ముంబై: బడ్జెట్ నేపథ్యంలో స్టాక్ మార్కెట్ సూచీలు పరుగులు పెడుతున్నాయి. ఆర్థిక సర్వే ఫలితాలు సైతం ఆశజనకంగా ఉండటం వృద్ధి రేటు 9 శాతానికి పైగా ఉండటంతో ఇన్వెస్టర్లు మార్కెట్‌పై నమ్మకం చూపిస్తున్నారు. మార్కెట్ ప్రారంభమైన అరగంటలోపే బీఎస్‌ఈ సెన్సెక్స్ 500ల పాయింట్లు లాభపడగా నిఫ్టీ 151 పాయింట్లు లాభంలో ఉంది. మార్కెట్ ముగిసే సరికి సెన్సెక్స్ వెయ్యి పాయింట్ల లాభంతో ముగియవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
నిన్న సాయంత్రం బీఎస్‌ఈ సెన్సెక్స్ 58,014 పాయింట్ల దగ్గర క్లోజయ్యింది. ఈ రోజు ఉదయం ఏకంగా 500 పాయింట్లకు పైగా లాభంతో 58,672 పాయింట్లతో మొదలైంది. ఉదయం 9:20 గంటల సమయంలో 588 పాయింట్ల లాభంతో 58,652 పాయింట్ల దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 151 పాయింట్ల లాభంతో 17,491 పాయింట్ల దగ్గర కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment