తగ్గేవి.. పెరిగేవి..
న్యూఢిల్లీ: 2017-18 ఆర్థిక బడ్జెట్ బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఎక్సైజ్, కస్టమ్స్ సుంకాలు తన ప్రతిపాదనలతో ఖజానాకు ఎటువంటి నష్టం లేదా లాభం రాదని చెప్పారు. ముఖ్యంగా త్వరలోనే జీఎస్ టీ అమల్లోకి రానున్న నేపథ్యంలో ఎక్సైజ్ & సర్వీస్ టాక్స్ ప్రస్తుత విధానంలో పెద్దగా మార్పులు చేయలేదని తెలిపారు. సిల్వర్ కాయిన్స్ పై 12.5 శాతం దిగుమతి సుంకం విధించారు. ఎక్సైజ్ & సర్వీస్ టాక్స్ లో స్వల్ప మార్పుల కారణగా ధరలు పెరిగేవి, తగ్గేవి ఈ విధంగా ఉన్నాయి.
తగ్గేవి
ఎల్ ఈడీ దీపాలు
సౌర ఫలకాలు( సోలార్ ప్యానల్స్)
మైక్రో ఎటీఎంలు
ఫింగర్ ప్రింట్ యంత్రాలు,
ఐరిస్ స్కానర్లు
రైల్వే టిక్కెట్ల ఆన్‌లైన్ బుకింగ్
ఎల్ఎన్‌జి(లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్)
ఫ్యూయల్ సెల్ బేస్డ్ జనరేటర్లు
లెదర్ ఉత్పత్తుల తయారీకి వాడే కూరగాయల ఉత్పత్తులు
రక్షణ రంగంలో గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీలు
పెరిగేవి
సెల్ ఫోన్లు, వెండి నాణేలు,
సిగరెట్లు, పొగాకు, బీడీలు, పాన్ మసాలా ఉత్పత్తులు
అల్యూమినియం ఉత్పత్తులు
పార్సిల్ ద్వారా దిగుమతి అయ్యే ఇతర వస్తువులు,
వాటర్ ఫిల్టర్స్ పరికరాలు,
జీడిపప్పు ప్రియం కానున్నాయి