హౌ ఈజ్‌ ద జోష్‌..?  | Piyush Goyal Budget Speech In Parliament | Sakshi
Sakshi News home page

Published Sat, Feb 2 2019 3:31 AM | Last Updated on Sat, Feb 2 2019 11:49 AM

Piyush Goyal Budget Speech In Parliament - Sakshi

న్యూఢిల్లీ: బడ్జెట్‌ సందర్భంగా సభలో పలు ఆసక్తికర సన్నివేశాలు చోటుచేసుకున్నాయి. తాత్కాలిక ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయల్‌ ప్రసంగం దాదాపు ఉత్సాహంగా సాగింది. ఇటీవల సూపర్‌ హిట్‌ అయిన బాలీవుడ్‌ సినిమా ‘ఉడీ.. ది సర్జికల్‌ స్ట్రైక్స్‌’ను ప్రస్తావిస్తూ.. ‘హౌ ఈజ్‌ ద జోష్‌?’అంటూ విపక్ష సభ్యుల్ని బీజేపీ నేతలు ప్రశ్నించారు. పీయూష్‌ గోయల్‌ రైతులకు నగదు బదిలీ పథకం, ఆదాయ పన్ను మినహాయింపులు వంటి పలు కీలక ప్రకటనలు చేస్తున్నప్పుడు బీజేపీ సభ్యులు మోదీ.. మోదీ అంటూ నినాదాలు చేస్తూ, బల్లలు చరుస్తూ స్వాగతించారు.  

  • సాధారణంగా ఆర్థిక మంత్రులు బడ్జెట్‌ ప్రసంగాన్ని చదవడానికే పరిమితమవుతుంటారు. అయితే ఇందుకు భిన్నంగా పీయుష్‌ గోయల్‌ కీలక ప్రకటనలు చేస్తున్నప్పుడు విపక్ష సభ్యుల్ని ఉద్దేశించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  
  • భవిష్యత్‌ అజెండా గురించి పీయూష్‌ ప్రస్తావిస్తూ ‘నేను ఉడీ సినిమా చూశాను. అందులో మంచి జోష్‌ ఉంది..’అంటూ నర్మగర్భంగా వ్యాఖ్యా నించారు. మరోవైపు న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌తో పాటు మరికొందరు బీజేపీ సభ్యులు సైతం ‘హౌ ఈజ్‌ ద జోష్‌?..’అంటూ కాంగ్రెస్‌ నేతలను వ్యంగ్యంగా ప్రశ్నించారు.  
  • పీయూష్‌ రూ.5 లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ప్రకటన చేయగానే బీజేపీ సభ్యులు బల్లల చరుస్తూ.. మోదీ, మోదీ అంటూ నినాదించారు. దీంతో నిమిషం పాటు గోయల్‌ తన ప్రసంగాన్ని ఆపారు. 
  • ప్రధాని కూడా పలు ప్రకటనలప్పుడు బల్లను కొడుతూ సంతోషం వ్యక్తం చేశారు. 
  • బడ్జెట్‌ ప్రవేశపెట్టడం పూర్తయిన తర్వాత గోయల్‌ మోదీ వైపు తిరిగి నవ్వుతూ నమస్కారం చేశారు. 
  • అనంతరం మోదీ చిరునవ్వుతో గోయల్‌ వద్దకు వెళ్లి వెన్నుతట్టి అభినందించారు.  
  • కాగా, తృణమూల్‌ కాంగ్రెస్‌ సభ్యులు బిగ్గరగా నవ్వుతూ పీయూష్‌ ప్రసంగాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు.  
  • సభ ప్రారంభమవ్వడానికి ఐదు, ఏడు నిమిషాల ముందు లోపలికి వచ్చిన గోయల్‌ కేంద్ర మంత్రు లు నితిన్‌ గడ్కరీ, ఉమా భారతి, బీజేపీ సీనియర్‌ నేత శాంత కుమార్‌ల పాదాలకు నమస్కారం చేసి.. ఆశీర్వాదం తీసుకున్నారు. 
  • బడ్జెట్‌ ప్రసంగం ముగిసిన తర్వాత చాలా మంది ఎంపీలు గోయల్‌ వద్దకు వెళ్లి అభినందించారు. అదే సమయంలో విజిటర్స్‌ గ్యాలరీలో నిల్చొని ఉన్న తన కుటుంబసభ్యుల్ని చేయి ఊపుతూ పలకరించారు. 
  • కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ కొద్దిసేపు సభ నుంచి బయటకు వెళ్లారు. దీంతో పలువురు బీజేపీ నేతలు ‘రాహుల్‌ పారిపోయాడు’అంటూ ఎగతాళి చేశారు.  
  • యూపీఏ చైర్‌పర్సన్‌ సోనియాగాంధీ, కాంగ్రెస్‌ విప్‌ జ్యోతిరాదిత్య సింథియా, డిప్యూటీ స్పీకర్‌ ఎం.తుంబిదురై సభకు గైర్హాజరయ్యారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement