Union Budget 2022 Highlights: List Of Which Items Gets Cheaper And What Is Costlier - Sakshi
Sakshi News home page

Union Budget 2022: పెరిగే..తగ్గే వస్తువుల జాబితా ఇదే..!

Published Tue, Feb 1 2022 1:49 PM | Last Updated on Tue, Feb 1 2022 3:54 PM

Union Budget 2022: These Items Get Cheaper And Costlier - Sakshi

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం కేంద్ర బడ్జెట్‌-2022ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఆసియాలోని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ అవతరించిందని నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు. ఇక కేంద్ర బడ్జెట్‌-2022లో ఆర్థిక మంత్రి ప్రతిపాదించినట్లుగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో పలు వస్తువులు మరింత చౌకగా, ఖరీదైనవిగా లభించే అవకాశం ఉంది. 

కేంద్ర బడ్జెట్‌-2022 ప్రకారం మొబైల్ ఫోన్స్‌, మొబైల్ ఫోన్ ఛార్జర్‌లతో సహా పెద్ద సంఖ్యలో సాధారణంగా ఉపయోగించే వస్తువులు చౌకగా మారబోతున్నాయి. కట్ చేసి పాలిష్ చేసిన వజ్రాలు, రత్నాలపై కస్టమ్స్ డ్యూటీ 5 శాతంకు తగ్గించారు. భారత్‌లో తయారు చేయబడిన వ్యవసాయ రంగానికి సంబంధించిన పనిముట్లు, ఉపకరణాలపై మినహాయింపును పొడిగిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు.

వచ్చే ఆర్థిక సంవత్సరంలో చౌకగా, ఖరీదైన వస్తువుల జాబితా ఇదే..

చౌకగా లభించేవి

  • బట్టలు
  • రత్నాలు,వజ్రాలు. 
  • మొబైల్ ఫోన్లు
  • మొబైల్ ఫోన్ ఛార్జర్లు
  • పెట్రోలియం ఉత్పత్తులకు అవసరమైన రసాయనాలపై కస్టమ్ డ్యూటీ తగ్గింపు
  • మిథనాల్‌తో సహా కొన్ని రసాయనాలు
  • స్టీల్ స్క్రాప్‌పై రాయితీ మరో ఎడాదిపాటు వర్తించనుంది.
  • స్మార్ట్‌వాచ్‌
  • వినికిడి పరికరాలు
  • వ్యవసాయ ఉపకరణాలు
  • కోకా బీన్స్‌, ఇంగువ

ఖరీదైనవి

  • అన్ని దిగుమతి వస్తువులు
  • గొడుగులపై భారీ సుంకాలను పెంచడంతో వీటి ధరలు భారీగా పెరగనున్నాయి.
  • క్రిప్టో లావాదేవీలపై 30 శాతం పన్నులు
  •  అనుకరణ ఆభరణాలు
  • స్పీకర్స్‌, హెడ్‌ ఫోన్స్‌, ఇయర్‌ఫోన్స్‌
  • సోలార్‌ సెల్స్‌, మాడ్యూల్స్‌
  • ఎక్స్‌ రే మెషిన్స్‌

చదవండి: Budget 2022: క్రిప్టో ట్రేడర్లకు శుభవార్త !

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement