priority
-
Parliament Session 2024: యూపీఏపై నిర్మల నిప్పులు
న్యూఢిల్లీ: యూపీఏ హయాంలో ఒక్క కుటుంబానికే ప్రాధాన్యమిచ్చి, దేశ ఆర్థిక పరిస్థితిని దయనీయ స్థితికి దిగజార్చారంటూ కాంగ్రెస్‌పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దుమ్మెత్తిపోశారు. ‘‘దేశ ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రం, భారతీయులపై దాని ప్రభావం’ అంశంపై లోక్‌సభలో చర్చ సందర్భంగా ఆమె మాట్లాడారు. ‘‘మోదీ ప్రభుత్వానికి దేశమే తొలి ప్రాధాన్యం. యూపీఏకు మాత్రం ఆ ఒక్క (గాం«దీ) కుటుంబమే ముఖ్యం. 2008లో దేశం ఆర్థికమాంద్యం కోరల్లో చిక్కుకుంటే జాతి ప్రయోజనాల పరిరక్షణకు యూపీఏ ప్రభుత్వాలు ముందుకు రాలేదు. ఆర్థిక వ్యవస్థను కాపాడే ప్రయత్నాలు చేయకపోగా కాంగ్రెస్ చేతులెత్తేసింది. పలు స్కామ్‌లతో దేశార్థికాన్ని దీనావస్థలోకి నెట్టి 2014లో ని్రష్కమించారు. వాళ్లు అధికారంలో కొనసాగితే ఇంకెన్ని దారుణాలు జరిగేవో దేవుడికే తెలుసు. సోనియా గాంధీ సూపర్ పీఎంగా ఉండటం వల్లే యూపీఏ హయాంలో ఆర్థికవ్యవస్థ నిర్వహణ అస్తవ్యస్తంగా ఉండేది. వాళ్లిప్పుడు మాకు సంక్షోభాలను ఎలా ఎదుర్కోవాలో నేరి్పస్తున్నారా?’’ అంటూ ఆగ్రహించారు. కోవిడ్ సంక్షోభంలో మోదీ సర్కార్ ఎంతటి సమర్థతతో, అంకితభావంతో పనిచేసిందో, పరిస్థితిని చక్కదిద్దిందో అంతా చూశారన్నారు. వరుస కుంభకోణాలు ‘‘బొగ్గు కుంభకోణం కారణంగా దేశం రూ.1.86 లక్షల కోట్ల ఆదాయం కోల్పోయిందని కాగ్ ఆక్షేపించింది. సుప్రీంకోర్టు సైతం యూపీఏ ప్రభుత్వాన్ని తలంటి ఏకంగా 214 బొగ్గు బ్లాకుల లైసెన్స్‌ను రద్దుచేసింది. కోల్‌స్కామ్ ధాటికి చివరకు చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. బొగ్గు కొరత ఏర్పడింది. విద్యుదుత్పత్తి తగ్గింది. మొత్తంగా పెట్టుబడులూ దెబ్బతిన్నాయి. అదే మోదీ ప్రభుత్వ పాలనలో పారదర్శకంగా బొగ్గు బ్లాకుల వేలం జరిగింది. వాళ్లు బొగ్గును బూడిదగా మార్చారు. మా మోదీ సర్కార్ లాభసాటి విధానాలతో బొగ్గును వజ్రాల వ్యాపారమంత విలువైనదిగా మార్చింది’’ అన్నారు. నాడు పరువు పోతే నేడు ప్రతిష్ఠ పెరిగింది ‘‘యూపీఏ హయాంలో కామన్వెల్త్ క్రీడల కుంభకోణంతో దేశం పరువు పోయింది. ఇప్పుడు ప్రతిష్టాత్మక జీ20 శిఖరాగ్ర సదస్సును ఔరా అనిపించేలా నిర్వహించి దేశ ప్రతిష్టను అంతర్జాతీయంగా పెంచాం. బ్యాంకింగ్ రంగమంటే మాకు గౌరవం. కానీ యూపీఏ హయంలో ప్రభుత్వ పెద్దలు తాము చెప్పిన వారికి రుణాలొచ్చేలా చేసి మొండిబకాయిలు పెరగడానికి కారకులయ్యారు. మోదీ హయాంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మొండి బకాయిలు 3.2 శాతానికి దిగొచ్చాయి’’ అన్నారు. యూపీఏ పాలనపై బురదజల్లుతున్నారంటూ నిర్మల ప్రసంగానికి విపక్ష సభ్యులు అడ్డుతగిలారు. -
ఫిక్స్.. డిజిటల్ డిటాక్స్
సాక్షి, హైదరాబాద్: నగరవాసులు కొత్త సంవత్సరంలో తీసుకునే తీర్మానాల్లో సరికొత్తగా ఒకటి వచ్చి చేరింది. జిమ్‌కు వెళ్లాలి, డైట్ ఫాలో కావాలి, టైమ్ మేనేజ్మెంట్ చేయాలి, కుటుంబ సభ్యులకు సమయం కేటాయించాలి తదిరాలన్నీ గతం నుంచి ఉంటూ వచ్చేవి. కానీ 2024లో మాత్రం అలాంటి తీర్మానాల వరుసలో డిజిటల్ డిటాక్స్ వచ్చింది. విపరీతంగా ఎల్రక్టానిక్ డివైజ్‌లకు అలవాటు పడుతూ రకరకాల మానసిక సమస్యలకు గురవుతున్న పలువురు వైద్యుల సూచనల ప్రకారం దీనిని తమ తీర్మానాల జాబితాలో ప్రధానంగా చేర్చినట్టు ‘సాక్షి’కి తెలిపారు. ఈ నేపథ్యంలో ఇలా డిజిటల్ డిటాక్స్‌ను తీర్మానంగా ఎంచుకున్నవారు లక్ష్యాన్ని సాధించేందుకు గాను వైద్యులు చేస్తున్న సూచనలివీ.. ► సినిమాలు ఇతర వినోదాలకు ఇంట్లో టీవీలు, ఆఫీసు పనిలో భాగంగా డెస్క్‌టాప్/ ల్యాప్‌టాప్, సోషల్ మీడియా వగైరాలకు స్మార్ట్ ఫోన్స్...ఇలా స్క్రీన్ వీక్షణ తగ్గించాలి. ► దీని కోసం ఆయా డిజిటల్ పరికరాల వినియోగం నుంచి క్రమం తప్పని విరామం తీసుకోవాలి. ► మొబైల్‌ను అవసరమైన పనులకు మాత్రమే వినియోగించాలి. ► తప్పనిసరి అయ్యి లేదా అనుకోకుండానో ఒక రోజులో ఎక్కువ సమయం డిజిటల్ పరికరాలతో గడిపితే ఆ మరుసటి రోజు అంతకు రెట్టింపు సమయం వాటి నుంచి విరామం తీసుకోవాలి. ► ప్రతీ రోజూ నిద్రకు ముందు నిద్ర నుంచి లేచిన తర్వాత నిర్ణీత వేళలు నిర్ణయించుకుని స్కీన్ర్కు దూరంగా ఉండాలి. ► స్కీన్స్ర్తో సంబంధం లేని కార్యకలాపాల్లో పాల్గొనడానికి ఒక రోజు సంపూర్ణంగా ‘డిజిటల్ డిటాక్స్’రోజుగా పరిగణించాలి. -
ఈ ఏడాది 6.5 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది(2023–24) 6.5 శాతం వృద్ధిని సాధించగలదని ప్రధాన ఆర్థిక సలహాదారు(సీఈఏ) వి.అనంత నాగేశ్వరన్ తాజాగా అంచనా వేశారు. ఈ దశాబ్దం అనిశ్చితికి నిదర్శనంగా నిలవనున్నదని వ్యాఖ్యానించారు. ఒకవేళ కార్పొరేట్ రంగం పెట్టుబడులను ఆలస్యంచేస్తే ఉపాధి కల్పన, ఆర్థిక వృద్ధి సాకారంకావని అభిప్రాయపడ్డారు. ఆర్థిక శాఖ విషయానికివస్తే జీడీపీ వృద్ధి, ఆదాయ పురోగతి తదితరాలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలియజేశారు. సగటున 6.5 శాతం ఆర్థికాభివృద్ధిని ఆశిస్తున్న నేపథ్యంలో మరింత పురోగతి అందుకోవడం ద్వారా ఆశ్చర్యాలకు తెరతీసే అవకాశమున్నట్లు పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన ఒక సదస్సులో వివరించారు. కాగా.. గతేడాది(2022–23)లో దేశ ఆర్థిక వ్యవస్థ 7.2 శాతం పుంజుకోగా.. మార్చితో ముగియనున్న ఈ ఆర్థిక సంవత్సరం(2023–24) 6.5 శాతం జీడీపీ వృద్ధిని రిజర్వ్ బ్యాంక్ అంచనా వేసింది. ఈ బాటలో అంతర్జాతీయ ద్రవ్యనిధి, ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్ సైతం 6.3 శాతం వృద్ధిని మదింపు చేశాయి. అయితే ఈ ఏడాది క్యూ2లో జీడీపీ 7.6 శాతం బలపడిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో నాగేశ్వరన్ అంచనాలకు ప్రాధాన్యత ఏర్పడినట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. -
బీసీన్ మారుస్తుందా?
కె. రాహుల్: తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీ వర్గాలకు చెందిన నేతను ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించడం ద్వారా బీసీ ఎజెండాతో బీజేపీ ఎన్నికల గోదాలోకి దిగుతున్న విషయం స్పష్టమైంది. గత కొంతకాలంగా ఆ పార్టీలో బీసీలకు ప్రాధాన్యం పెంచుతున్న నేపథ్యంలో బీసీ సీఎంపై కూడా పార్టీ అధినాయకత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. అటు అధికార బీఆర్ఎస్, ఇటు ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తాము గెలిస్తే బీసీ అభ్యర్థిని సీఎం చేస్తామని ప్రకటించే అవకాశాలు లేకపోవడంతో బీజేపీకి ఇప్పుడు ఇదే ప్రధాన ఎజెండాగా మారింది. కచ్చితమైన వ్యూహంతో ముందుకు.. కచ్చితమైన వ్యూహంతో ప్రజల్లోకి వెళ్లాలనే నిర్ణయంలో భాగంగానే అధికార బీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షం అంత బలంగా ఎత్తుకోని బీసీ నినాదాన్ని బీజేపీ తలకెత్తుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.. తాజాగా ఈ నిర్ణయాన్ని సూర్యాపేట సభలో అమిత్‌షా ప్రకటించడానికి ముందే సంస్థాగతంగా పార్టీలో వివిధ స్థాయిల్లో చర్చించి, ముఖ్యనేతలు, రాష్ట్రకార్యవర్గం, కౌన్సిల్ సభ్యుల స్థాయిలో అభిప్రాయసేకరణ చేపట్టారు. ఈ భేటీల్లోనూ రెడ్డి, ఇతర సామాజికవర్గనేతల నుంచి కూడా సానుకూల స్పందన రావడంతో బీసీ ఎజెండాతోనే ముందుకెళితేనే మంచి ఫలితాలు సాధించవచ్చుననే నిశ్చితాభిప్రాయానికి జాతీయ నాయకత్వం వచ్చినట్టు తెలిసింది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ అభ్యర్థుల గెలుపోటముల్లో బీసీల ఓట్లు కీలకం. రాష్ట్ర జనాభాలో 54 శాతం వరకు బీసీ వర్గాల వారు ఉన్నారనే అంచనాల నేపథ్యంలో అధికశాతం బీసీల ఓట్లు బీజేపీ ఖాతాలో పడేందుకు బీసీ సీఎం నినాదం పనిచేస్తుందని పార్టీ అధినాయకత్వం భావిస్తోంది. అయితే ఇదే సమయంలో బీసీ ఎజెండాతో ఇతర సామాజికవర్గాల నుంచి వ్యతిరేకత రాకుండా తగిన జాగ్రత్తలూ తీసుకోవాలని నిర్ణయించింది. విస్తృత ప్రచారంతో... వారిని చేరుకోవడమే కీలకం 2014 అసెంబీ ఎన్నికల్లో టీడీపీ బీసీ సీఎం నినాదాన్ని ఎత్తుకున్నా అది అస్సలు వర్కవుట్ కాలేదు. సీనియర్‌నేత టి దేవేందర్‌గౌడ్ కూడా బీసీల కోసం పార్టీ పెట్టినా ఈ వర్గాల నుంచి పెద్దగా మద్దతు కూడగట్టలేకపోయారు. ఈ నేపథ్యంలో బీసీ సీఎం ఎజెండాతో ఎన్నికల బరిలోకి దిగుతున్న బీజేపీ ఆచితూచి అడుగులు వేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే బీసీ, ఎంబీసీ కులాల పెద్దలు, నేతలను కలిసి వారి మద్దతు కూడగట్టాలని బీజేపీ నేతలు యోచిస్తున్నారు. బీసీ సీఎం అభ్యర్థిని ఎవరన్నది కూడా త్వరలో ప్రకటించే యోచనలో బీజేపీ ఉంది. 40కి పైగా సీట్లు ఇచ్చేలా.. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 40కి పైగానే బీసీ అభ్యర్థులకు టికెట్లు ఇచ్చేలా నాయకత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. మొత్తం సీట్లలో మూడోవంతుకు పైగానే సీట్లు ఇచ్చామనే సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తోంది. తొలిజాబితాను 52 మంది అభ్యర్థులతో విడుదల చేయగా, అందులో బీసీవర్గాలకు చెందిన వారికి 19 మందికి అవకాశం కల్పించారు. రెండో జాబితాలో ఒకరికి, తాజాగా 35 మందితో మూడో జాబితాను ప్రకటించగా అందులో 13 మంది బీసీలకు టికెట్లు కేటాయించారు. మొత్తంగా చూస్తే.. ప్రకటించిన 88 సీట్లలో 32 మంది బీసీ వర్గాలకు వచ్చారు. ఇంకా 31 సీట్లకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండగా, జనసేనకు 11 సీట్లు కేటాయిస్తే.. మిగిలిన 20 సీట్లలో పదిదాకా బీసీలకు కేటాయించే అవకాశాలున్నాయంటున్నారు. ఆయా కులాల వారీగా చూస్తే ముదిరాజ్–గంగపుత్రులు కలిపి (45 లక్షలు) యాదవ (35 లక్షలు), గౌడ (28 లక్షలు), మున్నూరుకాపు (22 లక్షలు), పద్మశాలి (18 లక్షలు),రజక (12 లక్షలు ),వడ్డెర (10 లక్షలు), ఇతర ఎంబీసీ కులాలకు చెందిన వారు 40 లక్షలదాకా ఉండొచ్చని బీజేపీ అంచనా వేస్తోంది. ఇందుకు తగ్గట్టుగానే ఆయా కులాల వారీగా టికెట్లు కేటాయిపునకు కసరత్తు సాగుతున్నట్టు తెలుస్తోంది. ప్రధాని మోదీ పథకాలతో.. జాతీయస్థాయిలో బీజేపీ తీసుకున్న ‘సబ్కా సాథ్, సబ్ కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్’ నినాదంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో బీసీలు, ఎంబీసీల అభ్యున్నతి కోసం చేపట్టిన కార్యక్రమాలు, అమలు చేసిన పథకాలకు విస్తృత ప్రచారం కల్పిస్తే మంచి ఫలితాలను సాధించొచ్చునని భావిస్తున్నారు. మోదీ హయాంలో ఆయా బీసీవర్గాలకు అందిన ప్రయోజనాలను వివరించనున్నారు. ఎంబీసీ వర్గానికి చెందిన మోదీని బీజేపీ తొలిసారిగా ప్రధానిగా నియమించడం, కేంద్ర కేబినెట్లో గతంలో ఎన్నడూ లేని విధంగా 27 మంది వెనుకబడిన తరగతుల వారి నియామకం, అదే విధంగా ఎస్సీ, ఎస్టీవర్గాల వారికి కూడా అత్యధిక ప్రాతినిధ్యం కల్పించడం... ఈ పరిణామాలను జనంలోకి బలంగా తీసుకువెళ్లాలని భావిస్తున్నారు. ఇక సీఎం అభ్యర్థులను ప్రకటించే సంప్రదాయం, ఆనవాయితీ బీజేపీలో లేకపోయినా తెలంగాణలో ఈ సారి ముందుగానే బీసీ అభ్యర్థిని ప్రకటించే అవకాశాలున్నాయని పార్టీవర్గాల విశ్వసనీయ సమాచారం. -
గగన్‌యాన్‌లో మహిళా పైలట్లకు ప్రాధాన్యం
తిరువనంతపురం: గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా చేపట్టే మానవసహిత అంతరిక్ష కార్యక్రమంలో మహిళా పైలట్లు, మహిళా శాస్త్రవేత్తలకే ఇస్రో ప్రాధాన్యం ఇస్తుందని, భవిష్యత్తులో మహిళా వ్యోమగాములనే అంతరిక్షంలోకి పంపుతామని సంస్థ చైర్మన్ ఎస్.సోమనాథ్ వెల్లడించారు. వచ్చే ఏడాది ప్రయోగించే మానవ రహిత గగన్‌యాన్ అంతరిక్ష నౌకలో మనిషిని పోలిన మహిళా హ్యూమనాయిడ్‌ను ఇస్రో పంపుతుందని తెలిపారు. 2025 నాటికి మానవ సహిత మిషన్‌ను భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులోని దిగువ కక్ష్యలోకి పంపుతామని, అది మూడు రోజుల తర్వాత సురక్షితంగా భూమికి తిరిగి చేరుకుంటుందని వివరించారు. ప్రస్తుతానికి మహిళా ఫైటర్ టెస్ట్ పైలట్లు దొరకనందున ఎయిర్ ఫోర్స్ ఫైటర్ టెస్ట్ పైలట్లనే అంతరిక్ష యాత్రకు ఎంపిక చేస్తున్నాం. మహిళా పైలట్లు అందుబాటులోకి వస్తే వారినే ఎంపిక చేసుకుంటాం. ఆ తర్వాత మహిళా సైంటిస్టుల వంతు. అప్పుడిక మహిళలకు ఎక్కువ అవకాశాలు అందుబాటులోకి వస్తాయి’ అని సోమనాథ్ చెప్పారు. 2035 నాటికి పూర్తి స్థాయిలో అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు. శనివారం గగన్‌యాన్ యాత్రలో సన్నాహక పరీక్షల్లో భాగమైన క్రూ ఎస్కేప్ మాడ్యూల్‌ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించిన విషయం తెలిసిందే. -
భారత్–అమెరికా భాగస్వామ్యానికి ప్రపంచంలో ప్రాముఖ్యత: బైడెన్
వాషింగ్టన్: భారత్–అమెరికా భాగస్వామ్యానికి, స్నేహానికి ప్రపంచంలో అత్యధిక ప్రాముఖ్యత ఉందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఉద్ఘాటించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు గతంలో ఎన్నడూ లేనంత బలంగా, సన్నిహితంగా, స్థిరంగా ఉన్నాయని వివరించారు. వ్యూహాత్మక సాంకేతిక భాగస్వామ్యాన్ని మరింత ఉన్నతస్థాయికి చేర్చాలని భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా నిర్ణయించుకున్నామని తెలిపారు. ఈ మేరకు బైడెన్ తాజాగా ట్వీట్ చేశారు. బైడెన్ ట్వీట్ పట్ల ప్రధాని మోదీ స్పందించారు. భారత్–అమెరికా స్నేహం ప్రపంచదేశాల అభ్యున్నతికి తోడ్పతుందని పేర్కొన్నారు. మన భూగోళం మరింత ఉత్తమంగా, స్థిరంగా మారడానికి ఇరుదేశాల భాగస్వామ్యం ఎంతగానో ఉపయోగపడుతుందని ట్విట్టర్లో స్పష్టం చేశారు. బైడెన్ అభిప్రాయంతో తాను ఏకీభవిస్తున్నానని తెలిపారు. ఇటీవల తాను చేపట్టిన పర్యటన భారత్–అమెరికా నడుమ సంబంధ బాంధవ్యాల బలోపేతానికి దోహదపడుతుందని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. భారత్, అమెరికా దేశాల మధ్యనున్న సన్నిహిత, లోతైన భాగస్వామ్యాన్ని మోదీ పర్యటన మరింత దృఢతరం చేసిందని అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసమైన వైట్‌హౌజ్ హర్షం వ్యక్తం చేసింది. -
International Womens Day: మహిళల హైరింగ్‌కు పెరుగుతున్న ప్రాధాన్యం
ముంబై: దేశీయంగా ఉద్యోగ నియామకాల్లో మహిళలకు ప్రాధాన్యమిచ్చే ధోరణి పెరుగుతోంది. కంపెనీల్లో వైట్ కాలర్ ఉద్యోగాల్లో (ఆఫీసుల్లో చేసే) మహిళల రిక్రూట్మెంట్కు సంబంధించి గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరిలో డిమాండ్ 35 శాతం పెరిగింది. జాబ్ ప్లాట్‌ఫామ్ ఫౌండిట్ (గతంలో మాన్స్టర్ ఏపీఏసీ, ఎంఈ) తమ పోర్టల్‌లో నమోదైన హైరింగ్ గణాంకాల ఆధారంగా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. మహిళా ఉద్యోగుల సంఖ్యను పెంచుకునే దిశగా.. నెలసరి, శిశు సంరక్షణ తదితర సందర్భాల కోసం ప్రత్యేకంగా సెలవులు ఇవ్వడం, కార్యాలయాల్లో పక్షపాత ధోరణులను నిరోధించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంలాంటి అంశాలపై కంపెనీలు దృష్టి పెడుతున్నాయి. అలాగే పని విషయంలో వెసులుబాటు కల్పించడం వంటివి చేస్తున్నాయి. మహిళా ఉద్యోగులకు డిమాండ్‌పరంగా చూస్తే ఐటీఈఎస్/బీపీవో రంగంలో అత్యధికంగా 36 శాతం, ఐటీ/కంప్యూటర్స్–సాఫ్ట్వేర్ (35%), బ్యాంకింగ్/అకౌంటింగ్/ఆర్థిక సర్వీసులు (22%)గా ఉంది. -
బడ్జెట్ 2022: ఆ రాష్ట్రాల మీదే ఫుల్ ఫోకస్?
Union Budget 2022 Updates: ప్రధాని మోదీ హయాంలోని బీజేపీ ప్రభుత్వం పదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. రాష్ట్రపతిని కలిసిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. వార్షిక బడ్జెట్ వివరాలు తెలిపారు. కాసేపట్లో కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. బడ్జెట్‌కు కేబినెట్ ఆమోద ముద్ర తర్వాత పార్లమెంట్ బడ్జెట్ సెషన్ రెండో రోజు ప్రారంభం కానుంది. 80సీ కింద మినహాయింపులు(లక్షన్నర నుంచి రూ. 3లక్షల పెంచుతారనే ఆశ) మీద వేత జీవుల ఆశలు, స్టాండర్డ్ డిడక్షన్ 50 వేల నుంచి లక్ష రూ. పెంచడం లాంటి అంశాల మీద అందరి దృష్టి ఉంది. అయితే.. కరోనాతో గత రెండేళ్లుగా సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఆర్థిక పురోగతికి ఈ ఏడాది కలిసి రావొచ్చనే అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం మూడో వేవ్‌లో ఉన్నప్పటికీ.. పరిస్థితి మెరుగైందనే చెప్పొచ్చు. ఈ తరుణంలో రూ.2.5 లక్షలుగా ఉన్న ఐటీ పరిమితి మినహాయింపులు పెరిగే అవకాశాలు తక్కువనే నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు ఐదు స్టేట్స్లో ఎలక్షన్స్ నేపథ్యంలో.. వాటి మీదే ప్రధాన ఫోకస్ ఉండొచ్చని, వ్యవసాయ, పారిశ్రామికరణ.. ఇతరత్ర కేటాయింపులు ఉండొచ్చనే టాక్ ప్రధానంగా వినిపిస్తోంది. (చదవండి: Budget 2022 LIVE Updates) గతంలో ఎలక్షన్ సంబంధిత రాష్ట్రాలకు జరిగిన కేటాయింపులనే అందుకు ఉదాహరణలుగా చూపిస్తున్నారు. వ్యవసాయం మాత్రమే కాదు.. మౌలిక వసతులు, రోడ్లు, రైల్వే, ఇరిగేషన్, మెడిసిన్ సంబంధిత బడ్జెట్ వరాలు సైతం ఆయా రాష్ట్రాల పైనే కురవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. మరోవైపు బీజేపీ వ్యతిరేక రాష్ట్రాల్లోనూ పట్టు కోసం బడ్జెట్ ఫోకస్ ఉండొచ్చనే వాదనా వినిపిస్తోంది. దీంతో అసంతృప్త రాష్ట్రాల పరిస్థితిపై జోరుగా చర్చ నడుస్తోంది. అదే సమయంలో.. 2022-2023 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 8-8.5 శాతంగా ఉండొచ్చనే లెక్కల నడుమ.. రాబడి పెరగడంతో(గత రెండేళ్లలో పోలిస్తే) ఆర్థిక వ్యవస్థకు ద్రవ్యపరంగా ఆసరా అందించే ఆస్కారం ఉందనే ఆశ మాత్రం ఉంది. వ్యాక్సినేషన్, సర్వీస్ సెక్టార్, నియంత్రణల సడలింపులు, ఎరువుల రాయితీలు, అంతరిక్షంలో ప్రైవేటీకరణ, రైల్వేలో పెట్టుబడులకు అవకాశం, రహదారుల నిర్మాణం, స్టార్టప్‌లకు వెన్నుదన్ను.. తదితర అంశాలపైనే ప్రధాన ఫోకస్ ఉన్నట్లు అర్థమవుతోంది. భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటిస్తున్నప్పటికీ.. అసంతృప్త రాష్ట్రాలకు కేటాయింపుల విషయంలో కేంద్రం కరుణ చూపిస్తుందా? లేదంటే ఎప్పటిలాగే మొండి చేయి ఇస్తుందా? అనేది మరికొన్నిగంటల్లో తేలిపోనుంది. సంబంధిత వార్త: బడ్జెట్ బూస్ట్.. భారీ లాభాలు! -
‘గ్యాప్’ పెరుగుతోందా? వైట్‌హౌస్‌లో ఏదో తేడా కొడుతోంది!
అమెరికా తొలి మహిళా ఉపాధ్యక్షరాలిగా చరిత్రకెక్కిన భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్‌కు ‘వైట్‌హౌస్’లో ప్రాధాన్యత తగ్గుతోందా? బాధ్యతల నిర్వహణలో ఆమె ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? అంటే అవుననే అంటున్నాయి ప్రముఖ మీడియా సంస్థలు. కమలా హ్యారిస్‌తో అధ్యక్షుడు జో బైడెన్ కీలక బృందంలోని సభ్యులకు పొసగడం లేదని, ఫలితంగా పాలనా వ్యవహారాల్లో ఆమె పాత్ర క్రమేపీ తగ్గుతోందని ఏఎఫ్‌పీ వార్తా సంస్థ పేర్కొంది. కమల కమ్యూనికేషన్ డైరెక్టర్ ఆష్లే ఇటైనీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారని తొలుత వార్తలు వెలువడ్డాయి. ఉపాధ్యక్షురాలికి ముఖ్య అధికార ప్రతినిధిగా పనిచేస్తున్న సైమోన్ సాండర్స్ ఈ ఏడాది చివర్లో పదవి నుంచి వైదొలగనున్నారు. హ్యారిస్ జట్టులో వీరిద్దరూ అత్యంత ముఖ్యులు. ఎన్నికల ప్రచారంలో కమలా హ్యారిస్ ఇమేజ్ను పెంచడంలో, ఆమె ప్రతిభను, నాయకత్వ పటిమను విజయవంతంగా అమెరికా ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలకభూమిక పోషించారు. అత్యంత ముఖ్యులు, సీనియర్లు ఇద్దరూ ఒకే సమయంలో కమలా హ్యారిస్‌కు దూరమవ్వడం... యాదృచ్చికంగా కాదని ‘సీఎన్ఎన్’ వార్తా సంస్థ అభిప్రాయపడింది. వైట్‌హౌస్‌లో అంతా సవ్యవంగా లేదని, ఏదో తేడా కొడుతోందని పేర్కొంది. ‘ముద్ర’పడిపోతుందనే భయమా? కమలా హ్యారిస్‌కు అత్యంత సన్నిహితురాలైన సైమోన్ సాండర్స్ వైదొలుగుతున్న విషయాన్ని ధృవీకరిస్తూ వైట్‌హౌస్ అధికార ప్రతినిధి జెన్ సాకీ ‘ఆమె ఎప్పటికీ బైడెన్– హ్యారిస్ కుటుంబం (సన్నిహిత బృందం)లో సభ్యురాలే. రెండు మూడేళ్లు ఒక పదవిలో పనిచేశాక కొత్త బాధ్యతలు సిద్ధం కావడం సహజమే. తొలి ఏడాది వైట్‌హౌస్‌లో పనిచేయడం ఉత్సాహాన్ని, సంతృప్తిని ఇస్తుంది. అదే సమయంలో కఠోరమైన శ్రమకు, తీవ్ర అలసటకు గురిచేస్తుంది’ అని అన్నారు. ‘సైమోన్‌ను నేనెంతో అభిమానిస్తాను. తదుపరి ఆమె ఏం చేస్తారనేది తెలుసుకోవడానికి ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్నాను. బాధ్యతల నిర్వహణలో భాగంగా దాదాపు మూడేళ్లుగా విరామం ఎరుగకుండా దేశాన్ని చుట్టేసింది’ అని హ్యారిస్ స్పందించారు. కమలకు అత్యంత సన్నిహితులుగా శాశ్వత ముద్రపడితే... బైడెన్ హయాంతో పాటు భవిష్యత్తులోనూ తమకు మంచి అవకాశాలు లభించకపోవచ్చనే భయమూ ఆష్లే, సాండర్స్లకు ఉండి ఉండొచ్చని మరికొన్ని మీడియా సంస్థలు విశ్లేషిస్తున్నాయి. పరిమిత పాత్రపై అసంతృప్తి! జెన్ సాకీ వివరణ ఆమోదయోగ్యంగా లేదని... ఆష్లే, సాండర్స్ ఇద్దరూ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే (జవనరి 20) బాధ్యతల నుంచి తప్పుకోవడం అసాధారణమైన పరిణామమేనని సీఎన్ఎన్ పేర్కొంది. విధి నిర్వహణకు ఉపాధ్యక్షురాలు సరైన రీతిలో సన్నద్ధం కాలేదని, పైగా ఆమెకు అంతగా ప్రాధాన్యం కూడా దక్కడం లేదని కమలా హ్యారిస్ కార్యాలయంలో, జట్టులో పనిచేస్తున్న సన్నిహితుల్లో అసంతృప్తి పెరుగుతోంది. రాజకీయంగా చేతులు కట్టేసినట్లుగా భావిస్తున్నానని హ్యారిస్ సన్నిహితుల వద్ద బాధపడినట్లు సీఎన్ఎన్ తెలిపింది. ఆమె టీంలోని దాదాపు 30 మందితో మాట్లాడాక సీఎన్ఎన్ ఈ అభిప్రాయానికి వచ్చింది. లీగల్ రెసిడెంట్లు, ఇతర మైనారిటీలకు ఓటు హక్కు విషయంలో గట్టిగా కృషి చేసే బాధ్యతను బైడెన్ జనవరిలోనే హ్యారిస్‌కు అప్పగించారు. చట్టసభల్లో ఈ అంశంలో బిల్లు పాసయ్యే అవకాశాలు బహుస్వల్పం. అలాగే మెక్సికో గుండా అక్రమ వలసలను నిరోధించి, దీనికో పరిష్కారం కనుగొనే బాధ్యతనూ ఉపాధ్యక్షురాలికి అప్పగించారు. డొనాల్డ్ ట్రంప్ హయాంలో అక్రమ వలసలు, శరణార్థుల విషయంలో కఠిన వైఖరిని అవలంభించారు. అప్పుడు ఎన్నో వేల మంది పిల్లలను తల్లిదండ్రులకు అమెరికా యంత్రాంగం దూరం చేసిందనే అపవాదు ఉంది. అక్రమవలసలను అడ్డుకొనే విషయంలో బైడెన్‌కు ముందు పనిచేసిన చాలామంది అధ్యక్షులూ విఫలమయ్యారు. ఇలాంటి కఠినతరమైన, సున్నిత అంశాలను కమలా హ్యారిస్‌కు అప్పగించారు. వయసు, ఆరోగ్యరీత్యా బైడెన్ (79 ఏళ్లు) రెండోసారి అధ్యక్ష పదవికి పోటీపడకపోవచ్చని, భవిష్యత్తులో డెమొక్రాట్ల తరఫున అధ్యక్ష అభ్యర్థి కావొచ్చని, అగ్రరాజ్యానికి తొలి మహిళా అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించే అవకాశం ఉంటుందనే అంచనాల మధ్యన బాధ్యతలు చేపట్టిన కమలా హ్యారిస్ (57 ఏళ్లు) ఇప్పుడు ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాట వాస్తవమనేది మెజారిటీ మీడియా అంటోంది. రుణ పరిమితిని పెంచుకోవడం, మౌలిక సదుపాయాలు, పర్యావరణం, సంక్షేమ పథకాలపై భారీ ఎత్తున ఖర్చు చేయడానికి సంబంధించిన ప్రతినిధుల సభ, సెనేట్ల ఆమోదం పొందడానికి జో బైడన్ ఆహోరాత్రులు శ్రమిస్తున్నారు. ఉపాధ్యక్షురాలితో ఏర్పడిన గ్యాప్‌ను తగ్గించుకునే ప్రయత్నాలపై సత్వరం దృష్టి సారించేంత సమయం ఇప్పుడు ఆయనకు లేదని అంటున్నారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
మౌలిక సదుపాయాల కల్పనా ప్రాజెక్టులపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
-
నెహ్రూను తగ్గించాలని కాదు
సాక్షి, బళ్లారి/అమ్రేలీ/బాగల్‌కోట: భారత తొలిప్రధాని జవహర్లాల్ నెహ్రూ ప్రాధాన్యతను తగ్గించేందుకు సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ విగ్రహాన్ని నిర్మించలేదని ప్రధాని మోదీ తెలిపారు. సర్దార్ పటేల్ తమ నాయకుడని చెప్పుకునే కాంగ్రెస్ నేతలు, గుజరాత్లో నర్మదా నదీతీరాన నిర్మించిన పటేల్ విగ్రహం ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ని ఇప్పటివరకూ ఎందుకు సందర్శించలేదని ప్రశ్నించారు.సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించిన మోదీ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. కశ్మీర్లో 75 శాతం పోలింగ్.. గతంలో పుణే, అహ్మదాబాద్, జమ్మూలో తరచూ బాంబు పేలుళ్లు జరిగేవి. కానీ గత ఐదేళ్లలో ఒక్క బాంబు దాడి జరిగినట్లైనా మీరు విన్నారా? కశ్మీర్లో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 75 శాతం పోలింగ్ నమోదైంది. ఈ సందర్భంగా ఒక్క హింసాత్మక ఘటన జరగలేదు. నేను పటేల్ విగ్రహాన్ని నెహ్రూను తక్కువ చేయడానికి నిర్మించలేదు. పటేల్ విగ్రహం ఎంత ఎత్తుగా ఉందంటే, మీరు(కాంగ్రెస్ నేతలు) ఇకపై ఇతరులను తక్కువ చేయడానికి పెద్దగా కష్టపడాల్సిన పనిలేదు’ అని అన్నారు. గుజరాత్ నన్ను దృఢంగా మార్చింది 2017లో చైనాతో డోక్లామ్ ఉద్రిక్తత సందర్భంగా కటువుగా, దృఢంగా వ్యవహరించేలా గుజరాత్ నన్ను తయారుచేసింది. గుజరాత్ ప్రజలు నాలో నైతిక విలువలను పెంపొందింపజేశారు. ఇందుకు నేను కృతజ్ఞతలు చెబుతున్నా. దేశద్రోహ చట్టాన్ని రద్దు చేస్తామనీ, కశ్మీర్లో సాయుధ బలగాల ప్రత్యేకాధికారాల చట్టాన్ని (అఫ్సా) తొలగిస్తామని కాంగ్రెస్ చెబుతోంది. అదే జరిగితే అమర్నాథ్ యాత్రికులను ఉగ్రవాదులు చంపేయరా? వైష్ణోదేవి ఆలయాన్ని భక్తులు ప్రశాంతంగా దర్శించుకోగలరా?’’ అని ప్రశ్నించారు. కేంద్రంలో మరోసారి బలమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని మోదీ కర్ణాటక ప్రజలకు పిలుపునిచ్చారు. బాగల్‌కోట, ఛిక్కొడి, బెళగావిల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో మోదీ మాట్లాడుతూ..‘కేంద్రంలో కాంగ్రెస్ బలహీన, నిస్సహాయ ప్రధానిని నియమించాలని అనుకుంటోంది. బలమైన ప్రభుత్వం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఢిల్లీ(కేంద్రం) వైపు చూడండి. బలహీనమైన ప్రభుత్వం ఎలా ఉంటుందంటే బెంగళూరువైపు చూడండి’ అని తెలిపారు. ఆమ్రేలీలో పార్లమెంటు భవంతి ఆకృతిలో జ్ఞాపికను అందుకుంటున్న ప్రధాని మోదీ -
మహబూబ్‌నగర్‌లో.. వలస జీవుల తీర్పెటో..?
హలో..! నేను.. మాట్లాడుతున్న. ఎలా ఉన్నారు..? అక్కడ ఏం పని చేస్తున్నరు..? మనోళ్లు ఎంత మంది ఉంటరు..? అందరికీ పని దొరుకుతుందా..? ఏప్రిల్ 11న ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలున్నయ్ తెలుసు కదా. తప్పకుండా రావాలి మరీ. వచ్చి ఓటు రూపంలో నన్ను ఆశీర్వదించండి. రవాణా ఖర్చులకు ఇబ్బందిపడకండా మనోళ్లు చూసుకుంటరు. అక్కడ మీ బాధలు నాకు తెలుసు. నేను గెలిస్తే మీకు ఇక్కడే ఉపాధి కల్పిస్తా.. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల, మిగతా సాగునీటి పథకాలకు నిధులు తెచ్చి వాటిని పూర్తి చేస్తా. సాగునీటి ఇబ్బందులు తీర్చి మీ చేనులను సస్యశ్యామలం చేస్తా. ఓటు వేసేందుకు తప్పకుండా రండి. మీ ఒక్క ఓటు నా గెలుపునకు ముఖ్యం. మరిచిపోవద్దు. ప్లీజ్..’అంటూ ఎంపీ అభ్యర్థులు, వారి అనుచరులు ఇతర ప్రాంతాల్లో ఉంటోన్న వలస ఓటర్లను మచ్చిక చేసుకుంటున్న తీరు ఇది. సాక్షి , మహబూబ్‌నగర్: పాలమూరు.. ఈ పేరు వినగానే ఠక్కున గుర్తొచ్చేది ఈ ప్రాంతంలో నెలకొన్న కరువే. వ్యవసాయ భూములున్నా సాగుకు నీరు లేక.. స్థానికంగా చేసేందుకు పని దొరక్క పొట్ట కూటి కోసం ముంబై.. పూణె.. కర్ణాటక.. హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వలస వెళ్లిన లక్షలాది కుటుంబాలు గుర్తొస్తాయి. దశాబ్దాల కాలంలో ఎన్ని ప్రభుత్వాలు మారినా.. ఎంత మంది పాలకులు మారినా.. వలసజీవుల తల రాతలు మారడం లేదు. పరాయి ప్రాంతాల్లో వారు పడుతోన్న కష్టాలు గుర్తుకొస్తాయి. ‘స్థానికంగా సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి జిల్లాను సస్యశా మలం చేస్తాం.. నిరుద్యోగ యువత ఇతర ప్రాంతాలకు తరలివెళ్లకుండా ఇక్కడే ఉపాధి అవకాశాలు కల్పిస్తాం’ అంటూ ప్రతిసారీ ఎన్నికల్లో అభ్యర్థులు ఇచ్చే హామీలు గుర్తొస్తాయి. ఇప్పుడు మళ్లీ వలస జీవులతో మన నాయకులకు పని పడింది. ఈ నెల 11 తేదీన జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలను మచ్చిక చేసుకునే పనిలో పడ్డ ఎంపీ అభ్యర్థులు తాజాగా వలస జీవుల ఓట్లనూ తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రస్తుత ఎన్నికలు బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఇప్పటికే బహిరంగసభలు, ర్యాలీలు, రోడ్ షోలు, కార్యకర్తలు.. కుల.. మత పెద్దలతో సమావేశాలు నిర్వహిస్తున్న అభ్యర్థులు తాజాగా ఇతర ప్రాంతాల్లో నివసిస్తోన్న వలస కూలీలు, కార్మికుల ఓట్లపై దృష్టి సారించారు. మూడున్నర లక్షలకు పైనే.. ఉమ్మడి జిల్లాలో మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ లోక్‌సభ స్థానాలున్నాయి. మహబూబ్‌నగర్ పరిధిలో 15,05,190మంది, నాగర్‌కర్నూల్ పరిధిలో 15,88,746మంది ఓటర్లున్నారు. రెండు సెగ్మెంట్ల నుంచి మూడున్నర లక్షలకు పైగా మంది ఓటర్లు ఇతర ప్రాంతాల్లో వలస కూలీలు, కార్మికులుగా పని చేసుకుంటున్నారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలోని నారాయణపేట అసెంబ్లీ సెగ్మెంట్ ఉన్న కోయిలకొండ, దామరగిద్ద, ధన్వాడ, నారాయణపేట, కొడంగల్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలోని కొడంగల్, దౌల్తాబాద్, బొంరాజ్‌పేట, మద్దూరు, కోస్గి మండలాల నుంచి పెద్ద మొత్తంలో ముంబయి, బెంగళూరు, పూణె నగరాల్లో ఉంటున్నారు. మక్తల్ మండలం కర్లి, గుడిగండ, మంతన్‌గోడ్, అనుగొండ, జక్లేర్ ప్రాంతాలకు చెందిన ప్రజలు ముంబయి, ఢిల్లీ ప్రాంతాల్లో ఉంటున్నారు. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధి నుంచి నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి ఎక్కువ మంది ముంబైలో ఉంటున్నారు. ఇలా వలస వెళ్లిన వారిని గుర్తించిన ఎంపీ అభ్యర్థులు, అనుచరులు వారికి ఫోన్లు చేస్తున్నారు. ఉగాది పండుగకు రాకున్నా.. పోలింగ్ రోజు కచ్చితంగా రావాలని అభ్యర్థిస్తున్నారు. ఉగాదికి తమ సొంతూర్లకు విచ్చేసిన వారి వివరాలు తీసుకుని వారిని కలుస్తున్నారు. ఎన్నికల తర్వాతే వెళ్లాలని అప్పటి వరకు ఏవైనా ఖర్చులున్నా తామే చూసుకుంటామని భరోసా ఇస్తున్నారు. అందరి నోటా అదే మాటా.. ఎన్నికలు సమీపిస్తున్నా కొద్దీ ప్రచారాన్ని వేగిరాన్ని పెంచిన ఎంపీ అభ్యర్థులందరూ ‘వలస’ ఓట్లు రాబట్టేందుకు హామీల వర్షం కురిపిస్తున్నారు. ఇప్పటికే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, ఇతర సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులను ప్రధాన ప్రచారాస్త్రంగా ఎంచుకున్న అభ్యర్థులు తాము గెలిస్తే వలసలకు అడ్డుకట్ట వేసేలా స్థానికంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటూ హామీలు చేస్తున్నారు. అభ్యర్థులతో పాటు ఎమ్మెల్యేలు, ఇతర పార్టీల నాయకులందరూ క్షేత్రస్థాయిలో ప్రచారం నిర్వహిస్తూ ఇలాంటి హామీలే ఇస్తున్నారు. కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలో వస్తుందని.. నరేంద్రమోదీ మళ్లీ ప్రధానమంత్రి అవుతారని.. తమను ఎంపీగా గెలిపిస్తే కేంద్రంతో పోరాడైనా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నిధులు తీసుకొచ్చి పనులు పూర్తి చేస్తామని, వలసలను నివారించేందుకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామంటూ బీజేపీ అభ్యర్థులు డీకే అరుణ, బంగారు శ్రుతి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తమకు మహబూబ్‌నగర్ ప్రజల సమస్యలు తెలుసని.. ఎంపీగా గెలిస్తే జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసి ఎవరూ వలస వెళ్లకుండా, వలస వెళ్లిన వారిని రప్పించి ఇక్కడ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని, అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని కాంగ్రెస్ అభ్యర్థులు చల్లా వంశీచందర్‌రెడ్డి, మల్లురవి హామీలు ఇస్తున్నారు. వలస వెళ్లిన వారందరూ తిరిగి వచ్చేలా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేసి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించి వలసలకు అడ్డుకట్ట వేస్తామంటూ టీఆర్ఎస్ అభ్యర్థులు మన్నె శ్రీనివాస్‌రెడ్డి, పోతుగంటి రాములు ఎన్నికల ప్రచారంలో హామీల వర్షం కురిపిస్తున్నారు. ఏదేమైనా ఈ ఎన్నికల్లో వలస జీవులు ఎవరి వైపు మొగ్గు చూపుతారో అని అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. -
ఏం చేద్దాం! ఓటర్లకు గాలం వేద్దాం?
పాలమూరు: పోలింగ్‌కు గడువు సమీపిస్తోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటర్లను మచ్చిక చేసుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేసేలా వ్యూహాలు రచిస్తున్నారు. తక్కువ వ్యవధిలో వీలైనన్ని ఎక్కువ ఓట్లను కొల్లగొట్టాలనే పంథాను ఆచరణలో పెడుతున్నారు. ఊరూరా తిరగడం కష్టమని భావించి గంపగుత్తగా ఓట్లను రాబట్టేందుకు పార్టీలో సీనియర్ల సలహాలు, సహకారం తీసుకుని కుల సంఘాల మద్దతును కోరుతూ రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారు. పగలు ప్రచారం నిర్వహిస్తూనే తీరిక వేళల్లో కులపెద్దలతో మంతనాలు చేస్తున్నారు. మహబూబ్‌నగర్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ఏడు సెగ్మెంట్లలో సుమారు 15 లక్షలకు పైగా ఓటర్లు ఉండటం, సమయం తక్కువగా ఉండటంతో ఈ తరహా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. నిఘా ఉన్నా.. కానరాని నియంత్రణ నిబంధనల ప్రకారం కుల సంఘాలతో నిర్వహించే సమావేశాల నిర్వహణ విషయమై ఎన్నికల పరిశీలకులు ప్రత్యేక దృష్టిని సారించాల్సి ఉంటుంది. చాలాచోట్ల ఈ విషయాన్ని విస్మరిస్తున్నారు. ఇటీవల ఒకరిద్దరు ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ నాయకులను మద్దతుగా ప్రచారాన్ని నిర్వహించారనే నెపంతో వారిపై అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇదే తరహాలో ఆయా పార్టీలు ఏ రకంగా ఓటర్లకు చేరువవుతున్నాయనే విషయమై మరింత నిశితంగా పరిశీలనలు పెంచాల్సి ఉంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నిఘా తీరుని పటిష్టపరిస్తే ప్రజాస్వామ్యంలో ఓటును స్వేచ్ఛాయుత వాతావరణంలో వేయించే అవకాశం ఉంటుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్‌కు ముందు ఓటర్లను అందించేందుకు ఆయా పార్టీల అభ్యర్థులు తీసుకొచ్చిన తాయిలాలను, నజరానాలను పలుచోట్ల పోలీసులు పట్టుకున్నారు. ఇదే తరహాలో ఈ ఎన్నికల్లోనూ మరింత పకడ్బందీగా తనిఖీలను చేపట్టడంతో పాటు అభ్యర్థుల ప్రచారాల తీరుతెన్నులపై వారు చేస్తున్న ఖర్చులపై పరిశీలకులు దృష్టిసారించాల్సి ఉంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి మరింత పక్కాగా నిఘాను పెంచాల్సిన అవసరముంది. అదే పద్ధతి గత అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే కొన్ని పార్టీలు సంఘాల మద్దతు కూడగట్టుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. మండలం, నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ అభ్యర్థిత్వానికి బలం చేకూరేలా ప్రయత్నిస్తున్నాయి. ప్రధానంగా జిల్లా కేంద్రం, పట్టణ కేంద్రాల్లో అభ్యర్థుల అనుచరులు నేరుగా కుల సంఘాలను కలుస్తూ బేరాలు మాట్లాడుకుంటున్నారు. మూడు నెలల కిందట జరిగిన శాసనసభ ఎన్నికల్లో ఈ పద్ధతి అనుకూలించిన విషయం తెలిసిందే. దాన్నే కొనసాగిస్తూ గంపగుత్తగా ఓట్లకు తగ్గట్టు మాట్లాడుకుంటున్నారు. ఎవరు చెబితే ఓట్లు ఎక్కువగా పడతాయో వారిని గుర్తించి వ్యూహరచన చేస్తున్నారు. పడే ఓట్లకే డబ్బుల పంపిణీ.. పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థులు ప్రతి గ్రామానికి వెళ్లే అవకాశం, సమయం ఉండదు. ఈ క్రమంలో గ్రామానికి ఒకరిద్దరు రెండో కేడర్ నాయకులకు డబ్బులు పంచే బాధ్యతలు ఇస్తున్నట్లు తెలిసింది. మరికొందరు పార్టీ నుంచి డబ్బులు తక్కువగా వస్తాయి.. భవిష్యత్‌లో మీకు అధికారం, ఉన్నత అవకాశాలు.. చేసుకోవడానికి పనులు కావాలంటే ఖర్చు పెట్టండి అంటూ ఆఫర్లు ఇస్తే వారితోనే డబ్బులు ఖర్చు పెట్టిస్తున్నారు. గతంలో మాదిరి కాకుండా ఈ సారి అభ్యర్థులు బలంగా పడే ఓట్లను మాత్రమే కొనుగోలు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే పోలింగ్ బూత్‌లపై ఆధారపడి ఓటర్లకు డబ్బు పంపిణీ చేసేందుకు సిద్ధమైన నాయక గణంలో ఇప్పుడు కలవరపాటు మొదలైంది. డబ్బులు తీసుకున్నవారు ఓటు వేయకపోతే ఎవరు బాధ్యులన్న ప్రశ్నలు వారిని ఆందోళనకు గురిచేస్తున్నాఇ. పైకి గెలుపుపై ధీమాను వ్యక్తం చేస్తున్నా లోలోపల దిగులు గుబులు వెంటాడుతోంది. -
ఓట్ల కోసం సరికొత్త వ్యూహాలు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో ఓట్లు రాబట్టేందుకు రాజకీయ పార్టీలు సరికొత్త వ్యూహాలకు పదును పెడుతున్నాయి. క్షేత్రస్థాయిలో ఓటర్లను నేరుగా ప్రభావితం చేసే బదులు వారిని ప్రభావితం చేసే వ్యక్తులపై దృష్టి సారించాయి. వారి మద్దతు కూడగడితే సరిపోతుందన్న భావనతో ప్రత్యేక ప్యాకేజీలతో దూసుకెళ్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య అధికం కావడంతో ఇంటింటి ప్రచారం చేయడం అభ్యర్థులకు కష్టమే. దీంతో రాజకీయ పార్టీలు ఓటర్లకు బదులుగా ఇలా ఓటర్లను ప్రభావితం చేసే వారివైపు దృష్టి పెట్టాయి. అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి నేత మొదలు గ్రామస్థాయి నేతలనూ ఇలా ప్రత్యేక ప్యాకేజీలతో ప్రసన్నం చేసుకొనే పనిలో అభ్యర్థులు తలమునకలయ్యారు. ఓటర్ల సంఖ్యకు తగిన ప్రాధాన్యత... పట్టణ ప్రాంతాల్లో వార్డులు, గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలవారీగా ప్రత్యేక సమయాన్ని నిర్దేశించుకొని ఎన్నికల ప్రచారంచేస్తున్న అభ్యర్థులు... ఓటర్లను ప్రభావితం చేసే వారిని వెతికి పట్టుకునేందుకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇందులో భాగంగా స్థాయిని బట్టి వారితో చర్చిస్తున్నారు. ఎంత మంది ఓటర్లను ప్రభావితం చేయగలరనే అంశం ప్రాతిపదికగా వారికి ప్రాధాన్యత ఇస్తున్నారు. భారీగా ఓటర్ల మద్దతు కూడగట్టగల వారికి ప్రత్యేక ప్యాకేజీలు సైతం ఇచ్చేస్తున్నారు. వెయ్యి, ఐదు వేలు, పది వేలు ఇలా ఓటర్ల సంఖ్యకు తగినట్లు గుర్తింపు ఇస్తూ ఆ మేరకు బహుమతులు సైతం అందిస్తున్నారు. కొన్నిచోట్ల ఎక్కువ మందిని ప్రభావితం చేసే అవకాశం ఉంటే ఏకంగా అభ్యర్థి సమక్షంలోనే తమ పార్టీలో చేర్చుకుంటున్నారు. అలా వచ్చిన వారికి దావత్‌లు ఇస్తూ వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. పట్టణ నియోజకవర్గాలైన ఎల్బీ నగర్, మహేశ్వరం, రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్, మేడ్చల్, శేరిలింగంపల్లి తదితర ప్రాంతాల్లో ఇలాంటి దావత్‌లు జోరుగా సాగుతున్నాయి. అంతటా ఇదే మంత్రం... ఓటర్లను ప్రభావితం చేసే వ్యక్తులకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో అన్ని సెగ్మెంట్లలో ఇలాంటి వ్యక్తులపై అభ్యర్థులు గురిపెడుతున్నారు. మల్కాజిగిరి, సికింద్రాబాద్ స్థానాల్లో ఈ తరహా వ్యక్తులకు భారీ మొత్తంలో బహుమతులు అందిస్తున్నారు. చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని రాజేంద్రనగర్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో కాలనీలు, వార్డుల్లో క్రియాశీల వ్యక్తులను భారీ సభలు నిర్వహించి పార్టీల్లో చేర్చుకుంటున్నారు. అదేవిధంగా యువతను ప్రభావితం చేసే యువ నాయకులకూ అందలం వేస్తున్న అభ్యర్థులు వారి డిమాండ్లకు తగినట్లు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదాహరణకు మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓ నేత గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు. చివరకు వేరే పార్టీ నుంచి పోటీ చేసి 20 వేలకుపైగా ఓట్లు సాధించారు. ప్రస్తుతం సైలెంట్‌గా ఉన్న ఆయన్ను ప్రధాన పార్టీకి చెందిన అభ్యర్థి ఆకర్షించేందుకు అన్ని ప్రయత్నాలూ చేశారు. ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించడంతో లోక్‌సభ ఎన్నికల్లో ఆ అభ్యర్థికి సహకరించేందుకు ఒప్పుకున్నారు. -
సగం కాదు సమం కావాలి
అవకాశం, అధికారం..పురుషుడి చేతుల్లో ఉన్నాయి.స్త్రీకి దక్కవలసిన వాటిని కూడా పురుషుడు తన చేతుల్లోనే బిగించి పట్టుకున్నాడు. సగమిస్తాం, శాతాలిస్తాం అని దశాబ్దాలు గడిపేస్తున్నాడు. ఈ సగాలూ, శాతాలు కాదు..సమ విభజన జరగాల్సిందేనని ‘ఆల్ ఉమెన్ పార్టీ’సమ(ర)శంఖారావం పూరిస్తోంది. ‘‘భూమి లోపల గింజ నాటుతున్నాం. అది మొలకెత్తుతుంది. మహావృక్షమవుతుంది. మొలకెత్తే వరకు అక్కడ ఒక గింజ నాటి ఉన్న సంగతి కూడా బయటకు తెలియకపోవచ్చు. మనకు తెలియలేదంటే అర్థం భూమిలో బీజం లేదని కాదు, భూమిలో బీజం ఉన్న సంగతిని మనం గుర్తించలేదని మాత్రమే. మేము ఇప్పుడు మహిళలకు రాజ్యాధికార బీజాలు నాటుతున్నాం. అవి మొలకెత్తిన రోజున సమాజం గుర్తిస్తుంది. అలాగని మా ప్రయత్నం.. మేము బీజం వేశామని సమాజం గుర్తించడం కోసం కాదు, సమాజంలో మహిళలు సగభాగం ఉన్నారనే వాస్తవాన్ని సమాజం గ్రహించడం కోసం. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే సమాజంలో మహిళలు సగభాగం ఉన్నారనే వాస్తవాన్ని సమాజానికి గుర్తు చేయడం కోసమే ఈ రాజకీయ మహోద్యమానికి బీజం వేశాం. పాపులేషన్లో సగం ఉన్న మేము పార్లమెంట్లో పది శాతానికి పరిమితం కావడమేంటి! పార్లమెంట్లో కూడా సగభాగం మహిళలే ఉండాలి’’ అన్నారు డాక్టర్ శ్వేతాశెట్టి. ఢిల్లీలో ఇటీవలే కొత్తగా ఆవిర్భవించిన ‘నేషనల్ ఉమెన్స్ పార్టీ’ అధ్యక్షురాలు ఆమె. దక్కన్ లీడర్ డాక్టర్ శ్వేతా శెట్టి హైదరాబాద్‌లో పుట్టి పెరిగారు. హైదరాబాద్‌లోని దక్కన్ కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఎంబీబీఎస్ చదివారు. కొంతకాలం కర్మాన్‌ఘాట్‌లో ప్రాక్టీస్ చేశారు. గత ఏడాది డిసెంబర్ 18వ తేదీన న్యూఢిల్లీలో ‘నేషనల్ ఉమెన్స్ పార్టీ’ పేరుతో రాజకీయ పార్టీని స్థాపించారు. పార్టీ ఆఫ్ మదర్స్ అనే ట్యాగ్‌లైన్, ముకుళిత హస్తాలతో ఉన్న మహిళ లోగోతో ఆవిర్భవించిన ఆ మహిళల రాజకీయ పార్టీ ఒక్కసారిగా దేశమంతటినీ ఆకర్షించింది. మహిళల కోసం జాతీయస్థాయిలో ఒక రాజకీయ పార్టీని స్థాపించాల్సిన ఆవశ్యకత, అనివార్యతల గురించి సాక్షితో తన ఆలోచనలను పంచుకున్నారు డాక్టర్ శ్వేతాశెట్టి. భిన్నత్వంలో ఏకత్వం ‘‘ఎన్నికలొచ్చిన ప్రతిసారీ వార్తాపత్రికలు, ఇతర ప్రసార సాధనాల్లో హడావుడి మొదలవుతుంది. పోటీలో ఉన్న అన్ని రాజకీయ పార్టీల అభ్యర్థుల జాబితాలను ప్రచురిస్తారు. పోటీలో నిలుచున్న మహిళలపై ప్రత్యేక కథనాలుంటాయి. నాకు తెలిసినప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లోనూ గమనిస్తూనే ఉన్నాను. అభ్యర్థుల జాబితాలో మహిళల సంఖ్య వేళ్ల మీద లెక్కకు మించేది కాదు. మరికొంచెం లోతుగా అధ్యయనం చేసినప్పుడు ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. మనదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరవాత మొదటి పంచవర్ష ప్రణాళికల నుంచి ప్రస్తుత ‘నీతి అయోగ్’ వరకు ప్రతిసారీ మహిళల అభ్యున్నతి గురించి మాట్లాడుతున్నాయి ప్రభుత్వాలు. మహిళల స్వయం స్వావలంబన గురించి, సాధికారత గురించి కూడా మాట్లాడుతున్నాయి. అయితే మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ గురించి మాత్రం మాట్లాడడం లేదు. ఒకసారి అటకెక్కిన మహిళా బిల్లును అటక దించే ప్రయత్నం ఏ ప్రభుత్వమూ చేయడం లేదు. బహుళ పార్టీ విధానం అమలులో ఉన్న మనదేశంలో రాజకీయ పార్టీల మధ్య భావసారూప్యతల కంటే భావ వైవిధ్యతలే ఎక్కువ. అయితే మహిళా రిజర్వేషన్ బిల్లు దగ్గరకొచ్చేటప్పటికి అన్ని పార్టీలూ ఒకటే రకంగా స్పందిస్తున్నాయి. ఎన్నికలొచ్చే సరికి నాయకులు ‘మా పార్టీ అధికారంలోకి వస్తే అవి చేస్తాం... ఇవి చేస్తాం’ అని హామీలు గుప్పిస్తుంటారు. ఒక్క జాతీయ నాయకుడైనా ‘మా పార్టీ అధికారంలోకి వస్తే చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం తెస్తాం’ అని వాగ్దానం చేయట్లేదు. అధికారమే పరమావధిగా ఎన్నికలకు ముందు– తర్వాత పొత్తులు కుదుర్చుకుని ఏర్పడే సంకీర్ణ ప్రభుత్వాల్లోని పార్టీలు... అనేక అంశాల మీద విభేదించుకుంటూ, సర్దిచెప్పుకుంటూ భిన్నత్వంలో ఏకత్వాన్ని పాటిస్తూ బిల్లులు పాస్ చేసుకుంటున్నాయి. కానీ మహిళాబిల్లు కోసం ఒక్క మగ గొంతు కూడా పెగలట్లేదు. అందుకే మహిళల కోసం ఒక పార్టీ ఉండాల్సిన అవసరం ఉందని ఈ పార్టీని స్థాపించాం’’ అన్నారు నలభై రెండేళ్ల శ్వేత. రాజ్యాంగం అలా చెప్పలేదు ‘‘మహిళల కోసం రిజర్వేషన్ అనగానే అందరికీ 33 శాతం గుర్తొస్తుంది. నిజానికి ఆ నిబంధన మహిళల స్థానాలను 33 శాతానికి పరిమితం చేయమని కాదు. లింగ వివక్షలేని సమాజ నిర్మాణం కోసం మహిళలకు సగభాగం ప్రాతినిధ్యం ఉండాలని చెప్పింది. పరిపాలన, నిర్ణయాధికారంలో మహిళల భాగస్వామ్యం కనీసం 33 శాతానికి తగ్గకుండా ఉండాలని చెప్పింది. పురుషాధిక్య భావజాలంలో నడుస్తున్న రాజకీయ పార్టీలు ‘కనీసంగా 33 శాతం’ అనే నిబంధనను తమకు అనుకూలంగా ‘మహిళలకు 33 శాతం స్థానాలను కేటాయించడం’గా మలుచుకున్నాయి. రాజ్యాంగం కల్పించిన సమ భాగస్వామ్యం గురించి సమాజానికి తెలియచేయడం, చట్టసభలతోపాటు, పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్లలో కూడా మహిళలకు సమ భాగస్వామ్య సాధనే మా నేషనల్ ఉమెన్స్ పార్టీ లక్ష్యం’’ అన్నారు శ్వేత. ఆల్ ఉమెన్ అసోసియేషన్ ‘‘మహిళల కోసం రాజకీయ పార్టీ స్థాపన అనేది పదేళ్ల కిందట నాకు వచ్చిన ఆలోచన. 2012లో పార్టీని రిజిస్టర్ చేశాను. అప్పటికే నాకు నాలుగేళ్ల పాప ఉంది. ఆ తర్వాత రెండేళ్లకు బాబు పుట్టాడు. పిల్లల బాధ్యత కారణంగా కొంత విరామం తీసుకోవాల్సి వచ్చింది. అయితే ఆ సమయంలో ‘తెలంగాణ మహిళా సమితి’ పేరుతో ఎన్జివో ప్రారంభించాను. భావసారూప్యం కలిగిన మహిళలతో నా ఆలోచనను పంచుకున్నాను. వాళ్లందరూ మహిళాభ్యుదయం కోసం కృషి చేస్తున్న వాళ్లే. ‘ఐద్వా’లో చురుగ్గా ఉన్న మహిళలతో కలిసి కార్యాచరణ రూపకల్పన చేసుకున్నాను. ఇదంతా పూర్తయిన తర్వాత గత డిసెంబర్లో న్యూఢిల్లీలో జానకీ రాజారామ్‌తో కలిసి పార్టీని ప్రారంభించాను. ఆ వెంటనే దక్షిణాది రాష్ట్రాలన్నింటితోపాటు ఉత్తరాదిన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్‌లలో ప్రాంతీయ విభాగాలు కూడా ప్రారంభమయ్యాయి. యూపీలో రుచికపూర్, ముంబయిలో భావనా జడేజా పార్టీ కార్యకలాపాలు చూసుకుంటున్నారు. దేశంలోని దాదాపుగా కొన్ని రాష్ట్రాల్లో పార్టీ లాంఛనంగా ప్రారంభం కాకపోయినప్పటికీ జమ్ముకాశ్మీర్, ఉత్తరప్రదేశ్ వంటి మరికొన్ని రాష్ట్రాల్లో కమిటీలు పనిచేస్తున్నాయి. మా పార్టీకి వెబ్సైట్, ఫేస్బుక్ పేజీ ఉన్నాయి. వీటిని నిర్వహించడానికి టెక్నికల్ టీమ్ పనిచేస్తోంది. నామినేషన్లు వేశాం ఎన్నికల్లో 283 లోక్‌సభ స్థానాలకు పోటీ చేయడం, గెలిచి పార్లమెంట్లో అడుగు పెట్టడం మా పార్టీ లక్ష్యం. అందుకోసం ప్రతి రాష్ట్రంలోనూ ఆయా రాష్ట్రాల లోక్‌సభ స్థానాల సంఖ్యలో సగం స్థానాలకు పోటీ చేస్తున్నాం. రాజస్థాన్‌లో పాతిక స్థానాలకు గాను పదమూడు స్థానాల్లో మా పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో కూడా నామినేషన్లు వేశారు. తెలంగాణలో ఇప్పటి వరకు ఐదుగురు, ఆంధ్రప్రదేశ్‌లో 13 స్థానాలకు పోటీ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ స్థానాల పోటీలో కూడా మా అభ్యర్థులుంటారు. ఈ ఎన్నికల్లో నేను పోటీ చేయడం లేదు. ఇప్పుడు నాటిన బీజం మొలకెత్తి, చివుర్లు తొడిగి, చెట్టంత ఎదగడానికి సమయం పడుతుంది. నా పూర్తి సమయాన్ని పార్టీని విస్తరింప చేయడానికే కేటాయించాల్సి ఉంటుంది. ఇలాంటి సమయంలో నేను ఒక నియోజకవర్గానికి పరిమితమైతే లక్ష్యం నెరవేరడం కష్టం. అందుకే 2024 టార్గెట్‌గా పని చేస్తున్నాం. ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల తర్వాత పార్టీని క్షేత్రస్థాయికి తీసుకెళ్లడం మీద దృష్టి పెడతాం. ప్రతి అసెంబ్లీ నియోజక వర్గంలోనూ దాదాపుగా రెండు వందల మంది కార్యకర్తలు రిజిస్టర్ అయి ఉన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి కసరత్తు మొదలు పెడతాం.ఎన్నికల కమిషన్ గుర్తించిందిమా పార్టీకి ఎన్నికల కమిషన్ గుర్తింపు వచ్చింది. జాతీయ స్థాయిలో కామన్‌గా గ్యాస్ స్టవ్ గుర్తును కేటాయించింది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్ మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల్లోనూ మా అభ్యర్థులు ఈ గుర్తు మీద పోటీ చేస్తారు. ఆ మూడు రాష్ట్రాల్లో ఇప్పటికే ఈ గుర్తును ఇతర ప్రాంతీయ పార్టీలకు కేటాయించి ఉండడంతో ఆ రాష్ట్రాల్లో మాకు గాజుల గుర్తు ఇచ్చారు. మహిళలకు రాజ్యాధికారం కోసం చేస్తున్న పోరాటంలో మాకు వంటింటి గుర్తును కేటాయించారని మగవాళ్లు ఎగతాళి చేయడానికి అవకాశం ఉంది. కానీ, అది రెండు బర్నర్లున్న గ్యాస్ స్టవ్. ఒక పనిని మహి మగవాడు ఇద్దరూ చేయగలగాలని చెప్పడానికి ప్రతీక ఆ చిహ్నం. ఎన్నికల కమిషన్ దగ్గర ఉన్న చిహ్నాల జాబితా నుంచి నాగలి, దీపం, తల్లీబిడ్డ, గ్యాస్‌స్టవ్ వంటి పదిహేను గుర్తులను ఎంపిక చేసుకున్నాం. అందులో మాకు గ్యాస్‌స్టవ్‌ని కేటాయించింది ఎన్నికల కమిషన్. ఆధిక్యం కోసం కాదు భారత మాజీ రాష్ట్రపతి ఆర్. వెంకట్రామన్ గారి అమ్మాయి పద్మా వెంకట్రామన్ నేషనల్ ఉమెన్స్ పార్టీలో సౌత్ జోన్ నిర్వహణ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. వెస్ట్ జోన్ బాధ్యతలను క్రికెట్ క్రీడాకారుడు రవీంద్ర జడేజా సోదరి భావనా జడేజా చూస్తున్నారు. మా పార్టీలో రిటైర్ అయిన మహిళా ఐఏఎస్ అధికారులు, న్యాయవాదులు, ఇతర ప్రభుత్వ సర్వీసుల్లో సేవలందించి రిటైర్ అయిన ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. వారంతా స్థానిక నిర్వహణ బాధ్యతలకు అవసరమైన ఖర్చులు సొంతంగా పెట్టుకుంటున్నారు. దాంతో మా పార్టీకి నిధుల సమీకరణ బాధ లేదు. ఇప్పటి వరకు చేరిన వాళ్లంతా శాసననిర్మాణంలో మహిళల భాగస్వామ్యం, ఆవశ్యకతల గురించి సంపూర్ణ అవగాహన ఉన్న మహిళలే. మేమంతా కలిసి ఇక నుంచి క్షేత్రస్థాయిలో మహిళల్ని చైతన్యవంతం చేయాలి. ఈ లోక్‌సభ ఎన్నికల తర్వాత ఆ పనికి పూనుకుంటాం. మా పార్టీ సిద్ధాంతాలు మగవారిని కూడా ఆకట్టుకుంటున్నాయి. పార్టీలో చేరడానికి ముందుకు వస్తున్నారు. ఇక్కడ ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే... ఇది మహిళాధిక్యతను ప్రదర్శించడానికి స్థాపించిన పార్టీ కాదు, మహిళలకు సమభాగస్వామ్యాన్ని కోరుతూ స్థాపించిన పార్టీ. కాబట్టి మగవాళ్లు ఉండకూడదనే నియమమేదీ లేదు. వాళ్లు కూడా సగభాగం ఉంటారు. అయితే మగవాళ్ల కోసం మహిళలు పోటీ చేసే స్థానాలను త్యాగం చేయడం వంటివి ఉండవు’’ అని ముగించారు శ్వేతాశెట్టి. ఇంటర్వ్యూ: వాకా మంజులారెడ్డి ఫొటోలు : ఎస్.ఎస్.ఠాకూర్ మా ఎజెండా మేము అధికారంలోకి వస్తే... మొదటి ప్రాధాన్యం మహిళల చదువు, రెండవది మహిళలకు ఉద్యోగం, మూడు మహిళల క్షేమం, ఆ తర్వాత వ్యవసాయరంగం, రక్షణ రంగాలుంటాయి. ఓ యాభై ఏళ్ల కిందట మహిళలు చదువుకోవడానికి ఇంటి నాలుగ్గోడల మధ్యనే మౌనపోరాటం చేయాల్సి వచ్చింది. ముప్పై ఏళ్ల కిందట ఉద్యోగాలు చేయడానికి అనుమతి కోసం మెల్లగా గొంతు విప్పింది. ఇప్పుడు శాసన నిర్మాణంలో అడుగు పెట్టడానికి ఉద్యమించాల్సిన సమయం వచ్చింది. ఇప్పటికే చట్టసభల్లో ఉన్న వాళ్లలో ఎక్కువ మంది రాజకీయ కుటుంబాల నేపథ్యం ఉన్న వాళ్లే. ఫలానా వారమ్మాయి, ఫలానా వారింటి కోడలు, ఫలానా వ్యక్తి భార్య... ఈ గుర్తింపుతోనే వస్తున్నారు, వచ్చిన తర్వాత కూడా వాళ్లింటి మగవాళ్ల నిర్ణయాలను అమలు చేస్తూ కొనసాగుతున్నారు తప్ప స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడానికి ధైర్యం చేయడం లేదు. మనదేశంలో ఒక ఇండిపెండెంట్ మహిళ రాజకీయ రంగంలో అడుగుపెట్టే పరిస్థితి లేదిప్పుడు. అరకొరగా ఉన్నప్పటికీ వాళ్లను కార్యకర్త స్థాయికి మించి నాయికగా ఎదగనివ్వడం లేదు. అందుకే మా పార్టీ అవసరం చాలా చాలా ఉందని నమ్ముతున్నాం. బేటీ బచావోలు, బేటీ పఢాలోలు ఉన్నప్పటికీ ఫిమేల్ ఫోటిసైడ్, ఉమెన్ ట్రాఫికింగ్, మహిళల మీద దాడులు తగ్గడం లేదు. వాటిని రూపుమాపగలిగింది మహిళలే. బాలికా విద్యం కోసం ఉద్యమించిన సావిత్రిబాయిఫూలే స్ఫూర్తితో మొదలు పెట్టిన ఉద్యమం మాది. ఇందులో మేము కూడా ఆమెలాగానే విజయవంతం అవుతాం. పొలిటికల్ ఎంపవర్మెంట్ మాత్రమే పరిపూర్ణమైన సాధికారత’’ అన్నారు శ్వేతాశెట్టి. -
పనిలో సమానత్వం వేతనంలో అసమానత్వం
కష్టం ఒకటే. పని గంటలూ అవే. కానీ చేతికి అందేది మాత్రం ఒకేలా ఉండదు. కింది నుంచి పై వరకు భారతదేశంలో మహిళా కార్మికులు, మహిళా ఉద్యోగుల పరిస్థితి ఇది. బ్రిటన్‌లోని ‘ఆక్స్‌ఫామ్’ అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా స్త్రీ, పురుషుల వేతనాల్లోని వ్యత్యాసాలపై అధ్యయనం చేసినప్పుడు ఈ ‘అసమానత్వం’ బయట పడింది. ఇదేమీ కొత్తగా బయటపడింది కాదు కానీ, ఓ కొత్త విషయాన్ని కూడా ఆక్స్‌ఫామ్ వెల్లడించింది. భారతదేశంలో ప్రభుత్వం ఏ రంగంలోనైనా ఖర్చు తగ్గించుకున్న ప్రతిసారీ వెంటనే ఆ దుష్ప్రభావం మహిళల జీవితాలపై పడుతోంది. ఉదా : విద్యపై పెట్టే ఖర్చును ప్రభుత్వం తగ్గించుకుంది. లేదా ఆరోగ్యంపై ఖర్చు తగ్గించుకుంది. ఆ వరుసలోనే ప్రజలకు అందవలసిన సేవలూ తగ్గుతాయి. ఆ తగ్గిన సేవలు, సదుపాయాల వినియోగంలో సహజంగానే బాలికలకు, మహిళలకు తొలి ప్రాధాన్యం తగ్గుతుంది. ఇద్దరు పిల్లల్ని చదివించలేనప్పుడు అబ్బాయిని మాత్రమే బడికి పంపడం, డాక్టరు దగ్గరికి వెళ్లవలసిన పరిస్థితిని ఇంట్లో ఆడవాళ్ల విషయంలో నిర్లక్ష్యం చేయడం.. ఇలా ఉంటాయి పర్యవసానాలు. స్త్రీలు, బాలికల కోసం అంటూ ప్రత్యేకంగా కేటాయించిన ప్రణాళికలు, పథకాలు వారికి చేరేలోపు దారి మారుతున్న వివక్షాపూరిత వాతావరణంలో ఇలాంటి ప్రభుత్వ తగ్గింపులు మహిళల్ని మరింత దైన్యంలోకి నెట్టడంలో ఆశ్చర్యం ఏముంది? ఆక్స్‌ఫామ్ లెక్కల ప్రకారం ఇండియాలో ఏటా 2 కోట్ల 30 లక్షల మందికి పైగా బాలికలు బడి మానేస్తున్నారు. బడిలో మరుగుదొడ్లు లేకపోవడం, రుతుస్రావ శుభ్రత వసతులు లేకపోవడం ఇందుకు తొలి కారణాలు కాగా, పనికి వెళుతున్న తల్లికి ఆమె శ్రమకు తగ్గ ఫలితం అందకపోవడం ఇంకో కారణం. స్త్రీకి ఆర్థిక స్వావలంబన ఉంటే, మెరుగైన పాఠశాలలో చేర్పించే అవకాశం ఉంటుంది కదా. ఇవన్నీ అలా ఉంచండి. కష్టానికి తగిన ప్రతిఫలం పొందలేని కారణంగా పోషించే శక్తి తగ్గి తన ఇంట్లో తనే స్త్రీ వివక్షకు, వివక్ష నుంచి హింసకు గురయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నట్లు ఆక్స్‌ఫామ్ గమనించింది. ఇంట్లో మగాళ్ల మాటను తు.చ.తప్పకుండా పాటించకపోవడం, వారికి చెప్పకుండా రూపాయి ఖర్చు పెట్టడం, పిల్లల సంరక్షణకు సమయాన్ని కేటాయించలేకపోవడం, ఇంట్లో పెద్దవాళ్లకు సేవలు చేయలేకపోవడం, వేళకు వండి వడ్డించకపోవడం, నీళ్ల బిందెలు ఖాళీగా ఉండడం, వంట చెరకును తీసుకు రాలేకపోవడం, చెప్పకుండా బయటికి వెళ్లడం.. ఇవన్నీ కూడా ఇంట్లో ఆర్థికబలం లేని మహిళలను వేధించడానికో, వారిపై చెయ్యి చేసుకోవడానికో నెపాలు అవుతున్నాయని ఆక్స్‌ఫామ్ తెలిపింది. -
సొంతిల్లు... మరింత చేరువ!
న్యూఢిల్లీ: అందుబాటు ధరల్లో ఇళ్లకు ప్రోత్సాహమిచ్చేందుకు రిజర్వ్ బ్యాంక్... ఇంటి కొనుగోలుదారుల ప్రయోజనాలను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం బుధవారం కీలక నిర్ణయాలు తీసుకున్నాయి. గృహాల కొనుగోలుదారులకు మరిన్ని అధికారాలు దఖలు పడేలా దివాలా చట్టాన్ని (ఐబీసీ) సవరిస్తూ చేసిన ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. దీనితో ఇకపై ఇంటి కొనుగోలుదారులకు కూడా ఆర్థిక రుణదాతల హోదా లభిస్తుంది. ఫలితంగా ఆయా సంస్థలు ఒకవేళ దివాలా తీస్తే... కీలక నిర్ణయాలు తీసుకునే రుణదాతల కమిటీలో (సీవోసీ) కొనుగోలుదారులకూ ప్రాతినిధ్యం లభిస్తుందని ప్రభుత్వం అధికారిక ప్రకటనలో తెలిపింది. మోసపూరిత డెవలపర్లపై చర్యలు తీసుకునేందుకు వీలుగా ఐబీసీలోని సెక్షన్ 7 కింద దివాలా పరిష్కార ప్రక్రియ కోసం దరఖాస్తు చేసే అధికారం కూడా గృహ కొనుగోలుదారులకు లభిస్తుంది. పలు హౌసింగ్ ప్రాజెక్టుల నిర్మాణం నిల్చిపోవడం, నిర్మాణాల్లో జాప్యం వంటివి గృహ కొనుగోలు దారుల్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో ఐబీసీ చట్ట సవరణ ఊరటనివ్వనుంది. మరోవైపు, లఘు, చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్ఎంఈ) ప్రమోటర్లకు సైతం ఐబీసీ సవరణతో కొంత వెసులుబాటు లభించనుంది. కార్పొరేట్ దివాలా పరిష్కార ప్రక్రియ (సీఐఆర్‌పీ) కింద చర్యలు ఎదుర్కొంటున్న తన సొంత సంస్థను దక్కించుకునేందుకు ప్రమోటరు కూడా బిడ్ చేయొచ్చు. అయితే, సదరు ప్రమోటరు ఉద్దేశ పూర్వక ఎగవేతదారుగా ముద్రపడని వారై ఉండాలి. దివాలా చట్ట నిబంధనలను ఉల్లంఘించి, అనర్హతకు గురైన ప్రమోటర్లు మాత్రం బిడ్డింగ్‌లో పాల్గొనడానికి ఉండదు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఎంఎస్ఎంఈ రంగానికి మరికొన్ని మినహాయింపులిచ్చేందుకు, నిబంధనలను సవరించేందుకు ఈ చట్ట సవరణతో కేంద్ర ప్రభుత్వానికి మరిన్ని అధికారాలు లభిస్తాయి. ఐబీసీలో సవరణలకు సంబంధించిన ఆర్డినెన్స్‌ను కేంద్ర కేబినెట్ గతనెలలో ఆమోదించింది. దీనికే రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. చౌక ఇళ్లకు ఆర్బీఐ బూస్ట్.. అందుబాటు ధరల్లోని గృహాల కొనుగోళ్లకు మరింత ఊతమిచ్చేలా ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. ప్రాధాన్యతా రంగ రుణాల (పీఎస్ఎల్) విభాగం కింద వీటికిచ్చే రుణాల పరిమితి పెంచింది. మెట్రో నగరాల్లో పీఎస్ఎల్ కింద గృహ రుణం పరిమితిని రూ.28 లక్షల నుంచి 35 లక్షలకు, ఇతర ప్రాంతాల్లో రూ.20 లక్షల నుంచి రూ.25 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ రుణం పొందేందుకు మెట్రో నగరాల్లో (10 లక్షల మించి జనాభా ఉన్నవి) ఇంటి విలువ రూ.45 లక్షలు, ఇతర ప్రాంతాల్లో రూ.30 లక్షలు మించకుండా ఉండాలి. దీనిపై ఈ నెలాఖరులో సర్క్యులర్ జారీ చేయనుంది. ప్రాధాన్యతా రంగం కింద గృహ రుణాల పరిమితిని పెంచడంతో సదరు లోన్లు మరింత చౌకగా లభిస్తాయని కేంద్ర ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి రాజీవ్ కుమార్.. మైక్రోబ్లాగింగ్ సైటు ట్విట్టర్లో తెలిపారు. బ్యాంకులు సాధారణంగా ఇచ్చే రుణాలతో పోలిస్తే పీఎస్ఎల్ కింద ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లు కొంత తక్కువగా ఉంటాయి. మరోవైపు, ఖాయిలా పడిన ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్‌యూ) దగ్గరున్న మిగులు స్థలాలను.. చౌక గృహాల నిర్మాణానికి ఉపయోగించాలని కేంద్రం నిర్ణయం తీసుకోవడం కూడా అందుబాటు ధరల్లో ఇళ్ల కొనుగోలుకు ఊతమివ్వనుంది. -
ఆ పోస్టుల్లో స్థానికులకు తొలి ప్రాధాన్యం
నల్లగొండ : అంగన్వాడీ పోస్టుల భర్తీలో స్థానికులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని మహిళా, శిశు సంక్షేమ స్థాయీ సంఘ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి మహిళలకు న్యాయం చేయాలని సభ్యులు కోరారు. బుధవారం జెడ్పీ కా ర్యాలయంలో మహిళా, శిశు సంక్షేమ స్థాయి కమిటీ, సాంఘిక సంక్షేమ స్థాయి కమిటీ సమావేశాలు కమి టీల చైర్మన్లు చింతల వరలక్ష్మీ, చుక్కా ప్రేమలత అధ్యక్షతన సమావేశాలు జరిగాయి. కమిటీ సమావేశాల్లో సభ్యులు మాట్లాడుతూ.. అంగన్వాడీ పోస్టుల భర్తీలో పదో తరగతిలో సాధించిన మెరిట్ మార్కుల ప్రకారం కాకుండా స్థానికులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. గతంలో అంగన్వాడీ సెంటర్ల లో ఉద్యోగాలుగా పనిచేసి వేర్వేరు కారణాలతో మానేసిన వారికి అవకాశం ఇవ్వాలని కోరారు. స్థానికులతో పాటు, ఇతర గ్రామాల్లో ఉంటున్న వారికి అవకాశం కల్పించాలని సభ్యుల అభిప్రాయం మేరకు ఏకగ్రీవ తీర్మానం చేశారు. గ్రామాల్లో మహిళా సంఘాలను చైతన్యపర్చి వ్యక్తిగత మరుగుడొడ్లు నిర్మించుకునేలా కమిటీ సభ్యులు చొరవ చూపించాలని చైర్మన్ వర లక్ష్మీ, సీఈఓ హనుమానాయక్ సభ్యులకు సూచిం చా రు. అంగన్వాడీలకు విజయా డెయిరీ నుంచి పాలు సప్లయ్ కావడం లేదని, ఆ కాంట్రాక్ట్‌ను తొలగించి మరొకరికి ఆ బాధ్యతలు అప్పగించాలని కోరారు. కొత్త భవనాలకు ప్రతిపాదనలు సంక్షేమ వసతి గృహాలకు ఎక్కడైతే సొంత భవనాలు లేవో వాటిని గుర్తించి ప్రతిపాదనలు పంపిస్తే పక్కా భవనాల మంజూరుకు కృషి చేస్తానని కమిటీ చైర్మన్ చుక్కా ప్రేమలత పేర్కొన్నారు. కమ్యూనిటీ హాల్స్ పనుల త్వరగా పూర్తిచేయాలని, ఎస్సీ, ఎస్టీలకు రు ణాలు అందజేసి వారిని ఆదుకోవాలని చైర్మన్ సూ చించారు. దళితులకు మూడెకరాల భూమి పంపిణీ చేసేలా అధికారులు కృషి చేయాలన్నారు. -
ఎల్జీయే ఢిల్లీకి బాస్
న్యూఢిల్లీ: రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఢిల్లీలో లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్జీ)కే ప్రాధాన్యత ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇతర కేంద్రపాలిత ప్రాంతాలతో పోలిస్తే రాజ్యాంగంలోని 239ఏఏ ఆర్టికల్ ప్రకారం ఢిల్లీలో ప్రభుత్వం కంటే ఎల్జీకే ఎక్కువ అధికారాలుంటాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం గురువారం వెల్లడించింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచీ ఎల్జీతో రోజూ ఘర్షణ తప్పట్లేదని.. మంత్రులంతా అధికారుల ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందని ఆప్ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. దీనిపై విచారించిన ధర్మాసనం.. ‘ఆర్టికల్ 239ఏఏ ఢిల్లీకే ప్రత్యేకం. రాజ్యాంగ పరిధిలో ఈ చట్టం ఎల్జీకే విశిష్టాధికారాలు కట్టబెట్టింది’ అని పేర్కొంది. ‘రాష్ట్రపతికి ఉండే పలు అధికారాలు ఢిల్లీలో ఎల్జీకి ఉంటాయని చట్టంలో స్పష్టంగా ఉంది. అయితే, మంత్రుల సలహాలతో ఎల్జీ పనిచేయాల్సి ఉంటుంది. వీరి ఆలోచనలతో విభేదిస్తే.. సమస్యల త్వరిత పరిష్కారం కోసం ఆయన రాష్ట్రపతి దృష్టికి సదరు విషయాన్ని తీసుకెళ్లాలి’ అని ధర్మాసనం స్పషం చేసింది. -
సోషల్ మీడియా: ఫేక్‌న్యూస్‌కు బ్రేక్?
సాక్షి నాలెడ్జ్ సెంటర్: సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరుతున్న కథనాలు, వార్తలు రానురాను ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. అయితే ఎవరిష్టం వచ్చినట్లు వారు వాస్తవాలకు సొంత అభిప్రాయాలు, వ్యాఖ్యానాలు జోడించి, అయినవి కానట్లుగా, కానివి అయినట్లుగా పోస్ట్ చేయడం, వాటిని మరికొందరు గుడ్డిగా ఇతరులకు పంపడం ఇటీవల పెచ్చుమీరిపోతోంది. ఈ నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో వస్తున్న సమాచారాన్ని ఏ మేరకు విశ్వసించాలి అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఎన్నికలు, ప్రముఖులకు సంబంధించిన విషయాలు, ప్రభుత్వ విధానాల వంటి విషయాలు సాధారణంగానే ప్రాధాన్యతను కలిగి ఉంటాయి. అయితే ఈ అంశాలపై కొన్నిసార్లు వాస్తవాలకు భిన్నంగా కథనాలు, వార్తలు సామాజిక మాధ్యమాల్లో వెలువడుతుంటాయి. ఆన్లైన్లో లభించే సమాచారం వచ్చే పదేళ్లలో ఎలా ఉండబోతోందన్న దానిపై ప్యూ (పీఈడబ్ల్యూ) పరిశోధనా కేంద్రం, ఈలాన్ విశ్వవిద్యాలయానికి చెందిన ఇమేజింగ్ ది ఇంటర్నెట్ సెంటర్లు సంయుక్తంగా వృత్తి నిపుణులు, మేధావులు, తదితరులతో సమాలోచనలు జరిపాయి. 2016లో బ్రెగ్జిట్ ఓటింగ్ సందర్భంగా, గతేడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికలపుడు ఈ డిజిటల్ మాధ్యమాల ద్వారా జరిగిన ప్రచారం, వెలువడిన వార్తలు, సామాజికంగా, సాంస్కృతికంగా వెల్లడైన అభిప్రాయాలు అధిక సంఖ్యాకులపై ప్రభావం చూపాయి. ఈ విధంగా ఏర్పడిన కొత్త సమాచార కేంద్రాల ద్వారా వివిధవర్గాల ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా సమాచారాన్ని అందజేసే ప్రయత్నం కూడా జరిగిందని ఈ అనుభవాలు వెల్లడిస్తున్నాయి. దాదాపు 900 పైగా న్యూస్ అవుట్లెట్ల ద్వారా 37.6 కోట్ల మంది ఫేస్బుక్ వినియోగదారులు జరిపిన సంభాషణల్లో ప్రజలు తమ భావాలు, అభిప్రాయాలకు అనువైన కోణంలో, దృక్పథంలో సమాచారాన్ని, వివరాలను కోరుకుంటున్నట్లుగా మరో అధ్యయనంలో తేలింది. వీటి ప్రాతిపదికన వెలువడే అసమగ్ర, అవాస్తవ సమాచారం, కథనాలను నమ్మే పరిస్థితులు ఏర్పడ్డాయి. ‘బీబీసీ ఫ్యూచర్’ ఇటీవల ‘21వ శతాబ్దంలో మనం ఎదుర్కోబోయే పెను సవాళ్లు’ పేరిట 50 మందికి పైగా నిపుణులను ఇంటర్వ్యూ చేసింది. కొత్త కోణంలో సత్యాన్ని, వాస్తవాన్ని వార్తలుగా అందించడం పెనుసవాల్‌గా మారనుందని వైర్డ్ మ్యాగజైన్ సహ వ్యవస్థాపకుడు కెవిన్ కెల్లీ అభిప్రాయపడ్డారు. ‘ఏవైనా విషయాలకు సంబంధించి అధికారవర్గాలు చెప్పే దానిని విశ్వసించడం కన్నా తోటివారు, సహచరులు వెల్లడించే అంశాలను నమ్మే పరిస్థితి ఏర్పడింది’ అని ఆయన పేర్కొన్నారు. అమెరికా ఎన్నికల సందర్భంగా పరిశోధనా కేంద్రం నిర్వహించిన అధ్యయనంలో అవాస్తవ కథనాలు తమను గందరగోళానికి గురిచేశాయని 64 శాతం మంది చెప్పారు. కల్పిత రాజకీయ కథనాలను ఇతరులకు షేర్ చేసినట్లు, ఇది కొన్ని సందర్భాల్లో ఉద్దేశ పూర్వకంగా, కొన్ని సార్లు తమకు తెలియకుండానే చేసినట్లు 23 శాతం మంది తెలిపారు. సమాచారం దగ్గరగా మారుతుందని 49 శాతం మంది, అధ్వాన్నంగా మారుతుందని 51 శాతం మంది అభిప్రాయపడుతున్నారు. సానుకూల స్పందనలు ∙సమాచారాన్ని సాంకేతికంగా వడపోయడం, అవాస్తవాలను పక్కకు తోసేయడం వల్ల వార్తల్లోని నాణ్యతను ప్రజలు తెలుసుకునే వీలుంటుంది. ∙సమాచార విస్తృతి పెరిగే కొద్ది ప్రజలు అందుకనుగుణంగా వాస్తవాలను అర్థం చేసుకోగలుగుతారు. ∙ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆయా సమస్యలను అధిగమించేలా చేస్తుంది. ప్రతికూల అభిప్రాయాలు u కేవలం సాంకేతికతే ఈ సమస్యను అధిగమించలేదు. సరైన సమాచారం వెలువడేలా ప్రజలు ఏర్పా ట్లు చేసుకోవాలి. ప్రజల్లో సమాచార సాక్షరత పెరిగేలా చర్యలు తీసుకోవాలి. u సాంకేతికత కొత్త సవాళ్లను ముందుకు తెస్తున్నందున సమాచార నాణ్యత పెరగదు. u ఈ సమస్య మానవ సంబం«ధితమైనది కాబట్టి సమాచార విస్తృతి పెరగదు. సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలి. -
కేంద్ర క్రీడా శాఖ ప్రయారిటీ జాబితాలో యోగ
-
మెట్రో రైలు నియామకాల్లో స్థానికులకు ప్రాధాన్యం
హైదరాబాద్: హైదరాబాద్ మెట్రో రైలు ఉద్యోగ నియామకాల్లో స్థానికులకు, ప్రత్యేకించి మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మెట్రో నిర్వాహకులకు సూచించారు. మెట్రో నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ఫ్రెంచి కంపెనీ కియోలిస్ సీఈవో బెర్నార్డ్ టబరీ గురువారం సీఎం కేసీఆర్‌తో క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. స్థానిక ఇంజనీరింగ్ కాలేజీలను సందర్శించి క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా మెయింటెనెన్స్ ఇంజనీర్లను ఎంపిక చేస్తామని బెర్నార్డ్ హామీ ఇచ్చారు. అవకాశమున్న చోట మహిళలకు కూడా ఉద్యోగావకాశాలు కల్పిస్తామన్నారు. -
బాలీవుడ్‌ల్ ఆఫర్ వస్తే చేస్తా
-
'ఆర్మీ సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత'
న్యూఢిల్లీ: ఆర్మీ సిబ్బంది సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తామని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ అన్నారు. సైనిక దళాల్లో ఆత్మహత్య ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గోవా షిప్‌యార్డులో 8 నౌకలను నిర్మిస్తామని పారికర్ తెలిపారు. -
జిల్లా ప్రాజెక్టులకు ప్రాధాన్యం
అచ్చంపేట రూరల్/ఉప్పునుంతల: జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి, వచ్చే బడ్జెట్లో ఎక్కువ నిధులు కేటాయించనున్నట్లు రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు వెల్లడించారు. ఆదివారం ఉప్పునుంతల మండలం పెనిమిళ్లలో విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ చెరువులు బాగుంటేనే ఊరు బాగుంటుందనే ఉద్దేశంతో రూ.5 వేల కోట్లతో రాష్ట్రంలో 9 వేల చెరువుల పునరుద్ధరణ పనులకు శ్రీకారం చుట్టినట్లు పేర్కొన్నారు. రైతులు చెరువులో తీసిన ఒండ్రుమట్టిని పొలాల్లో వేసుకుంటే పెట్టుబడులు తగ్గడంతో పాటు దిగుబడులు పెరుగుతాయని సూచించారు. తెలంగాణ లో ఖరీఫ్ పంటలు పండక రైతులు ఇబ్బందులు పడుతుంటే, కరెంట్ ఇవ్వకుండా చంద్రబాబు ఆంధ్రాలో రెండో పంట కోసం ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్ ఉమ్మడి ఒప్పందాలను బాబు ఉల్లంఘిస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని ఇబ్బందులెదురైనా రైతులకు ఆరుగంటల విద్యుత్ ఇచ్చి తీరుతామన్నారు. తెలంగాణ విద్యార్థులకు అన్యాయం జరుగుతున్నా ఒప్పందాలకు లోబడి ఉమ్మడి పరీక్షా విధానాన్ని అంగీకరించామని తెలిపారు. పల్లెటూర్లో రూ.1.50 లక్షల లోపు ఆదాయం ఉన్న ప్రతి ఒక్కరికి ఆహారభద్రత కార్డును ఇవ్వనున్నామని పేర్కొన్నారు. అనంతరం ఉప్పునుంతలలో రూ.64 లక్షల నాబార్డు నిధులతో నిర్మించనున్న పీఏసీఎస్ గోదాం నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అచ్చంపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి వరాలజల్లు కురిపించారు. సమావేశంలో అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వలబాలరాజ్, ఎంపీపీ తిప్పర్తి అరుణ, జెడ్పీటీసీ కట్టా సరిత, ట్రాన్స్‌కో ఎస్ఈ సదాశివరెడ్డి, పెనిమిళ్ల సర్పంచు చంద్రశేఖర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. వైఎస్ పథకాల అమలు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఆదివారం అచ్చంపేటలోని అంగిరేకుల శేఖరయ్య ఫంక్షన్ హాలులో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. అచ్చంపేట నియోజకవర్గాన్ని మరో సిద్దిపేటగా మారుస్తానని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంటే చంద్రబాబు ఓర్వలేకపోవడం దురదృష్టకరమన్నారు. తెలంగాణ ప్రతి ఎకరాకు నీరు పారే విధంగా పకడ్బందీ ప్రణాళికలు రూపొందించామన్నారు. టీఆర్ఎస్ కోసం పనిచేసే ప్రతి ఒక్కరికీ పార్టీ గౌరవం దక్కుతుందన్నారు. టీడీపీతో వేసారిపోయి ఆ పార్టీకి చెందిన చాలామంది టీఆర్ఎస్లో చేరుతున్నారని పేర్కొన్నారు. పోకల మనోహర్ చేరికతో పార్టీ మరింత బలపడుతుందని చెప్పారు. భూమి లేని నిరుపేద దళితులకు మూడు ఎకరాల భూమి, రైతులకు లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేయనున్నట్లు చెప్పారు. అమ్రాబాద్ మండలం మానువడ్డ వాగు, బల్మూర్ మండలం రుసూల్ చెర్వు మరమ్మతులు చేయిస్తామన్నారు. అనంతరం టీడీపీ సీనియర్ నేత పోకల మనోహర్, అచ్చంపేట ఎంపీపీ పర్వతాలు, జెడ్పీటీసీ సభ్యుడు రామకృష్ణారెడ్డి, కసిరెడ్డి దేవేందర్‌రెడ్డి,12 మంది సర్పంచ్‌లు, ఆరుగురు ఎంపీటీసీ సభ్యులు హరీశ్‌రావు సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ బండారు భాస్కర్, దేవరకద్ర ఎమ్మెల్యే వెంకటేశ్వర్‌రెడ్డి, నారాయణపేట పార్టీ ఇన్చార్జి శివకుమార్‌రెడ్డి, చీమర్ల దామోదర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
దసరా ఉత్సవాలకు సిద్ధంకావాలి
ఉత్సవాల ఏర్పాట్లపై సబ్ కలెక్టర్ సమావేశం భక్తులకు ఇబ్బందులు కలిగించొద్దు.. పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వండి ప్రసాదాల కొరత లేకుండా చూడండి 4వేల మంది పోలీసులతో బందోబస్తు విజయవాడ : భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు చేయాలని సబ్ కలెక్టర్ డి.హరి చందన అధికారులను ఆదేశించారు. దసరా ఉత్సవ ఏర్పాట్లపై సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఆమె సమన్వయ సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సెప్టెంబర్ 25వ తేదీ నుంచి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయని, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మెరుగైన ఏర్పాట్లు చేయూలని ఆదేశించారు. ఉత్సవాలకు వచ్చే లక్షలాది మంది భక్తుల మనోభావాలకు అనుగుణంగా ఈ ఏర్పాట్లు ఉండాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఘాట్లతోపాటు ఇంద్రకీలాద్రిపై ఎప్పటికప్పుడు పారిశుధ్యాన్ని పర్యవేక్షించాలని చెప్పారు. ఘాట్ల వద్ద తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని శానిటేషన్ అధికారులను ఆదేశించారు. ప్రసాదం తయారీ కేంద్రాల వద్ద అగ్నిమాపక సిబ్బంది తనిఖీలు నిర్వహించాలని, వారి సలహా మేరకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రసాదం కౌంటర్ల వద్ద తొక్కిసలాట జరగకుండా, అందరికీ ప్రసాదాలు అందేలా చూడాలని చెప్పారు. క్యూలైన్లకు పటిష్టమైన బారికేడింగ్ ఏర్పాటుచేయూలని ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. అన్ని ఘాట్ల వద్ద వైద్య శిబిరాలు ఏర్పాటుచేయాలని, అత్యవసర మందులను సిద్ధం చేసుకోవాలని వైద్య అధికారులను ఆదేశించారు. తాగునీటికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని, మూలానక్షత్రం రోజున భక్తుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని అదనపు స్టాకును సిద్ధం చేసుకోవాలని సబ్ కలెక్టర్ హరిచందన సూచించారు. చెప్పుల స్టాండ్, సామాన్లు భద్రపరిచే క్లోక్‌రూమ్‌లను అదనంగా ఏర్పాటుచేయాలని ఆదేశించారు. పోలీస్ అధికారులు, సిబ్బందికి సహకరించేందుకు ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వలంటీర్ల సేవలను వినియోగించాలని, వారికి ముందుగా శిక్షణ ఇవ్వాలని యువజన సంక్షేమ శాఖ అధికారిని ఆదేశించారు. కేశఖండన వద్ద బార్బర్లకు గుర్తింపుకార్డులు ఉండాలని చెప్పారు. డీసీపీ తస్సీర్ ఇక్బాల్ మాట్లాడుతూ దసరా ఉత్సవాల సందర్భంగా సుమారు నాలుగువేల మంది వివిధ స్థాయి పోలీస్ అధికారులు, సిబ్బంది విధులు నిర్వర్తిస్తారన్నారు. ఉత్సవాల తొమ్మిది రోజులూ నగరంలోకి వాహనాలు ప్రవేశించకుండా ట్రాఫిక్ మళ్లిస్తున్నామన్నారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా గొల్లపూడి, సితార, చిట్టినగర్, ఎర్రకట్ట, బుడమేరు బ్రిడ్జి, బెంజిసర్కిల్ వద్ద ఆరు క్రేన్లను సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి వి.త్రినాథరావు, ఏసీపీ ఎస్.రాఘవరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్
లోక్‌సభలో ఈ రోజు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన దేశ వార్షిక బడ్జెట్ (2014-2015)లో ఆంధ్రప్రదేశ్‌కు ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత ఇవ్వలేదు. రాష్ట్రంలో కొన్ని సంస్థలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ, రాష్ట్ర విభజనకు ముందు ఇచ్చిన ప్రధాన హామీల ప్రస్తావనేలేదు. విభజన జరిగిన నేపధ్యంలో ఏపి ఎంతో నష్టపోయింది. అనేక అంశాలలో తీవ్రస్థాయిలో నష్టం జరిగింది. ఆర్థికంగా అస్తవ్యస్తంగా ఉంది. రాష్ట్ర రాజధాని నిర్మించుకోవలసి ఉంది. విద్య, వైద్యంతోపాటు మౌలిక సదుపాయాలు సమకూర్చుకోవలసి ఉంది. అందుకు తగిన రీతిలో బడ్జెట్లో నిధుల కేటాయింపులు లేవు. జాతీయ వార్షిక బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయించినవి: * ఎయిమ్స్ - అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ * ఐఐటి - ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ * వ్యవసాయ విశ్వవిద్యాలయం * అనంతపురం జిల్లా హిందూపురంలో జాతీయ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ అకాడమీ * శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నంలో ఇండస్ట్రీయల్ స్మార్ట్ సిటీ ఏర్పాటు * విశాఖపట్నం నుంచి చెన్నై వరకూ పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు * హార్డ్‌వేర్ తయారీ లక్ష్యంగా కాకినాడ పోర్టు అభివృద్ధి బడ్జెట్లో ప్రస్తావించని ప్రధాన అంశాలు: * ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అతి ప్రధానమైన కొత్త రాజధాని నిర్మాణానికి నిధుల కేటాయింపు ప్రస్తావనేలేదు. * రాష్ట్ర విభజన సమయంలో చెప్పినవిధంగా ఐఐఎం(ఇండియన్ ఇస్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్)ను ఏపికి ప్రకటించలేదు. * సెంట్రల్ యూనివర్సిటీని ప్రకటించలేదు * గిరిజన విశ్వవిద్యాలయ ప్రస్తావనలేదు * అందరూ ఊహించినట్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ప్రతిపాదన కూడా బడ్జెట్లో లేదు. * పోలవరం ప్రాజెక్టు ప్రస్తావనలేదు. * విభజన సమయంలో కేంద్రం చెప్పిన విధంగా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించలేదు. * విజయవాడ-గుంటూరు-తెనాలి మెట్రోరైలు ప్రాజెక్టు ప్రకటించలేదు. -
ఎవరికి ప్రాధాన్యత? ఎవరికి లేదు?
న్యూఢిల్లీ: కేంద్ర మంత్రి మండలిలో ఉత్తరప్రదేశ్‌కు పెద్దపీట వేశారు. ఆ తరువాతి స్థానం మహారాష్ట్రకు దక్కింది. ముస్లీంలకు ప్రధాన్యత లేదు. ఒక్కరికి మాత్రమే స్థానం లభించింది. కేంద్ర మంత్రి మండలి ఎంపికలో మోడీ మార్కు స్పష్టంగా కనిపిస్తోంది. ఆర్ఎస్ఎస్ ప్రభావం కూడా ఉందని భావిస్తున్నారు యుపి నుంచి 9 మందికి మంత్రులుగా చోటు దక్కింది. యుపి నుంచి గెలుపొందిన రాజ్‌నాథ్, ఉమాభారతి, కల్ రాజ్ మిశ్రా, మేనకాగాంధీ , వీకే సింగ్, సంతోష్ గంగావార్, సంజీవ్ కుమార్, మనోజ్ సిన్హా కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేశారు. మహారాష్ట్ర నుంచి ఆరుగురికి స్థానం దక్కింది. మహారాష్ట్రకు చెందిన నితన్ గడ్కరీ, గోపీనాథ్ ముండే, అనంత్ గీతె, ప్రకాష్ జవదేకర్, పీయూష్ గోయల్, రావుసాహెబ్‌లు మంత్రులుగా ప్రమాణం చేశారు. ముస్లీంలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఒక్క నజ్మా హెప్తుల్లాకు మాత్రమే స్థానం దక్కింది. బిజెపిలో సీనియర్లకు మంత్రి మండలిలో స్థానం లభించలేదు. ఆ పార్టీ అగ్రనేతలైన అద్వానీ, అరుణ్ శౌరి, మురళీ మనోహర్ జోషీ, మన రాష్ట్రానికి చెందిన దత్తాత్రేయ వంటి వారికి మంత్రి పదవులు లభించలేదు. వారు లేకుండా బిజెపిని ఊహించడమే కష్టం. అటువంటి వారికి కేబినెట్లో స్థానం దక్కలేదు. అయితే వారికి ముందు ముందు ఇంకా ఏమైనా పదవులు ఇచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
టీడీపీలో బాలయ్యకు ప్రాధాన్యమేదీ?
తెలుగుదేశం పార్టీలో బాలకృష్ణకు ప్రాధాన్యం ఇవ్వడంలేదని బాలకృష్ణ అభిమాన సంఘం నాయకుడు రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. నందమూరి వారసులకు పార్టీలో ప్రాధాన్యం ఇచ్చి తీరాలని ఆయన డిమాండ్ చేశారు. అలా ఇవ్వని పక్షంలో తెలుగుదేశం పార్టీకి తామంతా వ్యతిరేకంగా పనిచేస్తామని హెచ్చరించారు. విశాఖపట్నంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, బాలకృష్ణ. ఇతర నందమూరి కుటుంబ సభ్యులకు పార్టీలో ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన అన్నారు.