Parliament Union Budget Session 2022: FM Nirmala Sitharaman Speech Highlights - Sakshi
Sakshi News home page

Budget 2022 Speech Highlights: డిజిటల్‌ భారత్‌ ప్రధానంగా మోదీ సర్కార్‌ రాయితీలు, కేటాయింపులు

Published Tue, Feb 1 2022 11:55 AM | Last Updated on Tue, Feb 1 2022 1:08 PM

Union Budget 2022 Live FM Speech From Parliament Telugu - Sakshi

నాలుగోసారి పార్లమెంట్‌లో ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టారు. కరోనా సమయంలో మరో బడ్జెట్‌ ప్రవేశపెడుతున్నట్లు ప్రసంగం మొదలుపెట్టారు ఆమె. ఈ ఏడాది వృద్ధి రేటు 9.2 శాతం దాటుతుందని అంచనా. వృద్ధి రేటులో ముందున్నామని నిర్మలా సీతారామన్‌ ప్రకటించుకున్నారు. వ్యాక్సినేషన్‌ క్యాంపెయిన్‌జోరుగా సాగుతోంది. కొవిడ్‌ కట్టడిలో వ్యాక్సినేషన్‌ కీలకంగా వ్యవహరించిందని పేర్కొన్నారు ఆర్థిక మంత్రి. 

ఆత్మనిర్భర్‌ స్ఫూర్తితో ముందుకు సాగనున్నట్లు నిర్మలా సీతారామన్‌ తెలిపారు. వంట నూనె దేశీయంగా తయారీపై దృష్టి. వెయ్యి లక్షల మెట్రిక్‌ టన్నుల వరిని సేకరిస్తామన్నారు. బడ్జెట్‌ ప్రసంగంలో కీలకాంశాలు కొన్ని.. 

పీఎం ఆవాస్‌ యోజన కింద 18 లక్షల ఇళ్లు. 48 వేల కోట్లు కేటాయింపు. 75 జిల్లాలో 75 డిజిటల్‌ బ్యాంకింగ్‌ కేంద్రాలు. తృణ ధాన్యాల సంవత్సరంగా 2023. 

యాప్‌లో ప్రజలకు అందుబాటులో బడ్జెట్‌.  వచ్చే ఐదేళ్లలో మేకిన్‌ ఇండియాలో భాగంగా 60 లక్షల ఉద్యోగాల కల్పనే ప్రణాళికగా ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి ప్రకటించారు. ఇంటి ఇంటికి మంచి నీటి కోసం 60 వేల కోట్ల కేటాయింపు.

వ్యవసాయ రంగానికి ఆధునిక టెక్నాలజీని ఉపయోగం, భూ రికార్డులను డిజిటలైజేషన్‌. డ్రోన్‌లతో పంట పొలాల పరిరక్షణ. సేంద్రీయ వ్యవసాయానికి ప్రత్యేక రాయితీల ప్రకటన.  పీఎం ఈ విద్య కోసం 200 ఛానెల్స్‌. ప్రాంతీయ భాషల్లో విద్యాబోధన.. 1.12 తరగతులకు వర్తింపు. 

ఆతిథ్య రంగానికి రూ. 5 లక్షల కోట్ల కేటాయింపులు. మైక్రో, చిన్నతరహా కంపెనీలకు 2 లక్షల కోట్ల కేటాయింపులు. ఎంఎస్‌  ప్రత్యేకంగా డిజిటల్‌ యూనివర్సిటీ. స్టార్టప్‌లకు 2 లక్షల కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. దేశంలో 4 మల్టీమోడల్‌ లాజిస్టిక్‌ పార్క్‌లు. అంగన్‌వాడీ 2.0 కింద 2 లక్షల అంగన్‌వాడీ కేంద్రాల ఆధునీకరణ. 

తెలుగు స్టేట్స్‌లో నదుల అనుసంధానంపై ప్రణాళిక. త్వరలో కృష్ణ గోదావరి, కృష్ణ పెన్నా నదుల అనుసంధానం. పెన్నా-కావేరి నదుల అనుసంధానానికి ప్లాన్‌. గంగా నదీ తీరంలో 5 కిలోమీటర్ల​ మేర సేంద్రీయ సాగు.

అన్ని పోస్టాఫీసుల్లో బ్యాంకింగ్‌ సేవలు(నెట్‌బ్యాంకింగ్‌, ఏటీఎం సహా) అందుబాటులోకి. ఇకపై చిప్‌ ఆధారిత పాస్‌ పోర్టులు. కొత్తగా ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ 2.0

డిజిటల్‌ పేమెంట్‌, నెట్‌బ్యాంకింగ్‌ సేవలకు ప్రోత్సాహకాలు. గతిశక్తి కార్గొ టెర్మినళ్ల నిర్మాణం. కొత్త రహదారుల నిర్మాణం. పేద, మధ్య తరగతి సాధికారికత కోసం ప్రభుత్వం కృసి చేస్తోందని నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. 

2022 నాటికి 5జీ స్పెక్ట్రం వేలం పూర్తి చేసే యోచన. 2023 నుంచి 5జీ సేవలు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం. 

► ప్రజా రవాణాలో ప్రత్యామ్నాయ ఇంధనలకు ప్రముఖ స్థానం. ఈ-వెహికల్స్‌ ప్రోత్సహకంలో భాగంగా హైవేలపై బ్యాటరీలు మార్చుకునే సదుపాయం. సోలార్‌ ఎనర్జీ ఉత్పత్తి కోసం 19,500 వేల కోట్ల రూ. కేటాయింపు.

అన్ని కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో కాగిత రహిత విధానం. మానసిక ఆరోగ​ వ్యవస్థ కోసం జాతీయ విధానం. 10 రంగాల్లో క్లీన్‌ఎనర్జీ యాక్షన్‌ ప్లాన్‌. ఎగుమతుల ప్రోత్సాహకానికి కొత్త చట్టం. వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలకు ప్రత్యేక స్టార్టప్‌లు. (చదవండి: Budget 2022 Highlights)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement