచి తొలుత జీరో వాయిస్ టారిఫ్ ప్లాన్స్ అందించనున్నట్లు ఈ ప్లాన్ లోకి ప్రవేశించేందుకు కూడా అతితక్కువ మొత్తంలోనే రుసుము వసూలు చేయనున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం జియో ప్లాన్ లోకి ప్రవేశించాలంటే రూ.149 చెల్లించాలి. కానీ బీఎస్ఎన్ఎల్ మాత్రం ప్రవేశ రుసుం రూ.2 నుంచి రూ.4మాత్రమే వసూలు చేస్తుందట. బీఎస్ఎన్ఎల్ మొబైల్ వినియోగదార్లతోపాటు ఇంటి వద్ద బ్రాడ్ బ్యాండ్ సేవలు ఉపయోగించుకుంటున్నవారికి కూడా ఈ ప్లాన్ అందిస్తామని శ్రీవాత్సవ చెప్పారు. బీఎస్ఎన్ఎల్ తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో ఇక ఎయిర్ టెల్ ప్లస్, వోడాఫోన్, ఐడీయాలపై మరింత ప్రభావం పడొచ్చని నిపుణులు చెబుతున్నారు. -
భారీగా ధరలు తగ్గిన మందులివే!
-
భారీగా ధరలు తగ్గిన మందులివే!
న్యూఢిల్లీ: కేంద్ర ఔషధ నియంత్రక మండలి కొన్ని నిత్యావసర మందుల ధరలను భారీగా తగ్గించింది. క్యాన్సర్ మందులు, యాంటీ రిట్రోవైరల్, మలేరియా నివారణకుపయోగించే దాదాపు 22 రకాల మందులపై 45శాతం దాకా ధరలను తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. ఈ ధరలు తక్షణమే అమల్లోకి రానున్నట్టు వెల్లడించింది. ముఖ్యంగా క్యాన్సర్ నిరోధకంలో, మలేరియా నివారణలోవాడే కొన్ని సాధారణ మందులను సామాన్యుడికి అందుబాటులో తెచ్చే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. 10-45 శాతంవరకు గరిష్ట చిల్లర ధర లేదా ఎంఆర్పీ ధరలను తగ్గించినట్టు నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) ప్రకటించింది. 22 సమ్మేళనాల కలిగిన దాదాపు 220 మెడిసిన్ బ్రాండ్ల ధరలపై దీని ప్రభావం ఉంటుందని తెలిపింది. తాజా ఆదేశాల ప్రకారం సగటున కనీసం 25 శాతం ధరల కోత ఉంటుందని ఒక అధికారి తెలిపారు. బ్లడ్, రొమ్ము, కడుపు, ఊపిరితిత్తులు, అండాశయము మరియు మూత్రపిండాల లాంటి వివిధ రకాల క్యాన్సర్ చికిత్సలో ఉపయోగించే ఇంజెక్షన ధరలు ప్రభావితం కానున్నాయి. -
ఆ ఫీజు రద్దు చేసిన ఢిల్లీ ఎయిర్పోర్ట్
న్యూఢిల్లీ : ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు(ఐజీఐ) నుంచి విమానంలో ప్రయాణిస్తున్నారా? అయితే మీక శుభవార్త. ఇంతవరకు ఇప్పటివరకూ విమాన ప్రయాణీకుల నుంచి చేసిన డెవలప్ మెంట్ ఫీజును రద్దు చేసింది. ఇక విమానాశ్రయం నుంచి మిగతా ప్రదేశాలకు ఎగరడం ఇక చౌకే. అంతేకాదు ఇంతవరకూ ప్రయాణీకులకు గుదిబండలా మారిన ఈ చార్జిలను ఉపసంహరించుకోవడంతోపాటు, ఈ నెలకు ఇప్పటికే చెల్లించినవారికి తిరిగి చెల్లించనుంది.ఎన్నో ఏళ్లుగా విమాన ప్రయాణికులపై వేస్తున్నఅభివృద్ధి ఫీజులను ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు లిమిటెడ్(డీఐఏఎల్) ఉపసంహరించుకుంది. దీంతో ఆ ఎయిర్ పోర్టు నుంచి ప్రయాణించే వారికి అదనపు వసూళ్ల బాధ తగ్గింది. దేశీయ మార్గాలలో ప్రయాణించే ప్యాసింజర్లపై డెవలప్ మెంట్ చార్జీ కింద డీఐఏఎల్ రూ. 100 వసూలు చేయగా.. ఇంటర్నేషనల్ గమ్యస్థానాలకు వెళ్లేవారిపై రూ.600 వసూలు చేసింది. ప్యాసెంజర్లపై వేసే అభివృద్ధి లెవీ ఫీజును మే 1 నుంచి వసూలు చేయడం మానేయాలని డీఐఏఎల్ కు ఎయిర్ పోర్ట్స్ ఎకనామిక్ రెగ్యులేటరీ అథారిటీ(ఏఈఆర్ఏ) ఫిబ్రవరిలో ఆదేశాలు జారీచేసింది. ఈ డీఎఫ్ లెవీని డీఐఏఎల్ 2012 డిసెంబర్ నుంచి వసూలు చేసింది. డీఎఫ్ కింద నెలకు రూ.30 కోట్ల మేర వసూలు జరిగింది. డీఎఫ్ కింద మంజూరుచేసిన రూ.3,415 కోట్లను 2016 ఏప్రిల్ 30 వరకూ డీఐఏఎల్ కు రికవరీ అవుతుందని, ఎయిర్ పోర్ట్ టారిఫ్ రెగ్యులేటరీ అథారిటీ ఫిబ్రవరిలో ఈ ఆదేశాలను జారీచేసింది. ఏప్రిల్ 30 తర్వాత ఐజీఐ ఎయిర్ పోర్టు నుంచి ప్రయాణించేందుకు టికెట్లు బుక్ చేసుకున్న ప్యాసెంజర్లకు డెవలప్ మెంట్ చార్జీలను రిఫండ్ చేయాలని అన్నీ ఎయిర్ లైన్ సంస్థలకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ గత నెలే ఆదేశాలు కూడా జారీచేసింది. -
త్వరలో చీప్‌గా పెట్రోల్, రైలు టిక్కెట్లు, ఫోన్ బిల్లులు!
న్యూఢిల్లీ: మున్ముందు ఇంధన (పెట్రోల్, డీజిల్)ధరలు, రైలు టెక్కెట్లు, టెలిఫోన్ బిల్లులు మరింత చౌకగా ఉండనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ త్వరలో ప్రకటన చేయనున్నారు. అది కూడా క్రెడిట్, డెబిట్ కార్డులు ఉపయోగించేవారికే ఈ సౌకర్యం లభించనున్నట్లు తెలిసింది. దేశంలో నల్లధనాన్ని అరికట్టేందుకు, పన్ను ఎగవేతదారులను నియంత్రించేందుకు ఎన్నో సంస్కరణలు తీసుకొస్తున్నామని అందులో భాగంగా ఎలక్ట్రానిక్ కార్డుల వినియోగం పెంచాలని నిర్ణయించినట్లు గతంలో అరుణ్ జైట్లీ చెప్పిన విషయం తెలిసిందే. ఆదాయపన్నును క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా చెల్లించేవారికి కొన్ని ప్రోత్సాహకాలు కూడా అందించనున్నట్లు, ఇలా చేయడం ద్వారా బదిలీ చెల్లింపులనుంచి కూడా మినహాయింపు ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లు కీలక వర్గాల సమాచారం. లక్ష రూపాలయకంటే పెద్ద మొత్తాన్ని కూడా ఎలక్ట్రానిక్ కార్డుల ద్వారా చెల్లించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుందని, అయితే, రెండు లక్షలకు పైగా చెల్లింపులు చేయాల్సి వస్తే మాత్రం తప్పకుండా పాన్ కార్డు అవసరం ఉంటుందని మంగళవారం జైట్లీ చెప్పారు కూడా. దీనిపై పూర్తి స్థాయిలో లోక్ సభలో అరుణ్ జైట్లీ త్వరలో ప్రకటన చేసే అవకాశం ఉంది.