తడబడి.. పొరపడి.. సవరించిన జైట్లీ | arun jaitley bloopers in budget speech | Sakshi
Sakshi News home page

తడబడి.. పొరపడి.. సవరించిన జైట్లీ

Published Wed, Feb 1 2017 2:24 PM | Last Updated on Wed, Apr 3 2019 4:38 PM

తడబడి.. పొరపడి.. సవరించిన జైట్లీ - Sakshi

తడబడి.. పొరపడి.. సవరించిన జైట్లీ

బడ్జెట్ ప్రసంగం చేసే సమయంలో కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ రెండు మూడు సందర్భాలలో కొంత తడబడి తప్పులు చదివారు. ఒకటి రెండు సందర్భాల్లో వేరే సభ్యులు, స్పీకర్ వాటిని సవరించినా ఒకటి రెండు మాత్రం అలాగే దొర్లిపోయాయి. ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసేవారి సంఖ్యను చెప్పేటప్పుడు 1.71 లక్షల మంది అనడానికి 1.71 లక్షల రూపాయలు అని చదివారు. అలాగే భరించదగ్గ గృహనిర్మాణ పథకం విషయంలో 30 చదరపు మీటర్లు అనడానికి బదులు 30 చదరపు కిలోమీటర్లుగా చెప్పారు. మరో సందర్భంలో కూడా జైట్లీ ఇలాగే తడబడ్డారు గానీ, దాన్ని స్పీకర్ సరిచేయడంతో ఆయన మళ్లీ సవరించుకున్నారు. ఇలా దాదాపు మూడు నాలుగు సందర్భాల్లో జైట్లీ తడబడ్డారు.
 
మొదటి నుంచి కూర్చునే..
2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ప్రసంగాన్ని అరుణ్ జైట్లీ కూర్చునే చదివారు. గతంలో రెండు సందర్భాల్లో ఆయన తొలుత నిలబడి ప్రసంగం ప్రారంభించి, కాసేపటి తర్వాత కూర్చునేవారు. నడుం నొప్పితో బాధపడుతున్న జైట్లీకి.. కూర్చుని చదివే అవకాశాన్ని స్పీకర్ సుమిత్రా మహాజన్ కల్పించారు. ఈసారి మొత్తం మొదటినుంచి చివరి వరకు ఆయన కూర్చునే బడ్జెట్ ప్రసంగం ఇచ్చారు. 

(సంబంధిత వార్తలు..)

గృహ రంగానికి గుడ్న్యూస్

పేదలకు కేంద్ర బడ్జెట్‌లో వరాలు!


బడ్జెట్లో పది ప్రాధాన్యతాంశాలు ఇవే..


ఐఆర్‌సీటీసీ టికెట్ల మీద భారీ వరాలు


ఆదాయపన్ను రేట్లు ఇలా..


మన విద్యా సంస్థలకు అంతంతమాత్రమే!

మోతెక్కనున్న కార్ల ధరలు


సిగరెట్లు..సెల్ ఫోన్ల ధరలు ఇక భగ భగ
 

బడ్జెట్ లో రైల్వే హైలెట్స్...

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement