నేటి జీఎస్‌టీ కౌన్సిల్ 50వ సమావేశంలో కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి 'నిర్మలా సీతారామన్' అధ్యక్షత ఏ వస్తువుల ధరలు పెరుగుతాయి, ఏ వస్తువుల ధరలు తగ్గుతాయనే విషయాలు అధికారికంగా వెల్లడవుతాయి. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం.. ఈ రోజు సమావేశంలో ప్రధానంగా ఆన్‌లైన్ గేమింగ్, మల్టి యుటిలిటీ వాహనాలు, క్యాసినో, గుర్రపు పందాలు వంటి వాటి మీద చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. రానున్న రోజుల్లో ఇవి మరింత ప్రియం కానున్నాయి. కాగా సినిమా హాళ్లలో తినుబండారాల ధరలు తగ్గించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ధరలు పెరిగేవి..
- జీఎస్‌టీ కౌన్సిల్ సమావేశంలో ఆన్‌లైన్ గేమింగ్, క్యాసినోలు, గుర్రపు పందాలు మరింత ప్రియం కానున్నాయి. మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని కమిటీ ఈ మూడింటి మీద ట్యాక్స్ పెంచాలని నిర్ణయించినట్లు సమాచారం. వీటి పైన జీఎస్‌టీ 28 శాతం పెరిగే అవకాశం ఉంది.
- మల్టీ యుటిలిటీ వెహికల్స్ (MUV), క్రాస్ఓవర్ యుటిలిటీ వెహికల్స్ (XUV) ధరలు కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్రం & రాష్ట్ర అధికారులతో కూడిన ఫిట్‌మెంట్ కమిటీ వీటి మీద 22 శాతం సెస్ వసూలు చేయాలని సిఫార్సు చేసింది.
(ఇదీ చదవండి: ఆ రెండు యాప్స్ ఉంటే మీ వివరాలు చైనాకే.. వెంటనే డిలీట్ చేయండి!)
ధరలు తగ్గేవి..
- సినిమా హాళ్లలో తినుబండారాలు, పానీయాల ధరలు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. సినిమా హాళ్ల యజమానులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇండస్ట్రీ లాబీ గ్రూప్ మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (MAI) పన్నులను తగ్గించనున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద సినిమా హాళ్లలో ఆహార పానీయాలపై 18 శాతం జీఎస్టీ కాకుండా 5 శాతం వర్తిస్తుందని కౌన్సిల్ ఈ రోజు స్పష్టం చేసిందని రెవెన్యూ కార్యదర్శి 'సంజయ్ మల్హోత్రా' అధికారికంగా తెలిపారు.
- శాటిలైట్ సర్వీస్ లాంచ్ కూడా చౌకగా మారే అవకాశం ఉంది. కమిటీ దీనిపైనా కూడా ట్యాక్ తగ్గింపుని కల్పించడానికియోచిస్తోంది.
- మెడిసిన్స్ మీద కూసే ధరలు తగ్గే అవకాశం ఉంది. రోగులు సాధారణంగా క్రౌడ్ ఫండింగ్ ద్వారా డబ్బును సేకరిస్తున్నందున రూ. 36 లక్షల ఖరీదు చేసే మందులను GST నుండి మినహాయించాలని ఫిట్‌మెంట్ కమిటీ సిఫార్సు చేసింది క్యాన్సర్ ఔషధం (dinutuximab/qarziba) వ్యక్తిగత ఉపయోగం కోసం దిగుమతి చేసుకున్నప్పుడు 12% ఇంటిగ్రేటెడ్ GST (IGST) నుండి మినహాయింపు ఇవ్వాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment