త్వరలో చీప్గా పెట్రోల్, రైలు టిక్కెట్లు, ఫోన్ బిల్లులు! | Cheaper Fuel, Rail Tickets, Phone Bills Through Card Payment, Says Government | Sakshi
Sakshi News home page

త్వరలో చీప్గా పెట్రోల్, రైలు టిక్కెట్లు, ఫోన్ బిల్లులు!

Published Tue, Dec 15 2015 7:58 PM | Last Updated on Tue, Oct 2 2018 4:19 PM

త్వరలో చీప్గా పెట్రోల్, రైలు టిక్కెట్లు, ఫోన్ బిల్లులు! - Sakshi

త్వరలో చీప్గా పెట్రోల్, రైలు టిక్కెట్లు, ఫోన్ బిల్లులు!

న్యూఢిల్లీ: మున్ముందు ఇంధన (పెట్రోల్, డీజిల్)ధరలు, రైలు టెక్కెట్లు, టెలిఫోన్ బిల్లులు మరింత చౌకగా ఉండనున్నాయి. ఈ మేరకు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ త్వరలో ప్రకటన చేయనున్నారు. అది కూడా క్రెడిట్, డెబిట్ కార్డులు ఉపయోగించేవారికే ఈ సౌకర్యం లభించనున్నట్లు తెలిసింది. దేశంలో నల్లధనాన్ని అరికట్టేందుకు, పన్ను ఎగవేతదారులను నియంత్రించేందుకు ఎన్నో సంస్కరణలు తీసుకొస్తున్నామని అందులో భాగంగా ఎలక్ట్రానిక్ కార్డుల వినియోగం పెంచాలని నిర్ణయించినట్లు గతంలో అరుణ్ జైట్లీ చెప్పిన విషయం తెలిసిందే.

ఆదాయపన్నును క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా చెల్లించేవారికి కొన్ని ప్రోత్సాహకాలు కూడా అందించనున్నట్లు, ఇలా చేయడం ద్వారా బదిలీ చెల్లింపులనుంచి కూడా మినహాయింపు ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లు కీలక వర్గాల సమాచారం. లక్ష రూపాలయకంటే పెద్ద మొత్తాన్ని కూడా ఎలక్ట్రానిక్ కార్డుల ద్వారా చెల్లించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుందని, అయితే, రెండు లక్షలకు పైగా చెల్లింపులు చేయాల్సి వస్తే మాత్రం తప్పకుండా పాన్ కార్డు అవసరం ఉంటుందని మంగళవారం జైట్లీ చెప్పారు కూడా. దీనిపై పూర్తి స్థాయిలో లోక్ సభలో అరుణ్ జైట్లీ త్వరలో ప్రకటన చేసే అవకాశం ఉంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement