Union Budget 2022-23
-
Union Budget 2023-24: కొత్త పన్ను విధానం ఆకర్షణీయం
న్యూఢిల్లీ: నూతన పన్ను విధానం 2023–24 బడ్జెట్‌తో ఆకర్షణీయంగా మారినట్టు ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) చైర్మన్ నితిన్ గుప్తా తెలిపారు. ఎక్కువ మంది ఇన్వెస్టర్లకు ఇది ప్రయోజనకరమని, తక్కువ పన్ను రేటును వారు ఆస్వాదిస్తారని చెప్పారు. బడ్జెట్ అనంతరం ఓ వార్తా సంస్థతో గుప్తా మాట్లాడారు. తగ్గింపులు, మినహాయింపులను క్రమంగా దూరం చేయడం కోసమే నూతన పన్ను విధానంలో (మినహాయింపుల్లేని) కొత్త శ్లాబులు, రేట్లు ప్రకటించడానికి కారణంగా పేర్కొన్నారు. దీని ద్వారా వ్యక్తులు, సంస్థలపై పన్ను రేట్లు తగ్గించాలన్న దీర్ఘకాలిక డిమాండ్‌ను చేరుకోవడం సాధ్యపడుతుందన్నారు. ‘‘నూతన పన్ను విధానాన్ని రెండేళ్ల క్రితం (2020–21 బడ్జెట్లో) ప్రతిపాదించాం. అయినప్పటికీ తగిన ప్రతిఫలాన్ని ఇవ్వడం లేదు. ఇప్పుడు ప్రభుత్వం శ్లాబులను మార్చింది. దీనివల్ల పన్ను చెల్లింపుదారులకు రేట్లు, శ్లాబులు ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమవుతాయి’’అని చెప్పారు. కార్పొరేట్ విభాగంలో పన్ను చెల్లింపుదారులకు ఇదే మాదిరి చర్యలను కొంత కాలం క్రితం ప్రకటించగా, వారికి ప్రయోజనకరంగా మారినట్టు గుప్తా తెలిపారు. నూతన పన్ను విధానంతో లబ్ధి పొందని వర్గాలు చాలా తక్కువన్నారు. దీనిలో స్టాండర్డ్ డిడక్షన్ కల్పించినందున, అది పాత విధానంలోని ప్రయోజనాలకు ఏ మాత్రం తీసిపోదన్నారు. పన్ను చెల్లింపు దారుల ఇష్టమే.. నూతన పన్ను విధానం డిఫాల్ట్ (ప్రమేయం లేని)గా ఉంటున్నందున, పాత పన్ను విధానంలో ఉన్నవారిపై ప్రభావం పడుతుందా? అన్న ప్రశ్నకు.. ఏ విధానం అయినా ఎంపిక చేసుకుని రిటర్నులు దాఖలు చేసే స్వేచ్ఛ పన్ను చెల్లింపుదారులకు ఉంటుందని నితిన్‌గుప్తా చెప్పారు. కావాలంటే పాత పన్ను విధానానికి కూడా మారిపోవచ్చన్నారు. ‘‘డిఫాల్ట్ అంటే ఫైలింగ్ పోర్టల్ స్క్రీన్‌పై ముందు కనిపిస్తుంది. కానీ, అక్కడ ఏ పన్ను విధానం అనే ఆప్షన్ ఉంటుంది. కావాల్సిన విధానాన్ని ఎంపిక చేసుకోవచ్చు’’అని గుప్తా వివరించారు. ఏ వర్గం పన్ను చెల్లింపుదారులను కూడా నిరుత్సాహపరచబోమన్నారు. నూతన పన్ను విధానంలో రూ.7 లక్షల వరకు పన్ను చెల్లించే అవకాశం లేకుండా రిబేట్ కల్పించడం తెలిసిందే. దీనికి అదనంగా రూ.50 వేల స్టాండర్డ్ డిడక్షన్ ప్రయోజనం కూడా ప్రకటించారు. పాత విధానంలో అయితే రూ.5 లక్షలకు మించిన ఆదాయంపై 20% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కాకపోతే వివిధ సెక్షన్ల కింద తగిన సాధనాల్లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అంతిమంగా కొత్త విధానమే తక్కువ పన్ను రేట్లతో, మినహాయింపుల్లేని, సులభతర పన్నుల విధానానికి (నూతన పన్ను విధానం) మళ్లడమే ప్రభుత్వ ధ్యేయమని కేంద్ర ప్రభుత్వ రెవెన్యూ విభాగం కార్యదర్శి సంజయ్ మల్హోత్రా తెలిపారు. రెవెన్యూ శాఖ నిర్వహించిన విశ్లేషణ ప్రకారం ఏటా రూ.15 లక్షలు ఆర్జించే వ్యక్తి పాత పన్ను విధానంలో రూ.3.75 లక్షల వరకు క్లెయిమ్‌లు పొందొచ్చని.. కానీ, తక్కువ పన్ను రేట్లతో దీనికి ప్రత్యామ్నాయ పన్నుల విధానాన్ని ప్రతిపాదించినట్టు చెప్పారు. నూతన పన్ను విధానం తప్పనిసరి చేయడానికి ఎలాంటి గడువు పెట్టుకోలేదని స్పష్టం చేశారు. -
ఆకాంక్షలు నెరవేరేనా
వచ్చే సార్వత్రిక ఎన్నికల ముందు వస్తున్న చివరి పూర్తి స్థాయి కేంద్ర బడ్జెట్ ఇదే. ఎంత కాదన్నా బడ్జెట్ నిర్ణయాలు, కేటాయింపుల ప్రభావం కొన్ని వర్గాలపై కచ్చితంగా ఉంటుంది. ఇప్పటికే కేంద్రంలో మోదీ ఆధ్వర్యంలోని ఎన్డీయే సర్కారు 9 ఏళ్లుగా పాలిస్తోంది. మరోసారి ప్రజామోదం కోసం బడ్జెట్‌ను ఒక అవకాశంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భావిస్తారా..? లేక మొదటి నుంచి సంస్కరణల హితమేనన్న తమ విధానానికి కట్టుబడి ఉంటారా? అన్నది ఫిబ్రవరి 1న తేటతెల్లం అవుతుంది. కానీ, సామాన్య, మధ్యతరగతి ప్రజలు పెరిగిపోయిన ధరల భారాన్ని ఎదుర్కొంటున్నారు. మరోవైపు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంలో ఉపాధి కల్పనపైనా ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. పన్నుల భారాన్ని తగ్గించాలన్న మధ్యతరగతి వాసుల వినతులు, వివిధ రంగాల ఆకాంక్షలకు ఈ బడ్జెట్ ఏ మేరకు న్యాయం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. కరోనా తర్వాత గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పూర్తి స్థాయిలో ఇంకా కోలుకోలేదు. డిమాండ్ పరిస్థితులు దీన్నే తెలియజేస్తున్నాయి. మరి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఉత్ప్రేరణకు ఆర్థిక మంత్రి ఏం చేస్తారో చూడాలి. నిర్మలమ్మకు ఇది ఐదో బడ్జెట్ కానుంది. మధ్యతరగతికి ‘ఐటీ’ తాయిలం..? రూ.2.5 లక్షల వరకు ఆదాయం కలిగిన వారికి ఎలాంటి ఆదాయపన్ను లేదు. 2014–2015 సంవత్సరానికి ఆదాయపన్ను బడ్జెట్ ప్రవేశపెట్టిన నాటి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ రూ.2 లక్షలుగా ఉన్న పరిమితిని రూ.2.5 లక్షలు చేశారు. 60 ఏళ్లు నిండిన వృద్ధులకు ఇది రూ.3 లక్షలుగా, రూ.80 ఏళ్లు నిండిన వారికి రూ.5 లక్షలకు పెంచారు. తొమ్మిదేళ్లుగా ఇదే బేసిక్ పరిమితి కొనసాగుతోంది. రూ.2.51–5 లక్షల వరకు ఆదాయం ఉన్నా పన్ను చెల్లించే అవసరం లేకుండా తర్వాతి కాలంలో రాయితీ కల్పించారు. కానీ, బేసిక్ పరిమితిలో మార్పులు చేయలేదు. ఔషధాల భారాన్ని దింపరూ.. పరిశోధన, అభివృద్ధికి, ఫార్ములేషన్, ఏపీఐల తయారీకి సంబంధించి ప్రత్యేక నిధుల కేటాయింపు అవసరం ఉందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఔషధాలపై జీఎస్టీని సులభతరం చేయాలని కోరుతున్నాయి. దేశ ఫార్మా పరిశ్రమ 2023 ముగిసే నాటికి 130 బిలియన్ డాలర్లకు చేరుతుందన్న అంచనా ఉంది. ఫార్మా పరిశ్రమ ఔషధ పరీక్షలు, సర్టిఫికేషన్ వంటి సేవలను అందిస్తున్నా.. సేవల ఎగుమతి ప్రోత్సాహక పథకం (ఎస్ఈఐఎస్) కింద ఎలాంటి ప్రోత్సాహకాలు అందించడం లేదని, తమకూ వాటిని అందించాలన్న డిమాండ్ ఉంది. ఆరోగ్యం కోసం ప్రజలు జేబు నుంచి చేసే ఖర్చు 65 శాతంగా ఉందని, కనుక ఔషధాలపై జీఎస్టీని తగ్గించడం వల్ల ఈ భారాన్ని దింపొచ్చని పరిశ్రమ కోరుతోంది. పాలసీదారులు/బీమా కంపెనీలు మనదేశంలో బీమా వ్యాప్తి ఇప్పటికీ అంతర్జాతీయ సగటుతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. ‘2047 నాటికి అందరికీ బీమా’ అనే లక్ష్యాన్ని బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్డీఏఐ) పెట్టుకుంది. టర్మ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై వినియోగదారులు 18 శాతం జీఎస్టీ చెల్లించాల్సి వస్తోంది. ఇది ఎంతో మందికి భారంగా పరిణమించిదని, దీన్ని 5 శాతానికి తగ్గించాలని పరిశ్రమ ఎప్పటి నుంచో కోరుతోంది. ఉదాహరణకు రూ.10,000 ప్రీమియంపై రూ.1800 పన్ను రూపంలో చెల్లించాల్సి వస్తోంది. పన్ను తగ్గింపుతో ప్రీమియం తగ్గడం వల్ల మరింత మంది బీమా పాలసీలు తీసుకునేందుకు ముందుకు వస్తారని పరిశ్రమ చెబుతోంది. ఈ డిమాండ్‌ను ఆర్థిక మంత్రి నెరవేర్చితే అది కచ్చితంగా బీమా వ్యాప్తికి దోహదపడుతుంది. ముఖ్యంగా అధిక కవరేజీనిచ్చే టర్మ్ ఇన్సూరెన్స్‌కు ఆదరణ పెరుగుతుంని పరిశ్రమ అంటోంది. హెల్త్ ఇన్సూరెన్స్‌కు చెల్లించే ప్రీమియం ఒక కుటుంబానికి రూ.25,000 వరకు ఉంటే సెక్షన్ 80డీ కింద పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. లైఫ్ ఇన్సూరెన్స్ కోసం ప్రత్యేక పన్ను మినహాయింపు కావాలని, యాన్యుటీ (పెన్షన్ ప్లాన్) ఆదాయంపై పన్ను ఎత్తేయాలని, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంపై మరింత పన్ను మినహాయింపు ఇవ్వాలని బీమా రంగం కోరుతోంది. ఉపాధి కల్పన అమెరికా, యూరప్‌లో ఆర్థిక మాంద్యం ఆందోళనల నేపథ్యంలో టెక్ కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయి. దీనిపై ఆందోళన వ్యక్తమవుతోంది. కనుక ఉపాధి కల్పన, పెట్టుబడులకు ఊతమిచ్చే ప్రతిపాదనలకు చోటు ఇవ్వాలన్న సూచనలు నిపుణుల నుంచి వినిపిస్తున్నాయి. నిజానికి ఉపాధి కల్పన లక్ష్యంతోనే మోదీ సర్కారు భారత్‌లో తయారీ విధానాన్ని ఎంచుకుంది. దీనికింద ఆత్మనిర్భర్ (స్వావలంబన) భారత్ పేరుతో దేశీ తయారిని ప్రోత్సహించే పలు విధానాలను ఇప్పటికే చేపట్టింది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) కింద ఇప్పటికే 14 రంగాలకు ప్రోత్సాహకాలను ప్రకటించారు. బడ్జెట్లో ఇందుకు సంబంధించి కేటాయింపులు పెంచొచ్చని భావిస్తున్నారు. ముఖ్యంగా మరిన్ని రంగాలు తమకు సైతం పీఎల్ఐ ప్రోత్సాహకాలు కావాలని కోరుతున్నాయి. వీటికి ఏ మాత్రం ప్రాధాన్యం ఇస్తారన్నది బడ్జెట్‌తో తెలుస్తుంది. స్టార్టప్‌లకు సైతం కేంద్రం ప్రోత్సాహకాలు ఇస్తోంది. దీనికి కూడా కేటాయింపులు పెంచొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీ) కింద కేటాయింపులు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రామీణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కేటాయింపులు పెంచడం ద్వారా ఉపాధి కల్పించొచ్చనే సూచనలు వస్తున్నాయి. ఫిన్‌టెక్/ఎంఎస్ఎంఈ దేశీ ఫిన్‌టెక్ పరిశ్రమ తమకు మరిన్ని మద్దతు చర్యలు కావాలని కోరుతోంది. అందరికీ ఆర్థిక సేవల చేరువలో తమ పాత్ర కీలకమని, ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థకు, ఉపాధి కల్పనకు కీలకంగా వ్యవహరిస్తున్న ఎంఎస్ఎంఈ రంగం అవసరాలు తీర్చడంలోనూ ఫిన్‌టెక్ పరిశ్రమ చేస్తున్న సేవలను గుర్తు చేసింది. 45 శాతం మందికి ఉపాధినిస్తూ, జీడీపీలో 30 శాతం వాటాను ఎంఎస్ఎంఈ పరిశ్రమ కలిగి ఉంది. కనుక బడ్జెట్ ప్రతిపాదనల పట్ల ఫిన్‌టెక్ పరిశ్రమ ఆసక్తిగా చూస్తోంది. కార్పొరేట్ రంగం డిమాండ్.. కొత్తగా తయారీ ప్లాంట్లు ఏర్పాటు చేసే దేశీ కంపెనీలకు అతి తక్కువగా 15 శాతం కార్పొరేట్ పన్నును కేంద్రం లోగడ ప్రకటించింది. 2024 మార్చి 31లోపు తయారీ కార్యకలాపాలు ఆరంభించేవి ఈ ప్రయోజనం పొందొచ్చు. ఈ గడువును పొడిగించాలనే డిమాండ్ ఉంది. దీనివల్ల మరిన్ని కంపెనీలు ముందుకు వస్తాయని, తద్వారా ఉపాధి కల్పన పెరుగుతుందన్న అభిప్రాయాలు ఉన్నాయి. కరోనా మహమ్మారి ప్రభావం నుంచి బయట పడేందుకు కంపెనీలకు సమయం పట్టిందని.. ఇప్పుడు నూతన పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నందున గడువు పొడిగించాలనే డిమాండ్ ఉంది. కొత్త ప్లాంట్ తయారీ కార్యకలాపాలు ప్రారంభించేందుకు కనీసం 2–3 ఏళ్లు పడుతుందని, కనుక ప్రస్తుత గడువు చాలదన్న అభిప్రాయం ఉంది. ఆదాయపన్ను విషయంలో ఊరట కల్పిస్తే అది హౌసింగ్ పరిశ్రమ వృద్ధికి మేలు చేస్తుందని రియల్టీ భావిస్తోంది. భారీ ఉపాధి కల్పిస్తున్న ఎంఎస్ఎంఈ రంగం తమకు క్షేత్రస్థాయిలో రుణ లభ్యత సమస్యగా ఉందని చెబుతోంది. ఎంఎస్ఎంఈ తర్వాత ఎక్కువ మందికి ఉపాధి కల్పించే కీలకమైన ఆటోమొబైల్ రంగం పన్నుల భారాన్ని తగ్గించాలని డిమాండ్ చేస్తోంది. కనిష్టంగా 28%, గరిష్టంగా 40 శాతానికి పైనే వాహనాలపై పన్నుల భారం వేస్తున్నారని.. మార్కెట్ విస్తరణకు ఇది అవరోధంగా నిలుస్తున్నట్టు చెబుతున్నాయి. స్టాక్ మార్కెట్ కోర్కెలు మూలధన లాభాల పన్ను పరంగా ఉపశమనం కల్పిస్తే అది మార్కెట్లకు మంచి జోష్‌నిస్తుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం డెట్, ఈక్విటీ, ప్రాపర్టీలకు వేర్వేరు మూలధన లాభాల పన్ను, హోల్డింగ్ పీరియడ్ అమలవుతున్నాయి. వీటి మధ్య ఏకరూపతకు అవకాశం ఉందని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి ఇప్పటికే సంకేతం ఇచ్చింది. ఈ క్రమంలోనే మూలధన లాభాల పన్ను విషయమై అంచనాలు ఏర్పడ్డాయి. దీర్ఘకాల మూలధన లాభాలపై నష్టాన్ని, స్వల్పకాల మూలధన లాభాలతో సర్దుబాటుకు అవకాశం లేదు. విద్యారంగం దేశంలో నాణ్యమైన విద్యకు డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలోనే విదేశీ విద్యా సంస్థలకు మోదీ సర్కారు ఆహ్వానం పలికింది. విద్యా సేవలపై జీఎస్టీ భారాన్ని తొలగించడం లేదంటే తగ్గించాలని విద్యా సంస్థలు కోరుతున్నాయి. దేశంలో ప్రాథమిక విద్యలో ఎక్కువ మంది చేరుతున్నారు. ఉన్నత విద్యకు వెళ్లేసరికి పిరమిడ్ మాదిరి చేరే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. అందుకుని ఉన్నత విద్యలోనూ మరింత మంది చేరేందుకు వీలుగా ఆకర్షణీయమైన రుణ పథకాలు, స్కాలర్షిప్లు ప్రకటించాలనే డిమాండ్ ఉంది. గృహ కల్పన అందరికీ ఇల్లు అనేది మోదీ సర్కారు నినాదం. దీని సాకారానికి వీలుగా రుణ సబ్సిడీ పథకాన్ని కొనసాగించాలని హౌసింగ్ పరిశ్రమ కోరుతోంది. అందుబాటు ధరల ఇంటికి నిర్వచనాన్ని విస్తరించాలన్న డిమాండ్ కూడా ఉంది. నిర్మాణ రంగ మెటీరియల్ అయిన స్టీల్, సిమెంట్‌పై జీఎస్టీ తగ్గించాలని పరిశ్రమ కోరుతోంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం గడువును మరింత కాలం పెంచాలని కోరుతోంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రుణంపై కొంత రాయితీ లభిస్తుంది. రైతులను చూస్తారా..? సాగు రంగం నుంచి డిమాండ్ల చిట్టా పెద్దదిగానే ఉంది. పీఎం కిసాన్ పథకం కింద ఒక్కో రైతుకు ఏటా సాగుకు కావాల్సిన ముడి సరుకుల కోసం ఇస్తున్న రూ.6,000ను పెంచాలనే డిమాండ్ ప్రధానంగా వినిపిస్తోంది. దీనివల్ల రైతులు రుణాలతో పనిలేకుండా సాగుకు కావాల్సిన ముడి పదార్థాలను కొనుగోలు చేసుకోగలరన్న సూచన ఉంది. పంటల బీమా పథకాన్ని మరింత మెరుగ్గా రూపొందించాలనే డిమాండ్ సైతం ఉంది. అగ్రి టెక్ స్టార్టప్‌లకు రాయితీలు కల్పించాలని, ఆగ్రోకెమికల్స్ దిగుమతులపై సుంకాలు తగ్గించాలని పరిశ్రమ కోరుతోంది. సాగులో టెక్నాలజీ విస్తరణకు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ల వినియోగం పెంచేందుకు చర్యలు ప్రకటిస్తారనే అంచనాలు ఉన్నాయి. ముడి చమురు మాదిరే వంట నూనెల విషయంలోనూ 65 శాతం దిగుమతులపైనే ఆధారపడుతున్నాం. దీంతో ‘నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్స్ ఆయిల్స్’ పేరుతో నూనె గింజల సాగుకు ఆర్థిక సహకారం అందించాలని సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా డిమాండ్ చేసింది. ఏటా రూ.25,000 కోట్ల చొప్పున ఐదేళ్లపాటు అందించాలని కేంద్రానికి సూచించింది. దీనివల్ల దిగుమతులను 30 శాతానికి తగ్గించొచ్చని పే ర్కొంది. సాగు రంగంలో పరిశోధన, అభివృద్దికి ప్రోత్సాహకాలు ఇవ్వాలని ధనూకా గ్రూప్ చైర్మన్ ఆర్జీ అగర్వాల్ కోరారు. రైతుల ఆదాయం రెట్టింపు చేయాలనే లక్ష్యంతో ఉన్న బడ్జెట్లో వ్యవసాయానికి మెరుగైన కేటాయింపులు చేస్తారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. హెల్త్‌కేర్‌కు పెద్ద పీట వేస్తారా? ఆరోగ్య సంరక్షణ (హెల్త్‌కేర్) రంగానికి బడ్జెట్లో కేటాయింపులను 20–30 శాతం పెంచాలన్న డిమాండ్లు నెలకొన్నాయి. కరోనా మహమ్మారి ఆరోగ్య మౌలిక సదుపాయాల అవసరాన్ని గర్తు చేసింది. హెల్త్‌కేర్ రంగానికి 2022–23 బడ్జెట్లో 16.5 శాతం అధికంగా రూ.86,200 కోట్ల కేటాయింపులు చేశారు. ఈ విడత కేటాయింపులు ఏ మేరకు ఉంటాయన్నది చూడాల్సి ఉంది. బడ్జెట్లో కేటాయింపుల పట్ల భారీ అంచనాలతో ఉన్నామని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ప్రెసిడెంట్ డాక్టర్ శరద్ కుమార్ అగర్వాల్ తెలిపారు. ముఖ్యంగా హెల్త్‌కేర్ పరిశ్రమ డిజిటైజేషన్‌కు అదనపు నిధులు అవసరమని అపోలో టెలీహెల్త్ సీఈవో విక్రమ్ తాప్లూ అభిప్రాయపడ్డారు. నేషనల్ డిజిటల్ హెల్త్ ఎకోసిస్టమ్, నేషనల్ టెలీ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ ప్రకటించినప్పటికీ, వీటి విస్తరణకు మరిన్ని నిధుల కేటాయింపు అవసరాన్ని ప్రస్తావించారు. ముఖ్యంగా టెలీ మెడిసిన్ సేవల విస్తరణకు అధిక నిధుల కేటాయింపు అవసరమని డాక్టర్ అగర్వాల్ సైతం పేర్కొన్నారు. స్వచ్చందంగా మెడికల్ ఇన్సూరెన్స్‌కు ప్రతిపౌరుడికీ అవకాశం కల్పించాలని కోరారు. అది కూడా ఉచితంగా అందించాలని సూచించారు. కేన్సర్ కేర్ వసతుల పెంపునకు మరిన్ని నిధులు అవసరమని నిపుణుల సూచనగా ఉంది. హెల్త్‌కేర్ మౌలిక సదుపాయాల కోసం ప్రత్యేక నిధి కేటాయించాలనే డిమాండ్ సైతం ఉంది. – బిజినెస్ డెస్క్ -
Union Budget 2022: ద్రవ్య స్థిరత్వానికి బడ్జెట్లో ప్రాధాన్యత!
న్యూఢిల్లీ: ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే నెల 1వ తేదీన పార్లమెంటులో ప్రవేశపెడతారని భావిస్తున్న 2023–24 వార్షిక బడ్జెట్ ద్రవ్య స్థిరత్వానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. 2022–23లో ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం) రూ.16.61 లక్షల కోట్లు ఉండాలని 2022 ఫిబ్రవరి 1వ తేదీన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ నిర్దేశించింది. ఇదే ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) అంచనాల్లో ఇది 6.4 శాతం. చక్కటి పన్ను వసూళ్ల వల్ల 2022–23 ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు అంచనాలకు అనుగుణంగా 6.4 శాతంలోపునకే (జీడీపీ విలువలో) పరిమితం అవుతుందన్న అంచనాలు ఉన్నాయి. 2025–26 నాటికి ద్రవ్యలోటును 4.5 శాతానికి తగ్గించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇక రానున్న (2023–24) ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యలోటు 5.8 శాతంగా ఉంటుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), జపాన్ బ్రోకరేజ్ దిగ్గజం– నోమురా వంటి సంస్థలు అంచనావేస్తున్నాయి. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) దన్నుతో భారత్ పన్ను వసూళ్లు 2023 మార్చితో ముగిసే 2022–23 ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ అంచనాలకన్నా రూ.4 లక్షల కోట్ల అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని స్వయంగా ప్రభుత్వ వర్గాలే పేర్కొంటున్నాయి. 2022–23లో రూ.27.50 లక్షల కోట్ల ప్రత్యక్ష, పరోక్ష పన్ను వసూళ్లు జరగాలన్నది లక్ష్యం. ఈ లక్ష్యంలో ప్రత్యక్ష పన్నుల వాటా రూ.14.20 లక్షల కోట్లయితే, పరోక్ష పన్ను వసూళ్ల వాటా రూ.13.30 లక్షల కోట్లు. అయితే లక్ష్యాలకు మించి పరోక్ష పన్ను వసూళ్లు రూ.17.50 లక్షల కోట్లు, పరోక్ష పన్ను (కస్టమ్స్, ఎక్సైజ్, జీఎస్టీ) వసూళ్లు రూ.14 లక్షల కోట్లకు చేరవచ్చు. అంటే వసూళ్లు రూ.31.50 లక్షల వరకూ వసూళ్లు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. బడ్జెట్ అంచనాలకన్నా ఇది రూ.4 లక్షల కోట్ల అధికం. 2022–23లో రూ.16.61 లక్షల కోట్ల ద్రవ్యలోటు కట్టడికి (జీడీపీలో 6.4 శాతం వద్ద) దోహదపడే అంశం ఇది. వ్యయ ప్రతిపాదనలకు సూచన పార్లమెంట్ (రెండు భాగాల) బడ్జెట్ సమావేశాలు జనవరి 31న ప్రారంభమవుతున్న నేపథ్యంలో వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల నుండి ఆర్థికశాఖ 2022–23కు సంబంధించి తుది వ్యయ ప్రతిపాదనలను కోరింది. గ్రాంట్లకుగాను రెండవ, తుది సప్లిమెంటరీ డిమాండ్ల ప్రతిపాదనలను ఆర్థికశాఖ కోరినట్లు ఒక అధికారిక మెమోరాండం పేర్కొంది. గ్రాంట్ల కోసం తుది సప్లిమెంటరీ డిమాండ్లను సమావేశాల్లోని రెండవ విడతలో సమర్పించే అవకాశం ఉందని సమాచారం. గత నెలలో, ప్రభుత్వం రూ. 3.25 లక్షల కోట్లకు పైగా నికర అదనపు వ్యయాన్ని అనుమతించే గ్రాంట్ల కోసం అనుబంధ డిమాండ్ల మొదటి బ్యాచ్‌ను ఆమోదించింది. ఇందులో ఎరువుల సబ్సిడీ చెల్లింపునకు ఉద్దేశించిన రూ. 1.09 లక్షల కోట్లు కూడా ఉన్నాయి. ఈ అదనపు వ్యయం 2022–23 బడ్జెట్లో ప్రతిపాదించిన మొత్తం కంటే అధికం. 2021–22లో బడ్జెట్ వ్యయం రూ.37.70 లక్షల కోట్లు. 2022–23లో బడ్జెట్ ప్రతిపానల్లో దీనిని రూ.37.70 లక్షల కోట్లకు పెంచడం జరిగింది. నియంత్రణలు సడలించాలి... ఫార్మా, హెల్త్‌కేర్ పరిశ్రమ విజ్ఞప్తి ∙ ప్రోత్సాహకాల కోసం వినతి రాబోయే కేంద్ర బడ్జెట్లో ఫార్మా, హెల్త్‌కేర్ రంగానికి సంబంధించిన నిబంధనలను సరళీకృతం చేయాలని సంబంధిత వర్గాలు విజ్ఞప్తి చేశాయి. పలు ప్రోత్సాహకాలతో పాటు, ప్రభుత్వం నూతన ఆవిష్కరణలు, పరిశోధనా అభివృద్దిని ప్రోత్సహించడానికి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. దేశీయ ఫార్మా పరిశ్రమ ప్రస్తుతం 50 బిలియన్ డాలర్ల పరిమాణంలో ఉందని, 2030 నాటికి 130 బిలియన్ డాలర్లు, 2047 నాటికి 450 బిలియన్ డాలర్లకు ఎదగాలన్నది పరిశ్రమ ఆంకాంక్షని ఇండియన్ ఫార్మాస్యూటికల్ అలయన్స్ (ఐపీఏ) సెక్రటరీ జనరల్ సుదర్శన్ జైన్ తెలిపారు. ఈ దిశలో బడ్జెట్లో చర్యలు ఉంటాయని భావిస్తున్నామని అన్నారు. ఔషధ పరిశ్రమ అభివృద్ధికి సహాయపడే సహాయక విధానాలు, సరళీకృత నిబంధనలు, జీఎస్టీ నిబంధనల సరళీకరణ ప్రతిపాదనలు బడ్జెట్ ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్, అరబిందో ఫార్మా, సిప్లా, లుపిన్, గ్లెన్‌మార్క్‌లతో సహా 24 ప్రముఖ దేశీయ ఫార్మా కంపెనీల కూటమే ఐపీఏ. ఆర్గనైజేషన్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ఇండియా (ఓపీపీఐ) డైరెక్టర్ జనరల్ వివేక్ సెహగల్ మాట్లాడుతూ, భారతదేశ పురోగతి బాటలో ’ఆత్మనిర్భర్ భారత్’ విజన్‌కు లైఫ్ సైన్సెస్ రంగం వాస్తవికంగా దోహదపడేలా ప్రభుత్వం విధానాలు అవసరమని అన్నారు. ప్రొడక్షన్ ఆధారిత ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకం మాదిరిగానే, పరిశోధన ఆధారిత ఇన్సెంటివ్ స్కీమ్‌ను ప్రభుత్వం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు. హెల్త్‌కేర్ రంగం విషయానికొస్తే, ప్రజలు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలకు అధిక ప్రాధాన్యత ఇస్తారని పరిశ్రమల సంఘం నాథేల్త్ ప్రెసిడెంట్ శ్రవణ్ సుబ్రమణ్యం అన్నారు. ఈ దిశలో మౌలిక సదుపాయాల సామర్థ్యాలను పెంపొందించడం అత్యవసరమని పేర్కొన్నారు. అల్యూమినియంపై దిగుమతి సుంకాలు పెంచాలి అల్యూమినియం, అల్యూమినియం ఉత్పత్తులపై రాబోయే బడ్జెట్లో దిగుమతి సుంకాన్ని కనీసం 12.5 శాతానికి పెంచాలని ఇండస్ట్రీ సంస్థ– ఫిక్కీ కోరింది. ఈ చర్య అల్యూమినియం ఉత్పత్తుల డంపింగ్‌ను అరికట్టడానికి అలాగే దేశీయ తయారీ– రీసైక్లింగ్ వృద్ధిని ప్రోత్సహించడానికి సహాయపడుతుందని పేర్కొంది. ప్రస్తుతం అల్యూమినియం, అల్యూమినియం ఉత్పత్తులపై దిగుమతి సుంకం 10 శాతంగా ఉంది. ఇటీవలి సంవత్సరాల్లో అల్యూమినియం దిగుమతులు తీవ్రంగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం దిగువ స్థాయి అల్యూమినియం దిగుమతుల్లో 85 శాతానికి పైగా చైనా వాటా ఉంటోందని ఒక ప్రకటనలో తెలిపింది. -
ఆర్థిక వ్యవస్థ పురోగతికి భారీ పన్ను వసూళ్లు బూస్ట్!
న్యూఢిల్లీ: బడ్జెట్లో (2022–23 ఆర్థిక సంవత్సరం) మూలధన పెట్టుబడుల పెంపు ప్రణాళికలు దేశ తయారీ రంగాన్ని ఉత్తేజం చేస్తాయని, పెట్టుబడులు పెరుగుతాయని, పన్ను రాబడులు పుంజుకుంటాయని ఆర్థికశాఖ ప్రకటించింది. ఆయా అంశాలు ఎకానమీని ఐదు ట్రిలియన్ డాలర్ల దిశగా నడుపుతాయన్న భరోసాను వ్యక్తం చేసింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో 2022–23 ఆర్థిక సంవత్సరానికి క్యాపెక్స్ (మూలధన వ్యయ ం)ను 35.4% పెంచారు. దీనితో ఈ విలువ రూ. 7.5 లక్షల కోట్లకు పెరిగింది. గడిచిన ఆర్థిక సంవత్సరంలో క్యాపెక్స్ రూ. 5.5 లక్షల కోట్లు. తాజా ఆర్థిక పరిస్థితి, భవిష్యత్ అంచనాలపై ఆర్థిక శాఖ ఆవిష్కరించిన అవుట్‌లుక్‌లో ముఖ్యాంశాలు... ► గత ఆర్థిక సంవత్సరంలో పన్ను ఆదాయాలు రికార్డు స్థాయిలో 34% పెరిగి రూ. 27.07 లక్ష ల కోట్లకు చేరుకున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ మహమ్మారి సవాళ్లను ఎదుర్కొని వేగవంతమైన పురోగతి సాధిస్తోందనడానికి ఇది గొప్ప సాక్ష్యం. ► భారత్‌ను ప్రపంచ ఆర్థిక శక్తిగా మార్చడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ నిబద్ధత కోసం పలు చర్యలు తీసుకుంటోంది. ఆయా అంశాలు దేశాన్ని పటిష్ట ఆర్థిక పురోగతి బాటన నిలుపుతున్నాయి. ► ఎకానమీ పటిష్ట బాటన నడుస్తోందని ఇటీవల భారీగా పెరిగిన పన్ను ఆదాయాలు వెల్లడిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ 5 ట్రిలియన్ డాలర్ల లక్ష్య సాధన సాధ్యమేనని ఈ గణాంకాలు భరోసా ఇస్తున్నాయి. 2020–21లో స్థూల కార్పొరేట్ పన్ను వసూళ్లు రూ.6.5 లక్షల కోట్లయితే, ఇది 2021–22లో రూ.8.6 లక్షల కోట్లకు పెరిగింది. గడచిన ఆర్థిక సంవత్సరం ప్రత్యక్ష పన్ను వసూళ్లు రికార్డు స్థాయిలో 49 శాతం పెరిగి రూ.14.10 లక్షల కోట్లకు చేరాయి. పరోక్ష పన్నుల వసూళ్లు 20 శాతం పెరిగి 12.90 లక్షల కోట్లకు ఎగశాయి. ► పన్ను వసూళ్ల బేస్ పెంపు, తక్కువ వడ్డీరేట్లు, మినహాయింపులు లేని కొత్త సరళీకృత పన్ను విధానం, కార్పొరేట్ రంగానికి వ్యాపారాన్ని సులభతరం చేయడం, భారతదేశ ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరచడం, పన్ను ఎగవేతలకు చర్యలు వంటి పలు సంస్కరణాత్మక చర్యలు పన్నుల రాబడిని పెంచడానికి, తద్వారా ఎకానమీ పురోగతికి దోహదపడుతున్నాయి. -
డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లకు లైన్ క్లియర్, ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు!
ముంబై: రోజులో 24 గంటల పాటు ఉత్పత్తులు, సేవలను అందించే డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను బ్యాంకులు ప్రారంభించుకోవచ్చని ఆర్బీఐ ప్రకటించింది. స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా 75జిల్లాల్లో ఒక్కొక్కటి చొప్పున 75డిజిటల్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్టు కేంద్ర బడ్జెట్లో పేర్కొనడం తెలిసిందే. ఖాతాలు తెరవడం, నగదు ఉపసంహరణ, నగదు డిపాజిట్, కేవైసీ నవీకరించడం, రుణాల మంజూరు, ఫిర్యాదుల నమోదు సేవలను డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ల ద్వారా అందించొచ్చంటూ ఆర్బీఐ తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. కస్టమర్లను చేర్చుకోవడం దగ్గర్నుంచి, వారికి సేవలు అందించడం వరకు కస్టమర్లే స్వయంగా పొందడం, లేదా సహాయకుల విధానంలో అందించొచ్చని పే ర్కొంది. డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ అన్నది కనీస మౌలిక సదుపాయాలతో, డిజిటల్ రూపంలో సేవలను అందించేందుకు ఏర్పాటు చేసిన వసతిగా అర్థం చేసుకోవచ్చు. డిజిటల్ బ్యాంకింగ్‌లో అనుభవం కలిగిన షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకులు అనుమతి అవసరం లేకుండానే టైర్–1 నుంచి టైర్–6 వరకు పట్టణాల్లో డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్లను తెరుచుకునేందుకు ఆర్బీఐ అనుమతించింది. -
పురోగతి బాటలో ఎకానమీ
ముంబై: ఆర్థికమంత్రి ఈ నెల ఒకటవ తేదీన పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2022–23 వార్షిక బడ్జెట్, సెంట్రల్ బ్యాంక్ అనుసరిస్తున్న ద్రవ్య పరపతి విధానాలు భారత్ ఎకానమీ విస్తృత స్థాయి పురోగతికి బాటలు వేస్తాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఫిబ్రవరి బులిటన్లో ప్రచురితమైన ఆర్టికల్ విశ్లేషించింది. మూడవ వేవ్‌ను సవాళ్లను అధిగమించిన భారత్‌లో ఆర్థిక రికవరీ ఇప్పటికే పటిష్టం అవుతోందని వివరించింది. అంతర్జాతీయంగా ఆర్థిక అంశాలుసహా వివిధ ప్రతికూలతలు కొనసాగుతున్నప్పటికీ దేశీయ ఎకానమీ పురోగమిస్తోందని ‘స్టేట్ ఆఫ్ ఎకానమీ’ థామ్‌తో ప్రచురితమైన ఆర్టికల్ పేర్కొంది. ఆర్టికల్‌లో మరికొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ► మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించి బడ్జెట్లో ప్రభుత్వ పెట్టుబడుల పునరుద్ధరణ వల్ల 2022–23లో ప్రైవేట్ పెట్టుబడులు కూడా గణనీయంగా పెరుగుతాయి. ఇది ఉపాధి కల్పన, డిమాండ్‌ను బలోపేతం వంటి అంశాలకూ దోహదపడుతుంది. ► మల్టీ–మోడల్ కనెక్టివిటీ, రవాణా రంగం పురోగతి ద్వారా విస్తృత స్థాయి వృద్ధిని భారత్ సాధించగలుతుంది. ఈ లక్ష్య సాధనలో గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్రణాళిక కీలకమైనది. మౌలిక సదుపాయాల పురోగతిలో ఇది కీలకమైనది. ► ప్రపంచ పరిణామాలు ఎలా ఉన్నప్పటికీ, దేశీయ స్థూల ఆర్థిక పరిస్థితులు పటిష్టంగా ఉన్నాయి. మూడవ వేవ్ నుంచి భారత్ బయట పడిన నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాలలో పునరుద్ధరణ వేగంగా ఉంది. ► డిమాండ్, ఆశావాదం ప్రాతిపదికన తయారీ, సేవల రంగాల రెండూ విస్తరిస్తున్నాయి. వినియోగదారు, వ్యాపార విశ్వాసాన్ని మెరుగుపడ్డం కూడా కలిసివస్తోంది. వ్యాపారాలు తిరిగి సాధారణ స్థితికి వస్తుండడంతో ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని విశ్వసిస్తున్నాం. ► ఈ రోజు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ద్రవ్యోల్బణం సమస్యతో సతమతమవుతోంది. క్రూడ్‌సహా కమోడిటీల ధరలు పెరగడం, సరఫరాల్లో సమస్యలు దీనికి ప్రధాన కారణం. ► ప్రపంచ స్థూల ఆర్థిక పరిస్థితులు ఇంకా తీవ్ర అనిశ్చితిలోనే కొనసాగుతున్నాయి. పలు అంశాలు ఇంకా సవాళ్లవైపే పయనిస్తున్నాయి. ► భారత్‌కు సంబంధించినంతవరకూ ప్రభుత్వం నుంచి అధిక వ్యయాల ప్రణాళికలు, వ్యాపారాలను సులభతరం చేయడానికి చర్యలు సానుకూల అంశాలు. ఆయా అంశాలే ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల వరుసలో భారత్‌ను మొదట నిలబెడుతున్నాయి. ► ఈ నెల ప్రారంభంలో జరిగిన ఆర్బీఐ పాలసీ సమావేశాల్లో ద్రవ్యోల్బణం–వృద్ధి లక్ష్యంగా ఆర్బీఐ వరుసగా పదవ త్రైమాసిక బేటీలోనూ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను ఆర్బీఐ యథాతథంగా 4 శాతం వద్దే కొనసాగించింది. రిటైల్ ద్రవ్యోల్బణం 2021–22 ఆర్థిక సంవత్సరంలో సగటున 5.3 శాతంగా కొనసాగుతుందని, 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 4.5 శాతానికి దిగివస్తుందని పేర్కొంది. వృద్ధి రికవరీ, పటిష్టత లక్షంగా అవసరమైనంతకాలం ‘సరళతర’ విధానాన్నే అనుసరించడం ఉత్తమమని అభిప్రాయపడింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 2021–22లో 9.2 శాతం ఉంటే, 2022–23లో ఈ రేటు 7.8 శాతానికి తగ్గుతుందని ఆర్బీఐ ఇటీవలి పాలసీ సమావేశం అంచనావేసింది. ► పెట్టుబడులకు సంబంధించి కేంద్రం మూలధన వ్యయాలు (క్యాపిటల్ అకౌంట్‌కు సంబంధించి) 35.4 శాతం పెరిగినట్లు బడ్జెట్ గణాంకాలు వెల్లడించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ఇందుకు సంబంధించి కేటాయింపులు రూ.5.54 లక్షల కోట్లయితే (సవరిత గణాంకాల ప్రకారం రూ.6.03 లక్షల కోట్లు), 2022–23లో రూ.7.50 లక్షల కోట్లకు (జీడీపీలో 2.9 శాతం) పెంచుతున్నట్లు ఆర్థికమంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. వృద్ధి, ఉపాధి కల్పన లక్ష్యంగా ఈ కేటాయింపులకు భారీగా పెంచుతున్నట్లు తెలిపారు. 2019–20 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే తాజా కేటాయింపులు (రూ.7.50 లక్షల కోట్లు) రెండు రెట్లు అధికమని మంత్రి తెలిపారు. వేగవంతమైన ఆర్థికాభివృద్ధి ఆర్థికశాఖ నెలవారీ నివేదిక స్పష్టీకరణ న్యూఢిల్లీ: కొత్త బడ్జెట్ (2022–23 ఆర్థిక సంవత్సరం)లో ప్రభుత్వం చేపట్టిన పలు చర్యల వల్ల భారత్ ఆర్థిక వ్యవస్థ అగ్ర దేశాలతో పోల్చితే వేగంగా పురోగమించనుందని ఆర్థికశాఖ నెలవారీ సమీక్షా నివేదిక పేర్కొంది. కోవిడ్–19 అనంతర ప్రపంచం ఆర్థిక పరిస్థితి ఎలా ఉండాలన్న ప్రణాళికతోనే ప్రస్తుత సంవత్సరం కూడా ముగియవచ్చని నివేదిక విశ్లేషించింది. భారత్‌కు సంబంధించినంతవరకూ తయారీ, నిర్మాణ రంగాలు వృద్ధి చోదకాలుగా ఉంటాయని పేర్కొంది. పీఎల్ఐ, మౌలిక రంగంలో ప్రభుత్వ వ్యయాల పెంపు దేశీయ ఆర్థిక వ్యవస్థ పురోగతికి బాటలు వేస్తాయని నివేదిక విశ్లేషించింది. నివేదికలోని కొన్ని కీలకాంశాలను పరిశీలిస్తే... ► నికర విత్తన విస్తీర్ణం, పంటల వైవిధ్యీకరణలో స్థిరమైన పురోగతిని వ్యవసాయ రంగం సాధిస్తోంది. ఇది దేశ ఆహార నిల్వల పరిస్థితిని బలోపేతం చేస్తుంది. అదే సమయంలో రైతులకు కనీస మద్దతు ధరలు, ప్రధానమంత్రి కిసాన్ పథకం ద్వారా ఆదాయ బదిలీల వంటి అంశాలు ఈ రంగానికి లాభిస్తాయి. ► వేగవంతమైన వృద్ధి విషయంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) కూడా భారత్‌ను తొలి స్థానంలో నిలిపిన విషయం గమనార్హం. జనవరి మొదట్లో భారత్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) వృద్ధి అంచనాలను అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) భారీగా 50 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తగ్గించింది. గత ఏడాది అక్టోబర్‌లో 9.5 శాతం అంచనాలను తాజాగా 9 శాతానికి కుదించింది. అయినా ఈ స్థాయి వృద్ధి కూడా ప్రపంచ దేశాల్లో అత్యధికమని పేర్కొంది. ► దేశంలో మూడవ వేవ్ సవాళ్లు తలెత్తినప్పటికీ, మొత్తం ఆర్థిక కార్యకలాపాలు వీటిని తట్టుకుని నిలబడ్డాయి. విద్యుత్ వినియోగం, తయారీకి సంబంధించి పర్చేజింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్, ఎగుమతులు, ఈ–వే బిల్లులు వంటి వంటి అనేక హై ఫ్రీక్వెన్సీ సూచికలు బలమైన పనితీరును ప్రదర్శిస్తున్నాయి. వృద్ధి రికవరీ పటిష్టతను ఇది ప్రతిబింబిస్తోంది. ► కోవిడ్ 19 వైరస్ వల్ల కలిగిన అనిశ్చితి, ఆందోళన ప్రజల మనస్సుల నుండి తొలగిపోయిన తర్వాత, వినియోగం పుంజుకుంటుంది. డిమాండ్ పునరుద్ధరణ జరుగుతుంది. పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి సంబంధించి ఉత్పత్తిని పెంచడానికి ప్రైవేటు పెట్టుబడులకు విస్తృత స్థాయి అవకాశం ఏర్పడుతుంది. ► అంతర్జాతీయంగా భౌగోళిక, రాజకీయ, ఆర్థిక అంశాలను మినహాయిస్తే, భారత్ ఆర్థిక వ్యవస్థకు 2022–23లో పలు సానుకూల అంశాలు ఉన్నాయి. -
‘పేదరికానికి మీ మాజీ అధ్యక్షుడే గతంలో కొత్త నిర్వచన ఇచ్చారు’
న్యూఢిల్లీ: పేదరికం ఓ మనోభావన అని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ గతంలో చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా చెణుకులు విసిరారు. కేంద్ర బడ్జెట్ 2022–23పై చర్చకు శుక్రవారం రాజ్యసభలో సమాధానమిస్తూ, పేదరిక నిర్మూలనకు బడ్జెట్ ఏ మాత్రం దోహదపడేలా లేదన్న కాంగ్రెస్ వ్యాఖ్యలపై ఆమె ఘాటు విమర్శలు చేశారు. ‘‘పేదరికానికి మీ మాజీ అధ్యక్షుడే గతంలో కొత్త నిర్వచనమిచ్చాడు. తిండి, డబ్బు, వస్తువులు లేకపోవడం పేదరికం కాదని, అదో మానసిక భావన మాత్రమేనని అన్నాడు. ఆత్మవిశ్వాసముంటే దాన్ని అధిగమించవచ్చన్నాడు. ఆయనెవరో మీకందరికీ తెలుసు. మీరు నిర్మూలించాలంటున్నది ఆ మానసిక పేదరికాన్నేనా?’’ అని ప్రశ్నించారు. ఇది పేదలను హేళన చేయడమేనన్న శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది వ్యాఖ్యలను కొట్టిపారేశారు. పేదలను హేళన చేసిన వ్యక్తి తాలూకు పార్టీతో శివసేన జట్టు కట్టిందన్నారు. ‘‘నేనెవరి పేరూ చెప్పలేదు. అయినా ఆ నేతను కాపాడేందుకు మీరు చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే, వానాకాలంలో కప్పల బెకబెకలు వినపడగానే అవెక్కడున్నదీ అందరికీ తెలిసిపోతుందన్న తమిళ సామెత గుర్తొస్తోంది’’ అంటూ నిర్మల ఎద్దేవా చేశారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన 2014 నుంచీ భారత్ రాహుకాలంలో ఉందన్న కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ కామెంట్లపైనా నిర్మల వాగ్బాణాలు సంధించారు. ‘‘నిజమైన రాహుకాలం ఏమిటో తెలుసా? సొంత పార్టీ ప్రధాని తెచ్చిన ఆర్డినెన్సును మీడియా సాక్షిగా మీ నేత (రాహుల్) చించేసిన కాలం. మీతో సహా 23 మంది కాంగ్రెస్ నాయకులు పార్టీ నాయకత్వ తీరుపై విమర్శలు ఎక్కుపెట్టిన కాలం. సీనియర్లంతా ఆ పార్టీని వీడుతున్నారే, ఆ కాలం. ఆ పార్టీ కేవలం 44 ఎంపీ సీట్లకు పడిపోయిన కాలం’’ అంటూ తిప్పికొట్టారు. -
మూలధన వ్యయాలు అనుకునేంత ఎక్కువేం కాదు!
ముంబై: ఉపాధి, వృద్ధికి మార్గం కల్పిస్తూ, మూలధన వ్యయాలు (క్యాపిటల్ ఎక్స్పెండిచర్– క్యాపెక్స్) 2022–23 వార్షిక బడ్జెట్లో భారీగా పెరిగనట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్న నేపథ్యంలో... ఈ కేటాయింపులు అనుకునేంత ఎక్కువేం కాదని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తన నివేదికలో పేర్కొంది. అయితే క్లిష్ట సమయంలో సహజంగా మూలధన వ్యయాలపై కోత పెట్టాలని ప్రభుత్వాలు భావిస్తాయని, అందుకు కొంత భిన్నంగా వ్యవహరించడం హర్షణీయ పరిణామమని కూడా వ్యాఖ్యానించింది. నివేదికాంశాలను పరిశీలిస్తే.. కీలక అంశాలు ► రూ. 7.50 లక్షల కోట్లు (స్థూల దేశీయోత్పత్తిలో 2.91 శాతం) క్యాపెక్స్ కోసం కేటాయింపుల్లో రాష్ట్రాలకు రూ. 1 లక్ష కోట్ల రుణాలను మినహాయిస్తే, 2022–23 ఆర్థిక సంవత్సరలో వాస్తవ వ్యయం జీడీపీలో 2.58 శాతానికి తగ్గుతుంది. 2021–22 సవరించిన అంచనాలకు ఇది దాదాపు సమానమే. ► కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు (సీపీఎస్ఈ) మూలధనం సమకూర్చుకోడానికి ఉద్దేశించిన అంతర్గత, అదనపు బడ్జెట్ వనరులను (ఐఈబీఆర్)ను బడ్జెట్ తగ్గించింది. ఇది మొత్తం క్యాపిటల్ వ్యయాల పెంపును వాస్తవంలో తటస్థానికి (ఆఫ్సెట్) చేర్చే అంశం. ఐఈబీఆర్ కరోనాకు ముందు (2018–20 ఆర్థిక సంవత్సరాల్లో) జీడీపీలో 3.33 శాతం ఉంటే, 2022–23 ఆర్థిక సంవత్సరంలో 1.82 శాతానికి పరిమితం చేయడం జరిగింది. ఆయా అంశాలన్నీ పరిశీలనలోకి తీసుకుంటే, ఐఈబీఆర్, ఎఫెక్టివ్ (వాస్తవ) బడ్జెటరీ క్యాపెక్స్ 2018–20 ఆర్థిక సంవత్సరాల్లో తరహాలోనే 2021–22 ఆర్థిక సంవత్సరంలోనూ జీడీపీలో 5.96 శాతంగా కొనసాగే వీలుంది. ► 2021–22 సవరిత అంచనాల్లో మూలధన వ్యయాలను 2.30 శాతం నుంచి 2.60 శాతానికి (జీడీపీలో) పెంచడం జరిగింది. ఎయిర్ ఇండియా రుణాలకు సంబంధించి ఒన్‌టైమ్ వ్యయాలు రూ.51,971 కోట్ల వల్లే ఈ పెరుగుదల చోటుచేసుకుంది తప్ప మరోటి కాదు. ► ప్రభుత్వం తన క్యాపెక్స్ బడ్జెట్‌ను పూర్తిగా ఖర్చు చేయగలుగుతున్న విషయం వాస్తవమే. అయితే గత రెండు ఆర్థిక సంవత్సరాలలో, చివరి త్రైమాసికంలోనే మాత్రమే ఎక్కువ ఖర్చు జరిగింది. అయితే ఇది సరికాదు. డిమాండ్ ప్రక్రియకు సహాయం చేయడానికి ఉద్దేశించిన నిధులను సాధ్యమైనంత త్వరగా వ్యయం చేయాల్సి ఉంటుంది. ► 2022–23 బడ్జెట్లో నిర్దేశించిన క్యాపెక్స్ ఉపాధికి అనుకూలంగా ఉన్నమాట వాస్తవమే. రోడ్లు, రహదారులు, రైల్వేలపై ఆయా వ్యయాలు దృష్టి పెడుతున్నాయి. అయితే ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభించే మారో విభాగం రక్షణ రంగంపై బడ్జెట్ అంతగా దృష్టి సారించని విషయం స్పష్టమవుతోంది. ► మూలధనానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక, మూలధన సౌలభ్యత, సానుకూలతను వినియోగించుకోడానికి రాష్ట్రాలు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. వ్యయ ‘బడ్జెట్’ ఇది... పెట్టుబడులకు సంబంధించి కేంద్రం మూలధన వ్యయాలు (క్యాపిటల్ అకౌంట్‌కు సంబంధించి) 35.4 శాతం పెరిగినట్లు బడ్జెట్ గణాంకాలు వెల్లడించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ఇందుకు సంబంధించి కేటాయింపులు రూ.5.54 లక్షల కోట్లయితే (సవరిత గణాంకాల ప్రకారం రూ.6.03 లక్షల కోట్లు), 2022–23లో రూ.7.50 లక్షల కోట్లకు (జీడీపీలో 2.9 శాతం) పెంచుతున్నట్లు ఆర్థికమంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. వృద్ధి, ఉపాధి కల్పన లక్ష్యంగా ఈ కేటాయింపులకు భారీగా పెంచుతున్నట్లు తెలిపారు. 2019–20 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే తాజా కేటాయింపులు (రూ.7.50 లక్షల కోట్లు) రెండు రెట్లు అధికమని మంత్రి తెలిపారు. ఆర్థిక మంత్రి చేసిన ప్రసంగం ప్రకారం, రాష్ట్రాలకు గ్రాంట్స్ –ఇన్–ఎయిడ్ ద్వారా మూలధన ఆస్తుల సృష్టికి ఏర్పాటు చేసిన కేటాయింపులనూ పరిగణనలోకి తీసుకుంటే మొత్తంగా 2022–23లో కేంద్ర ప్ర భుత్వ ‘సమర్థవంతమైన మూలధన వ్య యం’ (ఎఫెక్టివ్ క్యాపిటల్ ఎక్స్పెన్డిచర్) రూ.10.68 లక్షల కోట్లు. ఇది జీడీపీలో దాదాపు 4.1 శాతానికి సమానం. ఈ విలువ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సవరించిన రూ.8.4 లక్షల కోట్ల కంటే 27 శాతం అధికం. 2020–21 కేటాయింపుల కంటే 28 శాతం ఎక్కువ. -
14న బడ్జెట్‌పై ఆర్బీఐ బోర్డ్ చర్చ
న్యూఢిల్లీ: ఆర్బీఐ బోర్డ్ ఈ నెల 14వ తేదీన బడ్జెట్ అనంతర సాంప్రదాయ సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశం ప్రధానంగా 2022–23 వార్షిక బడ్జెట్ ముఖ్యాంశాలపై చర్చించనుంది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారని ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ద్రవ్యలోటు, మూలధన ప్రణాళికలు, ప్రభుత్వ మార్కెట్ రుణ సమీకరణల వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో సమీక్ష జరిపే అవకాశం ఉందని సమాచారం. లోక్‌సభలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత ఆర్బీఐ గవర్నర్, డిప్యూటీ గవర్నర్లతో కూడిన ఆర్బీఐ బోర్డ్‌ను ఉద్దేశించి ఆర్థిక మంత్రి ప్రసంగించడం సాంప్రదాయకంగా వస్తోంది. -
ఏపీకి ఆత్మనిర్భరత ఏది?
సాక్షి, న్యూఢిల్లీ: విభజన తర్వాత ఆర్థికంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ఆత్మనిర్భరత ఎక్కడుందని కేంద్ర ప్రభుత్వాన్ని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. బడ్జెట్లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ బడ్జెట్ ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డెడ్ అన్నట్లుగా ఉందన్నారు. ఎన్నికల రాష్ట్రాలకే బడ్జెట్ అని తొలుత భావించినా చివరకు ఏ రాష్ట్రానికీ చెందని బడ్జెట్‌లా ఉందని విమర్శించారు. రాజ్యసభలో బుధవారం బడ్జెట్‌పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. బడ్జెట్లో ఆర్భాటం తప్ప విషయం లేదన్నారు. రాష్ట్రాల వాటాను కేంద్రం తెలివిగా ఎలా సొంతం చేసుకుంటోందో గణాంకాలతో సహా సభకు వివరించారు. ఆయన ప్రసంగం ఆయన మాటల్లోనే.. రాష్ట్రాల వాటా తెలివిగా లాగేస్తున్నారు ‘కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు న్యాయంగా దక్కాల్సిన వాటాను తగ్గించడంలో కేంద్రం చాలా తెలివిగా వ్యవహరిస్తోంది. బడ్జెట్ గణాంకాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం స్థూలపన్నుల ఆదాయంలో ఉద్దేశపూర్వకంగానే సెస్సులు, సర్‌చార్జీలను పెంచుకుంటూ పోయింది. సెస్సులు, సర్‌చార్జీల పేరిట వచ్చే ఆదాయంలో నయా పైసా వాటా కూడా రాష్ట్రాలకు ఇవ్వాల్సిన అవసరం లేనందునే కేంద్రం ఈ పనిచేస్తోంది. కేంద్రానికి వచ్చే స్థూలపన్నుల ఆదాయంలో డివిజబుల్ పూల్ కింద రాష్ట్రాలకు 41 శాతం వాటాను పంపిణీ చేయాలని 15వ ఆర్థికసంఘం సిఫార్సు చేసింది. అయితే.. డివిజబుల్ పూల్‌లోకి రాని సెస్సులు, సర్‌చార్జీల పేరిట కేంద్రం వసూలు చేస్తోంది. దీంతో ఆంధ్రప్రదేశ్‌కు పన్నుల పంపిణీలో దక్కాల్సిన వాటా 41 శాతం నుంచి 29 శాతానికి పడిపోయింది. పెట్రోల్, డీజిల్ సెస్సులో రాష్ట్రాలకు ఇచ్చిందెంత? పెట్రోల్, డీజిల్‌పై విధించిన సెస్సు ద్వారా కేంద్ర ప్రభుత్వం రూ.3.35 లక్షల కోట్లు ఆర్జించినా అన్ని రాష్ట్రాలకు కలిపి ఇచ్చింది 5.8 శాతం.. అంటే రూ.19,475 కోట్లు మాత్ర మే. పెట్రోల్, డీజిల్‌పై స్పెషల్ అడిషనల్ ఎక్సైజ్ డ్యూటీ పేరుతో కేంద్రం మరో రూ.2.87 లక్షల కోట్లు వసూలు చేసింది. ఎక్సైజ్ డ్యూటీ కింద రాష్ట్రాలకు వచ్చే ఆదాయంలో పెట్రోల్‌పై 40 శాతం, డీజిల్‌పై 59 శాతం తగ్గిపోయింది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై 85 శాతానికిపైగా ఎక్సైజ్ డ్యూటీని సెస్ రూపంలో వసూలు చేస్తోంది. లీటర్ పెట్రోల్ ధర రూ.100 ఉంటే అందులో పలు సెస్‌ల కారణంగా రాష్ట్రాలకు రూ.1.40 మాత్రమే పంపిణీ అవుతోంది. డివిజబుల్ పూల్‌లో 4.1 శాతానికి పడిపోయిన ఏపీ వాటా కేంద్ర ప్రభుత్వం డివిజబుల్ పూల్ నుంచి రాష్ట్రాలకు పంపిణీ చేయాల్సిన పన్నుల వాటాలో ఏపీ వాటా నానాటికీ తగ్గిపోతోం ది. 13వ ఆర్థికసంఘం (2010–15) సిఫా ర్సుల ప్రకారం డివిజబుల్ పూల్‌లో ఏపీ వాటా 6.9 శాతం. 14వ ఆర్థికసంఘం (20 15–20) దాన్ని 4.3 శాతానికి తగ్గించింది. 15వ ఆర్థికసంఘం (2021–20 26) సిఫా ర్సుల ప్రకారం డివిజబుల్ పూల్‌లో ఏపీ వాటా 4.1 శాతానికి పడిపోయింది. సెస్సులు, సర్‌చార్జీల పేరుతో కేం ద్రం దొడ్డిదారిన వసూలు చేసే ప న్నులతో డివిజబుల్ పూల్‌లో జమయ్యే స్థూ ల ఆదాయం మొత్తం క్షీణిస్తుంటే మరోవైపు ఆర్థికసంఘం సిఫార్సుల కారణంగా డివి జబుల్ పూల్ నుంచి వచ్చే ఏపీ ఆదాయం తగ్గిపోతోంది. ఏపీ, కేంద్ర బడ్జెట్ మధ్య అంతరం సమాజంలోని అన్నివర్గాల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో నామమాత్రపు కేటాయింపులు జరపడం సరికాదు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున ఆర్థిక అరాచకానికి పాల్పడినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శనీయమైన బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఏపీ 2021–22 బడ్జెట్లో వ్యవసాయానికి 5.9 శాతం నిధులు కేటాయిస్తే, 2022–23 బడ్జెట్లో కేంద్రం 3.8 శాతం కేటాయించింది. విద్యారంగానికి ఏపీ 11.8 శాతం నిధులు కేటాయిస్తే కేంద్ర బడ్జెట్లో అది 2.6 శాతం మాత్రమే. ఆరోగ్యరంగానికి ఏపీ బడ్జెట్లో 6 శాతం కేటాయిస్తే కేంద్ర బడ్జెట్లో 2.2 శాతం, గ్రామీణాభివృద్ధికి ఏపీ 7.1 శాతం నిధులిస్తే కేంద్రం 5.2 శాతం, సామాజిక సంక్షేమానికి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో 12.1 శాతం నిధులు కేటాయిస్తే కేంద్రం 1.3 శాతం మాత్రమే కేటాయించింది. మధ్య తరగతికి ఊరట లేని బడ్జెట్ కేంద్ర పన్నుల ఆదాయంలో 10 శాతం పెరుగుదల నమోదైనప్పటికీ బడ్జెట్లో మధ్య తరగతి ప్రజలకు ఎలాంటి ఊరట కల్పించలేదు. ఆదాయపన్ను శ్లాబుల్లో మార్పు చేయనందున మధ్య తరగతి ప్రజల మిగులు ఆదాయం తగ్గిపోయింది. పెరిగిన ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఐటీ డిడక్షన్లలో మినహాయింపులు ఇవ్వాలి. ఒకే ఫారంతో ఐటీ రిటర్న్ దాఖలు చేసుకునే అవకాశం కల్పించాలి. -
కేంద్ర బడ్జెట్ నిరాశ పరిచింది: విజయసాయిరెడ్డి
-
ఆంధ్రప్రదేశ్ కోణంలో ఇది చెత్త బడ్జెట్: విజయసాయిరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కోణంలో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్.. చెత్త బడ్జెట్ అని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ వి. విజయసాయిరెడ్డి అన్నారు. రాజ్యసభలో బుధవారం కేంద్ర బడ్జెట్‌పై చర్చ కొనసాగుతోంది. చర్చలో పాల్గొన్న ఎంపీ వి.విజయసాయిరెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ నిరాశ పరిచిందని అన్నారు. ఆత్మ నిర్భరత కేంద్రానికే కాదు రాష్ట్రాలకూ అవసరమేనని తెలిపారు. సెస్‌లు, సర్ఛార్జ్ల పేరుతో రాష్ట్రాల పన్ను వాటా తగ్గించారని తెలిపారు. పెట్రోల్ విషయంలో ట్యాక్స్ వాటా 40 శాతం తగ్గిందని చెప్పారు. 2010-2015 మధ్య ఏపీ షేర్ 6.9 శాతం కాగా, 2015-2020 నాటికి ఏపీ పన్నుల వాటా 4.3 శాతానికి పడిపోయిందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. వ్యవసాయంపై ఏపీ ప్రభుత్వం 5.9 శాతం నిధులు వెచ్చిస్తోందని తెలిపారు. కానీ, కేంద్రం వెచ్చిస్తోంది 3.9 శాతం మాత్రమేనని చెప్పారు. విద్య కోసం ఏపీ 11.8 శాతం ఖర్చుచేస్తుంటే కేంద్రం 2.6 శాతం ఖర్చు చేస్తోందని తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల్లోనూ కేంద్రం కంటే రాష్ట్రామే ఎక్కువ ఖర్చు చేస్తోందని చెప్పారు. ఏపీ ప్రభుత్వంపై కేంద్రం సవతి ప్రేమ చూపిస్తోందని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. -
టెలీ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్.. ఎంతో ఉపయోగకరం!
మానసిక వికాసానికి భరోసా ఇస్తుంది కేంద్రం నూతనంగా ప్రకటించిన టెలీ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్. కరోనా మహమ్మారి వయస్సుతో సంబంధం లేకుండా అందరి మనస్సులపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో ప్రజల మానసిక ఆరోగ్య పరిరక్షణకు నాణ్యమైన ఆరోగ్య కౌన్సెలింగ్‌ను ప్రజలకు అందించడానికి జాతీయ టెలీమెంటల్ ఆరోగ్య కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి 2022–23 బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. 23 టెలీ–మెంటల్ హెల్త్ సెంటర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ల నెట్వర్క్ ద్వారా సేవలు అందుబాటులోకి తెస్తారు. బెంగళూరు లోని నిమ్హాన్స్ నోడల్ సెంటర్‌గా ఉంటుంది. ఇదే నగరంలో ఉన్న ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సాంకేతిక మద్దతును అందిస్తుంది అని మంత్రి ప్రకటించారు. కేర్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా ఈ సంజీవని మానసిక సేవలు మార్చి 28, 2020 నుండి (మొదటి 21 రోజుల జాతీయ లాక్డౌన్ విధించిన నాలుగు రోజుల తర్వాత) నిమ్హాన్స్ తన టోల్ ఫ్రీ నంబర్ 080– 46110007 ద్వారా లక్షకు పైగా మానసిక ఆరోగ్య సేవలను అందించింది. కర్నాటకలో ఇప్పటికే అమలు చేస్తున్న ఈ మానస్ కార్యక్రమాలు 23 సెంటర్ ఆఫ్ ఎక్సె లెన్స్‌ల ద్వారా దేశమంతా విస్తరించే అవకాశం ఉంది. కేర్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా మానసిక ఆరోగ్య సౌకర్యాలు, నిపుణుల వివరాలు, వైద్య రికార్డులు, మానసిక సమస్యలకు అధునాతన సాంకేతికత జోడిం చడం జరుగుతుంది. మానసిక రోగుల నామినేటెడ్ ప్రతినిధుల వివరాలను ఎప్పటికప్పుడు నవీకరిస్తారు. అదే విధంగా మనోవేదనలను పరిష్కరించడానికి మానసిక ఆరోగ్య సమీక్ష బోర్డుతో సమన్వయం చేసుకోవడం ఉంటుంది. మానసిక వికాసానికి భరోసా ఇస్తున్నది టెలీ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్. కరోనా మహమ్మారితో మారుతున్న జీవన విధానం, వృత్తి, ఉద్యోగాలు మానవాళిపై తీవ్ర ఒత్తిడి పెంచుతున్నాయి. తద్వారా జీవి తంపై పెను ప్రభావాన్నే చూపుతున్నాయి. చివరకు బలవన్మరణాలకు కూడా దారితీస్తున్నట్లు పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఏదేమైనా నేటి ఉరుకుల పరుగుల జీవనంతో చాలామంది మానసిక ప్రశాంతతకు దూరమవుతున్నారు. కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల మధ్య ఉంటూనే స్మార్ట్ మొబైల్స్ రాకతో వారికి దూరంగా గడు పుతున్నారు. ఈ నేపథ్యంలో మానసిక ఆరోగ్యం దెబ్బ తింటోంది. ఎక్కడికి వెళ్ళాలో తెలీక సతమతమవుతూ, తీవ్ర మనోవేదనకు గురవుతున్న వారికి ఒకే ఒక్క ఫోన్ కాల్‌తో పరిష్కారం దొరికే అవకాశం ఏర్పడుతోంది. – డాక్టర్ అట్ల శ్రీనివాస్ రెడ్డి జాతీయ అధ్యక్షుడు అసోసియేషన్ ఆఫ్ రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్స్ అండ్ ప్రొఫెషనల్స్ -
అన్ని వర్గాలకు జరిగేలా బడ్జెట్లో కేటాయింపులు: కేంద్ర మంత్రి
-
వారికి రాష్ట్రంలో పర్యటించే హక్కులేదు
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి తీరని అన్యాయం చేసిన కేంద్ర మంత్రులకు రాష్ట్రంలో పర్యటించే హక్కులేదని వామపక్ష పార్టీలు నిరసన వ్యక్తం చేశాయి. కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి కిషన్రావ్ కరాడే విజయవాడ పర్యటనను నిరనిస్తూ ఉభయ కమ్యూనిస్టు పార్టీలు లెనిన్‌సెంటర్‌లో ఆదివారం నల్ల జెండాలతో నిరసన తెలిపాయి. కేంద్ర మంత్రి గో బ్యాక్ అంటూ ఆ పార్టీల నాయకులు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు దోనేపూడి శంకర్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్.బాబూరావు మాట్లాడుతూ బడ్జెట్‌పై బీజీపీ రాష్ట్ర శాఖ ఏర్పాటు చేసిన సమావేశాన్ని మేధావులు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రానికి అన్యాయం జరిగితే బీజేపీ నాయకులు ఏమొహం పెట్టుకుని బడ్జెట్‌పై సభలు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. రామానుజ విగ్రహావిష్కరణకు వచ్చిన ప్రధాని మోదీని శ్రీరాముడి అవతారంగా పోల్చడాన్ని ఆక్షేపించారు. వామపక్ష నాయకులు లంక దుర్గారావు, తాడి పైడయ్య, ఆనందరావు, శ్రీదేవి, కె.దుర్గారావు, టి.ప్రవీణ్, ఝాన్సీ పాల్గొన్నారు. -
బడ్జెట్‌పై దేశమంతా చర్చలు
సాక్షి, అమరావతి: కేంద్ర బడ్జెట్ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీజేపీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా చర్చా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి భగవత్ కిషన్‌రావు కరాడే తెలిపారు. ఆదివారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. అనంతరం బడ్జెట్‌పై వివిధ రంగాల నిపుణులతో జరిగిన సమావేశంలో ప్రసంగించారు. ప్రతిపక్షాలు బడ్జెట్‌పై చేస్తున్న అసత్యాలను ప్రజలు నమ్మవద్దని, వాస్తవాలను అర్థం చేసుకోవాలని కోరారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పన్నులు విధించకుండా ప్రాధాన్యతా రంగాలకు అధిక కేటాయింపులు చేసినట్లు చెప్పారు. జాతీయ రహదారులు, పోర్టులు, ఇండస్ట్రియల్ సెక్టార్‌కు భారీగా నిధులు కేటాయించినట్లు తెలిపారు. గ్రామీణ భారతంలో పోస్టాఫీసుల ద్వారా బ్యాంకింగ్ సేవలు అందజేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. దేశ ప్రజలందరికీ ఉపయోగపడేలా బడ్జెట్ రూపకల్పన జరిగిందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ.. పోలవరం నిర్మాణం 78 శాతం పూర్తయిందన్నారు. రాష్ట్రంలో పోర్టులు కట్టాలని మోదీ కలలు కంటున్నారని చెప్పారు. లతా మంగేష్కర్ మృతిపట్ల సమావేశం రెండు నిమిషాలు మౌనం పాటించింది. లతా మరణం దేశానికి తీరని లోటని సోము వీర్రాజు పేర్కొన్నారు. కార్యకర్తలు కష్టపడితే బీజేపీకి అధికారం కార్యకర్తలు కష్టించి పనిచేస్తే రాష్ట్రంలో బీజేపీ అధికారం సాధించడం సాధ్యమేనని కేంద్రమంత్రి భగవత్ కిషన్‌రావు కరాడే పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఓబీసీ మోర్చా ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. భగవత్ కిషన్‌రావు కరాడేకు ఏపీ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు పైడా కృష్ణప్రసాద్, ప్రెసిడెంట్–ఎలక్ట్ పొట్లూరి భాస్కరరావు, ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్‌తో కూడిన బృందం వినతిపత్రం అందజేసింది. దుర్గమ్మ సేవలో కేంద్ర మంత్రి ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ): కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి భగవత్ కిషన్‌రావు కరాడే ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను ఆదివారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఈవో భ్రమరాంబ స్వాగతం పలికారు. -
కొత్త సెజ్ చట్టంతో బహుళ ప్రయోజనాలు
న్యూఢిల్లీ: బడ్జెట్లో ప్రతిపాదిత ప్రత్యేక ఆర్థిక జోన్ల (సెజ్) కొత్త చట్టం ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు అనుగుణంగా ఉంటుందని వాణిజ్య కార్యదర్శి బీవీఆర్ సుబ్రమణ్యం పేర్కొన్నారు. ప్రత్యేక ఆర్థిక జోన్లకు సంబంధించి ప్రస్తుత చట్టం స్థానంలో తీసుకువస్తున్న కొత్త చట్టంతో వ్యవస్థలో అన్ని అనుమతులు, విధి విధానాలు, కార్యకలాపాలు సింగిల్ విండో కింద జరుగుతాయని, అంతర్జాతీయ స్థాయిలో మౌలిక రంగం పురోగతికి కొత్త చట్టం దోహదపడుతుందని ఆయన అన్నారు. సెజ్‌లను నియంత్రించే ప్రస్తుత చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం మంగళవారం ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. డెవలప్మెంట్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ అండ్ సర్వీస్ హబ్స్(డీఈఎస్‌హెచ్)లో రాష్ట్రాలను భాగస్వాములు చేయడం దీని ప్రధాన ఉద్దేశం. ప్రస్తుత సెజ్ యాక్ట్‌ను 2006లో తీసుకువచ్చారు. ఎగుమతుల పెరుగుదల, మౌలిక రంగం పురోగతి, ఉపాధి కల్పన ఈ చట్టం ప్రధాన లక్ష్యం. అయితే కనీస ప్రత్యామ్నాయ పన్ను విధింపు, పన్ను ప్రోత్సాహకాల తొలగింపు వంటి చర్యల తర్వాత ఈ జోన్ల ప్రాధాన్యత తగ్గుతూ వస్తోంది. కొత్త చట్టంతో తిరిగి సెస్‌లకు బహుళ ప్రయోజనాలు ఒనగూరుతాయని, దేశాభివృద్ధిలో కీలక పాత్రను పోషిస్తాయని సుబ్రమణ్యం అభిప్రాయపడ్డారు. సెజ్ 2.0 ముసాయిదా యాక్ట్ తయారీ పక్రియలో ఉందని, వచ్చే కొద్ది నెలల్లో ప్రస్తుత సెజ్ యాక్ట్ స్థాయిలో ఇది అమల్లోకి వచ్చే చర్యలు ఉంటాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం భారత్ ఎగుమతుల్లో దాదాపు 20 శాతం సెజ్‌ల వాటా కావడం గమనార్హం. -
రాష్ట్రంపై ఎన్నాళ్లీ వివక్ష?
సాక్షి, అమరావతి: కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి తీవ్ర అన్యాయం చేశారని సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు వి.శ్రీనివాసరావు, కె.రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బడ్జెట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై వామపక్ష పార్టీలు బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరిపాయి. రాస్తారోకోలు, ప్రదర్శనలు, సభలు జరిపి కేంద్రం తీరుపై భగ్గుమన్నారు. విజయవాడలోని పాత బస్టాండ్ సెంటర్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు శ్రీనివాసరావు, రామకృష్ణ మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏడేళ్లుగా రాష్ట్రానికి అన్ని రకాలుగా తీరని ద్రోహం చేస్తూనే ఉందని మండిపడ్డారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, రామాయపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్, గత బడ్జెట్లో ప్రకటించిన విశాఖ రైల్వేజోన్ వంటి కీలక అంశాలను పూర్తిగా విస్మరించారన్నారు. పోలవరానికి నిధులు కేటాయించకుండా, కనీసం రాష్ట్రం ఖర్చు చేసిన నిధులు ఇవ్వకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంపై ఎందుకింత కక్ష? ఎన్నాళ్లీ వివక్ష? అని ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ, టీడీపీ కలిసి రావాలి రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర నిర్లక్ష్య, నిరంకుశ వైఖరిని ఎండగడుతూ రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున పోరాటం సాగిస్తామని నేతలు ప్రకటించా రు. రాష్ట్ర ప్రయోజనాల కోసం వైఎస్సార్సీపీ, టీడీపీ కూడా వీధుల్లోకి రావాలని, అవసరమైతే బంద్ చేయాలని కోరారు. వామపక్షనేతలు వెంక య్య, శంకర్, విల్సన్, వనజ, జి.కోటేశ్వరరావు, బాబూరావు, కృష్ణ, కాశీనాథ్, అమరనాథ్, ఖాదర్ బాషా మాట్లాడారు. విశాఖపట్నంలో సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై నిరసన తెలిపారు. శ్రీకాకుళం, విజయనగ రం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు తదితర ప్రాంతాల్లో నిరసన కార్యక్రమాలు జరిగాయి. -
ఈ బడ్జెట్లు స్వతంత్ర భారతంలో వెరీ స్పెషల్..
స్వతంత్ర భారతంలో 76 ఏళ్లుగా ఏటా బడ్జెట్ ప్రవేశపెడుతూనే ఉన్నారు. కానీ కొన్ని బడ్జెట్లు మాత్రం ఎంతో ప్రత్యేకం. ఆయా సందర్భాలుగానీ, బడ్జెట్లలో చేర్చే కీలక అంశాలుగానీ దీనికి కారణం. అలాంటి బడ్జెట్లు ఏమిటో చూద్దామా? బ్లాక్ బడ్జెట్ 197374లో ఇందిరాగాంధీ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్న యశ్వంత్‌రావు చవాన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ‘బ్లాక్ బడ్జెట్’గా వ్యవహరిస్తారు. అప్పటికే కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో.. 550 కోట్ల ఆర్థిక లోటుతో ఆ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇప్పటి లెక్కల్లో ఈ మొత్తం తక్కువే అనిపిస్తున్నా.. నాటి పరిస్థితుల ప్రకారం.. భారీ లోటు అన్నమాట. క్యారట్ – స్టిక్ ఓ వైపు తాయిలాలు ఇస్తూనే.. మరోవైపు బెత్తంతో అన్నింటినీ నియంత్రణలోకి తెచ్చుకునే లక్ష్యంతో 1986లో కాంగ్రెస్ ఆర్థిక మంత్రి వీపీ సింగ్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌నే ‘క్యారట్ అండ్ స్టిక్ బడ్జెట్’గా పిలుస్తారు. దేశంలో లైసెన్స్‌రాజ్ వ్యవస్థకు మంగళం పాడేదిశగా చర్యలు ఈ బడ్జెట్లోనే మొదలయ్యాయి. అంతేకాదు పన్నులపై మళ్లీ పన్నులు పడుతూ పెరిగిపోయే భారం నుంచి ఉపశమనం కలిగించేందుకు ‘మోడిఫైడ్ వ్యాల్యూ యాడెడ్ ట్యాక్స్ క్రెడిట్’ను అమల్లోకి తెచ్చారు. అదే సమయంలో స్మగ్లర్లు, బ్లాక్ మార్కెటింగ్ చేసేవారు, పన్నులు ఎగ్గొట్టేవారిపై కఠిన చర్యల కోసం ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టారు. ప్రగతి బడ్జెట్ ఒక రకంగా ఆధునిక భారతదేశ చరిత్రనే మార్చినదిగా చెప్పుకొనేది 1991 బడ్జెట్. మన దేశం ఆర్థిక సంక్షోభం అంచున ఉండి, రోజువారీ వ్యవహారాల కోసం బంగారాన్ని తాకట్టు పెట్టాల్సిన పరిస్థితుల్లో.. పీవీ నర్సింహారావు ప్రభుత్వంలో మన్మోహన్సింగ్ ఆర్థిక మంత్రిగా విప్లవాత్మక సంస్కరణలతో ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. లైసెన్స్‌రాజ్ వ్యవస్థకు పూర్తిగా మంగళం పాడుతూ.. స్వేచ్ఛాయుత వ్యాపారానికి దారులు తెరిచారు. ఎగుమతులను పెంచేందుకు భారీగా పన్నులు తగ్గించారు. కలల బడ్జెట్ వ్యాపారస్తుల నుంచి సామాన్యుల వరకు కలలుగనేది పన్నుల తగ్గింపు, సులువుగా వ్యాపార, వాణిజ్యాలు చేసుకునే అవకాశమే. అలా అందరి ఆశలు తీర్చినది 1997–98 బడ్జెట్. కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ప్రవేశపెట్టిన ఆ బడ్జెట్లో ఎన్నో సంస్కరణలను అమల్లోకి తెచ్చారు. ఆదాయపన్నులో మార్పులు చేశారు. గరిష్ట శ్లాబును 40శాతం నుంచి 30 శాతానికి తగ్గించారు. దేశీయ కంపెనీలకు పన్నును 35 శాతానికి తగ్గించారు. స్వచ్ఛందంగా నల్లధనాన్ని వెల్లడించే పథకాన్ని ప్రకటించారు. కస్టమ్స్ డ్యూటీని ఏకంగా 40 శాతానికి తగ్గించి, ఎగుమతులు–దిగుమతులు ఊపందుకోవడానికి బాటలు వేశారు. ‘మిలీనియం’ ఐటీరంగంలో ప్రస్తుతం మన దేశం ప్రపంచంలోనే కీలకమైన స్థానంలో ఉంది. అలాంటి సాంకేతికతకు ప్రాధాన్యమిచ్చినదే 2000లో యశ్వంత్‌సిన్హా ప్రవేశపెట్టిన ‘మిలీనియం బడ్జెట్’. అందులో సాఫ్ట్వేర్ ఎగుమతులకు భారీగా ప్రోత్సాహకాలు ప్రకటించారు. కంప్యూటర్లు, సంబంధిత ఉపకరణాలపై దిగుమతి సుంకాన్ని భారీగా తగ్గించారు. ‘రోల్‌బ్యాక్’ కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఏదైనా ప్రతిపాదన చేసిందంటే.. దాదాపుగా దాన్ని అమల్లోకి తీసుకొచ్చినట్టేనని ఆర్థిక నిపుణులు చెప్తుంటారు. అలాంటిది యశ్వంత్‌సిన్హా ప్రవేశపెట్టిన 2002–03 బడ్జెట్లోని చాలా అంశాలపై.. అప్పటి వాజ్‌పేయి ప్రభుత్వం వెనక్కి తగ్గింది. కొన్ని ప్రతిపాదనలనైతే మొత్తంగా వెనక్కి తీసుకుంది. అందుకే ఈ బడ్జెట్‌ను ‘రోల్‌బ్యాక్ బడ్జెట్’గా పిలుస్తుంటారు. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
మనకు తెలిసిన పెద్ద నోటు 2,000.. మరి ప్రపంచంలో పెద్ద నోటేంటో తెలుసా..?
బడ్జెట్ అంటేనే డబ్బుల లెక్కలు.. అంటే మనకు గుర్తొచ్చేవి కరెన్సీ నోట్లు, నాణేలే. నాగరికతలు అభివృద్ధి చెందిన మొదట్లో డబ్బులనేవే లేవు. ఓ వస్తువు ఇవ్వడం, బదులుగా మరో వస్తువు తీసుకోవడమే. ఆ తర్వాత బంగారం, వెండి, రాగి, ఇతర లోహాలతో చేసిన నాణేలు కరెన్సీగా అమల్లోకి వచ్చాయి. కాగితాన్ని కనిపెట్టాక నోట్లు మొదలయ్యాయి. అందులోనూ ఏ దేశానికి ఆ దేశం నచ్చినట్టుగా కరెన్సీ నోట్లు, నాణేలను తయారు చేసుకుంటూ వస్తున్నాయి. మరి ఈ కరెన్సీలో కొన్ని చిత్రాలేమిటో చూద్దామా..? స్టాంపు కాదు డబ్బులే.. ప్రపంచంలోనే ఇప్పటివరకు అధికారికంగా చలామణీ అయిన అతిచిన్న కరెన్సీ నోటు.. రొమేనియా దేశానికి చెందిన ‘10 బని’. 1917లో ముద్రించిన ఈ కరెన్సీనోటు పరిమాణం 4.4 సెంటీమీటర్ల ఎత్తు, 3.3 సెంటీమీటర్ల వెడల్పు మాత్రమే. అంటే కాస్త పెద్ద సైజు స్టాంపు అంత అన్నమాట. సాధారణంగా కరెన్సీ నోట్లు తక్కువ ఎత్తుతో, ఎక్కువ వెడల్పుతో అడ్డంగా ఉంటాయి. కానీ దీని ఎత్తు ఎక్కువ, వెడల్పు తక్కువ. ఇంకో విశేషం ఏమిటంటే.. ఈ నోట్లకు నకిలీలను తయారు చేస్తే పదేళ్లు జైల్లో వేస్తామని ఆ నోటుపైనే ముద్రించారు. చదవండి: (బడ్జెట్ ఇంగ్లిష్‌లోనే ఎందుకు?) సర్టిఫికెట్ సైజులో లక్ష నోటు... ఈ ఫొటోలో ఓ సర్టిఫికెట్ అంత పెద్దగా కనిపిస్తున్నది ఫిలిప్పీన్స్‌కు చెందిన లక్ష పెసోల కరెన్సీ నోటు. ఆ దేశానికి స్పెయిన్ నుంచి స్వాతంత్య్రం వచ్చి 300 ఏళ్లయిన సందర్భంగా.. 1998లో 14 అంగుళాల పొడవు, 8.5 అంగుళాల వెడల్పుతో ఈ నోటును విడుదల చేసింది. ప్రపంచంలో అధికారికంగా చెలామణిలో ఉన్న అతిపెద్ద కరెన్సీ నోటు ఇదే. కోటి కోట్ల కోట్లు.. ఒక్క నోటు మామూలుగా మనం చూసే పెద్ద నోట్లు అంటే ఏంటి? ఐదు వందలు, రెండు వేలే కదా. ఒకప్పుడు పదివేల నోటు కూడా ఉండేది. మరి ప్రపంచంలో ఇలా అత్యధిక డినామినేషన్ ఉన్న నోటు ఏదో తెలుసా..? హంగరీ దేశానికి చెందిన ‘కోటి కోట్ల కోట్లు (100 మిలియన్ బిలియన్)’ పెంగో నోటు. అంటే ఒకటి పక్కన 20 సున్నాలు పెడితే వచ్చే సంఖ్య అది. 1946లో రెండో ప్రపంచ యుద్ధంలో బాగా దెబ్బతిన్న హంగరీలో ధరలు పెరిగిపోయి ద్రవ్యోల్బణం ఆకాశాన్ని అంటింది. దాంతో ఈ నోటును విడుదల చేశారు. 2008లో జింబాబ్వేలో ధరలు, ద్రవ్యోల్బణం పెరిగిపోవడంతో.. అక్కడి ప్రభుత్వం ఏకంగా కోటి కోట్ల (హండ్రెడ్ ట్రిలియన్) జింబాబ్వే డాలర్ల నోట్లను విడుదల చేసింది. పోకెమాన్.. డాలర్ మిక్కీమౌస్.. 2 డాలర్లు సాధారణంగా ఏ దేశమైనా తమ నాణేలపై ప్రముఖులు, తమ దేశ ప్రత్యేకతలు వంటివాటిని ముద్రిస్తుంటుంది. కానీ నియూ మాత్రం చిత్రంగా స్టార్‌వార్స్, పోకెమాన్, మిక్కీమౌస్, చివరికి ఇటీవలి ఫ్రాజెన్ వంటి యానిమేటెడ్ క్యారెక్టర్లను కాయిన్లపై ముద్రిస్తోంది. పసిఫిక్ సముద్రం మధ్యలో చిన్న దీవి అయిన నియూ.. న్యూజిలాండ్ పర్యవేక్షణలో స్వతంత్ర దేశంగా కొనసాగుతోంది. ‘నియూ డాలర్స్’గా పిలిచే ఈ కరెన్సీ అధికారికంగా చెల్లుబాటు అవుతుంది కూడా. -
హైదరాబాద్ టు ఢిల్లీ ‘వందేభారత్’.. పింక్ బుక్‌లో ఏముందో..
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరానికి వందేభారత్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా వివిధ ప్రాంతాలకు వందేభారత్ పరుగులు పెట్టనుంది. దేశవ్యాప్తంగా 400 వందేభారత్ రైళ్లకు కేంద్రం ఈ బడ్జెట్లో పచ్చజెండా ఊపిన నేపథ్యంలో గతంలోనే ప్రతిపాదించినట్లుగా హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీ, సికింద్రాబాద్–ముంబయి, కాచిగూడ–బెంగళూర్ నగరాల మధ్య వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టే అవకాశం ఉందని రైల్వే వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు గతంలో ప్రతిపాదించిన 100 రైళ్లు కాకుండా ఈ బడ్జెట్లో మరో 400 రైళ్లను కేంద్రం కొత్తగా ప్రకటించడం గమనార్హం. చదవండి: (భారత గడ్డపై తొలి బడ్జెట్‌కు 162 ఏళ్లు..) పింక్ బుక్‌లో ఏముందో.. ►వందేభారత్ మినహా కొత్త రైళ్లు లేనట్లే. సికింద్రాబాద్ నుంచి విశాఖ, తిరుపతి, షిరిడీ, శబరి, తదితర ప్రాంతాలకు కొత్త రైళ్లకు డిమాండ్ ఉన్నప్పటికీ కొత్తగా రైళ్లను ప్రవేశపెట్టే అవకాశం లేదని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. సరుకు రవాణా టర్మినళ్లపై కూడా పింక్‌బుక్‌లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ►మరోవైపు ఇప్పటికే కొనసాగుతున్న కొత్త లైన్ల నిర్మాణం, ఎంఎంటీఎస్ రెండోదశ, యాదాద్రికి ఎంఎంటీఎస్, చర్లపల్లి రైల్వే టర్మినల్ విస్తరణ తదితర పనులకు ఏ మేరకు నిధులు విడుదలవుతాయనేది పింక్‌బుక్ వస్తే తప్ప తెలిసే అవకాశం లేదు. ►వందేభారత్ రైళ్లపై కూడా కచ్చితమైన అంచనాలు ఉన్నప్పటికీ ఏయే రూట్లలో ఎప్పటి నుంచి ప్రవేశపెడుతారనేది పింక్‌బుక్‌లోనే తేలనుంది. చదవండి: (బడ్జెట్ ఇంగ్లిష్‌లోనే ఎందుకు?) -
భారత గడ్డపై తొలి బడ్జెట్‌కు 162 ఏళ్లు..
న్యూఢిల్లీ: మొదట్లో బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ పాలనలో ఉన్న మన దేశాన్ని.. 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటన్ నేరుగా పాలించడం మొదలుపెట్టింది. ఆ సమయంలోనే మన దేశానికంటూ మొదటిసారిగా 1860 ఏప్రిల్ 7న బడ్జెట్ ప్రవేశపెట్టారు. బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం తరఫున స్కాటిష్ ఆర్థికవేత్త, రాజకీయ నాయకుడు జేమ్స్ విల్సన్ ఆ బడ్జెట్ రూపొందించి, బ్రిటిష్ పార్లమెంట్‌కు సమర్పించారు. స్వాతంత్య్ర భారతంలో 1947 నవంబర్ 26న అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముగం శెట్టి తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రహస్యంగా..ప్రింటింగ్‌నే మార్చేసి కేంద్ర బడ్జెట్ రూపకల్పన, పత్రాల ముద్రణ అత్యంత రహస్యంగా సాగుతుంది. బడ్జెట్లోని అంశాలు ముందే తెలిస్తే.. ఎవరైనా వాటిని మార్చేలా ప్రభావితం చేయడానికి వీలు ఉంటుందన్నదే దీనికి కారణం. అందుకే బడ్జెట్ పత్రాలను ముద్రించినన్ని రోజులు సిబ్బంది ఎవరినీ బయటికి వెళ్లనివ్వరు. 1950 వరకు రాష్ట్రపతి భవన్లో బడ్జెట్ పత్రాలు ముద్రించేవారు. ఆ ఏడాది బడ్జెట్ రహస్యాలు ముందే లీకవడంతో ముద్రణను ఢిల్లీలోని మింట్ రోడ్లో ఉన్న ప్రింటింగ్ ప్రెస్‌కు మార్చారు. 1980 నుంచి కేంద్ర ఆర్థికశాఖ కార్యాలయం ఉండే నార్త్‌బ్లాక్‌లో బడ్జెట్ పత్రాలను ముద్రిస్తున్నారు. చదవండి: (బడ్జెట్ ఇంగ్లిష్‌లోనే ఎందుకు?) -
బడ్జెట్ ఇంగ్లిష్‌లోనే ఎందుకు?
న్యూఢిల్లీ: మన దేశంలో ఒక రకంగా చూస్తే హిందీ అధికార భాష. దానికి తోడుగా 22 గుర్తింపు పొందిన స్థానిక భాషలు ఉన్నాయి. గుర్తింపు పొందిన భాషల్లో ఇంగ్లిష్ లేనే లేదు. మరి ఏటా బడ్జెట్ ప్రసంగాన్ని ఇంగ్లిష్‌లో మాత్రమే ఎందుకు చదువుతారో తెలుసా? దానికి గట్టి కారణమే ఉంది. నిజానికి స్వాతంత్య్రం వచ్చిన కొత్తలోనే.. కేంద్ర ప్రభుత్వ వ్యవహారాలన్నీ హిందీలో నిర్వహించేందుకు ప్రయత్నాలు జరిగాయి. కానీ దేశంలోని కొన్ని ప్రాంతాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఇతర భాషలను తీసుకునే పరిస్థితి లేదు. దాంతో బ్రిటిష్‌కాలం నుంచి కొనసాగుతూ.. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో పరిచయం ఉన్న ఇంగ్లిష్‌ను మధ్యే మార్గంగా.. ‘అనుసంధాన భాష’గా ఎంపిక చేశారు. ఇప్పటికీ అదే కొనసాగుతోంది. అయితే రాజ్యాంగం ప్రకారం.. రాష్ట్రాలకు భాష విషయంలో స్వేచ్ఛ ఉంది. ఏ రాష్ట్రమైనా కేంద్ర గుర్తింపు పొందిన భాషనుగానీ, తమకు నచ్చిన మరే భాషను గానీ.. సదరు రాష్ట్ర పరిధిలో అధికారిక భాషగా ప్రకటించవచ్చు. ఆ భాషలో కార్యకలాపాలు కొనసాగించవచ్చు. చదవండి: (Biggest Budget: అతిపెద్ద బడ్జెట్ మన్మోహన్‌దే..) -
Union Budget 2022: విశాఖ ఉక్కుకు రూ.910 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: విభజన హామీల ప్రస్తావన లేకపోయినప్పటికీ ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్న రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (విశాఖ ఉక్కు )కు కేంద్రం బడ్జెట్లో రూ.910 కోట్లు కేటాయించింది. వెనకబడిన జిల్లాలకు నిధులు, దుగరాజపట్నం పోర్టు తదితర హామీలకు నిధులు కేటాయించలేదు. విశాఖలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం, ఎనర్జీ యూనివర్సిటీకి రూ.150 కోట్లు, వైజాగ్ పోర్టు ట్రస్టుకు రూ.207 కోట్లు కేటాయించారు. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా గత బడ్జెట్‌తో పోలిస్తే పెరిగింది. గత బడ్జెట్లో రూ.30,356.31 కోట్లు వస్తే.. ఈ సారి రూ.33,049.80 (4.047 శాతం) కోట్లు రానుంది. దీంట్లో కార్పొరేషన్ పన్ను రూ.10,319.40 కోట్లు, ఆదాయపు పన్ను రూ.9,966.37 కోట్లు, సంపద పన్ను రూ. 0.37 కోట్లు, సెంట్రల్ జీఎస్టీ రూ.10,851.95 కోట్లు, కస్టమ్స్ రూ.1,432.93 కోట్లు, ఎక్సైజ్ డ్యూటీ రూ.446.34 కోట్లు, సర్వీస్ ట్యాక్స్ రూ.33.18 కోట్లు. చదవండిః చెంగల్పట్టులో రోడ్డు ప్రమాదం.. తెలుగు ప్రముఖుల దుర్మరణం -
గాలిలో మేడ కట్టారు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్ గాలిలో మేడలు కట్టినట్టుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. రెండేళ్లుగా కోవిడ్ మహమ్మారితో ఆర్థికంగా చితికిపోయిన పేద, మధ్య తరగతి ప్రజలను ఆదుకోవడంలో కేంద్ర బడ్జెట్ పూర్తిగా విఫలమైందన్నారు. 2022 నాటికి రైతు ఆదాయం రెట్టింపు, అర్హులందరికీ ఇళ్లు అనే వాగ్దానాలకు గతి లేకున్నా.. పీఎం గతిశక్తి పేరుతో 25 ఏళ్ల ఆర్థికాభివృద్ధికి ఈ బడ్జెట్ పునాది అనడం హాస్యాస్పదమన్నారు. ఏడాదిపాటు ఢిల్లీ సరిహద్దులో ఉద్యమించిన రైతుల ప్రధాన డిమాండ్ అయిన పంటలకు కనీస మద్దతు ధరపై బడ్జెట్లో ప్రస్తావించకపోవడం.. కర్షకులకు నమ్మక ద్రోహం చేసినట్టేనన్నారు. తెలంగాణలో ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ తదితర విభజన హామీలను బడ్జెట్లో పేర్కొనకుండా.. మరోసారి మోసం చేసిందన్నారు. -
తెలంగాణపై కేంద్రం చిన్న చూపు: షర్మిల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణపై కేంద్రం చిన్నచూపు చూస్తోందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆరోపించారు. కేంద్ర బడ్జెట్‌పై ఆమె ట్విట్టర్ వేదికగా స్పందించారు. బడ్జెట్లో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, కాజీపేట్ కోచ్ ఫ్యాక్టరీ ప్రస్తావించలేదని మండిపడ్డారు. నిజామాబాద్‌కు పసుపు బోర్డు ఏమైందని ప్రశ్నించారు. రాష్ట్రానికి నిధులు రాబట్టడంలో సీఎం కేసీఆర్ విఫలమయ్యారని విమర్శించారు. ‘అభయహస్తం’పునఃప్రారంభించండి పేదల పక్షపాతిగా వైఎస్ఆర్ తీసుకువచ్చిన పథకాలను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేస్తోందంటూ షర్మిల ఆగ్రహం వ్యక్తంచేశారు. వైఎస్ఆర్ తెచ్చిన అభయహస్తం పథకాన్ని మళ్లీ అమలుచేయాలని వేదికగా డిమాండ్ చేశారు. -
నిరాశాజనకమైన బడ్జెట్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్ నిరాశాజనకంగా ఉందని ప్రముఖ ఆర్థిక వేత్త, హెచ్‌సీయూ సోషల్‌సైన్సెస్ విభాగం మాజీ డీన్ ప్రొఫెసర్ డి.నరసింహారెడ్డి అభిప్రాయపడ్డారు. కరోనా కారణంగా వివిధ రంగాల్లో లెక్కకు మించిన వ్యక్తులు జీవనోపాధి కోల్పోవడంతో తలెత్తిన పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. కరోనా ప్రభావం అధికాదాయ వర్గాలపై పడలేదన్నారు. వారి ఆదాయంలో కోత లేకపోగా మెరుగైన కొనుగోలు శక్తి కలిగి ఉన్నారని తెలిపారు. వచ్చే 25 ఏళ్లకు సంబంధించి ప్రణాళికలు మొదలుపెట్టామని ఆర్థిక మంత్రి చెబుతున్నా బడ్జెట్లో అలాంటి చర్యలేవి కనిపించలేదన్నారు. -
కేంద్ర బడ్జెట్ 2022: వ్యవ‘సాయం’లో ఏపీ 'మోడల్'
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ బాట పట్టింది. వ్యవసాయ రంగానికి నూతన జవసత్వాలు కల్పించి, లాభసాటిగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తెస్తున్న సంస్కరణలు, అమలు చేస్తున్న కార్యక్రమాలను కేంద్రం జాతీయ స్థాయిలో చేపడుతోంది. మంగళవారం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో వ్యవసాయానికి చేయూతనిస్తూ ప్రకటించిన పలు కార్యక్రమాలు ఏపీలో వైఎస్ జగన్ సర్కారు ఇప్పటికే అమలులోకి తెచ్చింది. ► వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలకు (ఆర్బీకేలకు) అనుసంధానంగా 10,750 వైఎస్సార్ యంత్ర సేవా కేంద్రాలు (కమ్యూనిటీ హైరింగ్ సెంటర్స్) రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే రూ.139.46 కోట్లతో 2,896 సీహెచ్‌సీలు రైతులకు సేవలు అందిస్తున్నాయి. కేంద్రం ఇదే తరహాలో రైతు ఉత్పత్తిదారుల సంఘాలు (ఎఫ్‌పీఓ) మద్దతుతో అద్దె ప్రాతిపదికన యంత్రాలను, సాంకేతిక పరిజ్ఞానాన్ని తేనున్నట్లు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రకటించారు. ► రాష్ట్రంలో ఆర్బీకేల ద్వారా రైతుల్లో నైపుణ్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ తరహాలోనే కేంద్రం రైతులకు డిజిటల్, హైటెక్ సేవలను అందించడానికి ప్రభుత్వ రంగ పరిశోధన, విస్తరణ సంస్థలు, ప్రైవేట్ అగ్రి–టెక్ ప్లేయర్లు, అగ్రి–వాల్యూ చైన్ వాటాదారుల భాగస్వామ్యంతో పీపీపీ మోడ్‌లో ప్రత్యేక ప్రాజెక్టును అమలు చేయబోతున్నట్టు బడ్జెట్లో ప్రకటించింది. ► ప్రకృతి వ్యవసాయంలో దేశానికే ఆదర్శంగా నిలిచింది ఏపీ. సేంద్రీయ పాలసీని తీసుకొచ్చే దిశగా అడుగులేస్తోంది. కేంద్రం కూడా ప్రకృతి, సేంద్రీయ వ్యవసాయానికి ప్రోత్సాహకాలు అందించనున్నట్లు ప్రకటించింది. యూనివర్శిటీ స్థాయిలో నూతన విద్యా విధానాన్ని తీసుకొస్తున్న కేంద్రం రసాయన రహిత సహజ వ్యవసాయ విధానంపై విస్తృత ప్రచారం చేయనున్నట్లు తెలిపింది. ► ఏపీలో వరికి ప్రత్యామ్నాయంగా చిరు ధాన్యాలను ప్రోత్సహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం త్వరలో మిల్లెట్ పాలసీని తీసుకొస్తోంది. పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయిలో మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్లను కూడా ఏర్పాటు చేస్తోంది. కేంద్రం తాజా బడ్జెట్లో చిరు ధాన్యాలను ప్రోత్సహిస్తూ 2023ని అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించింది. వీటి సాగుకు ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు తెలిపింది. చిరు ధాన్యాల వినియోగం పెంచి, జాతీయంగా బ్రాండింగ్ చేయాలని నిర్ణయించింది. ► ఏపీ ప్రభుత్వం ఆయిల్ పామ్‌ను ప్రోత్సహిస్తూ మరే రాష్ట్రంలో లేని రీతిలో ప్రత్యేకంగా గిట్టుబాటు ధర కల్పిస్తోంది. రెండున్నరేళ్లలో కొత్తగా 59 వేల ఎకరాలు సాగులోకి తెచ్చింది. కేంద్ర ప్రభుత్వం క్రూడ్ ఆయిల్ దిగుమతులను తగ్గించడం ద్వారా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు ఆయిల్ పామ్‌పై సమగ్ర పథకాన్ని తీసుకొస్తోంది. ► రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ ద్వారా వాటికి అదనపు విలువను జోడించే లక్ష్యంతో ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీని తీసుకొచ్చింది. రూ. 2,389 కోట్లతో సెకండరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పుతోంది. కేంద్రం కూడా ఇదే తరహాలో పండ్లు, కూరగాయలు, ఇతర వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులకు అదనపు విలువ జోడించేందుకు రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో సమగ్ర ప్యాకేజీని అందిస్తామని ప్రకటించింది. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల (స్టార్టప్) ఏర్పాటుకు ఆర్థికంగా చేయూతనిస్తామని తెలిపింది. ► ఏపీలో ఇప్పటికే అమలవుతున్న భూ రికార్డుల డిజిటలైజేషన్, డ్రోన్ల ద్వారా పురుగుల మందులు, పోషకాల పిచికారీ కూడా జాతీయ స్థాయిలో అమలు చేయబోతున్నారు. పంట అంచనా కోసం కూడా వీటిని వినియోగించాలని కేంద్రం సంకల్పించింది. ఇలా వ్యవసాయాన్ని పండుగ చేసే లక్ష్యంతో ఏపీలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికి రోల్ మోడల్‌గా నిలిచాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. -
రాష్ట్రానికి రిక్తహస్తమే
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం 2022–23 బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్‌ను చిన్నచూపు చూసింది. అతి ముఖ్యమైన ప్రాజెక్టులకు సైతం ఆశించిన రీతిలో నిధులు కేటాయించకుండా అన్యాయం చేసింది. విభజన చట్టం ప్రకారం పూర్తిగా తనే నిధులు ఇవ్వాల్సిన పోలవరం ప్రాజెక్టును సైతం నిర్లక్ష్యం చేసింది. జాతీయ విద్యా సంస్థలు, ఇతర సంస్థలకు రిక్తహస్తం చూపింది. మొక్కుబడిగా సెంట్రల్ వర్సిటీ, గిరిజన వర్సిటీలకు కొద్ది మొత్తం నిధులు విదిల్చి.. తక్కిన సంస్థలకు ఎలాంటి కేటాయింపులు చేయక నిరాశపరిచింది. గతంలో ఆయా సంస్థలకు కనీసం లక్షల్లో అయినా కేటాయింపులు చూపేది. ఈ సారి బడ్జెట్లో ఆయా సంస్థల పేర్లు కూడా ప్రస్తావించలేదు. రాష్ట్ర ప్రజల దీర్ఘకాలిక డిమాండ్ విశాఖపట్నం రైల్వే జోన్ ఏర్పాటు అంశంపై ఈ ఏడాది కూడా ముఖం చాటేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాష్ట్రానికి సంబంధించి ఈ ఏడాది శుభవార్తలు విందామనుకున్న ఐదు కోట్ల మంది ప్రజలను నిరాశ, నిస్పృహలకు గురిచేసింది. ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ ఇంత దారుణంగా ఉంటుందని ఊహించలేదని వివిధ రంగాలకు చెందిన నిపుణులు, ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోల‘వరం’ లభించలేదు.. ► రాష్ట్ర సమగ్రాభివృద్ధికి దిక్సూచిలా నిలిచే పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం బడ్జెట్లో ప్రత్యేకంగా ఎలాంటి నిధులు కేటాయించలేదు. ఈ ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఏడాదికి పూర్తి చేసే దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ► ఈ ప్రాజెక్టులో 41.15 కాంటూర్ వరకూ వచ్చే ఏడాది నీటిని నిల్వ చేయాలంటే నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి, భూసేకరణ చేయడానికి రూ.3,197.06 కోట్లు, జలాశయం.. కుడి, ఎడమ కాలువల్లో మిగిలిన పనులు పూర్తి చేయడానికి తక్షణం రూ.4 వేల కోట్లు వెరసి.. 2022–23 బడ్జెట్లో కనీసం రూ.ఏడు వేల కోట్లను విడుదల చేయాలని అనేక సందర్భాల్లో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ► ఆ తర్వాత 45.72 మీటర్లలో నీరు నిల్వ చేయడానికి వీలుగా నిర్వాసితులకు పునరావాసం, భూసేకరణ చేయడానికి రూ.26 వేల కోట్లు విడుదల చేయాలని కోరింది. అయినా ప్రత్యేకంగా నిధులు కేటాయించలేదు. కేంద్ర జల్ శక్తి శాఖకు బడ్జెట్లో కేటాయించిన రూ.18,967.88 కోట్లలో భారీ నీటి పారుదలకు రూ.1,400 కోట్లు.. భారీ, మధ్యతరహా నీటి పారుదలకు రూ.6,922.81 కోట్లు వెరసి రూ.8,322.81 కోట్లు కేటాయించింది. ► ఇందులో నుంచే పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు విడుదల చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. నాబార్డు నుంచి రుణం తీసుకుని.. పోలవరానికి నిధులు విడుదల చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. 2016–17 బడ్జెట్ నుంచి ఇదే తీరు ► పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగిస్తూ 2016 సెప్టెంబరు 7న కేంద్రం నిర్ణయం తీసుకున్నప్పుడు.. బడ్జెట్ ద్వారా కాకుండా నాబార్డు నుంచి రుణం తీసుకుని, రాష్ట్రానికి విడుదల చేస్తామని పెట్టిన షరతుకు నాటి టీడీపీ సర్కార్ అంగీకరించింది. దాంతో 2016–17 నుంచి బడ్జెట్లో పోలవరానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించని కేంద్రం.. నాబార్డు ద్వారా రుణం తీసుకుని నిధులు విడుదల చేస్తోంది. ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నాబార్డు ద్వారా రూ.751.80 కోట్లను పోలవరానికి విడుదల చేసిన కేంద్రం.. ఇటీవల బడ్జెట్లో మిగిలిన రూ.320 కోట్లను విడుదల చేసింది. 2022–23లోనూ ఇదే రీతిలో పోలవరానికి నిధులు విడుదల చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏకాభిప్రాయం తర్వాతే నదుల అనుసంధానం ► నదుల అనుసంధానాన్ని కేంద్రం బడ్జెట్లో ప్రస్తావించింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌ల మధ్య ఏకాభిప్రాయం కుదిరిన నేపథ్యంలో.. కెన్–బెత్వా నదుల అనుసంధానాన్ని రూ.44,605 కోట్లతో చేపట్టింది. ఈ పనులకు బడ్జెట్లో రూ.1,400 కోట్లు కేటాయించింది. ► నదీ పరివాహక ప్రాంత రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరితే గోదావరి–కృష్ణా, కృష్ణా–పెన్నా, పెన్నా–కావేరి నదులను అనుసంధానం చేస్తామని బడ్జెట్లో పేర్కొంది. గోదావరిలో నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చి.. రాష్ట్ర అవసరాలు తీరాక, మిగిలిన నీటిని కావేరికి తరలించాలని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ నాలుగు నదుల పరివాహక ప్రాంతాల్లోని రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయాన్ని సాధించడానికి కేంద్ర జల్ శక్తి శాఖ ప్రయత్నాలు చేస్తోంది. కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా.. ► ఏఐబీపీ (సత్వర సాగునీటి ప్రయోజన పథకం), కాడ్వామ్ (కమాండ్ ఏరియా డెవలప్మెంట్ అండ్ వాటర్ మేనేజ్మెంట్), నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు (ఎన్హెచ్పీ) తదితర పథకాలను కేంద్ర జల్ శక్తి శాఖ ద్వారా అమలు చేస్తోంది. ► ఏఐబీపీకి బడ్జెట్లో రూ.3,239 కోట్లు, కాడ్వామ్‌కు రూ.1,044 కోట్లు, ఎన్‌హెచ్‌పీకి రూ.800 కోట్లను కేటాయించింది. ఈ మూడు పథకాల ద్వారా రాష్ట్రానికి రూ.250 నుంచి రూ.300 కోట్లు వచ్చే అవకాశం ఉందని అంచనా. కేంద్ర విద్యా సంస్థలకు మొండిచెయ్యి ► కేంద్ర బడ్జెట్లో రాష్ట్రంలోని జాతీయ విద్యా సంస్థలు, ఇతర సంస్థలకు రిక్తహస్తం చూపింది. మొక్కుబడిగా పెట్రోలియం, సెంట్రల్ వర్సిటీ, గిరిజన వర్సిటీలకు కొద్ది మొత్తం నిధులు విదిల్చింది. తక్కిన ఏ సంస్థకూ ఎలాంటి కేటాయింపులూ చేయలేదు. కనీసం గతంలో లక్షో, రెండు లక్షలో కేటాయింపులు చూపేది. ఈసారి బడ్జెట్లో ఆయా సంస్థల పేర్లు కూడా ప్రస్తావించ లేదు. ► రాష్ట్ర విభజన చట్టం కింద ఏపీలో 7 జాతీయ విద్యా సంస్థలతో పాటు మరో 9 సంస్థలను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రం విడిపోయి ఎనిమిదేళ్లు అవుతున్నా, ఆయా సంస్థల పురోగతి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా ఉంది. ► ఆయా సంస్థలకు శాశ్వత భవనాల నిర్మాణానికి, బోధన, బోధనేతర అవసరాలకు సంబంధించి మౌలిక సదుపాయాల కల్పనకు ఏటా సరైన విధంగా నిధుల కేటాయింపు కావడం లేదు. ఫలితంగా ఆయా సంస్థలు ఇప్పటికీ పూర్తి స్థాయిలో కొలువుదీరలేదు. ► ఈ ఆర్థిక సంవత్సరంలో సెంట్రల్ వర్సిటీకి రూ.56.56 కోట్లు కేటాయించినట్లు చూపించారు. 2020–21లో కేవలం రూ.4.8 కోట్లు మాత్రమే ఇచ్చారు. 2021–22లో రూ.60.35 కోట్లు ఇస్తున్నట్లు బడ్జెట్లో కేటాయింపులు చూపినా, విడుదల చేసింది మాత్రం రూ.20.11 కోట్లు మాత్రమే. ► ఏపీ, తెలంగాణలకు కలిపి గిరిజన వర్సిటీల ఏర్పాటుకు రూ.44 కోట్లు బడ్జెట్ కేటాయింపుల్లో చూపించారు. ఏపీకి ఇందులో రూ.22 కోట్లు కేటాయించారు. 2020–21లో గిరిజన వర్సిటీకి కేటాయించింది కేవలం రూ.89 లక్షలు మాత్రమే. 2021–22లో రూ.26.9 కోట్లు కేటాయింపులు చూపి, కేవలం రూ.6.68 కోట్లు మాత్రమే విడుదల చేశారు. తక్కిన సంస్థల ఊసేలేదు ► బడ్జెట్లో సెంట్రల్ వర్సిటీ, గిరిజన వర్సిటీ తప్ప ఇతర విద్యా సంస్థలు, విద్యేతర సంస్థలకు సంబంధించిన ప్రస్తావనే లేదు. విభజన చట్టం కింద రాష్ట్రంలో సెంట్రల్ వర్సిటీ అనంతపురంలో ఏర్పాటు కాగా, గిరిజన వర్సిటీ విజయనగరం జిల్లా సాలూరులో ఇంకా ఏర్పాటు కావలసి ఉంది. ► తిరుపతిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చి (ఐఐఎస్ఈఆర్), విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం), తాడేపల్లి గూడెంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), కర్నూలులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ డిజైన్ (ఐఐఐటీడీ), గుంటూరులో అగ్రికల్చర్ యూనివర్సిటీలు ఉన్నాయి. ► మంగళగిరిలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్), విజయవాడలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంటు, విశాఖపట్నంలో పెట్రోలియం అండ్ ఎనర్జీ యూనివర్సిటీ, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ రిఫైనరీ తదితర సంస్థల గురించి కనీస ప్రస్తావన కూడా కేంద్ర బడ్జెట్లో లేదు. -
బడ్జెట్ నిరుత్సాహ పరిచింది
సాక్షి, న్యూఢిల్లీ: వ్యాక్సిన్ బూస్టర్ డోస్‌లా ఉంటుందనుకున్న కేంద్ర బడ్జెట్ నిరుత్సాహ పరిచిందని వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి చెప్పారు. పైకి స్టైల్‌గా కనిపించినా.. వాస్తవంగా అందులో ఏమీ లేదన్నారు. ఆర్థిక మంత్రి సబ్కా వికాస్ అని చెప్పినప్పటికీ రాష్ట్రాలకు ప్రయోజనకారిగా లేదని తెలిపారు. మంగళవారం ఏపీ భవన్లో ఎంపీలు మిధున్‌రెడ్డి, పిల్లి సుభాష్‌చంద్రబోస్, మార్గాని భరత్, ఆదాల ప్రభాకర్‌రెడ్డి, తలారి రంగయ్య, వంగా గీత, చింతా అనూరాధ, గొడ్డేటి మాధవి, గురుమూర్తి, రెడ్డెప్ప, మాధవ్, ఎంవీవీ సత్యనారాయణ, లావు శ్రీకృష్ణదేవరాయలు, పోచ బ్రహ్మానందరెడ్డిలతో కలిసి మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ఎఫ్ఆర్బీఎంలో ఇదేమిటి? చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జీఎస్డీపీలో ఎఫ్ఆర్బీఎం పరిధిని 3 శాతంగా నిర్ధారించినా, దానికన్నా ఎక్కువ రుణాలు తీసుకున్నారు. ఆ మొత్తాన్ని ఇప్పుడు రాష్ట్రానికి నిర్థారించిన రుణ సేకరణలో తగ్గించే ప్రయత్నం జరిగింది. దీనిని వెంటనే ప్రధాని దృష్టికి తీసుకెళ్లాం. ఎఫ్ఆర్బీఎం కేంద్రం, రాష్ట్రాలకు ఒక్కటే. కానీ కేంద్రం ఆ పరిధి దాటొచ్చని, రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దాటొద్దు అంటూ ద్వంద్వ ప్రమాణాలు పాటించడం అభ్యంతరకరం. మూల ధన వ్యయం కింద గతంలో రాష్ట్రాలకు రూ.15 వేల కోట్లు ఇవ్వగా, ఈసారి లక్ష కోట్లు ఇస్తామని ఆర్థిక మంత్రి చెప్పారు. ఇది స్వాగతించదగినదే అయినా, కేంద్ర పన్నుల్లో రాష్ట్రానికి ఇస్తున్న మొత్తం 4.047 శాతం మాత్రమే. దీంతో రాష్ట్రానికి వచ్చేది రూ.4 వేల కోట్లే. కేంద్ర పన్నుల్లో మహారాష్ట్రకు 6.31 శాతం, మధ్యప్రదేశ్‌కు 7.8 శాతం, యూపీకి 17.9 శాతం ఇస్తున్నారు. ఏపీ వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. అయినా అన్యాయం జరుగుతోంది. గతేడాది ఆంధ్రప్రదేశ్‌కు రూ.35 వేల కోట్లు రాగా, యూపీకి రూ.1.53 లక్షల కోట్లు ఇచ్చారు. జీఎస్టీ వల్ల రాష్ట్రాలకు ఆదాయం తగ్గినందువల్ల మరో 5 ఏళ్లు రాష్ట్రాల వాటా పొడిగించాలని కోరినా ఏ ప్రస్తావనా లేదు. నదుల అనుసంధానం ఖర్చు తిరిగివ్వాలి నదుల అనుసంధానం అభినందనీయం. గోదావరి– కృష్ణా, కృష్ణా–పెన్నా అనుసంధానం పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కొంత ఖర్చు చేసింది. ఆ ఖర్చును తిరిగివ్వాలి. పీఎం గతి శక్తిలో తూర్పు తీరం డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (ఖరగ్‌పూర్ నుంచి విజయవాడ వరకు), రాష్ట్రంలోని పోర్టులను కలుపుతూ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ పనులు చేపట్టాలి. భోగాపురం జాతీయ రహదారిని వేగంగా పూర్తి చేయాలి. పీఎం జన ఆరోగ్య యోజన కింద మధ్య తరగతికి ఆరోగ్య బీమా అందించాలి. ఉపాధి హామీలో కవరేజ్ పెంచలేదు. పీఎం కిసాన్ పథకంలో భూమి లేని రైతులను పూర్తిగా వదిలేశారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలని కోరుతున్నాం. ధాన్యం సేకరణకు స్పష్టమైన పాలసీ లేదు. విశాఖ ఉక్కు, ఎల్ఐసీ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నాం. ఎక్కడి నుంచైనా రిజిస్ట్రేషన్ అనేది ఇప్పటికే రాష్ట్రంలో సచివాలయాల్లో మొదలు పెట్టాం. స్టాంప్ డ్యూటీకి దేశమంతా ఒకే విధానం ఉండాలన్న అంశాన్ని కేంద్రం ప్రతిపాదించినప్పుడు స్పందిస్తాం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జాతీయ పింఛన్ విధానంలో అదనంగా 4%, అంటే 14%వరకు పన్ను రాయితీ ఇవ్వడం అభినందనీయం. క్రిప్టో కరెన్సీపై కేంద్రం నిర్ణయం స్వాగతించదగ్గది. చదవండి: పనికిమాలిన పసలేని బడ్జెట్ ఇది: సీఎం కేసీఆర్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ టీడీపీకి ప్రయోజనకారి నేషనల్ టెలి మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ మంచి నిర్ణయం. దీని వల్ల ప్రయోజనం పొందేది టీడీపీయే. ఆ పార్టీలో చాలా మందికి మెంటల్ సమస్యలు వచ్చాయి. దాన్ని వారు వినియోగించుకోవాలి. సీఎం నివేదించిన అంశాలపై సానుకూల స్పందన ఆశిస్తున్నాం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రధాన మంత్రికి నివేదించిన 10 అంశాలను కమిటీ ముందుంచాము. వాటి మీద సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాం. సంక్షేమ పథకాలు, కార్యక్రమాల అమలులో ముందున్న రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇవ్వాలని, పోలవరం ప్రాజెక్టుతో పాటు 13వ షెడ్యూల్లో ఉన్న అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాం. వాటికి సానుకూల స్పందన వస్తుందని భావిస్తున్నాం. -
వచ్చే వందేళ్ల కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వచ్చే వందేళ్ల కోసం ప్రవేశపెట్టిన బడ్జెట్‌గా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. నాలుగు ప్రధాన సూత్రాల ఆధారంగా బడ్జెట్ రూపకల్పన జరిగింది. 1. ప్రధాని గతిశక్తి యోజన 2. సమీకృత అభివృద్ధి 3. అభివృద్ధి ఆధారిత పెట్టుబడులు 4. పరిశ్రమలకు ఆర్థిక అండ ఈ అంశాలను ఆధారంగా చేసుకుంటూ బడ్జెట్ రూపొందించాము. దేశ యువత ఉజ్వల భవిష్యత్‌కు ఈ బడ్జెట్ ఉపయోగపడుతుంది. ఉద్యోగాలు, మౌలిక వసతులు, అభివృద్ధి ప్రాతిపదికన ఈ బడ్జెట్ రూపొందించింది. ఈ బడ్జెట్లో భారత రక్షణకు పెద్దపీట వేశాం. బడ్జెట్లో మహిళల కోసం మిషన్ శక్తి, వాత్సల్య, సక్షమ్ అంగన్వాడీల రూపకల్పన వంటి 3 ప్రత్యేక పథకాలు తీసుకొచ్చాం. గంగానది తీర రాష్ట్రాల్లో సహజసిద్ధ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాం. దేశ ఆర్థిక వ్యవస్థ సరైన దిశలోనే ప్రయాణిస్తోంది. అన్ని వర్గాలకు లబ్ధి చేకూరుతుంది. నవశకానికి నాంది పలికేలా ఈ బడ్జెట్ ఉంది' అని ప్రధాని నరంద్ర మోదీ అన్నారు. చదవండి: (Budget 2022: క్రిప్టో ట్రేడర్లకు శుభవార్త !) -
పనికిమాలిన పసలేని బడ్జెట్ ఇది: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్ తీవ్ర నిరాశకు గురిచేసిందని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. దశ, దిశ, నిర్దేశం లేని పనికిమాలిన పసలేని బడ్జెట్ అని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. సామాన్యులకు తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురి చేసిందన్నారు. మసిపూసి మారేడుకాయ చేసిన గోల్మాల్ బడ్జెట్ ఇది. వ్యవసాయ రంగాన్ని ఆదుకునే చర్యలు శూన్యం. దేశ చేనేత రంగానికి బడ్జెట్లో చేసిందేమీ లేదన్నారు. చదవండి: బడ్జెట్ 2022: పెరిగేవి..తగ్గేవి ఇవే..! నేతన్నలను ఆదుకునేందుకు ఎలాంటి చర్యలు లేవని.. ఉద్యోగులు, చిరు వ్యాపారులను తీవ్ర నిరాశకు గురి చేసిందన్నారు. ఇన్కమ్ ట్యాక్స్‌ల స్లాబ్‌లు మార్చకపోవడం విచారకరం. వైద్యం, ప్రజారోగ్యం, మౌలిక రంగాల అభివృద్ధిలో కేంద్రం నిర్లక్ష్యం వహించిందన్నారు. హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అభివృద్ధి చేయకపోవడం విచారకరమన్నారు. వైద్య రంగంలో మౌలిక వసతుల పురోగతికి చర్యలు లేవన్నారు. దేశ ప్రజల ఆరోగ్యం కేంద్రానికి పట్టకపోవడం విచిత్రమని కేసీఆర్ అన్నారు. -
ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం ఎంతసేపు సాగిందంటే..
FM Nirmala Sitharaman Budget Speech Time: ఆర్థిక మంత్రి హోదాలో నాలుగోసారి లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్. 62 ఏళ్ల నిర్మలమ్మ 92 నిమిషాలపాటు ప్రసంగించారు. అయితే గతంతో పోలిస్తే ఈ దఫా ఆమె బడ్జెట్ ప్రసంగం త్వరగానే ముగించేశారు. 2019 బడ్జెట్ ప్రసంగం 2 గంటల 17 నిమిషాలపాటు ప్రసంగించి.. గతంలో జశ్వంత్ సింగ్(2003లో ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు 2 గంటల 15 నిమిషాలు ప్రసంగించారు) రికార్డును బద్ధలు కొట్టారామె. ఆపై 2020లో 2 గంటల 42 నిమిషాలు(భారత్ సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం!), 2021లో గంటా నలభై నిమిషాలపైనే, ఇప్పుడు గంటా 32 నిమిషాలపాటు ఆమె ప్రసంగించారు. సాధారణంగా బడ్జెట్ ప్రజంటేషన్ నిడివి 90 నిమిషాల నుంచి 120 నిమిషాలు(రెండు గంటలుగా ఉంటుంది). ఇక కేంద్ర బడ్జెట్ 2022 లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. 2022-23 మొత్తం బడ్జెట్ విలువ రూ. 39 లక్షల 45 వేల కోట్లు. 2022-23 మొత్తం వనరుల సమీకరణ రూ. 22.84 లక్షల కోట్లు కాగా.. ద్రవ్యలోటు 6.9 శాతం ఉంది. రూ.17 లక్షల కోట్ల లోటు బడ్జెట్‌గా తేలింది.ఇక బడ్జెట్ సెషన్ రెండో దశ మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు కొనసాగనున్న విషయం తెలిసిందే. -
వర్క్‌ఫ్రమ్ హోం.. ఆశాభంగం!
కరోనా రాకతో పూర్తిగా వర్క్ ఫ్రమ్ హోంకే పరిమితమైన ఉద్యోగులు ఈ బడ్జెట్లో కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుందని గంపెడు ఆశలు పెట్టుకున్నారు. కానీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ 2022లో ‘వర్క్‌ఫ్రమ్ హోం’కు నిరాశే ఎదురైంది. క్రిప్టో కరెన్సీపై బడ్జెట్లో ప్రకటనను ఎవరూ ఊహించకపోగా.. ఊహించిన వర్క్‌ఫ్రమ్ హోం లాంటి అంశంపై కేంద్రం నుంచి ప్రకటన రాకపోవడంతో తీవ్ర అసంతృప్తి నెలకొంది. కరోనా మహమ్మారి రాకతో.. కంపెనీలన్ని వర్క్ ఫ్రమ్ హోమ్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. తద్వారా ఆయా కంపెనీలకు అయ్యే ఖర్చు అమాంతం తగ్గింది. కంపెనీలు ఆయా ఖర్చులను తగ్గించుకున్నా.. ఎక్కువ శాతం ఆ భారం పూర్తిగా ఉద్యోగుల మీద పడుతోంది. దీనికి తగ్గట్టుగా ఉద్యోగులకు ప్రయోజనాలు కల్పించాలనే డిమాండ్లు గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. ఇవి దృష్టిలో ఉంచుకోని బడ్జెట్-2022లో కేంద్రం ఊరట ఇస్తుందని అంతా భావించారు. పైగా స్టాండర్డ్ డిడక్షన్, వర్క్‌ఫ్రమ్ హోం అలవెన్స్ విషయంలో స్పష్టమైన ప్రకటన లేకపోవడంతో ఉద్యోగులకు నిరాశే ఎదురైంది. స్టాండర్డ్ డిడక్షన్.. తుస్? 2018లోనే ప్రభుత్వం స్టాండర్డ్ డిడక్షన్‌ను మళ్లీ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అనేక మంది ఉద్యోగులు స్టాండర్డ్ డిడక్షన్ని ఎంచుకున్నారు. ప్రస్తుత స్టాండర్డ్ డిడక్షన్‌లో వర్క్ ఫ్రమ్ హోమ్ అలవెన్స్‌ను కవర్ చేసేందుకు ఎలాంటి అవకాశం లేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారి కోసం ప్రస్తుత స్టాండర్డ్ డిడక్షన్ పరిమితినైనా పెంచాల్సి ఉంది. లేదంటే కొత్తగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఖర్చుల కోసం కొత్త డిడక్షన్‌నైనా ప్రవేశపెట్టాల్సి ఉంది. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 16 కింద ప్రస్తుతం ఉన్న స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని రూ.50వేల నుండి రూ.1 లక్షకు పెంచాలని కోరగా.. కేంద్రం నుంచి సానుకూల స్పందన కరువ కావడం చర్చనీయాంశంగా మారింది ఇప్పుడు. వర్క్ ఫ్రమ్ హోమ్ అలవెన్స్.. సైలెంట్ వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగులకు అలవెన్స్ అందించాలని ప్రభుత్వాన్ని పరిశ్రమల సంస్థ నాస్కామ్ సహా డెలాయిట్ ఇండియా ప్రీ-బడ్జెట్ ఎక్స్పెక్టేషన్ 2022 నివేదికలో బలంగానే కేంద్రాన్ని కోరాయి. పనిలో పనిగా ఉద్యోగుల కోసం ‘‘వర్క్ ఫ్రమ్ హోమ్’’ ఖర్చులపై మరిన్ని తగ్గింపులను సూచించాయి. అంటే.. ఉద్యోగులకు అదనంగా రూ. 50,000 WFH భత్యాన్ని సిఫార్సు చేయగా.. బడ్జెట్లో అసలు ఆ ఊసే లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. శాలరీ స్ట్రక్చర్’ని ఓ కొలిక్కి తీసుకొచ్చినట్లు ప్రకటించుకున్న కేంద్రం.. ‘తక్కువ ఇంటి అద్దె భత్యం నుంచి కొత్త తగ్గింపుల వరకు’.. కొన్ని ప్రతిపాదనలపై కంపెనీల ప్రతినిధుల మధ్య వరుసబెట్టి చర్చలు నడిపించింది. పైగా కొత్త వర్క్ మోడల్‌కు లీగల్ ఫ్రేమ్‌వర్క్ అంటూ గప్పాల ప్రకటనలు ఇచ్చిన కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ.. ఈ దిశగా ఆర్థిక శాఖపై ఒత్తిడి తేలేకపోయిందనే విమర్శ వినిపిస్తోంది ఇప్పుడు. -
బడ్జెట్ 2022 హైలైట్స్‌పై ఓ లుక్కేయండి (ఫోటోలు)
-
బడ్జెట్ షాక్ : ఆరంభ లాభాలు ఢమాల్!
సాక్షి, ముంబై: స్టాక్ మార్కెట్లు ఆరంభ లాభాలనుంచి వెనక్కి తగ్గాయి. ముఖ్యంగా వేతన జీవులకు ఎలాంటి ఊరట లభించపోవడంతో ఇన్వెస్టర్లు నిరాశకు గురయ్యారు. దీంతో ఆరంభంలో వెయ్యి పాయింట్లకు పైగా ఎగిసిన మార్కెట్లో అమ్మకాలు కొనసాగాయి. అయితే కార్పొరేట్ సంస్థలకు లబించిన ఊరటతో ఊగిసలాట కొనసాగుతోంది. సెన్సెక్స్ 891 పాయింట్ల లాభంతో 59 వేలకు దిగువన, నిఫ్టీ 223 పాయింట్ల లాభాలకు పరిమితమై 18 వేల దిగున ట్రేడయింది. క్రమంగా నష్టాల్లోకి జారుకుని తీవ్ర ఒడిదుడుకుల మధ్య కొనసాగుతోంది. ప్రధానంగా ఆయిల్ అండ్ గ్యాస్, ఆటో రంగ షేర్లు నష్టపోతున్నాయి. మరోవైపు భారతీయ రిజర్వు బ్యాంకు త్వరలో డిజిటల్ రుపీని జారీ చేస్తుందని ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ మంగళవారం బడ్జెట్ ప్రసంగంలో భాగంగా వెల్లడించారు. 2022-23లో భారత దేశానికి సొంత డిజిటల్ కరెన్సీ వస్తుందన్నారు. బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా డిజిటల్ రూపీని జారీ చేయబోతున్నట్లు వెల్లడించారు. డిజిటల్ అసెట్ల బదిలీపై 30శాతం పన్ను రాయితీ ఇవ్వనున్నారు. జనవరిలో స్థూల జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో రూ. 1,40,986 కోట్లకు చేరుకున్నాయని, ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకోవడం వల్లే సాధ్యమైందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. అయితే మార్కెట్ విశ్లేషకులు మాత్రంనిర్మలాది మరో 2022-23 గ్రోత్ ఓరియెంటెడ్ బడ్జెట్ అంటూ ప్రశంసించారు. ముఖ్యంగా ఎంఎస్ఎంఈలకు లభించిన ఊరటను ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు. 2022-23 బడ్జెట్లో ఎమ్ఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు లభించాయి. ఎంఎస్ఎంఈలకు మార్కెటింగ్ సహకారం కోసం నూతన పోర్టల్ ఏర్పాటుతోపాటు, ఉత్పత్తుల అమ్మకాలకు ప్రత్యేక ప్లాట్‌ఫాంను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం ప్రత్యేక క్రెడిట్ గ్యారంటీ పథకాన్ని ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. క్రెడిట్ గ్యారంటీ పథకానికి రూ.2 లక్షల కోట్ల ఆర్థిక నిధులు ప్రకటించారు. రానున్న ఐదేళ్లలో ఎంఎస్ఎంఈల కోసం రానున్న అయిదేళ్లలో 6,000 కోట్ల రూపాయల RAMP కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. అలాగే స్టార్టప్‌ల కోసం రూ.2 లక్షల కోట్ల రూపాయలను వెచ్చించనున్నామని ప్రకటించడం విశేషం. -
ట్యాక్స్ పేయర్స్కి గుడ్‌న్యూస్! నిర్మలమ్మ వరాలు
పన్ను చెల్లింపుదారులకు తొలి గుడ్‌న్యూస్ వెలువడింది. ట్యాక్స్ రిటర్న్ అప్డేట్ చేసుకునేందుకు రెండేళ్ల సమయం పెంచుతున్నట్టు మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రకటించారు. ఐటీ రిటర్న్‌లో లోపాలను సవరించుకునేందుకు పన్ను చెల్లింపుదారులకు ఇది మంచి అవకాశమని మంత్రి అన్నారు. పన్నులు చెల్లింపులు మరింత సులభం చేసేందుకు ప్రభుత్వం ఈ ఫైలింగ్‌ను అమల్లోకి తేగా..టెక్నికల్ గ్లిచెస్తో అనేక మంది ఇబ్బందులు పడ్డారు. వర్క్‌ఫ్రం హోం అమలవుతున్నందున స్టాండర్డ్ డిడక్షన్‌లో పలు సవరణలు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారు. మరి ఈ బడ్జెట్లో దానికి సంబంధించిన అంశం ఎప్పుడు ప్రస్తావనకు వస్తుందా అని ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఇన్‌ట్యాక్స్ శ్లాబుల్లో కూడా మార్పులు తేవాలనే డిమాండ్లు ఉన్నాయి. అయితే కేంద్ర బడ్జెట్లో వీటికి అవకాశం కల్పించలేదు. పన్నులకు సంబంధించిన అనుబంధ సెక్షన్లలో సైతం ప్రభుత్వం ఎటువంటి మార్పులు చేయలేదు. పన్ను గురించి బడ్జెట్లో పేర్కొన్న అంశాలు - కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 14 శాతం పన్ను ఆదా - సహకార సంస్థలకు సంబంధించి ఆల్టర్నేటివ్ మినిమం ట్యాక్స్ రేటుని 18.50 శాతం నుంచి 15 శాతానికి తగ్గింపు - సహకార సంస్థలు చెల్లించే సర్ ఛార్జీలు 7 శాతం తగ్గింపు - నేషనల్ పెన్షన్ స్కీంలో డిడక్షన్ 14 శాతం పెంచుకునే వెసులుబాటు (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
బడ్జెట్ 2022 ప్రసంగం: డిజిటల్ భారత్ ప్రధానంగా..
నాలుగోసారి పార్లమెంట్లో ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. కరోనా సమయంలో మరో బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్లు ప్రసంగం మొదలుపెట్టారు ఆమె. ఈ ఏడాది వృద్ధి రేటు 9.2 శాతం దాటుతుందని అంచనా. వృద్ధి రేటులో ముందున్నామని నిర్మలా సీతారామన్ ప్రకటించుకున్నారు. వ్యాక్సినేషన్ క్యాంపెయిన్‌జోరుగా సాగుతోంది. కొవిడ్ కట్టడిలో వ్యాక్సినేషన్ కీలకంగా వ్యవహరించిందని పేర్కొన్నారు ఆర్థిక మంత్రి. ఆత్మనిర్భర్ స్ఫూర్తితో ముందుకు సాగనున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. వంట నూనె దేశీయంగా తయారీపై దృష్టి. వెయ్యి లక్షల మెట్రిక్ టన్నుల వరిని సేకరిస్తామన్నారు. బడ్జెట్ ప్రసంగంలో కీలకాంశాలు కొన్ని.. ►పీఎం ఆవాస్ యోజన కింద 18 లక్షల ఇళ్లు. 48 వేల కోట్లు కేటాయింపు. 75 జిల్లాలో 75 డిజిటల్ బ్యాంకింగ్ కేంద్రాలు. తృణ ధాన్యాల సంవత్సరంగా 2023. ►యాప్‌లో ప్రజలకు అందుబాటులో బడ్జెట్. వచ్చే ఐదేళ్లలో మేకిన్ ఇండియాలో భాగంగా 60 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రణాళికగా ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి ప్రకటించారు. ఇంటి ఇంటికి మంచి నీటి కోసం 60 వేల కోట్ల కేటాయింపు. ►వ్యవసాయ రంగానికి ఆధునిక టెక్నాలజీని ఉపయోగం, భూ రికార్డులను డిజిటలైజేషన్. డ్రోన్లతో పంట పొలాల పరిరక్షణ. సేంద్రీయ వ్యవసాయానికి ప్రత్యేక రాయితీల ప్రకటన. పీఎం ఈ విద్య కోసం 200 ఛానెల్స్. ప్రాంతీయ భాషల్లో విద్యాబోధన.. 1.12 తరగతులకు వర్తింపు. ►ఆతిథ్య రంగానికి రూ. 5 లక్షల కోట్ల కేటాయింపులు. మైక్రో, చిన్నతరహా కంపెనీలకు 2 లక్షల కోట్ల కేటాయింపులు. ఎంఎస్ ప్రత్యేకంగా డిజిటల్ యూనివర్సిటీ. స్టార్టప్‌లకు 2 లక్షల కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. దేశంలో 4 మల్టీమోడల్ లాజిస్టిక్ పార్క్‌లు. అంగన్వాడీ 2.0 కింద 2 లక్షల అంగన్వాడీ కేంద్రాల ఆధునీకరణ. ►తెలుగు స్టేట్స్లో నదుల అనుసంధానంపై ప్రణాళిక. త్వరలో కృష్ణ గోదావరి, కృష్ణ పెన్నా నదుల అనుసంధానం. పెన్నా-కావేరి నదుల అనుసంధానానికి ప్లాన్. గంగా నదీ తీరంలో 5 కిలోమీటర్ల మేర సేంద్రీయ సాగు. ►అన్ని పోస్టాఫీసుల్లో బ్యాంకింగ్ సేవలు(నెట్‌బ్యాంకింగ్, ఏటీఎం సహా) అందుబాటులోకి. ఇకపై చిప్ ఆధారిత పాస్ పోర్టులు. కొత్తగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ 2.0 ►డిజిటల్ పేమెంట్, నెట్‌బ్యాంకింగ్ సేవలకు ప్రోత్సాహకాలు. గతిశక్తి కార్గొ టెర్మినళ్ల నిర్మాణం. కొత్త రహదారుల నిర్మాణం. పేద, మధ్య తరగతి సాధికారికత కోసం ప్రభుత్వం కృసి చేస్తోందని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ►2022 నాటికి 5జీ స్పెక్ట్రం వేలం పూర్తి చేసే యోచన. 2023 నుంచి 5జీ సేవలు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం. ► ప్రజా రవాణాలో ప్రత్యామ్నాయ ఇంధనలకు ప్రముఖ స్థానం. ఈ-వెహికల్స్ ప్రోత్సహకంలో భాగంగా హైవేలపై బ్యాటరీలు మార్చుకునే సదుపాయం. సోలార్ ఎనర్జీ ఉత్పత్తి కోసం 19,500 వేల కోట్ల రూ. కేటాయింపు. ►అన్ని కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో కాగిత రహిత విధానం. మానసిక ఆరోగ వ్యవస్థ కోసం జాతీయ విధానం. 10 రంగాల్లో క్లీన్ఎనర్జీ యాక్షన్ ప్లాన్. ఎగుమతుల ప్రోత్సాహకానికి కొత్త చట్టం. వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలకు ప్రత్యేక స్టార్టప్‌లు. (చదవండి: Budget 2022 Highlights) -
వచ్చే మూడేళ్లలో పట్టాలెక్కనున్న 400 వందే భారత్ రైళ్లు
ఎన్డీఏ సర్కారు ఈ సారి కొత్త రైళ్లు ప్రవేశపెట్టడంపై దృష్టి సారించింది. మోదీ సర్కార్ కొలువుదీరిన తర్వాత కొత్త రైళ్లు స్టార్ చేయడం కంటే నూతన రైల్వేలైన్ల నిర్మాణం, డబ్లింగ్, ట్రిప్లింగ్ పనులపై ఎక్కువగా ఫోకస్ చేశారు. గతానికి భిన్నంగా వందే భారత్ పేరుతో భారీగా రైళ్లు ప్రవేశపెట్టబోతున్నట్టు బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇప్పటికే వరుసగా 75 వారాల పాటు 75 వందే భారత్ రైళ్లను నడిపిస్తామని పీఎం మోదీ ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా ఆర్థిక మంత్రి ప్రకటన వచ్చింది. కొత్తగా వచ్చే వందే భారత్ రైళ్లను పూర్తిగా లింకే హఫ్ మన్ బుష్ (ఎల్ఎఫ్బీ) కోచ్‌లతో రూపొందించబోతున్నారు. ప్రస్తుతం రాయ్‌బరేలీ, కపుర్తాల, చెన్నైలలో ఉన్న కోచ్ ఫ్యాక్టరీలలో ఎల్ఎఫ్బీ కోచ్‌లను తయారు చేస్తున్నారు. ఏప్రిల్‌లో ఈ బోగీలకు సంబంధించిన టెస్ట్ జరుగనుందని మంత్రి అశ్వీనీ వైౌష్ణవ్ తెలిపారు. ఆగష్టు, సెప్టెంబరులో ఈ రైళ్లు పట్టాలెక్కే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అయితే ఈ రైళ్లు ప్రీమియం కేటగిరిలో సేవలు అందించే అవకాశం ఉంది. ఇప్పటికే ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని పలు నగరాల నంచి దేశరాజధానికి వందే భారత్ రైలు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. కొత్తగా వచ్చే రైళ్లలో తెలంగాణ, ఏపీకి వాటా దక్కనుంది. ఇక వ్యవసాయ ఉత్పత్తుల రవాణాకు రైల్వే నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తామని మంత్రి ప్రకటించారు. వ్యవసాయ రంగానికి సంబంధించి ఇప్పటి వరకు ఎరువుల సరఫరాకే రైల్వే నెట్వర్క్ ఉపయోగపడుతోంది. కరోనా సంక్షోభం వచ్చాక రైళ్ల ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల రవాణా పెద్ద ఎత్తున చేపట్టారు. వీటి ఫలితాలు బాగుండటంతో ఈసారి చిన్న, సన్నకారు రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని రైల్వే కార్గో సేవలు ప్రారంభిస్తామన్నారు. ఈ మేరకు పీఎం గతి శక్తి ద్వారా దేశవ్యాప్తంగా వంద కార్గో టెర్మినల్స్ నిర్మించబోతున్నారు. ఇతర కీలక అంశాలు - రైల్వే, పోస్టల్ శాఖల సమన్వయంతో పార్సిస్ సర్వీసుల బలోపేతం - ఆధునిక టెక్నాలజీ సీల్ 4 సాయంతో రైలు ప్రమాదాలు నివారించేందుకు ‘కవచ్’ కార్యక్రమం. 2022-23 చివరి నాటికి కవచ్ పరిధిలో 2,000 కి.మీ ట్రాక్. - రైల్వేలతో మాస్ అర్బన్ ట్రాన్సపోర్టేషన్ అనుసంధానం - లోకల్ బిజినెస్‌ని ప్రోత్సహించేందుకు సప్లై చెయిన్ బలోపేతానికి వన్ స్టేషన్ - వన్ ప్రొడక్ట్ పథకం - ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 1.37 లక్షల కోట్లు కేటాయింపు - రైల్వే స్టేషన్ల డెవలప్మెంట్ కోసం రూ. 12,000 కోట్ల కేటాయింపు -
కేంద్ర బడ్జెట్ 2022 (ఫొటోలు)
-
బడ్జెట్ 2022: ఆ రాష్ట్రాల మీదే ఫుల్ ఫోకస్?
Union Budget 2022 Updates: ప్రధాని మోదీ హయాంలోని బీజేపీ ప్రభుత్వం పదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. రాష్ట్రపతిని కలిసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. వార్షిక బడ్జెట్ వివరాలు తెలిపారు. కాసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. బడ్జెట్‌కు కేబినెట్ ఆమోద ముద్ర తర్వాత పార్లమెంట్ బడ్జెట్ సెషన్ రెండో రోజు ప్రారంభం కానుంది. 80సీ కింద మినహాయింపులు(లక్షన్నర నుంచి రూ. 3లక్షల పెంచుతారనే ఆశ) మీద వేత జీవుల ఆశలు, స్టాండర్డ్ డిడక్షన్ 50 వేల నుంచి లక్ష రూ. పెంచడం లాంటి అంశాల మీద అందరి దృష్టి ఉంది. అయితే.. కరోనాతో గత రెండేళ్లుగా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఆర్థిక పురోగతికి ఈ ఏడాది కలిసి రావొచ్చనే అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం మూడో వేవ్‌లో ఉన్నప్పటికీ.. పరిస్థితి మెరుగైందనే చెప్పొచ్చు. ఈ తరుణంలో రూ.2.5 లక్షలుగా ఉన్న ఐటీ పరిమితి మినహాయింపులు పెరిగే అవకాశాలు తక్కువనే నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఐదు స్టేట్స్లో ఎలక్షన్స్ నేపథ్యంలో.. వాటి మీదే ప్రధాన ఫోకస్ ఉండొచ్చని, వ్యవసాయ, పారిశ్రామికరణ.. ఇతరత్ర కేటాయింపులు ఉండొచ్చనే టాక్ ప్రధానంగా వినిపిస్తోంది. (చదవండి: Budget 2022 LIVE Updates) గతంలో ఎలక్షన్ సంబంధిత రాష్ట్రాలకు జరిగిన కేటాయింపులనే అందుకు ఉదాహరణలుగా చూపిస్తున్నారు. వ్యవసాయం మాత్రమే కాదు.. మౌలిక వసతులు, రోడ్లు, రైల్వే, ఇరిగేషన్, మెడిసిన్ సంబంధిత బడ్జెట్ వరాలు సైతం ఆయా రాష్ట్రాల పైనే కురవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు బీజేపీ వ్యతిరేక రాష్ట్రాల్లోనూ పట్టు కోసం బడ్జెట్ ఫోకస్ ఉండొచ్చనే వాదనా వినిపిస్తోంది. దీంతో అసంతృప్త రాష్ట్రాల పరిస్థితిపై జోరుగా చర్చ నడుస్తోంది. అదే సమయంలో.. 2022-2023 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 8-8.5 శాతంగా ఉండొచ్చనే లెక్కల నడుమ.. రాబడి పెరగడంతో(గత రెండేళ్లలో పోలిస్తే) ఆర్థిక వ్యవస్థకు ద్రవ్యపరంగా ఆసరా అందించే ఆస్కారం ఉందనే ఆశ మాత్రం ఉంది. వ్యాక్సినేషన్, సర్వీస్ సెక్టార్, నియంత్రణల సడలింపులు, ఎరువుల రాయితీలు, అంతరిక్షంలో ప్రైవేటీకరణ, రైల్వేలో పెట్టుబడులకు అవకాశం, రహదారుల నిర్మాణం, స్టార్టప్‌లకు వెన్నుదన్ను.. తదితర అంశాలపైనే ప్రధాన ఫోకస్ ఉన్నట్లు అర్థమవుతోంది. భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటిస్తున్నప్పటికీ.. అసంతృప్త రాష్ట్రాలకు కేటాయింపుల విషయంలో కేంద్రం కరుణ చూపిస్తుందా? లేదంటే ఎప్పటిలాగే మొండి చేయి ఇస్తుందా? అనేది మరికొన్నిగంటల్లో తేలిపోనుంది. సంబంధిత వార్త: బడ్జెట్ బూస్ట్.. భారీ లాభాలు! -
ఆర్థిక సర్వే ఎఫెక్ట్.. జోరుమీదున్న స్టాక్ మార్కెట్.. లాభాల్లో సూచీలు
ముంబై: బడ్జెట్ నేపథ్యంలో స్టాక్ మార్కెట్ సూచీలు పరుగులు పెడుతున్నాయి. ఆర్థిక సర్వే ఫలితాలు సైతం ఆశజనకంగా ఉండటం వృద్ధి రేటు 9 శాతానికి పైగా ఉండటంతో ఇన్వెస్టర్లు మార్కెట్‌పై నమ్మకం చూపిస్తున్నారు. మార్కెట్ ప్రారంభమైన అరగంటలోపే బీఎస్ఈ సెన్సెక్స్ 500ల పాయింట్లు లాభపడగా నిఫ్టీ 151 పాయింట్లు లాభంలో ఉంది. మార్కెట్ ముగిసే సరికి సెన్సెక్స్ వెయ్యి పాయింట్ల లాభంతో ముగియవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. నిన్న సాయంత్రం బీఎస్ఈ సెన్సెక్స్ 58,014 పాయింట్ల దగ్గర క్లోజయ్యింది. ఈ రోజు ఉదయం ఏకంగా 500 పాయింట్లకు పైగా లాభంతో 58,672 పాయింట్లతో మొదలైంది. ఉదయం 9:20 గంటల సమయంలో 588 పాయింట్ల లాభంతో 58,652 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 151 పాయింట్ల లాభంతో 17,491 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది. -
సాక్షి కార్టూన్
-
కేంద్ర బడ్జెట్ 2022 అప్డేట్స్
-
బడ్జెట్ సమావేశాలను ఫలవంతం చేద్దాం
న్యూఢిల్లీ: ఎన్నికలు తరచుగా జరుగుతూనే ఉంటా యని, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మాత్రం చాలా కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. ఒక ఏడాది కాలానికి బ్లూప్రింట్‌ను ఖరారు చేసే బడ్జెట్ సమావేశాలను ఫలవంతం చేద్దామని పార్లమెంట్ సభ్యులకు పిలుపునిచ్చారు. ఓపెన్ మైండ్‌తో సభలో చర్చల్లో పాల్గొనాలని కోరారు. మోదీ సోమవారం మీడియాతో మాట్లాడారు. దేశంలో ఏదో ఒకచోట తరచుగా జరుగుతున్న ఎన్నికల కారణంగా పార్లమెంట్ భేటీలకు, చర్చలకు అంతరాయం కలుగుతున్న మాట వాస్తవమేనని పేర్కొన్నారు. అయినప్పటికీ పార్లమెంట్లో స్వేచ్ఛాయుతంగా, సదుద్దేశంతో ఆలోచనాత్మక చర్చలు జరగాలని ఆకాంక్షించారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో భారత్ ముంగిట ఎన్నో అవకాశాలు ఉన్నాయని వివరించారు. (చదవండి Budget 2022 Updates in Telugu) దేశ ఆర్థిక ప్రగతి, కోవిడ్–19 వ్యాక్సినేషన్, స్వదేశంలో కరోనా టీకాల ఉత్పత్తి వంటి వాటితో అంతర్జాతీయంగా భారత్ పట్ల విశ్వాసం ఎంతగానో పెరిగిందన్నారు. ప్రపంచంలో మన దేశ ప్రతిష్టను మరింత ఇనుమడింపజేసేందుకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను ఉపయోగించుకోవాలని, అర్థవంతమైన చర్చలు జరపాలని ఎంపీలకు సూ చించారు. దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపించడానికి ఎంపీలందరితోపాటు అన్ని రాజకీయ పార్టీలు తప్పనిసరిగా తోడ్పాటునందిస్తాయన్న ఆశాభావాన్ని ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు. చట్టసభల్లో ఓపెన్ మైండ్‌తో జరిపే నాణ్య మైన చర్చలు ఇందుకు దోహదం చేస్తాయని వెల్లడించారు. పూర్తి అంకితభావంతో ప్రస్తుత బడ్జెట్ సమావేశాలను ఫలవంతం చేస్తే రానున్న రోజుల్లో ఆర్థికంగా భారత్ ఉన్నత శిఖరాలకు చేరుకొనేం దుకు ఆస్కారం ఉంటుందని వ్యాఖ్యానించారు. పార్లమెంట్లో రచ్చ తప్పదా? రైతుల సమస్యలు, దేశ సరిహద్దులో చైనా సైన్యం ఆగడాలు, పెగాసస్ స్పైవేర్ వంటి కీలక అంశాలపై పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సన్నద్ధమవుతున్నాయి. ఇజ్రాయెల్ నుంచి భారత్ 2017లో పెగాసస్ స్పైవేర్‌ను కొనుగోలు చేసిందంటూ న్యూయార్క్ టైమ్స్ పత్రికలో వచ్చిన కథనం ఇప్పటికే రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై కలిసికట్టుగా కేంద్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రతిపక్షాలు నిర్ణయించుకున్నాయి. ఈ నేపథ్యంలో కీలకమైన అంశాలపై ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలు, నిరసనలతో బడ్జెట్ సమావేశాలు హోరెత్తిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. మీడియా సమావేశంలో మోదీ -
పార్లమెంట్లో కరోనా నిబంధనల ఉల్లంఘన
సాక్షాత్తూ పార్లమెంట్ సాక్షిగా ఎంపీలు కరోనా నిబంధనలను ఉల్లంఘించారు. సామాజిక దూరం అనే మాటే మర్చిపోయారు. ఒక పార్టీ అని కాదు, అన్ని పార్టీల ఎంపీలదీ అదే తీరు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా సోమవారం సెంట్రల్ హాల్లో ఉభయసభల సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగించారు. ఈ క్రమంలో మొదటి రెండు వరుసల్లో ఆసీనులైన ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత మల్లిఖార్జున ఖర్గేతోపాటు పలువురు కేంద్ర మంత్రులు, ఎంపీలు మాత్రమే సామాజిక దూరం పాటించారు. మూడో వరుస నుంచి కూర్చున్న ఎంపీలు కోవిడ్–19 ప్రొటోకాల్‌ను లెక్కచేయలేదు. వీరిలో కొందరు కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. కొన్ని బెంచీల్లో ఐదుగురు మాత్రమే కూర్చోవాల్సి ఉండగా, ఏడుగురు కనిపించారు. ఇక చాలామంది ఎంపీలు మాస్కులు కూడా కిందకు దించేశారు. మాస్కులు సక్రమంగా ధరించకుండానే ఒకరితో ఒకరు మాటల్లో మునిగిపోయారు. కరోనా కేసుల ఉధృతి దృష్ట్యా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్నారు. ఉదయం రాజ్యసభ, సా యంత్రం లోక్‌సభ సమావేశాలు జరుగుతాయి. (చదవండి: Nirmala Sitharaman Budget 2022 Speech) -
అట్టడుగు వర్గాలకే అధిక ప్రాధాన్యం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ విధానాలు సమాజంలోని పేదలు, అట్టడుగు వర్గాలకు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు, గ్రామ సీమల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చెప్పారు. మొత్తం రైతుల్లో 80 శాతం ఉన్న సన్నకారు రైతుల అభివృద్ధిని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. కరోనా మహమ్మారిపై పోరాటం, రికార్డు స్థాయిలో పంటల సేకరణ, దేశ అంతర్గత భద్రతను పటిష్టం చేయడానికి చేపట్టిన చర్యలు మన సమష్టి విజయాలని చెప్పారు. దీర్ఘకాలంలో సాధించాల్సిన లక్ష్యాలకు ఇవి చోదక శక్తిగా పని చేస్తాయని అన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఆయన సోమవారం ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం సాధించిన పలు ఘనతలను ప్రస్తావించారు. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాల్లో కేంద్రం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రత్యేకంగా గుర్తుచేశారు. గోవా విముక్తి పోరాట యోధుల స్మారకం నిర్మాణం, అఫ్గానిస్తాన్ నుంచి గురుగ్రంథ సాహిబ్ స్వరూపాలను వెనక్కి తీసుకురావడం, భారత్‌లో రైతాంగం సాధికారత కోసం సర్కారు కృషి వంటి అంశాలు రాష్ట్రపతి ప్రసంగంలో చోటుచేసుకున్నాయి. ‘మేక్ ఇన్ ఇండియా’లో భాగంగా 2020–21లో రక్షణ రంగం ఆధునీకరణకు 87 శాతం అనుమతులు మంజూరు చేసినట్లు తెలిపారు. 209 రకాల రక్షణ పరికరాలను దేశీయంగానే ఉత్పత్తి చేసుకోవాలని నిర్ణయించినట్లు గుర్తుచేశారు. దేశ భవిష్యత్తుకు రోడ్డుమ్యాప్ కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాలను దేశ భవిష్యత్తుకు రోడ్డుమ్యాప్గా భావించాలని రాష్ట్రపతి కోవింద్ ఉద్ఘాటించారు. కరోనా మహమ్మారిపై పోరాటంలో భాగంగా ఆరోగ్య కార్యకర్తలు, సైంటిస్టులు నిరుపమాన సేవలందించారని కొనియాడారు. ఏడాది కంటే తక్కువ సమయంలోనే 150 కోట్లకు పైగా కరోనా టీకా డోసులు ప్రజలకు అందజేయడం గొప్ప విషయమని చెప్పారు. దేశంలో 18 ఏళ్లు దాటిన వారిలో 90 శాతానికి పైగా ప్రజలు టీకా మొదటి డోసు, 70 శాతానికి పైగా ప్రజలు రెండు డోసులు తీసుకున్నారని తెలిపారు. 15–18 ఏళ్ల కేటగిరీకి కరోనా టీకా ఇస్తున్నట్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు, వృద్ధులకు బూస్టర్ డోసు ఇచ్చే ప్రక్రియ ఇప్పటికే మొదలయ్యిందని గుర్తుచేశారు. అతిపెద్ద ఆహార పంపిణీ పథకం కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న సమయంలో దేశంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం ‘ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన’ కింద పేదలకు ఉచితంగా ఆహార ధాన్యాలు సరఫరా చేసిందని రామ్‌నాథ్ కోవింద్ అన్నారు. 19 నెలల్లో 80 కోట్ల మంది లబ్ధి పొందారని, దీని కోసం ప్రభుత్వం రూ.2.60 లక్షల కోట్లు ఖర్చు చేసిందని, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార పంపిణీ పథకమని వివరించారు. దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పనను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం ‘పీఎం గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్’ను తెరపైకి తెచ్చిందని తెలిపారు. పార్లమెంట్లో రాష్ట్రపతి ప్రసంగంపై కాంగ్రెస్ నేత మనీష్ తివారీ పెదవి విరిచారు. చైనా, పాకిస్తాన్ వ్యవహారాన్ని రాష్ట్రపతి ప్రస్తావించలేదని, జమ్మూకశ్మీర్‌కు రాష్ట్రహోదా పునరుద్ధరణ, నాగాలాండ్‌లో పౌరుల ఊచకోతపై ఎలాంటి ప్రకటన చేయలేదని విమర్శించారు. రాజ్యసభలో ఆర్థిక సర్వే ఆర్థిక సర్వే 2021–22 నివేదికను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం రాజ్యసభలో ప్రవేశపెట్టారు. అంతకముందు తొలుత సభ ప్రారంభం కాగానే చైర్మన్ ఎం.వెంకయ్య నాయుడు సిట్టింగ్ ఎంపీ డాక్టర్ మహేంద్ర ప్రసాద్, మాజీ ఎంపీలు జయంత రాయ్, దేబేంద్రనాథ్ బర్మన్, ఎం.మోజెస్, గణేశ్వర్ కుసుమ్, కథక్ కళాకారుడు పండిట్ బిర్జూ మహారాజ్ మృతి పట్ల సంతాపం ప్రకటించారు. పార్లమెంట్ 255వ సమావేశాల్లో ఆమోదించిన బిల్లుల జాబితాను సెక్రెటరీ జనరల్ రాజ్యసభకు సమర్పించారు. ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన అనంతరం సభను మరుసటి రోజుకు వాయిదా వేస్తున్నట్లు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ప్రకటించారు. సభా హక్కుల ఉల్లంఘన... పెగాసస్ స్పైవేర్ సమస్యపై గత ఏడాది పార్లమెంట్లో ప్రకటన చేసిన కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌పై ప్రివిలేజ్ మోషన్‌ను ప్రవేశపెట్టాలని సీపీఐ ఎంపీ బినోయ్ విశ్వం సోమవారం నోటీసు సమర్పించారు. ఇటీవల న్యూయార్క్ టైమ్స్ రిపోర్టును ఆధారంగా నోటీసును సమర్పించినట్లు తెలిపారు. స త్యాన్ని దాచడానికి ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ, పెగాసస్ స్పైవేర్‌ను కొనుగోలు చేసిందన్న ఆధారాలు బహిర్గతం అయ్యాయన్నారు. పెగాసస్‌పై ప్రత్యేక చర్చ అక్కర్లేదు పెగాసస్ స్పైవేర్ వ్యవహారంపై పార్లమెంట్లో ప్రత్యేక చర్చ అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం సోమవారం స్పష్టం చేసింది. ఈ అంశం ఇప్పటికే కోర్టు పరిధిలో ఉందని వెల్లడించింది. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రతిపక్షాలు కోరుకుంటే ఏ అంశాన్ని అయినా లేవనెత్తవచ్చని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషీ అన్నారు. అఖిలపక్ష భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ వ్యవహారం కోర్టు పరిధిలో ఉన్నందున పార్లమెంట్లో ప్రత్యేక చర్చ అక్కర్లేదన్నారు. -
చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్‌కి ఏపీతోనూ అనుబంధం!
కేంద్ర బడ్జెట్ 2022 ముందు అనూహ్యంగా డాక్టర్ వీ అనంత నాగేశ్వరన్‌ను చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ (CEA)గా కేంద్రం నియమించిన విషయం తెలిసిందే. కేవీ సుబ్రమణియన్ మూడేళ్ల పదవీకాలం గత డిసెంబర్లోనే ముగియగా.. ఇప్పుడు అనంత నాగేశ్వరన్‌ను ఆ స్థానంలో నియమించారు. ఈ నేపథ్యంలో ఈయన నేపథ్యంపై ఓ లుక్కేద్దాం. అనంత నాగేశ్వరన్ ఆర్థిక మేధావి మాత్రమే కాదు.. రచయిత, టీచర్, ఎకనమిక్ కన్సల్టెంట్ కూడా. ప్రధాని నేతృత్వంలోని ఎకనమిక్ అడ్వైజరీ కౌన్సిల్లో 2019-2021 మధ్య పార్ట్‌టైం మెంబర్‌గా ఈయన ఉన్నారు. గతంలో క్రెడిట్ సుయిస్సె గ్రూప్ ఏజీ, జూలియస్ బాయిర్ గ్రూప్‌ల్లోనూ ఈయన ఎగ్జిక్యూటివ్‌గా పని చేశారు. అంతకు ముందు బిజినెస్ స్కూల్స్, భారత్‌లోని కొన్ని మేనేజ్మెంట్ ఇనిస్టిట్యూట్స్‌లో, సింగపూర్‌లో పని చేశారు. ఐఎఫ్ఎంఆర్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ డీన్‌గా కూడా వ్యవహరించారు. ప్రస్తుత సీఈఏకు ఆంధ్రప్రదేశ్‌తోనూ అనుబంధం ఉంది. క్రి(క్రె)యా యూనివర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్‌గానూ కొంతకాలం ఈయన పని చేశారు. తమిళనాడు మధురైలో స్కూలింగ్, కాలేజీ చదువులు పూర్తి చేసుకున్న నాగేశ్వరన్.. అహ్మదాబాద్ ఐఐఎం నుంచి ఎంబీఏ పూర్తి చేసుకున్నారు. 1994లో మస్సాషుసెట్స్ యూనివర్సిటీ నుంచి ఫైనాన్స్‌లో(empirical behaviour of exchange rates మీద) డాక్టరేట్ అందుకున్నారు. ఇదిలా ఉంటే ఎనకమిక్ సర్వే అనేది సాధారణంగా సీఈఏ ప్రిపేర్ చేస్తారు. కానీ, బడ్జెట్‌కు ముందు ఆ స్థానం ఖాళీగా ఉండడంతో ప్రిన్స్‌పల్ ఎకనమిక్ అడ్వైజర్, ఇతర అధికారులు సర్వే నివేదికను రూపొందించడం గమనార్హం. అంటే.. ఈ దఫా సర్వేలో సీఈఏ లేకుండానే రూపొందగా.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్రపతి ప్రసంగం అనంతరం దానిని ప్రవేశపెట్టారు. సంబంధిత వార్త: బడ్జెట్‌కు ముందే నాగేశ్వరన్ ఎంపిక.. ఎందుకు? -
ఇక బడ్జెట్‌పైనే ఆశలు..!
ముంబై: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపు (మంగళవారం) పార్లమెంట్లో ప్రవేశపెట్టే బడ్జెట్–2022–23కు అనుగుణంగానే ఈ వారం స్టాక్ మార్కెట్ కదలాడవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అదే రోజున జనవరి నెల వాహన విక్రయ, జీఎస్టీ, తయారీ రంగ గణాంకాలు విడుదల కానున్నాయి. ఈ కీలకాంశాలూ మార్కెట్‌కు దిశానిర్ధేశం చేయనున్నాయి. వీటితో పాటు ప్రపంచ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు, కంపెనీల క్యూ3 ఆర్థిక ఫలితాలు, రూపాయి ట్రేడింగ్, క్రూడ్ కదలికలు సూచీల ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపవచ్చు. ‘‘ప్రస్తుతం నిఫ్టీకి 16,850 వద్ద బలమైన మద్దతు స్థాయి ఉంది. అమ్మకాలు కొనసాగితే 16,000 వద్ద మరో కీలక మద్దతు ఉంది. షార్ట్ కవరింగ్ జరిగితే అప్‌ట్రెండ్‌లో 17,650 వద్ద కీలక నిరోధాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని రిలిగేర్ బ్రోకింగ్ వైస్ ప్రెసిడెంట్ అజిత్ మిశ్రా తెలిపారు. నాలుగు రోజులే ట్రేడింగ్ జరిగిన గతవారంలో సెన్సెక్స్ 1,837 పాయింట్లు, నిఫ్టీ 515 పాయింట్లు చొప్పున నష్టపోయాయి. మార్కెట్‌పై బడ్జెట్ ప్రభావెంత..? ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022 ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు పార్లమెంట్లో బడ్జెట్ 2022–23ను ప్రవేశపెట్టనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లలో అమ్మకాల ఒత్తిడి వేళ కేంద్ర బడ్జెట్ దేశీయ స్టాక్ మార్కెట్‌కు సరైన దిశానిర్ధేశం చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఈ ఏడాది బడ్జెట్ ‘‘స్థిరత్వంతో కూడిన వృద్ధి’’ అజెండాకు ప్రాధాన్యతనివచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్నుకు సంబంధించి ఉపశమనం లభించవచ్చని ఇన్వెస్టర్లు, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్లు ఆశిస్తున్నారు. ఈ పన్నును మినహాయిస్తే స్టాక్ మార్కెట్ ద్వారా ప్రైవేట్ పెట్టుబడులు ఊపందుకోవచ్చు. ఆదాయపు పన్ను మినహాయింపు, ఇంధన పన్నులపై కోత ఆశలు ఊరిస్తున్నాయి. బడ్జెట్ మార్కెట్‌కు అనుకూలంగా నిర్ణయాలుంటే సూచీలు తిరిగి ర్యాలీ చేయవచ్చు. ప్రతికూలంగా ఉంటే అమ్మకాలు పెరగవచ్చు. భయపెడుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు రష్యా– ఉక్రెయిన్ దేశాల మధ్య తలెత్తిన భౌగోళిక ఉద్రిక్తతలతో ఇటీవల ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఇరుదేశాల మధ్య వివాదం జఠిలం కావడంతో ముడిచమురు సరఫరాకు తీవ్ర ఆటంకం తలెత్తింది. దీంతో గతవారంలో బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర ఎనిమిదేళ్ల తర్వాత 90 డాలర్లకు చేరింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ముడిచమురు దిగుమతులపై ఆధారపడిన మనదేశంపై ద్రవ్యలోటు దవ్యోల్బణ భారాలు మరింత పెరగొచ్చు క్యూ 3 ఫలితాలు కీలక దశకు క్యూ3 ఫలితాల ప్రకటన అంకం దేశీయ కార్పొరేట్ కంపెనీలు క్యూ3 ఫలితాల ప్రకటన అంకం కీలక దశకు చేరుకుంది. సన్‌ఫార్మా, టాటా మోటార్స్, ఐఓసీ, అదానీ పోర్ట్స్, టెక్ మహీంద్రా, జిందాల్ స్టీల్, హెచ్డీఎఫ్సీ, అదానీ గ్రీన్ ఎనర్జీ, ఐటీసీ, అదానీ ట్రాన్స్పోర్ట్స్, గెయిల్, లుపిన్, టాటా స్టీల్, దివీస్ ల్యాబ్స్, శ్రీ సిమెంట్స్ సహా ఈ వారంలో మొత్తం 500 కంపెనీలు తమ డిసెంబర్ క్వార్టర్ ఫలితాలను వెల్లడించనున్నాయి. ఇన్వెస్టర్లు ఈ గణాంకాలపై దృష్టి సారించవచ్చు. స్టాక్ ఆధారిత ట్రేడింగ్‌కు అవకాశం ఉంది. స్థూల ఆర్థిక గణాంకాల ప్రభావం గతేడాది డిసెంబర్ నెలకు సంబంధించిన మౌలిక రంగ, కరెంట్ అకౌంట్ లోటు గణాంకాలు 2022 జనవరి 31న విడుదల కానున్నాయి. ఫిబ్రవరి 1న బడ్జెట్‌తో పాటు ఆటో కంపెనీల జనవరి వాహన విక్రయ గణంకాలు వెలువడతాయి. అదేరోజున తయారీ పీఎంఐ గణాంకాలు జనవరి జీఎస్టీ వసూళ్లు వెల్లడి కానున్నాయి. సేవారంగ పీఎంఐ డేటా గురువారం విడుదల అవుతుంది. వ్యవస్థ పనితీరును ప్రతిబింబింప చేసే ఈ స్థూల ఆర్థిక గణాంకాలు మార్కెట్ ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపగలవు. నాలుగో నెలా అమ్మకాలే ... ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీరేట్ల పెంపు భయాలతో విదేశీ ఇన్వెస్టర్లు ఈ జనవరి 3– 29 తేదీల మధ్య రూ. 28,243 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మేశారు. ఫలితంగా వరుసగా నాలుగో నెల విదేశీ ఇన్వెస్టర్లు నికర అమ్మకందారులుగా నిలిచారు. బ్యాంకింగ్ రంగ షేర్లలో అధికంగా అమ్మకాలకు పాల్పడినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాది బడ్జెట్ కేటాయింపు విదేశీ, దేశీ ఇన్వెస్టర్లకు సరైన దిశానిర్దేశం చేస్తుందని స్టాక్ నిపుణులు భావిస్తున్నారు. చదవండి: ప్రీ బడ్జెట్ డిమాండ్.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాల్సిందే.. -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాల్సిందే..
ముంబై: ‘‘ద్రవ్య స్థిరీకరణ ఆలస్యమైనా ఫర్వాలేదు. కరోనాతో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థకు, వినియోగ డిమాండ్‌కు మద్దతుగా ఆదాయపన్ను, ఇంధన పన్ను భారం తగ్గించడంపై దృష్టి సారించాలి’’ అని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ ఏజెన్సీ సూచించింది. ‘ప్రీ బడ్జెట్ డిమాండ్స్’ పేరుతో ఈ సంస్థ ఒక నివేదిక విడుదల చేసింది. ఫిబ్రవరి 1న 2022–23 బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి పార్లమెంట్లో ప్రవేశపెట్టనుండడం తెలిసిందే. కొత్తవి కాకుండా, గత బడ్జెట్లో ప్రకటించిన వాటి స్థిరీకరణపై ప్రభుత్వం దృష్టి సారించొచ్చని అంచనా వేసింది. డిమాండ్ పెంచేందుకు, కరోనాతో ఎక్కువ ప్రభావితమైన రంగాల్లో ఉపాధి కల్పన పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించింది. ఆర్థిక వ్యవస్థ పూర్తి స్థాయిలో కోలుకునే వరకు ద్రవ్యలోటు స్థిరీకరణ విషయంలో నిదానంగా వ్యవహరించాలని.. అదే సమయంలో ఆర్థిక వ్యవస్థకు కావాల్సినంత వ ుద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని సూచించింది. ఇతర సూచనలు - వ్యక్తుల ఆర్థిక పరిస్థితులపై కరోనా ప్రతికూల ప్రభావం చూపించింది. కనుక ఆదాయపన్ను ఉపశమనాలు, ఇంధనాలపై పన్నుల తగ్గింపు రూపంలో మద్దతుగా నిలవాలి. - అధిక ఇంధన ధరలు ద్రవ్యోల్బణానికీ కారణమవుతున్నాయి. - ప్రభుత్వం రూ.3 లక్షల కోట్ల మేర వ్యయాలను పెంచినా కానీ, ఆర్థిక వ్యవస్థలో ప్రత్యక్ష డిమాండ్ ఎందుకు పెరగలేదన్నది ఆర్థిక శాఖ విశ్లేషించుకోవాలి. అవసరమైన రంగాలకు ప్రభుత్వ మద్దతు ఇప్పటికీ అవసరం ఉందని ఇది తెలియజేస్తోంది. - 2022–23లో రెవెన్యూ వ్యయం.. 2021–22కు సవరించిన అంచనాలకంటే ఎక్కువే ఉండొచ్చు. - పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాలు మరింత ఆచరణాత్మకంగా ఉండాలి. - జీసెక్ ఈల్డ్స్‌ను కట్టడి చేయాలి. బడ్జెట్లో పేర్కొన్నదాని కంటే ప్రభుత్వం రుణ సమీకరణ ఎక్కువే ఉంటుందని మార్కెట్ అంచనా వేస్తోంది. చదవండి: నిర్మలమ్మా.. వీరి ఆశలన్నీ మీ పైనే! -
బడ్జెట్ సమావేశాల లైవ్ అప్డేట్స్: ఉభయ సభలు మంగళవారానికి వాయిదా
అప్డేట్స్ 04:00 PM ► కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం మధ్యాహ్నం 2021-22 ఆర్థిక సర్వేను రాజ్యసభలో ప్రవేశపెట్టారు. అనంతరం రాజ్యసభను ఫిబ్రవరి 1వ తేదీకి వాయిదా వేస్తున్నట్టు రాజ్యసభ చైర్మన్ ఎం.వెంకయ్యనాయుడు ప్రకటించారు. కాగా ఇంతకు ముందు ఆర్థిక సర్వేను మంత్రి నిర్మలా లోక్‌సభలో సమర్పించారు. 12: 55 PM ► కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ఎకానామిక్ సర్వే 2021-22 ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. 11: 55 AM ► పార్లమెంట్ సెంట్రల్ హల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 75 సంవత్సరాల ఆజాదీకా అమృత్.. ఒక పవిత్ర మహోత్సవమని వచ్చే 25 ఏళ్లు అదే స్ఫూర్తితో మనమంతా పనిచేయాలన్నారు. అదే విధంగా, వ్యాక్సిన్‌తో కరోనాను కట్టడి చేయబోతున్నామని తెలిపారు. ఫ్రంట్‌లైన్ వర్కర్ల సేవలు ప్రశంసనీయమన్నారు. దేశంలో పేదలకు ఉచితంగా రేషన్ సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ► భారత్ గ్లోబల్ మ్యాన్యుఫాక్చరింగ్ హబ్‌గా మారుతోందన్నారు. దేశంలో జీఎస్టీ వసూళ్లు బాగా పెరిగాయని పేర్కొన్నారు. భారీగా వస్తున్న ఎఫ్‌డీఐలు దేశ అభివృద్ధిని సూచిస్తున్నాయని తెలిపారు. మేకిన్ ఇండియాతో మొబైల్ పరిశ్రమ వృద్ధి చెందుతోందన్నారు. ► ఫసల్ బీమాతో సన్నకారు రైతులకు ప్రయోజం లభిస్తోందని తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి మహిళా సంఘాలకు రుణాలు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈల చేయూత కోసం 3 లక్షల కోట్ల రుణాలు కేటాయించినట్లు తెలిపారు. ► 7 మెగా టెక్స్టైల్ పార్క్‌లతో యువతకు భారీగా ఉద్యోగాల కల్పన చేసినట్లు రాష్ట్రపతి రామ్‌నాథ్ తెలిపారు. ఈ ఏడాది 10 రాష్ట్రాల్లో 19 బీటెక్ కాలేజీల్లో 6 స్థానిక భాషలలో బోధన జరుగుందని రామ్‌నాథ్ పేర్కొన్నారు. ► పీఎమ్‌గ్రామీణ సడక్ యోజనలతో రోజుకు 100 కి.మీ రహదారుల నిర్మాణం చేసినట్లు పేర్కొన్నారు. నదుల అనుసంధానంపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించిందని రాష్ట్రపతి రామ్‌నాథ్ తెలిపారు. ► ప్రస్తుతం భారతదేశం మూడో దశ కొవిడ్‌ను ఎదుర్కొంటుందన్నారు. భారత్‌లోనే మూడు వ్యాక్సిన్లు తయారవుతున్నాయని రాష్టపతి తెలిపారు. వ్యాక్సిన్ల ఉత్పత్తిలో భారత్ రెండో స్థానంలో ఉందని పేర్కొన్నారు. ఏడాది కాలంలో 160 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులు వేసినట్లు తెలిపారు. ప్రస్తుతం భారతదేశం మూడో దశ కోవిడ్‌ను ఎదుర్కొంటుందన్నారు. ► భారత్‌లోనే మూడు వ్యాక్సిన్లు తయారవుతున్నాయని రాష్ట్రపతి తెలిపారు. వ్యాక్సిన్ల ఉత్పత్తిలో భారత్ రెండో స్థానంలో ఉందని పేర్కొన్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియలో ప్రపంచానికి భారత్ ఆదర్శంగా నిలిచిందన్నారు. కోవిడ్ ఎదుర్కోవడానికి దేశ ఫార్మారంగం ఎంతో కృషి చేసిందన్నారు. ఫార్మా పరిశ్రమను విస్తరించేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ► పేదల ఆరోగ్యాన్ని పరిరక్షించడంలో ఆయుష్మాన్ భారత్ పథకం ఎంతో ఉపయోగపడిందన్నారు. డబ్ల్యూహెచ్‌వో తొలి ట్రెడిషనల్ మెడిసిన్ సెంటర్ భారత్‌లో ఏర్పాటు కాబోతుందని పేర్కొన్నారు. అదే విధంగా పద్మపురస్కారాలను సామాన్యుల వరకు తీసుకెళ్లినట్లు వివరించారు. ► ప్రధాని గరీబ్‌యోజన పథకం ద్వారా 19 నెలల పాటు పేదలకు ఉచితంగా రేషన్ ఇచ్చినట్లు తెలిపారు. ప్రపంచంలో భారత్ అతిపెద్ద ఆహార సరఫరా సంస్థ అని రాష్ట్రపతి తమ ప్రసంగంలో పేర్కొన్నారు. 11: 04 AM ► పార్లమెంట్లో ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగిస్తున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. భారతీయులకు స్వాతంత్ర్య, అమృతోత్సవ్ శుభాకాంక్షలు తెలిపారు. కరోనాపై భారత్ పోరాటం స్ఫూర్తిదాయకమన్నారు. 10: 54 AM ► పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలలో భాగంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పార్లమెంట్ భవనంకు చేరుకున్నారు. 10.: 45 AM పార్లమెంట్ ఆవరణలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. దేశాభివృద్ధికి ఇది కీలక సమయమని, బడ్జెట్ సమావేశాలకు విపక్షాలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా పెగాసస్, రైతు ఆందోళనలు, చైనా దురాక్రమణలు సహా పలు అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని విపక్షాలు సిద్ధమవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌పై దృష్టి సారించింది. సమావేశాలు ప్రారంభమయ్యే ముందు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌జోషీ, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు వేర్వేరుగా విపక్ష నేతలతో సమావేశమవుతారు. దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తున్న సమయంలోనే బడ్జెట్ సమావేశాలు జరగడం ఆసక్తికరంగా మారింది. బడ్జెట్ సమావేశాలు ఆయా రాష్ట్రాల ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశాలున్నాయని ఆర్థిక, రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రపతిగా కోవింద్ చివరి ప్రసంగం సోమవారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉభయ సభలను సంయుక్తంగా ఉద్దేశించి ప్రసంగిస్తారు. వచ్చే జూలైలో రాష్ట్రపతిగా కోవింద్ పదవీ కాలం పూర్తికానుంది. దీంతో ఈ సమావేశాలే ఆయన రాష్ట్రపతి హోదాలో చివరిగా ప్రసంగించే పార్లమెంట్ సమావేశాలు. రాష్ట్రపతి ప్రసంగానంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వే 2021–22ను, మంగళవారం(ఫిబ్రవరి 1) కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. బుధవారం నుంచి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదం తెలిపే అంశంపై చర్చ ఆరంభమవుతుంది. ఈ చర్చ సుమారు 4 రోజులు జరగవచ్చు. ఫిబ్రవరి 7న ఈ చర్చకు ప్రధాని బదులిస్తారు. తొలి దశ బడ్జెట్ సమావేశాలు జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు జరుగుతాయి. రెండో దశ సమావేశాలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు జరుగుతాయి. -
Budget 2022: జీఎస్టీ పరిధిలోకి నేచురల్ గ్యాస్..!
భారత్‌ను గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ వైపు పురోగతిని సాధించేందుకుగాను నేచురల్ గ్యాస్‌ను వస్తు సేవల పన్ను(జీఎస్టీ) పరిధిలోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని పెట్రోలియం ఇండస్ట్రీ కోరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నేచురల్ గ్యాస్ జీఎస్టీ పరిధికి వెలుపల ఉంది. ఈ ఇంధనంపై సెంట్రల్ ఎక్సైజ్ సుంకం, రాష్ట్ర వ్యాట్, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ వంటి పన్నులు వర్తిస్తాయి. జీఎస్టీ పరిధిలోకి..! ఆర్థిక మంత్రిత్వ శాఖకు తన ప్రీ-బడ్జెట్ మెమోరాండంలో, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పెట్రోలియం ఇండస్ట్రీ (FIPI), పర్యావరణ వ్యయాన్ని తగ్గించడంలో సహాయపడటానికి పైప్‌లైన్ ద్వారా సహజ వాయువు రవాణాపై అలాగే దిగుమతి చేసుకున్న ఎల్ఎన్జీ తిరిగి గ్యాసిఫికేషన్‌పై జీఎస్టీని హేతుబద్ధీకరించాలని డిమాండ్ చేసింది. దేశంలో ప్రాథమిక ఆయిల్ వ్యవస్థలో సహజవాయువు వాటాను కేంద్ర ప్రభుత్వం పెంచాలనుకున్న లక్ష్యాలు నేరవేరాలంటే కచ్చితంగా నేచురల్ గ్యాస్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ఆశించింది. నేచురల్ గ్యాస్‌పై పలు రాష్ట్రాలు 24.5 శాతం నుంచి 14 శాతం వరకు వ్యాట్‌ను విధిస్తోన్నాయి. నేచురల్ గ్యాస్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తే ధరలు భారీగా తగ్గే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నాయి. COP-26 లక్ష్యాలే ..! 2030 నాటికి నేచురల్ గ్యాస్ వాటాను 6.2 శాతం నుంచి 15 శాతానికి పెంచాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. సహజ వాయువును ఎక్కువగా ఉపయోగించడంతో ఇంధన ధర భారీగా తగ్గే అవకాశం ఉంది. దాంతో పాటుగా భారీ ఎత్తున కర్బన ఉద్గారాలు తగ్గుతాయి. COP-26 కట్టుబాట్లను చేరుకోవడంలో ఇది సహాయపడుతుంది. చదవండి: 69 ఏళ్ల తర్వాత టాటా గూటికి ఎయిర్ ఇండియా..! -
విశ్వనగరానికి అండగా నిలవండి: మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పురపాలక ప్రాజెక్టుల కోసం వచ్చే కేంద్ర బడ్జెట్లో తగినమేర నిధులు కేటాయించాలని మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్, వరంగల్ నగరాల్లో వ్యూహాత్మక రహదారులు, లింక్‌రోడ్లు, ఇతర అభివృద్ధి పథకాలకు కేంద్రం నుంచి అదనంగా సహాయం అందించాలని కోరారు. అభివృద్ధి పనుల కోసం రాష్ట్రం వేల కోట్లు వెచ్చిస్తోందని.. అందులో కేంద్రం తరఫున 15% నుంచి 33% వరకు భరించాలని, ఈ బడ్జెట్లో సుమారు రూ. 7,775 కోట్లు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం ఆయన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ రాశారు. కేటీఆర్ చేసిన విజ్ఞప్తులివీ.. హైదరాబాద్‌లో కేపీహెచ్‌బీ నుంచి కోకాపేట మీదుగా నార్సింగి వరకు ప్రతిపాదిత మాస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ (ఎంఆర్టీఎస్) ప్రాజెక్టుకు రూ.3,050 కోట్లు ఖర్చవుతుంది. అందులో కేంద్రం నుంచి 15 శాతం వాటాగా రూ. 450 కోట్లు కేటాయించాలి. సుమారు 30 కిలోమీటర్ల పొడవైన ఈ కారిడార్ ద్వారా 2030 నాటికి 5 లక్షల మంది ప్రయాణించే అవకాశం ఉంటుంది. వ్యూహాత్మక రహదారి అభివృద్ధి పథకం (ఎస్ఆర్డీపీ), మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, తూర్పు–పడమర ఎక్స్‌ప్రెస్ వే, రక్షణ శాఖ పరిధిలోని ప్రాంతాల్లో బ్రిడ్జి లు, స్కైవేలకు కలిపి రూ.34,500 కోట్లు ఖర్చవుతుంది. ఇందులో కేంద్రం తన వంతుగా 10% అంటే రూ. 3,450 కోట్లను బడ్జెట్లో కేటాయించాలి. వరంగల్ మెట్రో నియో ప్రాజెక్టుకు రూ.184 కోట్లు నిధులు మంజూరు చేయండి. ‘మేక్ ఇన్ ఇం డియా, ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్’పాలసీలకు అనుగుణంగా.. తెలంగాణ ప్రభుత్వం మెట్రో–ని యో కోచ్‌ల తయారీ అవకాశాలను పరిశీలిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం వ్యూహాత్మకంగా.. రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, మోడల్ కారిడార్స్ డెవలప్మెంట్, హైదరాబాద్ అర్బన్ అగ్లోమరేషన్లో భాగంగా రవాణా నెట్‌వర్క్‌ను మెరుగుపర్చే చర్యలకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు 22మిస్సింగ్ లింక్ రోడ్లను అభివృద్ధి చేశాం. మరో 17 రోడ్లకు వివిధ దశల్లో పనులు జరుగుతున్నాయి. ఇవికాకుండా 104 అదనపు కారిడార్లు అభివృద్ధి చేస్తున్నాం. వీటన్నింటికి రూ. 2,400 కోట్లు అవుతుందని అంచనా. అందులో మూడో వంతు కింద రూ.800 కోట్లను కేంద్ర సాయంగా ఇవ్వండి. హైదరాబాద్ నగరంతోపాటు ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో మురుగునీటి శుద్ధి కోసం రూ. 8,684.54 కోట్లు వెచ్చిస్తున్నాం. ఇం దులో రూ. 2,891 కోట్లు (మూడోవంతు) కేంద్రం నుంచి కేటాయించాలి. -
కేంద్ర బడ్జెట్లో పేదల సబ్సిడీలు, సంక్షేమానికి కోత..!
కరోనా మహమ్మారి కారణంగా భారతదేశం మునుపెన్నడు లేని సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. గత రెండేళ్లుగా ఈ మహమ్మారి వల్ల దేశంలోని దిగువ మధ్యతరగతి, పేదల ఆదాయం పడిపోవడంతో పుట గడవడమే కష్టం అవుతుంది. జనజీవనం ఇప్పుడిప్పుడే కుడుటపడుతున్న తరుణంలో మరోసారి విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర బడ్జెట్‌ను వచ్చే నెలలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ బడ్జెట్లో స్వల్పకాలం ఊరట కల్పించే పథకాల ప్రకటన కన్నా దీర్ఘకాలంలో దేశాభివృద్ధికి బాటలు వేసే వ్యవస్థీకృత కార్యక్రమాలపై కేంద్రం దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అందుకే, ప్రభుత్వం పేదలకు అందించే సబ్సిడీలను 2022-23లో కట్ చేయాలని చూస్తున్నట్లు ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది. రాబోయే బడ్జెట్లో ఆహార, ఎరువుల సబ్సిడీలను వరుసగా రూ.2.60 లక్షల కోట్లు, రూ.90,000 కోట్లుగా కేటాయించాలని భావిస్తున్నారు. ఇది ఆర్థిక సంవత్సరం 2022 కోసం సవరించిన అంచనాల కంటే చాలా తక్కువ. ఎకనామిక్ టైమ్స్ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సబ్సిడీ బిల్లు మొత్తం సుమారు రూ.5.35-5.45 లక్షల కోట్లు ఉండే అవకాశం ఉందని, వచ్చే ఆర్థిక సంవత్సరం ఆ మొత్తాన్ని తగ్గించడానికి ప్రభుత్వం చూస్తున్నట్లు అధికారులు తెలిపారు. గత బడ్జెట్లో ప్రకటించిన జిడిపిలో ఆర్థిక లోటు 6.8 శాతం కంటే ఎఫ్వై23 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక లోటు స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)లో 6.5 శాతంగా ఉంటుందని ఒక అధికారి తెలిపారు. మన ఆర్థిక లక్ష్యాల మేరకు ఆహారం, ఎరువులపై సబ్సిడీలను సవరించే అవకాశం ఉన్నట్లు ఆ అధికారి తెలిపారు. (చదవండి: అదిరిపోయిన స్పోర్ట్స్ ఎలక్ట్రిక్ బైక్.. దీని రేంజ్, ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!)