సాక్షి, హైదరాబాద్: నగరవాసులు కొత్త సంవత్సరంలో తీసుకునే తీర్మానాల్లో సరికొత్తగా ఒకటి వచ్చి చేరింది. జిమ్‌కు వెళ్లాలి, డైట్ ఫాలో కావాలి, టైమ్ మేనేజ్‌మెంట్ చేయాలి, కుటుంబ సభ్యులకు సమయం కేటాయించాలి తదిరాలన్నీ గతం నుంచి ఉంటూ వచ్చేవి. కానీ 2024లో మాత్రం అలాంటి తీర్మానాల వరుసలో డిజిటల్ డిటాక్స్ వచ్చింది.
విపరీతంగా ఎల్రక్టానిక్ డివైజ్‌లకు అలవాటు పడుతూ రకరకాల మానసిక సమస్యలకు గురవుతున్న పలువురు వైద్యుల సూచనల ప్రకారం దీనిని తమ తీర్మానాల జాబితాలో ప్రధానంగా చేర్చినట్టు ‘సాక్షి’కి తెలిపారు. ఈ నేపథ్యంలో ఇలా డిజిటల్ డిటాక్స్‌ను తీర్మానంగా ఎంచుకున్నవారు లక్ష్యాన్ని సాధించేందుకు గాను వైద్యులు చేస్తున్న సూచనలివీ..
► సినిమాలు ఇతర వినోదాలకు ఇంట్లో టీవీలు, ఆఫీసు పనిలో భాగంగా డెస్క్‌టాప్/ ల్యాప్‌టాప్, సోషల్ మీడియా వగైరాలకు స్మార్ట్ ఫోన్స్...ఇలా స్క్రీన్ వీక్షణ తగ్గించాలి.
► దీని కోసం ఆయా డిజిటల్ పరికరాల వినియోగం నుంచి క్రమం తప్పని విరామం తీసుకోవాలి.
► మొబైల్‌ను అవసరమైన పనులకు మాత్రమే వినియోగించాలి.
► తప్పనిసరి అయ్యి లేదా అనుకోకుండానో ఒక రోజులో ఎక్కువ సమయం డిజిటల్ పరికరాలతో గడిపితే ఆ మరుసటి రోజు అంతకు రెట్టింపు సమయం వాటి నుంచి విరామం తీసుకోవాలి.
► ప్రతీ రోజూ నిద్రకు ముందు నిద్ర నుంచి లేచిన తర్వాత నిర్ణీత వేళలు నిర్ణయించుకుని స్కీన్ర్‌కు దూరంగా ఉండాలి.
► స్కీన్స్ర్‌తో సంబంధం లేని కార్యకలాపాల్లో పాల్గొనడానికి ఒక రోజు సంపూర్ణంగా ‘డిజిటల్ డిటాక్స్’రోజుగా పరిగణించాలి.
Comments
Please login to add a commentAdd a comment