budget speech
-
Interim Budget 2024: నేడే బడ్జెట్
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల సమరశంఖం పూరించకముందే ఎన్నికల తాయిలాలతోపాటు సామాన్య ప్రజానీకం ఆశలను సాకారం చేస్తుందని అంతా భావిస్తున్న కేంద్ర మధ్యంతర బడ్జెట్ ఈరోజే పార్లమెంట్ ముందుకురానుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉదయం 11 గంటల సమయంలో నూతన పార్లమెంట్ భవనంలోని లోక్‌సభలో ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ముందుగా బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయానికి మంత్రి నిర్మల చేరుకుంటారు. బడ్జెట్ రూపకల్పనలో భాగస్వాములైన ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో కలిసి ఆమె రాష్ట్రపతి భవన్‌కు వెళ్తారు. ఉదయం 9.30 నిమిషాలకు రాష్ట్రపతిని కలిసి బడ్జెట్ గురించి వివరించి ఆమె అనుమతిని తీసుకోనున్నారు. ఆ తర్వాత ఉదయం 10 గంటలకు నూతన పార్లమెంట్ భవనానికి నిర్మల, ఆర్థిక శాఖ ఉన్నతాధికారుల బృందం చేరుకుంటుంది. బడ్జెట్ సమర్పణకు ముందు ఉదయం పార్లమెంట్ ఆవరణలో కేంద్ర మంత్రి మండలి ఒకసారి భేటీకానుంది. ఈ భేటీలోనే మధ్యంతర బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. ఆ తర్వాత ఉదయం 11 గంటలకు మంత్రి లోక్‌సభలో అడుగుపెడతారు. బడ్జెట్ ప్రతులను చదివి ఆయా శాఖలకు నిధుల కేటాయింపులుసహా సమగ్ర బడ్జెట్ స్వరూపాన్ని ఆవిష్కరిస్తారు. లోక్‌సభలో ఆమె బడ్జెట్ ప్రసంగం పూర్తయ్యాక ఆయా పద్దుల ప్రతులను రాజ్యసభలో సభ్యులకు అందజేస్తారు. నిర్మల ఇలా బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం వరసగా ఆరోసారి. గురువారం నాటి బడ్జెట్‌తో కలుపు కుని ఐదు పూర్తి బడ్జెట్లు, ఒక మధ్యంతర బడ్జెట్‌ను ఆమె ప్రవేశపెట్టినవారవుతారు. దీంతో గతంలో మాజీ ప్రధాన మంత్రి మొరార్జీ దేశాయ్ పేరిట ఉన్న రికార్డును నిర్మల సమంచేయనున్నారు. మన్మోహన్ సింగ్, అరుణ్ జైట్లీ, చిదంబరం, యశ్వంత్ సిన్హాలు ఐదు సార్లే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ మెరుపులు ఉంటాయా ? అద్భుత ప్రకటనలు ఆశించవద్దని విత్త మంత్రి విస్పష్టంగా చెప్పారు. మధ్యంతర బడ్జెట్లో ప్రకటించే నూతన పథకాల అమలు బాధ్యత కొత్త ప్రభుత్వానిదే. అయినాసరే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మధ్యంతర బడ్జెట్లోనూ కొన్ని ఎన్నికల తాయిలాలు ప్రకటించే ధోరణి ఏనాడో మొదలైంది. 2004లో ఇదే ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో 50 శాతం డియర్నెస్ అలవెన్స్‌ను మూలవేతనంతో కలుపుతున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. ప్రణబ్ ముఖర్జీ, పీయుశ్ గోయల్ ఆర్థిక మంత్రిగా ఉన్నపుడూ ఇలాంటి ప్రకటనలు వెలువడ్డాయి. అందుకే ఈసారీ బడ్జెట్ ఊరటలు ఉంటాయని జనం గట్టిగా నమ్ముతున్నారు. పెట్రోల్, డీజిల్‌పై సుంకం తగ్గించి ధరలు కాస్తంత కిందకు దించడం, పీఎం–ఆవాస్ యోజన తరహా కొత్త పథకం, విద్యుత్ వాహనాలకు రాయితీ పొడిగింపు వంటి ‘ఆర్థిక సాయం’ కోసం మధ్యతరగతి వర్గాలు ఆత్రంగా ఎదురుచూస్తున్నాయి. పన్ను శ్లాబులను సరళీకరిస్తే బాగుంటుందని ఆశిస్తున్నారు. ఆరోసారి పద్దుల చిట్టాతో పార్లమెంట్ గడప తొక్కుతున్న విత్తమంత్రి ఏమేరకు జనాలపై అద్భుత పథకాల పన్నీరు చల్లుతారో చూడాలి మరి. -
నిర్మలా సీతారామన్ మరో రికార్డు, ఎక్కువగా వాడిన పదాలు ఏంటో తెలుసా?
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ప్రెజెంటేషన్ సందర్భంగా ఆమె మరో రికార్డు క్రియేట్ చేశారు. వరుసగా ఐదోసారి కేంద్ర బడ్జెట్‌ను సమర్పించిన ఆమె ఈ సారి బడ్జెట్‌ను కేవలం 87 నిమిషాల్లో (గంటా 27 నిమిషాల్లో) ముగించారు. తద్వారా అతి తక్కువ సమయం బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డును క్రియేట్ చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం 2023-24 బడ్జెట్‌ను దాదాపు 16236 పదాలతో అతి చిన్న బడ్జెట్ ప్రసంగం చేశారు. సాధారణంగా కనీసం 2 గంటల పాటు జరిగే బడ్జెట్ ప్రసంగాలలో ఇది అతి చిన్నది. భారతదేశ చరిత్రలో అతి ఎక్కువ ,తక్కువ బడ్జెట్ ప్రసంగాలు ►ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2020 బడ్జెట్ ప్రసంగంలో 2 గంటల 42 నిమిషాల పాటు ప్రసంగించారు. ఇది బడ్జెట్ ప్రసంగాల చరిత్రలో సుదీర్ఘమైనది. వ్యవధి పరంగా సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డును సీతారామన్ సొంతం చేసుకున్నారు. ► భారత తొలి (పూర్తి) మహిళా ఆర్థిక మంత్రి సీతారామన్, 2019లో తన తొలి బడ్జెట్ ప్రసంగంలో, 2 గంటల 17 నిమిషాలు మాట్లాడారు. ఇంకా రెండు పేజీలు మిగిలి ఉన్నప్పటికీ, అస్వస్థతకు గురై తన ప్రసంగాన్ని కుదించుకుని ప్రసంగంలో మిగిలిన భాగాన్ని చదివినట్లుగా పరిగణించాలని ఆమె స్పీకర్‌ను కోరారు. ►ఆ తరువాత ఫిబ్రవరి 1, 2020న 2020-21 కేంద్ర బడ్జెట్‌ను సమర్పిస్తూ 2 గంటల 42 నిమిషాల పాటు ప్రసంగించి తన రికార్డును తానే బద్దలు కొట్టారు. 2021లో ఆమె గంటా 50 నిమిషాల పాటు ప్రసంగించారు. ►ఇక మాజీ ఆర్థిక మంత్రి జస్వంత్ సింగ్ తన 2003 బడ్జెట్ ప్రసంగంలో 2 గంటల 13 నిమిషాల పాటు ప్రసంగించారు. ►మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన 2014 బడ్జెట్ ప్రసంగంలో 2 గంటల 10 నిమిషాల పాటు ప్రసంగించారు. ► పదాల గణన పరంగా, 1991లో మన్మోహన్ సింగ్ సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం చేశారు. ప్రసంగంలో 18,650 పదాలు ఉన్నాయి. కాగా రానున్న ఎ న్నికలు, మోదీ సర్కార్‌కు చివరి బడ్జెట్ కావడంతో పన్ను చెల్లింపు దారులకు భారీ ఊరట కల్పించారు. అలాగే వేతన జీవుల ఆదాయ పన్నుల ట్యాక్స్ శ్లాబ్స్‌లో మార్పులు తీసుకొచ్చారు. పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రసంగంలో పన్ను, అభివృద్ధి, రాష్ట్రాలు, ఆదాయం , ఆర్థిక పదాలు ఎక్కువగా ఉపయోగించగా. పన్ను అనే పదాన్ని ఎక్కువగా 51 సార్లు, అభివృద్ధి 28 సార్లు, రాష్ట్రాలు 27 సార్లు, ఆదాయం 26 సార్లు, ఫైనాన్స్ అనే పదాన్ని 25 సార్లు ఉపయోగించారు. స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు అయిన నేపథ్యంలో అన్ని వర్గాల అభివృద్ధికి దోహదపడే అమృత్కాల్ బడ్జెట్ అనే పదాన్ని కూడా ఎక్కువగానే ప్రస్తావించారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_5371520960.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం ఎంతసేపు సాగిందంటే..
FM Nirmala Sitharaman Budget Speech Time: ఆర్థిక మంత్రి హోదాలో నాలుగోసారి లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్. 62 ఏళ్ల నిర్మలమ్మ 92 నిమిషాలపాటు ప్రసంగించారు. అయితే గతంతో పోలిస్తే ఈ దఫా ఆమె బడ్జెట్ ప్రసంగం త్వరగానే ముగించేశారు. 2019 బడ్జెట్ ప్రసంగం 2 గంటల 17 నిమిషాలపాటు ప్రసంగించి.. గతంలో జశ్వంత్ సింగ్(2003లో ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు 2 గంటల 15 నిమిషాలు ప్రసంగించారు) రికార్డును బద్ధలు కొట్టారామె. ఆపై 2020లో 2 గంటల 42 నిమిషాలు(భారత్ సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం!), 2021లో గంటా నలభై నిమిషాలపైనే, ఇప్పుడు గంటా 32 నిమిషాలపాటు ఆమె ప్రసంగించారు. సాధారణంగా బడ్జెట్ ప్రజంటేషన్ నిడివి 90 నిమిషాల నుంచి 120 నిమిషాలు(రెండు గంటలుగా ఉంటుంది). ఇక కేంద్ర బడ్జెట్ 2022 లోక్‌సభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. 2022-23 మొత్తం బడ్జెట్ విలువ రూ. 39 లక్షల 45 వేల కోట్లు. 2022-23 మొత్తం వనరుల సమీకరణ రూ. 22.84 లక్షల కోట్లు కాగా.. ద్రవ్యలోటు 6.9 శాతం ఉంది. రూ.17 లక్షల కోట్ల లోటు బడ్జెట్‌గా తేలింది.ఇక బడ్జెట్ సెషన్ రెండో దశ మార్చి 14 నుంచి ఏప్రిల్ 8 వరకు కొనసాగనున్న విషయం తెలిసిందే. -
సీతారామన్...సుదీర్ఘ ప్రసంగం!
న్యూఢిల్లీ: కశ్మీరీ కవిత, తమిళ కవుల పలుకులు ఉటంకిస్తూ, సింధు నాగరికతను గుర్తు చేసుకుం టూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం చేశారు. దీంతో రికార్డు బడ్జెట్ ప్రసంగం చేసిన ఆర్థిక మంత్రిగా చరిత్ర సృష్టించారు. శనివారం పార్లమెంట్లో నిర్మల దాదాపు 2 గంటల 42 నిమిషాల మేర బడ్జెట్ ప్రసంగం చేశారు. దీంతో గతంలో ఆమె పేరునే ఉన్న సుదీర్ఘ ప్రసంగం రికార్డును బద్దలు కొట్టారు. చివరలో కొంచెం అస్థత్వత కలగడంతో చివరి పేజీ లను చదవకుండా వదిలేశారు. లేదంటే నిర్మలమ్మ ప్రసంగం మూడు గంటలు దాటి ఉండేదే! గతేడాది జూలైలో నిర్మల తన తొలి బడ్జెట్ ప్రసంగం చేశారు. ఆ సమయంలో ఆమె 2 గంటల 17 నిమిషాల పాటు బడ్జెట్ ప్రసంగం చేసి రికార్డు సృష్టించారు. తిరిగి ఈ రోజు ఆమే తన రికార్డు బ్రేక్ చేశారు. గతంలో 2003లో అప్పటి ఆర్థిక మంత్రి జస్వంత్ సింగ్ దాదాపు 2గంటల 13 నిమిషాల ప్రసంగం చేశారు. అంతకుముందు 1991లో అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్ చేసిన ప్రసంగం కూడా సుదీర్ఘమైనదే! తాజా ప్రసంగంలో కశ్మీర్‌కు చెందిన కవితను అటు కశ్మీరీ, ఇటు హిందీలో ఆమె ఉటంకిం చారు. దీనికితోడు కాళిదాస విరచిత రఘువంశంలోని శ్లోకాన్ని, ప్రముఖ తమిళకవి తిరువళ్లువర్ రచనలను ఆమె తన ప్రసంగంలో గుర్తు చేసుకున్నారు. పలు సందర్భాల్లో ప్రధాని మోదీ సహా అధికారపక్ష సభ్యులు బల్లలు చరిచి ఆమెను ప్రశంసించారు. బేటీ బచావో పథకం ప్రస్తావనతో పాటు పలు అంశాల వద్ద ప్రతిపక్షాలు ఆమె ప్రసంగానికి అడ్డుతగిలాయి. సుదీర్ఘ ప్రసంగం చివరలో అలసిన ఆమె తన మిగతా ప్రసంగం పూర్తయినట్లు భావిం చాలని స్పీకర్‌ను కోరి కూర్చుండిపోయారు. సీతారామన్ షుగర్ లెవల్స్ పడిపోవడంతో పక్కనే కూర్చున్న మంత్రి గడ్కరీ ఆమెకు చాక్లెట్ ఇచ్చారు. కాగా, ఆరోగ్యం, సంతోషం, సంపద, ఉత్పత్తి, భద్రత.. ఈ ఐదు ఒక దేశ అందమైన ఆభరణాలు’ అని ప్రఖ్యాత తమిళ కవి తిరువళ్లువార్ కవితా పం క్తులను ఆమె ఉటంకించారు. ప్రసంగం అనంతరం మోదీ నిర్మలను ప్రశంసించడం కనిపించింది. -
యనమలా ఏందిలా..!?
సాక్షి, అమరావతి: ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మంగళవారం తన బడ్జెట్ ప్రసంగంలో పలుమార్లు తడబడ్డారు. పలు పదాలను తప్పుగా ఉచ్ఛరించారు. సవాళ్లను.. శవాలు అని పలికారు. కొన్నిసార్లు చదివిన లైన్లే మళ్లీ చదివారు. కింది లైన్లను పైన, పై వాటిని కింద చదివి కలగాపులగం చేశారు. బడ్జెట్ ప్రసంగాన్ని చదవడం ప్రారంభించిన యనమల ఆదిలోనే పిల్లల బట్టల కుట్టుకూలిని.. కట్టుకూలి అంటూ తడబడ్డారు. ఆ పరంపర చివరి వరకు కొనసాగింది. చక్కటి జీవనాన్ని.. చీకటి అని సంభోదించారు. యువతను యవత, కేటాయింపుల్ని కేటింపుగా చదివారు. చర్చీల నిర్మాణాన్ని చర్చల నిర్మాణాలుగా, ప్రమాదాన్ని ప్రధమంగా చదివారు. చివరకు ఆయన రోజూ ఉచ్ఛరించే దారిద్య్ర రేఖను, ప్రోత్సాహకాలను, కేంద్రీకృతం వంటి పదాలను సైతం తప్పుగా పలికారు. ఓ దశలో ఈ చర్య అనడానికి బదులు ఈ చర్మ అనేశారు. హాలిడేను హోలీడేగా, షీ టీమ్‌ను టీ టీమ్‌గా, వ్యవసాయాన్ని వ్యవస్థాగతంగా మార్చేశారు. దాదాపు 25 పదాలను ఆయన తప్పుగా చదివారు. -
హౌ ఈజ్ ద జోష్..?
న్యూఢిల్లీ: బడ్జెట్ సందర్భంగా సభలో పలు ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్ ప్రసంగం దాదాపు ఉత్సాహంగా సాగింది. ఇటీవల సూపర్ హిట్ అయిన బాలీవుడ్ సినిమా ‘ఉడీ.. ది సర్జికల్ స్ట్రైక్స్’ను ప్రస్తావిస్తూ.. ‘హౌ ఈజ్ ద జోష్?’అంటూ విపక్ష సభ్యుల్ని బీజేపీ నేతలు ప్రశ్నించారు. పీయూష్ గోయల్ రైతులకు నగదు బదిలీ పథకం, ఆదాయ పన్ను మినహాయింపులు వంటి పలు కీలక ప్రకటనలు చేస్తున్నప్పుడు బీజేపీ సభ్యులు మోదీ.. మోదీ అంటూ నినాదాలు చేస్తూ, బల్లలు చరుస్తూ స్వాగతించారు. సాధారణంగా ఆర్థిక మంత్రులు బడ్జెట్ ప్రసంగాన్ని చదవడానికే పరిమితమవుతుంటారు. అయితే ఇందుకు భిన్నంగా పీయుష్ గోయల్ కీలక ప్రకటనలు చేస్తున్నప్పుడు విపక్ష సభ్యుల్ని ఉద్దేశించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్ అజెండా గురించి పీయూష్ ప్రస్తావిస్తూ ‘నేను ఉడీ సినిమా చూశాను. అందులో మంచి జోష్ ఉంది..’అంటూ నర్మగర్భంగా వ్యాఖ్యా నించారు. మరోవైపు న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో పాటు మరికొందరు బీజేపీ సభ్యులు సైతం ‘హౌ ఈజ్ ద జోష్?..’అంటూ కాంగ్రెస్ నేతలను వ్యంగ్యంగా ప్రశ్నించారు. పీయూష్ రూ.5 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ప్రకటన చేయగానే బీజేపీ సభ్యులు బల్లల చరుస్తూ.. మోదీ, మోదీ అంటూ నినాదించారు. దీంతో నిమిషం పాటు గోయల్ తన ప్రసంగాన్ని ఆపారు. ప్రధాని కూడా పలు ప్రకటనలప్పుడు బల్లను కొడుతూ సంతోషం వ్యక్తం చేశారు. బడ్జెట్ ప్రవేశపెట్టడం పూర్తయిన తర్వాత గోయల్ మోదీ వైపు తిరిగి నవ్వుతూ నమస్కారం చేశారు. అనంతరం మోదీ చిరునవ్వుతో గోయల్ వద్దకు వెళ్లి వెన్నుతట్టి అభినందించారు. కాగా, తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు బిగ్గరగా నవ్వుతూ పీయూష్ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. సభ ప్రారంభమవ్వడానికి ఐదు, ఏడు నిమిషాల ముందు లోపలికి వచ్చిన గోయల్ కేంద్ర మంత్రు లు నితిన్ గడ్కరీ, ఉమా భారతి, బీజేపీ సీనియర్ నేత శాంత కుమార్ల పాదాలకు నమస్కారం చేసి.. ఆశీర్వాదం తీసుకున్నారు. బడ్జెట్ ప్రసంగం ముగిసిన తర్వాత చాలా మంది ఎంపీలు గోయల్ వద్దకు వెళ్లి అభినందించారు. అదే సమయంలో విజిటర్స్ గ్యాలరీలో నిల్చొని ఉన్న తన కుటుంబసభ్యుల్ని చేయి ఊపుతూ పలకరించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కొద్దిసేపు సభ నుంచి బయటకు వెళ్లారు. దీంతో పలువురు బీజేపీ నేతలు ‘రాహుల్ పారిపోయాడు’అంటూ ఎగతాళి చేశారు. యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ విప్ జ్యోతిరాదిత్య సింథియా, డిప్యూటీ స్పీకర్ ఎం.తుంబిదురై సభకు గైర్హాజరయ్యారు. -
ఆశల గాలి ఊసుల కలనేత
బడ్జెట్ ఉపన్యాసం ఆశలతో నిండి ఉంది గానీ, గణాంకాలు మాత్రం పూర్తిగా భిన్నమైన చిత్రాన్ని చూపుతున్నాయి. రైతుల ఆదాయాలను వచ్చే ఐదేళ్లలో రెట్టింపు చేయాలని బడ్జెట్ ఆకాంక్షించింది. కానీ కనీస మద్దతు ధరలను పెంచకుండా ఇది ఎలా సాధ్యం?. జీడీపీ 7.1 శాతానికి పడిపోవడం దుర్వార్త. మొత్తంగా చూస్తే పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దురదృష్టవశాత్తూ, 2016–17 సవరించిన అంచనాలతో పోలిస్తే 2017–18లో రాబడుల వృద్ధి 5.5 శాతమనే అంచనా అత్యంత నిరుత్సాహకరంగా ఉన్నదని చెప్పాలి. మొత్తంగా చూస్తే ఈ ఏడాది బడ్జెట్లో పెద్దగా చెప్పుకోవలసింది ఏమీ లేదు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ప్రస్తావనగానీ, విశాఖపట్నం రైల్వే జోన్ ప్రస్తావనగానీ లేదు. అలాగే ఏపీ రాజధాని నగరానికిగానీ లేదా వైజాగ్–చెన్నై పారిశ్రామిక కారిడార్‌కు గానీ పెద్దగా కేటాయింపులు జరిపినట్టు అనిపిం చడం లేదు. పెద్ద నోట్ల రద్దు ఆర్థిక వ్యవస్థపై చూపిన తీవ్ర దుష్ప్రభావాన్ని గురించి బడ్జెట్ వివరంగా చర్చించలేదు. మొట్టమొదటిసారిగా విడిగా రైల్వే బడ్జెట్‌ను ప్రవేశపెట్టలేదు. అది సాధారణ బడ్జెట్లో భాగంగా మారింది. స్వాతంత్య్రానంతర కాలంలో మొదటిసారిగా ఈ బడ్జెట్లో ప్రణాళిక, ప్రణాళికేతర వ్యయాల పద్దులు లేవు. ఆ వర్గీకరణకే స్వస్తి పలికారు. పెట్టు బడి, రాబడి పద్దులు రెండే ఈ బడ్జెట్లో ఉన్న ఏకైక వర్గీకరణ. అది రాజ్యాంగ పరంగా విధిగా జరపాల్సినది. గణాంకాలు ఘనం... వాస్తవాలు విభిన్నం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన నాలుగో బడ్జెట్ ఇది. రూ. 21.47 లక్షల కోట్ల వ్యయంతో ఆయన 2017–18 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను సమర్పించారు. 2016–17కు సవరించిన బడ్జెట్ వ్యయం రూ. 20.14 లక్షల కోట్లతో పోలిస్తే ఈ బడ్జెట్లో మొత్తం వ్యయం స్వల్పంగా, 6.6 శాతం పెరి గింది. ఇటీవలి కాలంలో ఇదే కనిష్ట పెరుగుదల. మొత్తం బడ్జెటరీ వ్యయం లోని వృద్ధి రేటు ఇంత స్వల్పంగా ఉంటే ఇక ఎంత ఆర్థిక వృద్ధి రేటుని ఆశించగలం? అదేవిధంగా, పెట్టుబడి పద్దు కింద ప్రతిపాదించిన వ్యయం కూడా 2016–17 సవరించిన అంచనాలలోని రూ. 2,79,847 కోట్ల నుంచి 2017–18లో రూ. 3,09,801 కోట్లకు పెంచాలని ప్రతిపాదించారు. అంటే ఆ పద్దు కింద వ్యయంలో వృద్ధి కేవలం 17 శాతమేనని అంచనా. పెట్టుబడి వ్యయానికి గణనీయంగా కేటాయింపులు చేశామని బడ్జెట్ పేర్కొంది. కానీ వాస్తవ అనుభవం భిన్నంగా ఉంటోంది. ఈ 2016–17 ఆర్థిక సంవత్స రంలోని ఏప్రిల్–డిసెంబర్ మధ్య తొమ్మిది నెలల కాలంలో కేంద్ర ప్రభుత్వ పెట్టుబడి వ్యయం రూ. 1,09,131 కోట్లు. కాగా అంతకు ముందటి ఏడాది ఇదే కాలంలో పెట్టుబడి వ్యయం రూ. 1,15,322 కోట్లు. అంటే గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పెట్టుబడి వ్యయం పడిపోయి, రుణాత్మక వృద్ధిని నమో దుచేసింది. ఇదే కాలంతో పోలిస్తే పడిపోయింది. పైగా ఈ ఏడాది ఏప్రిల్– డిసెంబర్ మధ్య కేంద్ర ప్రభుత్వ రాబడులు, గత ఏడాది అదే కాలంతో పోలిస్తే 16 శాతం వృద్ధిని నమోదు చేశాయి. 2015–16తో పోలిస్తే 2016–17 సవరించిన అంచనాల ప్రకారం రాబడుల పెరుగుదల 19 శాతంగా ఉంది. కాగా, 2016–17 సవరించిన అంచనాలతో పోలిస్తే 2017–18లో రాబడులు 5.5 శాతం పెరుగుతాయని అంచనా వేయడం మరింత ఆశ్చర్యకరం. 2016–17 సవరించిన అంచనా లతో పోలిస్తే రాబడుల వృద్ధి 2017–18లో ఇంత గణనీయంగా పడి పోవడానికి కారణాలేమిటో బడ్జెట్లో వివరించలేదు. బడ్జెట్ ఉపన్యాసం ఆశలతో నిండి ఉందేగానీ, గణాంకాలు మాత్రం పూర్తిగా భిన్నమైన చిత్రాన్ని చూపుతున్నాయి. బడుగు రైతుకు మొండి చెయ్యే రైతుల ఆదాయాలను వచ్చే ఐదేళ్ల కాలంలో రెట్టింపు చేయాలనే ఆకాంక్షను బడ్జెట్ వ్యక్తం చేసింది. కానీ కనీస మద్దతు ధరలను (ఎమ్‌ఎస్‌పీలను) పెంచ కుండా ఇది ఎలా సాధించగలరో స్పష్టతను ఇవ్వలేదు. ఎన్డీఏ ప్రభుత్వం ఏడాదికి 3 శాతం చొప్పున ఎమ్‌ఎస్‌పీలను పెంచుతోంది. అది ద్రవ్యోల్బణం రేటు కంటే కూడా తక్కువ. ద్రవ్యోల్బణం కంటే తక్కువ కనీస మద్దతు ధరలతో ఐదేళ్లలో రెట్టింపు కావడం కాదు గదా, రైతుల ఆదాయాలు పెరు గుతాయనైనా ప్రభుత్వం ఎలా ఆశిస్తుంది? 2017–18లో వ్యవసాయరంగ రుణగ్రహీతలకు కేటాయించినది రూ. 10 లక్షల కోట్లు, అంటే 10 శాతం పెరుగుదల. అది అతి సాధారణమైన పెంపుదలే. రైతాంగంలో అత్యధికులైన చిన్న, సన్నకారు రైతులకు మొత్తం బ్యాంకు రుణాల మొత్తంలో 7.5 శాతాన్ని కేటాయించాలనే పరిమితిని ఆర్బీఐ పెంచలేదనేది చాలా ముఖ్యమైన అంశం. వాస్తవానికి ఈ పరిమితిని కనీసం 15 శాతానికి పెంచి ఉండాల్సింది. నేడు చిన్న, సన్నకారు రైతులలో కేవలం 40 శాతానికే బ్యాంకు పరపతి అందుబాటులో ఉంటోందనే వాస్తవం మరింత ఆందోళనకరమైనది. వచ్చే 2–3 ఏళ్లలో 75 శాతం రైతాంగానికి బ్యాంకు పరపతిని విస్తరింపజేయడమనే బాధ్యతను ప్రభుత్వం స్వీకరించాలి. లేకపోతే వారు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల దయాదాక్షిణ్యాలపైనే ఆధారపడాల్సి వస్తుంది. మా పార్టీ ఇదే విషయాన్ని గత రెండు ఏళ్లుగా డిమాండు చేస్తున్నా, ఈ దిశగా చర్యలు చేపట్టింది లేదు. ఊరట అంతంత మాత్రం ఇక వ్యవసాయం, వ్యవసాయానుబంధ కార్యకలాపాలకు బడ్టెట్ కేటాయింపు లను తీసుకున్నా ఇదే తీరు. 2016–17లో వీటికి రూ. 52,821 కోట్లు కేటాయిస్తే, 2017–18కి రూ. 58,663 కోట్లు మాత్రమే కేటాయించారు. ముద్ర యోజన ద్వారా అసంఘటిత రంగానికి రూ. 2.4 లక్షల కోట్ల నిధులను కేటాయించే లక్ష్యాన్ని నిర్దేశించడం మంచి చర్య. మరి వాస్తవంలో బ్యాంకుల పనితీరు ఈ విషయంలో ఎలా ఉంటుందో వేచిచూడాలి. మౌలిక సదుపాయాల రంగానికి రూ. 3.96 లక్షల కోట్లను కేటాయించ డాన్ని ఆర్థిక మంత్రి తన ఉపవ్యాసంలో మరో గొప్ప విషయంగా పేర్కొ న్నారు. అయితే ఇది 2016–17 సవరించిన అంచనాలలోని రూ. 3.58 కోట్లతో పోలిస్తే ఇది కేవలం 10 శాతమే ఎక్కువ. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కేటాయింపులను రూ. 15,000 కోట్ల నుంచి రూ. 23,000 కోట్లకు పెంచారు. మహాత్మాగాంధీగ్రామీణ ఉపాధి హామీకిగానూ నిధులను రూ. 38,500 కోట్ల నుంచి రూ. 48,000 కోట్లకు పెంచారు. రాజకీయ పార్టీలు విరాళాలను చెక్కులు లేదా డిజిటల్ చెల్లింపుల ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. వ్యక్తిగత ఆదాయపు పన్ను విషయానికి వస్తే రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షల స్లాబుకు ప్రస్తుతం ఉన్న 10 శాతం పన్నును 5 శాతానికి తగ్గించారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావాన్ని లెక్కలోకి తీసుకోకుండా లోక్‌సభకు సమ ర్పించిన ఆర్థిక సర్వే 2016–17లో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటును 7.1 శాతంగా పేర్కొంది. జీడీపీ వృద్ధి రేటు 2015–16లోని 7.6 శాతంతో పోలిస్తే ప్రస్తుత సంవత్సరంలో 7.1 శాతానికి పడిపోవడం ఆశ్చ ర్యకరం. ఇదో దుర్వార్త. అయినాగానీ ఆర్థిక సర్వే 2017–18 ఆర్థిక సంవత్స రానికి జీడీపీ వృద్ధి రేటు 6.75 శాతం నుంచి 7.5 శాతం వరకు ఉండవచ్చని అంచనా వేసింది. గణాంకాల గారడీ? ప్రభుత్వం ప్రచురించిన జీడీపీ గణాంకాలలోని వాస్తవాన్ని పలుపురు నిపు ణులు ప్రశ్నిస్తున్నారు. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ, ఉపాధి కల్పన, పరపతి విస్తరణ, స్థూల స్థిర పెట్టుబడి కల్పనలోని వృద్ధి వంటి సూచికలన్నీ రుణాత్మక వృద్ధిని కనబరుస్తుండటమే వారి ప్రశ్నలకు కారణం. ఆర్థిక వృద్ధిపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం ఏమీ లేదని ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో అన్నారు. కానీ జీడీపీ వృద్ధిలోని క్షీణతను, రాబడుల తగ్గుదలను అంగీకరించడం ద్వారా ఆ ప్రభావం ఉన్నదని ప్రభుత్వం చెప్ప కనే చెప్పినట్టు అయింది. వస్తు తయారీ రంగంలోని క్షీణత మరీ తీవ్రంగా ఉండటం మరింత ఆందోళనకరం. కేంద్ర గణాంకాల సంస్థ (సీఎస్ఏ) ప్రతి నెలా అత్యంత ముఖ్యమైన వస్తు తయారీ రంగపు పారిశ్రామిక ఉత్పత్తి సూచీని ప్రచురిస్తుం టుంది. ఆ సూచిక 2014 మే నెలకు183.5 కాగా, 2016 నవంబర్ మాసంలో 181.2గా ఉంది. అంటే గత రెండున్నరేళ్లుగా వస్తు తయారీ రంగంలో వృద్ధ న్నది లే దన్నమాటే!! అంతా నిరుత్సాహకరం ఇక మరో ప్రధాన సూచికౖయెన స్థూల స్థిర పెట్టుబడి కల్పన (జీసీఎఫ్సీ) పరిస్థితీ అంతే. ఆర్థిక వ్యవస్థలోని పెట్టుబడి మదుపుల ధోరణిని స్థిరమైన ధరల (2011–12) రూపేణా లెక్కించే ముఖ్య కొలమానం జీసీఎఫ్సీ. అది 2015–16లో రూ. 35.41 లక్షల కోట్లు కాగా, 2016–17లో 35.35 లక్షల కోట్లు. అంటే – 0.2 శాతం రుణాత్మక వృద్ధిని నమోదు చేసింది. 2016 జూన్ 20న ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం జౌళి, తోళ్లు, లోహాలు, ఆటోమొబైళ్లు, రత్నాలు, ఆభరణాలు, రవాణా, సమాచార సాంకేతికత, చేనేత రంగాలన్నీ కలసి కేవలం 1,35,000 ఉద్యోగాలను మాత్రమే 2015లో కల్పించాయి. ఇది గత ఏడేళ్లలోనే అతి తక్కువ! పెద్ద నోట్ల రద్దుకు ముందే గ్రామీణ వేతనాలలో పెరుగుదల దాదాపు సున్నాగా ఉంది. మొత్తంగా చూస్తే పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. దురదృష్టవశాత్తూ, 2016–17 సవరించిన అంచనాలతో పోలిస్తే 2017–18లో రాబడుల వృద్ధి 5.5 శాతమనే అంచనా అత్యంత నిరుత్సాహకరంగా ఉన్నదని చెప్పాలి. ( వ్యాసకర్త : డీఏ సోమయాజులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సలహాదారు, వైఎస్సార్సీపీ రాజకీయ వ్యవహారాల సలహాదారు) -
దూసుకెళ్లిన రియాల్టీ: భారీ లాభాల్లో మార్కెట్లు
ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో గృహరంగానికి ఊతమిచ్చేలా ప్రకటనలు వెలువడంతో రియాల్టీ ఇండెక్స్ ఒక్కసారిగా దూసుకెళ్లింది. బీఎస్ఈలో 4.2 శాతం ఎగిసిన రియాల్టీ సూచీ, ప్రస్తుతం 3.38 శాతం వద్ద లాభాల్లో ట్రేడవుతోంది. రియాల్టీ ఇండెక్స్‌లో మేజర్ షేర్లుగా ఉన్న డీఎల్ఎఫ్(5.74 శాతం), గోద్రేజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్(4.04 శాతం), ఒబేరాయ్ రియాల్టీ లిమిటెడ్(4.24 శాతం), ప్రెస్టేజ్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్(3.19 శాతం), సోబా(2.64 శాతం), యూనిటెక్(3.31 శాతం), హెచ్‌డీఐఎల్(3.36 శాతం), ఇండియా బుల్ రియల్ ఎస్టేట్ లిమిటెడ్(0.80 శాతం) శాతం పెరిగాయి. హౌసింగ్ పరిశ్రమకు మేలు చేకూరేలా ఇండస్ట్రి వర్గాలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్న సరసమైన గృహాలకు మౌలిక సదుపాయాల స్టేటస్‌ను జైట్లీ ఈ బడ్జెట్లో కల్పించారు. దీన్ని ద్వారా డెవలపర్లకు ధరలు తగ్గనున్నాయి. అంతేకాక, ప్రధాని ఆవాస్ యోజన పథకానికి రూ.23వేల కోట్లు కేటాయించనున్నట్టు జైట్లీ తెలిపారు. నేషనల్ హౌసింగ్ బ్యాంకు ద్వారా రూ.20వేల కోట్ల గృహరుణాలను అందించనున్నట్టు హామీ ఇచ్చారు. ఈ ప్రకటనలన్నీ రియాల్టీకి మంచి బూమ్ ఇచ్చాయి. పెద్ద నోట్ల రద్దు అనంతరం డిమాండ్ కుదేలై పడిపోయిన రియాల్టీ ఇండెక్స్, జైట్లీ ప్రసంగం తర్వాత పుంజుకుంది. రియాల్టీకి ఊతమిచ్చేలా జైట్లీ పలు ప్రకటనలు చేస్తారని ముందునుంచి మార్కెట్ వర్గాలు అంచనావేశాయి. అంచనాలకు అనుగుణంగా రియాల్టీకి ఆయన గుడ్ న్యూస్ అందించారు. బడ్జెట్ స్పీచ్ అనంతరం 300 పాయింట్లకు పైగా దూసుకెళ్లిన మార్కెట్లు, ప్రస్తుతం మరింత లాభాల్లోకి దూసుకెళ్లాయి. 406.86 పాయింట్ల లాభంలో 28,062 వద్ద సెన్సెక్స్ ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం 125.35 పాయింట్ల లాభంలో 8,686 వద్ద కొనసాగుతోంది. బ్యాంకింగ్, పీఎస్‌యూ, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్‌లు సైతం లాభాల్లో నడుస్తున్నాయి. గృహరంగానికి అందించిన ప్రోత్సహకాలు : ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద పేద ప్రజలకు ఇళ్ల నిర్మాణాలు చేపట్టడం ఇళ్ల నిర్మాణంలో ఉద్యోగవకాశాలు కల్పించడం 2016 జూన్, 2019 మార్చి మధ్యలో అనుమతిచ్చే ఫ్లాట్స్ హౌసింగ్ ప్రాజెక్టుల్లో నాలుగు మెట్రోసిటీల్లో 30 చదరపు మీటర్లు, ఇతర మెట్రో సిటీల్లో 60 చదరపు మీటర్ల వరకు కనీస ప్రత్యామ్నాయ పన్ను. మొదటిసారి గృహ కొనుగోలుదారులు తీసుకునే రూ.35 లక్షల వరకు రుణాల్లో అదనంగా రూ.50వేలపై వేసే వడ్డీరేట్ల నుంచి మినహాయింపు. వచ్చే ఏడాది నుంచి ఇది అమలు. పీపీపీ స్కీమ్ లాంటి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఆఫర్ చేసే స్కీమ్‌ల కింద 60 చదరపు మీటర్లలో ఇళ్ల నిర్మాణాలకు సర్వీసు పన్ను తొలగింపు ఎక్స్చేంజ్ డ్యూటీ నుంచి కూడా మినహాయింపు -
తడబడి.. పొరపడి.. సవరించిన జైట్లీ
బడ్జెట్ ప్రసంగం చేసే సమయంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ రెండు మూడు సందర్భాలలో కొంత తడబడి తప్పులు చదివారు. ఒకటి రెండు సందర్భాల్లో వేరే సభ్యులు, స్పీకర్ వాటిని సవరించినా ఒకటి రెండు మాత్రం అలాగే దొర్లిపోయాయి. ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసేవారి సంఖ్యను చెప్పేటప్పుడు 1.71 లక్షల మంది అనడానికి 1.71 లక్షల రూపాయలు అని చదివారు. అలాగే భరించదగ్గ గృహనిర్మాణ పథకం విషయంలో 30 చదరపు మీటర్లు అనడానికి బదులు 30 చదరపు కిలోమీటర్లుగా చెప్పారు. మరో సందర్భంలో కూడా జైట్లీ ఇలాగే తడబడ్డారు గానీ, దాన్ని స్పీకర్ సరిచేయడంతో ఆయన మళ్లీ సవరించుకున్నారు. ఇలా దాదాపు మూడు నాలుగు సందర్భాల్లో జైట్లీ తడబడ్డారు. మొదటి నుంచి కూర్చునే.. 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రసంగాన్ని అరుణ్ జైట్లీ కూర్చునే చదివారు. గతంలో రెండు సందర్భాల్లో ఆయన తొలుత నిలబడి ప్రసంగం ప్రారంభించి, కాసేపటి తర్వాత కూర్చునేవారు. నడుం నొప్పితో బాధపడుతున్న జైట్లీకి.. కూర్చుని చదివే అవకాశాన్ని స్పీకర్ సుమిత్రా మహాజన్ కల్పించారు. ఈసారి మొత్తం మొదటినుంచి చివరి వరకు ఆయన కూర్చునే బడ్జెట్ ప్రసంగం ఇచ్చారు. (సంబంధిత వార్తలు..) గృహ రంగానికి గుడ్‌న్యూస్ పేదలకు కేంద్ర బడ్జెట్లో వరాలు! బడ్జెట్లో పది ప్రాధాన్యతాంశాలు ఇవే.. ఐఆర్సీటీసీ టికెట్ల మీద భారీ వరాలు ఆదాయపన్ను రేట్లు ఇలా.. మన విద్యా సంస్థలకు అంతంతమాత్రమే! మోతెక్కనున్న కార్ల ధరలు సిగరెట్లు..సెల్ ఫోన్ల ధరలు ఇక భగ భగ బడ్జెట్ లో రైల్వే హైలెట్స్... -
ఉపయోగం లేని సుదీర్ఘ ప్రసంగమే..: ఉమ్మారెడ్డి
బడ్జెట్ ప్రసంగం సుదీర్ఘంగా ఉంది కానీ, అందులో ప్రజలకు మేలు చేసే అంశాలు మాత్రం లేవని శాసనమండలిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పక్ష నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. సహచర ఎమ్మెల్సీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, కొలగట్ల వీరభద్రస్వామితో కలసి ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్లో విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది బడ్జెట్ 48 పేజీలు, 178 పేరాలు, 13 మంది ప్రపంచ ప్రముఖుల కొటేషన్లతో చదవడానికే 150 నిమిషాల సమయం పట్టిందని, అందులో అంకెలను చూస్తే ప్రజల అవసరాలు తీర్చే పరిస్థితి లేదని అన్నారు. -
నిరసనల మధ్య జైట్లీ ప్రసంగం
స్మృతి ఇరానీపై హక్కుల తీర్మానం కోసం విపక్షాల ఆందోళన గందరగోళం మధ్యే బడ్జెట్ ప్రసంగం ప్రారంభించిన జైట్లీ న్యూఢిల్లీ :బడ్జెట్ ప్రవేశపెట్టే రోజున లోక్‌సభలో మునుపెన్నడూ లేని అసాధారణ పరిస్థితుల్లో.. ప్రతిపక్ష సభ్యుల ఆందోళనల మధ్య.. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ బలవంతంగా ప్రసంగం ప్రారంభించాల్సి వచ్చింది. సోమవారం సభలో బడ్జెట్ ప్రసంగం చేయటానికి జైట్లీ లేచి నిలుచోగానే.. హెచ్‌సీయూలో దళిత విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య విషయమై కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ పార్లమెంటును తప్పుదోవ పట్టించారంటూ తాము ఇచ్చిన హక్కుల తీర్మానాల అంశాన్ని కాంగ్రెస్, వామపక్షాల సభ్యులు లేవనెత్తారు. ఆ అంశం పరిశీలనలో ఉందని స్పీకర్ సుమిత్రామహాజన్ చెప్పినప్పటికీ.. వారు దానిని ప్రస్తావిస్తూనే ఉండటంతో గందరగోళం తలెత్తింది. బడ్జెట్ సమయంలో ప్రతిపక్షాలు చౌకబారు రాజకీయాలకు పాల్పడుతున్నాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడుధ్వజమెత్తారు. మధ్యలో కూర్చుని ప్రసంగించిన జైట్లీ... లేత నీలి రంగు కుర్తాపై, కొంత ముదురు నీలి రంగు జాకెట్ ధరించిన జైట్లీ.. గంటన్నరకు పైగా ప్రసంగం కొనసాగించారు. ఆయన 20 నిమిషాలు ప్రసంగించాక.. కూర్చుని ప్రసంగాన్ని కొనసాగించవచ్చని స్పీకర్ సూచించారు. బడ్జెట్‌కు తొమ్మిది మూల స్తంభాలు... భారతదేశాన్ని రూపాంతరీకరించాలన్న తమ అజెండాలో భాగంగా.. తొమ్మిది విభిన్న మూల స్తంభాలపై ఆధారపడి బడ్జెట్ ప్రతిపాదనలను రూపొందించినట్లు జైట్లీ వివరించారు. అవేమిటంటే... 1) వ్యవసాయం - రైతుల సంక్షేమం, 2) గ్రామీణ రంగం, 3) ఆరోగ్యపరిరక్షణ సహా సామాజిక రంగం, 4) విద్య - నైపుణ్యాలు - ఉపాధి కల్పన, 5) మౌలిక సదుపాయాలు - పెట్టుబడులు, 6) ఆర్థిక రంగ సంస్కరణలు, 7) పరిపాలన - వాణిజ్యం సులభతరం చేయటం, 8) ఆర్థిక క్రమశిక్షణ, 9) పన్ను సంస్కరణలు. గ్రామీణ ఆదాయం, మౌలిక సదుపాయాలు దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయ సంక్షోభం అతి పెద్ద సవాలంటూ.. గ్రామీణ మౌలిక సదుపాయాలను మెరుగుపరచటం, గ్రామీణ ఆదాయాన్ని పెంపొం దించటం కేంద్ర బడ్జెట్ లక్ష్యాలని జైట్లీ తెలిపారు. బడ్జెట్లో ప్రణాళికా వ్యయం, ప్రణాళికేతర వ్యయం అనే వర్గీకరణను వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి తొ లగించనున్నట్లు జైట్లీ తెలిపారు. ప్రభుత్వ వ్యయం లో రెవెన్యూ, పెట్టుబడి (కేపిటల్) వర్గీకరణపై మ రింత దృష్టి కేంద్రీకరించాల్సి ఉందని వివరించారు. 2017-18 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రణాళిక, ప్రణాళికేతర అనే వర్గీకరణను తొలగిస్తామని.. కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లు ఒకే తరహాలో ఉండేలా రాష్ట్రాల ఆర్థిక శాఖలతో కలిసి పనిచేస్తామని జైట్లీ తెలిపారు. రాహుల్ సూచనకు సరే.. ♦ గత యూపీఏ ప్రభుత్వం ఆర్థికవ్యవస్థను పాడైపోయిన స్థితిలో తమకు అప్పగించిందని, ఎన్డీఏ ప్రభుత్వం దానిని సరిచేసిందని చెప్తూ జైట్లీ.. ఁకష్టీ చలానే వాలో నే జబ్ దీ పట్వార్ హమే.. ఇన్ హాలాత్ మే ఆతా హై దరియా పార్ కర్నా హమే* (ఓడ తెడ్డును మా చేతికి అందించినపుడు.. ఈ పరిస్థితుల్లో నదిని దాటటం ఎలాగో మాకు తెలుసు) అటూ ఉర్దూ కవితను ఉదహరించారు. ♦ ఒక సందర్భంలో తమను ఆకాశ (ఆస్మానీ) శక్తులు, రాజ్య (సుల్తానీ) శక్తులు ఇబ్బందులు పెట్టాయని జైట్లీ వ్యాఖ్యానించారు. అయితే దానిని వివరించలేదు. ♦ దళిత పారిశ్రామికవేత్తల గురించి జైట్లీ తన ప్రసంగంలో ప్రస్తావించినపుడు.. కాంగ్రెస్ సభ్యులు దళిత విద్యార్థి రోహిత్ వేముల అంశాన్ని లేవనెత్తటం వినిపించింది. ♦ బ్రెయిలీ పేపర్‌పై దిగుమతి సుంకాన్ని తొలగించాలంటూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సూచనలను తాను అంగీకరించినట్లు జైట్లీ పేర్కొన్నపుడు.. సభలోనే ఉన్న రాహుల్ నవ్వుతూ కనిపించారు. బడ్జెట్ హైలైట్స్ ⇔ ఎఫ్‌డీఐ పాలసీలో గణనీయమైన మార్పులు చేయటం ద్వారా సాధారణ బీమా కంపెనీల లిస్టింగ్‌కు, బ్యాంకింగ్ రంగంలో కీలక సంస్కరణలకు తెర తీయటం. ⇔ సేంద్రియ వ్యవసాయ ప్రోత్సాహకానికి పరంపరాగత్ కృషి వికాస్ యోజన ⇔ మొత్తం గ్రామీణ రంగానికి రూ.87,675 కోట్ల కేటాయింపు. ⇔ పంచాయతీలు, మున్సిపాలిటీలకు రూ.2.87 లక్షల కోట్ల గ్రాంట్ ఇన్ ఎయిడ్ ⇔ మహాత్మ గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి రూ.38,500 కోట్లు ⇔ విద్య, ఆరోగ్యం, సామాజిక రంగానికి రూ.1,51,581 కోట్ల కేటాయింపు. ⇔ 2016-17లో ప్రధానమంత్రి జన ఔషధి కార్యక్రమం కింద 3000 స్టోర్ల ఏర్పాటు. ⇔ ఫైనాన్షియల్ కంపెనీల వివాదాల పరిష్కారానికి సమగ్ర నియమావళి. ⇔ ముద్ర యోజన కింద మంజూరీ లక్ష్యం రూ.1.8 లక్షల కోట్లకు పెంపు. ⇔ ఎన్హెచ్ఏఐ, ఐఆర్ఈడీఏ, నాబార్డ్‌ల ద్వారా రూ. 31,300 కోట్ల ఇన్ఫ్రా బాండ్లు ⇔ 2017 మార్చి నాటికి 3 లక్షల రేషన్ డిపోల్లో ఆటోమేషన్. ⇔ స్టార్టప్‌లకు అనుకూలమైన వాతావరణం కల్పించడానికి కంపెనీల చట్టం సవరణ. ⇔ ఏప్రిల్, 2016 నుంచి మార్చి 2019 మధ్య ఏర్పాటు చేసిన స్టార్టప్‌లకు మూడు నుంచి ఐదేళ్ల పాటు లాభాల్లో పూర్తి మినహాయింపు ⇔ సంవత్సరానికి రూ.10 లక్షలకు మించి డివిడెండ్ గనక తీసుకుంటే మొత్తం డివిడెండ్‌పై అదనంగా 10 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ⇔ రూ.2 లక్షలకు పైబడి ఏవైనా వస్తువులు, సేవలు కొన్నా... రూ.10 లక్షలకు పైబడిన లగ్జరీ కార్లు కొన్నా... అక్కడికక్కడే 1 శాతం టీడీఎస్ ⇔ ఆప్షన్లపై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ 0.017 నుంచి 0.05కు పెంపు ⇔ అన్ని సేవలపై రైతులు, వ్యవసాయ సంక్షేమం నిమిత్తం 0.5 శాతం సెస్సు ⇔ రూ.1000 మించిన రెడీమేడ్ గార్మెంట్లపై ఎక్సయిజు పన్ను 2 శాతానికి పెంపు ⇔ బీడీ మినహా పొగాకు ఉత్పత్తులపై ఎక్సయిజు సుంకం 15 శాతానికి పెంపు. ⇔ బ్లాక్‌మనీ వెల్లడికి 4 నెలల సమయం. ఆ బ్లాక్‌మనీపై 45% పన్ను, వడ్డీ. ⇔ బొగ్గు, లిగ్నైట్‌లపై క్లీన్ ఎనర్జీ సెస్ టన్నుకు 200 నుంచి రూ. 400కు పెంపు. ⇔ 2017-18 నాటికి ద్రవ్యలోటు లక్ష్యం జీడీపీలో 3 శాతం ⇔ బ్యాంకుల రీక్యాపిటలైజేషన్ కోసం రూ. 25 వేల కోట్లు -
‘స్వచ్ఛ' విద్యుత్!
దేశంలో విద్యుత్ కొరతను ఎదుర్కొనేందుకు సాంప్రదాయేతర ఇంధన వనరులను ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయించింది. సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిని భారీ ఎత్తున చేపట్టాలని.. 2022 నాటికి 1,75,000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే తీవ్ర విద్యుత్ కొరతతో అల్లాడుతున్న పలు ప్రాంతాల్లో ఐదు అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టులను రూ. లక్ష కోట్లతో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఈ విషయాన్ని వెల్లడించారు. కానీ ఈ ప్రాజెక్టులను ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తామనే అంశాన్ని పేర్కొనలేదు. విద్యుత్ రంగానికి రూ. 61,404 కోట్లను కేటాయిస్తున్నట్లు తెలిపారు. అన్ని రకాల అనుమతులు పొందిన తర్వాతే ప్రాజెక్టులను చేపట్టే (ప్లగ్ అండ్ ప్లే) విధానాన్ని అనుసరిస్తామని జైట్లీ వెల్లడించారు. బొగ్గు గనులకు సంబంధించి కూడా అన్ని రకాల అనుమతులు వచ్చిన అనంతరమే వేలం వేస్తామన్నారు. భారీ లక్ష్యం: ఏడేళ్లలో 1,75,000 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జైట్లీ పేర్కొన్నారు. అందులో లక్ష మెగావాట్లను సౌర విద్యుత్ ద్వారా, 60 వేల మెగావాట్లు పవన, 10 వేల మెగావాట్లు జీవ వ్యర్థాల ద్వారా, 5 వేల మెగావాట్లను చిన్న జల విద్యుత్ కేంద్రాల ద్వారా ఉత్పత్తి చేస్తామని చెప్పారు. అణుశక్తికి రూ. 5,900 కోట్లు: దేశంలో అణు విద్యుత్ ఉత్పత్తి, పరిశోధనకు రూ. 5,900 కోట్లను కేటాయిస్తున్నట్లు జైట్లీ వెల్లడించారు. మొత్తంగా అణుశక్తి విభాగానికి రూ. 10,912 కోట్లను ఇస్తున్నట్లు చెప్పారు. ఇందులో బాబా ఆటామిక్ రీసెర్చ్ సెంటర్, కల్పక్కం అణు పరిశోధన కేంద్రాలకు రూ. 1,912 కోట్ల చొప్పున కేటాయిస్తున్నట్లు జైట్లీ తెలిపారు. కూడంకుళం రెండో యూనిట్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రారంభమయ్యే అవకాశముందని.. దాంతో మరో వెయ్యి మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. కాగా పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వడంపై ఆ రంగంలోని సంస్థలు హర్షం వ్యక్తం చేశాయి. ప్రభుత్వ నిర్ణయంతో దేశం పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి పెరుగుతుందని సుజ్లాన్ గ్రూప్ చైర్మన్ తులసి తంతి పేర్కొన్నారు. తమ ఇండస్ట్రీకి ఇది మంచి బడ్జెట్ అని వెల్స్పన్ రెన్యూవబుల్స్ వైస్ చైర్మన్ వినీత్ మిట్టల్ చెప్పారు. ప్రస్తుత బడ్జెట్లో విద్యుత్ రంగానికి రూ. 61,404 కోట్లను కేటాయించారు. అదే 2013-14లో రూ. 57,949 కోట్లు, 2014-15లో సవరించిన అంచనా ప్రకారం 55,488 కోట్లు వ్యయం చేశారు. పునరుత్పాదక విద్యుత్‌కు ప్రోత్సాహంలో భాగంగా.. సౌర విద్యుత్ ఫలకాల తయారీలో వినియోగించే ‘ఎవాక్యుయేటెడ్ ట్యూబ్’లపై కస్టమ్స్ పన్నును మినహాయించారు. దీంతోపాటు పునరుత్పాదక విద్యుత్ వ్యవస్థల్లోని ఇన్వర్టర్ల తయారీకి ఉపయోగించే ‘యాక్టివ్ ఎనర్జీ కంట్రోలర్ (ఏఈసీ)’లపై పన్నును 5 శాతానికి తగ్గించారు. ఆర్థిక మంత్రి ప్రకటించిన ప్రకారం రూ. లక్ష కోట్లతో ఐదు అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టుల (యూఎంపీపీ)ను ఏర్పాటు చేస్తారు. 4,000 మెగావాట్ల సామర్థ్యమున్న థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులను యూఎంపీపీలుగా పేర్కొంటారు. ళీవిద్యుత్ కొరతతో సతమతమవుతున్న బిహార్‌లో వీటిల్లో ఒక ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. దీనికి జార్ఖండ్ లేదా ఒడిశాల నుంచి బొగ్గు సరఫరా చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందే ఏపీలోని కృష్ణపట్నం, మధ్యప్రదేశ్‌లోని ససాన్, జార్ఖండ్‌లోని తలైయాలో, గుజరాత్‌లోని ముంద్రాలో యూఎంపీపీలను చేపట్టింది.