న్యూఢిల్లీ: మన దేశంలో ఒక రకంగా చూస్తే హిందీ అధికార భాష. దానికి తోడుగా 22 గుర్తింపు పొందిన స్థానిక భాషలు ఉన్నాయి. గుర్తింపు పొందిన భాషల్లో ఇంగ్లిష్ లేనే లేదు. మరి ఏటా బడ్జెట్ ప్రసంగాన్ని ఇంగ్లిష్‌లో మాత్రమే ఎందుకు చదువుతారో తెలుసా? దానికి గట్టి కారణమే ఉంది. నిజానికి స్వాతంత్య్రం వచ్చిన కొత్తలోనే.. కేంద్ర ప్రభుత్వ వ్యవహారాలన్నీ హిందీలో నిర్వహించేందుకు ప్రయత్నాలు జరిగాయి. కానీ దేశంలోని కొన్ని ప్రాంతాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇతర భాషలను తీసుకునే పరిస్థితి లేదు. దాంతో బ్రిటిష్‌కాలం నుంచి కొనసాగుతూ.. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పరిచయం ఉన్న ఇంగ్లిష్‌ను మధ్యే మార్గంగా.. ‘అనుసంధాన భాష’గా ఎంపిక చేశారు. ఇప్పటికీ అదే కొనసాగుతోంది.
అయితే రాజ్యాంగం ప్రకారం.. రాష్ట్రాలకు భాష విషయంలో స్వేచ్ఛ ఉంది. ఏ రాష్ట్రమైనా కేంద్ర గుర్తింపు పొందిన భాషనుగానీ, తమకు నచ్చిన మరే భాషను గానీ.. సదరు రాష్ట్ర పరిధిలో అధికారిక భాషగా ప్రకటించవచ్చు. ఆ భాషలో కార్యకలాపాలు కొనసాగించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment