Budget 2022: Government Main Focus On Election Of 5 States Details Inside - Sakshi
Sakshi News home page

బడ్జెట్‌ 2022: ఆ రాష్ట్రాల మీదే కేంద్రం ఫోకస్‌! ఆల్‌ ఈజ్‌ వెల్‌.. మరి నిర్మలమ్మ కరుణించేనా?

Published Tue, Feb 1 2022 9:55 AM | Last Updated on Tue, Feb 1 2022 11:03 AM

Budget 2022 Government Main Focus On Election States - Sakshi

Union Budget 2022 Updates: ప్రధాని మోదీ హయాంలోని బీజేపీ ప్రభుత్వం పదోసారి బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. రాష్ట్రపతిని కలిసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌.. వార్షిక బడ్జెట్‌ వివరాలు తెలిపారు.  కాసేపట్లో కేంద్ర కేబినెట్‌ సమావేశం జరగనుంది. బడ్జెట్‌కు కేబినెట్‌ ఆమోద ముద్ర తర్వాత పార్లమెంట్‌ బడ్జెట్‌ సెషన్‌ రెండో రోజు ప్రారంభం కానుంది. 80సీ కింద మినహాయింపులు(లక్షన్నర నుంచి రూ. 3లక్షల పెంచుతారనే ఆశ) మీద వేత జీవుల ఆశలు, స్టాండర్డ్‌ డిడక్షన్‌ 50 వేల నుంచి లక్ష రూ. పెంచడం లాంటి అంశాల మీద అందరి దృష్టి ఉంది. అయితే.. 

కరోనాతో గత రెండేళ్లుగా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఆర్థిక పురోగతికి ఈ ఏడాది కలిసి రావొచ్చనే అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం మూడో వేవ్‌లో ఉన్నప్పటికీ.. పరిస్థితి మెరుగైందనే చెప్పొచ్చు. ఈ తరుణంలో రూ.2.5 లక్షలుగా ఉన్న ఐటీ పరిమితి మినహాయింపులు పెరిగే అవకాశాలు తక్కువనే నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఐదు స్టేట్స్‌లో ఎలక్షన్స్‌ నేపథ్యంలో.. వాటి మీదే ప్రధాన ఫోకస్‌ ఉండొచ్చని, వ్యవసాయ, పారిశ్రామికరణ.. ఇతరత్ర కేటాయింపులు ఉండొచ్చనే టాక్‌ ప్రధానంగా వినిపిస్తోంది. (చదవండి: Budget 2022 LIVE Updates)

గతంలో ఎలక్షన్‌ సంబంధిత రాష్ట్రాలకు జరిగిన కేటాయింపులనే అందుకు ఉదాహరణలుగా చూపిస్తున్నారు. వ్యవసాయం మాత్రమే కాదు.. మౌలిక వసతులు, రోడ్లు, రైల్వే, ఇరిగేషన్‌, మెడిసిన్‌ సంబంధిత బడ్జెట్‌ వరాలు సైతం ఆయా రాష్ట్రాల పైనే కురవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు బీజేపీ వ్యతిరేక రాష్ట్రాల్లోనూ పట్టు కోసం బడ్జెట్‌ ఫోకస్‌ ఉండొచ్చనే వాదనా వినిపిస్తోంది. దీంతో అసంతృప్త రాష్ట్రాల పరిస్థితిపై జోరుగా చర్చ నడుస్తోంది. అదే సమయంలో..

2022-2023 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 8-8.5 శాతంగా ఉండొచ్చనే లెక్కల నడుమ.. రాబడి పెరగడంతో(గత రెండేళ్లలో పోలిస్తే) ఆర్థిక వ్యవస్థకు ద్రవ్యపరంగా ఆసరా అందించే ఆస్కారం ఉందనే ఆశ మాత్రం ఉంది. వ్యాక్సినేషన్‌, సర్వీస్‌ సెక్టార్‌, నియంత్రణల సడలింపులు, ఎరువుల రాయితీలు, అంతరిక్షంలో ప్రైవేటీకరణ, రైల్వేలో పెట్టుబడులకు అవకాశం, రహదారుల నిర్మాణం, స్టార్టప్‌లకు వెన్నుదన్ను.. తదితర అంశాలపైనే ప్రధాన ఫోకస్‌ ఉన్నట్లు అర్థమవుతోంది.  భవిష్యత్‌ సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటిస్తున్నప్పటికీ.. అసంతృప్త రాష్ట్రాలకు కేటాయింపుల విషయంలో కేంద్రం కరుణ చూపిస్తుందా? లేదంటే ఎప్పటిలాగే మొండి చేయి ఇస్తుందా? అనేది మరికొన్నిగంటల్లో తేలిపోనుంది.

సంబంధిత వార్త: బడ్జెట్‌ బూస్ట్‌.. భారీ లాభాలు!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement