బడ్జెట్లో మరో కీలక నిర్ణయం | in Budget Speech, A Major Reform For Foreign Investment - Ending FIPB | Sakshi
Sakshi News home page

బడ్జెట్లో మరో కీలక నిర్ణయం

Published Wed, Feb 1 2017 4:45 PM | Last Updated on Sat, Sep 15 2018 8:05 PM

బడ్జెట్లో మరో కీలక నిర్ణయం - Sakshi

బడ్జెట్లో మరో కీలక నిర్ణయం

న్యూఢిల్లీ:  2017-18 ఆర్థిక బడ్జెట్  ప్రసంగంలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ  మరో కీలక   నిర్ణయాన్ని ప్రకటించారు. విదేశీ పెట్టుబడులను మరింత   ప్రోత్సహించేలా  భారీ సంస‍్కరణ చేపట్టారు.  విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ) ప్రతిపాదనలను పరిశీలించే విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్‌ఐపిబి) రద్దు చేస్తున్నట్టు  ప్రకటించి మరో సంచలనం సృష్టించారు.   

విదేశీ పెట్టుబడుల అభివృద్ధి బోర్డు(ఎఫ్‌ఐపిబి) నుండి అనుమతులు పొందడానికి, నిబంధనలు సైతం ఉల్లంఘించి  డైరెక్ట్  పెట్టుబడులను సాధిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో  ఈ చర్య తీసుకున్నారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానాలను సరళీకరిస్తామని ఆయన చెప్పారు. ఎఫ్‌ఐపీబీ మార్గదర్శకాలు రాబోయే సంవత్సరంలో మరింత  సరళంగా ఉండనున్నట్టు చెప్పారు.   
 
మేకిన్ ఇండియాలో భాగంగా  విదేశీ ప్రత్యక్ష పెట్టుడులను భారీగా ఆహ్వానించారు ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ. గత ఏడాది భారతదేశం పౌరవిమానయాన నుండి ఫార్మాస్యూటికల్స్ వరకు రంగాల్లో   విదేశీ పెట్టుబడును మరింత సులభతరం చేశారు. ప్రపంచంలో భారతదేశం అత్యంత ఓపెన్ ఆర్థిక వ్యవస్థగా తయారు చేసేందుకు ప్రభుత్వం  కట్టుబడి ఉన్నట్టు ప్రకటించారు.  
భారతదేశం లో కొన్ని రంగాల్లో విదేశీ పెట్టుబడులకు  ఆటోమేటిక్ ఎఫ్ఐపిబి  ద్వారా అనుమతి లభించేది. ప్రభుత్వం లేదా భారతదేశం యొక్క రిజర్వు బ్యాంకు  నుంచి ముందస్తు అనుమతులు లేకుండానే 100శాతం విదేశీ పెట్టుబడిదారులు పూర్తిగా సొంతదారు కావడానికి అనుమతి ఉంది.  ఉదాహరణకు దేశంలో యాపిల్ ఫోన్ల తయారీలో రూ.5వేల కోట్ల ప్రత్యక్ష పెట్టుబడులకు ఎఫ్ఐపిబి అనుతినిచ్చింది. దీనిపై వివాదం నెలకొన్న సంగతి విదితమే.  విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు ముఖ్యంగా బ్యాంకింగ్, రక్షణ మరియు పౌర విమానయాన రంగాల్లో ప్రాజెక్టులు చేపట్టడానికి ప్రభుత్వం ఆమోదం తప్పనిసరి.

కాగా 1990ల కాలంలో ఆర్థిక సరళీకరణలో భాగంగా దీన్ని ఏర్పాటు  చేసింది. పీఎంవో  కింద పనిచేసేలా దీన్ని రూపొందించారు.  అయితే 2013 లో ఆర్థిక శాఖకు దీన్ని బదిలీ చేశారు.

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement