Resolutions
-
మెగా కోడలు లావణ్య త్రిపాఠి.. న్యూ ఇయర్ రిజల్యూషన్స్ ఏంటో తెలుసా!
గతేడాది హీరోయిన్ లావణ్య త్రిపాఠి వివాహబంధంలోకి అడుగుపెట్టింది. మెగా హీరో వరుణ్ తేజ్‌ను పెళ్లాడిన ముద్దుగుమ్మ.. ప్రస్తుతం ఎలాంటి సినిమాల్లో నటించడం లేదు. వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుక ఇటలీలో ఘనంగా జరిగింది. టుస్కానీలో జరిగిన గ్రాండ్ వెడ్డింగ్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితులు పాల్గొని సందడి చేశారు. గతేడాది జూన్‌లో ఎంగేజ్మెంట్ చేసుకున్న వీరిద్దరు పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. అయితే కొత్త ఏడాదికి స్వాగతం పలికిన లావణ్య తన న్యూ ఇయర్ రిజల్యూషన్స్ను సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. మెగా కోడలు అభిమానులకు న్యూ ఇయర్ విషెస్ తెలిపింది. అంతే కాకుండా 2024లో తన న్యూ రిజల్యూషన్స్ను ఇన్‌స్టా స్టోరీస్‌లో పంచుకుంది. కొత్త ఏడాదిలో మరింత మానవత్వంతో ఉండాలని.. తనపై తనకు మరింత ప్రేమ, అలాగే సోషల్ మీడియాకు తక్కువ టైమ్ కేటాయించాలని.. ఎక్కువ సమయం ప్రకృతితో మమేకం కావాలని కోరుకుంటున్నట్లు రాసుకొచ్చింది. 2012లో అందాల రాక్షసి చిత్రం ద్వారానే టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ముద్దుగుమ్మ. అందాల రాక్షసి చిత్రానికి లావణ్య ఉత్తమ నటిగా అవార్డును అందుకుంది. అయితే సినిమాల్లో రాకముందు ఆమె హిందీ సీరియల్ ప్యార్ కా బంధన్ (2009)తో తొలిసారిగా నటించింది. వరుణ్ తేజ్- లావణ్య జంటగా మిస్టర్ (2017), అంతరిక్షం చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. -
ఫిక్స్.. డిజిటల్ డిటాక్స్
సాక్షి, హైదరాబాద్: నగరవాసులు కొత్త సంవత్సరంలో తీసుకునే తీర్మానాల్లో సరికొత్తగా ఒకటి వచ్చి చేరింది. జిమ్‌కు వెళ్లాలి, డైట్ ఫాలో కావాలి, టైమ్ మేనేజ్మెంట్ చేయాలి, కుటుంబ సభ్యులకు సమయం కేటాయించాలి తదిరాలన్నీ గతం నుంచి ఉంటూ వచ్చేవి. కానీ 2024లో మాత్రం అలాంటి తీర్మానాల వరుసలో డిజిటల్ డిటాక్స్ వచ్చింది. విపరీతంగా ఎల్రక్టానిక్ డివైజ్‌లకు అలవాటు పడుతూ రకరకాల మానసిక సమస్యలకు గురవుతున్న పలువురు వైద్యుల సూచనల ప్రకారం దీనిని తమ తీర్మానాల జాబితాలో ప్రధానంగా చేర్చినట్టు ‘సాక్షి’కి తెలిపారు. ఈ నేపథ్యంలో ఇలా డిజిటల్ డిటాక్స్‌ను తీర్మానంగా ఎంచుకున్నవారు లక్ష్యాన్ని సాధించేందుకు గాను వైద్యులు చేస్తున్న సూచనలివీ.. ► సినిమాలు ఇతర వినోదాలకు ఇంట్లో టీవీలు, ఆఫీసు పనిలో భాగంగా డెస్క్‌టాప్/ ల్యాప్‌టాప్, సోషల్ మీడియా వగైరాలకు స్మార్ట్ ఫోన్స్...ఇలా స్క్రీన్ వీక్షణ తగ్గించాలి. ► దీని కోసం ఆయా డిజిటల్ పరికరాల వినియోగం నుంచి క్రమం తప్పని విరామం తీసుకోవాలి. ► మొబైల్‌ను అవసరమైన పనులకు మాత్రమే వినియోగించాలి. ► తప్పనిసరి అయ్యి లేదా అనుకోకుండానో ఒక రోజులో ఎక్కువ సమయం డిజిటల్ పరికరాలతో గడిపితే ఆ మరుసటి రోజు అంతకు రెట్టింపు సమయం వాటి నుంచి విరామం తీసుకోవాలి. ► ప్రతీ రోజూ నిద్రకు ముందు నిద్ర నుంచి లేచిన తర్వాత నిర్ణీత వేళలు నిర్ణయించుకుని స్కీన్ర్కు దూరంగా ఉండాలి. ► స్కీన్స్ర్తో సంబంధం లేని కార్యకలాపాల్లో పాల్గొనడానికి ఒక రోజు సంపూర్ణంగా ‘డిజిటల్ డిటాక్స్’రోజుగా పరిగణించాలి. -
ఫస్టు నుంచి చూద్దాం!
అందరి షూ ర్యాక్‌లో దుమ్ము పట్టిన వాకింగ్ షూస్ ఉంటాయి. అవి గత సంవత్సరం జనవరి నెలలో కొన్నవి. కొత్త సంవత్సరంలో తీసుకున్న నిర్ణయాలలో భాగంగా, వాకింగ్ చేయాలనుకుని కొన్నవి అవి. ఆ వాకింగ్ ఎన్ని రోజులు సాగిందో. ప్రస్తుతం అవి దుమ్ముకొట్టుకుని, పట్టించుకునే యజమాని కోసం ఎదురు చూస్తూ అలా పడి ఉంటాయి. ఆ దారిన వెళుతున్నప్పుడల్లా ఆ జిమ్ కనిపిస్తూనే ఉంటుంది. జనవరి, ఫిబ్రవరి రెండు నెలలు వెళ్లి మూడో నెల నుంచి మానేసిన జిమ్. ట్రైనర్ ఇప్పటికీ ఫోన్ చేస్తుంటాడు. జిమ్ నుంచి అలెర్ట్ మెసేజ్‌లు వస్తూనే ఉంటాయి. గత సంవత్సరం కంటిన్యూ చేయలేదు కాని ఈ సంవత్సరం మళ్లీ చేరి కంటిన్యూ చేయాలి అనుకుంటూ ఉంటారు కొందరు. ఉదయం వాకింగ్ ఫ్రెండ్స్ వాకింగ్ చేస్తూనే ఉంటారు. మనం వారు కనిపిస్తే ముఖం తిప్పుకుని వెళ్లిపోతూ ఉంటాం. నాలుగు రోజుల సింగారంగా మన వాకింగ్ ముగిసిపోయి ఉంటుంది. ‘న్యూ ఇయర్ రానివ్వండి. జాయిన్ అవుతాను’ అని వాళ్లు కనిపించినప్పుడల్లా అంటూనే ఉంటారు. తక్షణం అవశ్యం ఆరోగ్యం ‘ఆలస్యం అమృతం విషం’ అన్నారు పెద్దలు. ‘తక్షణం అవశ్యం ఆరోగ్యం’ అనుకోవాలి విజ్ఞులు. ఇవాళ రేపట్లో మనం ఏం తింటున్నామో అందరికీ తెలుసు. విషం. మందులు విషం. కల్తీ గాలి. అయితే పరిగెత్తి చేసే ఉద్యోగాలు లేదా తిష్ట వేసినట్టుగా కదలక కూచుని చేసే కొలువులు... ఆరోగ్యం ఎలా? వయసు పెరిగే కొద్దీ బాధ్యతలు పెరుగుతాయి. బాధ్యతలు నెరవేరాలంటే ఆరోగ్యం ముఖ్యం. అందుకు ప్రయత్నం ముఖ్యం. అక్కడే వస్తుంది చిక్కు. ‘ఆరంభించరు నీచ మానవులు’ అని భర్తృహరి అన్నాడుకాని ‘ఆరంభించడానికి వేచి చూస్తారు సోమరి పోతులు’ అనాలి నిజానికైతే. ‘జనవరి 1 వస్తేనే ఆరంభిస్తా’ అనుకుంటే జనవరి 1 వస్తేనే భోం చేస్తా అనుకోరు ఎందుకో. ఫ్రెష్ స్టార్ట్ ఎఫెక్ట్ జనవరి 1 అంటే కొత్త సంవత్సరం వస్తుంది. క్యాలెండర్ మారుతుంది. అన్నిచోట్ల ఒక కొత్త ఉత్సాహం ఉంటుంది. కనుక కొత్తగా నిర్ణయాలను అమలు చేద్దాం అని చాలామంది అనుకుంటారు. దీనిని ఫ్రెష్ స్టార్ట్ ఎఫెక్ట్ అంటారు. అయితే డాక్టర్ జాన్ నార్క్రాస్ అనే సైకాలజీ ప్రొఫెసర్ ఇలా న్యూ ఇయర్ నిర్ణయాలు తీసుకుంటున్నవారిని గత 40 ఏళ్లుగా పరిశీలిస్తూ ఏమని తేల్చాడంటే– సాధారణంగా న్యూ ఇయర్ నిర్ణయాలలో ముఖ్యమైనవి 2. మొదటిది ఫిట్నెస్ సాధించడం, రెండోది బరువు తగ్గడం. ఫిట్నెస్ సాధించాలనుకునేవారు, బరువు తగ్గాలనుకునేవారు ఒక నెల రోజుల్లో సగానికి సగం మంది వ్యాయామం ఆపేస్తున్నారు. ఆరు నెలల్లో తొంభై శాతం మంది. పది శాతం మందే న్యూ ఇయర్ నిర్ణయాలను కొనసాగిస్తున్నారు. నిర్ణయం తీసుకోవడం ఎందుకు నీరుగారి పోవడం ఎందుకు? మంచి సీజన్ అమెరికా, బ్రిటన్లలో ప్రతి సంవత్సరం జనవరి నెలలో జిమ్‌లు కిటకిటలాడతాయి. నవంబర్, డిసెంబర్ వచ్చేసరికి ఖాళీ అయిపోతాయి. కొత్త సంవత్సరం ఉత్సాహం, నిర్ణయం నిలబడకపోవడమే కారణం. నిపుణులు ఏమంటున్నారంటే మీరు, మీ చుట్టూ ఉండే వాతావరణం ఎప్పుడు ఉత్సాహం గా ఉంటే అప్పుడు నిర్ణయాలు తీసుకుని అమలు చేయండి అని. ఉదాహరణకు మనకు వేసవి కాలం ఉత్సాహంగా అనిపిస్తే అప్పుడు మొదలెట్టి కొనసాగించాలి. లేదా నవంబర్ మంచి సీజన్ అనుకుంటే మొదలెట్టాలి. అమెరికాలో జనవరి నెల చలిలో మొదలెట్టే వ్యాయామాలు కొనసాగించడం సాధ్యం కావడం లేదని తేల్చారు. మన దగ్గర కూడా జనవరి చలి. ఆ చలిలో ఉదయాన్నే లేవలేక న్యూ ఇయర్ రెజల్యూషన్ పాటించడం లేదని బాధపడి... ఇదంతా ఎందుకు? ఈ రోజు నుంచే మొదలెట్టొచ్చు కదా. ముఖ్యం... చాలా ముఖ్యం ఆరోగ్యం కోసం కష్టపడటం ముఖ్యం. చాలా ముఖ్యం. ఏదో ఒక మంచి సందర్భంలో వజ్ర సంకల్పం తీసుకోవాలి. ఆల్కహాల్ తగ్గిస్తాను, స్మోకింగ్ మానేస్తాను, ఫేస్బుక్ కట్టేస్తాను, పిల్లలతో గడుపుతాను, యోగా చేస్తాను, నాన్‌వెజ్ వారంలో ఒక్కరోజే... ఇలా ఏ మంచి నిర్ణయమైనా మీకు మేలు చేస్తుంది. నేటి మీ నిర్ణయం రేపు మీ యోగం. -
G20 Summit: తీర్మానాలపై ఎన్నో ఆశలు
న్యూఢిల్లీ: జీ20 శిఖరాగ్ర సదస్సులో విస్తృత చర్చల తర్వాత దేశాధినేతలు ప్రపంచ శ్రేయస్సు కోసం ఎలాంటి తీర్మానాలు చేయనున్నారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. జులైలో జీ20 దేశాల పర్యావరణశాఖ మంత్రుల సదస్సులో శిలాజ ఇంథనాల వినియోగాన్ని దశాలవారీగా తగ్గించడంపై చర్చలో ఏకాభిప్రాయం కుదరనే లేదు. పునరుత్పాదక ఇంథన ఉత్పత్తి సామర్థ్యాన్ని 2030 నాటికల్లా 11 టెరావాట్లకు తేవడం, అభివృద్ధి చెందుతున్న దేశాలకు తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వడం వంటి అంశాల్లోనూ ఉమ్మడి నిర్ణయం తీసుకోలేకపోయాయి. శిలాజ ఇంధనాలకు బదులు మరో ఇంధన వనరులకు మారడం, బహుళ అభివృద్ధి బ్యాంకు(ఎండీబీ)లో సంస్కరణలు వంటి అంశాల్లో కనీస ఉమ్మడి నిర్ణయాలైనా దేశాధినేతలు తీసుకుంటారేమోనని పలు రంగాల వర్గాలు ఆశగా చూస్తున్నాయి. ‘అభివృద్ధి చెందుతున్న దేశాలకు మేలు చేకూర్చేలా తక్కువ వడ్డీకి రుణాలు అందేలా ఎండీబీలో సంస్కరణలు తేవాలన్న చర్చ జీ20 శిఖరాగ్ర సదస్సు స్థాయిలో జరగడం ఇదే తొలిసారి. సంస్కరణలు వాస్తవరూపం దాల్చితే ఎంతో మేలు’ అని క్లైమేట్ యాక్షన్ నెట్వర్క్ సంస్థలో గ్లోబల్ పాలసీ విభాగం నేత ఇంద్రజిత్ బోస్ ఆశాభావం వ్యక్తంచేశారు. అయితే ఇక్కడో సమస్య ఉంది. అభివృద్ధి చెందుతున్న దేశాలు తాము అందుకున్న నిధులను పర్యావరణ మార్పులు తదితరాలను ఎదుర్కొనేందుకు ఖర్చుచేస్తాయి. గ్రాంట్స్‌గా కాకుండా రుణాలు, పెట్టుబడుల రూపంలో ఈ నిధుల్ని అందుకుంటాయి. వీటిని తిరిగి చెల్లించాలి. కానీ ఆ దేశాలకు ఆ స్తోమత ఉండదు. దీంతో ఈ దేశాలను ఆదుకునేందుకు సంపన్న దేశాలు వెనుకంజ వేస్తున్నాయి. 2011–20కాలంలో ఇలాంటి దేశాలకు కేవలం 5 శాతం నిధులే దక్కాయి. ఈ నేపథ్యంలో గత వాగ్దానాలు, తీర్మానాలకు కట్టుబడేలా ఈసారైనా జీ20 దేశాలు ఉమ్మడి నిర్ణయాలు తీసుకుంటాయో లేదో చూడాలి. -
జీ20: ఎందుకు.. ఏమిటి!
ప్రపంచంలోనే అత్యంత ప్రభావవంతమైన దేశాల కూటమిగా ఖ్యాతికెక్కిన జీ20 సదస్సుకు హస్తిన ముస్తాబైంది. ఈనెల 9, 10 తేదీల్లో జీ20 శిఖరాగ్ర సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా జరుగు తున్నాయి. జీ20కి భారత సారథ్య బాధ్యతలు త్వరలో ముగుస్తున్న తరుణంలో ఢిల్లీలో జరిగే సదస్సులో విప్లవాత్మక తీర్మానా లు జరిగే అవకాశముంది. వర్కింగ్ గ్రూప్ సెషన్స్‌లో తీసుకున్న నిర్ణయాలు, వివిధ శాఖల జీ20 మంత్రుల విడివిడి సమావేశాల్లో చేసిన తీర్మానాలు ఈ శిఖరాగ్ర సదస్సు ముందుకు రానున్నాయి. ఈ నేపథ్యంలో జీ20 గురించి కొన్ని విషయాలను గుర్తుచేసుకుందాం. ఈసారి ఇతివృత్తమేంటి ? వసుధైక కుటుంబం అనేది ఈ ఏడాదికి జీ20 సదస్సు ఇతివృత్తం. ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు అనే భావనను స్ఫూర్తిగా తీసుకున్నారు. మహా ఉపనిషత్తులోని సంస్కృత రచనల్లో పేర్కొన్నట్లు సూక్షజీవులు మొదలు మనుషులు, జంతుజాలం అంతా ఈ భూమిపైనే ఒకే కుటుంబం జీవిస్తూ ఉమ్మడి భవిష్యత్తుతో ముందుగు సాగుతాయనేది ‘వసుధైక కుటుంబం’ అంతరార్థం. భూమిపై మనగడ సాగిస్తున్న జీవజాలం మధ్య అంతర్గత బంధాలు, సంపూర్ణ సమన్వయ వ్యవస్థల సహాహారమే వసుధైక కుటుంబం అని చాటిచెపుతూ దీనిని జీ20 సదస్సుకు ఇతివృత్తంగా తీసుకున్నారు. లైఫ్(లైఫ్ స్టైల్ ఆఫ్ ఎన్విరాన్మెంట్).. అంటే పర్యావరణహిత జీవన విధానాన్ని అవలంభించాలని సదస్సు ద్వారా జీ20 దేశాలు ప్రపంచానికి పిలుపునిచ్చాయి. వ్యక్తిగత స్థాయిలోనే కాదు దేశాల స్థాయిల్లో ఇదే విధానాన్ని కొనసాగించాలని జీ20 సదస్సు అభిలషిస్తోంది. ‘లైఫ్’తోనే శుద్ధ, పర్యావరణ హిత, సుస్థిర ప్రపంచాభివృద్ధి సాధ్యమని జీ20 కూటమి భావిస్తోంది. జీ20 సారథ్య బాధ్యతలను ఎలా నిర్ణయిస్తారు? 19 దేశాలు, ఐరోపా సమాఖ్యల కూటమే జీ20. ప్రపంచం స్థూల వస్తూత్పత్తిలో 85 శాతం, ప్రపంచ వాణిజ్యంలో 75 శాతం, ప్రపంచ జనాభాలో మూడింట రెండొంతులు జీ20 దేశాల్లోనే ఉంది. జీ20లో అంతర్గతంగా ఐదు గ్రూప్‌లు ఉన్నాయి. ఒక్కో గ్రూప్ నుంచి ఒక దేశం జీ20 సారథ్యం కోసం పోటీపడొచ్చు. ప్రతి సంవత్సరం రొటేషన్ పద్ధతిలో ఒక గ్రూప్‌కు సారథ్య బాధ్యతల అవకాశం దక్కుతుంది. తమ గ్రూప్ తరఫున సారథ్య అవకాశం వచ్చినపుడు ఆ గ్రూప్ నుంచి ఎవరు ప్రెసిడెన్సీకి పోటీ పడాలనేది అంతర్గతంగా ఆ దేశాలు విస్తృతంగా చర్చించుకుని నిర్ణయించుకుని ఉమ్మడి నిర్ణయం ప్రకటిస్తాయి. అలా తదుపరి సారథి ఎవరో నిర్ణయమైపోతుంది. సారథ్యం వహించే దేశం అత్యంత కీలకమైన బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. జీ20 అజెండా ఖరారు, శిఖరాగ్ర సదస్సుసహా మంత్రిత్వ శాఖల స్థాయిలో విడివిడిగా జీ20 గ్రూప్ సమావేశాలను వేర్వేరు పట్టణాల్లో నిర్వహించాలి. సమావేశాల తాలూకు అన్ని రకాల నిర్వహణ ఖర్చులు, సిబ్బంది తరలింపు బాధ్యత సారథ్య దేశానిదే. శాశ్వత సచివాలయం లేని సందర్భాల్లో జీ20 సదస్సు సంబంధ వ్యవహారాలనూ అతిథ్య దేశమే చూసుకోవాలి. తొలి సదస్సు ఎక్కడ ? 2008 నాటి ఆర్థిక సంక్షోభం కారణంగా జీ20 ఉద్భవించింది. ఆనాడు యురోపియన్ యూని యన్‌కు సారథ్యం వహిస్తున్న ఫ్రాన్స్.. ప్రపంచం ఆర్థిక మాంద్యం నుంచి గట్టెక్కి ఆర్థికవ్యవస్థ మళ్లీ ఉరకలెత్తాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపు నిచ్చింది. అప్పటికే జీ8 దేశాలైన కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, రష్యా, బ్రిటన్, అమెరికాలు పరిస్థితిని చక్కదిద్దలేకపోయాయి. దీంతో మరిన్ని దేశాలతో కలిపి జీ20ని కొత్తగా ఏర్పాటుచేశారు. ‘ఫైనాన్షియల్ మార్కెట్లు– ప్రపంచ ఆర్థికవ్యవస్థ’ ఇతివృత్తంతో తొలి జీ20 సదస్సు 2008 నవంబర్‌లో అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో జరిగింది. ఈసారి సదస్సుకు ఎవరెవరు వస్తున్నారు? అమెరికా అధ్యక్షుడు బైడెన్ పర్యావరణ మార్పులను అడ్డుకుంటూ శుద్ధ ఇంథనం వైపు ప్రపంచ దేశాలను ఎలా నడిపించాలనే అంశంపై ప్రసంగించేందుకు అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఈ సదస్సులో పాల్గొనబోతున్నారు. బహుళజాతి అభివృద్ధి బ్యాంకుల సామర్థ్యం పెంపుతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, సామాజిక అంశాలపై ఉక్రెయిన్ యుద్ధ ప్రభావాన్ని సమీక్షించనున్నారు. చైనా తరఫున లీ కియాంగ్ ఈసారి సదస్సులో చైనా తరఫున ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్ రావట్లేదు. ఆయన బదులు చైనా ప్రధాని లీ కియాంగ్ వస్తున్నారు. బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్ భారత్–బ్రిటన్ స్వేచ్ఛా వాణిజ్యం లక్ష్యంగా బ్రిటన్ ప్రధాని రిషీ సునాక్ ఈ శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటున్నారు. మోదీతో విడిగా భేటీ కానున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ ఢిల్లీలోని క్లారిడ్జ్ హోటల్లో ఈయన బస చేయనున్నారు. కెనడా ప్రధాని ట్రూడో రష్యాతో యుద్ధంలో తాము ఉక్రెయిన్‌కు మద్దతుగా నిలుస్తున్నట్లు ఈ అంతర్జాతీయ వేదికపై ఈయన ప్రకటన చేయనున్నారు. ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ ఇండోనేసియా, ఫిలిప్పీన్స్‌లోనూ పర్యటిస్తూ ఈయన భారత్‌లో జీ20లో పాల్గొననున్నారు. టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాలూ సదస్సులో పాల్గొంటారు. రానివారెవ్వరు ? ఆహ్వానం అందని కారణంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ రావట్లేదు. సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, మెక్సికో, జపాన్, ఇటలీ, జర్మనీ, ఇండోనేసియా, బ్రెజిల్, అర్జెంటీనాల అగ్రనేతలు సదస్సుకు రావట్లేదు. అతిథులు వస్తున్నారు.. అతిథి హోదాలో కొన్ని దేశాల నేతలు ఈ భేటీలో పాల్గొంటారు. నెదర్లాండ్స్, సింగపూర్, స్పెయిన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ), ఒమన్, బంగ్లాదేశ్, ఈజిప్ట్, మారిషస్, నైజీరియా ఈ జాబితాలో ఉన్నాయి. శి ఖరాగ్ర సదస్సు మొదలవగానే ఈ భేటీలో అగ్రరాజ్యాధినేతలు ఏమేం నిర్ణయాలు తీసుకోబోతున్నారు? ఎలాంటి తీర్మానాలు చేస్తారు ? ఏం వాగ్దానాలు చేస్తారు? అని ప్రపంచ దేశాలు ఉత్సకతతో ఎదురుచూడటం ఖాయం. పెను వాతావరణ మార్పులు, ఆర్థిక అనిశ్చితి, మాంద్యం భయాలు మొదలు ఉక్రెయిన్ యుద్ధం దాకా ఎన్నో అంతర్జాతీయ అంశాలు ఈ భేటీలో చర్చకురానున్నాయి. సదస్సులో భాగంగా విచ్చేసే దేశాధినేతలు విడివిడిగా ద్వైపాక్షిక చర్చలు, ఒప్పందాలు, ఉమ్మడి ప్రణాళికలు చేసుకునేందుకు చక్కని అవకాశం దక్కనుంది. ఇది ఆయా దేశాల పురోభివృద్ధికి ఎంతో దోహదపడనుంది. – నేషనల్ డెస్క్, సాక్షి -
ఎదిగే క్రమంలో ఎన్నో మార్పులు.. పిల్లల కోసం తల్లిదండ్రుల కొత్త తీర్మానాలు
పిల్లల మానసిక స్థితి ఏయే దేశాల్లో ఏవిధంగా ఉందో తెలుసుకోవడానికి గత ఏడాది యునిసెఫ్ ఓ ప్రయత్నం చేసింది. అందులో భాగంగా 21 దేశాలలో 20,000 మంది పిల్లలు– పెద్దలతో ఒక సర్వే నిర్వహించింది. మిగతా దేశాలతో పోల్చితే భారతదేశంలోని పిల్లలు మానసిక ఆరోగ్య చికిత్సను పొందేందుకు ఇష్టపడరని తేలింది. విదేశాలలో మానసిక ఆరోగ్య సమస్యల పట్ల సగటున 83 శాతం మంది స్పందిస్తే, 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయస్సు గల యువత 41 శాతం మాత్రమే మానసిక చికిత్సకు మద్దతునిచ్చారని తేలింది. ఇతరులను కలవాలనుకోరు.. మిగతా దేశాలతో పోల్చితే భారతీయ పిల్లలలో మానసిక రుగ్మతలను గుర్తించడం పెద్దవాళ్లకు కష్టంగా ఉంటుంది. అమ్మాయి లేదా అబ్బాయి పెరుగుతున్నప్పుడు అనేక శారీరక, మానసిక భావోద్వేగ మార్పులకు లోనవుతారు. అందుకు తగిన చికిత్స లేదా సహాయం తీసుకోవడానికి ఇష్టపడరు. 2019లో ఇండియన్ జర్నల్ ఆఫ్ సైకియాట్రీలో ప్రచురించిన ఒక అధ్యయనం, కరోనా మహమ్మారి రాకముందే 50 మిలియన్ల మంది భారతీయ పిల్లలు మానసిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని నివేదించింది. వీరిలో 80 నుంచి 90 శాతం మంది చికిత్స తీసుకోలేదు. ఈ అసమానతలు ఉన్నప్పటికీ, ఇండియన్ జర్నల్ ఆఫ్ సైకియాట్రీ 2017 ప్రకారం, భారతదేశం తన హెల్త్ బడ్జెట్లో ఏటా 0.05 శాతం మాత్రమే మానసిక ఆరోగ్యం కోసం ఖర్చు చేస్తోంది. సరైన తీర్మానాలివే! ►ఎడిహెచ్డి, ఆందోళన, ప్రవర్తనా సమస్యలు, నిరాశ అనేవి పిల్లలు– యుక్తవయస్కులలో అత్యంత ప్రబలంగా ఉన్న న్యూరో బిహేవియరల్ డిజార్డర్‌గా చెప్పవచ్చు. ►మానసిక నిపుణులు, మీరు.. పిల్లలతో కలిసి కూర్చుని, వారి నూతన సంవత్సర తీర్మానాలుగా నిర్దేశించాలనుకుంటున్న లక్ష్యాలను చర్చించాలి. ►ప్రవర్తనలో ఆకస్మిక మార్పులను గమనించాలి. ఇలాంటప్పుడు పిల్లలకి మానసిక బలం అవసరమని సూచించే అనేక సంకేతాలు కనిపిస్తాయి. ఇందులో స్నేహితులు, ►కుటుంబ సభ్యుల నుండి ఒంటరిగా ఉండటం, నిత్యకృత్యాలను పాటించకపోవడం, పిల్లలు సాధారణంగా ఆనందించే కార్యకలాపాల నుండి వైదొలగడం వంటి ప్రవర్తనలో ఆకస్మిక మార్పులు ఉంటాయి. ► పిల్లలు చెప్పేది ఓపికగా వినాలి. ఇబ్బందులు ఎదురైతే మద్దతుగా ఉంటానని భరోసా ఇవ్వాలి. ►పిల్లల పట్ల అధిక పర్యవేక్షణ, సానుభూతి చూపించడం తగ్గించాలి. అలాగే వారి మీద తక్కువ అంచనాలు ఉండాలి. ►రోజువారీ షెడ్యూల్లు, పనితీరు కారణంగా పిల్లలు తరచు అధిక స్థాయి ఒత్తిడి, ఆందోళన కు గురవుతారు. అందుకని, రోజువారీ దినచర్యలను అనుసరించడంలో ►పిల్లలకు సహాయపడాలి. చురుకైన జీవనశైలిని గడపడానికి ప్రోత్సహించాలి. ►పెద్దలు భావోద్వేగాలను వ్యక్తం చేసే విధానాన్ని పిల్లలు నిరంతరం గమనిస్తూనే ఉంటారు. ►ఒత్తిడిని తగ్గించుకోవడానికి తరచుగా దీర్ఘ శ్వాస తీసుకోవడం, రంగులు వేయడం, పెయింటింగ్ చేయడం, నడవడం లేదా సంగీతం వినడం వంటి కార్యకలాపాలలో పాల్గొంటాం. ►మన పిల్లలు ఒత్తిడిని ఎదుర్కోవడంలో, వారి జీవన నైపుణ్యాలను బలోపేతం చేయడంలో సహాయపడటానికి చిన్నప్పటినుంచే ఇలాంటి వ్యూహాలను పరిచయం చేయవచ్చు. ►ఆటలు, పాటలు, నృత్యం వంటి బృంద కార్యకలాపాలలో పాల్గొనడం ఒత్తిడిని తగ్గిస్తుంది. భావోద్వేగ, సామాజిక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తుంది. విశ్వాసాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది. దీనివల్ల అవకాశాలూ పెంపొందుతాయి. ►సానుకూల అభిప్రాయం, ప్రోత్సాహం సరైన ప్రవర్తనను పునరావృతం చేసేలా వారిని ప్రేరేపించడమే లక్ష్యంగా ఎంచుకోవాలి. మీరు సపోర్ట్ గా ఉన్నారని చేతల్లో చూపడం, సురక్షితమైన వాతావరణాన్ని అందించడం కూడా అంతే ముఖ్యం. చదవండి: అకస్మాత్తుగా గుండె పట్టేయడం.. గుండెపోటుతో చనిపోతాననే భయం! ఎందుకిలా? సమస్య ఏమిటంటే.. -
కొత్త సంకల్పాలు 2023: మూస నిర్ణయాలు వద్దు.. పాత నిర్లక్ష్యాలూ వద్దు
‘జిమ్‌లో చేరాలి’ ‘టైమ్‌కి భోజనం చేయాలి’ ‘వాకింగ్ మొదలెట్టాలి’ ‘స్మోకింగ్ మానేయాలి’... ఇలా కొత్త సంవత్సరం నిర్ణయాలు తీసుకోవడం, మర్చిపోవడం, జోక్‌గా మార్చడం ఇకపై వద్దు. కొత్తగా ఆలోచించండి. ‘నాలో నుంచి ద్వేషం తీసేస్తాను’ ‘ఇక పై సహనాన్ని సాధన చేస్తాను’ ‘జ్ఞానాన్ని పెంచుకుంటాను’ ‘డిజిటల్ సమయాన్ని తగ్గించుకుని కుటుంబానికి కేటాయిస్తాను’ ఎంత బాగున్నాయి ఇలాంటి నిర్ణయాలు. రాబోయే కాలం వ్యక్తిగతంగా, కుటుంబపరంగా, సామాజికంగా మీకెన్నో సవాళ్లు విసరొచ్చు. వాటి కోసం సిద్ధం కండి. చెదరని సంకల్పాలు ఈ సంవత్సరం తీసుకోండి. ‘ఈ పని చేసి తీరాలి’, ‘ఇది జరిగి తీరాలి’ అని హెచ్చరించుకోకపోతే మనిషి ఏ పనీ చేయడు. తనకు తాను గట్టిగా చెప్పుకోవడం కూడా అవసరమే. ‘నిర్ణయం’ (డెసిషన్) తీసుకుంటే దానిని మార్చుకునే అవకాశం ఉంది. కాని సంకల్పం (విల్) తీసుకోవాలి. ఒక పని సంకల్పించాక దానిని ఇక మార్చకూడదు. పూర్వం దీక్షా కంకణాలు కట్టేవారు పెద్దలు. ఒక పని అనుకున్నాక పూర్తయ్యే వరకు ఆ పనిని గుర్తు చేస్తూ కట్టే కంకణం అన్నమాట. పని పూర్తయ్యాకే కంకణం విప్పాలి. ఇప్పుడు 365 రోజుల పాటు విప్పడానికి వీల్లేని మనో కంకణం కట్టుకోవాలి కొత్త సంవత్సర సంకల్పంగా. ఎందుకు? ఎప్పటికప్పుడు జీవితాన్ని మెరుగు పర్చుకోవడానికి. సరి చేసుకోవడానికి. క్వాలిటీ ఆఫ్ లైఫ్ గడపడానికి. అర్థవంతంగా గడపడానికి. జీవితం జోక్ కాదు. తేలిగ్గా తీసుకునేది అంతకన్నా కాదు. చిన్న రాయి దెబ్బకు కూడా కకావికలం కావచ్చు జీవితం. అందువల్ల ఏమరుపాటుగా ఉండటానికి కూడా కొత్త సంవత్సర సంకల్పాలు తీసుకోవాలి. 2023లో వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సామాజికంగా ఎటువంటి మెరుగుదలకు సంకల్పాలు తీసుకోవచ్చో చూద్దాం. వ్యక్తిగతంగా... 1. భౌతికంగా ఎలా ఉన్నారు?: లావు, సన్నం తర్వాత. ముందు మీరు చురుగ్గా ఉన్నారా లేదా చూసుకోండి. ఆరోగ్యకరమైన శరీరం సగం సంతోషాన్ని, దేనినైనా ఎదుర్కొనవచ్చనే ధైర్యాన్ని ఇస్తుంది. మీకు మీరు దిలాసా ఇచ్చుకోవడానికి శరీరాన్ని చురుగ్గా ఉంచండి. వ్యాయామం, హెల్త్ చెకప్ అవసరం. సొంత వైద్యం మానాలి. అదే తగ్గిపోతుందిలే అనే నిర్లక్ష్యం వద్దు. శరీరమే ఆయుష్షు. మీ చర్యలతో మీకు మీరే ఆయుష్షు పోసుకోండి. 2. మానసికంగా: మానసిక ఉద్వేగాలు శరీరంపై ప్రభావం చూపుతాయి. కొన్ని లక్షణాలు జన్మతః, కొన్ని లక్షణాలు స్వభావరీత్యా ఏర్పడతాయి. వాటిలో పనికిమాలినవి వదిలేయండి. ఉదాహరణకు: ఈ సంవత్సరం అసూయ పడను అనుకుంటే చాలా మంది బంధువులు, స్నేహితులు, కలీగ్స్ మీకు ఆత్మీయులు అయిపోతారు. అసూయతోనే వారికి మీరు దూరం అవుతారు. అసూయ లేకపోతే ఇంత బలగం వస్తుంది. ద్వేషం, అత్యాశ, త్వరగా అందలం ఎక్కేయాలన్న కుతి... ఇవి వదులుకోవడం చాలా అవసరమైన సంకల్పాలు. ‘నా ప్రయాణం ఆరాంగా చేస్తాను. అంచెలంచెలుగా ముందుకు సాగుతాను. నా రేంజ్లో ఎంత పొందవచ్చో అంతా పొందుతాను. మిగిలినవారిని చూసి పోల్చుకోను’ అనుకోవడం మానసిక ఆరోగ్యానికి ఎంతో అవసరం. 3. ఉద్యోగపరంగా: వృత్తి నైపుణ్యం పెంచుకుంటాను అని సంకల్పించాలి. ఉన్న చోట ఉండిపోవడం తెలిసినదానితో ఆగిపోవడం సరి కాదు. పనిలో నైపుణ్యం పెరిగే కొద్దీ అందుకు అవసరమైన పరిజ్ఞానం పెంచుకునే కొద్దీ మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ‘ఈ ఉద్యోగం పోతే ఎలా’ అనే భయం పోతుంది. ‘ఎక్కడైనా బతకొచ్చు’ అనే ధైర్యం వస్తుంది. పని నేర్చుకోండి. మీ పనికి విలువ ఇచ్చే చోటుకు మారిపోండి. కుటుంబపరంగా... 1. మొదట కుటుంబం: కుటుంబం మొదటి ్రపాధాన్యం అనుకోవాలి. భార్య లేదా భర్త ఉద్యోగాలు చేస్తున్నా వేరే అభిరుచుల్లో ఉన్నా పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నా కుటుంబమే మొదటి ్రపాధాన్యం. ‘రోజూ రాత్రి భోజనం కలిసి చేయాలి’ నిర్ణయాన్ని తప్పనిసరిగా అమలు చేస్తే ఇల్లు దాదాపుగా ఒక దారికి వచ్చినట్టు. ‘చె΄్తాను... వింటాను’ అనేది కూడా చాలా పెద్ద సంకల్పం. భార్యకు/భర్తకు చెప్పాలనుకున్నది చెప్పకపోవడం, వారు చెప్పేది వినకపోవడం కుటుంబాల్లో అగాధాలకు కారణం. పిల్లల విషయంలో ‘అడుగుతాను/వింటాను’ అనే సంకల్పం. పిల్లలు ఏం చేస్తున్నారు... వారి రొటీన్... స్నేహితులు... ఇవి అడగడం 365 రోజులూ చేయాల్సిందే. వారి మనసులో ఏముందో మాటల్లో పెట్టి వినాల్సిందే. ‘ఫోన్ టైమ్ తగ్గించుకుంటాను’ అని సంకల్పించుకుంటే, సోషల్ మీడియా టైమ్ కట్ చేసుకుంటే రాబోయే సంవత్సరం మీకెన్నో కౌటుంబిక ఆనందాలు ఇస్తుంది. 2. ఆర్థిక నిర్లక్ష్యం వద్దు: ఇతర నిర్లక్ష్యాల కంటే అర్థిక నిర్లక్ష్యం మూలాల మీద కొడుతుంది. ఆప్తులను దూరం చేస్తుంది. చేతులు నులుముకునేలా చేస్తుంది. ‘ఆర్థిక విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉంటాను’ అనేది ముఖ్య సంకల్పం. కుటుంబం మొత్తం కలిసి ‘అనవసరమైనవి కొనం/ అనవసర ఖర్చులు చేయం/వేస్ట్‌ను నివారిస్తాం’ అనుకుంటే చాలా మంచి జరుగుతుంది. లైట్లు, గీజర్లు, స్టౌ, టీవీ, కంప్యూటర్ సమయానికి అందరూ ఆపినా చాలా పెద్ద విషయమే. ‘రాబోయే అవసరాలకు ఇప్పుడు ఎంత ఉంది’ అని చూసుకుంటే జాగ్రత్త అదే వస్తుంది. 3. చైతన్యంగా ఉంటాం: కుటుంబం ఆరోగ్యంగా, ఆర్థికంగా బాగున్నా చైతన్యం లేకుండా అజ్ఞానంతో ఉంటే ఎలా? పేపర్ తెప్పించండి. కుటుంబంలో ప్రతి ఒక్కరూ నెలకు ఒక పుస్తకమైనా చదవాలి అని సంకల్పించుకోవడం ఇంటికి వెలుతురు తీసుకురావడం. సామాజికంగా... మంచి ΄పౌరుడిగా మారండి: రోడ్డు మీద ఉమ్మను... ట్రాఫిక్ నియమాలు పాటిస్తాను.. అని అనుకోవడం కూడా చాలా పెద్ద విషయమే. ఒకటి సంస్కారం.. రెండోది ్రపాణానికి భద్రత. సమాజంలో ఒకరికి హాని చేసే ద్వేషాన్ని ప్రచారం చేయకుండా, ఒకరికి నష్టం చేసే అబద్ధంలో భాగంగా కాకుండా, ‘తెలిసీ కావాలనీ తప్పని తెలిసినా’ అలాంటి పనులు చేసి సామాజిక కలనేతకు నష్టం కలగించకుండా ఉంటాను అనుకోవడం అత్యంత ముఖ్యమైన సంకల్పం. ఇక దీక్ష బూనడం మీ వంతు. -
YSRCP Plenary: వైద్య, ఆరోగ్య రంగంపై తీర్మానంలోని అంశాల్లో హైలైట్స్
వైఎస్సార్ ప్రాంగణం నుంచి సాక్షి ప్రతినిధి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రంలో పేద, మధ్యతరగతి ప్రజలకు ఆరోగ్య భరోసా కల్పించారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని తెలిపారు. టీడీపీ హయాంలో హెల్త్ డిపార్ట్మెంట్ (వైద్య, ఆరోగ్య శాఖ) అప్పటి సీఎం చంద్రబాబు వెల్త్ (ఆదాయం) కోసం పనిచేస్తే.. ప్రస్తుతం రాష్ట్ర ప్రజల వెల్నెస్ (ఆరోగ్యం) కోసం పనిచేస్తోందని చెప్పారు. బాబు వైద్య శాఖలో అవినీతిని విస్తరించారని, సీఎం జగన్ ఆరోగ్యశ్రీ పథకాన్ని విస్తరించి ప్రజల ఆరోగ్యానికి భరోసాగా నిలుస్తున్నారని వివరించారు. చదవండి: చంద్రబాబు ఎక్కడ పోటీ చేసినా ఓటమి తథ్యం: విజయసాయిరెడ్డి వైఎస్సార్సీపీ ప్లీనరీలో శుక్రవారం వైద్య ఆరోగ్య రంగంలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాల మీద తీర్మానంపై మంత్రులు రజని, సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ చర్చించారు. మంత్రి రజని మాట్లాడుతూ.. 14 సంవత్సరాలు సీఎంగా పనిచేసిన చంద్రబాబు వైద్య రంగంలో మార్పు తేలేకపోయారని, సీఎం వైఎస్ జగన్ మూడేళ్లలో అద్భుత మార్పు తెచ్చారని చెప్పారు. 2019 ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం సాధించి, ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన రంజక పాలన అందిస్తున్నారని చెప్పారు. ఆయన పాలనలో చేపడుతున్న కనీవినీ ఎరుగని అభివృద్ధితో 2024లోనూ ఇదే విధమైన చారిత్రక విజయాన్ని అందుకుంటారని తెలిపారు. వైద్య, ఆరోగ్య రంగంపై తీర్మానంలోని అంశాల్లో హైలైట్స్.. ♦రూ. 5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న వారందరికి వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకం వర్తింపు. తద్వారా రాష్ట్రంలోని 85 % (1.40 కోట్ల) కుటుంబాలకు ఉచితంగా మెరుగైన వైద్యం. ♦టీడీపీ హయాంలో ఈ పథకం కింద కేవలం 1059 చికిత్సలు అందిస్తే.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2,446 చికిత్సలు అందుతున్నాయి. చికిత్సల సంఖ్యను ఇంకా పెంచేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ♦వెఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నెట్వర్క్ ఆస్పత్రుల సంఖ్య పెంపు. పక్క రాష్ట్రాల్లోని కార్పొరేట్ ఆస్పత్రుల్లో కూడా ఆరోగ్య శ్రీ పథకం కింద ఉచితంగా వైద్యం ♦గత టీడీపీ ప్రభుత్వం ఆరోగ్య శ్రీ పథకానికి రూ.5,171 కోట్లు ఖర్చు చేస్తే.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం గడిచిన మూడేళ్లలోనే రూ.5,100 కోట్లు ఖర్చు చేసింది. టీడీపీ హయాంలో రోజుకు సగటున 1500 మందికి వైద్యం అందించగా.. ఇప్పుడు రోజుకు సగటున 3 వేల మందికి పైగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా వైద్యం పొందుతున్నారు. ♦వైఎస్సార్సీపీ ప్రభుత్వం 104, 108 సేవలకు జీవం పోసింది. మండలానికి ఒకటి చొప్పున 104, 108 వాహనాలను ప్రవేశపెట్టడం ద్వారా సేవలను ప్రజలకు మరింత చేరువ చేసింది. ♦వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాడు–నేడు కార్యక్రమంలో భాగంగా 11 వైద్య కళాశాలలు, వాటికి అనుబంధంగా ఉండే బోధనాస్పత్రులను బలోపేతం చేస్తోంది. ♦రూ.12 వేల కోట్లకు పైగా ఖర్చుతో రాష్ట్రంలో 16 కొత్త వైద్య కళాశాలల నిర్మాణం చంద్రబాబుకు శ్రీరామచంద్రుడితో పోలికా! పదవి కోసం సొంత మామకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును లోకేష్ శ్రీరామచంద్రుడితో పోల్చడం హాస్యాస్పదం. లోకేశ్ తనను తాను రాక్షసుడితో పోల్చుకుంటున్నాడు. అతను రాక్షసుడు కాదు.. కమెడియన్. మా నాయకుడు జగన్ కోసం ఏమైనా చేయడం కోసం నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. 50 శాతానికి పైగా పదవులను బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు ఇచ్చి సామాజిక న్యాయానికి నిజమైన అర్థం చెప్పిన నాయకుడు సీఎం జగన్. 2024లో 175కు 175 సీట్లు గెలుస్తాం. ఇందుకోసం ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం. – మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ నాడు ఆరోగ్యశ్రీ ఉండి ఉంటే నా చెల్లి బతికి ఉండేది.. పుట్టుకతో ఉండే గుండె జబ్బు కారణంగా నా సోదరి 1999లో మృతి చెందింది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా నా చెల్లికి మెరుగైన వైద్యం అందించలేకపోయాం. అప్పట్లో ఆరోగ్య శ్రీ పథకం ఉండి ఉంటే నా చెల్లి ప్రాణాలతో ఉండేది. 2004లో వైఎస్సార్ సీఎం అయ్యాక పేదల ఆరోగ్యానికి భరోసా ఇవ్వడం కోసం ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత టీడీపీ ప్రభుత్వం పథకాన్ని పూర్తిగా పక్కనపెట్టడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వైఎస్సార్ తనయుడిగా పథకాన్ని ఊహించని రీతిలో వైఎస్ జగన్ బలోపేతం చేశారు. రాష్ట్రంలో ఉన్న 11 వైద్య కళాశాలల్లో ఏ ఒక్కటీ చంద్రబాబు హయాంలో నిర్మించినవి కావు. టీడీపీ ప్రభుత్వ ఆస్పత్రులను నరకానికి నకళ్లుగా మార్చింది. – మత్స్య, పశు సంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు -
ఉక్రెయిన్ పరిణామాలు.. భారత్ వైఖరి నిరుత్సాహకరం
వాషింగ్టన్: ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణను ఖండిస్తూ భద్రతామండలిలో ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్‌లో భారత్ పాల్గొనకపోవడం నిరుత్సాహం కలిగించిందని రిపబ్లిక్ పార్టీకి చెందిన అమెరికా టాప్ సెనేటర్ జాన్ కొర్నిన్ వ్యాఖ్యానించారు. రష్యాతో ఉన్న వ్యూహాత్మక సంబంధాలను కొనసాగించేందుకే ఆ దేశాన్ని విమర్శించకుండా ఇలా తప్పించుకునే వైఖరిని అనుసరించిందని ఆయన ట్విట్టర్ వేదికగా భారత్‌ను విమర్శించారు. సెనేట్ ఇండియా కాకస్ సహాధ్యక్షుడి భారత్– అమెరికా సంబంధాలు బలోపేతానికి కృషి చేస్తున్న కొర్నిన్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అమెరికా కాంగ్రెస్ సభ్యులురో ఖన్నా, ఎరిక్ స్వాల్వెల్ కూడా మండలిలో భారత్ వైఖరిని తప్పుబట్టారు. -
ఉక్రెయిన్-రష్యా వివాదం: సంయమనం పాటించాలని పిలుపునిచ్చిన తాలిబన్లు!
Russia Ukraine conflict through “peaceful means: అఫ్గనిస్తాన్‌లోని తాలిబాన్ ప్రభుత్వం రష్యా-ఉక్రెయిన్ సంక్షోభంపై ఒక ప్రకటన విడుదల చేసింది.ఈ మేరకు ఇరుదేశాలు సంయమనం పాటించాలని పిలుపునిచ్చింది. శాంతియుత చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని కోరింది. ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ అఫ్గనిస్తాన్ ఉక్రెయిన్‌లో పరిస్థితిని నిశితంగా పరిశీలించడమే కాక పౌరుల ప్రాణ నష్టం పై ఆందోళన వ్యక్తం చేసింది. హింసను తీవ్రతరం చేసే విధానాలను ఇరు పక్షాలు మానుకోవాలని సూచించింది. అంతేకాదు అఫ్గాన్ తటస్థ విదేశాంగ విధానానికి అనుగుణంగా ఉందని అఫ్గాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది నెలరోజుల క్రితం అఫ్గాన్ రాజధాని కాబూల్‌లో ఇస్లామిక్ మిలిటెంట్లు ఇదే విధమైన సైనిక దాడిని ఉపసంహరించుకుని అధికారాన్ని స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు 20 ఏళ్ల తర్వాత అమెరికా సైన్యం ఉపసంహరించుకోవడంతో అష్రఫ్ ఘనీ ఎన్నికైన ప్రభుత్వం పడిపోయిన నేపథ్యంలో గత ఏడాది ఆగస్టు 15న అఫ్గాన్ అధ్యక్ష భవనాన్ని తాలిబాన్ స్వాధీనం చేసుకున్నారు. Statement concerning crisis in #Ukraine pic.twitter.com/Ck17sMrAWy — Abdul Qahar Balkhi (@QaharBalkhi) February 25, 2022 (చదవండి: రష్యా మిలటరీ కాన్వాయ్కి అడ్డుగా నిలుచుని ఆపేందుకు యత్నం!) -
కొత్త సంవత్సరం ఈ రెజల్యూషన్స్ తీసుకుందామా?
కొత్త సంవత్సరం అనగానే చాలామంది కొన్ని నిర్ణయాలు తీసుకోవాలనుకుంటారు. ఈ ఏడాదినుంచైనా తప్పక అమలుపరచాలనుకుంటారు. ఇలా నిర్ణయాలు తీసుకుంటూ, తప్పుతూ ఉండటం సహజం. కానీ కరోనా మహమ్మారి నేర్పిన గుణపాఠాల నేపథ్యంలో కొన్ని నిర్ణయాలు తీసుకుందాం. సరికొత్త ఏడాది 2022 సందర్భంగా ఈ తీర్మానాలు అమలు చేద్దాం. తు.చ. తప్పకుండా ఆచరిద్దాం. కరోనా మనకు మాస్క్ పెట్టుకోవడం నేర్పింది. కోవిడ్ నేపథ్యంలో స్వచ్ఛందంగా అమలు చేసుకున్న ఈ నిర్ణయం మరెన్నో శ్వాసకోస వ్యాధుల్నీ నివారించింది. ఈ విషయాన్ని డాక్టర్లు, పల్మనాలజిస్టులే నిర్ధారణ చేశారు. ఈ మంచి అలవాటును కోవిడ్ పూర్తిగా తగ్గేవరకే కాదు... ఆ తర్వాత కూడా అమలు చేయండి. మరీముఖ్యంగా సమూహాల్లోకి వెళ్లేటప్పుడు. గతంలో డాక్టర్లు మాత్రమే ఆల్కహాల్ బేస్డ్ శానిటైజర్ వాడేవారు. కోవిడ్ సందర్భంగా మనందరమూ దాన్ని వాడటం మొదలుపెట్టాం. ఈ శానిటైజర్ కేవలం కరోనానే కాదు... చాలా రకాల వ్యాధికారక క్రిములను నిర్మూలిస్తుంది. అందుకే మహమ్మారి సమయంలోనే కాదు... ఆ తర్వాత కూడా మన మెడికల్ కిట్‌లో శానిటైజర్ ఉండేలా చూసుకోండి. ఏదైనా విషయం చెప్పాల్సి వచ్చినప్పుడు చాలామంది మరీ దగ్గరగా వచ్చి చెబుతుంటారు. ఎదుటివారికి అది ఇబ్బందిగా అనిపించవచ్చు. భౌతికదూరం అనే నిబంధన అలవాటైనందున ఇకపై కూడా గౌరవపూర్వకమైన దూరం పాటిస్తూనే సంభాషించండి. ఇది వ్యాధులను నివారించే పద్ధతి మాత్రమే కాదు... మంచి మర్యాద లక్షణం కూడా. ఈ కోవిడ్ సమయంలో వ్యాధి నిరోధకతను పెంచుకోవడం కోసం మంచి సమతులాహారం, తాజా కూరగాయలు, పండ్లు, నట్స్ వంటివి తీసుకోవడం ఓ అలవాటుగా మారింది. ఇది అన్ని రకాల వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. ఈ అలవాటును కొనసాగించండి. అలాగని ఖరీదైనవి తీసుకోవాల్సిన అవసరం లేదు. మనకు అందుబాటు ధరల్లో ఉండే మేలైన ఆహారాలనే తీసుకోండి. ఆత్మవిశ్వాసం, సంకల్పబలం, సానుకూల దృక్పథం రోగనిరోధక శక్తిని పెంచుతాయనీ... చాలామందిలో క్యాన్సర్ వంటి జబ్బులనూ తగ్గించాయని అనేకమార్లు చదివాం. ఆత్మవిశ్వాసాన్ని, పాజిటివ్ ఆలోచనలను పెంచుకోడానికి నిర్ణయం తీసుకోండి. మీరు పూర్తి ఆరోగ్యవంతులై... రక్తదానం చేసే అవకాశం ఉన్నవారైతే ప్రతి మూడు నుంచి ఆరు నెలలకోమారు రక్తదానమో లేదా ప్లేట్లెట్స్ దానం చేస్తాననే సంకల్పం తీసుకోండి. ఇది మీకు మంచి ఫీల్‌గుడ్ భావన ఇవ్వడమే కాదు... మీ ఆరోగ్యానికీ దోహదపడుతుంది. ఆహారాలన్నీ తాజాగా ఉంటేనే ఎంతో మేలు. నిల్వ చేసిన పదార్థాలకు దూరంగా ఉండండి. ఫ్రిజ్జులో పెట్టిన వాటిల్లో 50% – 60% పోషకాలు నశిస్తాయి. అందుకే సాధ్యమైనంత వరకు తాజావే తీసుకోవాలనే నియమం పెట్టుకోండి. ఒక వయసు దాటాక ఒకసారి పూర్తి హెల్త్ చెకప్ చేయించుకుని, నిశ్చింతగా ఉండండి,. ఆ తర్వాత ఏవైనా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ, లక్షణాలు కనిపిస్తూ ఉండి, డాక్టర్ సలహా ఇస్తే తప్ప... మాటిమాటికీ బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, బీఎమ్ఐ వంటివి చెక్ చేసుకోకండి. ఆ రీడింగ్స్‌లో కొద్దిపాటì తేడా కనిపించినా అది మరింత ఒత్తిడి పెంచి, మాటిమాటికీ తప్పుడు రీడింగ్స్ చూపుతుంది. అందుకే ఒకసారి వార్షిక పరీక్షల తర్వాత, మీరు ఆరోగ్యవంతులని నిర్ధారణ అయ్యాక... ఇక ఏడాది మధ్యలో మళ్లీ మళ్లీ సాధారణ వైద్యపరీక్షలు వద్దు. ఆహారం తీసుకునే ముందర సలాడ్స్/గ్రీన్‌సలాడ్స్ తీసుకోవాలని నిర్ణయించుకోండి. దీనివల్ల కడుపు త్వరగా నిండిపోతుంది. ఫలితంగా బరువు పెరిగే ప్రమాదమూ ఉండదు. బరువును అదుపులో ఉంచుకోవడం చాలా ఆరోగ్యకరమని గుర్తుంచుకోండి. కంటి నిండా నిద్ర ఆరోగ్యానికి చాలా మంచిది. వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది. అయితే... మరీ ఎక్కువగా నిద్రపోవడం డిప్రెషన్‌కు సూచిక. మరీ తక్కువగా నిద్రపోవడం గుండెకు హాని చేస్తుంది. మీ రోజువారీ పనులన్నీ ఎలాంటి అలసట లేకుండా చేసుకోగలుగుతున్నారంటే... మీ నిద్ర మీకు సరిపోతోందని అర్థం. వృత్తిపరంగా సాధ్యమైనవారు మధ్యాహ్నం పూట చిన్న పవర్‌న్యాప్ తీసుకున్నా మంచిదే. అయితే అది అరగంటకు మించకూడదు. ప్రతిరోజూ వ్యాయామం చేయాలనే నిర్ణయం తీసుకోండి. దాని వల్ల మీరు పూర్తి ఆరోగ్యంతో ఉంటారు. అది అన్ని కండరాలకూ బలం పెంచినట్టే గుండె కండరాలనూ బలోపేతం చేస్తుంది. అందువల్ల గుండెపోటు ముప్పు కూడా నివారితమవుతుంది. అయితే వ్యాయామం కూడా మితిమీరకూడదని, శ్రమ కలిగించేలా ఉండకూడదని గుర్తుంచుకోండి. మానసిక, శారీరక ఒత్తిడి మితిమీరితే కీడు చేస్తుంది. అయితే కొన్ని పనులు వేళకు జరగడానికి ఒత్తిడి కొంతమేర ఉపయోగపడుతుంది. దాన్ని ఆ మేరకే ఉండనివ్వండి. ఒకవేళ ఒత్తిడి మితిమీరుతున్నట్లు గ్రహిస్తే... వెంటనే టీమ్ వర్క్ ప్రాధాన్యాన్ని గుర్తెరగండి. దాంతో పనులు సకాలంలో పూర్తవుతాయి. చాలా పనులను మంచి టీమ్ వర్క్‌తో సాధించేందుకు... ఆ సామర్థ్యం ఉన్నవారిని ఎంచుకుని సంసిద్ధంగా ఉంచుకోండి.అవసరమైనప్పుడు వారి సేవలను తీసుకోండి. కొన్ని రకాల పనుల్లో ఉండేవారు లేట్ నైట్ పార్టీలకు వృత్తిపరంగా హాజరు కావాల్సి ఉండవచ్చు. అలాంటి వారు ఓ టైమ్ నిర్ణయించుకుని, అంతకు మించి ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకండి. ఇది సామాజికంగా, ఆరోగ్యపరంగా... రెండు విధాలా మంచిదే. పొగతాగడం పూర్తిగా మానేయండి. పొగాకును చుట్ట, బీడీ, సిగరెట్, తంబాకూ, గుట్కా, ఖైనీ, నశ్యం... ఇలా ఏ రూపంలో తీసుకుంటున్నా వాటిని పూర్తిగా మానేయండి. ఒకవేళ మానలేకపోతే... మీ నికొటిన్ వాంఛను భర్తీ చేసే చ్యూయింగ్‌గమ్ వంటివి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటి సహాయంతో చాలా తేలిగ్గా ఈ దురలవాట్లను వదులుకోవచ్చు. తక్కువ మోతాదుల్లో ఎక్కువ సార్లు తినండి. మీ రోజువారీ భోజనమూ మితంగా ఉండాలి. ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తప్పకూడదు. రాత్రి భోజనం మరీ ఎక్కువగా తినకూడదు. ఆరోగ్య కారణాల వల్ల మీకు ఇష్టమైన పదార్థాలను ఎక్కువగా తినకూడదని డాక్టర్ చెప్పినా లేదా చాలా చాలా పరిమితంగానే తీసుకోవాల్సి వచ్చినా... ఆ పదార్థాలను పూర్తిగా మానేస్తామనే నిర్ణయం తీసుకోకండి. సాధారణంగా ఇలాంటి నిర్ణయాలే విఫలమవుతాయి. దీనికి బదులు... ఒక నిర్ణీతమైన రోజును ఎంచుకుని, ఆనాడు పరిమితమైన మోతాదులో దాన్ని తీసుకుంటానంటూ మనసుకు సర్దిచెప్పుకోండి. పూర్తిగా మానేయలనే సంకల్పం వల్ల దానికి పూర్తిగా దూరమవుతామనే ఓ ఒత్తిడి కలుగుతుంది. దానికి బదులు ఫలానా రోజున దాన్ని ఆస్వాదిస్తామనే భరోసా మనలో ఒత్తిడిని తగ్గిస్తుంది. ఎప్పుడూ బిజీగా ఉండటమే కాదు... ఇన్‌డోర్స్‌లో పనిచేసేవారు ఈ ఏడాది నుంచి కనీసం అరగంట లేదా గంటసేపు ఆరుబయట పచ్చికలో... ఆకాశం కింద గడపాలని నిర్ణయం తీసుకోండి. ఇది మీకు తాజా శ్వాసనూ, విటమిన్–డిని అందించి, మీ ఆరోగ్యాన్ని మరింత బాగుచేస్తుంది. -
2022లో ఇలా ప్రయత్నించండి.. జీవితం అందమైనదే!
‘ప్రతి ఒక్కరూ తమను తాము స్వీకరించాలి. తమను తాము ప్రేమించుకోవాలి. లక్ష్యానికి అనుగుణంగా ముందుకు సాగిపోవాలి. ఆకాశంలో ఎగరాలని ఉంటే ఆ కోరిక తప్పేమీ కాదు. అయితే... పైకి ఎగరడానికి అడ్డు వస్తున్న బరువులను పక్కన పెట్టాలి. పక్కన పెట్టాల్సింది బరువులను మాత్రమే, బాధ్యతలను కాదు. అప్పుడు నీ జీవితం నీ చేతిలోనే ఉంటుంది. ఉన్నది ఒక్కటే జీవితం. ఆ జీవితాన్ని సంతోషంగా జీవించాలని అందరికీ ఉంటుంది. కానీ, మన హక్కులను మనం గౌరవించుకుంటూ, ఇతరుల హక్కులకు భంగానికి కారణం కాకుండా, వివాదరహితంగా జీవించడం ఎలాగో తెలియకపోవడం వల్లనే జీవితం కష్టాలపాలవుతుంటుంది. మనల్ని మనం గౌరవించుకుంటే ఇతరులను అగౌరవపరచకుండా ఉండగలిగే స్థితప్రజ్ఞత కలుగుతుంది. మనల్ని మనం ప్రేమించుకుంటే ఇతరులకు ఆత్మీయతను పంచడమూ వస్తుంది. మన దారిలో అడ్డుగా ఉన్న ముళ్లను తీసి పారేసుకునే క్రమంలో ఆ ముళ్లను పక్కవారి దారిలో వేయకుండా ఉండగలిగితే మన జీవితం హాయిగా సాగిపోతుంది. ఆశలకు ఆకాశమే హద్దుగా ఉండవచ్చు, పక్షిని చూసి స్ఫూర్తి పొందనూ వచ్చు, పక్షిలాగ తేలిగ్గా ఉండాలి. ఇక్కడ తేలిగ్గా ఉండాల్సింది దేహం కాదు, మనసు. అనవసర ఆందోళనలు, ఆలోచనలకు తావివ్వకుండా మనసును తేలిగ్గా ఉంచుకోగలిగితే ఆశలకు, ఆకాంక్షలకు ఏదీ అడ్డురాదు. మన కంటికి పక్షి స్వేచ్ఛగా విహరించడమే కనిపిస్తుంది. కానీ అది అలా విహరించి ఆహారాన్ని అన్వేషించి గూటిలో ఉన్న రెక్కలు రాని పిల్లలను పోషించే గురుతర బాధ్యతను తన రెక్కల్లో ఇముడ్చుకుని ఉంటుంది. మన కంటికి కనిపించేది స్వేచ్ఛా విహంగమే. ఆ స్వేచ్ఛతోపాటు రెక్కల మాటున దాగి ఉన్న బాధ్యత నుంచి కూడా మనం స్ఫూర్తి పొందాలి. పక్షి గూటిలో ఉన్న పిల్లలను కాళ్లకు బంధనాలుగా కట్టుకుని ఆకాశంలోకి వెళ్లదు, అలాగని పిల్లల బాధ్యతను వదిలి ఆకాశంలో విహరించదు. మరణం ఎప్పుడు, ఏ రూపంలో వస్తుందో తెలియని అనిశ్చితిలో కూడా తన లక్ష్యాన్ని మరువదు. బాధ్యతను బరువుగా భావించదు. ఈ సూత్రం ఆధారంగా జీవితాన్ని అల్లుకుంటే జీవితం అందరికీ అందమైనదే అయి తీరుతుంది. ఈ ఏడాదిలో ఇలాగ ప్రయత్నించి చూద్దాం. -
కొత్త సంవత్సరం సంకల్పాలు..
365 విలువైన కాలపు సంచులతో కొత్త సంవత్సరం అతిథిగా వచ్చేసింది. ఆ సంచులలో ఏముంది? ఏ సంచిలో ఏ అనుభవం మనకై రిజర్వ్ అయి ఉంది. అంతుచిక్కనివ్వకపోవడమే కాల మహిమ. అదే జీవితానికి మధురిమ. చిన్నపిల్లలు కింద పడితే వారే లేచేంత వరకు పెద్దలు గమనిస్తూ ఉండిపోయినట్టు కాలం కూడా మనల్ని అనుభవాలతో చెక్కి రాటుదేలేలా చేస్తుంది. పరిణతి తెచ్చిపెడుతుంది. స్థితప్రజ్ఞతతో జీవితాన్ని ఎదుర్కొనడం నేర్పిస్తుంది. కొత్తకాలం ఎప్పుడూ ఆశతో ఉండు అని చెప్పడానికే వస్తుంది. కొత్త సంవత్సరం ఊపిరినిండా ఆకాంక్షలు నింపుకోవడానికే వచ్చింది. ఈ సంవత్సరం హ్యాపీగా గడిచేందుకు సంకల్పాలు సరిచేతలు కొన్ని.... తొలి వందనం కుటుంబానికి గేట్ తీస్తూ ఇంటి లోపలికి తండ్రి అడుగు పెడుతూ ఉండటం బాగుంటుంది. పిల్లల్ని హెచ్చరిస్తూ తల్లి ఇంటిని నిభాయించుకుంటూ రావడం బాగుంటుంది. ‘ఒరే అన్నయ్యా’... అని పిలిచే చెల్లి పిలుపు బాగుంటుంది. ‘తమ్ముడూ’... అని క్రికెట్ బ్యాట్ కొనిచ్చే అన్నయ్య ఉండటం బాగుంటుంది. ‘న్యూస్‌పేపర్ ఎక్కడా’ అని మనమడిని కేకేసే తాత ఉండటం బాగుంటుంది. పూలసజ్జ పట్టుకుని మొక్కల దగ్గర తిరుగాడే జేజి కనిపించడం బాగుంటుంది. సంఘంలో అందమైన కుటుంబం బాగుంటుంది. కుటుంబం కోసం అక్కర కలిగిన సంఘమూ బాగుంటుంది. కుటుంబానికి విలువివ్వని మనిషి సంఘానికి ఇవ్వడు. కుటుంబం పట్ల బాధ్యత లేని మనిషి సంఘం పట్ల బాధ్యత వహించడు. నీ కుటుంబాన్ని చూసి నువ్వు ఎలాంటివాడివో చెప్పొచ్చు. నీ కుటుంబ అనుబంధాలను బట్టి సంఘంతో నీ అనుబంధం బేరీజు వేయవచ్చు. తోడబుట్టిన వాళ్లతో తెగదెంపులు నేటి ఫ్యాషన్. మాట పట్టింపులతో రక్త సంబంధాల కోత నేటి ట్రెండ్. కొత్త సంవత్సరంలో కుటుంబమే ముఖ్యం అనుకుందాం. జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఎలా వదిలించుకోవాలా అని ఆలోచించిన గత కాలాన్ని బిలంలో పడేద్దాము. వారితో ఆప్యాయంగా ఉందాం. పిల్లల పలకరింపు కోసం అలమటించే పెద్దల చెంప దెబ్బ తిందాము. కన్నీళ్లతో అభిషేకిద్దాము. వారి క్షమాపణ పొంది వారి సంతోషం కోసం ఇంటి వాకిలి తెరుద్దాము. కొత్త సంవత్సరంలో కుటుంబమే ముఖ్యం అనుకుందాం. జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఎలా వదిలించుకోవాలా అని ఆలోచించిన గత కాలాన్ని బిలంలో పడేద్దాము. నిన్ను నువ్వు తెలుసుకో ఎంత ఎగిరినా భుజాలకు రెక్కలు మొలవవు. ఎంత రుద్దినా కాళ్లకు చక్రాలు పుట్టవు. ఏమి చేసినా అందరూ ఎనిమిది అడుగుల ఎత్తుకు ఎదగరు. ఊయలలో ఊగి మొదలెట్టే ప్రయాణంలో దొరికే సమయానికి ప్రపంచంలో ప్రతి అంగుళం చుట్టి రాలేము. మన మొదలు మన తుది మనకు తెలియాలి. పక్కన వాడి మొదలూ తుదితో పోటీ పడటమే నేటి సమస్య. మనకు బైక్ ఉండటం సంతోషం కావడం లేదు. పక్కవాడి కారును చూసి ఏడుపు ఎగదన్నుకొని వస్తోంది. మూస చదువులు నేటి యువతకు సమస్య. మూస ఉపాధి నేటి కుర్రకారుకు ఫ్రస్ట్రేషన్. మూస పోటీ వారికి అశాంతి. దేనిలో ఇష్టం ఉంది, ఏ పనిలో అభిరుచి ఉంది, కౌశలం ప్రావీణ్యం ఎందులో ప్రదర్శించవచ్చు ఇవి పట్టించుకోవడం లేదు. తెలుసుకున్నా పోటీ కొద్దీ వాటిని వదిలేసి తెలియని బావిలో దూకాల్సి వస్తోంది. ఉనికి, గుర్తింపు, అస్తిత్వం, గౌరవం.. చిన్న పనిలో అయినా పెద్ద పనిలో అయినా... ఇవీ సాధించవలసింది. అదే సంపద. యువత తానేమిటో తాను తెలుసుకోవాలి. అందుకు తల్లిదండ్రులు సహకరించాలి. ఆ మేరకు ఈ కొత్త సంవత్సరంలో కన్ను తెరవాలి. ఉనికి, గుర్తింపు, అస్తిత్వం, గౌరవం.. చిన్న పనిలో అయినా పెద్ద పనిలో అయినా... ఇవీ సాధించవలసింది. స్వస్థత ప్రధానం గతంలో కట్టివేయడానికి సంకెళ్లు, తాళ్లు బజారులో దొరికేవి. ఇప్పుడు చేతిలోనే వాటిని తలదన్నే వస్తువు ఉంది. సెల్‌ఫోన్. కదలికలు నిరోధించబడటం శిథిలానికి దగ్గర కావడం. వ్యాయామ సమయాలు తగ్గిపోతున్నాయా చూసుకోవాలి. నడవడం, ప్రతి ఉదయం లేదా సాయంత్రం కేవలం మనతో మనమే ఉండేలా నడవడం, మనం నడుస్తున్నట్టుగా శరీరానికి తెలిసేలా నడవడం అవసరం. సెల్‌ఫోన్ దీనిని నిరోధిస్తోంది. వ్యాపకాలు నిరోధిస్తున్నాయి. వినోద ఆకర్షణలు నిరోధిస్తున్నాయి. ఇంట్లో మోటివేషన్ లేకపోవడం నిరోధిస్తున్నది. కుటుంబ ఆరోగ్యమే సమాజ ఆరోగ్యం. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దేన్ క్యూర్. ఆరోగ్యానికి మనం ఎంత ప్రాముఖ్యం ఇస్తున్నామో ఇకపై జాగ్రత్తగా గమనించుకోవాలి. సెల్‌ఫోన్ చూడటం వల్ల, విపరీతంగా వాడటం వల్ల, మెడ వంచి దానిలో నిమగ్నం కావడం వల్ల మున్ముందు కంటి సమస్యలు, చెవి సమస్యలు, మెడ సమస్యలు తప్పవు. వ్యాయామం చేయకపోతే స్థూలకాయం, అజీర్తి సమస్యలు తప్పవు. జంక్ ఫుడ్ తినడం వల్ల ఇమ్యూనిటీ పెరగదు. హెల్దీ ఫుడ్ ఇంట్లో వండుకోవడం బద్దకం వేసి స్విగ్గీలకు జొమాటోలకు అలవాటు పడితే లోపలకు వెళ్లేది ప్రిస్క్రిప్షిన్ రూపంలో చేతికి వస్తుంది. మహమ్మారి ఇంకా ఇంకా భయపెడుతున్న ఈ రోజుల్లో ఆరోగ్యమే ప్రధానం. అదే మన నినాదం. అందుకు నిపుణుల, వైద్యుల సలహా తో కచ్చితమైన అలవాట్లను పాటించాలనే నిర్ణయం ఈ సంవత్సరంలో తీసుకోక తప్పదు. తర్వాతి స్థానం ప్రేమది ప్రేమ అడుగంటిపోయిన నివాసం మహలు అయినా పాక అయినా ఒకటే. స్త్రీ, పురుషులు భార్యాభర్తలయ్యాక ఆ కాపురానికి తలం ప్రేమ కావాలి. ఛాయ ప్రేమ కావాలి. పంచుకున్న బతుకు ప్రేమ కావాలి. తమ మధ్య ప్రేమ నశించిపోయింది అని గుర్తించలేని స్థితిలో నేటి భార్యాభర్తలు ఉన్నారు. ఒకరి పట్ల ఒకరు ప్రేమ ప్రదర్శించుకోవాలి అని గ్రహింపు లేని భార్యాభర్తలు ఉన్నారు. ఇద్దరూ ఆఫీసులకు వెళ్లినా, అతను వెళ్లి ఆమె ఉన్నా, సాయంత్రాలు కలిసి టీవీ చూసినా, పిల్లల గురించి నాలుగు మాటలు మాట్లాడుకున్నా అదంతా మొక్కుబడి అని ఇరువురూ అనుకుంటే అంతకు మించిన దురదృష్టం మరొకటి లేదు. భార్యాభర్తల మధ్య ప్రేమ లేకపోతే పిల్లలకు సక్రమంగా ప్రేమ ప్రవహించదు. పిల్లలకు ప్రేమ అందకపోతే భవిష్యత్తు సౌకర్యంగా ఉండదు. ప్రేమ పొందడం ఊరికే జరిగిపోదు. అందుకు శ్రద్ధ పెట్టాలి. జీవిత భాగస్వామి పట్ల గౌరవం ఉండాలి. జీవితాన్ని నిర్మించుకోవడానికి కలిశారు మీరిద్దరు. పైచేయి సాధించాలని కింద పడవద్దు. అభిప్రాయాలకు విలువ ఇవ్వకుండా అశాంతి తెచ్చుకోవద్దు. పాలలో చక్కెర కూడా కలబెడితేనే కరుగుతుంది. ప్రేమ ప్రదర్శిస్తేనే తెలుస్తుంది. ఈ సంవత్సరం ‘నువ్వంటే నాకు ఇష్టం’ అని చెప్పగలిగే సందర్భాలు ఒక వేయి రావాలని భావించండి. దాంపత్య జీవితాన్ని సంతోషమయం చేసుకోండి. పౌరులం మనం పౌరులం మనం. నియమ నిబంధనలు పాటించే పౌరులే మెరుగైన పౌర సమాజం నిర్మిస్తారు. ప్రభుత్వం పౌర జీవనం కోసం ఎన్నో పనులు చేస్తుంటుంది. పౌరులుగా వాటిని గౌరవించాలి. మాస్క్ ధరించమంటే ధరించకుండా, హెల్మెట్ పెట్టుకోమంటే పెట్టుకోకుండా, తాగి డ్రైవ్ చేయవద్దంటే చేస్తూ, టీకా వేయించుకోమంటే వేయించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తే సరైన పౌరులం అనిపించుకోము. ఇళ్లు, వ్యాపార సముదాయాలు, ఆస్పత్రులు, హాళ్లు, మాళ్లు... వీటి నిర్మాణంలో ప్రమాణాలు పాటించడం కనీస పౌర ధర్మం. ఆక్రమణలు చేయకపోవడం, చెత్తను సరిగ్గా పారబోయడం, వాహనాలను ఇష్టం వచ్చినట్టుగా పార్క్ చేయకపోవడం... చేయాల్సింది. ఎంగిలి ఊయడం అసహ్యకరమైన పని అని తెలిసినా రోడ్డు మీద ఎంగిలి ఊస్తూ కనిపించే వారిని ఏమనాలి? ఓట్ల కాలం వస్తే డబ్బులు డిమాండ్ చేసే వారిని గెలిచిన అభ్యర్థి పౌరులుగా చూస్తాడా? గౌరవిస్తాడా? సమాజంలో ప్రతి పౌరుడు పౌర బాధ్యతలు నిర్వర్తిస్తూ గౌరవం పొందాలని ఈ సంవత్సరం అందుకు నాంది కావాలని కోరుకుందాం. ఏమిటి మన సంస్కారాలు? సంస్కారాల పరిణతి సమాజ పరిణతి ఒక్కటే. సంకుచితాల నుంచి బయట పడటమే సంస్కారం. ఛాందసాలు, మూఢ విశ్వాసాల నుంచి చెడు మాటలు, చేష్టలు, ఆలోచనల నుంచి బయట పడటమే సంస్కారం. ఎదుటి మనిషి కళ్లబడిన వెంటనే కులం, మతం, ప్రాంతం జ్ఞప్తికి రావడం నీచ సంస్కారం. ‘మనవాడికే’ మన మద్దతు రోత సంస్కారం. ఫలానా తిండి చెడ్డది, జీవన విధానం చెడ్డది, సమూహం చెడ్డది అని భావించి, నమ్మి, దానికి తోడు ప్రచారం చేసి, విద్వేషం నింపుకోవడం కుసంస్కారం. పరువు పేరుతో పిల్లలను కోల్పోయేంత పంతం పెంచుకోవడం దారుణ సంస్కారం. స్నేహం, సహనం, సహ జీవనం, ఆదరణ, సహాయం, సమాన దృష్టి... ఇవీ సంస్కార గుణాలంటే. మనిషిగా ఉండటం సంస్కారం. మనతో పాటు ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క విషయంలో హక్కులు ఉన్నాయి, ఉంటాయి అనుకోవడం సంస్కారం. బతుకు.. బతికించు విధానం పాటించడం సంస్కారం. ఏ ఒక్క మనిషి కంటే, మతం కంటే, కులం కంటే, ప్రాంతం కంటే, భాష కంటే, జెండర్ కంటే మరొకరు ఎక్కువ అని ఎవరైతే భావిస్తారో వారి సంస్కారం అథమంగా ఉన్నట్టు లెక్క. సంస్కార ప్రమాణాలు పెరిగేలా చేయమని ఈ సంవత్సరానికి విన్నవిద్దాం. సంఘటితం కావాలి సందర్భాలకు తగినట్టుగా సంఘటితం కాని ప్రజలు ఉన్న దేశం తిరోగమనంలో పడుతుంది. దేశం అంటే హితం. దేశం అంటే ప్రజాహితం. దేశం అంటే మట్టి. దేశం అంటే మొలక. దేశం అంటే అడవి. దేశం అంటే ఇంకా న్యాయం అందవలసిన ప్రజ. దేశం అంటే స్త్రీలు. దేశం అంటే ప్రజాస్వామిక విధానాలు అవలంబించాల్సిన పాలన. అటువంటి విధానాలకు విఘాతం కలిగినప్పుడు స్థానికం గా కాని, రాష్ట్రీయంగా కాని, జాతీయంగా కాని ప్రజలు సంఘటితం కాగలగాలి. శాంతియుత నిరసన తెలపాలి. సరి చేయించాలి. ‘మనకెందుకులే’ అనే ధోరణి చాలు. ‘నష్టం మనకు కాదు కదా’ అనుకోవడానికి వీల్లేదు. ఆమ్ల వర్షం ఫలానా వారిని ఎంచుకొని కురవదు. కార్చిచ్చు ఏ ఒక్కరినో దహించదు. ప్రజలే దేశ నిర్మాణకర్తలు. సంఘటితం కావడమే వారి అజేయమైన శక్తి. ప్రతి ఒక్కరి కోసం అందరూ, అందరి కోసం ప్రతి ఒక్కరూ తల ఎత్తేలా ఈ దేశం మేలుకోవాలి. అందుకు ఈ సంవత్సరం మార్గం చూపాలి. ప్రకృతితో బతకాలి ప్రకృతితో మనం బతుకుతున్నాం. మనతో ప్రకృతి బతకడం లేదు. నీలి రంగు, ఆకుపచ్చ రంగు ఎక్కువగా కనిపించాల్సిన ఈ భూగోళంలో ఆ రంగులు ఏ మేరకు పలచబడుతున్నాయో గమనించుకోవాలి. సిమెంటు రంగు భూగోళం ఏర్పడకుండా చూడాలి. పక్షుల్ని వాలనివ్వాలి. మొక్కల్ని ఎదగనివ్వాలి. తీగలు కిటికీల వరకూ పాకి గదుల్లో తొంగి చూడగలగాలి. నదులు, కాలవలు తమ స్థలాలను తిరిగి ఆక్రమించుకునే హక్కును ఇవ్వగలగాలి. మట్టి, ఇసుక, కొండ, అడవి సురక్షితంగా ఉండాలి. మట్టి మీద నడిచే మనం కృతజ్ఞతగా దానికి మొక్కను ఇవ్వగలగాలి. ప్రతి సంవత్సరం పది మొక్కలు నాటాలి అనుకుంటే అంతకు మించిన సాయం లేదు భూమికి. నా వంతు కాలుష్యాన్ని నివారిస్తాను అనుకుంటే ప్రకృతి బతికి బట్టకడుతుంది. ఈ సంవత్సరం ప్రకృతి స్నేహితులుగా మారడానికి సంకల్పించుకుందాం. -
హ్యాపీ న్యూ ఇయర్: ఇదే మా న్యూ ఇయర్ రిజల్యూషన్..
సాక్షి, హైదరాబాద్: కొత్త సంవత్సరం వస్తుందంటే చాలు.. ప్రతి ఒక్కరిలో ఏదో నూతన ఉత్సాహం. పాత సంవత్సరంలోని అనుభవాలకు వీడ్కోలు పలుకుతూ.. కొత్త ఏడాది మరిన్ని ఆనందాలకు వేదికవ్వాలని న్యూ ఇయర్ వేడుకలతో ఆహ్వానిస్తుంటాం. కానీ ప్రస్తుత పరిస్థితులు దీనికి భిన్నంగా ఉన్నాయి. చాపకింద నీరులా వ్యాప్తిస్తున్న ఒమిక్రాన్ ఓ వైపు.. నిర్లక్ష్యం కారణంగా గడిచిన రెండు సంవత్సరాల కాలంలో పెనవేసుకున్న విషాద అనుభవాలు మరో వైపు.. ఈ తరుణంలో ఓపెన్ పార్టీలకు అధికారికంగా వెసులుబాటు లభించినప్పటికీ., పార్టీ అంటే పబ్లేనా? అంటున్నారు కొందరు యువకులు. పాశ్చాత్య పార్టీలకు భిన్నంగా సరి‘కొత్త’గా స్వాగతిస్తామంటున్నారు. ఇదే మా న్యూ ఇయర్ రిజల్యూషన్.. ► ఈ రెండేళ్ల కాలంలో మనిషి జీవన విధానంలో వచ్చిన మార్పులు అన్నీ ఇన్నీ కాదు. కరోనాకు ముందు ఆ తర్వాత అనేలా అనడంలో అతిశయోక్తి లేదేమో. విద్య, ఉద్యోగం, వైద్యం, ఆహారం, అలవాట్లు ఇలా అన్నింటిలో మార్పులు ఆమోదించినప్పుడు ఈ పార్టీలకెందుకు మినహాయింపు అంటోంది ఈతరం యువత. ► మంచో చెడో కోవిడ్ వల్ల కుటుంబానికి కాççస్త సమయాన్ని కేటాయించడం అలవాటైంది. ఈసారి 31 వేడుకలు ఫ్యామిలీతోనే అంటున్నారు. జనసంద్రంలా నిండే గోవా బీచ్‌లు, రిసార్ట్లు కాదు పరిమిత మిత్రులతో ప్రకృతి ఒడిలో సేదతీరాలనుకుంటున్నామని మరికొందరు చెబుతున్నారు. ► ఒమిక్రాన్ ఒక్కటే కారణం కాదు, గత రెండు, మూడు నెలలుగా జరిగిన ప్రమాదాల్లో అధిక శాతం డ్రంకన్ డ్రైవ్వే కావడం విదితమే. ఇలాంటి పరిస్థితుల్లో సరికొత్త ట్రెండ్‌తో న్యూ ఇయర్ వేడుకలు జరపడమే మా రిజల్యూషన్ అంటోంది ఈతరం. (చదవండి: Happy New Year 2022 Wishes) ఓడితేనే గెలుస్తాం.. కొత్త సంవత్సరం అంటేనే కొత్తగా ఉండాలి. పాత పద్ధతులెందుకు? పార్టీ కల్చర్ అంటే నాకు ఇష్టమే, కానీ అది సామాజికంగా నష్టం కలిగించేదిగా ఉండకూడదు. ఇప్పుడున్న పరిస్థితులు మనకు పరీక్షలాంటివే. కొన్ని సంతోషాలను వద్దనుకుని ఓడిపోతేనే మనం గెలుస్తాం. ఈ సిటీ ఇక్కడే ఉంటుంది, ఎక్కడికీ వెళ్లదు. మంచి రోజులు వచ్చాక మరింత గ్రాండ్‌గా పార్టీ చేసుకుందాం. ఈసారి కొద్ది మంది మి త్రులతో ఇంటి దగ్గరే కేక్ పార్టీ ప్లాన్ చేసుకున్నాం. – సంతోష్, ఫ్యాషన్ ఔత్సాహికుడు స్టే హోం.. స్టే సేఫ్.. సంతోషాన్ని పంచుకోవడానికి జరుపుకొనేవే పార్టీలైనా, పండగలైనా. ప్రస్తుత పరిస్థితుల్లో పార్టీల పేరుతో జనసమూహాలుగా చేరడం శ్రేయస్కరం కాదు. గత కొంత కాలంగా జన సంచారం పెరిగింది, వేడుకలూ జరుపుకొంటున్నారు. అన్నీ సర్దుకుంటున్న సమయంలో ఎంటర్టైన్మెంట్ పేరుతో విపత్కర పరిస్థితులను కోరుకోవద్దు. కుటుంబంతో జరుపుకొంటే సంబరం కూడా సంతోషపడుతుంది. – అను, సినీనటి సొంతూరుకు పోతాం.. స్నేహితులతో కలిసి డిసెంబర్ 31ని గోవాలాంటి ఇతర ప్రదేశాల్లో సెలబ్రేట్ చేసుకునేవాళ్లం. ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తే ఒమిక్రాన్ రూపంలో పెను ప్రమాదం పొంచి ఉందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఈసారి సొంతూరి వెళుతున్నాం. ప్రకృతి ఒడిలో, ఊరి అందాల చెంతన గడిపే ప్రతి క్షణమూ తీయని వేడుకే కదా. – రామ్, క్యూఏ -
మేయరమ్మా... ఇదేంటమ్మా!
కాకినాడ: కౌన్సిల్ నిర్ణయాలను ‘తీర్మానం’ చేసే విషయంలో కాకినాడ మేయర్ సుంకర పావని వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోందంటూ కార్పొరేటర్లు ఎండగట్టారు. కౌన్సిల్ నిర్ణయాలను తీర్మానం చేయడంలో ఆమె చూపిస్తోన్న అలసత్వం సమస్యలకు తావిస్తోందంటూ ఆమెపై కార్పొరేషన్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌కు ఫిర్యాదు చేశారు. అసలు ఏం జరిగిదంటే.. కాకినాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ సాధారణ సమావేశం గత నెల 27న జరిగింది. బడ్జెట్‌తో పాటు 25కు పైగా అంశాలపై సభ్యులు సుదీర్ఘంగా చర్చించి అనేక నిర్ణయాలు తీసుకున్నారు. పారిశుద్ధ్య కార్మికులను మరో ఏడాది కొనసాగింపుతో పాటు పలు అభివృద్ధి పనులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. మున్సిపల్ కార్పొరేషన్ చట్టం ప్రకారం కౌన్సిల్ సమావేశం పూర్తయిన వెంటనే సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ‘తీర్మానం’ రూపంలో నమోదు చేయాలి. ఆ వెంటనే సదరు తీర్మానాల వివరాలను నోటీసు బోర్డులో ఉంచి అమలు దిశగా సంబంధిత సెక్షన్లకు పంపాలి. అయితే కౌన్సిల్ సమావేశం జరిగి 10 రోజులు దాటినా ఈ ప్రక్రియ ముందుకు కదల్లేదు. సమస్యలు గాలికొదిలి.. తిరుపతిలో ఎన్నికల ప్రచారం.. కౌన్సిల్ నిర్ణయాలను ‘తీర్మానం’ చేయాల్సిన మేయర్ తన విధులను పక్కన పెట్టి తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. దీంతో కౌన్సిల్ తీర్మానాలు ముందుకు కదలని పరిస్థితి నెలకొంది. అదే రోజు చేయాల్సిన తీర్మానాలు పదిరోజులు గడుస్తున్నా ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉండిపోవడంపై కార్పొరేటర్లు తీవ్రంగా నిరసిస్తున్నారు. మేయర్ తీరు కౌన్సిల్‌ను అవమానించడమేనని మండిపడుతున్నారు. గతంలో కూడా తీర్మానాలు రాయడంలో జాప్యం జరిగి కౌన్సిల్లో తీసుకున్న నిర్ణయాలకు, రాసిన తీర్మానాలకు తీవ్ర వ్యత్యాసాలు వచ్చాయంటున్నారు. ఇలా జాప్యం జరిగితే ఇక కౌన్సిల్ నిర్ణయాలకు పారదర్శకత ఎక్కడ ఉంటుందంటూ ప్రశ్నిస్తున్నారు. కమిషనర్‌కు ఫిర్యాదు మేయర్ వ్యవహరశైలి, తీర్మానాల విషయంలో జరిగిన లోపాలపై స్టాండింగ్కమిటీ సభ్యులు జేడీ పవన్‌కుమార్, బాలప్రసాద్, చవ్వాకుల రాంబాబు, సీనియర్ కార్పొరేటర్లు చోడిపల్లి ప్రసాద్, ఎంజీకే కిశోర్, మీసాల ఉదయ్, నాయకులు సుంకర సాగర్ తదితరులు కమిషనర్ స్వప్నిల్ దినకర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు బుధవారం కమిషనర్‌ను కలిసి మేయర్ తీరుపై లేఖ అందజేశారు. కార్పొరేటర్ల ఫిర్యాదు నేపథ్యంలో కమిషనర్ స్వప్నిల్దినకర్ సంబంధిత అధికారులతో మాట్లాడి వివరణ తీసుకున్నారు. లోపాలను సరిచేసి సమస్య పరిష్కరిస్తానని కార్పొరేటర్లకు ఆయన హామీ ఇచ్చారు. చదవండి: ఎవరికీ అనుమానం రాదు.. ఈ దొంగ ప్రత్యేకత ఇదే.. ఏపీకి కోటి డోసుల కోవిడ్ వ్యాక్సిన్! -
దేశం కోసం తీర్మానం చేద్దాం
సాక్షి, న్యూఢిల్లీ: కొత్త సంవత్సరం పేరుతో ఏటా తీర్మానాలు చేసే వారు ఈసారి దేశం కోసం తీర్మానం చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. రెండో విడత మన్ కీ బాత్ 19వ సంచికలో ఆదివారం ప్రధాని దేశవాసులను ఉద్దేశించి ప్రసంగించారు. దేశం కోసం తీర్మానం చేయాలన్న విశాఖపట్నానికి చెందిన వెంకట మురళీ ప్రసాద్, కొల్హాపూర్‌కు చెందిన అంజలి చేసిన ఈ సూచనను ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. దేశం 2021లో కొత్త విజయ శిఖరాలు తాకాలని, ప్రపంచంలో భారతదేశం మరింత గుర్తింపు పొందాలని, మరింత శక్తిమంతం కావాలని కోరుకోవడం కంటే గొప్ప కోరిక ఏముంటుందని ప్రధాని పేర్కొన్నారు. కరోనా కారణంగా సప్లయ్ చైన్‌తో పాటు అనేక విషయాల్లో ప్రపంచంలో చాలా అడ్డంకులు ఏర్పడ్డాయని, కానీ, ప్రతి సంక్షోభం నుంచి కొత్త పాఠాలు నేర్చుకున్నామన్నారు. దేశంలో కొత్త సామర్థ్యం కూడా ఏర్పడిందని, దీనికి స్వావలంబన అని పేరు పెట్టొచ్చని మోదీ తెలిపారు. గుర్గావ్కు చెందిన ప్రదీప్ హీలింగ్ హిమాలయాస్ అనే ఉద్యమం ప్రారంభించి, పర్యాటక ప్రాంతాల్లో టన్నుల కొద్దీ ప్లాస్టిక్‌ను శుభ్రపరిచారని తెలిపారు. ఇదే స్ఫూర్తిగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నుంచి దేశానికి విముక్తి కల్పించాలని కోరారు. 2021 తీర్మానాల్లో ఇది కూడా ఒకటిగా ఉండాలని పేర్కొన్నారు. ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఆసక్తికరమైన లేఖ అది ‘విశాఖపట్నం నుంచి వెంకట మురళీ ప్రసాద్ రాసిన ఆలోచన విభిన్నంగా ఉంది. 2021 కోసం ఏబీసీని అటాచ్ చేస్తున్నానంటూ లేఖ రాశారు. స్వయం సమృద్ధిగల భారత చార్ట్ ఏబీసీ. చాలా ఆసక్తికరంగా ఉంది. నిత్యం వినియోగించే అన్ని వస్తువుల పూర్తి జాబితాను వెంకట్ తయారుచేశారు. దీంట్లో ఎలక్ట్రానిక్, స్టేషనరీ, స్వీయ సంరక్షణ సామగ్రితోపాటు మరికొన్ని వస్తువులు ఉన్నాయి. మనకు తెలియకుండానే దేశంలో సులభంగా లభించే విదేశీ ఉత్పత్తులు ఉపయోగిస్తున్నామని తెలిపారు. దేశవాసుల శ్రమ, చెమట ఉన్న ఉత్పత్తులను మాత్రమే వినియోగిస్తానని వెంకట్ ప్రతిజ్ఞ చేశారు. స్వావలంబన దేశానికి తాము మద్దతు ఇస్తున్నామని కూడా రాశారు. దేశీయ తయారీదారులు నాణ్యతలో రాజీ పడరాదు’’ -
సీపీఎం మహాసభల్లో కీలక తీర్మానాలు
సాక్షి, హైదారాబాద్: జాతీయ మహాసభల్లో భాగంగా పలు కీలక తీర్మానాలపై చర్చించినట్టు సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు ప్రకాశ్ కారత్ తెలిపారు. రాజకీయ తీర్మానంపై గురువారం చర్చ ముగిసిందని, తీర్మానంపై 47 మంది ప్రతినిదులు ప్రసంగించి వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారని కారత్ తెలిపారు. 286 ప్రతిపాదనల్లో చర్చలో వచ్చిన సూచనలతో కొన్ని మార్పులు చేసి రాజకీయ తీర్మానం సిద్ధంచేశామని, ఇవాళ పూర్తి స్థాయి రాజకీయ తీర్మానం ఆమోదం తెలుపుతామని పేర్కొన్నారు. శుక్రవారం పార్టీ రాజకీయ నిర్మాణం పై తీర్మానం ప్రవేశపెట్టి దానిపై చర్చిస్తామన్నారు. చర్చలో భాగంగా 15వ ఆర్థిక సంఘం సూచనలు, దక్షణాది రాష్ట్రాలకు జరుగుతున్న నష్టంపై చర్చించామని తెలిపారు. 1971 జనాభా ప్రాతిపదికన కాకుండా 2011 లెక్కల ప్రకారం నిదుల కేటాయింపు సరికాదని, అలా అయితే జనాభా నియంత్రణ సక్రమంగా జరిపిన రాష్ట్రాలు నష్టపోతాయని తీర్మానంలో చర్చించినట్లు కారత్ పేర్కొన్నారు. ప్రభుత్వం ఏకపక్షంగా సంక్షేమ పథకాలు కుదించటం సరికాదని విమర్శించారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల భద్రతపై మరో తీర్మానం ప్రవేశపెట్టగా, ప్రైవేట్ సెక్టార్లో కార్మికులు, ఉద్యోగుల చట్టాల అమలుపై కార్మిక సంఘాల సూచనలను పరిశీలించారు. సభలో ప్రవేశపెట్టిన రెండు ముసాయిదాలపై వచ్చిన సవరణలకు సమాధానం ఉంటుందని, ముసాయిదాలపై ఏకాభిప్రాయం కుదరకపోతే ఓటింగ్ నిర్వహిస్తామని కారత్ తెలిపారు. ఓటింగ్‌కు ఏ సభ్యుడైనా డిమాండ్ చేయవచ్చునని, పార్టీలో రహాస్య ఓటింగ్ విధానం లేనందున ప్రతినిదులు రహస్య ఓటింగ్ కోరితే ఆలోచిస్తామని తెలిపారు. ఓటింగ్‌లో తీసుకున్న నిర్ణయాన్ని సభ్యులందరూ పాటించాలని, అప్పుడు మెజారిటీ, మెనారిటీ అన్న ప్రశ్న ఉత్పన్నం కాదన్నారు. పార్టీ సెంట్రల్ కమిటీ కంటే పార్టీ కాంగ్రెస్ ఉన్నతమైనదని, కీలక అంశాలపై ఇక్కడ స్పష్టమైన ముగింపు ఉంటుందని ప్రకాష్ కారత్ స్పష్టంచేశారు. -
అధికారం కోసం నాటకాలు
న్యూఢిల్లీ: సమగ్రాభివృద్ధి, అవినీతిపై పోరాటం అంటూ బూటకపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలను మోసం చేశారని యూపీఏ చైర్పర్సన్, కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోపించారు. అధికారాన్ని అందుకునేందుకు నాటకాలు ఆడారని విమర్శించారు. ఢిల్లీలో ప్రారంభమైన కాంగ్రెస్ పార్టీ 84వ ప్లీనరీని ఉద్దేశించి శనివారం సోనియా ప్రసంగించారు. తన ప్రసంగంలో ప్రధాని మోదీని లక్ష్యంగా తీవ్రమైన విమర్శలు చేశారు. పార్టీని బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. దేశానికి వివక్ష, అహంకార,కుట్రపూరిత రాజకీయాలనుంచి విముక్తి కల్పించాలన్నారు. మోదీ ప్రభుత్వంపై ప్రజలు విసిగిపోయారని.. ఎన్డీయే ప్రభుత్వం విద్వేషాలను రెచ్చగొడుతోందని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ విమర్శించారు. ఉపాధి కల్పనలో మోదీ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని ఆయన ఆరోపించారు. ప్లీనరీలో పార్టీ లక్ష్యాలను నిర్దేశిస్తూ వ్యవసాయం, రాజకీయ పరిస్థితులపై పోరాటం, యువత, ఉపాధికల్పన, పేదరిక నిర్మూలన, సామాజిక న్యాయం తదితర అంశాలపై రూపొందించిన తీర్మానాలను ఆమోదించారు. కుట్రపూరితంగా అధికారంలోకి.. ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్, నా ఖావూంగా – నా ఖానేదూంగా అంటూ మోదీ ఇచ్చిన నినాదాలన్నీ నాటకాలే. అధికారాన్ని అందుకునేందుకు పన్నిన కుట్రలే’ అని మోదీపై ఘాటుగా విమర్శలు చేశారు. నిరంకుశ మోదీ ప్రభుత్వంతో కాంగ్రెస్ పోరాడుతోందని పేర్కొన్న సోనియా.. 2014లో అధికారంలోకి వచ్చేందుకు మోదీ చేసిన వాగ్దానాలన్నీ బూటకమేనని ప్రజలు ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారని పేర్కొన్నారు. ‘మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ వర్ధిల్లింది. మా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో కోట్ల మంది పేదరికం నుంచి బయటకువచ్చారు. కానీ నేటి మోదీ ప్రభుత్వం ఆ విధానాలను బలహీనపరిచింది. అధికారంలో ఉండేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. కానీ కాంగ్రెస్ ఇలాంటి రాజకీయాల ముందు మోకరిల్లదు’ అని సోనియా విమర్శించారు. మోదీ ప్రభుత్వ అవినీతిని ఆధారాలతో సహా బయటపెడతామన్నారు. ‘పార్టీని బలోపేతం చేయటమే మన మొదటి ప్రాధాన్యం కావాలి. కాంగ్రెస్ ఒక పార్టీ కాదు. ఒక ఆలోచన. కొత్త అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కార్యకర్తలు, నాయకులు సంపూర్ణ మద్దతు తెలపాలి’ అని సోనియా కోరారు. రాహులే ప్రధాని: సిద్దరామయ్య త్వరలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు లౌకికవాదం, మతతత్వం మధ్య జరుగుతున్న పోరాటమని ఆ రాష్ట్ర సీఎం సిద్దరామయ్య పేర్కొన్నారు. 2019 ఎన్నికలకు ఈ ఎన్నికల ఫలితాలే తొలి అడుగన్నారు. ‘2019లో రాహుల్ గాంధీ ప్రధాని కాకుండా ఎవరూ అడ్డుకోలేరు. భారీ మెజారిటీతో మళ్లీ కర్ణాటకలో అధికారంలోకి వస్తాం’ అని సిద్దరామయ్య తెలిపారు. ప్లీనరీ తీర్మానాలు భావసారూప్య పార్టీలను కలుపుకుని సహకారాత్మక విపక్షాన్ని రూపొందించాలన్న తీర్మానానికి ప్లీనరీలో కాంగ్రెస్ పార్టీ ఆమోదం తెలిపింది. పొత్తులతో 2019లో బీజేపీ–ఆరెస్సెస్ కూటమిని ఓడించేందుకు వ్యూహాత్మకంగా ముందుకెళ్లాలని నిర్ణయించింది. ‘దేశానికి స్వాతంత్య్రాన్ని అందించిన నేతల మార్గదర్శకత్వంలో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ముందుకు నడిపిస్తుంది. బీజేపీ నేతృత్వంలో దేశంలో నెలకొన్న రాజకీయ అస్థిరతను కాంగ్రెస్ మాత్రమే రూపుమాపగలదు’ అని ఈ రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెడుతున్న సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. గణతంత్ర, ప్రజాస్వామ్య రాజ్యాంగ విలువలను కాపాడేందుకు పార్టీ కార్యకర్తలంతా సిద్ధమవ్వాలని తీర్మానంలో పేర్కొన్నారు. దీంతోపాటుగా ఈవీఎంలను పక్కనపెట్టి బ్యాలెట్ పేపర్లతో పాత పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని కూడా తీర్మానించారు. ఈవీఎంలు దుర్వినియోగం అవుతున్నాయని.. తద్వారా ఎన్నికల వ్యవస్థపై నమ్మకం పోకుండా బ్యాలెట్ పేపర్లతో ఓటింగ్ సరైనదని తీర్మానంలో పేర్కొన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో దేశంలో సమతుల్యత నెలకొనేలా మీడియా వ్యవహరించాలని కోరారు. అంతర్గత భద్రత, యువత, మహిళల సాధికారత, సామాజిక న్యాయం తదితర అంశాలనూ తీర్మానంలో ప్రస్తావించారు. రుణమాఫీ చేస్తాం.. తాము అధికారంలోకి వస్తే చిన్న, సన్నకారు రైతుల రుణాలన్నీ మాఫీచేస్తామని పార్టీ తీర్మానంలో పేర్కొంది. 2009లో యూపీఏ ప్రభుత్వం చేసినట్లుగానే ఈసారీ మాఫీ చేస్తామని వెల్లడించింది. ‘వ్యవసాయం, ఉపాధికల్పన, పేదరిక నిర్మూలన’ పేరుతో పంజాబ్ సీఎం అమరీందర్‌సింగ్ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 2022 కల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామంటూ మోదీ ప్రభుత్వం బూటకపు ప్రచారం చేస్తోందని ఆయన విమర్శించారు. రైతులకు మద్దతు ధరను పెంచటం, అటవీ ఉత్పత్తులపై గిరిజనులకే అధికారాన్ని కల్పించటం తమ పార్టీ లక్ష్యాలని పేర్కొన్నారు. పేదలకు జరిగే లబ్ధిని ఆధార్ ద్వారా అడ్డుకోకుండా కాంగ్రెస్ భరోసా ఇస్తుందని తీర్మానంలో పేర్కొన్నారు. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి రాగానే.. వ్యవసాయ పరికరాలపై జీఎస్టీని సమీక్షిస్తామని వెల్లడించారు. అధికారంలోకి రాగానే దేశంలో ఉన్న ఒకశాతం అత్యంత ధనికుల నుంచి 5 శాతం సెస్ వసూలుచేసి ‘పేదరిక నిర్మూలన నిధి’ ఏర్పాటుచేస్తామన్నారు. దేశం విసిగిపోయింది: రాహుల్ నరేంద్ర మోదీ ప్రభుత్వ పాలనతో దేశం విసిగిపోయిందని.. అందుకే ప్రత్యామ్నాయం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పేర్కొన్నారు. ఎన్డీయే ప్రభుత్వం ఉపాధికల్పన, రైతు సమస్యల పరిష్కారంలో దారుణంగా విఫలమైందన్నారు. ‘కాంగ్రెస్ పార్టీ మాత్రమే దేశాన్ని ఏకం చేసి.. ముందుకు తీసుకెళ్తుంది. అధికార పార్టీ విద్వేషాన్ని రెచ్చగొడుతోంది. కానీ మేం.. సోదరభావాన్ని, ప్రేమను పంచుతాం.అదే మాకు, వారికి ఉన్నతేడా’ అని రాహుల్ తెలిపారు. త న నాయకత్వంలో పార్టీ అనుభవజ్ఞులైన సీనియర్లు, యువరక్తం కలయికతో.. సరికొత్త దిశలో ముందుకెళ్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ‘మోదీ పాలనలో ఉద్యోగాల్లేక యువకులు దీనంగా ప్రధాని మోదీవైపు చూస్తున్నారు. తమ పంటలకు సరైన గిట్టుబాటు ధరలేక రైతులు ఆవేదన చెందుతున్నారు. దేశం అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం తీరుతో విసిగి వేసారిపోయింది. అలాంటివారందరికీ మేం సరైన దారిచూపిస్తామని భరోసా ఇస్తున్నా’ అని రాహుల్ తెలిపారు. దేశ ప్రజలందరినీ ఏకం చేసి ముందుకు నడిపించే శక్తి తమ పార్టీ గుర్తు ‘హస్తం’కే ఉందన్నారు. ‘హిందుత్వతో హిందూయిజానికి సంబంధం లేదు. బీజేపీకి ఉన్న హిందూ ఓటుకు తలవంచాల్సిన పనిలేదు’ అని కాంగ్రెస్ సీనియర్‌నేత శశిథరూర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. తల్లి సోనియాకు రాహుల్ గాంధీ ఆత్మీయ ఆలింగనం -
సెట్ & ఫిట్
న్యూఇయర్ సందర్భంగా తీసుకునే రిజల్యూషన్స్‌లో అత్యధికంగా ఆరోగ్యానికి సంబంధించినవే ఉంటాయని వివిధ సర్వేల్లో వెల్లడైంది. వీటిలో మరింత ప్రధానమైంది ‘ఈ ఏడాది వ్యాయామం ప్రారంభిద్దాం’. అయితే ఈ తీర్మానం తీసుకుంటున్న వారిలో అత్యధిక శాతం మంది అమలులో విఫలమవుతున్నారట. దీనికి కారణాలేమిటి? అలా జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? రైట్ వర్కవుట్ కఠినమైనది కాకుండా, వాస్తవంగా మనసుకు ఆనందం కలిగించే వ్యాయామం ఏదనేది గుర్తించాలి. ఆనందం కలిగించని ఏ పనైనా ఎక్కువ కాలం కొనసాగించలేం. అదే సమయంలో సీజన్‌నూ దృష్టిలో పెట్టుకోవాలి. ఈ సీజన్లో పరుగు ఎంచుకుంటే చలిలో దానిని కొనసాగించడం చాలా కష్టమవుతుంది. ఆదిలోనే హంసపాదు ఎదురవుతుంది. కంపెనీ సన్నిహిత వ్యక్తిని మంచి కంపెనీగా ఎంచుకోండి. అది మీ ఫ్రెండ్ కావొచ్చు, జీవిత భాగస్వామి అయినా సరే. మరొకరితో కలిసి వెళ్తున్నప్పుడు బాధ్యత పెరిగి మిమ్మల్ని మరింత ప్రోత్సహిస్తుంది. ఇద్దరికి నచ్చిన వ్యాయామశైలిని కలిసి ఎంజాయ్ చేయడం స్ఫూర్తిని రగిలిస్తుంది. వ్యక్తిగతంగా ఎవరూ దొరక్కపోతే, ఆన్లైన్ పార్టనర్‌ని కూడా ట్రై చేయొచ్చు. వెరైటీ తొలి దశలో నచ్చినది మాత్రమే చేసినా, వీలున్నంత వరకు వైవిధ్యభరిత వ్యాయామాలు ఎంచుకుంటూ కొనసాగాలి. ఇది మీలో మరింత ఆసక్తిని పెంచుతుంది. అది జిమ్‌లో వర్కవుట్ కావచ్చు.. డ్యాన్స్ క్లాస్ కావచ్చు.. యోగా, తాయ్‌చీ ఇలా ఏదైనా సరే. ఆటలు కూడా మంచి వ్యాయామమే. లక్ష్యం ఆరోగ్యమే అంతిమ లక్ష్యం అయినప్పటికీ, కొన్ని స్వల్పకాలిక లక్ష్యాలు నిర్ణయించుకోవాలి. తొలుత వెయిట్‌లాస్, తర్వాత ఫిట్నెస్.. ఇలా ఒక్కో దశలో ఒక్కోటి మార్చుకుంటూ వెళ్లాలి. అంతేకానీ ఒకేసారి అన్ని రకాల ఫలితాలు ఆశిస్తే, పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకుంటే త్వరగా నిరుత్సాహపడే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒకే నెలలో బరువు తగ్గాలనే లక్ష్యం కంటే, ఒక నెలలో 3–4 కిలోలు తగ్గితే చాలనే లక్ష్యం పెట్టుకోవడం అర్థవంతంగా ఉంటుంది. సాకులొద్దు ఈ రోజు మనం ఎందుకు వ్యాయామం చేయలేదనే దానికి సాకులు వెతుక్కోవడంలోనే వెనకడుగు మొదలవుతుంది. మరీ చల్లగా ఉందనో, వేడిగా ఉందనో, వర్షం పడుతుందనో, సమయం సరిపోవడం లేదనో... ఇవన్నీ అసలు కారణాలే కాదని, సాకులు మాత్రమేనని గుర్తించాలి. ఈ విషయంలో మీకు మీరే చాలెంజ్ చేసుకోండి. మీ శరీరానికి వెకేషన్ లేదని గుర్తించండి. సీజన్ ఏదైనా, పరిస్థితులు ఎలా ఉన్నా వ్యాయామం నిత్యావసరం. హోమ్‌వర్క్ ఎక్సర్సైజ్ కోసం జిమ్‌కి, మరెక్కడికైన వెళ్లినా ఇంట్లో కూడా వ్యాయామానికి అనుగుణమైన వాతావరణం ఏర్పాటు చేసుకోవాలి. చిన్ని చిన్న పరికరాలు ఇంట్లో ఏర్పాటు చేసుకుంటే, అవుట్‌డోర్‌కి వెళ్లలేనప్పుడు చేసుకోవచ్చు. ఇందుకు ఆన్‌లైన్‌లోనూ టిప్స్ లభిస్తున్నాయి. ఏరోబిక్స్ లాంటి వ్యాయామాలైతే పూర్తిగా యూట్యూబ్ వీడియోల ఆధారంగా కూడా చేయొచ్చు. సానుకూల దృక్పథం వ్యాయామంతో కేవలం శారీరకంగా మాత్రమే కాకుండా మానసికంగా, వృత్తి, వ్యాపార వ్యవహారాల్లోనూ ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. వాటిని నిశితంగా గమనిస్తే అంతకముందున్న దానికంటే మనం సాధిస్తోందేమిటో అవగతమవుతుంది. ఏ శారీరక శ్రమకైనా ముందస్తుగా శరీరాన్ని సిద్ధం చేయకపోతే అది వ్యతిరేకంగా స్పందిస్తుంది. ఫలితంగా వ్యాయామంపై విముఖత కలిగేలా చేస్తుంది. ప్రతి వర్కవుట్‌కి ముందు కనీసం 10 నిమిషాలు వార్మప్ చేయాలి. ఈ చలికాలంలో ఇది మరింత తప్పనిసరి. వ్యాయామం చేసే సమయంలో, మరెప్పుడైనా దాని తాలూకు ఫలితాలు ఇబ్బందికరంగా అనిపిస్తే వెంటనే వైద్యుణ్ని సంప్రదించాలి. – నరేందర్, ఫిట్నెస్ ట్రైనర్ -
శపథమ్ముందా?
కొత్త సంవత్సరం తన్నుకొస్తోంది పాత అలవాట్లను తన్నిపారేయండి ప్రతి స్టెప్పులో కొత్త స్టెప్పేయండి హ్యాపీ న్యూఇయర్ ఎవిరీ ఇయర్ వస్తది హెల్దీ న్యూఇయర్ 2018లోనే రావాలి ఆర్యూ రెడీ...? శపథం చేస్తారా? ఈ 18 రెసెల్యూషన్స్ తీసుకునే దమ్ముందా? 1. అనారోగ్యకరమైన జంక్‌ఫుడ్‌ను ఈ ఏడాది దరిచేరనివ్వకండి. దానికి బదులు అన్ని పోషకాలు సమతులంగా... అంటే కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు, ఖనిజ లవణాలు, విటమిన్ల వంటివి అన్నీ సమంగా ఉండేలా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలనే నిర్ణయం తీసుకోండి. మితంగా తినండి. కాస్తంత ఆకలిగా ఉండగానే తినడం ఆపేయండి. భోజనానికి ముందర కాస్త రసం (సూప్) తీసుకోండి. దాంతో మీరు తక్కువ తింటారు. కొంచెం కొంచెంగా ఎక్కువ సార్లు తినండి. దాంతో మీ జీవరసాయన క్రియలు (మెటబాలిజం) సమర్థంగా జరుగుతాయి. ఇక ఏవైనా కారణాల వల్ల మీకు ఇష్టమైన పదార్థాలను పరిమితంగా తీసుకోవాల్సి వస్తే వాటిని మానేయాల్సి వస్తుందని భావన మీలో ఒత్తిడిని పెంచవచ్చు. అందుకే వాటిని పరిమితంగా తినేందుకు మీకెప్పుడూ అవకాశం ఉంటుందనే ఆలోచనను పెంచుకోండి. దీంతో మీకు ఇష్టమైన వాటి పట్ల మీరు దూరంగా ఉండాలన్న ఆందోళన తగ్గి ఏడాదంతా మీ ఆరోగ్యం మరింత బాగుంటుంది. 2. మీరు తీసుకునే ఆహార పదార్థాలు ఎప్పుడూ తాజాగా ఉండేలా చూసుకోండి. రోజూ తాజాగా ఉండే కూరగాయలు, పళ్లు తీసుకుంటే వాటిల్లోని పోషకాల వల్ల అనేక జబ్బులు, క్యాన్సర్ రిస్క్ దూరమవుతుంది. ఫ్రిజ్‌లో పెట్టిన వాటిల్లో 50% – 60% పోషకాలు నశిస్తాయి. అందుకే సాధ్యమైనంత వరకు తాజా పదార్థాలనే తినాలనే నిర్ణయం తీసుకోండి. 3. ఈ ఏడాది నుంచి ఒకసారి ఉపయోగించిన నూనెను ఎట్టిపరిస్థితుల్లోనూ మళ్లీ వాడకూడదనే నిర్ణయం బలంగా తీసుకోండి. దాంతో క్యాన్సర్లు మొదలుకొని ఎన్నో సమస్యలను అరికట్టడంతో పాటు, ఎన్నో జబ్బులను నివారించుకున్నట్లూ అవుతుంది. 4. పొగతాగడం అనేది పూర్తిగా హానికరమైన దురలవాటు. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం, ఒబేసిటీల కంటే పొగతాగడమే ఎక్కువ హానికరం అని అనేక అధ్యయనాలు నిరూపించాయి. దీన్ని బట్టే గుండెపోటుకు కారణమయ్యే కొలెస్ట్రాల్, స్థూలకాయం కంటే పొగతాగడాన్నే సైంటిస్టులు ఎక్కువ ప్రమాదకరంగా పరిగణిస్తున్నారంటే... దానితో కలిగే హానిని గుర్తించండి. 5. ఆల్కహాల్ ఆరోగ్యపరంగా, సామాజికంగా, ఆర్థికంగా... అన్ని రకాలుగా మిమ్మల్ని దెబ్బతీస్తుంది. ఆ అలవాటును మానేయాలని నిర్ణయం తీసుకోండి. ఇక ఇప్పటివరకు మీరు ఆల్కహాల్‌ను ముట్టనివారైతే మున్ముందు అస్సలు ఎప్పటికీ దాన్ని ముట్టుకోబోమని ప్రతిజ్ఞ తీసుకోండి. ఎందుకంటే అది మీ మెదడు మీద చాలా ప్రతికూలమైన ప్రభావాలు చూపుతుంది. 6. మీ చేతిలోని పనులన్నీ మీరే చేయాలని అనుకోకండి. మీరు మాత్రమే బాగా చేస్తారనే మొండి పట్టుదలతో ఉండకండి. కొన్ని ఇతరులకు అప్పజెప్పండి. పనులు చేసే విషయంలో పర్ఫెక్షనిజం పేరిట అతిగా కష్టపడకండి. ఏదో ఒక చోట పనిని ముగించాలి... అలా పని ముగిసి తీరాలి. ఈ సత్యం గుర్తుంచుకుంటే పర్ఫెక్షన్ కోసం అతిగా తాపత్రయపడటం తగ్గుతుంది. 7. మీలో చెలరేగే కోపం, ప్రేమ, విచారం లాంటి ఫీలింగ్స్ భావోద్వేగాలను అణచుకోకండి. వాటిని అణచుకోవడం వల్ల గుండెపోటుతో పాటు అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. ఎవరిపట్లనైనా మీకు కోపం వస్తే... వారి పట్ల మీరు ఏమాత్రం రియాక్ట్ కాకండి. మీకు కోపం కలిగించిన వారిని పూర్తిగా విస్మరించండి. (ఇగ్నోర్ చేయండి). దాంతో భవిష్యత్తులో ఇటు... మీకు వారితో వ్యవహారపరంగా గానీ, అటు... ఆరోగ్యపరంగా గానీ ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు రావు. వీలైతే మీ భావోద్వేగాలను ఒకచోట రాయండి. అలా నమోదు చేయడం మీకు ఎన్నో విధాలుగా మేలు చేస్తుంది. ఏదైనా విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోగలం అనే అతి విశ్వాసాన్ని వదులుకోండి. మీ అపరిమితమైన జ్ఞాపకశక్తి మీద నమ్మకం కంటే చిన్న పెన్సిల్... మీరు ఏ విషయాన్నీ మరచిపోకుండా ఉంచుతుంది. ఎందుకంటే ఏదో ఒక సమయంలో మరపు కలగడం ఎంతటి జ్ఞాపకశక్తి ఉన్నవాళ్లలోనైనా అరుదుగానైనా సంభవించే పరిణామమే. 8. మీ ఆత్మవిశ్వాసమే మీకు బలం. మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీ రోగనిరోధకశక్తిని మరింత పెంచుతుంది. తమ మీద తమకు నమ్మకం, పాజిటివ్ దృక్పథం అన్న అంశాలు క్యాన్సర్, గుండెజబ్బులతో పాటు అనేక వ్యాధుల విషయంలో ఒక ఆత్మరక్షణ చర్యలా పనిచేస్తాయి. అందుకే ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోడానికి కృషి చేయండి. 9. మీ బెడ్రూమ్లో కంప్యూటర్లను, టీవీ వంటివాటిని అమర్చుకోకండి. టీవీ ప్రకటనల్లో కనిపించే ప్రతి వస్తువును కొనాలనో, సమకూర్చుకోవాలనో అనుకోకండి. నిద్రకు ఉపక్రమించే సమయంలో కంప్యూటర్, టీవీ లాంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలను వాడకండి. బెడ్ రూమ్‌లో మీకు టీవీ, కంప్యూటర్ వాడాలనిపించినప్పుడు మంచి పుస్తకం చదవండి. దాంతో రీడింగ్ హ్యాబిట్స్ పెరుగుతాయి. విజ్ఞానమూ సమకూరుతుంది. కళ్లు అలసి నిద్రా వస్తుంది. 10. స్ట్రెస్‌కు దూరంగా ఉండండి. స్ట్రెస్‌ను కలిగించే అంశాల్లో 90 శాతం నిజానికి అంత ఒత్తిడి కలిగించాల్సినవేమీ కాదన్న విషయాన్ని గ్రహించండి. పిల్లల చదువులు అంటూ వారిపైనా ఒత్తిడి పెంచకండి. పరిమితమైన ఒత్తిడి వల్ల కాస్తంత ప్రయోజనం ఉండవచ్చేమో గానీ అది మితిమీరితే హానికరం. స్ట్రెస్ అన్నది స్త్రీ, పురుషులిద్దరికీ హాని చేసినప్పటికీ, అది పురుషుల్లో కంటే మహిళల్లో ఎక్కువగా హాని చేస్తుందని గుర్తుంచుకోండి. అప్పుడప్పుడూ కాస్తంత ఒళ్లువిరుచుకుని ఒకసారి ఆవలించండి. ఒత్తిడి తగ్గుతుంది. అబద్ధాలు ఆడటం మీలో ఒత్తిడిని మరింత పెంచుతుంది. ఎందుకంటే ఒకసారి అబద్ధం ఆడామంటే వాటిని నిత్యం జ్ఞాపకం పెట్టుకుంటూ ఉండాలి. అది మీ స్ట్రెస్‌కు కారణమవుతుంది. మీ స్ట్రెస్‌ను ధ్యానం, యోగా వంటి ప్రక్రియలతో తొలగించుకొని ప్రశాంతంగా ఉండండి. 11. మీ సెల్‌ఫోన్స్‌ను అవసరం లేని సమయంలో దూరంగా పెట్టుకోవాలనే నియమం పెట్టుకోండి. మీ మొబైల్ మీ స్ట్రెస్‌ను అపరిమితంగా పెంచుతుందని గుర్తుంచుకోండి. మీ మొబైల్‌ను టాయిలెట్స్‌లో, మూవీలో ఇకపై ఉపయోగించబోమని నిర్ణయం తీసుకోండి. ఆధునికమైన గాడ్జెట్స్ వినియోగాన్ని సాధ్యమైనంతగా తగ్గించండి. వాట్సాప్ వంటి వాటిని కేవలం అవసరం మేరకు మాత్రమే వాడండి. 12. పెంపుడు జంతువులు ఉన్నవాళ్లలో స్ట్రెస్ తగ్గి హైబీపీ, డయాబెటిస్, గుండె జబ్బులు, పక్షవాతం వంటి జబ్బులు తక్కువగా వస్తాయని తేలింది. వీలైతే పెట్‌ను పెంచుకోండి. అక్వేరియంలోని చేపల వల్ల హైపర్‌టెన్షన్ (రక్తపోటు) తగ్గుతుంది. పెట్స్ పట్ల అలర్జీలు ఉన్నవారు పక్షులు సంచరించే ప్రాంతాల్లో కొన్ని గింజలు చల్లి... వాటిని పరిశీలిస్తూ ఎక్కువ సేపు గడపండి. పెట్స్‌ను పెంచడానికి వీల్లేని వారికి ఈ పని పెట్స్‌ను పెంచినప్పుడు కలిగే ప్రయోజనాన్నే ఇస్తుంది. 13. మీ పాత ఫ్రెండ్షిప్స్ కొనసాగిస్తూ, వారితో ఆరోగ్యకరమైన బంధాలను నెరపుతా మని ప్రతిజ్ఞ తీసుకోండి. అలాగే కొత్త ఫ్రెండ్ షిప్స్ చేసుకుంటూ ఉండండి. నమ్మకమైన ఫ్రెండ్స్ దగ్గర మాత్రమే పూర్తిగా ఓపెన్–అప్ అవండి. 14. పుకార్లనూ, గాసిప్స్‌ను నవ్వుకోవడం వరకే పరిమితం చేయండి. ఎప్పుడూ పరిశుభ్రమైన దుస్తులను ధరించి, నీట్‌గా కనిపించాలనే నిర్ణయం తీసుకోండి. వీలైతే ఒకరోజు వేసుకున్న దుస్తులను ఉతకకుండా మళ్లీ ధరించకండి. ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని, ఎదుటివారికి నవ్వుతూనే కనిపించాలనే నిర్ణయం తీసుకోండి. ఎప్పుడూ నవ్వుతూ ఉండటం వల్ల గుండెజబ్బులు తగ్గుతాయని వైజ్ఞానికంగా నిరూపితమయ్యింది. లాఫ్టర్ థెరపీ వల్ల రక్తపోటు, ఒత్తిడి, క్యాన్సర్, గుండెజబ్బుల రిస్క్ తగ్గుతుందని అనేక అధ్యయనాల్లో నిర్ద్వంద్వంగా తేలింది. 15. పని తర్వాత విశ్రాంతి, వినోదం తప్పనిసరి. వారంలోని అన్ని రోజులూ మీ ఆఫీస్ కోసమైతే... మీ వారాంతం మాత్రం పూర్తిగా మీ కుటుంబం కోసమే. ఇక రోజంతా మీ ఆఫీస్ పని కోసమైతే... సాయంత్రాలు మాత్రం మీ కోసమే. ఇలా మీ కోసం కూడా మీరు సమయం వెచ్చించుకోక తప్పదనే నిర్ణయాన్ని ఈ ఏడాది తప్పక తీసుకోండి. ఏడాదిలో ఒకసారైనా కనీసం వారం రోజుల పాటు ఏ హాలిడేకో వెళ్లాలనే నిర్ణయం తీసుకోండి. 16. అందమైన పూలకుండీలు, కుండీల్లోని మొక్కల వల్ల ఒత్తిడి తగ్గుతుంది. అకస్మాత్తుగా వినిపించే గట్టి చప్పుళ్లు లేదా మెల్లిగానైనా దీర్ఘకాలం వరకు వినిపించే శబ్దాలు గుండెజబ్బుల రిస్క్ పెంచుతాయని ఓ జర్మన్ రీసెర్చ్ చెబుతోంది. ప్రకృతిలో వినిపించే ఆహ్లాదకరమైన శబ్దాలు... అంటే... నీటి ప్రవాహం, పక్షి కూతల వంటివి గుండెకు సాంత్వననిస్తాయి. అందుకే మంచి ఆహ్లాదకరమైన సంగీతాన్ని వింటుండండి. 17. రాత్రి వేళ నిద్రకు ఉపక్రమించి, కంటినిండా నిద్రపోవాలనే నిర్ణయం తీసుకోండి. మరీ తక్కువ నిద్రపోవడం గుండెకు మంచిది కాదు. మరీ ఎక్కువ నిద్రపోవడం డిప్రెషన్‌కు సూచిక. వీలైతే మధ్యాహ్నం పూట ఒక కునుకు తీయండి. ఆ పవర్‌న్యాప్ గుండెకూ, మెదడుకూ మంచిది. మధ్యాహ్న భోజనం తర్వాత తీసే ఆ కునుకుతో మీ పని సామర్థ్యం, జ్ఞాపకశక్తి పెరుగుతాయని గుర్తుంచుకోండి. తగినంత నిద్ర కచ్చితంగా అవసరం. 18. వ్యాయామం చేస్తామనే నిర్ణయాన్ని ఈ ఏడాది తీసుకొని, తప్పక అమలు చేయండి. మీరు నడిచే ప్రతి క్షణం మీ ఆయుర్దా యాన్ని పెంచుతుంది. వ్యాయామం వల్ల మీలో సంతోషం కలిగించే రసాయనాలు (ఎండార్ఫిన్స్) స్రవిస్తాయి. అవి మిమ్మల్ని ఆనందంగా, ఆరోగ్యకరంగా ఉంచుతాయి. వ్యాయామం మొదలుపెట్టే సమయంలో వార్మప్‌తో ప్రారంభించి, ముగించడం అకస్మాత్తుగా చేయకుండా మెల్లగా కూల్‌డౌన్ చేస్తూ ముగించాలని గుర్తుపెట్టుకోండి. - డాక్టర్ ఎం. రామకృష్ణ సీనియర్ జనరల్ ఫిజీషియన్ యశోద హాస్పిటల్స్, మలక్‌పేట్, హైదరాబాద్ -
‘ఏపీని బజారున పడేసింది టీడీపీనే’
గుంటూరు: మూడేళ్లుగా వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం అధ్యక్షుడు నాగిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రాన్ని కరువు వెంటాడుతోందని అన్నారు. టీడీపీ అసమర్థ పాలన కారణంగా వ్యవసాయ రంగం తీవ్ర దుర్భక్ష పరిస్థితులు ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి జిల్లాలోని పలు మండలాలు తీవ్ర కరువుతో అల్లాడుతున్నాయని వివరించారు. శనివారం ప్రారంభమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్లీనరీలో రైతుల సమస్యలపై నాగిరెడ్డి తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో ఉన్న మండలాలలన్నీ కరువు మండలాలుగా ప్రభుత్వమే ప్రకటించింది. ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్సు చెల్లించకుండా టీడీపీ ప్రభుత్వం మోసం చేసింది. పొలాల్లో పారుతుంది సాగునీరు కాదు.. టీడీపీ అవినీతి. రైతు రుణమాఫీ లేదు. ఎగువన ఉన్న తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతుంటే ఇక్కడ టీడీపీ ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తోంది. రైతు రుణమాఫీ కాదు కదా .. కనీసం వడ్డీ మాఫీ కూడా కాలేదు. మూడేళ్లతో పోల్చుకుంటే ఖర్చులు తీవ్రంగా పెరిగాయి. కానీ రైతుకు మధ్దతు ధర పెరగలేదు' అని నాగిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 5వేల కోట్లతో ఇన్పుట్ సబ్సిడీ ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందన్నారు. బేషరతుగా రైతు రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు తాను అసలు ఆ మాటే చెప్పలేదని మాట మార్చారని ధ్వజమెత్తారు. బంగారంపై తీసుకున్న రుణాలు మాఫీ చేస్తామని చెప్పి ఇప్పడు ఒక్క పైసా కూడా మాఫీ చేయలేదని తీర్మానం సందర్భంగా గుర్తు చేశారు. రైతులకు సంబంధించి ప్రతి అంశంలో మోసమే చేశారు. రైతాంగ చరిత్రలో ల్యాండ్ పూలింగ్, ల్యాండ్ అక్విజిషన్, ఇనాం భూముల స్వాధీనం, రికార్డుల మార్పు, తుపానుల పేరుతో రికార్డుల మాయంవంటివన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించిన చీకటి అధ్యాయం అని మండిపడ్డారు. అన్నపూర్ణగా పిలవబడే ఆంధ్రప్రదేశ్‌ను బజారున పడేసిన టీడీపీకి బుద్ధిచెప్పి, రాబోయే రోజుల్లో రైతులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. -
'భగవంతుడు పంపిన దూత వైఎస్ జగన్'
గుంటూరు: వెనుకబడిన శ్రీకాకుళం జిల్లా అభివృద్ధికి దివంగత మహానేత వైయస్ఆర్ పలు ప్రాజెక్టులు తీసుకొచ్చారని శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షురాలు రెడ్డి శాంతి అన్నారు. శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్లీనరీ సందర్భంగా ఆమె పలు తీర్మానాలు పార్టీ తరుపున ప్రవేశ పెట్టారు. అందులో ముఖ్యమైనవి కొన్ని పరిశీలిస్తే.. 1. వంశధార, మడ్డువలస, నారాయణ, తోటపల్లి ప్రాజెక్టుల నిర్మాణానికి వైఎస్ కృషి చేశారు. ప్రస్తుతం రైతులు సాగునీరు లేక ప్రజలు తాగునీరు లేక అనేక కష్టాలు పడుతున్నారు. భగవంతుడు పంపిన దూతగా వైఎస్ఆర్ చనిపోయిన తరువాత ఒక అద్భుతాన్ని మనకు ఇచ్చారు. అది వైఎస్ జగన్. 2. మత్స్యకారులు శ్రీకాకుళంలో 192 కోస్టల్ కారిడర్లు ఉన్నాయి. 3 లక్షలమంది మత్స్యకారులు ఉన్నారు. టీడీపీ అధికారంలోకి రాకముందే 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని, కోల్డ్ స్టోరేజీలు కట్టిస్తామంటూ ఎనో హామీలు ఇచ్చారు. కానీ ఏ ఒక్కటీ నెరవేరలేదు. శ్రీకాకుళం జిల్లాలో గత వందేళ్లలో 80కి పైగా గత మూడు సంవత్సరాల కాలంలో హుద్ హుద్, ఫైలాన్ వచ్చాయి. వాటికి ఒక్క పరిహారం ఇవ్వలేదు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్ర మత్స్యకారులను బాగుచేస్తారు. 3. గిరిజనులు శ్రీకాకుళం జిల్లా 2 లక్షలకు పైగా ఉన్నారు. వారికి ఇప్పటికీ రహదారులు లేవు. వైద్యానికైనా డోలీలపై వెళ్లాలి. వారి స్కూల్స్ ఎత్తివేస్తున్నారు. ఐటీడీఏ సబ్ ప్లాన్ ద్వారా వచ్చిన నిధులు టీడీపీ ప్రచారానికి వాడుకుంటుంది. గిరిజనుల అభివృద్ధిని తుంగలో తొక్కారు. వైఎస్ జగన్ గిరిజన సంక్షేమం కోసం పాటుపడిన ముఖ్యమంత్రి అవుతాడని ధీమా వ్యక్తం చేస్తున్నాం. 4. పొందూరు చేనేత కార్మికులు దివంగత మహానేత వైయస్ఆర్ ఎప్పుడు ఆదరించి అందంగా కట్టుకునే పంచ పొందూరు ఖద్దర్ అని తెలియజేస్తున్నా. పొందూరు ఖద్దర్ విలువ దయనీయంగా ఉంది. దేశవాడి పత్తి అని కేవలం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలోనే ఉంది. ఆ పత్తిపై నివసించే కార్మికులు పూర్తిగా రోడ్డున పడ్డాయి. మళ్లీ చేనేత కార్మికులను ఆదుకోవాలని కోరుతున్నాను. -
'వైఎస్ జగన్ ఆదుకున్నారు తప్ప ప్రభుత్వం కాదు'
గుంటూరు: రానున్న కాలంలో రాష్ట్రంలోని ప్రతి పేదవాడి కోసం, బడుగు బలహీన వర్గాల వారికోసం ముఖ్యమంత్రి కానున్న నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ అన్నారు. విశాఖపట్నంలో లక్షల కోట్ల విలువైన భూములు టీడీపీ నాయకులు దోచుకుంటున్నారని, వాటిపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్లీనరీ సందర్భంగా ఆయా జిల్లాల పార్టీ అధ్యక్షులు తీర్మానాలు ప్రవేశ పెట్టారు. జిల్లా స్థాయిలో నిర్వహించిన ప్లీనరీల్లో చర్చించిన పలు అంశాల్లోని ముఖ్యమైన వాటిని ఆయా నేతలు జాతీయ ప్లీనరీలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమక్షంలో నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణుల మధ్య ప్రకటించారు. ఈ సందర్భంగా తొలి తీర్మానాన్ని శ్రీకాకుళం జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి ప్రవేశపెట్టారు. అనంతరం గుడివాడ అమర్నాథ్ విశాఖ పట్నం జిల్లా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తీర్మానంలో భాగంగా విశాఖపట్నంలో లక్షల కోట్ల విలువైన భూములు టీడీపీ నాయకులు దోచుకుంటున్నారని, వాటిపై వెంటనే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. తక్షణమే రైల్వే జోన్, పోలవరం నుంచి తాగు నీరు సాగునీరు ఇవ్వడంతోపాటు ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకు ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని ప్రారంభించాలన్నారు. బాక్సైట్ తవ్వకాలకు సంబంధించిన జీవో 95ను వెంటనే రద్దు చేయాలని తీర్మానంలో కోరారు. విశాఖ గ్రామీణ ప్రాంత చెరుకు రైతులకు రూ.3000 గిట్టుబాటు ధర ఇవ్వాలని కోరారు. అలాగే, గాజువాక, సింహాచలం భూసమస్యలు పరిష్కరించాలని తీర్మానంలో కోరారు. అనంతరం తూర్పుగోదావరి జిల్లాకు చెందిన తీర్మానాన్ని కన్నబాబు ప్రవేశపెట్టారు. పౌష్టికాహార లోపంతో చాపరాయిలాంటి గిరిజన గ్రామాలకు చెందిన వారంతా మత్యువాత పడుతున్నారని, కనీస సౌకర్యాలు సైతం లేక సతమతమై పోతున్నారని వారిని ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని, ప్రతి సందర్భంలో వైఎస్ జగన్ మాత్రమే ఏజెన్సీలో సందర్శించి సహాయం చేసి భరోసా ఇచ్చారే తప్ప ప్రభుత్వ సాయం అందించలేదన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో వెంటనే హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలి డిమాండ్ చేశారు. గోదావరి డెల్టా ఆధునీకరణ దారుణంగా తయారైందని, వైఎస్ఆర్ హయాంలో గొప్పగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు పాలనలో అధ్వాన్నంగా మార్చారని ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్లకు రూ.100గా ఉన్న పన్నును రూ.1000 వరకు చేశారని ఆ పన్ను పెంపును ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. -
ఎన్నో తీర్మానాలు.. మరెన్నో చర్చలు...
* ఆసక్తికరంగా జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం * రాష్ట్రానికి ‘ఎన్టీఆర్ నవ్యాంధ్రప్రదేశ్’గా నామకరణం చేయాలని తీర్మానం * జెడ్పీ పాఠశాలలను గురుకుల పాఠశాలలుగా మార్చేందుకు నిర్ణయం * నిధులు, విధులు లేని జెడ్పీటీసీ వ్యవస్థను రద్దుచేస్తారా.. * లేకుంటే గౌరవం కల్పిస్తారా చెప్పాలంటూ చర్చ ఆద్యంతం ఆసక్తికర చర్చలు.. పలు తీర్మానాలు.. వాటిని ప్రభుత్వానికి పంపాలని నిర్ణయూలు... ఇవీ.. స్థానిక పాత జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం విశేషాలు. మాజీ ఎమ్మెల్సీ దాచూరి రామిరెడ్డికి నివాళులర్పించడంతో పాటు పలు కీలక అంశాలపై జెడ్పీ సమావేశంలో చర్చించారు. ఆ వివరాలివీ.. - ఒంగోలు రాష్ట్రానికి ‘ఎన్టీఆర్ నవ్యాంధ్రప్రదేశ్’గా నామకరణం చేయాలి... రాష్ట్రానికి ‘ఎన్టీఆర్ నవ్యాంధ్రప్రదేశ్’గా నామకరణం చేయాలని జెడ్పీ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు. జెడ్పీటీసీ సభ్యురాలు నాగజ్యోతి ఈ విషయూన్ని ప్రతిపాదించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ తెలుగుజాతి వైభవాన్ని చాటిచెప్పిన ఎన్టీఆర్ పేరును రాష్ట్రానికి పెట్టాలని తాము కూడా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తామన్నారు. కొండపి ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామి మాట్లాడుతూ ఎన్టీఆర్ పేరుతో అనేక పథకాలు ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. రాష్ట్రానికి కూడా తప్పకుండా ఆయన పేరు పెట్టాలని పేర్కొన్నారు. జెడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు మాట్లాడుతూ పథకాలకు పేరుపెడితే ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఆ పేరు మారుతుంటుందని, అదే రాష్ట్రానికి పెడితే చిరస్థాయిగా ఉండిపోతుందని అన్నారు. మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి ఎన్టీఆర్ పేరు పెట్టేందుకు తాము వ్యతిరేకం కాదన్నారు. అయితే, ఎన్టీఆర్ పేరుకన్నా చంద్రన్న పేరునే పథకాలకు ఎక్కువగా పెట్టారని, ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ పేరు పెట్టేందుకు చంద్రబాబు ఎంతవరకు ముందుకు వస్తారనేది తమకు అనుమానంగా ఉందని పేర్కొన్నారు. అందువల్ల ఈ ప్రతిపాదనను చంద్రబాబు ద్వారానే కేంద్రానికి పంపాలని విజ్ఞప్తి చేశారు. దీంతో రాష్ట్రానికి ఎన్టీఆర్ నవ్యాంధ్రాప్రదేశ్గా పేరుపెట్టాలని సభ ఏకగ్రీవంగా తీర్మానించింది. జెడ్పీ పాఠశాలలను జెడ్పీ గురుకుల పాఠశాలలుగా మార్చాలి... జిల్లాలో జెడ్పీ ఉన్నత పాఠశాలలు 380 ఉన్నాయని, వాటిలో 90 శాతం మంది విద్యార్థులు ఎస్సీ, ఎస్టీలేనని చైర్మన్ ఈదర హరిబాబు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పాఠశాల ఒక ప్రాంతంలో, హాస్టళ్లు మరో ప్రాంతంలో ఉండటం వల్ల ప్రభుత్వానికి, విద్యార్థులకు భారంగా మారుతుందన్నారు. చాలాచోట్ల సరిపడినంత స్థలం కూడా లేకపోవడంతో హాస్టళ్ల నిర్మాణాలకు కూడా ఆటంకాలు ఏర్పడుతున్నాయన్నారు. తాము ప్రతిపాదించే విధానాల ప్రకారం ప్రతి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కేవలం ఐదారు చుట్టుపక్కల గ్రామాలకు కేంద్రంగా ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో ఆ పాఠశాల ఆవరణలోనే హాస్టళ్ల నిర్మాణం కూడా చేపడితే ఆ గ్రామాల్లోని విద్యార్థులు డేస్కాలర్లుగా, ఇతర గ్రామాల విద్యార్థులు రెసిడెన్షియల్‌గా ఉంటారన్నారు. కేవలం 5 నుంచి 6 కిలోమీటర్ల దూరంలోనే తమ గ్రామాలుండటం వల్ల విద్యార్థులు సెలవురోజుల్లో ఇంటికి వెళ్లడానికి వీలవుతుందన్నారు. ఇందుకోసం జెడ్పీ పాఠశాలలను జెడ్పీ గురుకుల పాఠశాలలుగా మార్చాలన్నారు. దీనిపై కూడా సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించి రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలని నిర్ణరుుంచింది. డీసీసీబీని ఆర్సీఎస్ టార్గెట్ చేస్తోంది : ఈదర మోహన్ రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా ప్రకాశం జిల్లా సహకార కేంద్ర బ్యాంకును నిర్వీర్యం చేయాలనే కక్షతో రిజిస్ట్రార్ ఆఫ్ కో ఆపరేటివ్ సొసైటీస్ (ఆర్సీఎస్) వ్యవహరిస్తున్నారని జిల్లా పరిషత్ చైర్మన్ అనుమతితో పీడీసీసీబీ చైర్మన్ ఈదర మోహన్‌బాబు సభలో ప్రస్తావించారు. సొసైటీలకు సంబంధించిన మిగులు షేరు ధనాన్ని వెంటనే సొసైటీలకు జమచేయాలని ఆదేశించారని, దీన్ని కేవలం బ్యాంకుకు మాత్రమే రాతపూర్వకంగా పంపారని పేర్కొన్నారు. ఇటీవల కరువు కాలంలో రైతులకు సత్వరంగా రుణాలందించేందుకు మూలధనం లేకుండా కూడా రుణాలు మంజూరుచేశామన్నారు. అయితే, ఆప్కాబ్ ఆదేశాలతో రైతుల వద్దనుంచి తిరిగి 3 శాతం మూలధనాన్ని వసూలు చేశామన్నారు. కానీ, తాజాగా ఆర్సీఎస్ నుంచి వచ్చిన ఆదేశాలతో బ్యాంకుపై రిజర్వుబ్యాంక్ ఆఫ్ ఇండియా చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు. కక్షపూరితంగా వ్యవహరిస్తూ బ్యాంకును దెబ్బతీయాలని చూస్తున్న ఆర్సీఎస్పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని మోహన్‌బాబు కోరారు. ఆ మేరకు సమావేశం కూడా తీర్మానించింది. జెడ్పీటీసీ వ్యవస్థను రద్దుచేయండి... జెడ్పీటీసీ సభ్యులైన తాము కేవలం ఉత్సవ విగ్రహాలుగా మారామని, ఇటువంటి వ్యవస్థ అవసరం లేదనుకుంటే రద్దుచేసి ప్రభుత్వం వ్యయాన్ని తగ్గించుకోవచ్చని పొదిలి జెడ్పీటీసీ సభ్యుడు సాయిరాజేశ్వరరావు సభలో చర్చలేపారు. పంచాయతీ సర్పంచ్ అనుమతి లేకుండా గ్రామంలో ఏమీ చేయలేకపోతున్నామన్నారు. జెడ్పీ నిధులతో అభివృద్ధి పనులు చేస్తున్నా.. ఆ వివరాలు కూడా తమకు తెలియడంలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. చివరకు తాము కూర్చునేందుకు ఎంపీడీవో కార్యాలయంలో కుర్చీ కూడా ఉండటం లేదన్నారు. దీనిపై పలువురు జెడ్పీటీసీ సభ్యులు స్పందిస్తూ ఎంపీపీల ద్వారానే జెడ్పీ చైర్మన్‌ను ఎన్నుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బెటరని, జెడ్పీటీసీ వ్యవస్థను రద్దుచేయాలని డిమాండ్ చేశారు. జెడ్పీటీసీ సభ్యులకు ఏడాదికి కనీసం రూ.10 లక్షల జెడ్పీ నిధులు కేటాయించాలన్నారు. వ్యవస్థను రద్దుచేయడంగానీ, విధులు, నిధులు కల్పించడంగానీ చేయూలని తీర్మానిస్తూ ప్రభుత్వానికి పంపాలని నిర్ణయించారు. ‘ఏసీ’కి నోటీసులు, విచారణకు కమిటీ... పర్చూరు మండలంలో దేవాలయ భూములకు సంబంధించిన కుంభకోణంపై సమాధానం ఇవ్వాలని దేవాదాయశాఖ సహాయ కమిషనర్‌ను జెడ్పీ చైర్మన్ అడిగారు. అయితే, కమిషనర్‌కు బదులుగా సమావేశానికి సూపరింటెండెంట్ రావడంపై చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిషనర్ ఎందుకు రాలేదని ప్రశ్నించగా, క్యాంపునకు వెళ్లారని సూపరింటెండెంట్ బదులిచ్చారు. క్యాంపు ఎక్కడ అని ప్రశ్నిస్తే.. తనకు తెలియదంటూ సూపరింటెండెంట్ నీళ్లు నమలడంపై చైర్మన్ మండిపడ్డారు. కుంభకోణంపై విచారణకు జెడ్పీ నుంచి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు చైర్మన్ ప్రకటించారు. పాఠశాలల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి... జిల్లా పరిషత్ పాఠశాలలు, వాటిలో ఆటస్థలాలను అభివృద్ధి చేసేందుకు సమావేశంలో ప్రతిపాదించి తీర్మానించారు. సీసీ రోడ్ల నిర్మాణం ద్వారా భూతాపాన్ని పెంచడం కంటే నీరు-చెట్టు పథకం, ఎంజీ ఎన్ఆర్ఈజీఎస్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని డ్వామా పీడీ పోలప్ప పేర్కొన్నారు. రోటరీ క్లబ్ చిలకలూరిపేట ప్రధాన కార్యదర్శి రత్నప్రభాకర్ మాట్లాడుతూ ప్రకాశం జిల్లా పరిషత్ స్కూళ్లలో 14 వేల బెంచీలు, 190 ఆర్వో ప్లాంట్లు, 660 మరుగుదొడ్లు, 100 లైబ్రరీలు నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. రాబోయే మూడు నెలల్లో జిల్లాలోని జెడ్పీ పాఠశాలలకు 3,800 బెంచీలు అందజేస్తామని పేర్కొన్నారు. ఆర్‌అండ్‌బీలో అక్రమాలపై విచారణకు ఆదేశం జిల్లాలోని రోడ్లు, భవనాల శాఖ (ఆర్అండ్బీ)లో అక్రమాలపై విచారణకు ఆదేశిస్తున్నట్లు జెడ్పీ చైర్మన్ ఈదర హరిబాబు ప్రకటించారు. అందుకోసం సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం కూడా చేశారు. జిల్లాలో రూ.100 కోట్ల పనులకు సంబంధించి అక్రమాలు జరిగాయంటూ సాక్షి దినపత్రికలో ఆధారాలతో సహా కథనాలు ప్రచురితమయ్యాయి. దీనిపై ఆర్అండ్బీ అధికారులను ఈదర ప్రశ్నించారు. ఆర్అండ్బీ ఎస్ఈ సమావేశానికి ఎందుకు రాలేదని, టెండర్లు పిలిచినా ఎందుకు ఓపెన్ చేయలేదని, ఎమ్మెల్యేలు తెరవవద్దంటే టెండర్ కవర్లు ఓపెన్ చేయరా..? అని ప్రశ్నించారు. గత నెల 22వ తేదీ టెండర్లు తెరిచామంటూ ఆర్అండ్బీ అధికారులు సమావేశంలో ప్రకటించారు. మరి ఎందుకు బయటపెట్టలేదని చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగిల్ టెండర్ వేస్తే ఓపెన్ చేస్తారా..? ముగ్గురునలుగురు కలిసి ఒక పనికి టెండర్ వేస్తే ఓపెన్ చేయరా..? అంటే కాంట్రాక్టర్లు సిండికేట్ కావడానికి మీరే సహకరిస్తున్నారా..? అంటూ జెడ్పీ చైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై విచారణకు ఆదేశిస్తున్నామని చెప్పడంతో సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదించారు. -
ముగిసిన టీఆర్ఎస్ ప్లీనరీ కమిటీ సమావేశం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) ప్లీనరీ కమిటీ సమావేశం ఆదివారం ముగిసింది. ఎంపీ కే.కేశవరావు నివాసంలో జరిగిన ఈ సమావేశానికి ప్లీనరీ కమిటీ సభ్యులు హాజరయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న వివిధ అంశాలపై తీర్మానాలు ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఇంజనీరింగ్ కాలేజీలు, కేజీ టు పీజీతో పాటు 12 కీలక అంశాలపై తీర్మానాలు పెట్టాలని నేతలు అభిప్రాయపడ్డారు.