![RBI Board Meeting Will Be Held On Feb 14 To Discuss About Budget 2023 - Sakshi](/styles/webp/s3/article_images/2022/02/10/RBI.jpg.webp?itok=m1tXMLG6)
న్యూఢిల్లీ: ఆర్‌బీఐ బోర్డ్ ఈ నెల 14వ తేదీన బడ్జెట్ అనంతర సాంప్రదాయ సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశం ప్రధానంగా 2022–23 వార్షిక బడ్జెట్ ముఖ్యాంశాలపై చర్చించనుంది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారని ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ద్రవ్యలోటు, మూలధన ప్రణాళికలు, ప్రభుత్వ మార్కెట్ రుణ సమీకరణల వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో సమీక్ష జరిపే అవకాశం ఉందని సమాచారం. లోక్‌సభలో వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తర్వాత ఆర్‌బీఐ గవర్నర్, డిప్యూటీ గవర్నర్లతో కూడిన ఆర్‌బీఐ బోర్డ్‌ను ఉద్దేశించి ఆర్థిక మంత్రి ప్రసంగించడం సాంప్రదాయకంగా వస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment