ముంబై: స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లోముగిశాయి. మిడ్ సెషన్ నుంచీ అమ్మకాలు ఊపందుకున్నాయి. చివరికి సెన్సెక్స్ 259 పాయింట్లు కోల్పోయి 32,014 వద్ద, నిఫ్టీ 79 పాయింట్లు నష్టపోయి 9978 వద్ద ముగిశాయి. ఒక దశలో సెన్సెక్స్ 32వేల కిందికి దిగజారినా చివర్లో కీలక మద్దతుస్తాయిని నిలబెట్టుకుంది. అయితే నిఫ్టీ 10వేలకుదిగువన ముగిసింది. ఒక్క మెటల్ తప్ప అన్ని రంగాలూ బలహీనపడ్డాయి. ముఖ్యంగా సెబీ 331 షెల్‌కంపెనీలపై విధించిన నిబంధనలు, రియాల్టీ పతనం మార్కెట్లను ప్రభావితం చేశాయి.
రియల్టీ, పీఎస్‌యూ బ్యాంక్, బ్యాంక్ నిఫ్టీ, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా కుదేలయ్యాయి. హెచ్‌డీఐఎల్ ఏకంగా 23శాతం పతనమైంది. యూనిటెక్, డీఎల్‌ఎఫ్, ఇండియాబుల్స్, డెల్టాకార్ప్, శోభా, ఒబెరాయ్ లతోపాటు, ఐవోసీ, డాక్టర్ రెడ్డీస్, బీపీసీఎల్, ఇన్‌ఫ్రాటెల్, స్టేట్‌బ్యాంక్, కోల్ ఇండియా, టెక్‌మహీంద్రా, యస్‌బ్యాంక్, అంబుజా, బీవోబీ నష్టపోయాయి. అయితే మెటల్ దిగ్గజాలు వేదాంతా, హిందాల్కో, ఫలితాల నేపథ్యంలో టాటా స్టీల్ భారీ లాభాలనార్జించాయి. బజాజ్ ఆటో గెయిల్, సిప్లా, అరబిందో, హెచ్‌యూఎల్ లాభాల్లోముగిశాయి.
అటు డాలర్‌మారకంలో రుపీ 0.07 లాభపడి రూ. 63.74 వద్ద, ఎంసీఎక్స్‌మార్కెట్ లోపుత్తడి పది గ్రా. రూ. 28, 460 వద్ద ఉన్నాయి.
మార్కెట్లకు రియాల్టీకి దెబ్బ, భారీ నష్టాలు
Published Tue, Aug 8 2017 3:47 PM | Last Updated on Mon, Sep 11 2017 11:36 PM
Advertisement