నిర్మలా సీతారామన్‌ మరో రికార్డు,  ఎక్కువగా వాడిన పదాలు ఏంటో తెలుసా? | Nirmala Sitharaman Delivers Her Shortest Budget Speech At 87 Minutes | Sakshi
Sakshi News home page

Union Budget 2023-24 సీతారామన్‌ మరో రికార్డు,  ఎక్కువగా వాడిన పదాలు ఏంటో తెలుసా?

Published Wed, Feb 1 2023 2:56 PM | Last Updated on Wed, Feb 1 2023 5:39 PM

 Nirmala Sitharaman Delivers Her Shortest Budget Speech At 87 Minutes - Sakshi

న్యూఢిల్లీ:  ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2023-24 బడ్జెట్‌ను  ఫిబ్రవరి 1న  ప్రెజెంటేషన్‌ సందర్భంగా ఆమె మరో రికార్డు క్రియేట్‌ చేశారు.  వరుసగా ఐదోసారి కేంద్ర బడ్జెట్‌ను సమర్పించిన ఆమె ఈ సారి బడ్జెట్‌ను ‍ కేవలం 87 నిమిషాల్లో (గంటా 27 నిమిషాల్లో) ముగించారు. తద్వారా అతి తక్కువ సమయం బడ్జెట్‌ ప్రసంగం చేసిన రికార్డును క్రియేట్‌ చేశారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం 2023-24 బడ్జెట్‌ను దాదాపు 16236 పదాలతో అతి చిన్న బడ్జెట్ ప్రసంగం  చేశారు. సాధారణంగా కనీసం 2 గంటల పాటు జరిగే బడ్జెట్ ప్రసంగాలలో ఇది అతి చిన్నది. 

భారతదేశ చరిత్రలో  అతి ఎక్కువ ,తక్కువ బడ్జెట్ ప్రసంగాలు
 ►ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  2020 బడ్జెట్ ప్రసంగంలో 2 గంటల 42 నిమిషాల పాటు ప్రసంగించారు. ఇది బడ్జెట్ ప్రసంగాల చరిత్రలో సుదీర్ఘమైనది.  వ్యవధి పరంగా సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డును సీతారామన్ సొంతం చేసుకున్నారు. 

► భారత తొలి (పూర్తి) మహిళా ఆర్థిక మంత్రి సీతారామన్, 2019లో తన తొలి బడ్జెట్ ప్రసంగంలో, 2 గంటల 17 నిమిషాలు మాట్లాడారు. ఇంకా రెండు పేజీలు మిగిలి ఉన్నప్పటికీ, అస్వస్థతకు గురై తన ప్రసంగాన్ని కుదించుకుని  ప్రసంగంలో మిగిలిన భాగాన్ని చదివినట్లుగా పరిగణించాలని ఆమె స్పీకర్‌ను కోరారు.

ఆ తరువాత  ఫిబ్రవరి 1, 2020న 2020-21 కేంద్ర బడ్జెట్‌ను సమర్పిస్తూ 2 గంటల 42 నిమిషాల పాటు ప్రసంగించి తన రికార్డును తానే  బద్దలు కొట్టారు.  2021లో ఆమె గంటా 50 నిమిషాల పాటు ప్రసంగించారు.
ఇ​క మాజీ ఆర్థిక మంత్రి జస్వంత్ సింగ్ తన 2003 బడ్జెట్ ప్రసంగంలో 2 గంటల 13 నిమిషాల పాటు ప్రసంగించారు.
మాజీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తన 2014 బడ్జెట్ ప్రసంగంలో 2 గంటల 10 నిమిషాల పాటు ప్రసంగించారు.
► పదాల గణన పరంగా, 1991లో మన్మోహన్ సింగ్ సుదీర్ఘ బడ్జెట్ ప్రసంగం చేశారు. ప్రసంగంలో 18,650 పదాలు ఉన్నాయి.

కాగా రానున్న ఎ న్నికలు, మోదీ సర్కార్‌కు చివరి బడ్జెట్‌ కావడంతో   పన్ను చెల్లింపు దారులకు భారీ ఊరట కల్పించారు. అలాగే వేతన జీవుల ఆదాయ పన్నుల ట్యాక్స్‌ ‍శ్లాబ్స్‌లో మార్పులు తీసుకొచ్చారు. పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రసంగంలో పన్ను, అభివృద్ధి, రాష్ట్రాలు, ఆదాయం , ఆర్థిక పదాలు ఎక్కువగా ఉపయోగించగా.  పన్ను అనే పదాన్ని  ఎక్కువగా 51 సార్లు, అభివృద్ధి 28 సార్లు, రాష్ట్రాలు 27 సార్లు, ఆదాయం 26 సార్లు, ఫైనాన్స్ అనే పదాన్ని 25 సార్లు ఉపయోగించారు. స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు అయిన నేపథ్యంలో అన్ని వర్గాల అభివృద్ధికి దోహదపడే అమృత్‌కాల్‌ బడ్జెట్‌ అనే పదాన్ని కూడా ఎక్కువగానే ప్రస్తావించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement