
FM Nirmala Sitharaman Budget Speech Time: ఆర్థిక మంత్రి హోదాలో నాలుగోసారి లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్. 62 ఏళ్ల నిర్మలమ్మ 92 నిమిషాలపాటు ప్రసంగించారు. అయితే గతంతో పోలిస్తే ఈ దఫా ఆమె బడ్జెట్ ప్రసంగం త్వరగానే ముగించేశారు.
2019 బడ్జెట్ ప్రసంగం 2 గంటల 17 నిమిషాలపాటు ప్రసంగించి.. గతంలో జశ్వంత్ సింగ్(2003లో ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు 2 గంటల 15 నిమిషాలు ప్రసంగించారు) రికార్డును బద్ధలు కొట్టారామె. ఆపై 2020లో 2 గంటల 42 నిమిషాలు(భారత్ సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం!), 2021లో గంటా నలభై నిమిషాలపైనే, ఇప్పుడు గంటా 32 నిమిషాలపాటు ఆమె ప్రసంగించారు. సాధారణంగా బడ్జెట్ ప్రజంటేషన్ నిడివి 90 నిమిషాల నుంచి 120 నిమిషాలు(రెండు గంటలుగా ఉంటుంది).
ఇక కేంద్ర బడ్జెట్ 2022 లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. 2022-23 మొత్తం బడ్జెట్ విలువ రూ. 39 లక్షల 45 వేల కోట్లు. 2022-23 మొత్తం వనరుల సమీకరణ రూ. 22.84 లక్షల కోట్లు కాగా.. ద్రవ్యలోటు 6.9 శాతం ఉంది. రూ.17 లక్షల కోట్ల లోటు బడ్జెట్‌గా తేలింది.ఇక బడ్జెట్ సెషన్ రెండో దశ మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు కొనసాగనున్న విషయం తెలిసిందే.