దూసుకెళ్లిన రియాల్టీ: భారీ లాభాల్లో మార్కెట్లు
ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో గృహరంగానికి ఊతమిచ్చేలా ప్రకటనలు వెలువడంతో రియాల్టీ ఇండెక్స్ ఒక్కసారిగా దూసుకెళ్లింది. బీఎస్ఈలో 4.2 శాతం ఎగిసిన రియాల్టీ సూచీ, ప్రస్తుతం 3.38 శాతం వద్ద లాభాల్లో ట్రేడవుతోంది. రియాల్టీ ఇండెక్స్లో మేజర్ షేర్లుగా ఉన్న డీఎల్ఎఫ్(5.74 శాతం), గోద్రేజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్(4.04 శాతం), ఒబేరాయ్ రియాల్టీ లిమిటెడ్(4.24 శాతం), ప్రెస్టేజ్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్(3.19 శాతం), సోబా(2.64 శాతం), యూనిటెక్(3.31 శాతం), హెచ్డీఐఎల్(3.36 శాతం), ఇండియా బుల్ రియల్ ఎస్టేట్ లిమిటెడ్(0.80 శాతం) శాతం పెరిగాయి. హౌసింగ్ పరిశ్రమకు మేలు చేకూరేలా ఇండస్ట్రి వర్గాలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్న సరసమైన గృహాలకు మౌలిక సదుపాయాల స్టేటస్ను జైట్లీ ఈ బడ్జెట్లో కల్పించారు. దీన్ని ద్వారా డెవలపర్లకు ధరలు తగ్గనున్నాయి.
అంతేకాక, ప్రధాని ఆవాస్ యోజన పథకానికి రూ.23వేల కోట్లు కేటాయించనున్నట్టు జైట్లీ తెలిపారు. నేషనల్ హౌసింగ్ బ్యాంకు ద్వారా రూ.20వేల కోట్ల గృహరుణాలను అందించనున్నట్టు హామీ ఇచ్చారు. ఈ ప్రకటనలన్నీ రియాల్టీకి మంచి బూమ్ ఇచ్చాయి. పెద్ద నోట్ల రద్దు అనంతరం డిమాండ్ కుదేలై పడిపోయిన రియాల్టీ ఇండెక్స్, జైట్లీ ప్రసంగం తర్వాత పుంజుకుంది. రియాల్టీకి ఊతమిచ్చేలా జైట్లీ పలు ప్రకటనలు చేస్తారని ముందునుంచి మార్కెట్ వర్గాలు అంచనావేశాయి. అంచనాలకు అనుగుణంగా రియాల్టీకి ఆయన గుడ్ న్యూస్ అందించారు. బడ్జెట్ స్పీచ్ అనంతరం 300 పాయింట్లకు పైగా దూసుకెళ్లిన మార్కెట్లు, ప్రస్తుతం మరింత లాభాల్లోకి దూసుకెళ్లాయి. 406.86 పాయింట్ల లాభంలో 28,062 వద్ద సెన్సెక్స్ ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం 125.35 పాయింట్ల లాభంలో 8,686 వద్ద కొనసాగుతోంది. బ్యాంకింగ్, పీఎస్యూ, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్లు సైతం లాభాల్లో నడుస్తున్నాయి.
గృహరంగానికి అందించిన ప్రోత్సహకాలు :
-
ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద పేద ప్రజలకు ఇళ్ల నిర్మాణాలు చేపట్టడం
-
ఇళ్ల నిర్మాణంలో ఉద్యోగవకాశాలు కల్పించడం
-
2016 జూన్, 2019 మార్చి మధ్యలో అనుమతిచ్చే ఫ్లాట్స్ హౌసింగ్ ప్రాజెక్టుల్లో నాలుగు మెట్రోసిటీల్లో 30 చదరపు మీటర్లు, ఇతర మెట్రో సిటీల్లో 60 చదరపు మీటర్ల వరకు కనీస ప్రత్యామ్నాయ పన్ను.
-
మొదటిసారి గృహ కొనుగోలుదారులు తీసుకునే రూ.35 లక్షల వరకు రుణాల్లో అదనంగా రూ.50వేలపై వేసే వడ్డీరేట్ల నుంచి మినహాయింపు. వచ్చే ఏడాది నుంచి ఇది అమలు.
-
పీపీపీ స్కీమ్ లాంటి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఆఫర్ చేసే స్కీమ్ల కింద 60 చదరపు మీటర్లలో ఇళ్ల నిర్మాణాలకు సర్వీసు పన్ను తొలగింపు
-
ఎక్స్చేంజ్ డ్యూటీ నుంచి కూడా మినహాయింపు