realty index
-
హెచ్డీఎఫ్సీ ఎంఎఫ్ నుంచి నిఫ్టీ రియల్టీ ఇండెక్స్ ఫండ్
హెచ్డీఎఫ్సీ మ్యుచువల్ ఫండ్ సంస్థ తాజాగా హెచ్డీఎఫ్సీ రియల్టీ ఇండెక్స్ ఫండ్‌ను ఆవిష్కరించింది. ఈ ఎన్ఎఫ్వో మార్చి 21తో ముగుస్తుంది. గత 6–7 ఏళ్లుగా లిస్టెడ్ రియల్టీ కంపెనీల ఫండమెంటల్స్, లాభదాయకత మెరుగుపడ్డాయి. రెసిడెన్షియల్, కమర్షియల్, రిటైల్, హాస్పిటాలిటీ, సెజ్ ప్రాజెక్టుల వ్యాప్తంగా దీర్ఘకాలిక వృద్ధికి రియల్టీ రంగానికి గణనీయంగా అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ను ప్రతిబింబించే ఈ ఓపెన్ ఎండెడ్ స్కీములో ఇన్వెస్ట్ చేయడం ద్వారా మరింత మెరుగైన రాబడులు అందుకోవడానికి ఆస్కారం ఉండగలదని హెచ్డీఎఫ్సీ ఏఎంసీ ఎండీ నవ్‌నీత్ మునోత్ తెలిపారు. -
మార్కెట్లకు రియాల్టీకి దెబ్బ, భారీ నష్టాలు
ముంబై: స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లోముగిశాయి. మిడ్ సెషన్ నుంచీ అమ్మకాలు ఊపందుకున్నాయి. చివరికి సెన్సెక్స్ 259 పాయింట్లు కోల్పోయి 32,014 వద్ద, నిఫ్టీ 79 పాయింట్లు నష్టపోయి 9978 వద్ద ముగిశాయి. ఒక దశలో సెన్సెక్స్ 32వేల కిందికి దిగజారినా చివర్లో కీలక మద్దతుస్తాయిని నిలబెట్టుకుంది. అయితే నిఫ్టీ 10వేలకుదిగువన ముగిసింది. ఒక్క మెటల్ తప్ప అన్ని రంగాలూ బలహీనపడ్డాయి. ముఖ్యంగా సెబీ 331 షెల్కంపెనీలపై విధించిన నిబంధనలు, రియాల్టీ పతనం మార్కెట్లను ప్రభావితం చేశాయి. రియల్టీ, పీఎస్‌యూ బ్యాంక్, బ్యాంక్ నిఫ్టీ, ఎఫ్ఎంసీజీ, ఫార్మా కుదేలయ్యాయి. హెచ్‌డీఐఎల్ ఏకంగా 23శాతం పతనమైంది. యూనిటెక్, డీఎల్ఎఫ్, ఇండియాబుల్స్, డెల్టాకార్ప్, శోభా, ఒబెరాయ్ లతోపాటు, ఐవోసీ, డాక్టర్ రెడ్డీస్, బీపీసీఎల్, ఇన్ఫ్రాటెల్, స్టేట్‌బ్యాంక్, కోల్ ఇండియా, టెక్‌మహీంద్రా, యస్‌బ్యాంక్, అంబుజా, బీవోబీ నష్టపోయాయి. అయితే మెటల్ దిగ్గజాలు వేదాంతా, హిందాల్కో, ఫలితాల నేపథ్యంలో టాటా స్టీల్ భారీ లాభాలనార్జించాయి. బజాజ్ ఆటో గెయిల్, సిప్లా, అరబిందో, హెచ్‌యూఎల్ లాభాల్లోముగిశాయి. అటు డాలర్‌మారకంలో రుపీ 0.07 లాభపడి రూ. 63.74 వద్ద, ఎంసీఎక్స్‌మార్కెట్ లోపుత్తడి పది గ్రా. రూ. 28, 460 వద్ద ఉన్నాయి. -
దూసుకెళ్లిన రియాల్టీ: భారీ లాభాల్లో మార్కెట్లు
ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రసంగంలో గృహరంగానికి ఊతమిచ్చేలా ప్రకటనలు వెలువడంతో రియాల్టీ ఇండెక్స్ ఒక్కసారిగా దూసుకెళ్లింది. బీఎస్ఈలో 4.2 శాతం ఎగిసిన రియాల్టీ సూచీ, ప్రస్తుతం 3.38 శాతం వద్ద లాభాల్లో ట్రేడవుతోంది. రియాల్టీ ఇండెక్స్‌లో మేజర్ షేర్లుగా ఉన్న డీఎల్ఎఫ్(5.74 శాతం), గోద్రేజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్(4.04 శాతం), ఒబేరాయ్ రియాల్టీ లిమిటెడ్(4.24 శాతం), ప్రెస్టేజ్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్(3.19 శాతం), సోబా(2.64 శాతం), యూనిటెక్(3.31 శాతం), హెచ్‌డీఐఎల్(3.36 శాతం), ఇండియా బుల్ రియల్ ఎస్టేట్ లిమిటెడ్(0.80 శాతం) శాతం పెరిగాయి. హౌసింగ్ పరిశ్రమకు మేలు చేకూరేలా ఇండస్ట్రి వర్గాలు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్న సరసమైన గృహాలకు మౌలిక సదుపాయాల స్టేటస్‌ను జైట్లీ ఈ బడ్జెట్లో కల్పించారు. దీన్ని ద్వారా డెవలపర్లకు ధరలు తగ్గనున్నాయి. అంతేకాక, ప్రధాని ఆవాస్ యోజన పథకానికి రూ.23వేల కోట్లు కేటాయించనున్నట్టు జైట్లీ తెలిపారు. నేషనల్ హౌసింగ్ బ్యాంకు ద్వారా రూ.20వేల కోట్ల గృహరుణాలను అందించనున్నట్టు హామీ ఇచ్చారు. ఈ ప్రకటనలన్నీ రియాల్టీకి మంచి బూమ్ ఇచ్చాయి. పెద్ద నోట్ల రద్దు అనంతరం డిమాండ్ కుదేలై పడిపోయిన రియాల్టీ ఇండెక్స్, జైట్లీ ప్రసంగం తర్వాత పుంజుకుంది. రియాల్టీకి ఊతమిచ్చేలా జైట్లీ పలు ప్రకటనలు చేస్తారని ముందునుంచి మార్కెట్ వర్గాలు అంచనావేశాయి. అంచనాలకు అనుగుణంగా రియాల్టీకి ఆయన గుడ్ న్యూస్ అందించారు. బడ్జెట్ స్పీచ్ అనంతరం 300 పాయింట్లకు పైగా దూసుకెళ్లిన మార్కెట్లు, ప్రస్తుతం మరింత లాభాల్లోకి దూసుకెళ్లాయి. 406.86 పాయింట్ల లాభంలో 28,062 వద్ద సెన్సెక్స్ ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం 125.35 పాయింట్ల లాభంలో 8,686 వద్ద కొనసాగుతోంది. బ్యాంకింగ్, పీఎస్‌యూ, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్‌లు సైతం లాభాల్లో నడుస్తున్నాయి. గృహరంగానికి అందించిన ప్రోత్సహకాలు : ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద పేద ప్రజలకు ఇళ్ల నిర్మాణాలు చేపట్టడం ఇళ్ల నిర్మాణంలో ఉద్యోగవకాశాలు కల్పించడం 2016 జూన్, 2019 మార్చి మధ్యలో అనుమతిచ్చే ఫ్లాట్స్ హౌసింగ్ ప్రాజెక్టుల్లో నాలుగు మెట్రోసిటీల్లో 30 చదరపు మీటర్లు, ఇతర మెట్రో సిటీల్లో 60 చదరపు మీటర్ల వరకు కనీస ప్రత్యామ్నాయ పన్ను. మొదటిసారి గృహ కొనుగోలుదారులు తీసుకునే రూ.35 లక్షల వరకు రుణాల్లో అదనంగా రూ.50వేలపై వేసే వడ్డీరేట్ల నుంచి మినహాయింపు. వచ్చే ఏడాది నుంచి ఇది అమలు. పీపీపీ స్కీమ్ లాంటి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఆఫర్ చేసే స్కీమ్‌ల కింద 60 చదరపు మీటర్లలో ఇళ్ల నిర్మాణాలకు సర్వీసు పన్ను తొలగింపు ఎక్స్చేంజ్ డ్యూటీ నుంచి కూడా మినహాయింపు